"If you want to tell people the truth, make them laugh, otherwise they'll kill you" అని ఆస్కార్ వైల్డ్ అన్నారో లేక జార్జ్ బెర్నార్డ్ షా అన్నారో ఖచ్చితంగా తెలీదు గానీ ఈ మాటల్ని అక్షరాలా పాటించారు వియత్నాం అమెరికన్ రచయిత Viet Thanh Nguyen..ఈ రచన 2016 సంవత్సరానికి గాను Pulitzer Prize for Fiction,Edgar Award for Best First Novel తో పాటు రచయితకు మరిన్ని అవార్డులను సాధించిపెట్టింది.
I am a spy,a sleeper,a spook,a man of two faces.Perhaps not surprisingly,I am also a man of two minds... అంటూ Laos లోని కారాగారంలో ఒక ఖైదీ కన్ఫెషన్ తో 'The Sympathizer' నవల మొదలవుతుంది ..
ఇందులో కథంతా పేరు తెలియని ముఖ్య పాత్రధారి జైలు కమాండెంట్ కు ఇచ్చిన కన్ఫెషన్ లో భాగంగానే చెప్తారు..ఇది వియత్నాం యుద్ధ కాలం,అంటే 1950-60 ల మధ్య జరిగిన కథ కాబట్టి ఈ హిస్టారికల్ ఫిక్షన్ చదివే ముందు వియత్నాం యుద్ధం గురించి కొంత తెలుసుకోవాలి..ఈ యుద్ధం నార్త్ వియత్నాంను సోవియట్ యూనియన్,చైనాలు మరియు సౌత్ వియత్నాంను అమెరికా,థాయిలాండ్ లాంటి anti-కమ్యూనిస్ట్ దేశాలు మద్దతుదార్లుగా అప్పటికే ప్రపంచం నలుమూలలా వేళ్ళూనుకుంటున్న కమ్యూనిజాన్నీ అడ్డుకోవాలని అమెరికా తదితర దేశాల ప్రయత్న ఫలితం..ఇందులో సౌత్ వియత్నాం ప్రభుత్వం పరాజయం పాలై సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంగా ఆవిర్భవించేవరకు జరిగిన సంఘటనల్ని ఒకొక్కటిగా చెప్పుకొస్తారు..
ఇందులో ప్రొటొగోనిస్ట్ ఒక ఫ్రెంచ్ మతాధికారికీ,వియత్నాం యువతీకీ జన్మించి,అక్రమ సంతానమనే ముద్రతో జీవిస్తూ అమెరికాలో విద్యాభ్యాసంతో పాటు Claude అనే అమెరికన్ వద్ద గూఢచారిగా శిక్షణ పూర్తి చేసుకుని వియత్నాం చేరతాడు..కమ్యూనిస్ట్ ఏజెంట్ అయిన అతను సౌత్ వియత్నాంలోని Saigon లో ఆర్మీ కెప్టెన్ గా తన జనరల్ కు నమ్మినబంటుగా నటిస్తూ తన కమ్యూనిస్ట్ సహచరుడూ,బాల్య స్నేహితుడూ అయిన Man కు అవసరమైన రహస్య సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు..తన ద్వంద్వ వైఖరికి కారణం,తన పుట్టుకే అసమంజసమైన వ్యక్తుల/సంస్కృతుల మేళవింపు కావడం వలన అని చెప్తూ,అమెరికాలో విద్యాభ్యాసం చెయ్యడం వలన ఆ దేశం కూడా పాక్షికంగా తన అస్తిత్వంలో ఎలా భాగమైందో చెప్తాడు..
I was already undercover, part scholarship student, part spy-in-training, the lone representative of our people at a sylvan little college called Occidental, its motto Occidens Proximus Orienti. There I passed six idyllic years in the dreamy, sun-besotted world of Southern California during the sixties.
What was it like to live in a time when one’s fate was not war, when one was not led by the craven and the corrupt, when one’s country was not a basket case kept alive only through the intravenous drip of American aid ?
ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి,ఒకటి మంచైతే మరొకటి చెడు..కానీ ఈ రెండు వైపులూ ఒకరి అస్థిత్వంలో భాగమైనప్పుడు పూర్తిగా ఒకే పక్షం తీసుకోవడం సాధ్యమేనా ! అసలు ఆ స్థితిలో మంచి-చెడులు బేరీజు వెయ్యడంలో కూడా తడబాటు సహజమేమో !! మన కథానాయకుడు ఈ దువిధను కథ నడుస్తున్నంతసేపూ తన భుజస్కంధాలపై మోస్తుంటాడు..నార్త్ వియత్నాం తరఫు గూఢచారిగా ఉన్నప్పటికీ, సౌత్ వియత్నాం సైనికుల్లో తనను తాను ఐడెంటిఫై చేసుకుంటూ వారిపై సానుభూతి తప్ప శత్రుత్వం కలగట్లేదంటాడు...ఒక దశలో We cannot represent themselves; We must be represented అంటూ తమ అస్తిత్వం చాటుకునే దిశగా వెళ్తూ ఆ క్రమంలో తమ ఉనికినీ,భవిష్యత్తునీ గుడ్డిగా అమెరికా చేతుల్లో పెట్టామని వాపోతాడు.
ఇందులో ప్రొటొగోనిస్ట్ కు Man,Bon అనే ఇద్దరు బాల్య స్నేహితులుంటారు,వారిని బ్లడ్ బ్రదర్స్ గా పిలుస్తుంటాడు..వారి ముగ్గురి స్నేహాన్ని కూడా చిన్ననాటి విశేషాలతో వర్ణిస్తారు..ఇందులో Man కూడా ప్రొటొగోనిస్ట్ లాగే కమ్యూనిస్ట్ కాగా,Bon మాత్రం anti-కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉండటం కథలో కీలక మలుపులకు కారణమవుతుంది..వీరితో పాటు జనరల్,Claude,crapulent మేజర్,సోనీ,ఏజెంట్ కూడా కథా గమనాన్ని నిర్దేశించే మరికొన్ని కీలక పాత్రలు..కాగా జనరల్ కుమార్తె Lana పాత్రను శాంతిని కాంక్షిస్తూ,తమ భవిష్యత్తును గూర్చి కలలు కనే వియత్నాం యువతకు ప్రతినిధిగా చిత్రించారు..మొత్తం 23 భాగాలుగా రాసిన ఈ కథలో మొదట భాగం Saigon ఆక్రమణ గురించి రాస్తే,రెండో భాగం లాస్ ఏంజెల్స్ లో అమెరికా శరణార్థిగా ప్రొటొగోనిస్ట్,జనరల్,Bon తదితరుల అనుభావాలుంటాయి,మూడో భాగంలో Laos లో జైలు ఖైదీగా ప్రొటొగోనిస్ట్ పడ్డ బాధలు,ఆ పై అతని ద్వంద్వ వైఖరికి పరిష్కారం దొరికే దిశగా ఒకదాని వెంబడి ఒకటిగా బయటకొచ్చే నిజాలు,చివరగా అతని భావాలు విముక్తి దిశగా ప్రయాణించడంతో కథ ముగుస్తుంది..స్థిరమైన వర్ణనలతో సాగే ఈ నవలలో అక్కడక్కడా పోరాటాలు,హత్యలు,ఎదురు దాడులతో జేమ్స్ బాండ్ సినిమాలను తలపించే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి..నవల చివరి వంద పేజీల దగ్గరకొచ్చేసరికి మాత్రం శ్వాస కూడా తీసుకోవడం మర్చిపోయేంత ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఎదురవుతాయి..
ఇందులో నేరేటర్ ఒక గూఢచారిగా తన అనుభవాలతో పాటు,యుద్ధకాలంలో వియత్నాం,అమెరికా,కాంబోడియా తదితర దేశాల్లోని సామాజిక మార్పులు,రాజకీయ సమీకరణాలపై అనేక విశ్లేషణలు చేశారు..యుద్ధ సమయంలో గూఢచారి వ్యవస్థ పని తీరు,వారి ఇంటరాగేషన్ పద్ధతులు భీతి గొలిపేలా చాలా వివరంగా రాశారు..కేవలం యుద్ధం,చరిత్ర అంటూ చరిత్ర పాఠాన్ని వల్లెవేయకుండా తన intellectual,ఫిలసాఫికల్ విశ్లేషణల ద్వారా చదువరులను కట్టిపడేస్తారు..వియత్నాంకు సంబంధించి ఇందులో రచయిత స్పృశించని అంశమంటూ ఉండదు..ఈ యుద్ధానికి సంబంధించిన వాస్తవాలు కావాలంటే ఏ చరిత్ర పుస్తకాన్ని అడిగినా చెప్తుంది,కానీ వియత్నాంనూ,ఆ యుద్ధాన్నీ ఒక సగటు వియత్నాం దేశస్థుని కళ్ళతో చూడాలంటే ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే..కేవలం వియత్నాం రూపాన్నే కాకుండా హృదయాన్ని కూడా ఆవిష్కరించిన రచన ఏదైనా ఉంటే అది ఇదే అనిపించక మానదు..
ఇందులో కొన్ని సంఘటనలు స్మృతిపథం నుంచి ఎప్పటికీ చెరిగిపోవు,ఉదాహరణకు యుద్ధ కాలంలో సౌత్ వియత్నాం సైనికుల దుర్భర జీవితాన్నీ,తమ కుటుంబాల కోసం తమ దేశభక్తినీ,నిజాయితీని పణంగా పెట్టవలసిన సందర్భాలలో వారి మానసిక సంఘర్షణను,నిస్సహాయతనూ కళ్ళకు కట్టిన తీరు చాలా బావుంటుంది...ఒక చేత్తో Saigon ఆక్రమణ తరువాత రెఫ్యూజీ క్యాంపుల్లో అమెరికా శరణార్థులుగా మారిన ఒక ఆర్మీ జనరల్ కుటుంబం గురించీ,అతని మానసిక స్థితిని గురించీ రాస్తే మరో చేత్తో యుద్ధ ప్రభావం సామాన్యులను ఎలా ప్రభావితం చేసిందో కూడా రాస్తారు..ఈ యుద్ధాన్నీ,దాని కారణంగా జరిగిన వినాశనాన్నీ వివరించే క్రమంలో Richard Hedd రాసిన Asian Communism and the Oriental Mode of Destruction అంటూ ఒక పుస్తకాన్ని మెటాఫోర్ గా చాలా చోట్ల విరివిగా ప్రస్తావించారు..ఇటువంటివే కాకుండా సందర్భానుసారంగా పుస్తకంలో ప్రస్తావించిన వియత్నాం,అమెరికన్ గీతాలు,సంగీతంలో రచయితకున్న పరిజ్ఞానానికి ఉదాహరణలు..
చేదు నిజాలను చదవడానికి ఇష్టపడనివాళ్ళని సైతం తన వ్యంగ్యం,డార్క్ హ్యూమర్ మేళవించిన ప్రత్యేకమైన రచనా శైలితో మంత్రముగ్ధుల్ని చెయ్యగల రచయిత Viet Thanh Nguyen..పుస్తకంలో అన్నిటికంటే ఆకట్టుకున్న విషయం నేరేషన్..తొలి పేజీ నుండే అలవోకగా,ఒక ప్రవాహంలా సాగే నేరేషన్ పాఠకులకు చరిత్రలోని చీకటి దారుల్లో ప్రయాణిస్తున్నామనే అలుపు అస్సలు తెలియనివ్వదు..పదాలను మంత్రించి రాశారేమో అన్నట్లు,కొన్ని వాక్యాలు పెదవుల మీద చిరునవ్వులు పూయిస్తే అవే వాక్యాలు వెనువెంటనే మౌనంగా ఆలోచనల్లో పడేస్తాయి..ఈ తరహా వివరణలు పుస్తకంలో కోకొల్లలు..ఇందులో బాగా ఆకట్టుకున్న మరో విషయం ప్రోటొగోనిస్ట్ Conscience..చిన్న చిన్న విషయ విశేషాల్లో కూడా లోతైన భావాలను వెలికి తీయగల ప్రోటోగోనిస్ట్ ఆత్మశోధన,అంతఃచేతనలు అమోఘం అనడం తప్ప మరో మాట లేదు..ఈ మధ్య చదివిన పుస్తకాల్లో క్రింద పెట్టనివ్వకుండా చదివించిన పుస్తకమేదైనా ఉంటే అది ఇదే...
"East is East and West is West,and never the twain shall meet" అని కిప్లింగ్ అన్నట్లు,కాలిఫోర్నియాలో తన జీవితాన్ని గురించి రాస్తూ 'Amerasian' గా రెండు ప్రపంచాల మధ్యా ఊగిసలాడుతూ తాము ఏ ప్రపంచానికి చెందుతామో తెలీని దువిధని వర్ణిస్తూ (orient-Occident) తూర్పు పడమరల వైరుధ్యాలను వర్ణించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది..
అమెరికా narcissism ను తూర్పారబడుతూ,
America, a country not content simply to give itself a name on its bloody birth, but one that insisted for the first time in history on a mysterious acronym, USA, a trifecta of letters outdone later only by the quartet of the USSR. Although every country thought itself superior in its own way, was there ever a country that coined so many “super” terms from the federal bank of its narcissism, was not only superconfident but also truly superpowerful, that would not be satisfied until it locked every nation of the world into a full nelson and made it cry Uncle Sam ?
Americans on the average do not trust intellectuals, but they are cowed by power and stunned by celebrity.
యుద్ధానంతరం Saigon జీవన చిత్రం...
This had happened in Da Nang and Nha Trang, where the Americans had fled for their lives and left the residents to turn on one another. But despite this precedent, the atmosphere was strangely quiet in Saigon, most of the Saigonese citizenry behaving like people in a scuppered marriage, willing to cling gamely to each other and drown so long as nobody declared the adulterous truth.
యుద్ధాలతో,ఆక్రమణలతో శిధిలమైన వియత్నాం చిత్రాన్ని వర్ణిస్తూ ఈ విధంగా అంటారు..
We had been forced to adapt to ten years of living in a bubble economy pumped up purely by American imports; three decades of on-again, off-again war, including the sawing in half of the country in ’54 by foreign magicians and the brief Japanese interregnum of World War II; and the previous century of avuncular French molestation.
ఒక గూఢచారిగా తన జీవితాన్ని గురించి రాస్తూ,
I lived like a bonded servant, a refugee whose only job perk was the opportunity to receive welfare. I barely even had the opportunity to sleep, since a sleeper agent is almost constantly afflicted with insomnia. Perhaps James Bond could slumber peacefully on the bed of nails that was a spy’s life, but I could not.
Interrogation is not punishment. Interrogation is a science.
A spy’s task is to hide where everyone can see him and where he can see everything.
ఒక కమ్యూనిస్టుగా తన సందిగ్ధతను విప్పి చెప్తూ,
We Marxists believe that capitalism generates contradictions and will fall apart from them, but only if men take action. But it was not just capitalism that was contradictory. As Hegel said, tragedy was not the conflict between right and wrong but right and right, a dilemma none of us who wanted to participate in history could escape.
కమాండెంట్ ప్రొటొగోనిస్ట్ ని ఉద్దేశించి అన్న మాటలు అతని వ్యక్తిత్వానికి దర్పణం పడతాయి..
Compared to To Huu, you are a communist only in name. In practice, you are a bourgeois intellectual. I’m not blaming you. It’s difficult to escape one’s class and one’s birth, and you are corrupted in both respects. You must remake yourself, as Uncle Ho and Chairman Mao both said bourgeois intellectuals should do. The good news is that you show glimmers of collective revolutionary consciousness. The bad news is that your language betrays you. It is not clear, not succinct, not direct, not simple. It is the language of the elite. You must write for the people.
పుస్తకం నుండి మరికొన్ని,
How could I forget that every truth meant at least two things, that slogans were empty suits draped on the corpse of an idea? The suits depended on how one wore them, and this suit was now worn out.out, a sartorial sensation that only a man of two minds, or a man with no face, dared to wear.
Namely this: while nothing is more precious than independence and freedom, nothing is also more precious than independence and freedom! These two slogans are almost the same, but not quite. The first inspiring slogan was Ho Chi Minh’s empty suit, which he no longer wore. How could he? He was dead. The second slogan was the tricky one, the joke. It was Uncle Ho’s empty suit turned inside out, a sartorial sensation that only a man of two minds, or a man with no face, dared to wear.
But they aren’t innocent. Neither are we, my friend. We’re revolutionaries, and revolutionaries can never be innocent. We know too much and have done too much.
It is always better to admire the best among our foes rather than the worst among our friends. Wouldn’t you agree, Commandant?
I had an abiding respect for the professionalism of career prostitutes, who wore their dishonesty more openly than lawyers, both of whom bill by the hour.
To live was to be haunted by the inevitability of one’s own decay, and to be dead was to be haunted by the memory of living.
No one else has the luxury I have of simply writing and living the life of the mind, I said.
I was guilty of the crime of doing nothing. I was the man to whom things are done because he had done nothing !
Image Courtesy Google |

No comments:
Post a Comment