One must admit that time has angles as yet unexplored. What a teaser! అంటారు 'Tickets on Time' అనే కథలో మార్సెల్ ఐమీ..కాలానికి భూతభవిష్యద్ వర్తమానాలనే మూడు డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయని నమ్మే పాఠకులకు కాలాన్ని సరికొత్త నాలుగో డైమెన్షన్ లో చూపిస్తూ,ఆ ఫాంటసీని నిజమని నమ్మించే సాహసం చేశారీ ఫ్రెంచ్ రచయిత..ప్రపంచానికి ఫ్రెంచ్ సాహిత్యం అనగానే ప్రౌస్ట్,ఫ్లాబర్ లు తెలిసినంతగా మార్సెల్ ఐమీ పేరు తెలీదు..స్థానికంగా ప్రసిద్ధి చెందిన రచనలైనప్పటికీ అనువాదాలకు నోచుకోక ప్రపంచం దృష్టికి రాకుండా మరుగున పడిపోయిన వివిధ సంస్కృతులకు సంబంధించిన రచనల్ని వెలికితీసే దిశగా 'పుష్కిన్ ప్రెస్' అనువదించిన కొన్ని ఆణిముత్యాల్లాంటి రచనల్లో సుప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత మార్సెల్ ఐమీ కథల సంపుటి 'The Man Who Walked through Walls' కూడా ఒకటి..1943 లో తొలిసారి ప్రచురింపబడిన ఈ పుస్తకంలో ఐమీ కథల్లో బాగా పేరుపొందిన పది కథల్ని ఎంపిక చేశారు..మేజికల్ రియలిజం,ఫాంటసీ శైలుల్లో అద్భుతాలు సృష్టించగల నైపుణ్యం ఉన్న ఈ రచయిత కథల్ని చదవడం పూర్తి చేశాక,ఈ రచయిత పేరు ఎక్కడా వినపడలేదెందుకు అని అనుకుని మళ్ళీ నా పిచ్చి ఆలోచనకు నాకే నవ్వొచ్చింది..ఒకానొకప్పుడు మాక్సిమ్ గోర్కీ రష్యా కమ్యూనిస్టు సమాజానికి పనికిరావని తీర్మానిస్తే Krzhizhanovsky రచనల్ని సైతం తిరస్కరించిన ఘన చరిత్ర మనది..పాలక ప్రభుత్వాలకు సలాములు కొట్టని పక్షంలో మంచి సాహిత్యానికి కూడా మనుగడ శూన్యమనడానికి మరో చక్కని ఉదాహరణ ఈ మార్సెల్ ఐమీ..రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫ్రాన్స్ వైఖరి పట్ల ఐమీ వ్యతిరేక దృక్పథమే చాలా కాలం వరకూ ఆయన రచనల్ని ప్రపంచానికి దూరం చేసిందంటారు.
ఈ పది కథల్లో నాకు బాగా నచ్చిన కథ తొలి కథైన 'The Man Who Walked through Walls (Le Passe-muraille)'..ఈ కథ 'ఐమీ మార్కు హ్యూమర్' కు ఒక మంచి ఉదాహరణ..ఈ కథలో పారిస్ లోని Montmartre అనే ఊళ్ళో మినిస్ట్రీ ఆఫ్ రికార్డ్స్ లో గుమస్తాగా పనిచేసే Dutilleul కు గోడల్లోంచి నడుచుకుంటూ వెళ్ళే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది..కానీ నలభైమూడేళ్ళ వరకూ అతడికి తనలో ఉన్న ఈ విచిత్రమైన శక్తి గురించి తెలీదు..ఒకరోజు హఠాత్తుగా వెలుగులోకి వచ్చిన నమ్మశక్యం కాని ఈ వింత శక్తిని కేవలం ఒక భ్రమ అనుకొని వైద్యుణ్ణి సంప్రదించి ఆయనిచ్చిన మందులు వాడుతుంటాడు..ఇదిలా ఉండగా అతడి ఆఫీసులో కొత్తగా వచ్చిన Monsieur Lécuyer అనే అధికారి Dutilleul ను చీటికీ మాటికీ అకారణంగా హింసిస్తూ ఉంటాడు..ఒకరోజు అధికారి హద్దుమీరిన వ్యవహారంతో సహనం కోల్పోయిన Dutilleul మొదటిసారి తన శక్తిని ఉపయోగిస్తూ కేవలం అతడి తల మాత్రమే గోడకి అటువైపు వెళ్ళేలా ప్రక్కనే ఉన్న అధికారిని భయభీతుణ్ణి చేసేవిధంగా అతడి గదిలోకి తొంగి చూస్తాడు.."ఆ సమయంలో Dutilleul తల గోడకి తగిలించిన ట్రోఫీలా కనిపిస్తుంది,కానీ తేడా ఏంటంటే ఈ ట్రోఫీ లా ఉన్న తల మాట్లాడుతుంది" అంటూ “Sir,” it said, “you are a ruffian, a boor and a scoundrel.”అని తిట్టేసరికి ఆ అధికారికి ఉన్న మతి కాస్తా పోతుంది..ఈ సందర్భాన్ని ఊహించుకుంటున్న పాఠకులకు నవ్వాగదు..
ఈ లోగా కాస్త తేరుకున్న అధికారి Dutilleul గదిలోకి వచ్చి చూస్తే అతడు తాపీగా తన టేబుల్ వద్ద పనిచేసుకుంటూ కనిపిస్తాడు..కానీ Dutilleul పగ అక్కడితో చల్లారదు..ఇదే విధంగా మరో 23 సార్లు చేసేసరికి ఆ అధికారికి పాపం నిజంగా పిచ్చి పట్టి ఆస్పత్రి పాలవుతాడు..ఇంతా జరిగిన తరువాత Dutilleul కు తన సాధారణ జీవితం పట్ల విసుగు కలుగుతుంది..తనకున్న అరుదైన శక్తితో మరేదైనా సాహసం చెయ్యాలని తలపోసి Werewolf పేరుతో బ్యాంకుల్ని దోచుకోవడం మొదలుపెడతాడు..అతడిలో ఉన్న ఈ అతీంద్రియ శక్తి అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిందనేది మిగతా కథ..ఈ కథ చదువుతున్నంత సేపూ ప్రతి వాక్యానికీ నవ్వుతూనే ఉంటాము..ఒక సాధారణమైన మనిషికి అసాధారణమైన శక్తిని ఆపాదిస్తూ మానవజీవితంలోని అబ్సర్డిటీని చక్కగా ప్రతిబింబించే కథ ఇది.
రెండో కథ Sabine Women (Les Sabines) లో Montmartre లోని RUE DE L’ABREUVOIR అనే వీధిలో సబీన్ అనే వివాహిత స్త్రీకి సర్వవ్యాపకత్వమనే శక్తి (Ubiquity) ఉంటుంది..మన పురాణాల్లో శ్రీకృష్ణుడు ఏకకాలంలో తన పదహారువేలమంది గోపికల వద్దా ఉన్నట్లు సబీన్ కూడా అనేక ప్రదేశాల్లో ఏకకాలంలో సంచరించగలిగే శక్తిని కలిగి ఉంటుందన్నమాట..ఆమె ఒకరోజు పరపురుష వ్యామోహంలో పడి భర్తకు తెలీకుండా Theorem అనే ఒక బీద ఆర్టిస్టుని ప్రేమిస్తుంది..అతణ్ణి కష్టాల్లోంచి బయటపడేసే సాకుతో లండన్ లోని మరో ధనవంతుణ్ణి వివాహమాడుతుంది..ఆమెలో ఇలా మొదలైన వ్యామోహం దినదిన ప్రవర్థమానమై మూణ్ణెల్లు తిరిగేలోపు ఆమె ప్రియుల/భర్తల సంఖ్య పదుల్లోంచి వేలల్లోకి చేరుతుంది..ఒకేరూపంలో ఉన్న స్త్రీని అనేక చోట్ల చూసిన ప్రజల్లో కలకలం రేగుతుంది.."Among the Guards of France, I had a lover once" అంటూ సబీన్ అలవాటుగా పాడే పాట అంతర్జాతీయ గీతంలా అందరి పెదాలపైకీ చేరుతుంది..ఈ పరిణామాల్ని జెనెటిక్ మ్యుటేషన్ గా అభివర్ణిస్తూ శాస్త్ర సాంకేతిక రంగం అనేక ప్రతిపాదనలు చేస్తుంది..
ఒక దశలో అనేక శరీరాలున్నా ఒకే ఆత్మ కలిగిన సబీన్ స్థితిని వర్ణిస్తూ హాస్యోక్తంగా "Her teeth clenched, cheeks flushed and pupils slightly dilated, she seemed, sometimes, like a telephone operator surveying a vast switchboard with passionate dedication." అంటారు ఐమీ..మరి సబీన్ లోని అనైతికతకు పర్యవసానాలేమిటన్నది మిగతా కథ..
మూడో కథ 'Tickets on Time (La Carte)' మరో అద్భుతమైన కథ..ఈ కథను Jules Flegmon అనే రచయిత డైరీలోని పేజీల రూపంలో చెప్తారు..భూమి మీద వనరుల కొరత కారణంగా ఉత్పాదకత లేని వినియోగదారులకు జీవించే కాలాన్ని రేషన్ లో ఇవ్వాలనే ప్రతిపాదన తెస్తుంది ప్రభుత్వం..దీన్ని అమలు చేస్తూ,తినడానికి తప్ప వేరే ఏ ఉపయోగం లేని ప్రజల జీవించే హక్కుకు పరిమితులు విధిస్తూ నెలకు 15 రోజులకు 'లైఫ్ టికెట్స్' పంపిణీ చేస్తారు..ముందు ఈ వర్గంలో వృద్ధులూ,నిరుద్యోగులూ,పదవీ విరమణ చేసిన వారే ఉంటారని తాపీగా ఉన్న రచయిత తరువాత పేపర్లో వారితో పాటు ఈ వర్గంలో రచయితలను కూడా చేర్చడం పట్ల కోపంగా తన డైరీలో రాసుకున్న మాటలు, :)
This is infamous! Abuse of justice! Vile murder! The decree has just been published in the newspapers and there it appears that those “consumers whose maintenance is offset by no real contribution” include artists and writers! I could understand, at a pinch, if the measure were to apply to painters, sculptors, to musicians. But to writers! This exposes an inconsistency, an aberration, that will remain the crowning shame of our era. For, you see, writers’ utility goes without saying, my own above all, I may say in all modesty. Yet, I shall have the right to only two weeks of life per month.
ఈ పుస్తకంలో Poldevian Legend (Légende Poldève),The Bailiff (L’Huissier) అనే రెండు కథల గురించి కూడా ప్రత్యేకం చెప్పుకోవాలి..ఈ రెండూ కూడా నాకు మనసుకి బాగా హత్తుకున్న కథలు..అతి సహజమైన శైలిలో చెప్పినా చివరకు గొప్ప సందేశాన్నిచ్చే కథలివి..మనిషి చేసే సత్కర్మలను,దుష్కర్మలను బేరీజు వేస్తూ జీవితానికి సార్ధకత ఎక్కడ లభిస్తుందో సూచించే ఈ కథల్లో మతం,కట్టుబాట్లు,నీతి నియమాలననుసరిస్తూ అసలు ఏ పాపం అంటకుండా జీవించే కంటే 'కర్మ' చెయ్యడం ప్రధానమని మొదటి కథలో Marichella Borboiie పాత్ర ద్వారా నిరూపిస్తే,పాపభీతితో చేసే వంద సత్కర్మల కంటే ఆత్మశుద్ధితో ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ఒక్క మంచిపని విలువ ఎక్కువని రెండో కథలో Malicorne పాత్ర నిరూపిస్తుంది...The Problem of Summertime (Le Décret), The Wife Collector (Le Percepteur d’épouses), While Waiting (En attendant) అనే మూడు కథలూ రెండవ ప్రపంచ యుద్ధం తరువాతి ఫ్రాన్స్ సమాజపు స్థితిగతులను ప్రతిబింబిస్తాయి..ఇక The Proverb (Le Proverbe), The Seven-League Boots (Les Bottes de sept lieues) అనే రెండు కథలూ పాఠకులకు బాల్య ప్రపంచపు ఊహాలోకాల ద్వారాల్ని తెరచి చూపిస్తాయి...ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఒక్కో కథా ఒక్కో ఆణిముత్యం.
వాస్తవానికి అద్దంపట్టే కాల్పనిక జగత్తులో విహరిస్తూ సామాన్యుడు తన సమస్యలకు కారణాలే కాదు,పరిష్కారాలు కూడా వెతుక్కుంటాడు..అటువంటి సామాన్యుడి నిత్యజీవితంలోని అబ్సర్డిటీకి సున్నితమైన హాస్యం,వ్యంగ్యం సమపాళ్ళలో రంగరించి ఈ కథల్ని రాశారు ఐమీ..సాహిత్యం ద్వారా సమస్యల్ని ఎత్తి చూపడం ఎంత అవసరమో,మనసుకి స్వాంతన చేకూర్చడం కూడా అంతే అవసరం..ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కదాన్నీ విస్మరించకుండా రెండింటినీ సమతౌల్యం చెయ్యగలిగిన అరుదైన నైపుణ్యం ఐమీ సొంతం..
ఐమీ తన పాత్రలకు ఒక వింత శక్తిని ఆపాదించి దానిని వాస్తవమని భ్రమింపజేస్తూ, వర్తమానంలో ఆ శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలిగే అన్ని పోజిబిలిటీస్ నీ,పర్యవసానాల్నీ విశ్లేషిస్తారు..ఈ కథలన్నిటిలోనూ ఐమీకి సగటు మనిషంటే ఉన్న వల్లమాలిన అభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..కానీ కొందరు రచయితల్లా కఠినంగా కాకుండా ఐమీ తను సృష్టించిన 'సగటు మనిషి' పట్ల చాలా సానుభూతితో వ్యవహరిస్తారు..జీవితం పట్ల నిరాశతో నిస్సహాయంగా చూస్తున్న వారి చేతికి ఎక్కడా కనీ వినీ ఎరుగని ఆయుధాలనిచ్చి వాళ్ళ సమస్యల్ని స్వయంగా ఎదుర్కోమంటారు..వాళ్ళు తమకి అలవాటులేని దారుల్లో ప్రయాణిస్తూ భంగపాటు పడితే నవ్వుతారు..తమను తాము సంభాళించుకుంటూ వారు పడే తొట్రుపాటు చూసి వ్యంగ్యోక్తులతో చమత్కరిస్తారు..నిర్దిష్టమైన దిశానిర్దేశం లేని కాలగమనంలో చిక్కుకుపోయిన ఐమీ పాత్రలు మూలాలను కోల్పోయిన అనాథల్లా నూతన ప్రపంచాల్లో సంచరిస్తుంటాయి..ఈ కథలు మనిషికి తన comfortable జోన్ వెలుపల అసాధ్యమనిపించే అంశాలన్నింటినీ పరిశీలన చేయమని ప్రోత్సహించే విధంగా ఉంటాయి..ఫాంటసీ శైలిలో సరళత్వాన్నీ,గాంభీర్యాన్నీ తగుపాళ్ళలో రంగరించి పోసే కాల్వినో శైలిని ప్రక్కన పెడితే బోర్హెస్,Krzhizhanovsky లాంటివారి శైలి ఒక్కోసారి నేలవిడిచి సాము చేస్తున్నట్లు కఠినంగా అనిపిస్తుంది..కానీ మార్సెల్ ఐమీ వారి బాటలోనే ప్రయాణిస్తూ పాఠకుల్ని ఎన్ని ఫాంటసీ లోకాల్లో విహరింపజేసినా తన పాదాలు మాత్రం భూమి మీద స్థిరంగా ఆనించి మరీ కథ చెప్తారు..ఈ సంవత్సరం చదివిన పుస్తకాల్లో అద్భుతంగా తోచిన రచన..కాల్వినోనీ,Krzhizhanovsky నీ మరిపించిన రచన ఈ "మార్సెల్ ఐమీ,'The Man Who Walked through Walls'.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
Mrs Smithson, the millionaire’s wife, did not follow her sisters’ example but fell rather seriously ill. During her convalescence in California, she took to reading those dangerous novels that show in too rosy a light dishonourable couples engulfed in sin, novels whose authors are not even ashamed to describe—with despicable complacency but also, alas! in such appealing terms, with such artistry veiling the horrible truth, making disgraceful situations enticing, as to transfigure and glamorise their principal actors, all the while devilishly inducing us to forget, if not to approve (it is not unheard of!) the true nature of these odious practices—are not, as I say, even ashamed to describe the pleasures of love and the pursuit of sensual pleasure. There is nothing wickeder than that kind of book. Mrs Smithson allowed herself to be taken in by them.
(Here Mrs Smithson would sigh and allow the pages of her novel to run on beneath her thumb.) “The lovers in Love Awakens Me have no idea how it is to have such qualms. And they are as happy as hogs” (she meant to say as gods).
“the distinction between spacetime and lived time is not a philosophical fantasy. I am the proof. In reality, absolute time does not exist.”
“No less noticeable,” Maleffroi went on, “is this atmosphere of tranquillity and ease that we enjoy in the absence of those newly rationed. Now we can see just how dangerous the rich, the unemployed, the intellectuals and the whores can be in a society where they sow nothing but trouble, pointless fuss, disorder and longing for what’s impossible.
As often happens, human genius had allowed itself to be overruled by habit
In government meetings there was much talk of relative time, physiological time, subjective time and even compressible time.
Due to an administrative or communicational error, the decree to advance time had not been transmitted to this tiny community, and, lost deep in the woods, it had kept to the old regime.
I was participating. Nothing gave me reason to believe that I should ever escape its grip.
All these worlds multiplying my body into infinity extended before my eyes in vertiginous perspective.
There’s nothing more depressing than the role of the lowly confidant. For example, everyone knows that the real drama in classical tragedy is that of the confidants. It’s terrible to watch these brave souls—to whom nothing actually happens—listen with polite resignation to a complacent bore describing his own adventures.
“Yes, one good deed, but a weighty one. He, a bailiff, shouted out: ‘Down with landlords!’” “Oh, that’s beautiful,” murmured God. “That is beautiful.” “He shouted it twice, and he died in the act of protecting a poor woman from her landlord’s fury.”
A couple is not a chemical compound. When the elements come apart, it isn’t enough to put them in the same room for them to be reunited. People who declare wars should think about that.
Image Courtesy Google |