టామ్ హాంక్స్..సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాతో పరిచయం నాకు..ఆ తరువాత Forrest Gump,Saving Private Ryan,Catch me if you can,You've got a mail,The Terminal,Appollo 13,Sleepless in Seattle ల నుంచీ మొన్న మొన్నటి Bridge of Spies వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం..ఒక నటుడిగా ఆయన్ను గురించి చెప్పడం అంటే కర్ణుడు దానం చేస్తాడు,హరిశ్చంద్రుడు అస్సలు అబద్ధం చెప్పడు లాంటి యూనివర్సల్ ట్రూత్స్ ని మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే ఉంటుంది..అది వదిలేసి రచయిత టామ్ హాంక్స్ గురించి మాట్లాడుకుందాం..Uncommon Type: Some Stories,
టామ్ హాంక్స్ రాసిన 17 కథల సంకలనం..
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు టామ్ హాంక్స్ కు టైపు రైటర్స్ అంటే ప్రాణం..అందువల్ల ఈ కథల పుస్తకం అట్ట మీద మొదలు ప్రతి కథకి ప్రారంభంలోను,కథల్లో భాగంగానూ కూడా టైప్ రైటర్స్ ప్రత్యక్షమైపోతుంటాయి..మొదటి కథ ’Three Exhausting Weeks' ఇద్దరు స్నేహితులు మూడు వారాల పాటు డేటింగ్ చెయ్యడం గురించిన కథ..ఒక చాలా తెలివైన అమ్మాయి (Anna), ఒక అమాయకపు ప్రాణిలాంటి అబ్బాయి మధ్య జరిగే సంఘటనల్ని హాంక్స్ మార్కు హాస్యం మేళవించి రాశారు..మన ప్రమేయం లేకుండానే ఈ కథలో అబ్బాయిని హాంక్స్ హావభావాలతో ఊహిస్తూ చదువుతాం..నాకు అన్నిటికంటే బాగా నచ్చిన కథ ఇదే.
I am one of those lazy-butt loners who can poke my way through a day and never feel a second has been wasted.
Being Anna’s boyfriend was like training to be a Navy SEAL while working full-time in an Amazon fulfillment center in the Oklahoma Panhandle in tornado season.And watched a movie on Netflix about smart women with idiot boyfriends.
Strong, determined woman, Anna, who would never let a man define her. You and her pairing off is like a story line from season eleven when the network is trying to keep us on the air.” లాంటి హాస్యపూరిత వర్ణనలతో మొదటి కథ సరదాగా సాగిపోతుంది..
అరే,హాంక్స్ మంచి నటుడే కాకుండా మంచి రచయిత కూడా అన్నమాట అనుకుంటూ రెండో కథకి వెళ్తాం.. 'Christmas Eve 1953' లో రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి జ్ఞాపకాల్ని,దాని పర్యవసానాల్నీ ముడివేస్తూ 1953 లో ఒక మాజీ సైనికుడి కుటుంబం ఇంట్లో క్రిస్మస్ సంబరాల్ని కళ్ళకుకట్టినట్లు రాశారు..ఇందులో యుద్ధవాతావరణం Saving Private Ryan సినిమాను గుర్తుకు తెస్తుంది..ముఖ్యంగా Santa బహుమతులు ఇస్తారని ఎదురుచూసే పిల్లల మనస్థితిని వర్ణించడంలో టామ్ హాంక్స్ మార్కు సున్నితత్వం,సహజత్వం అడుగడుగునా కనిపిస్తాయి.
“He can make it cold with just a touch! He just sticks his finger in a glass of warm milk and does a whooshy thing and boom. Cold milk.”
'A Junket in the City of Light' ,'Who’s Who?' -ఈ రెండు కథలూ పూర్తి సినీ నేపథ్యంలో ఉంటాయి..ఇందులో సీనీ పరిశ్రమ వాతావరణాన్నీ,అందులో ఎదురయ్యే ఆటుపోట్లను హాంక్స్ కళ్ళతో చూపిస్తారు..మొదటి కథలో రాత్రి వేళ ప్యారిస్ కాంతులు,రెండో కథలో న్యూ యార్క్ వీధులను గురించిన వర్ణనలు బావున్నాయి..
Rory now felt that working with Willa Sax was like eating a peanut butter sandwich on a motorcycle, kissing Willa Sax was like Christmas in July, and the butt in the hurricane was that of a talking horse named Britches.
I think NYC comes off way better on TV and in the movies, when a taxi is just a whistle away and superheroes save the day. In the real world (ours) every day in Gotham is a little like the Macy’s Thanksgiving Day Parade and a lot like Baggage Claim after a long, crowded flight.
“My parents will be disappointed if I don’t use my real name.” “Disappointing your parents is the first thing to do when you come to New York.”
"Our Town Today with Hank Fiset- ఈ పేరుతో మొత్తం నాలుగు కథలుంటాయి..ఇవి న్యూ యార్క్ లో ఒక పత్రిక ఆఫీసులో పని చేస్తున్న జర్నలిస్టు అనుభవాలు..అతను ఓల్డ్ స్కూల్ స్టూడెంట్ లా కంప్యూటర్స్,సోషల్ మీడియా ఆవిర్భావం వల్ల టైపు రైటర్స్ కనుమరుగైపోవడం,న్యూస్ పేపర్స్ కొని చదవడం లాంటివి తగ్గిపోవడం లాంటి విషయాల పట్ల చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాడు..
"Welcome to Mars","A Special Weekend" ఈ రెండూ తల్లిదండ్రుల మధ్య విభేదాలూ,విడాకుల మధ్య నలిగిన బాల్యం గురించిన కథలు..వీటిల్లో టామ్ హాంక్స్ బాల్యం దాగుందా అని అనుమానం కలిగిస్తాయి..
"A Month on Greene Street" ..విడాకుల అనంతరం గ్రీన్ స్ట్రీట్ లోని ఒక ఇంట్లో తన పిల్లలతో నివసించడానికి వచ్చిన Bette కథ..ఈ కథలో ఆమె పొరుగింటి వారైన ఒక ఇండియన్ ఫామిలీ ని కూడా పరిచయం చేస్తారు హాంక్స్.. పటేల్ ఫామిలీ గురించి రాస్తూ,
That lawn belonged to the Patel family—was that what the real estate agent said? Patel? An Indian name for sure. The Patels must have had a kid every eleven months, judging from the black hair and brown skin of five kids out there, each a perfect match of the brother or sister, just a head shorter. The older Patel girls had iPhones or Samsungs, which they checked every forty-five seconds. They took a lot of pictures of Eddie on the pink bike.
"Alan Bean Plus Four" కథలో మళ్ళీ మొదటి కథలో ఉన్న Anna,MDash,Steve Wong లాంటి పాత్రల్ని తీసుకొస్తారు..ఈ కథ 'Apollo 13' సినిమాను గుర్తుకుతెస్తుంది.
ఇందులో నచ్చిన మరో కథ "The Past Is Important to Us" ..1979 కాలం నాటి సైన్స్ ఫిక్షన్ కథ..1939 వ సంవత్సరంలోకి టైం ట్రావెల్ చేసే ఒక Chronometric Adventures సంస్థ సైంటిస్ట్ Bert ఆ కాలంలోకి వెళ్ళాకా,అక్కడ ఒక పచ్చని దుస్తులు ధరించిన అమ్మాయి Carmen ప్రేమలో పడతాడు..నిర్ణీత సమయంలో వెనక్కి తిరిగి వెళ్ళని Bert ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు అనేది ఈ కథ.
These are the meditations of my heart కథ లో టైప్ రైటర్స్ మీద హాంక్స్ కి ఉన్న ప్రేమ ప్రస్ఫూటమవుతుంది..
“Would you own a stereo and never listen to records? Typewriters must be used. Like a boat must sail. An airplane has to fly. What good is a piano you never play? It gathers dust and there is no music in your life.,"
ఇక మిగతా కథల్లో చెప్పుకోదగ్గ కథలేవీ లేవు.. ఇందులో పాత్రలు చాలా casual way లో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్లుంటాయి..నేరేషన్ అంతా కూడా అతి సాధారణమైన భాషలో,ఇంట్లో మాట్లాడుకున్నట్లుండే వాడుక భాషలో రాశారు..అమెరికన్ ఇంగ్లీష్ లో వాడే పిచ్చాపాటి సంభాషణల కారణంగా ఆ సంస్కృతి తో సంబంధంలేనివారికి చాలా పదాల వాడుక పంటి క్రింద రాయిలా తగులుతుంది..దానితో పాటు వాక్యనిర్మాణం చాలా అస్తవ్యస్తంగా ఉంది..కొన్ని పదాలు అటు ఇటు అసంబద్ధంగా అతికించేసినట్లు ఉండి,రెండోసారి చదివితే కానీ అర్ధంకానట్లు ఉన్నాయి.
“You working at all?”
“Not until someone makes me.”
SO, WHAT’S NOO in Noo Yawk?
ఒక రచనకు సంపాదకత్వం ఆవశ్యకత తెలియాలంటే ఈ కథల సంపుటిని ఉదహరించచ్చు..పదిహేడు కథల్లో అధిక శాతం కథలు చాలా ఎక్కువ నిడివితో,కథకు అవసరంలేని,సంబంధంలేని అనవసరమైన విషయ విశేషాలతో చాలా పేలవంగా ఉన్నాయి..టామ్ హాంక్స్ ను ఊహించుకుంటూ మొదటి కథను చాలా ఆసక్తిగా చదివినా రెండో కథకొచ్చేసరికే మెల్లిగా ఆ అభిమానం మొహం చాటేస్తుంది..మిగిలిన కథల్ని చదువుతుంటే టామ్ హాంక్స్ అనే పేరు చుట్టూ ఉన్న మేజిక్ కూడా పనిచెయ్యడం మానేస్తుంది..ఇక ఆఖరి కథ పూర్తి చేశాక అసలు టామ్ హాంక్స్ కి కథలు రాయాలని ఎందుకనిపించిందో అని విచారించడం ఖాయం..బహుశా ఆయన మీదున్న అభిమానంతో ఆయన రాసిన ఒక్క పదాన్ని కూడా సవరించకుండా ముడి ప్రతిని ఉన్నదున్నట్లు ప్రచురించినట్లున్నారు..నాలుగైదు కథలు మినహాయించి మిగతావన్నీ మన సహనానికి పరీక్ష పెడతాయి..
కథనంలో చాలా చోట్ల పాప్ కల్చర్ metaphor ని ఉపయోగించే ప్రయత్నంలో తీవ్రంగా విఫలమయ్యారు హాంక్స్..టైప్ రైటర్స్ తరువాత ఆయన కథల్లో తరువాత స్థానంలో కనిపించేది న్యూ యార్క్ మహానగరమైతే,మూడో స్థానంలో కాఫీ ఉంటుంది...VW బస్సులు,Buick కార్లు,పురాతన టైపు మిషన్లు మనల్ని కాసేపు retro మూడ్ లోకి తీసుకెళ్ళినా మళ్ళీ అంత త్వరగాను ఆ లోకం నుంచి బయటకు తీసుకొచ్చేస్తాయి..కొన్ని కథల్లో పాత్రలు వేరైనా వారి పేర్లు మాత్రం పునరావృతం అవుతుండటం కూడా చదివేవాళ్ళకి గందరగోళంగా ఉంటుంది..MDash,Anna,Steve Wong లాంటి పేర్లు పలు కథల్లో ప్రస్తావించారు..సహజంగానే కొన్ని కథల్లో టామ్ హాంక్స్ సినీ జీవితానికి సంబంధించిన అనుభవాలు ప్రతిబింబించాయి.
అసలు ఈ నాలుగొందల పేజీల పుస్తకాన్ని రెండువందలకు కుదించి,పదిహేడు కథల బదులు బావున్న కొన్ని కథల్ని ఎంపిక చేసుకునుంటే పాఠకులకు కాస్త చదివిన తృప్తి మిగిలేది..మంచి కథలన్నీ తొలి రెండొందల పేజీల్లోనూ,మిగతావన్నీ రెండో అర్ధభాగంలో కూర్చడం కూడా పాఠకులకి చివరకి వచ్చేసరికి చిరాకు తెప్పిస్తుంది.టామ్ హాంక్స్ ను ఏ పాత్రలో చూసినా ఆయనలో ఒక సగటు మనిషి చాలా సులభంగా కనెక్ట్ అవ్వగలిగే ఆహార్యం,వ్యక్తిత్వం కనిపిస్తాయి..ఈ కథల్లో కూడా ఆయన 'ఈజీ గోయింగ్' ఆటిట్యూడ,సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే దట్టించినా,ఇది సినిమా కాదుగనుక,చదవడానికొచ్చేసరికి ఒక స్థాయిలో ఆ casual behaviour వెగటనిపించి,అబ్బా కాసేపు ఎవరైనా ఇక్కడ సీరియస్ గా ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది..కథలు చదువుతున్నంత సేపూ టీనేజ్ లో ఉండే పిల్లలు పార్టీ చేసుకుంటున్న DJ నైట్ లో ఏం చెయ్యాలో తెలీక,అర్థంకాక పార్టీ ఎప్పుడైపోతుందా,ఇంటికెప్పుడెళ్ళిపోదామా అని ఒక మూలన కూర్చున్న భావన కలుగుతుంది..ఒక టామ్ హాంక్స్ వీరాభిమానిగా ఈ పుస్తకం నన్ను చాలా నిరాశపరిచింది..
పుస్తకం నుండి మరికొన్ని,
MDash threw his uneaten half of a protein bar in the trash. “I used to look at you and think, That guy has figured it all out. He has his sweet little house with a nice backyard, he doesn’t work for anyone but his own self. He could throw away his watch because he never has to be anywhere. To me, you were the America I hope to live in. Now, you kowtow to a boss lady. Alas."
“To circle the globe, a ship needs only a sail, a wheel, a compass, and a clock.”
“Wise words in a landlocked nation,” I said.
In the capitals of Europe—and America—I was hustled around like a politician, into cars and into ballrooms filled with camera-totin’, question-hollerin’ reporters. I waved to seas of people, many of whom waved back, even though no one knew who I am, even though I am, in fact, a no one.
టామ్ హాంక్స్ రాసిన 17 కథల సంకలనం..
Image courtesy Google |

No comments:
Post a Comment