Thursday, June 1, 2017

Twenty Love Poems and a Song of Despair - Pablo Neruda

Image courtesy Google
ఈ ఏడాది నా పుస్తక పఠనం తాలూకూ గ్రహస్థితి ఏమంత బావున్నట్లు లేదు..ఆ మధ్య టైటిల్ చూసి 'భలే' అనుకుంటూ చదవడం మొదలు పెట్టిన 'The Success and Failure of Picasso' పూర్తి చేసేసరికి ఒక పూర్తి స్థాయి రీసెర్చ్ చేసినట్లు తలప్రాణం తోక్కొచ్చింది..అందులోనూ పుస్తకమంతా నాకు చాలా చికాకేసే అబ్స్ట్రాక్ట్ వ్యవహారం..ఆ పుస్తకం పూర్తయ్యాక బ్రతుకు జీవుడా అనుకుని నెలైనా కాలేదు,పాబ్లో నెరుడా చేతికి చిక్కాను..నేను పెయింటింగ్ లోనే అబ్స్ట్రాక్ట్  అంటే బుర్ర గోక్కునే టైపు..ఇక పోయెట్రీ లో అబ్స్ట్రాక్ట్ అంటే ! హ్మ్ ...

ఒక చోట,
and in the skin of the grapes
I thought I touched you. అని చదవగానే ఆహా అద్భుతం అనుకున్నాను..

అలాగే మరో చోట,
If suddenly         
you forget me         
do not look for me
for I shall already have forgotten you. అని చదివినప్పుడు నాలో narcissist వాహ్ అనుకుంది..

we begin again,
we end again
death and life.
And here we survive,
pure,with the purity that we created,
broader than the earth that could not lead us 
astray
eternal as the fire that will burn
as long as life endures....ఆ తరువాత భూమ్యాకాశాలు,నక్షత్రాలుమండలాలు,పాలపుంతలు,సమస్త ప్రాణికోటి అంతా చుట్టేసిన ఆ ప్రేమ నా స్థాయిని మించి చాలా దూరం వెళ్లిపోయింది..

సహజంగా కవిత్వం అంటే నాకు సంబంధించింది కాదులే అని సర్దిచెప్పుకుంటున్న సమయంలో,క్రిందటి సంవత్సరం రూమి,గిబ్రయిన్ లాంటి వారు చెరోవైపు భుజం తట్టి 'పరవాలేదమ్మాయి మేమున్నాం కదా '! అని ప్రోత్సహించగానే ఆనందపడిపోయి అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి అన్నట్లు నెరుడా ను చదవాలనుకోవడం సాహసమే..అసలు టైటిల్ చూసి ప్రేమ కనబడగానే పరిగెత్తి పారిపోకుండా పుస్తకం చదవడానికి పూనుకోవడం ఒక తప్పైతే,చదివాకా లెంపలేసుకుని,కాస్త చన్నీళ్లతో మొహం కడుక్కుని బుద్ధిగా వేరే కథలో కాకరకాయలో ఉన్న పుస్తకం చదువుకోకుండా ఇలా ఒక బ్లాగ్ పోస్టు రాసి గోడు వెళ్ళ బోసుకోవడం ఇంకో తప్పు..అక్కడక్కడా ఒకటీ అరా వాక్యాలు మినహా ఈ పుస్తకం చాలా నిరాశపరిచింది..ఇందులో కవిత్వం అర్ధంకాలేదనడంకంటే నాకు ఎందుకో రుచించలేదు అనడం సబబుగా ఉంటుంది..మరి అర్ధమైతే అంత గొప్ప కవి రాసిన కవిత్వం నాకెందుకు నచ్చలేదు అంటే,Perhaps Love and Poetry are not for me..

ఒక్కోసారి కొన్నిటి గొప్పదనం అర్ధం కావాలంటే కాస్త కాలానికి వదిలేసి మళ్ళీ ప్రయత్నించాలి...బహుశా పాబ్లో నెరుడాను మళ్ళీ చదివితే అప్పుడైనా ఆయన నాకు నచ్చుతారేమో చూడాలి ! బెటర్ లక్ నెక్స్ట్ టైం !!!

పుస్తకం నుండి మరికొన్ని,
EPITHALAMIUM నుండి,

At first I did not see you: I did not know
         that you were walking with me,
         until your roots
         pierced my chest,
         joined the threads of my blood,
         spoke through my mouth,
         flourished with me

Our love was born
         outside the walls,
         in the wind,
         in the night,
         in the earth,
         and that’s why the clay and the flower,
         the mud and the roots
         know your name,
         and know that my mouth
         joined yours
         because we were sown together in the earth

1 comment: