Sunday, July 29, 2018

Upstream:Selected Essays - Mary Oliver

. . . in solitude, or in that deserted state when we are surrounded by human beings and yet they sympathise not with us,
we love the flowers, the grass and the waters and the sky.
In the motion of the very leaves of spring in the blue air there is then found a secret correspondence with our heart.-- Shelley, On Love

అంటూ షెల్లీ కవితతో తన పుస్తకాన్ని ఆరంభిస్తారు మేరీ ఆలీవర్..ఆధునిక మానవుడు అంతులేని గమ్యాల దిశగా పరుగులు తీసే ఆరాటంలో  ప్రకృతిలో తానూ ఒక భాగమని మరచిపోయాడు..'ప్రైవసీ' పేరిట మానవసంబంధాల్ని చిన్నచూపు చూస్తూ,మొహంవైపు పరీక్షగా చూడడం,వ్యక్తిగత వివరాలు అడగడం,మనిషి కనపడగానే ఒక పలకరింపు చిరునవ్వు నవ్వడం లాంటి ప్రాథమిక అంశాలు కూడా 'అనాగరికత' గా పరిగణింపబడుతున్న ఈ కాలంలో మానవజీవితంలోని ప్రాధాన్యతల్ని ఈ వ్యాసాల ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు..బ్రెయిన్ పికింగ్స్ లో మేరీ ఆలీవర్ గురించి విరివిగా ప్రచురించిన వ్యాసాలు ఆమె పుస్తకాలు చదవాలనే ఆసక్తిని కలిగించాయి..'Upstream' అనే ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటినుండీ తన స్వీయానుభావాలను నెమరువేసుకుంటూ ఒక ఆర్టిస్టుగా ఏటికి ఎదురీదిన వైనాన్ని వ్యాసాలుగా రాశారు.
Image Courtesy Google
ప్రకృతితో జీవితాన్ని పెనవేసుకున్న మనిషికి,విషయాలను లోతుగా అనుభూతి చెందే తత్వం సహజంగానే అలవడుతుంది..అది కొరవడిన ఈనాటి కాంక్రీట్ జంగిల్స్ లో 'ఇండివిడ్యువాలిటీ,ఇండిపెండెన్స్' అనే పదాల అర్ధాలను చాలా కన్వీనియెంట్ గా మార్చేసి,'నేనూ,నాదీ' మంత్రాన్ని జపిస్తూ,నాలుగ్గోడలనూ తన బందిఖానాగా మార్చుకున్న మానవుడికి ఈ Upstream పాత ప్రపంచాన్నే కొత్తగా పరిచయం చేస్తుంది..ప్రకృతి పట్లా,సమాజం పట్లా తన బాధ్యతను విస్మరించి ముందుకు వెళ్ళిపోతున్న తరానికి ఈ వ్యాసాలు ఆదర్శవంతమైన,బాధ్యతాయుతమైన జీవన విధానం అవసరాన్ని గుర్తు చేస్తాయి.

Sometimes the desire to be lost again, as long ago, comes over me like a vapor. With growth into adulthood, responsibilities claimed me, so many heavy coats. I didn’t choose them, I don’t fault them, but it took time to reject them. Now in the spring I kneel, I put my face into the packets of violets, the dampness, the freshness, the sense of ever-ness. Something is wrong, I know it, if I don’t keep my attention on eternity. May I be the tiniest nail in the house of the universe, tiny but useful. May I stay forever in the stream. May I look down upon the windflower and the bull thistle and the coreopsis with the greatest respect.

"ప్రకృతి అనేది లేకపోతే నాలో కవిత్వం పుట్టడం సాధ్యం కాదు,మిగతావారెవరికైనా సాధ్యమేమో" For me the door to the woods is the door to the temple.అని నిష్కర్షగా ప్రకృతితో తన అనుబంధాన్ని చాటుకుంటారు ఆలీవర్..నాకు మొదట్నుంచీ ప్రకృతి వర్ణనలూ,యాత్రా విశేషాలు చదవడం పట్ల ఆసక్తి తక్కువ..వాటిని కేవలం అనుభవంలో ఆనందించాలనుకుంటాను..కానీ తొలిసారి ఆలీవర్ నన్ను తన ప్రకృతి వర్ణనలతో పూర్తిగా కట్టి పడేశారు..పెరియార్ అడవిలో గడిపిన వర్షాకాలపు రోజుల్లో ఆమెను చదివిన ప్రభావమో ఏమో!! ఆమె వ్యాసాలు నాకు మరింత అద్భుతంగా తోచాయి..మేరీ ఆలీవర్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుక్షణం ఒక విస్మయంతో చూస్తారు..సాలెగూళ్ళ మొదలు,సముద్రపు తాబేళ్ళు,చేపపిల్లలు,గుడ్లగూబలూ,నక్కల విహారాలు ఇవన్నీ ఆమెకు వింతే..ఇవన్నీ ఆమె జీవితంలో భాగమే..ఇలా ప్రకృతితో ముడివడి నడవడం వల్ల మానవజీవితం పరిపుష్టమవుతుందంటారు..ఉరకలు వేసే జలపాతాలూ,సెలయేళ్ళు,అన్ని కాలమాన పరిస్థితులనూ ఎదుర్కోడానికి సర్వసన్నద్ధతను వ్యక్తం చేస్తూ నిశ్శబ్దంగా తమ ఉనికిని చాటుకునే వృక్షరాజాలు,సముద్రపు అలలు,ఆటుపోట్లు,శీతాకాలపు గాలులకు ఆకుల శబ్దాలూ,పున్నమి రాత్రులూ,శరద్,శిశిర,వసంతాలూ,వెచ్చని వేసవి ఉదయాలు,చిక్కని చీకట్లో అడవి అందాలూ,ఇలా ప్రకృతి పరంగా ఆలీవర్ సునిశిత దృష్టిని దాటిపోయే అంశాలేవీ ఉండవు..మనిషి జీవితం ఎక్కడ మొదలయ్యిందో,మనం ఎక్కడనుంచి వచ్చామో మళ్ళీ అదే చోటుకి లాక్కెళ్ళి 'ఇవిగో ఇవీ మీ మూలాలు' అంటూ తాను తిరుగాడిన ప్రదేశాలన్నీ చూపిస్తారు..

I would say that there exist a thousand unbreakable links between each of us and everything else, and that our dignity and our chances are one. The farthest star and the mud at our feet are a family; and there is no decency or sense in honoring one thing, or a few things, and then closing the list. The pine tree, the leopard, the Platte River, and ourselves—we are at risk together, or we are on our way to a sustainable world together. We are each other’s destiny.

'ప్రకృతి'తో స్నేహం అంటే మనుష్య సంచారం లేని ఏకాంత క్షణాలు కాదు ఆలీవర్ కోరుకునేది,ఆవిడ దృష్టిలో మనిషి కూడా ప్రకృతిలో భాగమే..ఆమె కళ్ళతో చూసే రోజువారీ జీవితాలు కూడా మనకు అక్కడక్కడా తారసపడతాయి..అందులో భాగంగా ఒక కార్పెంటర్ గురించి చెప్తారు,రోజంతా పని చేసుకుని ఖాళీ సమయాల్లో తన పుస్తకాల్లో కవితలూ,కథలూ రాసుకుంటూ అతడు గడిపే సంతృప్తికరమైన జీవితాన్ని పరిచయం చేస్తారు..మరోసారి తన స్వస్థలమైన ప్రొవిన్షియల్ టౌన్ లో ఒక దుకాణదారు ఎలా ఉన్నారంటూ, చిరునవ్వుతో పలకరించడం గురించి రాస్తారు..ఈ అంశాలు చూడ్డానికి చాలా స్వల్పంగా కనిపించినా అవి మనిషి జీవితానికి పరిపూర్ణతను చేకూరుస్తాయని ఆలీవర్ నమ్మకం..ఆవిడ కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఒక సారి చూస్తే ఆ తరువాత మన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని మనమెందుకు విస్మరిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము..

Ohio లోని ఒక ప్రొవిన్షియల్ టౌన్ లో పుట్టి పెరగడం ఆలివర్ ను ప్రకృతితో స్నేహం చేసే దిశగా ప్రభావితం చేసి ఉండవచ్చు..ఈ పుస్తకంలో ఆమెను ఒక కవయిత్రిగా మాత్రమే కాక ఒక రీడర్ గా,సాధారణ వ్యక్తిగా మరింత సన్నిహితంగా చూస్తాము..ఆ క్రమంలో బుట్ట నిండా పుస్తకాలు పెట్టుకుని అడవిలోకి పరిగెత్తి అలసిపోయి,చెట్టు నీడన చేరి వాల్ట్ విట్మన్ ను చదువుకునే చిన్నపిల్ల ఒక చోట  తారసపడితే,మరో చోట కేవలం $3.58 కే తన ఇంటిని  నిర్మించుకునే స్వతంత్రురాలైన యువతి కనిపిస్తుంది..

I learned to build bookshelves and brought books to my room, gathering them around me thickly. I read by day and into the night. I thought about perfectibility, and deism, and adjectives, and clouds, and the foxes. I locked my door, from the inside, and leaped from the roof and went to the woods, by day or darkness.

ఇందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న  అంశాలు ఆమె అభిమాన రచయితలు వాల్ట్ విట్మన్,ఎమెర్సన్,పో ల గురించి రాసిన మూడు సమగ్రమైన వ్యాసాలు..విట్మన్ చిన్నతనం నుండీ పరోక్షంగా ఒక స్నేహితునిలా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో వివరిస్తూ 'లీవ్స్ ఆఫ్ గ్రాస్' గురించి ఒక మంచి విశ్లేషణ చేశారు..విట్మన్ ను వెంటనే చదవాలనిపించేంత తీక్షణత ఆమె అక్షరాల్లోని ఆరాధనాభావంలో కనిపిస్తుంది..ఒక పాఠకులు కవిత్వాన్ని ఎలా అనుభూతి చెందాలో తెలియజెప్పే వ్యాసం అది..

That his methods are endlessly suggestive rather than demonstrative, and that their main attempt was to move the reader toward response rather than reflection, is perhaps another clue to the origin of Whitman’s power and purpose, and to the weight of the task. If it is true that he experienced a mystical state, or even stood in the singe of powerful mystical suggestion, and James is right, then he was both blessed and burdened—for he could make no adequate report of it. He could only summon, suggest, question, call, and plead. And Leaves of Grass is indeed a sermon, a manifesto, a utopian document, a social contract, a political statement, an invitation, to each of us, to change. All through the poem we feel Whitman’s persuading force, which is his sincerity; and we feel what the poem tries continually to be: the replication of a miracle.

అలాగే పో శైలిని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు..పో ను అర్ధం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం కుదరదంటారు..'మనందరం ఒక్కోసారి పో కథల్లో నేరేటర్సే కదా' అంటూ చేసిన విశ్లేషణ,

For are we not all, at times, exactly like Poe’s narrators—beating upon the confining walls of circumstance, the limits of the universe? In spiritual work, with good luck (or grace), we come to accept life’s brevity for ourselves. But the lover that is in each of us—the part of us that adores another person—ah! that is another matter.
In the mystery and the energy of loving, we all view time’s shadow upon the beloved as wretchedly as any of Poe’s narrators. We do not think of it every day, but we never forget it: the beloved shall grow old, or ill, and be taken away finally. No matter how ferociously we fight, how tenderly we love, how bitterly we argue, how pervasively we berate the universe, how cunningly we hide, this is what shall happen. In the wide circles of timelessness, everything material and temporal will fail, including the manifestation of the beloved. In this universe we are given two gifts: the ability to love, and the ability to ask questions. Which are, at the same time, the fires that warm us and the fires that scorch us. This is Poe’s real story. As it is ours.

ఈ వ్యాసాల్లో పాఠకులకూ,రచయితలకూ కూడా ఉపయోగపడే అంశాలతో పాటు మనిషి జీవితంలో సాహిత్యం ప్రాధాన్యతనూ,సృజన అవసరాన్ని గురించీ రాశారు..ఇది పోయెట్రీ,ఫిలాసఫీ,నేచర్ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

సాహిత్యం తెరచే దారుల్ని గురించి రాస్తూ,
The best use of literature bends not toward the narrow and the absolute but to the extravagant and the possible. Answers are no part of it; rather, it is the opinions, the rhapsodic persuasions, the engrafted logics, the clues that are to the mind of the reader the possible keys to his own self-quarrels, his own predicament.

ఎమెర్సన్ రచనల గురించి,
The writing is a pleasure to the ear, and thus a tonic to the heart, at the same time that it strikes the mind.

ఆర్టిస్టులు శ్వాసించే 'ఏకాంతం' గురించి,
For me it was important to be alone; solitude was a prerequisite to being openly and joyfully susceptible and responsive to the world of leaves, light, birdsong, flowers, flowing water. Most of the adult world spoke of such things as opportunities, and materials. To the young these materials are still celestial; for every child the garden is re-created. Then the occlusions begin.

విద్యా,వివేకం రెండు వేర్వేరు పార్శ్వాలు అంటూ,
When I came to a teachable age, I was, as most youngsters are, directed toward the acquisition of knowledge, meaning not so much ideas but demonstrated facts. Education as I knew it was made up of such a preestablished collection of certainties..Knowledge has entertained me and it has shaped me and it has failed me. Something in me still starves.

పుస్తకం నుండి మరికొన్ని,
Outwardly he was calm, reasonable, patient. All his wildness was in his head—such a good place for it!

“Men have called me mad; but the question is not yet settled, whether madness is or is not the loftiest intelligence,” the narrator says in “Eleonora.”

I read my books with diligence, and mounting skill, and gathering certainty. I read the way a person might swim, to save his or her life. I wrote that way too.

You must not ever stop being whimsical.And you must not, ever, give anyone else the responsibility for your life.

Thus the great ones (my great ones, who may not be the same as your great ones) have taught me—to observe with passion, to think with patience, to live always caringly.

Over and over in the butterfly we see the idea of transcendence. In the forest we see not the inert but the aspiring. In water that departs forever and forever returns, we experience eternity.

Monday, July 16, 2018

Fernando Pessoa and Co:Selected Poems - Fernando Pessoa

This is my morality, or metaphysics, or me: passerby of everything, even of my own soul, I belong to nothing, I desire nothing, I am nothing—just an abstract center of impersonal sensations, a fallen sentient mirror reflecting the world’s diversity. I don’t know if I’m happy this way. Nor do I care.- Fernando Pessoa. 


Image Courtesy Google
ఏ కళలోనైనా కళాకారుడికి తన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటాలనే ఆరాటం కనిపిస్తుంది..తనకు శాశ్వతత్వాన్ని ఆపాదించిన ఆ కళారూపంలో తన ఉనికిని చూసుకుని సంబరపడని కళాకారులంటూ ఎవరూ ఉండరేమో..అలాగే ఒక కవి,కవిత్వం ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటాలని ఆరాటపడతారు..మరి తన ఉనికిని నిరాకరించడమే తన కళగా చేసుకున్న పోర్చుగల్ రచయిత ఫెర్నాండో పెస్సోవా ను గురించి యేమని పరిచయం చెయ్యాలో తెలీడం లేదు.

ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలోని సాహిత్యంలో రచయితల్లో 'alter egos' వాడకం ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలంలో చాలా మంది రచయితలు తమ తమ అస్తిత్వాలకు వివిధ రూపాలనివ్వడం జరిగింది కానీ పెస్సోవా ఈ ఆటను తుదికంటా తీసుకువెళ్ళారు,ఈ శైలిని పెస్సోవా వాడుకున్నట్లు మరెవ్వరు వాడుకోలేదని తన ముందుమాటలో అనువాదకర్త రిచర్డ్ జెనిత్ అభిప్రాయపడతారు...""It is a drama divided into people, instead of into acts"" అంటూ తన కవిత్వమనే రంగస్థలాన్ని తనతో కలిపి నాలుగు పరస్పర విరుద్ధ స్వభావాలు,అస్తిత్వాలు ఉన్న వ్యక్తులుగా విభజించారు పెస్సోవా..ఈ మూడు స్వభావాలు విభిన్నంగా ఉన్నప్పటికీ వాటి అస్తిత్వాల్లో పోలికలుంటాయి..వాటన్నిటినీ సమన్వయం చేస్తూ ఈ రచన ద్వారా ఒక వినూత్న ప్రయోగం చేశారు..ఈ విషయంలో తనదైన గుర్తింపుని (?) వదిలేసుకుని ఈయన తన heteronyms కు పేర్లు మాత్రమే కాకుండా విభిన్నమైన వ్యక్తిత్వాలు,మనస్తత్వం,మతం,politics, aesthetics,శరీరాకృతి వంటివాటిని కూడా ఆపాదించారట..ఆ ముగ్గురి గురించీ చెప్తూ,

Alberto Caeiro, considered the Master by the other two, was an ingenuous, unlettered man who lived in the country and had no profession. Ricardo Reis was a doctor and classicist who wrote odes in the style of Horace. Álvaro de Campos, a naval engineer, started out as an exuberant futurist with a Walt Whitmanesque voice, but over time he came to sound more like a mopey existentialist.

పెస్సోవా ఒక సందర్భంలో తను సృష్టించిన పాత్రల గురించి ఆంగ్లంలో రాసిన ఒక వ్యాసంలో ఇలా రాశారట.."Caeiro డిసిప్లిన్ లో విషయాలను యథాతథంగా అనుభూతి చెందడం అయితే,Ricardo Reis డిసిప్లిన్ కాస్త సంక్లిష్టం,ఈయన విషయాలను యధాతథంగా అనుభూతి చెందడమే కాకుండా ,అందులో కొన్ని నిర్దిష్టమైన,ఆదర్శవాద నియమాలను అనుసరించాలంటుంది..Álvaro de Campos ది సరళమైన శైలి,ఆయన కవితల్లో 'అనుభూతి' మాత్రమే కనిపిస్తుంది"..పెస్సోవా కవిత్వం తనను తాను చిన్న చిన్న శకలాల్లా ఛిద్రం చేసుకుని అనంత విశ్వంలోకి విసిరేశాక,ఆ ముక్కలన్నీ తిరిగి అతికించడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది...తాను చూసిన  స్వప్నాల్లో,ఒక్కో స్వప్నానికీ ఒక్కో మనిషికి ప్రాణం పోస్తూ,ఆ కలను ఆ మనిషి చూసినట్లు ఊహించుకునేవారు..తన ఆర్ట్ గురించి ఒక సందర్భంలో ఈ విధంగా రాశారు.."To create I've destroyed myself. I've so externalized myself on the inside that I don't exist there except externally. I'm the empty stage where various actors act out various plays." 

అర్ధాలకూ,ప్రతిపదార్ధాలకూ అతీతమైనది పెస్సోవా ప్రపంచం..
Whenever I look at things and think
about what people think of them,
I laugh like a brook cleanly plashing against a rock.
For the only hidden meaning of things
Is that they have no hidden meaning.
It's the strangest thing of all,
Stranger than all poets’ dreams
And all philosophers’ thoughts,
That things are really what they seem to be
And there’s nothing to understand.
Yes, this is what my senses learned on their own:
Things have no meaning; they exist.
Things are the only hidden meaning of things

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది...పెస్సోవా ని చదవడంలో నాకు ఒక వింత అనుభవం ఎదురైంది..ఒక కథనో,కవితనో చదివినప్పుడు పాఠకుడు సహజంగా అందులో తనని తాను వెతుక్కుంటాడు..కానీ ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ మనం రచయిత 'పెస్సోవా' ని వెతుకుతూనే ఉంటాము..మనకు అందుబాటులో ఉన్న సబ్జెక్టుకు సంబంధించిన ఆబ్జెక్ట్ కనపడకపోయేసరికి మన ఆలోచనల్ని ఎవరివైపు మళ్ళించాలో తెలీక తికమకపడతాం..కవిత్వానికి పునాది నిజాయితీ..కవిత్వంలో నిజాయితీ ఉండాలంటే కవిలో నిజాయితీ ఉండాలి..కానీ పెస్సోవా కవిగా తన ఇన్సిసియారిటీలో చాలా సిన్సియర్ గా ఉంటారు..తనను తాను ఎక్కడా బయటపెట్టుకోకుండా తన అస్తిత్వాన్నీ, ఉనికినీ (fake) పదాల్లో తెలివిగా దాచేసి ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు తన ఉనికిని మార్చుకుంటూ ఉంటారు..అస్థిత్వంలోని conformity ని ఇంత తీవ్రంగా నిరాకరించిన రచయిత బహుశా ఈయనేనేమో..ఇది ఈ పుస్తకంలో సిగ్నేచర్ పోయెమ్ అని చెప్పొచ్చు..

AUTOPSYCHOGRAPHY
 The poet is a faker 
Who’s so good at his act 
He even fakes the pain Of pain he feels in fact.
 And those who read his words 
Will feel in what he wrote 
Neither of the pains he has 
But just the one they don’t.
 And so around its track 
This thing called the heart winds, 
A little clockwork train
 To entertain our minds

పెస్సోవా తన (heteronyms) మారు రూపాలకు Alberto Caeiro,Ricardo Reis,Álvaro de Campos అనే పేర్లనిచ్చి తన కవితా ప్రస్థానాన్ని కొనసాగించారు..అందుకే ఈ పుస్తకానికి 'ఫెర్నాండో పెస్సోవా అండ్ కో' అనే పేరు పెట్టారు..ఇక్కడ కనిపించే 'కవి' ఒక్క వ్యక్తి కాదు మరి..పుస్తకాల్లో మనకు పరిచయమైన పెస్సోవా ఒక స్వాప్నికుడు..ఒక కిటికీ ప్రక్కన కూర్చుని,నోట్లో సిగరెట్ తో,నిరంతరం ఏదో స్వప్నావస్థలో ఉన్నట్లు వాస్తవ ప్రపంచానికీ,ఊహా ప్రపంచానికీ మధ్యనుండే ఒక చిన్న ఖాళీలో ఐడెంటిటీ ఇష్యూస్ తో జీవించారు..ఈ రెండు ప్రపంచాలకూ మధ్య ఉండే 'గ్యాప్' తన ఉనికి అని 'The Book of disquiet' లో ఒక చోట అంటారు..ఆ 'గ్యాప్' ను పట్టుకోవడం పాఠకుల తరం కాదు..ఇందులో కూడా అలాంటిదే ఒక కవిత ఉంది..

I’m beginning to know myself.
I don’t exist.I’m the gap between what I’d like to be and what others have made me,
Or half of this gap,
since there’s also life . . .
That’s me. Period.

ఒక కవి తన చుట్టూ ఉండే పరిసరాల్ని,ఆ పరిసరాల తాలూకూ అనుభవాల్నీ మాత్రమే తన కవితల్లో పొందుపరిచారంటే ఆ కవి ప్రపంచానికి ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదని పెస్సోవా అభిప్రాయపడతారు..పెస్సోవా కవితల్లో నాకు నచ్చిన మరో విషయం గంభీరమైన పదాడంబరాలు లేకపోవడం..
'The Keeper of Sheep' లోని ఒక కవితలో Alberto Caeiro ,
"నా దృష్టి పొద్దుతిరుగుడు పువ్వంత స్పష్టమైనది..రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుడివైపు,ఎడమ వైపు,ఒక్కోసారి వెనక్కి కూడా చూడటం నాకలవాటు..చూసిన ప్రతి సారీ నేను చూసినది మునుపెన్నడూ చూడనిదే..అప్పుడే పుట్టానని స్పృహ కలిగిన పసిబిడ్డ ఆశ్చర్యంగా ప్రపంచాన్ని కళ్ళు విప్పార్చుకుని చూసినట్లు నేను కూడా ఈ అనంతమైన నూతన ప్రపంచంలోకి అప్పుడే వచ్చినట్లు  చూస్తాను." అంటారు..గతము,భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఆ క్షణాన్ని ఒడిసిపట్టుకుని అనుభూతి చెందడం ఈ కవితలన్నిటిలోనూ కనిపిస్తుంది.
అలాగే మరో చోట "నేను ఒక డైసీ పువ్వులా ఈ ప్రపంచాన్ని చూస్తాను..ఎందుకంటే ఆ పువ్వుని చూస్తాను,కానీ దాని గురించి ఆలోచించను..ఆలోచించడమంటే అర్ధం చేసుకోకపోవడం... ప్రపంచం ఉన్నది మనం దాన్ని చూసి అంగీకరించడానికే గానీ,ఆలోచించడానికి కాదు." అంటారు."నాకు సిద్ధాంతాలు లేవు..ఉన్నవల్లా అనుభూతులే.నేను ప్రకృతి గురించి మాట్లాడితే నాకు ప్రకృతి తెలుసునని కాదు..నేను దాన్ని ప్రేమిస్తాను గనుక.బహుశా అందుకేనేమో ప్రేమలో ఉన్నవారికి తాము ప్రేమించిన వాళ్ళ గురించి ఎప్పటికీ తెలీదు,ఎందుకు ప్రేమిస్తున్నారో,అసలు ప్రేమంటే ఏమిటో కూడా తెలీదు.." అని మరో కవితలో అంటారు..ఇలా దాదాపు పెస్సోవా కవితలన్నీ అనుభూతి ప్రధానంగా ఉంటాయి..ఈ కవితల్లో కవి ఉనికి విశ్వంలో మిణుకుమిణుకు మంటున్న ఒక తారలా,అప్పుడప్పుడూ ఆకాశంలోంచి రాలి పడే ఉల్కలా శాశ్వతత్వం అనేది లేకుండా అలా ఒక్క క్షణం పాఠకుల మస్తిష్కంలో తళుక్కుమని అదృశ్యమైపోతుంది..చాలా కాలం క్రితం మొదలు పెట్టి,అడపాదడపా కొన్ని కవితలు చదివినా,సీరియస్ రీడ్ అని మళ్ళీ ప్రక్కన పెట్టిన ఈ పుస్తకాన్ని ఎట్టకేలకు ముగించాను..అస్తిత్వవాదం ఇష్టపడేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

పుస్తకం నుండి మరికొన్ని :

దేన్నైనా కంటితో చూసి,ఆలోచనలకతీతంగా అనుభూతి చెందడం అవసరం అంటారాయన...
The only inner meaning of things
Is that they have no inner meaning at all..

మరో చోట ఆ క్షణంలో తప్ప,ఆ క్షణానికి ముందూ,వెనుకా నా ఉనికి లేదు అంటారు..
For me it is immediate reality.I never go beyond immediate reality.There is nothing beyond immediate reality.

అన్నీ నచ్చిన కవితలే అయినా ఈ కవిత ప్రత్యేకం నచ్చింది..
COUNTLESS LIVES INHABIT US
Countless lives inhabit us.
I don’t know, when I think or feel,
Who it is that thinks or feels.
I am merely the place
Where things are thought or felt.
 I have more than just one soul.
There are more I’s than I myself.

I exist, nevertheless,
Indifferent to them all.
I silence them:
I speak.

The crossing urges of what
I feel or do not feel
Struggle in who I am,
but I ignore them.
They dictate nothing
To the I I know:
I write.
-- 13 NOVEMBER 1935

ఉల్లిపొరల్లా తనలోని మనిషిని ఇంతగా విడదీసి చూసిన వ్యక్తిని ఎక్కడా చూళ్ళేదు...
I multiplied myself to feel myself,
To feel myself I had to feel everything,
I overflowed, I did nothing but spill out,
I undressed, I yielded,
And in each corner of my soul there’s an altar to a different god.

మానవత్వంతో మాత్రమే మనిషి మనుగడనీ,తనను మనిషిని చెయ్యమని దేవుణ్ణి ప్రార్ధించడం ఐరనీతో కూడిన ఒక అద్భుతమైన ఘట్టం..
Make me human,
O night, make me helpful and brotherly.
Only humanitarianly can one live.
Only by loving mankind,
actions,the banality of jobs,Only in this way
---alas! —only in this way can one live.
Only this way, O night,
and I can never be this way!

కళ్ళతో చూసినవి మనసు వరకూ వెళ్ళకపోవడం గురించి ఇది వరకూ విని ఉన్నాను.. ఇప్పుడు పెస్సోవా మాటల్లో మరోసారి..తామరాకు మీద నీటి బొట్టు సిద్ధాంతం..
I look at life passing by,
watching without getting involved,
Belonging to it without pulling a gesture out of my pocket
And without noting down what I see to pretend later on that I saw it.

To hell with life!
To have a profession weighs like paid freight on the shoulders,
To have duties stupefies,
To have morals stifles,
And to react against duties and rebel against morals
Lives on the street—a fool.

మూలాలు ఉండేది చెట్లకి మాత్రమేనట..నేను చెట్టును కాదు,నాకు వేర్లు లేవు అనడం బావుంది కదూ !
And who thinks it’s fine not to feel too attached to his homeland,
For I don’t have roots,
I’m not a tree, and so I have no roots. .

నాకు జీవితం అంటే ఇష్టం లేదు..కానీ దాన్ని అనుభూతి చెందడం మాత్రం ఇష్టం అనడం  స్వార్ధంగా లేదూ  !!
As I don’t like life but like to feel it . .

The rage of not containing all this,
not retaining all this,O abstract hunger for things,
impotent libido for moments,
Intellectual orgy of feeling life!

Insane asylums are full of lunatics with certainties!

I’m at a physical and moral standstill: I’d rather not imagine .

To think about nothing
is to fully possess the soul
To think about nothing
Is to intimately live
life's ebb and flow...

If I think for more than a moment
Of my life that’s passing by,I am
 —to my thinking mind
 —A cadaver waiting to die.

Friday, July 6, 2018

14 Stories that Inspired Satyajit Ray - Bhaskar Chattopadhyay

Image courtesy Google
'సత్యజిత్ రే'..ఫలానా అనే పరిచయం అక్కర్లేని వ్యక్తి...ఆయన రాసిన Indigo: Selected Stories చదివి చాలా కాలమైనా,ఇప్పటికీ ఆయన కథల్లో చూపించిన ఫాంటసీ ప్రపంచం నా కళ్ళముందు కదులుతూనే ఉంది..నా వరకూ నాకు రచయితగా రే తెలిసినంత,దర్శకుడిగా తెలీదు..ఒక దర్శకుడిగా సత్యజిత్ రే ప్రతిభ ఏంటో ఆయన సినిమాలు ఒకటీ రెండూ చూసినవారెవరికైనా కూడా సులభంగా తెలుస్తుంది..కానీ ఆ కళాఖండాలను తయారు చెయ్యడం వెనుక ఆయనను ప్రేరేపించిన అంశాలేమిటో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారికి ఈ పుస్తకాన్ని ఒక బహుమతిగా ఇచ్చారు రచయిత భాస్కర్ ఛటోపాధ్యాయ్.

నేను J.M.Coetzee 'Youth' చదివే సమయానికి సత్యజిత్ రే 'అపు ట్రయాలజీ' పూర్తిగా చూడలేదు..అందులో అపు సినిమాలో అద్భుతమైన సన్నివేశాల గురించీ,ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ గురించీ రాశారాయన..సినిమా కంటే ఆ సంగీతం తననెక్కువ ఆకట్టుకుందని చెప్తారు..అప్పటికి చాలా కాలం క్రిందట 'పథేర్ పంచాలి' చూసినా,సత్యజిత్ రే సినిమాను ఆస్వాదించి,అభినందించే పరిపక్వత బహుశా నాలో లేకపోవడం వల్ల కావచ్చు,బిభూతి భూషణ్ పుస్తకం నచ్చినంతగా ఆ సినిమా నన్ను ఆకట్టుకోలేదు..Coetzee ని చదివాక మళ్ళీ అపు ట్రయాలజీ మరోసారి చూశాను..అప్పుడు కలిగిన అనుభవం మాత్రం పూర్తిగా వేరు..'14 Stories that Inspired Satyajit Ray' లో ఒక దర్శకుడిగా ప్రపంచ స్థాయి కీర్తినార్జించిన రే సినిమాలకు స్ఫూర్తినిచ్చిన కొన్ని కథల్ని ఎంపిక చేసి రచయిత భాస్కర్ ఛటోపాధ్యాయ్ మనకందించారు...సత్యజిత్ రే అభిమానులకు ఈ పుస్తకం,మరోసారి తమ అనుభవాల్ని నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

బెంగాలీ సాహిత్యంతోనూ,వారి సంస్కృతీ సంప్రదాయాలతోను శరత్,టాగోర్ లాంటి వారి రచనల ద్వారా సుపరిచితులైన పాఠకులకు ఈ కథలేవీ కొత్తగా అనిపించవు..ఈ పధ్నాలుగు కథలకూ భాస్కర్ ఛటోపాధ్యాయ్ చేసిన అనువాదాలతో పాటు పుస్తకం చివర్లో Translator's నోట్ ; సత్యజిత్ రే బెంగాలీ నటుడు Chhabi Biswas గురించి రాసిన ఒక వ్యాసం ; షర్మిలా ఠాగోర్ మాటల్లో 'దేవి' సినిమా గురించిన అనుభవాలు ; ధ్రితిమాన్ ఛటర్జీ తో ఇంటర్వ్యూ లాంటివి దర్శకుడు 'సత్యజిత్ రే' గురించి మనకు తెలియని మరిన్ని విషయవిశేషాల్ని తెలియజేస్తాయి..ఇందులో   ఠాగోర్ 'తీన్ కన్యా సిరీస్' లో మూడు కథలూ,సత్యజిత్ రే రాసిన 'అతిథి','పికూస్ డైరీ' అనే రెండు కథలూ మినహాయిస్తే మిగతా కథలన్నీ వేర్వేరు రచయితల నుండి సంగ్రహించినవే..కాగా మున్షీ ప్రేమ్ చంద్ రాసిన రెండు హిందీ కథలు 'సద్గతి (ఓంపురి) ,షత్రంజ్ కే ఖిలాడీ' తప్ప మిగతావన్నీ బెంగాలీ కథలే.

ఇందులో తొలి కథ 'దేవి' (The Goddess)..19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో బెంగాలీ సమాజంలో వేళ్ళూనుకుపోయి ఉన్న మూఢ మతఛాందసవాదాలపై ప్రభాత్ కుమార్ ముఖోపాధ్యాయ్ రాసిన 'దేవి' (The Goddess) కథను షర్మిళా ఠాగోర్ ప్రధాన పాత్రలో నిర్మించారు..ఈ సినిమా షర్మిళా నటజీవితంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు..మరో కథ 'అతిథి' ని రే ముఖ్యంగా పిల్లలు/యువత కోసం రాశానని చెప్తారు..ఆ కథను 'ఆగంతుక్' గా ఉత్పల్ దత్ ప్రధాన పాత్రలో నిర్మించారు..అందులో ఉత్పల్ దత్ నటన ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉంటుంది..నేను కూడా ఈ కథ చదువుతున్నంతసేపూ ఉత్పల్ దత్ ను ఊహించుకుంటూనే చదివాను..కానీ సత్యజిత్ రే ఇందులో చాలా కథల్ని యథాతథంగా చిత్రించకుండా,సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు-చేర్పులూ చేశారు..ఉదాహరణకి ఆగంతుక్ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో ఉన్న ధ్రితిమాన్ ఛటర్జీ పాత్ర కథలో నిజానికి ఉండదు..ఇలాంటి మార్పులు ఆయన సినిమాల్లో చాలానే ఉన్నాయి..కానీ బెంగాలీ సినిమాలు ముఖ్యంగా సాహిత్యాన్ని ఆధారంగా చేసుకునే రూపొందుతాయి కాబట్టి,సినిమా కథలే ప్రేక్షకులకు తొలిగా పరిచయమవుతాయి..ముఖ్యంగా 5% ను మించి మూలకథ తెలిసిన ప్రేక్షకులు ఉండరని రచయిత అంటారు.

ఒక కథను రాసినప్పుడు రచయిత ఆలోచనలు,దర్శకుని దృష్టికోణం నుంచి చూసేటప్పుడు రూపాంతరం చెందడం సహజం,అనివార్యం..రచయిత చెప్పాలనుకున్న విషయం,దర్శకుడు ఊహించిన విషయం మధ్యా గ్యాప్ రావడం తప్పనిసరి..కానీ రే సినిమాల్ని పరిశీలిస్తే,ఆయన తన క్రాఫ్టింగ్ తో ఆ గ్యాప్ ను అత్యంత  ప్రతిభావంతంగా చెరిపేస్తారు..అయినప్పటికీ ఈ కథలు చదివినప్పుడు,విజువల్ మీడియానికీ,పుస్తకానికీ ఉన్న తేడా చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది..
ఉదాహరణకు ఒక కథ రాసేటప్పుడు రచయిత ఒక సంభాషణ గురించి రాస్తున్నప్పుడు తన భావాలకు తగిన మాటలు రాస్తే సరిపోతుంది..అంటే ఇక్కడ ఇమాజినేషన్ ను పూర్తిగా పాఠకులకు వదిలివేసే స్వేఛ్చ రచయితలకు ఉంటుంది..మరి దర్శకుడికి ఆ అవకాశం ఉండదు అంటూ,దర్శకత్వంలోని ఇబ్బందుల గురించి ఈ క్రింది విధంగా రాశారు.

The filmmaker does not have the luxury to leave the character’s description to the imagination of his audience.He has to show a person, her build, her age, her attire, her mental state of mind. His art is, in some sense, that of a more specific projection. And in that sense, telling a story in a cinematic medium is quite different from telling a story through the pages of a book. Both have their own challenges, both present difficulties of varying nature in front of their creators. And what works in one medium may not work in the other.

ఈ కథల్లో 'దేవి','ఆగంతుక్','తీన్ కన్య సిరీస్','పికు','షత్రంజ్ కే ఖిలాడీ','మహానగర్' లాంటి కొన్ని సినిమాలు నేను చూశాను..ఇవి మెజారిటీ సత్యజిత్ రే అభిమానులకు కూడా సుపరిచితమైనవే..వీటితో పాటు నాకు తెలియని సినిమాలు కూడా చాలానే ఉన్నాయి..ప్రేమేంద్ర మిత్రా రాసిన 'కాపురుష్', తారాశంకర్ బందోపాధ్యాయ్ రాసిన 'జల్ సాగర్',రాజ్ శేఖర్ బసు రాసిన 'పరష్ పత్తర్' లాంటి మరి కొన్ని కథలు చదివాకా ఆ సినిమాలను రే ఎలా తీశారో చూడాలనే ఆసక్తి కలిగింది..మధ్యతరగతివారు తన ప్రేక్షకులని చెప్పుకునే రే సినిమాల్లో(కథల్లో) ఒక సామాన్యుడు సులువుగా ఐడెంటిఫై చేసుకునే అన్ని అంశాలూ పుష్కలంగా ఉంటాయి..మిగతా పుస్తకాలేవైనా ఇలాంటి కథల్ని ఆపకుండా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు..కానీ రే చేతుల్లో కళాఖండాలుగా రూపొందిన ఈ కథల్లో కొన్ని సంఘటనల్ని చదువుతున్నప్పుడు,సత్యజిత్ రే ఈ సందర్భాన్ని ఎలా స్క్రీన్ మీద చూపించారా అనే కుతూహలం మధ్యమధ్య లో అడ్డుపడుతూ త్వరగా పేజీలు తిప్పనివ్వదు..అదృష్టవశాత్తూ యూట్యూబ్ లో ఈ సినిమాలు అన్నీ అందుబాటులో ఉండడం వల్ల,ఏకకాలంలో ఒక్కో కథనీ చదువుతూ,మధ్యలో యూట్యూబ్ లో ఆ సినిమా తాలూకూ కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలను చూస్తూ పుస్తకం పూర్తి చేసేసరికి నాకు చాలా సమయం పట్టింది..చాలా ఏళ్ళ క్రిందట చదివిన ఠాగోర్ కథలు మరోసారి రచయిత మాటల్లో అపురూపంగా చదువుకున్నాను..

'సినిమా పుస్తకానికి న్యాయం చెయ్యదు' అనేది జగమెరిగిన సత్యం.అందులోనూ పుస్తకప్రియుల్ని ఈ విషయంలో సంతృప్తి పరచడం అంత తేలికైన విషయం కాదు..కానీ సత్యజిత్ రే సినిమాలకి ఎందుకో ఈ సిద్ధాంతం వర్తించదనిపిస్తుంది..మూలకథను మర్చిపోయేలా చెయ్యగల నైపుణ్యం బహుశా రే కి మాత్రమే సాధ్యమేమో అన్నంతగా ఆయన పాత్రల చిత్రీకరణ ఉంటుంది..స్క్రీన్ ప్లే,బ్యాక్గ్రౌండ్ స్కోర్ ల మీద ఆయనెంత శ్రద్ధ పెడతారంటే,ప్రతి ఫ్రేమ్ లోనూ 'రే మార్కు' స్పష్టంగా కనిపిస్తుంది..ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన 'తీన్ కన్యా'  సిరీస్ లో భాగంగా వ్యవహరించే ఠాగోర్ మూడు కథల్నీ (Monihara,Postmaster,Samapthi ) చదువుతున్నప్పుడు నాకు అసలు ఒరిజినల్ కథ ఇదీ అని గుర్తు రాలేదు..పైపెచ్చు సినిమానే ఒరిజినల్ వెర్షనేమో,ఆ కథలే సినిమా ఆధారంగా రాశారేమో అన్నంత భ్రమలో ప్రేక్షకుల్ని ఉంచేశారు రే..ఇందులో అన్ని కథలూ ఒక ఎత్తైతే,సత్యజిత్ రే తాతగారైన ఉపేంద్ర కిశోర్ రే రాసిన 'Goopy Gyne Bagha Byne' కథ ఒక్కటీ మరొకెత్తు..పిల్లలకు కూడా చాలా నచ్చే ఈ కథ మనల్ని అమాంతం చందమామ కథల కాలం నాటికి తీసుకువెళ్తుంది..

ఠాగోర్ ముగ్గురు స్త్రీల మనస్తత్వాలను విశ్లేషిస్తూ వివిధ దశల్లో స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించిన కథల్లో 'మోనీహార' కథ ఇపుడు మరోసారి చదివినప్పుడు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది..ఈ కథలో ఠాగోర్ స్త్రీ-పురుషుల మనస్తత్వాలను చిత్రీకరించిన తీరు ఆయన్ను 'స్త్రీ పక్షపాతి' అనడానికి అంగీకరించనివ్వదు..ఈ కథ ఒక్కటీ నాకు సినిమా కంటే కూడా బావుందనిపించింది.

‘A woman strives to acquire the love of her husband. If a man, because of his good nature, doesn’t provide her with that opportunity, then such a couple is doomed. In the new-age mantra of marital life, men have lost their intrinsic, inherent, god-gifted and well-meaning barbarism, and Phanibhushan was no exception. He was not successful in business, and he was a complete failure in his marital life.

At twenty-four, she looked like a fourteen-year-old. Perhaps people who have icy hearts, with no room for love, longing and emotions, are able to stay fresh and beautiful for a long time, without withering away with age.

‘The wife often understands her husband much better than he can ever hope to understand her. But the new-age weak-spirited man of today is a different animal altogether. There are broad, age-old categories under which to classify men—brave, blind, buffoon and so on. But these modern men can’t really be slotted into such categories.

పుస్తకం నుండి మరికొన్ని..

'The Story of a Coward' (కాపురుష్)నుండి,
I hadn’t realized I would begin to feel that she was being too normal with me. We both knew the sun had set. But had the faint hue of the rays clung to the clouds of the west, my sensitive ego would have been satisfied.

'ఆగంతుక్' నుండి,
‘We, on the other hand, have always considered the rooted and settled life as the one true way of life. We can’t afford to run around aimlessly. We need to earn our living, we have responsibilities to shoulder, we have to raise our children. I’m assuming you aren’t married?

He told me that once you take the first step out of your house, the whole world becomes a home to you. And then, you simply stop differentiating between black and white, rich and poor, wild and civilized—everything becomes the same.

'మోనిహారా' నుండి,
Even when one leaves an apparently empty space behind, one really leaves several impressions of one’s love, fond signatures of one’s care, on inanimate, insignificant objects.

'పోస్ట్ మాస్టర్' నుండి,
Oh, the human heart! It keeps hoping against hope. It ignores all logic. It doesn’t learn from mistakes. It overlooks the strongest of evidences and clutches at the faintest of hopes, trying to keep the glimmer of expectation locked within itself. And one day, when that very hope cuts through the heart to drink its blood and escapes, the heart simply looks for some other hope to lean on.

ఠాగోర్ రాసిన 'సమాప్తి' కథలో మృణ్మయి బాల్యం నుండి యవ్వనానికి మారే దశను ఠాగోర్ వర్ణించినట్లు వర్ణించడం ఎవరికీ సాధ్యం !!
Ancient stories talk about highly skilled ironsmiths who are adept at making such sharp swords that if such a sword is used to cut a person in half, he would not even realize it until he is pushed and the two halves fall off. God’s sword was as sharp as that. He had cut through Mrinmoyi’s childhood and youth so swiftly that she hadn’t even realized it, and all it needed was a shove for the two to be separated from each other, leaving her in a dazed and wounded state of mind.