There is in every true woman's heart, a spark of heavenly fire, which lies dormant in the broad daylight of prosperity, but which kindles up and beams and blazes in the dark hour of adversity.-Washington Irving,The Sketch Book.
స్త్రీ మస్తిష్కంలో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరమూ కాధు....ఆమె హృదయం ఒక లోతైన సముద్రం..ఆ సముద్రాన్ని మధించే యత్నంలో రూపుదిద్దుకున్న బినోదిని పాత్ర ద్వారా అమృతతుల్యమైన స్త్రీ ఔన్నత్యాన్ని తనదైన శైలిలో మనకు రుచి చూపిస్తారు రవీంద్రనాథ్ టాగూర్.."చోఖేర్ బాలి" అంటే "కంట్లో నలుసు(ఇసుక రేణువు) అని అర్థం ..ఏ విధం గా అయితే ఇసుక రేణువు కంట్లో పడి చికాకు పెడుతుందో అదే విధం గా బినోదిని, మహేంద్ర-ఆశల అందమయిన దాంపత్య జీవితం లో కలకలం రేపుతుంది..
An irate queen bee stings everyone that comes in her path,and similarly an irate Binodini was prepared to destroy everyone around her.
కథలోకి వస్తే,ఈ నవల లో కీలక పాత్రధారి బినోదిని ఒక వితంతువు...అనుపమాన సౌందర్యం,వివేకం, తెలివితేటలు అంతకుమించిన కలివిడితనం ఆమె సొంతం..ఇన్ని సుగుణాలను దాచేస్తూ ఆమె శిరస్సు పైన వైధవ్యం అనే శ్వేతవర్ణ పరదా ఆమెకు సుఖప్రదమయిన జీవితాన్ని ఇవ్వలేకపోయింది..సమాజపు కట్టుబాట్ల మధ్య అన్ని ఆనందాలకి దూరంగా,బరసత్ అనే ఒక కుగ్రామం లో భారం గా బ్రతుకు వెళ్ళదీస్తున్న ఆమె కి,కలకత్తా కు చెందిన ధనవంతురాలు మరియు ఆమె బంధువు రాజలక్ష్మి రాక వరం గా పరిణమిస్తుంది..ఆమె బినోదినిని తనతో పాటు నివసించడానికి తన ఇంటికి తీసుకెళ్తుంది.రాజలక్ష్మి తనయుడు మహేంద్ర,మొదట తల్లి నిర్ణయం పట్ల విముఖత ప్రదర్శించినా,భార్య ప్రోద్బలం తో బినోదిని చురుకుతనం, గుణగణాలు చూసి ఆమెతో స్నేహం చేస్తాడు...అంతవరకూ ఒంటరి జీవితం గడిపిన బినోదిని,సర్వ సౌఖ్యాలూ అమరిన ఇల్లు,ఆ ఇంటి బాధ్యత,అన్నిటినీ మించి ఆశ,మహేంద్ర ల స్నేహపూరితమయిన సాంగత్యం,అన్నీ వెరసి ఒక అద్భుత ప్రపంచం లోకి వచ్చినట్లు భావిస్తుంది..వైధవ్యం ఆపాదించిన కట్టుబాట్ల శృంఖలాలు తెంచుకుని ఆధునిక జీవన శైలిలో మమేకమై పట్నవాసంలోని స్వేచ్చని ఆస్వాదిస్తుంది..ఆశ- మహేంద్రల అన్యోన్య దాంపత్యం గురించి నెచ్చెలి ఆశ తరచూ చెప్పగా విని బినోదిని అలౌకికమయిన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది..
Love turns bland if not seasoned with a touch of pique,like cooking without spices..
Love needed to be rooted in life's labour,otherwise ecstasy would never be profound and enduring.
ఇంతవరకూ అంతా సజావుగానే సాగుతుంది,కానీ మహేంద్ర తల్లి ఒకప్పుడు బినోదిని సంబంధం తెచ్చి పెళ్ళాడమని బలవంతం చేసినప్పటికీ,మహేంద్ర ఆమెను తిరస్కరించి,తన బాల్య మిత్రుడు,వైద్య విద్యనభ్యసిస్తున బిహారీ పెళ్లాడవలసిన ఆశ ను ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు..మహేంద్ర అత్త అన్నపూర్ణకి వరసకు కూతురు,ఆశ ..ఈ సంగతి మనసులో పెట్టుకుని,తనకి దక్కవలసిన సుఖ సంతోషాలని తనతో ఏ మాత్రం సరితూగలేని,అవివేకి,అజ్ఞాని అయిన ఆశ అనుభవిస్తోందని అసూయ చెందుతుంది బినోదిని.ఇది విష బీజమై బినోదిని మనసుని కలుషితం చేస్తుంది.పర్యవసానంగా మహేంద్ర ని తన అందచందాలతో,మితిమీరిన చొరవతో ఆకర్షించడం మొదలు పెడుతుంది..మహేంద్ర ని పొందాలనే ఆకాంక్ష కి మూలం ఆశ పట్ల తనకున్న అసూయ ద్వేషాలే గానీ ప్రేమ కాదని తెలుసుకుంటుంది..అదే సమయం లో తన హృదయం మృదు స్వభావీ,అందరి మంచి కోరే వాడు అయిన బిహారీ సొంతమని గ్రహించే లోపు చాలా ఆలస్యమైపోతుంది.మహేంద్ర బినోదిని పై ప్రేమోన్మాదంలో పూర్తిగా విచక్షణ కోల్పోతాడు..ఈ క్రమంలో బినోదిని,మహేంద్ర,ఆశ మరియు బిహారీ ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది చోఖేర్ బాలి కథాంశం...
Mahendra's thoughts,
Was there a hint in this letter of an ardour - veiled yet implied, forbidden yet intimate,noxious yet delicious,offered but unrequited ?
This play acting in a down to earth domestic chore,in a sense,rescued him from the improbable task of creating his fairy tale dream world..
Mahendra addressing Binodini,
Why did you at all engage yourself in this game ? There is now no release for you.If we sink we sink together.
పాత్రల చిత్రీకరణ,మనస్తత్వాల విశ్లేషణలో టాగోర్ శైలి అత్యంత సహజం గా సాగుతుంది ..ముఖ్యం గా స్త్రీ పాత్ర చిత్రీకరణలో ఆయన చూపించే ప్రత్యేకత,పక్షపాతం జగద్విదితం..ఆనాటి సమాజంలో వైధవ్యం పొందిన స్త్రీలు పడే మానసిన సంఘర్షణకి నిలువెత్తు ప్రతిబింబం బినోదిని..భౌతిక వాంఛలను అణచుకోలేక,సమాజపు కట్టుబాట్లకి ఎదురు తిరగనూలేక ఆమె కనపరిచే గాంభీర్యం ఆమె వ్యక్తిత్వానికి దర్పణం..మధ్యలో కొన్ని మానసిక దౌర్బల్యాల వలన విలువలు కోల్పోయినా బిహారీ వివాహ ప్రతిపాదనని హుందాగా తిరస్కరించే సందర్భంలో ఆమె తన ఔన్నత్యాన్ని చాటుతుంది....తల్లి అతి గారాబం,మొండితనం,ఆవేశం,కోరుకున్నది సాధించాలన్న పట్టుదలా కూడి మహేంద్ర వ్యక్తిత్వం..భార్య ఆశను వంటింటికి పరిమితం చెయ్యకుండా,విద్యావంతురాలిని చెయ్యాలనుకునే ఉత్తమమైన నాయక పాత్రగా మొదలై పరస్త్రీ వ్యామోహంతో విలువలు దిగజార్చుకుంటాడు..బిహారీ అందరికీ నోట్లో నాలుకలా మెలుగుతూ,అందరి మంచీ కోరుకుంటూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర గా మొదలై చివరకు నిజమైన నాయకుడిగా అవతరిస్తాడు..మంచితనానికి,త్యాగశీలతకూ,క్షమా గుణానికీ మారు పేరు ఆశాలత,సగటు ఆడపిల్ల కి ప్రతీక...అమ్మగా,అత్తగారిగా రెండు విభిన్నఛాయలతో,కొడుకు మనసులో ప్రథమ స్థానం,తల్లిగా తనకే సొంతమని భావించే రాజలక్ష్మిపాత్ర ప్రతి ఒక్క ఇంటిలో అత్తగారిని తలపిస్తుంది..
"చోఖేర్ బాలి" ప్రత్యేకత "రవీంద్రుని రచన" కావడమే..సమాజపు దురాచారాలను సున్నితంగా విమర్శిస్తూ, వితంతువుల పై సమాజపు అమానుష ధోరణులను ఎత్తి చూపుతుంది..మానవీయ విలువలు,మనస్తత్వ విశ్లేషణలు,మానవ సంబంధాలు,జీవితపు ఆటుపోట్లు ప్రధానాంశాలుగా సాగే ఈ నవల బెంగాలీ సమాజ కట్టుబాట్లకి,సంప్రదాయాలకీ అద్దం పడుతుంది..మానవ సహజమైన భావోద్వేగాలకు ఎంతటి వారయినా అతీతులు కారని నిరూపిస్తుంది..ఆనాటి సంఘం లో ద్వితీయ వివాహం నిషిద్ధం కావడం తో బినోదిని-బిహారీల వివాహంతో కాకుండా,ఎడబాటుతో ఈ కథకి ముగింపు ఇవ్వవలసి వచ్చినందుకు టాగోర్ అసంతృప్తి వ్యక్తం చేసేవారట. 'బంగదర్శన్' పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల సుఖేందు రే అనువదించగా 300 పేజీల పుస్తకం గా రూపుదిద్దుకుంది..ఈ నవలను 2003 లో రితుపర్నో ఘోష్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్,ప్రసేన్జిత్ చటర్జీ ప్రధాన భూమికలుగా వెండితెర మీద ఆవిష్కరించారు..

No comments:
Post a Comment