There’s no continuity and the world I have come from is utterly foreign to me. I haven’t heard its music, I haven’t seen its painting, I haven’t read its books, except for the handful I found in the refuge and of which I understood little. I know only the stony plain, wandering, and the gradual loss of hope. I am the sterile offspring of a race about which I know nothing, not even whether it has become extinct. Perhaps, somewhere, humanity is flourishing under the stars, unaware that a daughter of its blood is ending her days in silence. There is nothing we can do about it.
మనకి అలవాటైన ప్రపంచానికీ మూడేళ్ళ కోవిడ్ వినాశనం తరువాత ప్రపంచానికీ భేదం విస్మరించలేనంత స్పష్టంగా కనబడుతోంది. మానవ తప్పిదాలకు (తప్పిదం అనేది చిన్నమాటేమో కదా !) ముందు తరాలు భారీమూల్యం చెల్లించవలసివస్తుందని ఈ పాండెమిక్ మరోమారు కటువుగా గుర్తుచేసింది. ఆన్లైన్ క్లాసులతో విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, ఆటపాటల్లో స్వేచ్ఛగా బాల్యాన్ని గడపవలసి పిల్లలు గృహనిర్బంధంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో కాలక్షేపం చెయ్యవలసి వస్తోంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పెద్దలు పలు శారీరక,మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సింగీతం శ్రీనివాసరావు సినిమా 'ఆదిత్య 369' లో అందరూ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూగర్భంలో ఇళ్ళు కట్టుకుని, శరీరాన్ని పైనుండి క్రిందవరకూ పూర్తిగా సూట్స్ లో కప్పుకుని తిరుగుతుంటేనో, "టొమాటోలు కేజీ 200 రూపాయలేనటండీ,చాలా చవగ్గా ఉన్నాయి,ఇంటికొచ్చేటప్పుడు కొని పట్టుకురండి" అని భార్య భర్తకు కంప్యూటర్ స్క్రీన్ లో పురమాయిస్తేనో చూసి "భలే హాస్యం" అనుకుంటూ నవ్వుకున్నాం. 2020 తరువాత ఇటువంటి అనేక ఫాంటసీలు వాస్తవాలుగా ఎప్పుడు మారిపోయాయో కూడా తెలీలేదు.
Image Courtesy Google |
మనకు తెలిసినవారెవరైనా మరణిస్తే మనమందరం బాధపడతాం, "అయ్యో" అంటాం. ఆ అనడంలో అంతర్లీనంగా మృత్యువు మనవరకూ రాదన్న ధీమా కనిపిస్తుందంటారు తత్వవేత్త సెనెకా. ఈ మధ్య నెట్ఫ్లిక్ లో డేవిడ్ అటెన్బరో 'Our Planet' లో స్వార్ధంతో మానవజాతి కోరితెచ్చుకుంటున్న వినాశనాన్ని గురించి చెప్పిన విషయాలు చూసినప్పుడు అలాగే అనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ భూమికీ,దాని మీద జీవులకీ ఎక్కువ సమయం లేదు. మరో 'మాస్ ఎక్స్టింక్షన్' కి మన చేతులతోనే ఒక్కొక్క సమిధనూ పేరుస్తున్నాం.
భూమిపై సహజ వనరులన్నీ మెల్లిగా క్షయమైపోతే, మనిషి మేథస్సుతో కట్టుకున్న సౌథాలన్నీ కూలిపోతే, మనిషికీ పశువుకీ తేడా ఇదొక్కటేనని చూపించే కళలూ, సంగీత సాహిత్యాలవంటి సాంస్కృతికపరమైన చిహ్నాలన్నీ క్రమంగా అంతరించిపోతే, మానవజాతి కూడా అంకెల్లో లెక్కపెట్టగలిగే సమూహాలకు కుదించుకుపోతే, అటువంటి జీవితం ఎలా ఉంటుందో జాక్విలిన్ హార్ప్మ్యాన్ పోస్ట్ అపోకలిప్టిక్, ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ నవల 'I Who Have Never Known Men' కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. జ్యూయిష్ మూలాలున్న బెల్జియం రచయిత్రి జాక్విలిన్ హార్ప్మ్యాన్ నవలల్లో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి నవల ఇదే. ఇదే రచన తొలుత 'The Mistress of Silence' పేరుతో అనువదించబడింది. ఈ రచన శైలిలోనూ, నేపథ్యంలోనూ కూడా రెండేళ్ళ క్రితం చదివిన మార్గరెట్ ఆట్వుడ్ నవల 'ది హ్యాండ్ మెయిడ్స్ టేల్' ని గుర్తుకుతెచ్చింది. ఈ కథ నేపథ్యాన్ని చూసి ఇది కూడా ఫెమినిస్ట్ డిస్టోపియన్ కథేమో అని పొరబడ్డాను. నిజానికి ఈ కథలో స్త్రీవాదానికి సంబంధించిన అంశాలు బహు తక్కువ. సమస్త మానవజాతికీ సంబంధించిన కథను ఒక స్త్రీ దృష్టి కోణంలో నుంచి చెప్పిన కథ ఇది.
‘We’re not very resourceful, are we!’ said Greta ruefully.
‘We come from a world where it wasn’t necessary, everything was ready-made and we never asked how things were produced,’ replied Frances.
ఇక కథ విషయానికొస్తే, ఈ పుస్తకం మానవజాతి వినాశపుటంచుల్లో ఉన్న సమయంలో మొదలవుతుంది. భూగర్భంలో 39 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్న ఒక బంకర్. వారికి కాపలాగా కొంతమంది గార్డులు, వీరందరూ మగవారు. ఆ 39 మంది స్త్రీలలో అన్ని వయసుల వారూ ఉండగా పేరు తెలియని కథానాయకురాలు మాత్రం అందరికంటే చిన్నది. కథ మొదలయ్యే సమయానికి ఆమెకు సుమారు 14 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె రజస్వల కాని కారణంగా మిగతా స్త్రీలు ఆమె పట్ల భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు, ఈ కారణంగా ఆమె ఊహల్లో తనకంటూ ఒక అంతఃప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. మిగతా స్త్రీలు మానవజాతి పురోగతికీ, వినాశనానికీ ప్రత్యక్ష సాక్షులు కావడంతో వారికి భూమిపై పూర్వపు వైభవాన్ని గూర్చిన అవగాహన ఉండేది. కానీ కథానాయకురాలి జీవితం ఆమెకు ఊహ తెలిసేసరికే బంకర్లో మొదలవుతుంది. ఆ కారణంగా ఆమె జీవితం ఎటువంటి అస్తిత్వ చిహ్నాలూ, సాంస్కృతిక మూలాలూలేని తెల్ల కాగితం వంటిది. మిగతా స్త్రీలందరూ జంతువులను పోలిన తమ నిర్బంధ జీవితాన్ని నిందించుకుంటూ రోజులు వెళ్ళదీస్తుంటే, ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాని ఆమె మాత్రం తన భిన్నత్వాన్నే తన ప్రత్యేకతగా మార్చుకుంటూ క్రమంగా మిగతావారిని కూడా ప్రభావితం చేస్తుంది. తన హృదయ స్పందనను లెక్కిస్తూ కాలాన్ని అంచనావెయ్యడంతో మొదలుపెట్టి, బంకర్లోంచి బయటపడి అందరికీ సొంతంగా ఇళ్ళు నిర్మించి ఇచ్చే వరకూ ఆమె ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది.
I would have sworn it couldn’t happen to me; I’d seen women trembling, crying and screaming, but I’d remained unaffected by their tragedy, a witness to impulses I found unintelligible, remaining silent even when I did what they asked of me to assist them.
Admittedly, we were all caught up in the same drama that was so powerful, so all-embracing that I was unaware of anything that wasn’t related to it, but I had come to think that I was different. And now, racked with sobs, I was forced to acknowledge too late, much too late, that I too had loved, that I was capable of suffering and that I was human after all.
How can you feel privileged not to have something that everyone else has? I felt they were deceiving me.
ఆహార నిద్రా మైథునాలను మించి మనిషిని మృగంనుంచి వేరు చేసే ఒకే ఒక్క సాధనం 'కళ'. అంతవరకూ తన ఉనికిని కాపాడుకోవడం తప్ప మరో ధ్యేయంలేని ఆమెకు ఒక చోట విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. వినాశనాన్ని దాటుకుని మిగిలిన ఒక ఇంట్లో మానవ వైభవం తాలూకా చిహ్నాలు కనిపిస్తాయి. ఆ ఇంట్లో కనిపించిన పుస్తకాలూ, గృహోపకారణాలూ, చిత్రాలూ వంటి వాటిని చూసి మానవ మేథస్సుకి అబ్బురపడిన ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతాయి.
I was choked with admiration. I’d never seen anything so beautiful, because I’d never seen anything beautiful that was the work of a human hand. I had seen the beauty of the sky, the changing shapes of the clouds, softly falling rain; I had seen the slowly moving stars, and a few flowers, but here, I was seeing furniture, paintings hanging on the walls, vases, a small carving – but I shouldn’t be describing these things so precisely, because that first moment I saw only the interplay of lines, shapes and harmonious colours, an unfathomable configuration that completely overwhelmed me, and brought tears to my eyes because of the feeling of calm and tranquillity that reminded me of the women’s singing, in the past, when it rose up over the plain. The colours were beautifully in tune with each other, and harmonised with the volumes and dimensions of the room.
బంకర్లో అడవిమనిషుల్లా జీవితం, దాన్నుండి బయటపడిన తరువాత తిండీ,బట్ట కోసం ఒక బంకర్ నుండి మరో బంకర్ ను వెతుక్కుంటూ ఏళ్ళ తరబడి కొనసాగిన వారి ప్రయాణంలో ఆమెకు తోడుగా ఉన్న మిగతా స్త్రీలందరూ ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతుండగా చివరకు ఈ భూమిపై ఆమె ఏకాకి జీవితం ఎటువంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ. 1995 లో రాసిన ఈ నవలలో మూలకథలో ఉన్న వైవిధ్యం కథనంలో ఎక్కడా కనబడదు. బల్లపరుపు వర్ణనలతో కూడిన వాక్యనిర్మాణం పేజీలు త్వరాగా తిప్పనివ్వదు. ఆట్వుడ్ వర్ణనల్లో పదును ఈ రచనలో ఎక్కడా కనబడలేదు. అనువాద లోపమో, లేదా మూలమే ఈ విధంగా ఉందో చెప్పడం కష్టం కాబట్టి ఈ పుస్తకానికి ఐదుకి మూడు స్టార్లు ఇవ్వవచ్చు.
పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు :
I’d listened closely, and I was surprised at how much they had to say, the passion with which they repeated the same thing in ten different ways so as to avoid accepting that they’d had absolutely nothing to say to one another for ages. But human beings need to speak, otherwise they lose their humanity, as I’ve realised these past few years. And gradually, I began to feel sorry for those women determined to carry on living, pretending they were active and making decisions in the prison where they were locked up for ever, from which death was the only release – but would they remove the bodies? – and where they couldn’t even kill one another.
Oh! That first time I went up the stairs! When I think of it, my eyes fill with tears and I feel that compulsion, that surge of triumph. I think I’d be prepared to relive twelve years of captivity to experience that miraculous ascent, the wonderful certainty that made me so light that I flew up the hundred steps in one go, without stopping for breath, and I was laughing.
It wasn’t until we reached the ninth bunker that we found fabric, but already in the second, we’d found a packet of coffee. I’d never tasted coffee and I didn’t like it very much. I watched my companions shriek with delight and pleasure as they imagined the others’ joy when they returned with such a wonderful find, but I was unable to share their excitement.
I gazed at the ten houses in the village which I’d so enjoyed building. Behind the biggest one was the cemetery where I’d buried Anthea. Only now, I tell myself that what I’d felt for her, the trust that slowly built up, the constant preference for her company and the joy each time I was reunited with her after an expedition were probably what the women called love.
Anthea had taught me the alphabet and the rudiments of reading by drawing the letters in the sand. At the time, it bored her, because she couldn’t see what I would do with such knowledge, but I had insisted: there was too little to learn for me not to grasp at everything I could. I had words in my head for things I’d never seen, let alone touched, as I was now doing. I recognised the book at once and I was so overwhelmed that I felt almost giddy. I think that if I’d been standing, I’d have collapsed. I had in my hands the most precious of treasures, a spring from which to drink the knowledge of that world to which I would never have access.