Sunday, October 15, 2017

Gratitude - Oliver Sacks

చాలా మందికి జీవితాన్ని ప్రేమించడమంటే మృత్యువుని అంగీకరించలేకపోవడం,లేదా మృత్యువు ఉనికిని గుర్తించకుండా ముందుకి సాగిపోవడం..దీన్నే 'పాజిటివ్ లైఫ్' అని అనుకోడం సగటు మనిషి నైజం..కానీ వాస్తవాన్ని అంగీకరిస్తూ కూడా జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు హుందాగా వీడ్కోలు చెప్పడం వివేకవంతులకు మాత్రమే సాధ్యం..ప్రముఖ న్యూరాలజిస్ట్,ప్రొఫెసర్ మరియు రచయిత అయిన Oliver Sacks అదే కోవకి వస్తారు..

Image Courtesy Google
Oliver Sacks కాన్సర్ తో పోరాడుతూ తనకు సమయం తక్కువ ఉందని తెలిసి,ఉన్న కొద్ది సమయంలోనే తన జీవితాన్ని అర్ధవంతంగా గడిపి చివరకు తన జీవితానికి కృతజ్ఞతలు చెప్తూ రాసిన పుస్తకమే ఈ 'Gratitude'...బ్రెయిన్ పికింగ్స్ లో తొలిసారి ఈ పుస్తకం గురించి చూసి చాలా కాలం నుంచీ చదువుదామనుకుంటూ,ఎట్టకేలకి చదివిన పుస్తకం ఇది..ఇందులో Sacks "ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గురించి భయం లేదని అబద్ధం చెప్పను" అంటూ ఎంతో నిజాయితీగా తన మనసులోని భావాలను ఒక్కొక్కటిగా మన ముందుంచుతారు..

I cannot pretend I am without fear. But my predominant feeling is one of gratitude. I have loved and been loved; I have been given much and I have given something in return; I have read and traveled and thought and written. I have had an intercourse with the world, the special intercourse of writers and readers. అంటూ ఒక రీడర్ గా,రైటర్ గా ఈ ప్రపంచంతో తనకు గల ప్రత్యేకమైన అనుబంధాన్ని ప్రేమగా నెమరువేసుకుంటారు Sacks..

Sacks జీవితంలో చివరి రెండేళ్ళలో రాసి The Newyork Times లో విడి విడి వ్యాసాలుగా పబ్లిష్ చెయ్యబడిన Mercury,My Own Life,My Periodic table,Sabbath లను ఈ 'Gratitude' లో పొందుపరిచారు..ఆయన మెమోయిర్ 'On the move' రాసిన 18 నెలల తరువాత ఆయన కంట్లో ఏర్పడిన melanoma,లివర్ కు వ్యాపించడంతో Sacks కు ఆరు నెలల మించి వ్యవధి లేదని వైద్యులు ధృవీకరిస్తారు..
ఇందులో మొదటి భాగం 'మెర్క్యూరీ' పీరియాడిక్ టేబుల్ ప్రకారం ఎనభయ్యో మూలకం..తను ఎనభయ్యో పడిలో పడటానికి ఎదురుచూస్తున్నానంటూ దానికి ఆ పేరు పెట్టానంటారు Sacks ..

రెండో భాగం My Own Life లో మృత్యువు దగ్గరయ్యే సమయంలో ఆయన జీవితంలో ప్రాముఖ్యతలు ఎలా మారాయో చెప్తారు..జీవితంలో ఎంత సాధించినా,మేధో సంపన్నులైనా,ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించినవారికైనా ఈ అందమైన ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతూ ఏదో వెలితిగా అనిపించడం సహజం అంటూ ఇలా అంటారు..
I often feel that life is about to begin, only to realize it is almost over.


మరోచోట మరణానంతర జీవితం గురించి తనకి ఆసక్తి లేదనీ,ఎటొచ్చీ తన అక్షరాల్లో తన తదనంతరం కూడా జీవించే ఉంటాననీ ఆయనలోని రచయిత ఇలా అంటారు..
I have no belief in (or desire for) any postmortem existence, other than in the memories of friends and the hope that some of my books may still “speak” to people after my death.

తన చివరి రోజుల్లో మరణం ఆసన్నమైందని తెలిసిన Sacks జీవితాన్ని ఒక విస్తృతమైన పరిధిలో చూశానంటూ,ఆ సమయంలో జీవితంలో ప్రతి అణువుతో ఒక లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నానేనే భావనతో గడిపానంటారు..

Over the last few days, I have been able to see my life as from a great altitude, as a sort of landscape, and with a deepening sense of the connection of all its parts. This does not mean I am finished with life. On the contrary, I feel intensely alive, and I want and hope in the time that remains to deepen my friendships, to say farewell to those I love, to write more, to travel if I have the strength, to achieve new levels of understanding and insight.This will involve audacity, clarity, and plain speaking; trying to straighten my accounts with the world. But there will be time, too, for some fun (and even some silliness, as well).

చిన్నతనం లోనే దగ్గరవాళ్ళని కోల్పోయిన Sacks,తనను భౌతిక శాస్త్రం దిశగా నడిపించిన కారణాలనూ,సైన్స్ తో తనకు అనుబంధం ఏర్పడిన విధానాన్నీ గురించి ఇలా అంటారు..
Times of stress throughout my life have led me to turn, or return, to the physical sciences, a world where there is no life, but also no death.

పీరియాడిక్ టేబుల్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్తూ,అందులోని మూలకాలతో తన పుట్టినరోజుల్ని లెక్కించుకుంటూ తను Polonium (84) పుట్టినరోజుని ఖచ్చితంగా చూడబోనంటూ,ఈ విధంగా చమత్కరిస్తారు..

I almost certainly will not see my polonium (eighty-fourth) birthday, nor would I want any polonium around, with its intense, murderous radioactivity.

ఇక చివరి భాగం 'Sabbath' లో ఒక సంప్రదాయ జ్యూయిష్ కుటుంబంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ,Jew లకు పవిత్ర దినమైన వారంలో ఏడో రోజైన 'Sabbath' ను గురించి రాస్తారు...జీవితాన్ని ప్రేమించిన వాళ్ళెంతమంది మృత్యువుని కూడా అదే ప్రేమతో ఆహ్వానిస్తారు ! అసలు ఎలా జీవించామన్నది కాదు,ఎలా వీడ్కోలు చెప్పామన్నది ముఖ్యం అని చాలా మంది అంటూ ఉంటారు..కానీ రక్తబిగి ఉన్నప్పుడుండే గాంభీర్యం చివరి క్షణాల్లో సాధ్యమేనా అని చదివేవాళ్ళని ఆలోచనలో పడేసే పుస్తకం ఇది..జీవితం చివర్లో లెక్కలు సరి చూసుకునే సమయంలో అడుగులు తడబడకుండా ఎలా ఉండాలో చూపించే ఒక చిన్న గైడ్ లాంటిది ఇది..పుస్తకం చాలా చిన్నది కావడంతో చదవడం చాలా సులువు,కానీ గంగి గోవు పాలు గరిటెడైనను చాలు రీతిలో చిన్నదైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు...
I’m glad I’m not dead!” sometimes bursts out of me when the weather is perfect. (This is in contrast to a story I heard from a friend who, walking with Samuel Beckett in Paris on a perfect spring morning, said to him, “Doesn’t a day like this make you glad to be alive?” to which Beckett answered, “I wouldn’t go as far as that.”)

No comments:

Post a Comment