ప్రముఖ అమెరికన్ సాహితీవేత్త, విమర్శకులూ అయిన పీటర్ బ్రూక్స్ రాసిన "Reading for the Plot"(1984) చదువుదామని చాలా కాలంగా అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఈలోగా ఇటీవలే ఆయన కొత్త పుస్తకాన్ని "Seduced by Story: The Use and Abuse of Narrative" పేరుతో న్యూయార్క్ రివ్యూ బుక్స్ వారు ప్రచురించారని తెలిసింది. ఈ పుస్తకం 2022 సంవత్సరానికి గాను న్యూయార్క్ మ్యాగజైన్ / వల్చర్ బెస్ట్ బుక్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. పుస్తకం పేరు కుతూహలాన్ని రేకెత్తించగా, పాత పుస్తకం సంగతి వదిలేసి ఇది చదవడం మొదలుపెట్టాను. నిజానికి బ్రూక్స్ రాసిన ఈ రెండు పుస్తకాల మధ్య కాలంలో మన సంస్కృతిలో "కథనానికి" ఉన్న నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కళారంగానికి మాత్రమే పరిమితమైన "కథనాలు" (నేరేటివ్స్) నేడు వాస్తవంపై పూర్తిగా కమ్ముకున్న చీకటి నీడల్లా రాజకీయ సామజిక అంశాలపై సైతం తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. (Public civic discourse supposedly dedicated to reasoned analysis).
Image Courtesy Google |
"గేమ్ ఆఫ్ థ్రోన్స్" సిరీస్లో నాకు ఇష్టమైన టిరియన్ పాత్రధారి “There’s nothing in the world more powerful than a good story. Nothing can stop it. No enemy can defeat it.” అన్న మాటల్ని ప్రారంభ వాక్యాలుగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకం మొదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కథలూ, కథనాలూ మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న అంశంపై రాసిన పుస్తకం ఇది. "ప్రపంచంలోని కథనాలు అసంఖ్యాకమైనవి" అంటారు రోలన్ బార్త్. ఎక్కడైనా, ఎప్పుడైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన కథ లేని మనిషంటూ ఉండడు. అంతర్జాతీయ, సాంస్కృతిక, చారిత్రక వైరుధ్యాలు ఎన్నున్నప్పటికీ జీవితమున్న ప్రతీ చోటా ఒక కథనం (నేరేటివ్) కూడా ఉంటుంది.
ఈ పుస్తకంలో సాహిత్యంలోని వివిధ నేరేటివ్స్ మనపై ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయో అంచనావేసే క్రమంలో రచయిత ప్రూస్ట్, సాకీ, బోర్హెస్, పౌలా హాకిన్స్, బల్జాక్, మొపాసా, హెన్రీ జేమ్స్ వంటి పలువురి రచనల్లోని కథనాల్ని విస్తృతంగా విశ్లేషించారు. సాహిత్యం చదివేటప్పుడు మనం వాస్తవం కాదని తెలిసి కూడా కాల్పనిక వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకుంటాం, మన భావోద్వేగాల్ని వెచ్చిస్తాం. ఎమ్మా బావరీ, అన్నా కరెనిన వంటి కల్పిత పాత్రల ఆశయాలూ, పొరబాట్లూ, అంతఃసంఘర్షణలూ మనకెంతో ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. పేజీలు తెరుస్తూనే ఆ పుస్తకంలోని పాత్రలు నిజం కాదని తెలిసినప్పటికీ వాళ్ళతో పరిచయం పెంచుకోడానికి తహతహలాడతాం, వాళ్ళను ఆరాధిస్తాం, ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, విమర్శిస్తాం. వాళ్ళ ఓటమి మనదైనంతగా బాధపడతాం, వాళ్ళ గెలుపుకి చప్పట్లు కొడతాం. Those unreal people and their dilemmas are deeply important to us. The psychologist Paul Harris confirms what we already know: fictions arouse emotions even when recognized to be fictional.
ఇక వాస్తవ ప్రపంచానికొస్తే, రోజువారీ జీవితంలో మనం అనేక కథనాలు వింటూ ఉంటాం. అనేక వివరాలతో కూడిన ప్రతీ కథనమూ కథకుడు (కథకుడంటే రచయితే కానఖ్ఖర్లేదు, ఎవరైనా కావచ్చు, కథకుడు అంటే ఇక్కడ కథగా విషయాన్ని చెప్పేవాడు) కథను చెప్పే విధానాన్ని బట్టి వాస్తవంగానే ధ్వనిస్తుంది. We know from literature as well as life that unreliable narrators can at times be charming and seductive, even that the non-truth they tell can have a certain value. ఈ నేరేటివ్స్ లో వాస్తవమెంతో అభూత కల్పనెంతో తెలియాలంటే ఇటువంటి పుస్తకాలు చదవడం అవసరం. ముఖ్యంగా ఈ కృత్రిమ మేథ కాలంలో మన జీవితాలను సామజిక మాధ్యమాలూ, మీడియా, రాజకీయాలూ, కార్పొరేట్ కంపెనీలూ తమ స్వార్ధప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా మానిప్యులేట్ చేస్తున్న తరుణంలో వారి కథనాల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్య గీతలు గీసుకోవడం గురించి విస్తృతంగా చర్చిస్తుందీ పుస్తకం. ఇందులో అనేక విశ్లేషణలు Ontological నేరేటివ్ కీ epistemological నేరేటివ్ కీ మధ్య భేదాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. రాజకీయ పార్టీలూ, పాలక వ్యవస్థలూ భాషను తమకనుగుణంగా మలుచుకుని సమర్ధవంతమైన కథనాల్ని తయారుచేసి ప్రజల్ని మభ్యపెడుతున్న ఈ కాలంలో మనం ఏ కథను నమ్మాలో, ఏ కథను నమ్మకూడదో ఈ పుస్తకం చదివితే ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది.
What seems more important than choosing between ontology and epistemology is recognizing that telling and living are not the same thing. We may live the world as an unfurling narrative, but when we tell of it, whether anecdotally or analytically, that’s a different operation.
"చెప్పేవాడు వినేవాడికి లోకువ" అనే ఒకప్పటి నానుడి ఇప్పుడు పాతబడిపోయింది. ఇప్పటి పరిస్థితి "వినేవాడు చెప్పేవాడికి లోకువ" అన్న తీరుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడి కథలో ఎంతోకొంత ప్రామాణికత ఉండేది, కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అనేక అజెండాల ప్రాతిపదికన కులమతవర్గ వైషమ్యాలను రెచ్చగొడుతూ, రాజకీయలబ్ది కోసం ప్రామాణికతకు తిలోదికాలిచ్చే సత్యదూరమైన కథనాలే నేడు అధికంగా ప్రాచుర్యంలో ఉంటున్నాయి. వాటిల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చుకోవాలంటే మనకు భిన్న కథనాల తీరుతెన్నులు తెలియాలి. ఈ రచన సాహిత్యం మొదలు మీడియా, రాజకీయాలూ, ఫిలాసఫీ, సైకాలజీ వంటి అనేక అంశాల ఆధారంగా కథనాలు (నేరేటివ్స్) మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒక అవగాహన కలిగిస్తుంది.
ఈ రోజుల్లో మీడియాలో ప్రతీ ఒక్క వార్తా ఒక కథనమే. అందులోనూ వీటిల్లో ఏ విధమైన ప్రామాణికతా లేని కథనాలే అధికం. ఏ వార్త గురించైనా చెప్పాలన్నా ఈ మధ్య "మీడియా కథనాలను అనుసరించి", "రాజకీయ కథనాల్ని బట్టి" వంటి వాక్యాలు తరచూ వింటున్నాం. "ఆవిడ కథ ఏమిటంటే", "అతడి కథ మనకి తెలియాలంటే", "ఫలానా కంపెనీ కథని చూస్తే", "దీని వెనుక ఉన్న కథేమిటంటే" అంటూ న్యూయార్క్ టైమ్స్ మొదలు గార్డియన్, బీబీసీ, టైమ్స్ వంటి అనేక ప్రముఖ పత్రికల వరకూ అనేక వ్యాసాలు ప్రచురింపబడుతున్నాయి.
That continues, in more and more virulent form, as rulers judge that controlling the media narrative is what governing is all about. “The nation needs a better story about the drivers of economic growth,” I read in The New York Times. Writing to the corporate world in Whoever Tells the Best Story Wins, Annette Simmons claims: “The really important issues of this world are ultimately decided by the story that grabs the most attention and is repeated most often.”
Every person has a story to tell, and the corporate person has understood, with a vengeance, that it must stake its identity, persuasion, and profits on telling a story, however bizarre or banal. Corporate reports have turned from the statistical to the narrative mode. And in the wake of the corporation are political candidates and parties, the military, the tourism industry, universities, hospitals, bakeries—even accounting firms. Salmon, the sociologist, has identified what he calls a “nouvel ordre narratif,” or NON: a new narrative order that dominates in business and politics.
ఈ కారణంగా పాఠకులపైనా లేదా విన్నవారిపైనా సదరు కథనాలను గుడ్డిగా నమ్మడం కంటే తమకు తాముగా విశ్లేషించుకోవలసిన (French Structuralists dubbed “narratology.”) బాధ్యత మునుపెన్నడూ లేనంతగా ఉందని గ్రహించడం అందరికీ అవసరం.
Recall the claim of Annette Simmons: “Every problem in the world can be addressed—solved, made bearable, even eliminated—with better storytelling.” Do we really want to subscribe to that belief ? Doesn’t it mystify more than it solves?
భవిష్యత్తులో "నేరేటివ్ పవర్" మనల్ని శాసించకుండా దాన్ని మనం అదుపు చెయ్యవలసిన అవసరాన్ని గుర్తుచేస్తూ పీటర్ బ్రూక్స్ ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు అనే కంటే, ఈ రచనలో అనేక ఉదాహరణల సహితంగా పలు కథనాల్లోని ప్రామాణికతను అంచనా వేసే మార్గాలను సూచించారనడం సబబు. రోలన్ బార్త్ "మైథాలజీస్" తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత కలిగిన పుస్తకం ఇది. సాహితీప్రియులే కాకుండా ప్రతీ ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. హాప్పీ రీడింగ్. :)
పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :
Mortality can perhaps best be dealt with in story form. Whatever meanings life may have, or fail to have, develop through time.
Stories are regarded by law as suspiciously emotional, as making a kind of appeal to empathy—or prejudice—that legal rules must cabin and confine.
Story may be a necessary part of our cognitive interaction with the world because its mode of explaining takes place within time, and humans are time-bound in a way that they are not place-bound.
It’s quite true that we can’t ever find the proper repose, as Kierkegaard puts it, to see our lives in full retrospect. That view is denied to us. According to Walter Benjamin, this explains why we read fiction: we seek in the death of the fictional character the meaning of life that comes only with death. Death in fiction is the “flame” at which we warm “our shivering lives.”
Plato notes in his Phaedrus that the problem with written texts is that they roam around everywhere, promiscuously, and it’s impossible to know how they will be received, interpreted, acted upon. The oral storyteller, on the other hand, can gauge audience reaction, respond to questions or skeptical looks or bored body language. Many writers in the age of writing and print appear to look back upon the era of oral storytelling with nostalgia, as a less fallen age of communication and fellowship.
నేరేటివ్ పవర్ గురించి గై డి మొపాసా కథ " A Ruse" ను ఆధారంగా చేసుకుని బ్రూక్స్ చేసిన విశ్లేషణ అద్భుతం. మీరు ఇప్పటికే ఈ కథ చదివున్నట్లైతే ఈ క్రింది విశ్లేషణ మరింత బాగా అర్థమవుతుంది. చదవని వాళ్ళు వీలైతే ఆ కథ చదివిన తరువాత ఈ వాక్యాలు చదవండి.
This cynical, mocking—almost sneering—reply that ends the tale reverberates after we have closed the book. What has the doctor done to the young woman? The tale reads as a kind of verbal violation, really a kind of rape, destroying the young woman’s faith in marital fidelity, contaminating her mind with ideas it does not want, creating an unwholesome bond between her and her doctor. She has been changed by the story she has unwittingly and unwillingly listened to. She has gained a knowledge of good and evil of which she was innocent. She doesn’t want the story, its content, its lesson. But now she cannot get rid of them. They remain with her as a kind of poisonous residue. Maupassant’s story is trivial and bleak. But it demonstrates with a kind of fierceness the result of listening, of having to listen to, a story. In the words of T. S. Eliot: “After such knowledge, what forgiveness?” Some things we learn cannot be undone. We are forever changed by them.
Benjamin claims: “The flame that consumes this stranger’s fate warms us as our own fates cannot. What draws the reader to a novel is the hope of warming his shivering life at the flame of a life he reads about.”
As Freud said, much too simplistically but with much truth, fiction is all about “His Majesty, the ego.”
So what we think of as the teller’s tale can’t exist without it being the listener’s tale as well.
Language is an imperfect instrument of communication: “a cracked cauldron on which we beat out tunes for bears to dance to, while we would wish to move the stars to pity,” Flaubert claims in Madame Bovary.
But it’s what we have to hand to communicate with others, in the hope of hearing a response, of establishing a dialogue. When we fail to get a reponse, we try again, telling another story. We’re back to Scheherazade, telling one story after another to keep alive, knowing that in the long run we are condemned but believing that in the meanwhile we need to make others hear us out.
The Borges tale I mentioned earlier, “Tlön, Uqbar, Orbis Tertius,” offers a kind of parable: if you cease to recognize that fictions are the “discipline of men, not of angels,” if you start believing in them literally, they cease to be fictions and devolve into myth, which claims explanatory status and demands belief, whether it be in the “master race” or in the resurrection of the body. Fiction is playful precisely in its refusal to accept belief systems, its insistence on the “as if.”
“Let’s pretend” seems to be a statement and a state of mind that distinguishes humans from the so-called “higher apes.”
We live at a time when knowledge generated by the humanities in general and literary study in particular is often publicly devalued, or even derided. The only knowledge worth having is thought to be instrumental: that which gives you direct leverage on the world.