Friday, June 21, 2024

Desire - Haruki Murakami

ప్రేమకు భాష ఉన్నట్లే మనిషిలోని కోరికకు కూడా భాష ఉంటుందంటారు మురాకమీ. టైటిల్ కి తగ్గట్టు ఈ కథలన్నీ లాజిక్ కి ఎంతమాత్రం అందని కోరికను గురించి రాసినవే.  "What I wanted was to be one with her, with nothing coming between us."- దారినపోతున్న స్త్రీని చూసి ఒక యువకుడు మనసులో అనుకునే మాటలివి. మరి ఆ అమ్మాయి అందగత్తేనా అంటే, అదీ కాదుట. ఆమె ముక్కు చూసి ఆమెతో అమాంతం ప్రేమలో పడ్డానంటాడు. :) ఆమెతో మాట కలపడం కోసం ఆమెకో కథ చెప్తాడు. ఆకలి, వ్యామోహం, మనిషిలో రహస్యమైన కోరికలూ- వెరసి ఈ కథలన్నీ మనిషి అదుపులోలేని (?) 'కోరికను' గురించి రాసినవే.

Image Courtesy Google

రికవరీ మోడ్ లో ఉన్నప్పుడు మెదడు మీద భారం మోపే పుస్తకాల కంటే మగతలోనైనా చదివించగలిగే పుస్తకాలు అవసరమవుతాయి. మునుపు మురాకమీ రచనల్లో 'నార్వేయన్ వుడ్' తో పాటు ఇతరత్రా కొన్ని ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలు చదివాను గానీ ఆయన కథలతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఇంట్లో ఉన్న పుస్తకాలు వెతికితే వింటేజ్ మినీస్ వారి ఈ 'డిజైర్' కనిపించింది.

ఇందులో మురకమీ కథల్లో వివిధ రచనల నుండి సేకరించిన ఐదు కథలున్నాయి. ఈ కథలన్నిటిలో మూలవస్తువు మనిషిలో మౌలికమైన  భావోద్వేగాలు, కోరికలు. మనిషిలో నాగరికతకూ, ఆధునికతకూ దూరంగా మరో ఆదిమమైన మనిషి ఉంటాడని సైకో ఎనాలిసిస్ చెబుతుంది. ప్రతి మనిషిలోనూ సమాజం హర్షించని కొన్ని ఆదిమ భావజాలాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా బయటకి వస్తుంటాయి. నిజానికి ఒక మనిషి మరో మనిషితో సులభంగా కనెక్ట్ అవ్వడంలో కూడా ఈ మౌలిక అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి అనిపిస్తుంది. మనిషితనానికి దగ్గరగా ఉండే కొన్ని భావాలూ, భావజాలాలూ మరొక వ్యక్తిలో కనిపించినప్పుడు వాళ్ళు మనకు దగ్గర మనుషుల్లా అనిపించడం సహజం. అటువంటి వాళ్ళని సరదాగా "పార్టనర్ ఇన్ క్రైమ్" అంటూ ఉంటాం. వాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్లు చెయ్యకుండా మనలోని మంచితో పాటు చెడుని కూడా సహానుభూతితో చూడగలరని నమ్ముతాం. 

ఈ కథల్లోని పాత్రలు తోటిమనుషులతో అటువంటి 'కనెక్షన్'ను వెతుక్కుంటాయి. "The Second Bakery Attack" కథలో కొత్తగా పెళ్ళైన జంట అర్థరాత్రి వేళ ఆకలి తట్టుకోలేక, ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఒక బేకరీకి దొంగతనానికి బయలుదేరతారు. అంతవరకూ సమాజంలో హుందాగా జీవిస్తున్న ఈ జంటలో ఉన్నట్లుండి ఇటువంటి విచిత్రమైన కోరిక కలగడానికి కారణాలు భర్త కథగా చెప్పే అతని గతంతో ముడిపడి ఉంటాయి. మనిషిలో కొన్ని బలమైన కోరికలకు లాజిక్ అస్సలు ఉండదని చెప్పడమే మురాకమీ ఉద్దేశ్యం అనిపిస్తుంది. ఈ క్రింది వాక్యాలు చూడండీ, లావాలా ఎప్పుడు ఉబికి వస్తుందో తెలీని అదిమిపట్టిన కోరికకు ఎంత గాఢమైన వర్ణన!!
One, I am in a little boat, floating on a quiet sea. Two, I look down, and in the water I see the peak of a volcano thrusting up from the ocean floor. Three, the peak seems pretty close to the water’s surface, but just how close I cannot tell. Four, this is because the hypertransparency of the water interferes with the perception of distance.

I myself have adopted the position that, in fact, we never choose anything at all. Things happen. Or not.

‘The baker was a classical-music freak, and when we got there, he was listening to an album of Wagner overtures. So he made us a deal. If we would listen to the record all the way through, we could take as much bread as we liked.
రెండో కథ 'On Seeing the 100% Perfect Girl One Beautiful April Morning' కథతో చాలా మంది పాఠకులు సులభంగా కనెక్ట్ అవుతారు. జీవితంలో కొందరు తారసపడినప్పుడు తొలిపరిచయంలోనే "హీ/ షీ ఈజ్ ది వన్" అనిపిస్తుంది. అన్ని అడ్డుగోడల్నీ దాటుకుని మనలో మనకు తెలీని మరో మనిషిని వాళ్ళు గుర్తుపట్టినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడా కూడా లాజిక్ పెద్దగా ఏమీ ఉండదు. మురాకమీ హీరో దారినపోతున్న ఒక అమ్మాయి ముక్కు తీరు చూసి ప్రేమలో పడ్డానంటాడు. :) 'అందం' సహజ నిర్వచనాలకి చాలా దూరంగా ఉండే ఆమె తన కంటికి జగదేక సుందరిలా అగుపించిందంటాడు. మరి దారినపోతున్న ఆమెతో ఎలా మాట కలపడం! ఎలా పరిచయం పెంచుకోవడం! వాళ్ళ కథ "హ్యాప్పీలీ ఎవర్ ఆఫ్టర్" అవుతుందా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే.

Wish I could talk to her. Half an hour would be plenty: just ask her about herself, tell her about myself, and – what I’d really like to do – explain to her the complexities of fate that have led to our passing each other on a side street in Harajuku on a beautiful April morning in 1981. This was something sure to be crammed full of warm secrets, like an antique clock built when peace filled the world.

After talking, we’d have lunch somewhere, maybe see a Woody Allen movie, stop by a hotel bar for cocktails. With any kind of luck, we might end up in bed.

Potentiality knocks on the door of my heart.

Now the distance between us has narrowed to fifteen yards.

'Birthday Girl' కథ కాస్త క్రిప్టిక్ గా అనిపిస్తుంది. తన పుట్టినరోజు కానుకగా ఆ 20 ఏళ్ళ అమ్మాయి ఏం కోరుకుందో, ఆ వృద్ధుడు ఆమెకు ఏమి కానుక ఇచ్చారో పాఠకుల ఊహకే వదిలేస్తారు రచయిత. 'Samsa in Love' కథను కాఫ్కా 'మెటమార్ఫసిస్' నేపథ్యంగా తీసుకుని రాశారు మురాకమీ. కోరికనూ, వ్యామోహాన్నీ కొత్త వెలుగులో చూపించే ప్రయత్నం చేసిన ఈ కథ ఇందులోని మిగతా కథలన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. హ్యాపీ రీడింగ్ :)

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :

ONCE UPON A time, there lived a boy and a girl. The boy was eighteen and the girl sixteen. He was not unusually handsome, and she was not especially beautiful. They were just an ordinary lonely boy and an ordinary lonely girl, like all the others. But they believed with their whole hearts that somewhere in the world there lived the 100% perfect boy and the 100% perfect girl for them. Yes, they believed in a miracle. And that miracle actually happened. One day the two came upon each other on the corner of a street.

They should never have undertaken it, because they really and truly were each other’s 100% perfect lovers, and it was a miracle that they had ever met. But it was impossible for them to know this, young as they were. The cold, indifferent waves of fate proceeded to toss them unmercifully.

When they awoke, their heads were as empty as the young D. H. Lawrence’s piggy bank.

But the glow of their memories was far too weak, and their thoughts no longer had the clarity of fourteen years earlier. Without a word, they passed each other, disappearing into the crowd. Forever. A sad story, don’t you think?

‘Hey, bumpers are made for denting.’

‘No matter what they wish for, no matter how far they go, people can never be anything but themselves. That’s all.’

THE STORY HE told me came out after we had knocked around other topics over some wine, so strictly speaking it might not be altogether true. There are parts I didn’t catch, and details I’ve kind of imagined and woven in. And to protect the real people in it, I’ve changed some of the facts, though this doesn’t have a bearing on the overall story. Still, I think things took place pretty much as set out. I say this because though I might have forgotten some of the details, I distinctly recall the general tone. When you listen to somebody’s story and then try to reproduce it in writing, the tone’s the main thing. Get the tone right and you have a true story on your hands. Maybe some of the facts aren’t quite correct, but that doesn’t matter – it actually might elevate the truth factor of the story. Turn this around, and you could say there are stories that are factually accurate yet aren’t true at all. Those are the kind of stories you can count on being boring, and even, in some instances, dangerous. You can smell those ones a mile away.

No comments:

Post a Comment