పరుగు ఆపడం ఒక కళ. అది తెలియని జీవి ఏదన్నా ఉంటే అది ఒక్క మనిషి మాత్రమేననిపిస్తుంది. ఆదీ-అంతం లేని జీవన కాంక్షతో వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసి, ముందు తరాలకు సహజవనరులేవీ మిగల్చకుండా అభివృద్ధి పేరిట మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. "ఇందులో కొత్త విషయం ఏముందీ ! ప్రజలూ,పర్యావరణవేత్తలూ అరిగిపోయిన రికార్డులా అస్తమానం అనే మాటేగా ఇదీ." అంటారా ! నిజమే, అయితే ఈ పుస్తకంలో చర్చించిన విషయాలవి కాదు. ఈ పుస్తకం మానవజాతి పురోభివృద్ధికి మొదటి వరుసలో నిలబడి మనకు దిశానిర్దేశం చేసినవారి అనుభవాల గురించి. వారు ఇటువంటి పరిస్థితులను ముందే ఊహించారా ! ఒకవేళ తమ ఆవిష్కరణల ఫలితాలను ముందే ఊహించి ఉంటే వాటిపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలేమిటి అనే దిశగా రాసిన రచనే చిలీ దేశస్థుడైన రచయిత Benjamín Labatut రాసిన ఈ 'When We Cease to Understand the World'. ఇది 2021 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలూ,గ్లోబల్ పాండెమిక్ వంటి అనేక సంక్లిష్టతల నేపథ్యంలో మానవజాతిపై శాస్త్రీయ పరిశోధనల పర్యవసానాలెలా ఉంటాయోనన్న దిశగా రాసిన ఈ పుస్తకంలోని మూలాంశం నాకు సహజంగానే ఆసక్తి కలిగించింది.
|
Image Courtesy Google |
శాస్త్రసాంకేతికాభివృద్ధి పురోగమనం వైపా లేక తిరోగమనం వైపా అన్నది ఈనాటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. ఒకవేళ ఐన్స్టీన్, హైసెన్బర్గ్ , బోర్, Grothendieck, Schrödinger, Schwarzschild లాంటి వాళ్ళు ఇప్పుడు జీవించి ఉంటే, వాళ్ళు ఆద్యులుగా పునాదులు వేసిన క్వాంటమ్ మెకానిక్స్, గణితం, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వంటివి భవిష్యత్తు తరాల చేతుల్లోపడి ఏవిధంగా దుర్వినియోగమవుతున్నాయో చూసి తమను తాము ఖచ్చితంగా నిందించుకునేవారేమో, లేదా కళ్ళకు గంతలు కట్టుకుని అభివృద్ధి పేరిట సైన్సును గుడ్డిగా నమ్మడం వల్ల కలిగే దుష్పరిణామాలేమిటో చూసి బాధపడి ఉండేవారేమో అనుకుంటే, నిస్సందేహంగా అవుననే అంటుంది ఈ రచన. ఈ వ్యాసాల్లో పలువురు శాస్త్రజ్ఞులు మానవజాతిలో యుద్ధోన్మాదాన్నీ, పెచ్చుమీరిన స్వార్థాన్నీ ప్రత్యక్షంగా చూసి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనవ్వడం చూస్తాం.
ఏ శాస్త్రవేత్తనైనా నడిపించేవి అతడికి తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతా, అకుంఠిత దీక్షా, passion మాత్రమే. నిజానికి ఒక కళాకారుడిలాగే శాస్త్రవేత్త కూడా ఒక ఉన్మాద స్థాయిలో, ఏదో మానవాతీత శక్తి ఆవహించినట్లు తనకు ఆసక్తి ఉన్న రంగంలో తీవ్రంగా కృషి చేస్తాడు. కానీ అతడికి తన ఆవిష్కరణల ప్రభావం మానవజాతిపై ఎలా ఉండబోతుందోనన్న విషయంపై కనీస అవగాహన ఉండదు. ఇదే అంశాన్ని సాహిత్యంలో నోబెల్ గ్రహీత Mario Vargas Llosa 'Notes on the death of culture' పేరిట రాసిన కొన్ని వ్యాసాల్లో ఈ విధంగా రాస్తారు : "శాస్త్రజ్ఞులు తమ రంగాల్లో మాత్రమే ప్రతిభావంతులు. ఈ స్పెషలిస్టులకు తమ రంగానికి ఆవలి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు. తాము సాధించిన విజయాలు సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కూడా కనీస స్పృహ ఉండదు." అంటూ లోసా ఈ 'వన్ డైమెన్షనల్ మనుషుల్ని' "ఏకకాలంలో ప్రతిభావంతులూ,సంస్కృతి లేని అనాగరికులూ" అని కూడా అంటారు. వారి సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం అందరితోనూ కలవడానికి బదులు వారిని ఏకాకిని చేస్తోందని ఘాటుగా విమర్శిస్తారు. వాస్తవానికి దూరంగా తమదైన ప్రపంచంలో అహోరాత్రాలూ నిద్రాహారాలు మాని కృషి చేసినప్పటికీ, చివరకు తమ ఆవిష్కరణల ద్వారా పరోక్షంగా మానవజాతి వినాశనంలో వీరంతా కీలక పాత్ర పోషించారని అంటారు.
రెండు ప్రపంచ యుద్ధాలనీ, శాస్త్ర సాంకేతికాభివృద్ధికి పునాదులు పడిన కాలాన్నీ, చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారెవరూ ప్రస్తుత పాండెమిక్ పరిస్థితులను చూసి మరీ ఎక్కువ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఇంతకంటే ఘోరమైన, అనాగరికమైన కాలాన్ని దాటివచ్చిన సౌకర్యవంతమైన సంస్కృతి మనది. దీనికి సాక్ష్యాలుగా ఈ పుస్తకంలో అనేక 'పెద్ద గీత' లు కనిపిస్తాయి. ఆధునిక వైద్యవిధానాలకు బీజాలు పడుతున్న కాలంలో ఆల్కెమిస్టులు సజీవంగా ఉన్న జంతువుల అవయవాలను వేరుచేసి వాటిని ఎలక్ట్రిక్ ఛార్జ్ తో పునర్జీవింపజేసే ప్రయత్నం చెయ్యడం వంటివి చూసినప్పుడు మేరీ షెల్లీ మోడరన్ ప్రొమీథియస్ గా మలిచిన Frankenstein ను రాసినప్పుడు అన్ని కళలకంటే ప్రమాదకరమైన కళ అయిన 'సైన్స్' ను అభివృద్ధి పేరిట గుడ్డిగా నమ్మి అనుసరించడం వల్ల రాబోయే ప్రమాదాలను ముందుగానే ఊహించి ఆ పేజీల్లో హెచ్చరించారా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాల్లో విరివిగా వినియోగించిన సైనేడ్, ఇతరత్రా డ్రగ్స్, కెమికల్ వెపన్స్ సర్ అలాన్ ట్యూరింగ్ ప్రాణాలే కాకుండా, సైనిక దళాల మొదలు సాధారణ ప్రజానీకం వరకూ ఎన్ని ప్రాణాలను బలికొందో రాసిన విషయాలు చదువుతున్నప్పుడు "ఈ మానవ మేథోసృష్టి అంతా దేనికోసం ?" అని అనుకోకుండా ఉండలేం.
ఐన్స్టీన్ రెలెటివిటీ థియరీ లో తన వంతు పాత్ర పోషించిన జర్మన్ ఫిజిసిస్టు Schwarzschild మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఆర్మీలో వాలంటీర్ గా పనిచేసిన కారణంగా ఆ వినాశనానికి ప్రత్యక్ష సాక్షి. Schwarzschild సైనికుల ద్వారా సాధారణ ప్రజలపై జరిగిన అత్యాచారాలనూ,నరమేథాన్ని,దొమ్మీలనూ గూర్చిన పలు కథనాలను వినేవారు. పట్టణాలు రాత్రికి రాత్రే ప్రపంచపటంలోనుండి కనీస ఆనవాళ్ళు మిగలకుండా మాయమైపోవడం చూశారు. జరిగిన మారణ కాండకు ఎటువంటి 'Martial logic' లేదు, ఈ వినాశనానికి బాధ్యత ఎవరిదంటే చెప్పడం కష్టం. చివరకు Schwarzschild ఒకరోజు తన సైనికులు కొందరు తప్పించుకునే శక్తి కూడా లేని ఒక బక్కచిక్కిన కుక్కపిల్ల మీద నోరులేని ప్రాణి అన్న దయ కూడా లేకుండా తమ టార్గెట్ ను టెస్ట్ చేసుకోవడం చూసి చలించిపోయారు. శరీరం మీద యుద్ధోన్మాదం తాలూకా బొబ్బలతో ఆయన స్నేహితుడు Ejnar Hertzsprung కి రాసిన ఒక ఉత్తరంలో,“We have reached the highest point of civilization. All that is left for us is to decay and fall.” అన్నారట. ఇది ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే నిజమని అనిపించక మానదు.
ఈ కథలన్నిటిలోనూ Grothendieck మరియు Schrödinger ను గురించిన సంగతులు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకవేళ ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ప్రచురించగానే ఫిజిక్స్ ని వదిలేస్తానంటే ? మారడోనా ప్రపంచ కప్పు గెలవగానే బంతిని మళ్ళీ ముట్టుకోనని శపథంచేస్తే ? ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు Alexander Grothendieck నిజానికి అటువంటి నిర్ణయమే తీసుకున్నారు. తన పరిశోధనల వల్ల ప్రపంచానికి వినాశనం జరిగితీరుతుందని ముందే ఊహించి నలభయ్యేళ్ళకే కుటుంబాన్నీ,స్నేహితులనూ,ఉద్యోగాన్నీ,పరిశోధనల్నీ అన్నిటినీ వదిలేసి అస్త్ర సన్యాసం చేశారు. ఒక సన్యాసిలా జీవిస్తూ, రాయడం,చదవడం,ధ్యానం చేసుకోవడం వంటివి చేస్తూ తన శేషజీవితాన్ని గడిపారు.
Influenced by the clamour of the May ’68 protests all around him, he called on more than a hundred students during a masterclass at the University of Paris in Orsay to renounce “the vile and dangerous practice of mathematics” in light of the hazards humanity was facing. It was not politicians who would destroy the planet, he told them, but scientists like them who were “marching like sleepwalkers towards the apocalypse”.
From that day forward, he refused to participate in any maths conference that would not allow him to devote equal time to ecology and pacifism. During his talks, he gave away apples and figs grown in his garden and warned about the destructive power of science: “The atoms that tore Hiroshima and Nagasaki apart were split not by the greasy fingers of a general, but by a group of physicists armed with a fistful of equations.” Grothendieck could not stop fretting over the possible effects that his own ideas could have on the world. What new horrors would spring forth from the total comprehension that he sought? What would mankind do if it could reach the heart of the heart?
Grothendieck తన ఏకాకి జీవితానికి కారణం మానవ జాతిపై ద్వేషమో, తిరస్కారమో కాదనీ, తన పరిశోధనల కారణంగా మానవజాతికి నష్టం వాటిల్లకుండా వారిని రక్షించడానికే సన్యసించాననీ చెప్పుకునేవారట. మరో నాలుగేళ్ళలో మరణిస్తారనగా 2010 లో ఒక మిత్రుడికి చేరిన ఉత్తరంలో “Declaration of Non-Publication” ను కోరుతూ అన్ని లైబ్రరీల నుండీ, యూనివర్సిటీల నుండీ తన గణితశాస్త్ర ప్రచురణలను తొలగించాలనీ, భవిష్యత్తులో కూడా వాటిని ఏ రూపంలోనూ పునఃప్రచురించడంగానీ , క్రయవిక్రయాలు జరుపడం వంటివిగానీ నిషిద్ధమనీ హెచ్చరించారు. ఈ విధంగా Grothendieck మానవజాతిపై తన ప్రభావాన్నిసమూలంగా తుడిచేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకంటే శాస్త్రీయపరిజ్ఞానం చేసే మేలే కాదు, కీడు గురించి కూడా స్పృహ ఉన్నవాడిగా దాని ప్రభావాన్ని తగ్గించడంలో తనవంతు ఉడతాభక్తి ప్రయత్నం మాత్రమే. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, జూకర్బర్గ్ వంటివారు తమ పిల్లలను పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ తమ సృజించిన ఎలక్ట్రానిక్ ఉపకరాలూ, టెక్నాలజీలకు దూరంగా పెంచారనీ(పెంచుతున్నారనీ) చదివిన గుర్తు. ఆ మేథావులకి వాటి వల్ల వాటిల్లే నష్టాలు తెలియకపోతే కదా !
“My first impression on hearing him lecture was that he had been transported to our planet from an alien civilization in some distant solar system in order to speed up our intellectual evolution,” a professor from the University of California at Santa Cruz said of him. Despite how radical they were, the mathematical landscapes Grothendieck conjured up gave no impression of artificiality.
మరో వ్యాసంలో క్వాంటమ్ థియరీలో అనేక ప్రాథమిక ప్రతిపాదనలు చేసి కీలకమైన 'వేవ్ ఫంక్షన్' ని నిర్వచించిన ఆస్ట్రియన్-ఐరిష్ నోబెల్ గ్రహీత Erwin Schrödinger అనుభవాలూ,జీవిత విశేషాలూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. క్షయ వ్యాధి కారణంగా ఆల్ప్స్ పర్వతశ్రేణులు మధ్య అరోసా అనే ప్రాంతంలో ఉన్న డాక్టర్ హెర్విగ్ శానిటోరియంలో చికిత్సపొందుతున్న కాలంలో డాక్టర్ కుమార్తె పదహారేళ్ళ మిస్ హెర్విగ్ తో Schrödinger సాన్నిహిత్యం విశేషణాలకందదు. చిన్నతనంనుండీ అనారోగ్య కారణాల చేత మంచంపట్టి ఉండడంతో విస్తృతంగా చదువుతూ తండ్రి పర్సనల్ లైబ్రరీలో ఉన్న సైంటిఫిక్ వాల్యూమ్స్ అన్నిటినీ ఔపాసన పట్టేసిన ఆమెకు తెలియని విషయమంటూ ఉండదు. వయసుకి మించిన పరిపక్వత ఉన్న మిస్ హెర్విగ్ Schrödinger కోలుకోవడంలోనూ, వేవ్ ఈక్వేషన్ ని కనిపెట్టడంలోనే కాకుండా అతడికి తనలోని 'దెయ్యాలను' జయించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పెడోఫీలియా అని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. వీరి సంబంధం లోతు తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
Her eclectic reading and constant isolation had produced an unusually alert mind and an insatiable curiosity; during Schrödinger’s previous visit, she had assailed him with questions about the most recent advances in theoretical physics, about which she seemed to be thoroughly informed, despite having had virtually no contact with the outside world and never having ventured beyond the region surrounding the sanatorium. At just sixteen years old, Herwig had the mind, the bearing and the presence of someone much older. Schrödinger was quite the opposite.
The physicist sat down next to her, and she opened a book she held in her hands, reading the following passage: “One ghost succeeds the other like waves on the illusory sea of birth and death. In the course of a life, there is nothing but the rise and fall of material and mental forms, while the unfathomable reality remains. In every creature sleeps an infinite intelligence, hidden and unknown, but destined to awaken, to tear the volatile web of the sensory mind, break the chrysalis of flesh, and conquer time and space."
మిస్ హెర్విగ్ పట్ల తన అబ్సెషన్ నుండి బయటపడడానికి Schrödinger శతవిధాలా ప్రయత్నిస్తారు. చివరకు నిద్రపోతున్న ఆమెను తాకడానికి ప్రయత్నించే ఒక సందర్భంలో ఆయనకు హఠాత్తుగా కాళికాదేవి కనిపించడం, మరుక్షణం ఆయన హాస్పిటల్ బిల్లు కూడా కట్టకుండా తన పరిశోధనల తాలూకూ కాగితాలూ, సూట్ కేసూ తీసుకుని పెనుతుఫానును సైతం లెక్కచెయ్యకుండా రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తడం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ నిజజీవిత విశేషాల్లో సైతం వాస్తవికత పరిథుల్ని ప్రశ్నించుకోని పాఠకులుండరు.
It was not the first time he had become obsessed with a woman that young, but there was something different about Miss Herwig, something that disarmed him, that put his self-confidence in jeopardy.
Then he would call his wife to pick him up and would never set foot in the clinic again, even if it meant coughing himself to death in the streets like a beggar. Anything was better than bearing this infantile infatuation, which deepened the longer they spent together.
మిస్ హెర్విగ్ ఒక సందర్భంలో Schrödinger కి భగవద్గీతను ఇచ్చినప్పుడు వేదాలను అభ్యసించడం మొదలుపెట్టిన తరువాత తనకు తరచూ వచ్చే ఒక పీడకలను గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తారాయన. ఆ విచిత్రమైన కల గురించి ఈ విధంగా రాస్తారు : పలు విదేశీ శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలకు మూలాల్ని మన వేదాలనుండి గ్రహించారనడానికి ఇదొక సాక్ష్యం.
In his nightmare, the goddess Kali would sit on his chest like an enormous beetle, crushing him so that he could not move. With her necklace of human heads, and brandishing swords, axes and knives in her many arms, she would bathe him in drops of blood that fell from the tip of her tongue and jets of milk from her swollen breasts, rubbing his groin until he was no longer capable of bearing the arousal, at which point she would decapitate him and swallow his genitals. Miss Herwig listened to him impassively and told him his dream was not a nightmare, but a blessing: of all the forms taken on by the female aspect of the divine, Kali was the most compassionate, because she granted moksha—liberation—to her children, and her love for them extended beyond all human comprehension. Her black skin, she said, was the symbol of the void that transcends all form, the cosmic uterus in which all phenomena gestated, while her necklace of skulls comprised the egos she had freed from the principal object of their identification, which was nothing less than the body itself. The castration Schrödinger suffered at the Dark Mother’s hands was the greatest gift he could receive, a mutilation necessary so that his new consciousness could be born.
ఇలా రాస్తూపోతే మరెన్నో అనుభవాలు, భయాలు, అసూయలూ, ఉన్మాదాలూ, ఆనందాలూ. పరిమితికి మించినదేదైనా విషమేనన్న సూత్రం అభివృద్ధికి కూడా వర్తిస్తుంది. సాధారణ వ్యక్తులకే కాదు, ప్రస్తుత ప్రపంచం సర్వజ్ఞులైన పండితులకూ, శాస్త్రజ్ఞులకూ కూడా అర్థంకానిదిగా తయారైంది. మానవజాతికి 'crown jewel' గా పరిగణింపబడే క్వాంటమ్ మెకానిక్స్ థియరీనే తీసుకుంటే, దాని ఉనికంతా మన స్మార్ట్ ఫోన్ల సుప్రీమసీ వెనుకా, ఇంటర్నెట్ వెనుకా, మానవ మేథస్సుకి సవాళ్ళు విసురుతున్న కంప్యూటింగ్ పవర్ వెనుకా నిక్షిప్తమైపోయి ఉంది. మన ప్రపంచాన్ని సమూలంగా మార్చేసిన ఈ మహాద్భుతాన్ని మనకు వీలుగా ఎలా వాడుకోవాలో మనకందరికీ తెలుసు, కానీ అందులో లోపమల్లా అది మానవ మేథస్సు అవగాహనకు మించినది. ఇంతవరకూ దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా అర్థంచేసుకున్నవారు లేరు. ఆ పారడాక్స్ లనూ, వైరుధ్యాలనూ పట్టుగోగలగడం మనిషి మెదడుకి సాధ్యం కాలేదు. ఆకాశాన్నుంచి ఒక అద్భుతంలా ఊడిపడిన ఆ థియరీని మనం అబ్బురంగా చూస్తూ కోతుల్లా దాన్ని గురించి ఏమీ అర్ధం కాకుండానే దాని చుట్టూ తిరుగుతూ దానితో ఆడుకుంటున్నామేమో అంటారు రచయిత బెంజమిన్.
చివరగా వాస్తవానికీ, కల్పనకూ మధ్యనున్న పరిథులు చెరిపేస్తూ శాస్త్రజ్ఞుల అనుభవాలకు ఎటువంటి భేషజాలూ లేకుండా న్యాయం చేసిన అరుదైన రచన ఇది. ఇది ఒక నాన్ ఫిక్షన్ రచన అని అనుకోడానికి వీల్లేదు. ఫిక్షన్ ను మించిన ఆసక్తికరమైన కథలు ఇందులో బోలెడున్నాయి. తప్పకుండా చదవండి. హ్యాపీ రీడింగ్ :)
ఈ పుస్తకాన్ని రికమెండ్ చేసిన ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ గారికి ధన్యవాదాలు.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
No one dared deny the importance of this new wave mechanics, but pretty soon some began to ask themselves the same questions that had troubled Schrödinger in the Villa Herwig. “It is a truly beautiful theory. One of the most perfect, precise and elegant man has discovered. But there is something strange in it. It’s as if it were warning us: don’t take me seriously. The world I reveal is not the one you are thinking of when you employ me,” wrote Robert Oppenheimer, one of the first to question what wave functions actually had to say about reality.
He spilled the contents of the bottle into what was left of his beer and pushed the glass towards Heisenberg. “You look tired, Professor. You should take better care of yourself. Did you know the first symptom of a psychological disturbance is the inability to contend with the future? If you consider that, you will realize how implausible it is that we are able to exert control over even an hour of our lives. How hard it is to control our thoughts! You, for example—it is obvious you are possessed. That you are in thrall to your intellect as a degenerate is in thrall to a woman’s cunt. You are bewitched, Professor, you’ve been sucked inside your own head. Come on, drink. Don’t make me ask you twice.”
Reality, they said to those present, does not exist as something separate from the act of observation. A quantum object has no intrinsic properties. An electron is not in any fixed place until it is measured; it is only in that instant that it appears. Before being measured, it has no attributes; prior to observation, it cannot even be conceived of. It exists in a specific manner when it is detected by a specific instrument. Between one measurement and the next, there is no point in asking how it moves, what it is, or where it is located. Like the moon in Buddhism, a particle does not exist: it is the act of measuring that makes it a real object.
He renounced his post at the University of Kyoto, and wrote a last entry before shutting down his blog, stating that, in mathematics, certain things should remain hidden, “for the good of all of us”. This incomprehensible and apparently capricious gesture only confirmed what many had feared: Mochizuki had succumbed to Grothendieck’s curse.
“Doing mathematics is like making love,” wrote Grothendieck, whose sexual impulses rivalled his spiritual inclinations.