Friday, July 12, 2019

The Handmaid's Tale - Margaret Atwood

జార్జ్ ఆర్వెల్ 1984 చదివినవారికి విన్స్టన్ వర్ణించిన 'ఓషియానా' (Oceania) జ్ఞాపకం ఉండే ఉంటుంది..సరిగ్గా అటువంటి ఓషియానా కు సమాంతరంగా మార్గరెట్ ఆట్వుడ్ సృష్టించిన మరో ప్రపంచమే 'గిలియడ్'..1984 ని ఆర్వెల్ ఒక పురుషుని దృష్టికోణం నుండి రాస్తే ఆట్వుడ్ 'The Handmaid's Tale' నవలను ఒక స్త్రీ దృష్టికోణంనుండి రాశారు..ఒక మనిషి జీవితంలో చదివితీరాల్సిన 100 పుస్తకాల లిస్టుల్లో ఈ పుస్తకం కూడా ఒకటి..ఎప్పుడో ముప్పైనాలుగేళ్ళ క్రిందట అంటే 1985 లో తొలిసారి ముద్రితమైన ఈ నవల ఉన్నట్లుండి ఈరోజు మళ్ళీ తాజాగా తెరమీదకు వచ్చింది..దీన్ని అదే పేరుతో ఇటీవలే నెట్ఫ్లిక్ లో సిరీస్ గా కూడా తీశారు..ఆట్వుడ్ ఈ రచనను ఒక Speculative ఫిక్షన్ గా అభివర్ణిస్తూ,భవిష్యత్ సమాజాలకు రూపకల్పన చేస్తూ తాను రాసిన కథలో ఒక్క అంశం కూడా చరిత్రలో యదార్థంగా జరగని విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
Image Courtesy Google
మార్గరెట్ ఆట్వుడ్ రచనలన్నిటిలో గొప్ప రచనగా పేరుపొందిన ఈ పుస్తకం చదివిన తరువాత గానీ సిరీస్ చూడకూడదని ఆగాను,కానీ ఇప్పుడు పుస్తకం పూర్తిచేశాక ఇక సిరీస్ చూడడానికి మనస్కరించలేదు..ఎందుకంటే మరోసారి అనుభూతి చెందడానికి ఇది స్త్రీవాదాన్ని రొమాంటిసైజ్ చేస్తూ మనసుని ఆనందడోలికల్లో ముంచెత్తే  జేన్ ఆస్టిన్,ఎలిజబెత్ గాస్కెల్ వంటివారి ఉటోపియన్ ప్రపంచం కాదు..ఒక్కసారి ఆ అంథకారంలోకి దృష్టిసారించాక ఇక చాలు అని తలుపులు గట్టిగా మూసేసి మళ్ళీ వెనుతిరిగి చూడకుండా తిరిగి వచ్చేయాలనిపించే కౄరమైన గిలియడ్ ప్రపంచం..

ప్రతీ సమాజానికీ ఒక  గొప్ప ధీమా ఉంటుంది,ఏ సమస్య వచ్చినా 'మన వరకూ రాదులే','మనం కాదులే' అనుకోవడం..కొన్నిసార్లు మనమనుభవించే హక్కులూ,అధికారాల విలువ అవి చేజారిపోయాక గానీ తెలీదు..అమెరికాలో ఉద్యోగం చేస్తూ భర్త ల్యూక్,కూతురు హన్నా లతో స్వతంత్రమైన జీవితాన్ని గడుపుతున్న 'జూన్' కూడా అదే భ్రమలో బ్రతుకుతుంటుంది..కానీ ఒకరోజు హఠాత్తుగా ఆమె ప్రపంచం తలక్రిందులవుతుంది..దేశాధ్యక్షుణ్ణి హతమార్చి,ప్రభుత్వాన్ని కూల్చేసిన నిరంకుశ పాలకులు దానికి 'రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్' గా పేరు మార్చి పరిపాలనను హస్తగతం చేసుకుంటారు..ఈ గిలియడ్ అనే ప్యూరిటన్ వ్యవస్థ పితృస్వామ్యమూలాలతో కూడిన పురుషాధిక్య ప్రపంచం..అక్కడ స్త్రీలకు ఎటువంటి హక్కులూ,అధికారాలూ ఉండవు..వారిని కమాండర్ల భార్యలు,Marthas,Aunts,Handmaids and Jezebels అంటూ కొన్ని ప్రత్యేక వర్గాలుగా విభజిస్తారు..కమాండర్ ల భార్యలకు మాత్రం కొన్ని పరిమితమైన ప్రత్యేకాధికారాలు ఉంటాయి..సంతానం లేని కమాండర్ లకు సంతానాన్ని ఇవ్వడం కోసం ఈ హ్యాండ్ మెయిడ్ లను ప్రత్యామ్న్యాయ యంత్రాలుగా ఉపయోగిస్తారు..ఆ హ్యాండ్ మెయిడ్ పేరుకి ఆమెకు సంబంధించిన కమాండర్ పేరుని జత చేసి పిలుస్తుంటారు..అలా జూన్ పేరు కమాండర్ Fred Waterford పేరు జతకలిసి 'Offred' గా మారిపోతుంది..కుటుంబాలనుండి వేరు చేసి,పేరుతో సహా అన్ని అస్తిత్వ చిహ్నాలను నిలువుదోపిడీ చేసి వారిని 'రెడ్ సెంటర్' లో నిర్బంధిస్తారు..నియమోల్లంఘన చేసిన స్త్రీలను Auschwitz నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులను తలపించే కాలనీలకు తరలిస్తారు,లేదా అందరూ చూసేలా బహిరంగంగా ఉరి తీస్తారు..గిలియడ్ సమాజంలో తన స్థానమేమిటో తనకే తెలీని స్థితిలో We were the people who were not in the papers. We lived in the blank white spaces at the edges of print. It gave us more freedom. We lived in the gaps between the stories. అంటూ ఆ అనాగరిక ప్రపంచంలో తన ఉనికిని ప్రశ్నించుకునే స్త్రీమూర్తి కథే ఈ హ్యాండ్ మెయిడ్స్ టేల్..మరి జూన్ ఆ నరకం నుండి బయటపడగలిగిందా లేదా అనేది మిగతా కథ.

ఒక సమాజంలో స్త్రీల అస్తిత్వానికి నిర్వచనాలు వారి శరీరాకృతి వరకే పరిమితమైతే ? వారి గర్భధారణ శక్తి ఒక పవిత్రమైన మాతృత్వానుభవంగా కాకుండా,మనుగడకు ఒక అర్హతగా మాత్రమే పరిగణింపబడితే ? విద్య విచక్షణను ప్రసాదిస్తుంది గనుక, 'క్రిటికల్ థింకింగ్' ప్రమాదకారి అంటూ ఒక సమాజంలో స్త్రీ విద్య సమూలంగా నిషేధించబడితే ? శృంగారం అనేది ఒక వ్యవస్థీకృత చర్యగా సంతోనోత్పత్తి కోసమేనని నిర్ధారిస్తే ? స్త్రీ శరీరాన్నీ,ముఖాన్నీ పూర్తిగా కప్పేస్తూ ఆమె ఒక యూనిఫామ్ మాత్రమే ధరించాల్సొస్తే ? ఆమె స్త్రీ,పురుషులెవ్వరితో తోనూ స్నేహం చెయ్యకూడదంటే ? కేవలం అలంకారప్రాయంగా,ఒక విలాసవస్తువుగా (Jezebels) పురుషుడికి స్త్రీ మీద సర్వాధికారాలూ ఉంటే ? బైబిల్ ను (మతాన్ని) కూడా పురుషాధిక్యసమాజానికి అనుకూలంగా స్త్రీ స్వేచ్ఛను నియంత్రించడానికి ఉపయోగిస్తే ? స్త్రీని ఆమె అన్ని హక్కులూ,అధికారాల నుండీ వేరు చేసి ఆమెనొక కట్టు బానిసగా,మరబొమ్మగా మార్చివేస్తే ? ఇదంతా మార్గరెట్ ఆట్వుడ్ సృష్టించిన 'The Handmaid's Tale' లోని డిస్టోపియన్ ప్రపంచం..కానీ ఇది చదువుతున్నంతసేపూ పాఠకులకు ఇది ఒక డిస్టోపియన్ ప్రపంచంగా అగుపించదు.. సంస్కృతి,సంప్రదాయాల పేరిట సమాజంలో వ్రేళ్ళూనుకున్న సాంఘిక దురాచారాలూ,వ్యవస్థాగత లోపాలూ అనేకం జ్ఞప్తికి వచ్చి ఆట్వుడ్ డిస్టోపియన్ ప్రపంచం ఉన్నపళంగా  ఒక వాస్తవ సమాజంగా జీవంపోసుకుని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది..ఇందులో ఆట్వుడ్  విశ్లేషణలు పాఠకుల్ని వాస్తవికతకూ,కాల్పనికతకూ భేదం తెలియనంతగా మభ్యపెడతాయి.

ఏ వాదమైనా మానవతావాదాన్ని మించి గొప్పది కాదనుకుంటాను..కానీ మార్గరెట్ ఆట్వుడ్ పుస్తకాలు చదివాకా నాకు ఫెమినిజం మీద ప్రత్యేకమైన ఆసక్తీ,గౌరవం కలిగాయి..ఉహూ..ఆవిడ కలిగించారు..నేను చదివిన వారిలో స్త్రీవాదాన్ని ఆట్వుడ్ అంత హుందాగా విశ్లేషించిన రచయితలు బహు అరుదు..స్త్రీవాదమంటే పురుషాధిక్య ప్రపంచాన్ని ద్వేషించడమో,లేక అణచివెయ్యడమోననే  రెండు extreme భావనలు వ్రేళ్ళూనుకుని ఉన్న నేటి సమాజానికి స్త్రీ అంతరంగాన్ని ఆమె సరళత్వపు తొడుగు విప్పకుండానే చూపిస్తారు ఆట్వుడ్..కానీ స్త్రీవాద రచనలల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే ఈ నవలలో నేను గమనించిన విషయం ఏంటంటే ఇందులో స్త్రీజాతికి శత్రువులు ఆపోజిట్ సెక్స్  కాకపోవడం..ఈ కథలో కూడా 'Aunt లిడియా,'సెరెనా జోయ్' వంటి స్త్రీ పాత్రలే స్త్రీల అణచివేతకు బాధ్యులుగా కనిపిస్తాయి..కమాండర్ వాటర్ ఫోర్డ్,నిక్ వంటి పురుషులు కూడా స్త్రీల వలెనే నిస్సహాయంగా గిలియడ్ నిరంకుశత్వంలో తమ బాధ్యతను గుడ్డిగా నిర్వర్తిస్తూ,సౌమ్యత్వం ఉట్టిపడే పాత్రలుగా కనిపిస్తారు..వాళ్ళని నిందించడానికో,బాధ్యులుగా చూపడానికో   మార్గరెట్ ఆట్వుడ్ ఎందువల్లో ఒక్క కారణం కూడా చూపించలేదు..ఈ అంశం స్త్రీజాతి అణచివేతకు ఆమె స్వయంగా బాధ్యురాలా అన్నదిశగా కూడా ఆలోచనలు రేకెత్తిస్తుంది.

దీనితో పాటు ఈ నవలలో ముఖ్యంగా ప్రస్తావించవలసిన మరో అంశం 'భాష'..సామజిక వ్యవహారాల్లో భాష కీలక పాత్ర పోషిస్తుంది..వాస్తవికత పట్ల ప్రజల దృక్పథాన్ని  మార్చగలిగే సామర్ధ్యం భాషకి ఉంటుంది..Ludwig Wittgenstein సమాజాన్ని ప్రభావితం చెయ్యడానికి భాషను ఎంతటి శక్తిమంతమైన ఆయుధంగా వాడొచ్చనే అంశంపై పలు ప్రతిపాదనలు చేశారంటారు..జార్జ్ ఆర్వెల్ 1984 లో New speak లాగానే గిలియడ్ సమాజాన్ని అదుపు చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన భాషను వాడతారు..కొన్ని పదాలకు అర్ధాలను తమకు అనుకూలంగా మార్చేస్తారు..ఇందులో భాగంగా 'unbaby',' unwoman' లాంటి కొత్త పద ప్రయోగాలు కనిపిస్తాయి..నిశితంగా గమనిస్తే ఈరోజుల్లో భాషకు మీడియా చేస్తున్న సత్యదూరమైన వక్రీకరణలు జ్ఞప్తికి వచ్చి మనం ఏదో డిస్టోపియన్ ప్రపంచం గురించి చదువుతున్నామనే భావన పాఠకులకు ఎక్కడా కలగదు..ఆట్వుడ్ కథనం అభూతకల్పనను వాస్తవంగా   భ్రమింపజేస్తుంది.

ఏదేమైనా 'The Handmaid's Tale' ను కేవలం ఒక స్త్రీవాద రచన మాత్రమే అంటే అంగీకరించలేను..న్యాయాన్నీ,చట్టాల్నీ చేతుల్లోకి తీసుకున్న నియంతృత్వపు  ప్రభుత్వాలు మానవజాతికి నియంతల కాలం నుండీ సుపరిచయమే..కానీ ఆధునిక సమాజం,అభివృద్ధి అంటూ మురిసిపోతున్న నేటి తరంలో కూడా ఈ నిరంకుశ విధానాలు చాపక్రిందనీరుగా ఇంకా అమలులోనే  ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు..మీడియాను గుప్పిట్లో పెట్టుకుని,భాషను తమ కనుగుణంగా మార్చుకుంటూ సమాజాలను హానికరమైన రీతిలో ప్రభావితం చేస్తూ ప్రభుత్వాలూ,కార్పొరేట్ వ్యవస్థలూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి..ఇదిలాగే కొసాగితే ఒక ప్రమాదకర స్థాయిలో వ్యవస్థలోని ఈ నిరంకుశత్వాన్ని ఒక సాధారణమైన విషయంగా ప్రజలు కూడా అంగీకరించే పరిస్థితి ఎదురవుతుందని ఈ నవల చెప్పకనే చెపుతుంది..వ్యక్తి స్వేచ్చనూ,విలువల్నీ ప్రక్కకు నెట్టి ఆలోచన శక్తి,జ్ఞానం ఉన్న మనుషుల్ని కూడా పశువుల్లాగే వారి సామర్ధ్యాలకనుగుణంగా వర్గీకరించి,మానవత్వాన్ని మంటగలిపి,బలమైన వాడు బలహీనుణ్ణి శాసించే ఆటవిక న్యాయం ఇటువంటి ఆర్గనైజ్డ్ సొసైటీస్ పేరిట మళ్ళీ అమల్లోకి వస్తుందని హెచ్చరిస్తుంది ..ఏ కాలంలో చదివినా కూడా ఆ సమాజానికి అతికినట్లు సరిపోయే నవలల్లో ఈ 'The Handmaid's Tale' కూడా ఒకటి..బహుశా అందుకే ఇన్నేళ్ళ తరువాత కూడా దీని గురించి ఇప్పుడు మళ్ళీ తాజాగా చర్చ మొదలయ్యింది..“And so I step up, into the darkness within; or else the light.” అని జూన్ అనే చివరి మాటలు నిద్రావస్థలో ఉన్న పాఠకుణ్ణి తట్టిలేపి అనేక సామజిక సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తాయి.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

ఒక వస్తువును చూసేటప్పుడు పాఠకుల మనసులో మెదిలే 'endless possibilities' ను పట్టుకోవడం లో మార్గరెట్ ఆట్వుడ్ నిష్ణాతురాలు..ఈ కథలో ఆఫ్రెడ్ కమాండర్ గదిలోకి వెళ్ళినప్పుడు ఆమెకు నిషేధించబడిన వోగ్ మ్యాగజైన్ ను చూసిన ఆఫ్రెడ్ మనసులో కలిగిన భావనలు..ఇలాంటి వాక్యాలు ఈ పుస్తకం నిండా కోకొల్లలు..నేరేషన్ విషయంలో మార్గరెట్ ఆట్వుడ్ ప్రతిభకు ఇలాంటి పటిష్టమైన వాక్యనిర్మాణమే ఉదాహరణ..ఇక్కడ ఆవిడ కేవలం ఒక వోగ్ మ్యాగజైన్ ను వర్ణిస్తున్నారు..
What was in them was promise. They dealt in transformations; they suggested an endless series of possibilities, extending like the reflections in two mirrors set facing one another, stretching on, replica after replica, to the vanishing point. They suggested one adventure after another, one wardrobe after another, one improvement after another, one man after another. They suggested rejuvenation, pain overcome and transcended, endless love. The real promise in them was immortality.
Nolite te bastardes carborundorum.
I hunger to touch something,other than cloth.or wood. I hunger to commit the act of touch.
There is more than one kind of freedom, said Aunt Lydia. Freedom to and freedom from. In the days of anarchy, it was freedom to. Now you are being given freedom from. Don’t underrate it.
We were a society dying, said Aunt Lydia, of too much choice.
We lived, as usual, by ignoring. Ignoring isn’t the same as ignorance, you have to work at it.
I am like a room where things once happened and now nothing does, except the pollen of the weeds that grow up outside the window, blowing in as dust across the floor.
When I get out of here, if I’m ever able to set this down, in any form, even in the form of one voice to another, it will be a reconstruction then too, at yet another remove. It’s impossible to say a thing exactly the way it was, because what you say can never be exact, you always have to leave something out, there are too many parts, sides, crosscurrents, nuances; too many gestures, which could mean this or that, too many shapes which can never be fully described, too many flavours, in the air or on the tongue, half-colours, too many. But if you happen to be a man, sometime in the future, and you’ve made it this far, please remember: you will never be subjected to the temptation of feeling you must forgive, a man, as a woman. It’s difficult to resist, believe me. But remember that forgiveness too is a power. To beg for it is a power, and to withhold or bestow it is a power, perhaps the greatest.
He was still smiling, that wistful smile of his. It was a look you’d give to an almost extinct animal, at the zoo. Staring at the magazine, as he dangled it before me like fishbait, I wanted it. I wanted it with a force that made the ends of my fingers ache?
She says after seeing a man killed "What I feel is relief. It wasn’t me."

No comments:

Post a Comment