Image Courtesy Google |
I would never be part of anything. I would never really belong anywhere, and I knew it, and all my life would be the same, trying to belong, and failing.Always something would go wrong. I am a stranger and I always will be, and after all I didn’t really care.Hisham Matar ఒక చోట గుర్తు చేసుకున్న ఈ Jean Rhys వాక్యాలు ఆయన జీవితానికి అతికినట్లు సరిపోతాయి..
చమురు నిల్వలు కలిగిన ఆఫ్రికా దేశాల్లో ఒకటైన లిబియాకు ఇటలీ వలస పాలన నుంచి విముక్తి లభించినా,1969 తరువాతి కాలంలో గడాఫీ నియంతృత్వం క్రింద మగ్గింది...గడాఫీ పాలనలో రెండు దశాబ్దాల నుండీ అదృశ్యమైన తండ్రి Jaballa Matar ను అన్వేషిస్తూ లండన్ లో రచయితగా స్థిరపడ్డ Hisham Matar రాసిన పుస్తకం ఈ 'The Return: Fathers, Sons and the Land In Between' ,2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక Pulitzer Prize for Biography or Autobiography తో పాటు Folio Prize ని కూడా గెలుచుకుంది..
లిబియాలో కింగ్ Idris పరిపాలనలో దౌత్యవేత్తగా పని చేస్తున్న సంపన్నుడు Jaballa Matar గడాఫీ నియంతృత్వానికి ఎదురెళ్ళిన కారణంగా లిబియా ను వదిలి ఈజిప్ట్ (కైరో)కు కుటుంబసమేతంగా వలస వెళ్ళిపోవల్సొస్తుంది..కానీ అణువణువునా దేశభక్తి నిండిన Jaballa,ఈజిప్ట్ నుండే గడాఫీకి వ్యతిరేకంగా లిబియాలో స్లీపింగ్ సెల్స్ ఏర్పాటు చేసి రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తారు..ఆయన ఒక ఉద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నాయకుడు,లిబియా బోర్డర్ కు దగ్గరలోని Chad లో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి,తన ధనాన్ని అందులో ధార పొయ్యడమే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న లిబియా సంపన్నుల దగ్గర నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించగల నైపుణ్యం ఉన్నవారు..Jaballa Matar కున్న ఆర్ధిక వనరులు ఆయన రాజకీయ నిబద్దతకు సరిపోలడంతో ఆయన గడాఫీ పాలనకు ప్రమాదకరంగా మారారు..కానీ తలదాచుకున్న ఈజిప్ట్ వెన్నుపోటుతో 12 మార్చ్ 1990 న వారి కైరో ఫ్లాట్ లోనే ఆయన్ని ఈజిప్ట్ సీక్రెట్ పోలీసులు కిడ్నాప్ చేసి రహస్యంగా Tripoli లోని Abu Salim జైలుకు తరలిస్తారు..
He was taken to Abu Salim prison, in Tripoli, which was known as “The Last Stop”—the place where the regime sent those it wanted to forget.
"Even today, to be Libyan is to live with questions." అంటూ ప్రశ్నలతోనే జీవితాన్ని గడిపేస్తూ,అదృశ్యంలో ఉన్న Jaballa Matar బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలియక దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన ఆచూకీ కోసం ఆ కుటుంబం చెయ్యని ప్రయత్నం లేదు..Hisham అమెరికా లో వ్యాపారస్థుడైన అన్నగారు Ziad తో కలిసి తండ్రిని వెతికే క్రమంలో ఎదుర్కున్న పరిస్థితులు కేవలం లిబియా రాజకీయ,సామాజిక పరిస్థితులను మాత్రమే కాక మానవ హక్కులను కాపాడే బాధ్యత విషయంలో ప్రపంచ దేశాల వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తాయి.
Hisham తండ్రి Jaballa Matar గురించి ఆచూకీ కోసం చేసే ప్రయత్నంలో స్వదేశమైన లిబియాకు పయనమవుతూ లిబియా లో తాను వదిలేసిన బాల్యాన్నీ,తన తండ్రిని దేశభక్తినీ,తమ కుటుంబపరిస్థితులను ఒక్కొక్కటిగా మనకు చెప్పడంతో పుస్తకం మొదలవుతుంది..
The plane was going to cross that gulf. Surely such journeys were reckless. This one could rob me of a skill that I have worked hard to cultivate: how to live away from places and people I love.రాజ్యాధికారం కోసం పాలకుల మధ్య జరిగే ఆధిపత్యపోరులో ఎక్కువ ప్రభావితమయ్యేవి సామాన్యుల జీవితాలే..ఇందులో గడాఫీ నియంతృత్వంపై పోరాటంలో ప్రాణాలు వదిలిన Hisham కజిన్ Izzo,సుమారు ఇరవై ఏళ్లపాటు జైల్లో మగ్గిన అంకుల్ Mahmoud,Hmed,కజిన్స్ Ali,Saleh లాంటి వారి గురించిన విశేషాలతో పాటు మూడు తరాలుగా లిబియా రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులుగా మారిన వారి కుటుంబీకులను గురించిన సంగతులుంటాయి..అందరిలోకి Hisham తండ్రి Jaballa Matar వ్యక్తిత్వం మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంది..లిబియాలో ప్రముఖ వ్యక్తి/సంపన్నుడైన ఆయనలో కేవలం తన కుటుంబం గురించి ఆలోచించే కుటుంబ పెద్దతో పాటు తన దేశ సంక్షేమం కోసం తపించే దేశభక్తుడు కనిపిస్తారు..
“Don’t put yourselves in competition with Libya. You will always lose,” he had said, when once the three of us had tried to dissuade him from openly opposing Qaddafi. The silence that followed was the distance between him and us. The disagreement had a historical dimension. It placed a nation against the intimate reality of a family.
I have always associated the irrevocable and violent changes my family and my country went through in the following four decades with the image of my father—a poet turned officer turned, reluctantly, diplomat—dressed in a suit and tie, far away from home, collecting the pieces of a dead man. He was thirty-one years old. I was born later that year.తండ్రి Jaballa బలమైన వ్యక్తిత్వానికి తోడు ఆయన అడుగులో అడుగువేస్తూ నడిచే ఆయన భార్య,Hisham కు తల్లి అయిన Fawzia Tarbah గురించి చెప్తూ,
In those days my mother operated as if the world were going to remain forever. And I suppose that is what we want from our mothers: to maintain the world and, even if it is a lie, to proceed as though the world could be maintained. Whereas my father was obsessed with the past and the future, with returning to and remaking Libya, my mother was devoted to the present. For this reason, she was the truly radical force in my adolescence.తండ్రి నుండి ఆ ఇరవై ఏళ్లలో కేవలం రెండు ఉత్తరాలు మాత్రమే వీరికి అందుతాయి..Abu Salim జైల్లో నరకాన్ని అనుభవిస్తున్నా కూడా ఆ ఉత్తరాల్లో పట్టుసడలని Jaballa వ్యక్తిత్వం మనల్ని అబ్బురపరుస్తుంది..
The old man’s words, “I will not let disgrace stain my forehead,” were echoed thirty-six years later in Father’s first letter from prison, when he wrote, “My forehead does not know how to bow.”తన తండ్రి ఒక సాధారణ వ్యక్తి కాదని తనకు తెలుసంటూనే ,కనీసం తన తండ్రి మరణించారో లేదో కూడా తెలీని పరిస్థితిలో రచయిత మాటలు,ఇరవై ఏళ్ళుగా ఒక కొడుకు అనుభవించిన మానసిక వేదనకి అద్దం పడతాయి..
I wished that “at least I had some happy man / as father, growing old in his own house.” But, unlike Telemachus, I continue, after twenty-five years, to endure my father’s “unknown death and silence.” I envy the finality of funerals. I covet the certainty. How it must be to wrap one’s hands around the bones, to choose how to place them, to be able to pat the patch of earth and sing a prayerతొలుత Hisham తన కలంతో మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో,Jaballa అదృశ్యం ఇంటర్నేషనల్ 'లా' ను ఉల్లంఘించడమేననీ అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా గగ్గోలుపెట్టడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న రీతిలో లిబియా,ఈజిప్ట్,లండన్ దేశాలన్నీ రంగంలోకి దిగుతాయి..ఈ ప్రయత్నంలో గడాఫీ కొడుకు Seif el-Islam కు Hisham కు ముఖాముఖీ భేటీ కూడా జరుగుతుంది..మరి ఒక కరడుగట్టిన నియంత కొడుకు Seif ,Hisham కు సహాయం చేశాడా ! చివరకి తండ్రీ కొడుకులు కలిశారా ? అసలు Jaballa బ్రతికే ఉన్నారా లేదా అనే విషయాలు మనకు చివర్లో తెలుస్తాయి..Hisham ఆవేదనలోంచి పుట్టిన అక్షరాలు,నియంతృత్వాన్ని విమర్శించేవారిని బహిరంగంగా ఉరి తీసి,సంగీతసాహిత్యాలను నాశనం చేసి,తీవ్రమైన మారణహోమం సృష్టించి,అనేక అకృత్యాలకు పాల్పడ్డ గడాఫీ era ను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి..మూడు దశాబ్దాలుగా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడే ప్రయత్నంలో లిబియా దేశంలో,తరాల మధ్య ఏర్పడిన పూడ్చలేని అగాధల గాధల్ని వివరిస్తాయి.
లిబియా పాలన చేతులు మారడం గురించి,
There are many other histories, of course, concerning those who, over the past three millennia, occupied Libya: the Phoenicians, the Greeks, the Romans, the Ottomans and, most recently, the Italians.Rajab Abuhweish లిబియా struggle గురించి రాసిన కవిత,
I have no illness but the loss of
noble folk and the foul ones who now,
with calamitous, shameless faces,
govern us.
How many a child have they
taken and whipped?
The poor young flowers return
confused,
made old without having
lived.
బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ David Miliband,Hisham భుజం మీద చెయ్యి వేసి "నువ్వు మాలో ఒక్కడివే" అన్న మాటలపై Hisham అంతరంగం,
So tell me,’ he said, ‘Are you British now?’‘Yes.’‘Good man. Excellent. So you’re one of us.’– Perhaps it was the genuine warm confederacy of a fellow Brit. Or maybe it was the impatient, political, bullying pragmatism of power towards a person of mixed identities, a man whose preoccupations do not fit neatly inside the borders of one countryపుస్తకం నుండి మరి కొన్ని అంశాలు,
It was to figure out how on earth this mere writer was able to rustle up such “noise,” as Miliband put it.
“People can’t choose their history,"
I remembered what Sarah Hamoud, who used to run the Libya desk at Amnesty International, once told me: “There is no country where the oppressed and the oppressor are so intertwined as in Libya."
The words “frail” and “well” rumbled silently in my mouth. Hope, like water on parched earth, surged over me, heavy, drowning. It was tremendous news. Tremendous in the way a storm or a flood can be tremendous. When your father has been made to disappear for nineteen years, your desire to find him is equaled by your fear of finding him. You are the scene of a shameful private battle.
It makes me think that we all carry, from childhood, our death mask with us.