'మన ప్రమేయం లేనిదే మనల్ని ఎవరూ కించపరచలేరు' అని అంటుంటారు కానీ చరిత్ర చూసినప్పుడు,ఇలాంటి కథలు చదివినప్పుడు అది నిజం కాదని బలంగా అనిపిస్తుంది..పుట్టుక విషయంలో తన జాతి,కులం,మతం లాంటివి మనిషి తనంతట తాను కోరుకున్నవి కాదు..అవి కేవలం యాదృచ్ఛికంగా మనిషికి ఆపాదించబడతాయి..గతాన్ని చూస్తే ఇలాంటి విషయాల్లో మనిషి కేవలం నిమిత్తమాత్రుడైనా జాతిపేరుతో జరిగే మారణహోమంలో మాత్రం సమిధకాక తప్పలేదు..జాతి వివక్ష లాంటివి ఎదుర్కొంటే మాత్రం అలా ఎలా డ్రగ్స్ బారిన పడతారు ? నేరప్రవృత్తి ఎలా వస్తుంది ? ఇండివిడ్యువల్ డిసిప్లిన్ అఖ్ఖర్లేదా ???? అని ఆపకుండా ప్రశ్నలు సంధించే లాజికల్ మైండ్ ని కాసేపు బుజ్జగించి వాస్తవాలు పరిశీలిస్తే ఒక మనిషి సక్సెస్ లో పూర్తిగా కాకపోయినా ఈ పుట్టుక కూడా పరోక్షమైన(బలమైన?) పాత్ర పోషిస్తుందని David McRaney 'You are not so smart' లో అన్న మాటలు గుర్తొచ్చాయి..
మెదడు పాత విషయాలతో నిండిపోయుంటే కొత్త విషయాలకు చోటు ఉండదు,అలాంటప్పుడు మెదడుకి కూడా కాస్త ఫార్మాటింగ్ అవసరం :) అలా పోయిన సంవత్సరం చదువుదామనుకున్న ఈ పుస్తకం ఈ సంవత్సరం ఖాతాలో పడింది..జెస్మిన్ వార్డ్ రాసిన Sing, Unburied, Sing 2017 వ సంవత్సరానికి గాను నేషనల్ బుక్ అవార్డును గెలుచుకోవడమే కాక Andrew Carnegie Medal,Kirkus Prize లాంటి మరిన్ని అవార్డులకు నామినేట్ చెయ్యబడింది..పదమూడేళ్ళ జోజో (Jojo),చెల్లెలు కేలా (Kayla/Michaela) అమ్మమ్మ,తాతలతో (Mam,Pop) కలిసి ఉంటుంటారు..డ్రగ్స్ కు బానిసైన తల్లి లియోనీ (Leonie) బాధ్యతా రాహిత్యం కారణంగా జోజో పసిపాప అయిన కేలాను తల్లిలా సంరక్షిస్తుంటాడు..లియోనీ భర్త,తెల్లజాతీయుడైన మైఖేల్ మూడేళ్ళ జైలు శిక్ష అనంతరం విడుదలవుతున్న సందర్భంలో తన స్నేహితురాలు Misty తో కలిసి పిల్లలిద్దరినీ తీసుకుని Mississippi State Penitentiary అయిన Parchman Farm కు బయలుదేరుతుంది..కథనం చాలావరకూ ఈ రోడ్డు ట్రిప్ లో భాగంగా నడుస్తుంది..ఈ ప్రయాణంలో మిస్సిస్సిప్పి వీధులు డ్రగ్స్,నేరాలు,పిల్లల ఆకలిదప్పులు,సంరక్షణ లేని బాల్యం ఇలా అస్తవ్యస్తమైన నల్లజాతీయుల బ్రతుకులకు సాక్ష్యాలుగా నిలబడతాయి.
ఈ పాత్రలతో పాటు ఇందులో కాస్త ఫాంటసీ ప్రపంచం కూడా ఉంటుంది..పాత్రల మధ్య తిరుగుతూ,వారితో మాట్లాడుతూ ఆత్మలు కూడా సంచరిస్తుంటాయి..లియోనీకి చనిపోయిన సోదరుడు గివెన్(Given) కనిపిస్తూ ఉంటాడు..మైఖేల్ కజిన్ గివెన్ ను చంపగా మైఖేల్ తండ్రి బిగ్ జోసెఫ్,అతని కుటుంబం దాన్ని కేవలం ఒక 'హంటింగ్ ఆక్సిడెంట్' గా అభివర్ణిస్తుంది..జోజో Parchman ఫార్మ్ కి వెళ్ళినప్పుడు గతించిన కాలంలో అతని తాత(రివర్) అక్కడ ఉన్నప్పటి రోజుల్లో ఆ ఫార్మ్ లో ఖైదీ గా ఉన్న Richie అనే పిల్లవాడి ఆత్మ జోజోను వెంటాడుతుంది..రిచీ గురించి జోజోకు తాత కథలు కథలుగా చెప్తుంటాడు గానీ రిచీ జైలునుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన తరువాత మాత్రం ఏమైందనేది చెప్పకుండా దాటేస్తుంటాడు..తాతను ఆ మిగతా కథ చెప్పమని అడగమని రిచీ జోజో వెంటపడి అడుగుతుంటాడు..రిచీ గురించి చదువుతున్నప్పుడు మనలో కలిగే జాలి,అసలు Parchman లో ఏమైంది,రిచీ కథేంటి అనే ఆలోచనలతో ఆత్రంగా పేజీలు తిప్పేలా చేస్తుంది.
జెస్మిన్ సృష్టించిన లోకంలో ప్రేమ,దయ కోసం పరితపించే పాత్రలు కనిపిస్తాయి..అక్కడ No-Trespassing బోర్డు వెనుక లోడెడ్ గన్ పట్టుకుని గర్జించే తెల్లవాళ్ళను చూస్తే అటుప్రక్కగా వెళ్ళే నల్లజాతీయులకు నిలువెల్లా చెమటలుపోస్తాయి..ఆ ప్రపంచంలో నల్లవాళ్ళు ఏమైనా తప్పు చేశారని వినగానే అసలు ఏమీ విచారించకుండానే కళ్ళు పీకెయ్యడం,చర్మం వలిచేయ్యడం లాంటి ఘోరమైన శిక్షలు అమలుచేస్తారు..చేదు నిజాలను ఒక ప్రక్క కఠినంగా చెప్తూనే మరో ప్రక్క సున్నితమైన పసివాళ్ళ ప్రపంచాన్ని కూడా పరిచయం చెయ్యడం జెస్మిన్ కే సాధ్యమా అన్నట్లు చిన్న చిన్న విషయ విశేషాలతో నేరేషన్ ఆద్యంతం ఒక ప్రవాహంలా సాగిపోయింది..ఈ కథని జోజో,లియోనీ,రిచీ-ముగ్గురి దృష్టి కోణంనుంచీ,గత-వర్తమానకాలాల్లో మార్చి మార్చి రాశారు..తల్లిదండ్రుల జాతులు వేరుకావడం,నేరాలు,డ్రగ్స్ లాంటి కారణాలతో జోజోకు తల్లిదండ్రుల పట్ల విముఖత ఏర్పడుతుంది..ఈ పుస్తకంలో అన్నిటికంటే నచ్చిన విషయం అన్న చెల్లెళ్ళ(జోజో,కేలా) మధ్య ఉన్న ప్రేమ..ప్రతి నిముషం కేలాను తల్లిలా బుజ్జగించి అక్కున చేర్చుకునే జోజో,చిన్ని చిన్ని చేతులను జోజో మెడచుట్టూ వేసి ఒక్క క్షణం కూడా అతన్ని వదలని కేలా లను చూస్తుంటే మనకే కాక తల్లి లియోనీ కి కూడా అసూయ కలుగుతుంది..ఇక పదిహేడేళ్ళకే తల్లి అయిన లియోనీలో మాతృత్వపు ఛాయలు మాత్రం లేవని కాన్సర్ బారినపడిన అమ్మమ్మ జోజోతో అంటుంటుంది..లియోనీ కి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నా వాటిని వ్యక్తం చెయ్యడం చేతకాదు..తనపై తనకే అదుపులేని లియోనీ భర్త మైఖేల్ ప్రేమలో ఊరట పొందుతుంది..ఇక రిచీ కథ Parchman దారుణాలకు సాక్ష్యం..పశువుల్లా ఆ పొలాల్లో పని చేసే ఖైదీలు,వాళ్ళు నియమాలను అతిక్రమిస్తే కుక్కని కాల్చినట్లు కాల్చిపడేసే గన్ మాన్లు,ఖైదీలపై కుక్కల్ని వదిలి వేడుక చూసేవాళ్ళు-ఇలా మానవత్వానికి ఆవలి తీరంలో ఉంటుంది Parchman..మరి రిచీ కథ ఏమైంది ! రిచీకి ప్రేమను పంచిన రివర్ (జోజో తాత) రిచీని కాపాడగలిగాడా అనేది మిగతా కథ..
ఇందులో వాక్య నిర్మాణం నల్లజాతీయుల వ్యవహార శైలికి దగ్గరగా ఉండటంతో అర్ధం చేసుకోడానికి కాస్త ఇబ్బంది అనిపించింది..వాక్యాలకు ముగింపు లేకుండా విడి పువ్వుల్లా,మాల కట్టుకునే పని చదివేవాళ్ళకే వదిలేసినట్లు ఉన్నాయి..కానీ ఆ శైలికి తొలి పేజీల్లో కాసేపు అలవాటుపడితే చాలు,కట్టుదిట్టమైన కథనం ఇలాంటి విషయాలను గమనించే అవకాశం ఇవ్వకుండా చదివిస్తుంది..నల్లజాతీయులకు ఇప్పటికీ కలలోకొచ్చి భయపెట్టే అమెరికా భూతాన్ని గురించి తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
లియోనీ అంతరంగం..
I catch myself massaging the back of my neck and stop. Everything hurts.
Mama looks at me, only her eyes looking full in that moment, round as they ever were, almost hazel if I lean in close enough, water gathering at the edges. The only thing time hasn’t eaten.
Because from the first moment I saw him walking across the grass to where I sat in the shadow of the school sign, he saw me. Saw past skin the color of unmilked coffee, eyes black, lips the color of plums, and saw me. Saw the walking wound I was, and came to be my balm.
బిగ్ జోసెఫ్ ను గురించి లియోనీ...
He is taking something off the seat of the mower, a rifle that was strapped there, something he keeps for wild pigs that root in the forest, but not for them now. For me.
Parchman అనుభవాలు,
This ain’t no place for no man. Black or White. Don’t make no difference. This a place for the dead.
The warden said: “It ain’t natural for a colored man to master dogs. A colored man doesn’t know how to master, because it ain’t in him to master.” He said: “The only thing a nigger knows how to do is slave."
I didn’t understand time, either, when I was young. How could I know that after I died, Parchman would pull me from the sky? How could I imagine Parchman would pull me to it and refuse to let go? And how could I conceive that Parchman was past, present,and future all at once? That the history and sentiment that carved the place out of the wilderness would show me that time is a vast ocean, and that everything is happening at once?
లియోనీ గురించి జోజో...
I don’t want Leonie giving her that. I know that’s what she think she need to do, but she ain’t Mam. She ain’t Pop. She ain’t never healed nothing or grown nothing in her life, and she don’t know.
రిచీ అంతరంగం,
“Home is about the earth. Whether the earth open up to you. Whether it pull you so close the space between you and it melt and y’all one and it beats like your heart. Same time. Where my family lived . . . it’s a wall. It’s a hard floor, wood. Then concrete. No opening. No heartbeat. No air."
I know Jojo is innocent because I can read it in the unmarked swell of him: his smooth face, ripe with baby fat; his round, full stomach; his hands and feet soft as his younger sister’s. He looks even younger when he falls asleep. His baby sister has flung herself across him, and both of them slumber like young feral cats: open mouths, splayed arms and legs, exposed throats.
This is where he differs from River. This scent blooms stronger than the dark rich mud of the bottom; it is the salt of the sea, burning with brine. It pulses in the current of his veins. This is part of the reason he can see me while the others, excepting the little girl, can’t. I am subject to that pulse, helpless as a fisherman in a boat with no engine, no oars, while the tide bears him onward
పుస్తకం నుండి మరికొన్ని...
Sometimes the world don’t give you what you need, no matter how hard you look. Sometimes it withholds.
“He wasn’t nothing but a boy, Jojo. They kill animals better than that.”
“Of course she’s yellow. She’s our baby.” And then Leonie laughs, and even though it’s a laugh, it doesn’t sound like one. There’s no happiness in it, just dry air and hard red clay where grass won’t grow.
This the kind of world, Mama told me when I got my period when I was twelve, that makes fools of the living and saints of them once they dead. And devils them throughout.
Image Courtesy Google |