న్యూయార్క్ రివ్యూ బుక్స్ క్లాసిక్స్ జర్మన్ రచయిత,తత్వవేత్త వాల్టర్ బెంజమిన్ రాసిన 'ది స్టోరీ టెల్లర్ ఎస్సేస్' కి కొత్త అనువాదాన్ని ప్రచురించింది..కొన్ని పుస్తకాలు చదవడం ఒక తరంలో సాంస్కృతిక వైశాల్యపు పరిథుల్ని పూర్తి స్థాయిలో అవలోకనం చెయ్యడంతో సమానం..అందుచేత ఈ నూట ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం చదవడానికి మధ్యలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ తో కలిపి నాకు ఒక వారం పట్టింది..ఇందులో వ్యాసాలన్నీ ప్రధానంగా స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ ఎందుకు అంతరించిపోతోంది ? స్టోరీ టెల్లింగ్ పై ప్రభావం చూపే అంశాలేమిటి ? రచయితల్లో సృజనాత్మకత లోపించడానికి,భావదారిద్య్రమునకు కారణాలేమిటి ? వంటి ప్రశ్నల చుట్టూ తిరుగుతాయి.
చెన్నై లో అన్నా సెంటినరీ లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేకించి స్టోరీ టెల్లింగ్ సెషన్స్ జరిగేవి..అక్కడ పిల్లలకు తీరుబాటు వేళల్లో కథలు చెప్పగలిగిన కళ తెలిసినవాళ్ళు వచ్చి కథలు చెప్తుండేవారు..కథకులు చక్కని హావభావాలతో ఎంతో ఉత్సాహంగా పిల్లలకు కథలు చెప్పడం నావరకూ నాకొక అద్భుతంగా తోచేది..అవకాశం ఉండేది కాదుగానీ రోజంతా అక్కడ కూర్చుని వాళ్ళ కథలు వినాలనిపించేది..జీవంలేని పుస్తకంలోని పేజీలతో ఏకపక్షమైన మౌన సంభాషణ కంటే ఓరల్ స్టోరీ టెల్లింగ్ లో అదనపు మానవీయ కోణం విస్మరించలేనిది.. ఒకానొకప్పుడు కథలు ఒక నోటి నుండి మరొక నోటికి చేరుతూ ఒక తరంనుండి మరో తరానికి సాంస్కృతిక వారసత్వం రూపంలో అందించబడేవి..ఈ ప్రక్రియలో శబ్దం,ఉఛ్ఛారణతో పాటు చేతులు,ముఖ కవళికల ద్వారా కథను అభినయిస్తూ చెప్పడంలో చెప్పేవారికీ వినేవారికి మధ్య ఒక సత్సంబంధం ఏర్పడుతుంది..తరువాత కథాకాలక్షేపాలూ,హరికథలూ,బుర్ర కథల్లాంటి కొన్ని పద్ధతుల ద్వారా ఇది కొనసాగినప్పటికీ పుస్తకాలు,ప్రచురణలు (టెక్స్ట్) వెలుగుచూశాక ఓరల్ స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ దాదాపు అంతరించిపోయిందని చెప్పవచ్చు.
ఇందులో నవలా ప్రక్రియతో పాటు జాతీయాల (సామెతలు) గురించి రాసిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి..మనుషులకు జీవితంలో నేర్చుకునే పాఠాల ద్వారా ఎదురైన వ్యక్తిగతానుభావాలను ప్రక్షాళన చేసుకునే అవకాశం చాలా తక్కువ..కానీ సామెతలు ఆ అనుభవాలకు స్పష్టమైన నిర్వచనాలనిస్తాయి.
మరో వ్యాసంలో నవలలు చదవడం గురించి రాస్తూ అన్ని పుస్తకాలనూ ఒకే విధంగా చదవకూడదంటారు..
రచనలు చెయ్యడంలో భావ దారిద్య్రం గురించి ప్రస్తావిస్తూ,నేటి తరం వారు అజ్ఞానులూ,అనుభవశూన్యులూ కాదని అభిప్రాయపడతారు వాల్టర్..నిజానికి మనుషులు నూతనమైన అనుభవాల్ని ఆశిస్తున్నారా ? అంటే లేదంటారాయన..నేటి తరం రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనుషుల్నీ,సంస్కృతినీ,చరిత్రనూ అన్నిటినీ జీర్ణించుకుని చివరకు వివిధ సాంస్కృతిక పరమైన వత్తిడుల క్రింద ఊపిరాడకుండా నలిగిపోతుందంటారు..తత్పరిణామంగా వారు నూతనమైన అనుభవాలనుంచి దూరంగా జరుగుతున్నారనేది వాల్టర్ వాదన..కథా సంస్కృతి అంతరించిపోవడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్పుకొస్తారాయన.
No one feels the sting of Scheerbart’s words more than they: “You are all so tired—and the only reason is that you do not focus all your thoughts on a very simple but very magnificent plan.”
Didn’t everyone notice at the end of the war that men returned from the battlefield completely mute, not richer in experiences they could share, but poorer?
ఈ వ్యాసాల చివర్లో Johann Peter Hebel,Ernst Bloch,Paul Valéry,Georg Lukács,Herodotus లాంటి వారి కొన్ని కథలూ,ఆ కథల్లో శైలిని గూర్చిన ఆసక్తికరమైన పలు విశ్లేషణాలు ఉన్నాయి..ఈ పుస్తకంలో విసిగించిన విషయమేంటంటే ఎడిటింగ్ బాగాలేదు..ఈ పుస్తకం NYRB వారి ప్రచురణ అంటే కాస్త ఆశ్చర్యం వేసింది..ఎడిటింగ్ విషయంలో ఇంతటి దీనావస్థ వారి పుస్తకాల్లో మునుపెప్పుడూ చూసింది లేదు..ఇందులో గ్రీక్ స్టోరీ టెల్లర్ హేరోడోటస్ కథ నాలుగు సార్లు రిపీట్ అవ్వడం,చెప్పిన అంశాలే మళ్ళీ మళ్ళీ చెప్పడంలాంటివి ఎడిటర్ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు,
Image Courtesy Google |
Thus it is the voice of a born storyteller we hear opposing the novelist when we read: “Nor will I speak of the fact that I consider it useful . . . to liberate the epic from the book, useful above all with regard to language. The book is the death of real language. The most vital creative forces of language escape the epic poet who only writes.”
On the other hand, with the dominance of the middle class—for which the press is one of the most essential instruments in the era of fully fledged capitalism—a form of communication comes into play, which, however ancient its origins, had never before influenced the epic form in a decisive way.మరి కథలు చెప్పగలిగే సామర్థ్యం ఎవరికుంటుంది ! తమ జీవిత కాలంలో ఎప్పుడూ 'బోర్ డమ్' ఎరుగని వాళ్ళెవరూ కథలు చెప్పలేరంటారు వాల్టర్..మరి ఇప్పుడు కథలకు తీవ్రమైన కొరత రావడానికి కారణం మన జీవితాల్లో ఈ బోర్డమ్ కు స్థానం లేకపోవడమేనేమో..ఒకప్పుడు పొలాల్లో పని చేస్తూనో,మగ్గం నేస్తూనో,నీళ్ళు తోడుతూనో,చెరువు గట్టున బట్టలుతుకుతూనో,వుడ్ వర్క్ చేస్తూనో,హ్యాండీ క్రాఫ్ట్స్ తయారు చేస్తూనో ఇలా అనేక శారీరకమైన పనులు చేస్తూ అలసటలో ఆటవిడుపుగా ఒకరికొకరు కథలు చెప్పుకునేవారు..అదే యాత్రికులు ఎదురైతే సుదూరప్రాంతాల సంగతులను అతడి చుట్టూ చేరి అమితాశ్చర్యంతో వినేవారు..ఇప్పుడు గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం మొత్తానికి సంబంధించిన సమాచారం నట్టింట్లో దొరికేస్తోంది..ఎంత 'No man is an Island' అనుకున్నా ఈరోజుల్లో డబ్బుంటే చాలు సాటి మనిషితో అవసరంలేని జీవన శైలి అమలులోకి వచ్చింది..మనిషిలో భావోద్వేగాలను ఒక్క కుదుపు కుదిపి లేపే మృత్యువు,వ్యాధులు వంటివి ఒక తరానికి దైనందిన జీవితంలో అత్యంత సహజమైనవి..ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ మరణాన్ని చూడని గదులు చాలా అరుదంటారు వాల్టర్..కానీ ఈరోజుల్లో మనుషులు మృత్యువు ఛాయలు పడని గదుల్లో నివసిస్తున్నారు..తుదిదశకు చేరిన తరువాత శానిటోరియంలోనో,హాస్పిటల్లోనో విడిచే శ్వాసలే ఎక్కువ..అశాశ్వతాన్నీ,వికారాన్నీ,అస్థిరత్వాన్నీ,ఏకాంతాన్నీ ఆమడ దూరంలో పెట్టి నలుగురి మెప్పు కోసం,నలుగురి మధ్యలో ఊపిరాడని బిజీ జీవితాలతో భోగలాలసత్వానికి అలవాటుపడిన ఆధునిక తరంలో కథలు సృష్టించడానికి అవసరమైన సృజనాత్మకత అడుగంటా అంతరించిపోవడానికి వేరే కారణాలు అక్కర్లేదు..జీవితాన్ని ఏ రంగుటద్దాల ఆసరా లేకుండా దాని పూర్తి స్వాభావికమైన స్వరూపంలో చూసే శక్తి ఈ తరానికి లేదు..ఇది నిజానికి అన్నిటికంటే అతి పెద్ద మానవ వైఫల్యం.
Let us admit it: our poverty of experience is not only an impoverishment of private experience but of human experience as a whole. It is, therefore, a new kind of barbarism.
Boredom is the dream bird that broods the egg of experience. A rustling in the leaves is enough to scare it away. Its nests—those activities intimately connected to boredom—have already died out in the cities and are declining in the countryside as well. With them, the gift of listening is being lost, and the community of listeners is disappearing.“No one dies so poor that he does not leave something behind,” అంటారు Pascal..కటిక పేద కూడా చివరకు ఈ భూమ్మీద తనవైన కొన్ని జ్ఞాపకాలైనా మిగిల్చి వెళ్తాడు..కానీ ఆ జ్ఞాపకాలకు వారసత్వం దొరకడమే కష్టం..ఇలాంటి వారసత్వాన్ని నవలా రచయిత అందిపుచ్చుకుంటాడు..వివేకశూన్యత (the epic side of truth, that is, wisdom ) వల్ల కథా సంస్కృతి ఒకవైపు తెరమరుగైపోతున్నప్పటికీ అదృష్టవశాత్తూ నవలా నిర్మాణంలో కీలకమైన బిల్డంగ్స్రోమన్ ప్రక్రియ మాత్రం ఇంకా అంతరించిపోలేదు..జననమరణాల మధ్య మనిషి తాత్విక,ఆధ్యాత్మిక ప్రయాణానికి దారులు ఏర్పరుస్తూ మనిషి వ్యక్తిగతాభివృద్ధిపై ప్రభావాన్ని చూపే ఆర్ధిక,సామాజిక,రాజకీయ,నైతిక పరమైన అంశాలు ఇప్పటికీ కంచుకోటలా నవలాప్రక్రియను ముందుకు నడిపిస్తున్నాయంటారు వాల్టర్.
ఇందులో నవలా ప్రక్రియతో పాటు జాతీయాల (సామెతలు) గురించి రాసిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి..మనుషులకు జీవితంలో నేర్చుకునే పాఠాల ద్వారా ఎదురైన వ్యక్తిగతానుభావాలను ప్రక్షాళన చేసుకునే అవకాశం చాలా తక్కువ..కానీ సామెతలు ఆ అనుభవాలకు స్పష్టమైన నిర్వచనాలనిస్తాయి.
Proverbs turn knowledge gained from experience into a wave in the endless, breathing chain of life lessons that come to us from eternity.ఇందులో ఎపిక్ (పురాణము,గాథ,చరిత్ర,కథ) గురించి రాస్తూ నవలాకారుడికీ,కవికీ ఉన్న భేదాన్ని వివరించిన సందర్భం ఒకటుంది,
నిజానికి సముద్రాన్ని మించిన ఎపిక్ లేదు..అనంతమైన సముద్రానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు..ఉదాహరణకు కొందరు సముద్రతీరంలో విశ్రాంతి తీసుకుంటారు,అలలఘోషను శ్రద్ధగా వింటారు,అలలతో పాటుగా తీరానికి కొట్టుకొచ్చిన గవ్వలు ఏరుకుంటారు..ఇది కవి చేసే పని..మరికొందరు అనేక కారణాల వల్ల,లేక ఏ కారణమూ లేకుండానే సముద్రయానం చేస్తారు..కనుచూపుమేరలో తీరం కనిపించని చోట సముద్రం మధ్యలో కేవలం సముద్రతరంగాలు,ఆకాశం,నక్షత్రాలు మాత్రమే కనిపించే చోట్లకు ప్రయాణిస్తారు..ఇది నవలాకారుడు చేసే పని..ఈ ప్రక్రియలో అతడు పూర్తి ఒంటరి..మౌని.కథలు అంతరించిపోవడానికి వార్తాపత్రికలు,మీడియా చేసే చేటు కూడా విస్మరించలేనిది..వాల్టర్ బెంజమిన్ నౌకా ప్రయాణంలో ఎదురైన ఒక స్టోరీ టెల్లర్ కెప్టెన్ O..ఆయనెప్పుడూ వార్తాపత్రిక చదవగా చూడలేదంటారు వాల్టర్..అదేమని అడిగితే వార్తా పత్రిక చదవడం వల్ల నువ్వు ఏదీ నేర్చుకునే అవకాశం లేదంటారు కెప్టెన్ O..మితిమీరిన వివరణలు కథకు బలాన్నివ్వవు సరికదా కథలో చెప్పదల్చుకున్న అంశాన్ని క్షీణింపజేస్తాయి..ఈ క్రమంలో వివరణలకు దూరంగా ఉండే కథల ఆవశ్యకతను గురించి రాస్తూ హెరోడోటస్ 'హిస్టరీస్' లో కథను ఇందులో పలుమార్లు ప్రస్తావించారు.
“They always want to explain everything to you.” Indeed: isn’t half the art of journalism keeping your reports free of explanation? And didn’t the ancients set an example for us by presenting events dry, so to speak, drained of all psychological motivation and any opinion whatsoever? In any case, one has to admit that the captain kept his own stories free of any superfluous explanations, and it seemed to me that they lost nothing as a result.కథలకు స్వస్థత చేకూర్చే శక్తులున్నాయని రుజువు చేసే క్రమంలో జర్మన్ లో పురాతనమైన స్టోరీ టెల్లింగ్ సంస్కృతి అయిన Merseburg incantations ను ప్రస్తావించారు..ఉదాహరణకు మెర్స్బర్గ్ ఛార్మ్స్ లో నార్స్ మైథాలజీలో పాగన్స్ (వైకింగ్స్ etc) యొక్క దేవుడు ఓడిన్ మంత్రాలను కేవలం ప్రస్తావించి ఊరుకోరు..అతడు ఆ మంత్రాలను ఎటువంటి సందర్భంలో,ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో సహేతుకమైన వివరణలు కూడా ఇస్తారు..ఇది ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట తన బాధను వివరించడం లాంటిదేనంటూ దానిని స్వస్థతకు మొదటి అడుగుగా అభివర్ణిస్తారు వాల్టర్.
మరో వ్యాసంలో నవలలు చదవడం గురించి రాస్తూ అన్ని పుస్తకాలనూ ఒకే విధంగా చదవకూడదంటారు..
నవలల్ని ఎంపతీ తో చదవకూడదు,వాటిని ఆవురావురుమంటున్న ఆకలితో తినేసి జీర్ణం చేసేసుకోవాలి..హీరో స్థానంలో పాఠకుడు తనను తాను ఊహించుకోనక్కర్లేదు. రుచీపచీలేని పచ్చిగా ఉన్న ఆహార పదార్ధాల్ని తిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం..నవల అటువంటి మ్రింగుడు పడని పచ్చి వాస్తవాలకు అనేక స్పైసెస్ జోడించి దానిని తినడానికి అనువుగా మారుస్తుంది.ఫ్లాబర్ట్ తన రచనల్లో రిథమిక్ పర్ఫెక్షన్ ని పరీక్షించుకోడానికి తన వాక్యాలను తానే పైకి బిగ్గరగా చదువుకునేవారట..అందుకే ఆయన వాక్యాలు ఒకదానికొకటి కట్టుదిట్టమైన ఇటుకలతో కట్టిన గోడలా ఉంటాయంటారు..
Nothing more was needed to establish the cult of “construction” with its echoes of sonorous “prosody,” all very much to the advantage of ambitious impotence. But if the novel is a structure, it is less like one designed by an architect than like logs stacked in the fireplace by the maid. It is not meant to be durable but to burn brightly.ఈ పుస్తకంలో అడుగంటిపోతున్న మానవీయ అనుభవాలను గురించిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది..అదే Paul Scheerbart 'గ్లాస్ ఉటోపియా'..“Every object I want to own becomes opaque to me.” అంటారు André Gide..ఒక సగటు మనిషి ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లోకి అడుగుపెట్టినప్పుడు అక్కడకు వచ్చిన అపరిచిత వ్యక్తికి అక్కడ "ఇక్కడ నీకేమీ పని లేదు" అని చెప్పకనే చెపుతున్న నలిగిన సోఫా కవర్లు,దుమ్ము పేరుకున్న కిటికీ ఊచలు,సగం సగం తాగి పెట్టిన కాఫీ కప్పూ,సగం సగం చదువుతూ పేజీ మడత పెట్టిన సగం తెరిచిన పుస్తకంలాంటివన్నీ స్వాగతం పలుకుతాయి..అటువంటి ఇంట్లో యజమాని దైనందిన జీవితపు ముద్రలు పడని స్థానమంటూ ఉండదు..అక్కడ నూతనత్వానికి అవకాశం చాలా తక్కువ..మానవ జీవితంలో సింహభాగం మూసుకుపోయిన నాలుగ్గోడల మధ్యే గడిచిపోతుంది..ఈ కారణంగా అత్యంత విలువైన మానవీయ అనుభవాన్నికోల్పోతున్నామని జర్మన్ రచయితా,ఆర్కిటెక్ట్ అయిన Paul Scheerbart అభిప్రాయపడతారు..ఈ మొనాటనీ ని ఎదుర్కోడానికి ఆయన 'గ్లాస్ ఉటోపియా' ను ప్రతిపాదించారు..దాని ప్రకారం ఇటుకలతో కట్టిన గోడలన్నీ గ్లాస్ తో పునఃనిర్మించాలని ఆయన సూచించారు..సూర్యోదయాలు,సూర్యాస్తమయాలూ,ఆకాశంలో నక్షత్రాలతో సహా ఇటువంటి ఇళ్లు మానవీయ అనుభవానికి మనల్ని దగ్గర చేస్తాయని ఆయన భావన..ఆచరణయోగ్యమా కదా అన్న విషయం ప్రక్కన పెడితే ఈ సూచన ఆసక్తికరంగా అనిపించింది.
Brecht had a fine phrase that will help us get away, far away: “Erase all traces!” is the refrain in the first poem of “A Reader for Those Who Live in Cities."కథలకు ముడిసరుకు అనుభవం..కానీ ఇన్ని రంగులున్న ప్రపంచంలో ఏ తరంలోనైనా ఈ అనుభవలేమికి కారణాలేమిటి అన్న ఆలోచన కలిగింది..నిరంతరాన్వేషి అయిన మనిషి నూతన అనుభవాలకు దూరంగా జరుగుతున్నాడా ? బహుశా కాదేమో..అతడు అలిసిపోయి ఉంటాడు..రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన అంతులేని విషాదం,క్రూరత్వం,దానికి తోడు సాంస్కృతికపరమైన వత్తిడులు,నిరంతరం ఊపిరాడకుండా ప్రపంచం నలుమూలల్నుంచీ వచ్చి ముంచెత్తుతున్న సమాచారం వీటన్నిటి నడుమా నేటి తరం మనిషి కొత్త అనుభవాలు మిగిల్చే అడ్రినలిన్ రష్ కంటే శాశ్వతమైన శాంతిని కోరుకుంటున్నాడు..కానీ శాంతి ఉన్న చోట సృజనాత్మతకు,ఊహాత్మకతకూ స్థానం లేదు..ఇక కథలు పుట్టే అవకాశం అస్సలే లేదు..
రచనలు చెయ్యడంలో భావ దారిద్య్రం గురించి ప్రస్తావిస్తూ,నేటి తరం వారు అజ్ఞానులూ,అనుభవశూన్యులూ కాదని అభిప్రాయపడతారు వాల్టర్..నిజానికి మనుషులు నూతనమైన అనుభవాల్ని ఆశిస్తున్నారా ? అంటే లేదంటారాయన..నేటి తరం రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనుషుల్నీ,సంస్కృతినీ,చరిత్రనూ అన్నిటినీ జీర్ణించుకుని చివరకు వివిధ సాంస్కృతిక పరమైన వత్తిడుల క్రింద ఊపిరాడకుండా నలిగిపోతుందంటారు..తత్పరిణామంగా వారు నూతనమైన అనుభవాలనుంచి దూరంగా జరుగుతున్నారనేది వాల్టర్ వాదన..కథా సంస్కృతి అంతరించిపోవడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్పుకొస్తారాయన.
No one feels the sting of Scheerbart’s words more than they: “You are all so tired—and the only reason is that you do not focus all your thoughts on a very simple but very magnificent plan.”
Didn’t everyone notice at the end of the war that men returned from the battlefield completely mute, not richer in experiences they could share, but poorer?
ఈ వ్యాసాల చివర్లో Johann Peter Hebel,Ernst Bloch,Paul Valéry,Georg Lukács,Herodotus లాంటి వారి కొన్ని కథలూ,ఆ కథల్లో శైలిని గూర్చిన ఆసక్తికరమైన పలు విశ్లేషణాలు ఉన్నాయి..ఈ పుస్తకంలో విసిగించిన విషయమేంటంటే ఎడిటింగ్ బాగాలేదు..ఈ పుస్తకం NYRB వారి ప్రచురణ అంటే కాస్త ఆశ్చర్యం వేసింది..ఎడిటింగ్ విషయంలో ఇంతటి దీనావస్థ వారి పుస్తకాల్లో మునుపెప్పుడూ చూసింది లేదు..ఇందులో గ్రీక్ స్టోరీ టెల్లర్ హేరోడోటస్ కథ నాలుగు సార్లు రిపీట్ అవ్వడం,చెప్పిన అంశాలే మళ్ళీ మళ్ళీ చెప్పడంలాంటివి ఎడిటర్ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు,
This new form of communication is information.
Leskov was a master at this (think of stories like “The Deception” or “The White Eagle".Extraordinary and miraculous events are recounted with great precision, but the psychological context is not forced on the reader. He is left the freedom to interpret the situation as he understands it, and the story thus acquires a breadth that information lacks.
Telling stories, after all, is the art of retelling those we have heard, and that is lost when stories are no longer remembered. They are being lost because no one spins or weaves any longer while listening to them. The more self-forgetful the listener, the deeper what is heard is inscribed in him. When he is caught up in the rhythm of his work, he listens to the stories in such a way that the art of telling them descends on him of its own accord. In this way, the web is woven in which the gift of storytelling is embedded. Today this web is unraveling on all sides after having been woven thousands of years ago in the domain of the oldest forms of craftsmanship.
Few lines come closer to expressing the meaning of this important story than those written by Paul Valéry in a completely different context. “The artist’s observation can achieve an almost mystical profundity,” he writes in reflections on the artist [Camille Corot]:The objects illuminated by it lose their names: light and shadows create very particular systems and problems that do not depend on any science or relate to any practice, but are given their existence and value exclusively from certain special accordances between the soul, the eye, and the hand of one born to spot them in his inner self and reproduce them.
Lovers unbearable passion : I am miserable, indeed, deprived of all my senses. As soon as I catch sight of you, Lesbia, I lose my reason and cannot utter a word; my tongue freezes; a slender flame spreads through my limbs, my ears ring and darkness covers my eyes.
All passions that can be relished and digested are necessarily mediocre ones.