ప్రపంచీకరణ వలన అనేకమైన లాభాలతో పాటు ఒక పూడ్చలేని నష్టం కూడా జరిగింది..అదేమిటంటే అది మనిషికీ-మనిషికీ ప్రత్యేకంగా ఉండే సాంస్కృతిక మూలాలను వ్రేళ్ళతో సహా పెకలించివేసింది..మనుషులు ఏళ్ళ తరబడి ఒకే ప్రాంతానికి పరిమితమై నివసించడం వల్ల వాళ్ళకి ఆ ప్రాంతపు సంస్కృతీ సంప్రదాయాలూ,వేషభాషలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది..అటువంటి అనుబంధం ఉన్నవాళ్ళు పొట్టకూటికోసం రెక్కలుకట్టుకుని ప్రపంచంలో ఏ మారుమూలకు వలస పోయినా,తిరిగి తన సొంత గూటిని వెతుక్కుంటూ వెనక్కిరావడానికి తపిస్తారు..గ్లోబలైజేషన్ ఈ తరానికి ఆ అనుభవాన్ని మెల్లిమెల్లిగా దూరంచేస్తోంది..ఒకప్రక్క 'జగమంత కుటుంబం' నీదని భరోసా ఇస్తూనే మనిషి ఉనికికి కీలకమైన మూలాలనుండి అతడిని దూరం చేసింది..మనిషి అస్తిత్వాన్ని నిర్వచించడంలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుంది..అనేక భాషలు,సంస్కృతులు సొంతం చేసుకునే క్రమంలో ఈతరం మనిషి,ప్రత్యేకించి తనవైన సాంస్కృతిక మూలాలు బలహీనపడుతుండగా,తెగిన గాలిపటంలా ఒక 'belongingness' కోసం తపిస్తున్నాడు..ఇండియన్-అమెరికన్ రచయిత్రి ఝంపా లహిరి నాన్ ఫిక్షన్ రచన 'In Other Words' లో ఈ తపనే కనిపిస్తుంది.
చాలా ఏళ్ళ క్రితం పులిట్జర్ ప్రైజ్ గ్రహీత ఝంపా లహిరి 'Interpreter of Maladies' చదివాను,అప్పట్లో ఎందుకో ఆవిడ శైలి పెద్దగా రుచించక పోవడంతో లహిరి ఇతరత్రా రచనల జోలికి వెళ్ళలేదు..మళ్ళీ ఇంతకాలానికి ఆవిడ నాన్ ఫిక్షన్ రచన 'In Other Words' చదవడం తటస్థించింది..ఝంపా లహిరి మాతృభాష బెంగాలీ అయినప్పటికీ అమెరికాలో పూర్తి ఆంగ్ల మాధ్యమంలో చదువు ఆమెకు మాతృభాషపై ఆధిపత్యాన్ని కట్టబెట్టడంలో విఫలమైంది..దీనికి తోడు తమ భాషను సజీవంగా ఉంచుకోవాలనే ఆరాటంతో ఇంట్లో బెంగాలీ మాత్రమే మాట్లాడాలని తల్లితండ్రులు పెట్టిన నియమం తన ఉనికిని రెండుగా చీల్చిందంటారు ఝంపా..తనకు 'బెంగాలీ' తల్లి లా అనిపిస్తే,'ఇంగ్లీష్' సవతి తల్లిలా అనిపించేదంటారు..ఇంగ్లీష్ భాషపై ఆమెకు మంచి పట్టున్నప్పటికీ అది ఆమెకు పరాయి భాష క్రిందే లెక్ఖ..ఈ రెండు ఐడెంటిటీలతో సతమవుతున్న సమయంలో ఇటాలియన్ పై ఆమెకున్న అబ్సెషన్ ఆమె అస్తిత్వంలో మూడో పార్శ్వానికి తెరతీసింది..ఆంగ్లంలో సాధికారకమైన రచనలు చేసిన ఝంపా,ఇటాలియన్ భాష పై ఉన్న మక్కువ కారణంగా ఆ భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు..ఇటాలియన్ రచయిత 'సెజారే పవేసే' లా ఇటాలియన్ లో రచనలు చెయ్యాలని కలలు కనేవారు..ఒక సమయంలో తన నివాసాన్ని సైతం రోమ్ కి మార్చుకుని ఇటాలియన్ భాషపై ఆమె ఏ విధంగా పట్టు సాధించారన్నది ఈ పుస్తకం సారాంశం..'In Other Words' ఝంపా లహిరి ఇటాలియన్ లో రాసిన తొలి రచన..ఒక పరాయి భాషను నేర్చుకునే క్రమంలో రచయితలు ఎదుర్కునే సంఘర్షణల్నీ,అనుభవాల్నీ ఈ అందమైన పుస్తకంగా మలిచారు ఝంపా..ఇంగ్లీష్ లో రచయిత్రిగా స్థిరపడ్డాక కూడా ఇటాలియన్ లో రచనలు చెయ్యాలనే తలంపు ఎందుకొచ్చిందీ అంటే : "ఒక ఆర్టిస్టుకి తనను తాను నిరంతరం వైవిధ్యంగా ఆవిష్కరించుకోవాలనే తపన ఉంటుంది,ఈ క్రమంలో తనను ఎప్పటికప్పుడు కొత్తగా అభివ్యక్తీకరించుకోవడానికి నూతన ప్రయోగాలు చేస్తూ తన తీరుని మార్చుకుంటూ వెళ్తాడు,ఇదీ అంతే" అంటారు..పెస్సోవా అనేక హెటెరోనిమ్స్ ద్వారా నిరంతరం తన ఉనికిని మార్చుకున్న తరహాలోనే,తన అస్తిత్వంలో భాగమైన ఇంగ్లీష్,బెంగాలీ భాషల్ని కాదని ఇటాలియన్ లో రచనలు చెయ్యడం,తన అస్తిత్వానికి కొత్తరూపునిచ్చే ప్రయత్నమే అంటారు.
As I went through the show, I recognized an artist who at a certain point felt the need to change course, to express himself differently. Who had the mad impulse to abandon one type of vision, even a particular creative identity, for another. I thought of my writing in Italian: a similarly intricate process, a similarly rudimentary result compared with my work in English. Writing in another language represents an act of demolition, a new beginning.
ఈ పుస్తకంలో అడుగడుగునా ఝంపా లహిరి కి ఇటాలియన్ భాషపై ఉన్న అబ్సెషన్ స్పష్టంగా కనిపిస్తుంది.ఒక పరాయి భాషపై ఈ రకమైన అబ్సెషన్ సాధ్యమేనా అంటే సాధ్యమే అంటాను నేను..నాకు ఊహ తెలిసినప్పటినుండీ బ్రిటిష్ రూరల్ కల్చర్ పై ఉన్న అబ్సెషన్ దాదాపు ఇటువంటిదే..నిర్వచనాలకందని వ్యామోహమది..విచిత్రంగా నాకు అస్సలు పరిచయం లేని సంస్కృతితో చిన్నప్పటినుండీ ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించేది..వారి వేషభాషలతో,సంప్రదాయాలతో ఏ పూర్వ జన్మలోదో అనిపించే సాన్నిహిత్యం,కానీ నా జ్ఞాపకాల దొంతరల్లో ఛాయామాత్రంగా కనిపించే ఆ సంస్కృతి తాలూకా నీడలు మాత్రం వాస్తవం..ఆరో క్లాసు చదువుతున్నప్పుడు జేన్ ఆస్టిన్ పెంబర్లీ ఎస్టేట్ ని పెయింట్ చేసి దాచుకున్న జ్ఞాపకాలు నా ఈ అబ్సెషన్ కి సాక్ష్యాలు.
What do I recognize? It’s beautiful, certainly, but beauty doesn’t enter into it. It seems like a language with which I have to have a relationship. It’s like a person met one day by chance, with whom I immediately feel a connection, of whom I feel fond. As if I had known it for years, even though there is still everything to discover. I would be unsatisfied, incomplete, if I didn’t learn it. I realize that there is a space inside me to welcome it.
I feel a connection and at the same time a detachment. A closeness and at the same time a distance. What I feel is something physical, inexplicable. It stirs an indiscreet, absurd longing. An exquisite tension. Love at first sight.
ఝంపా లహిరి ఇటాలియన్ భాషను నేర్చుకునే క్రమంలో తన అనుభవాలను అందమైన మెటాఫోర్లుగా మార్చి ఈ పుస్తకాన్ని రాశారు..ఇందులో అత్యంత సన్నిహితమైన వర్ణనలు 'Cultural deprivation' విషయంలో దాదాపూ ప్రతీ మనిషీ ఎదుర్కునే సంఘర్షణలకు అద్దంపడతాయి.
I’ve come for a week, to see the buildings, to admire the squares, the churches. But from the start my relationship with Italy is as auditory as it is visual. Although there aren’t many cars, the city is humming. I’m aware of a sound that I like, of conversations, phrases, words that I hear wherever I go. As if the whole city were a theater in which a slightly restless audience is chatting before the show begins.
ఒక ప్రదేశంలో నాటిన చిన్న మొక్క తన లేలేత వ్రేళ్ళను మెల్లిగా విస్తరించుకుంటూ సరిగ్గా మట్టితో అనుబంధం పెనవేసుకునే సమయంలో దాన్ని వ్రేళ్ళతో సహా పెకలించివేసి తీసుకెళ్ళి మరో ప్రదేశంలో పూర్తి వైవిధ్యమైన వాతావరణంలో నాటినప్పుడు అది జీవసహజమైన సర్వైవల్ ఇన్స్టింక్ట్ తో ఆ మార్పును తట్టుకుని జీవిస్తుంది గానీ దాని మూలాలు మాత్రం తీవ్రంగా బలహీనపడతాయి..మా తిలక్ పుట్టినప్పటినుండీ మూడు రాష్ట్రాల్లో ఉండడంతో ఈ పదేళ్ళలో ఇంగ్లీష్ తో పాటుగా మరో మూడు భాషలైన తెలుగు,తమిళం,మలయాళంలను కూడా own చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది..ఒక భాష కాస్త వస్తోంది అనుకోగానే మరో రాష్ట్రానికి వలస పోవాల్సొచ్చేది..ఈ కారణంగా నాలుగు భాషలొచ్చినప్పటికీ వాడికి ఇంగ్లీష్ తప్ప మరే ప్రాంతీయ భాషా వ్యాకరణసహితంగా,లోతుగా రాదు..దక్షిణ భారతంలో నాలుగు విడి విడి భాషల్ని కలిపి ఖిచిడీ వండి వాడు మాట్లాడే భాష మన భిన్నత్వంలో ఏకత్వానికి చిరు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది..ఇక విదేశాల్లో ఉన్న పిల్లల సంగతి సరేసరి..వాళ్ళు ఈ 'కల్చరల్ క్లాష్' ని మరింత తీవ్రంగా ఎదుర్కుంటారు..గ్లోబలైజేషన్ కారణంగా ఈ తరంలో పిల్లలకు మాతృభాషతో అనుబంధం ముడిపడే అవకాశాలు బలహీనపడుతున్నాయి..ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక సామజిక అవసరంగానూ ,ఇతరత్రా భాషలు నేర్చుకోవడం ఒక లగ్జరీగానూ మారిపోయింది..ప్రాంతీయ భాషల్ని భాష మీద ప్రేమతో,మక్కువ కొద్దీ నేర్చుకోవాలి తప్ప నిజానికి వాటి అవసరం నేటి సమాజంలో ప్రశ్నార్థకమే !
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
The unknown words remind me that there’s a lot I don’t know in this world.
At the end of the day the basket is heavy, overflowing. I feel loaded down, wealthy, in high spirits. My words seem more valuable than money. I am like a beggar who finds a pile of gold, a bag of jewels.
Even though I now speak the language fairly well, the spoken language doesn’t help me. A conversation involves a sort of collaboration and, often, an act of forgiveness. When I speak I can make mistakes, but I’m somehow able to make myself understood. On the page I am alone. The spoken language is a kind of antechamber with respect to the written, which has a stricter, more elusive logic.
Why do I write? To investigate the mystery of existence. To tolerate myself. To get closer to everything that is outside of me.
Because in the end to learn a language, to feel connected to it, you have to have a dialogue, however childlike, however imperfect.
I’ve been writing since I was a child in order to forget my imperfections, in order to hide in the background of life. In a certain sense writing is an extended homage to imperfection. A book, like a person, remains imperfect, incomplete, during its entire creation. At the end of the gestation the person is born, then grows, but I consider a book alive only during the writing. Afterward, at least for me, it dies.
All my life I wanted to see, in the frame, something specific. I wanted a mirror to exist inside the frame that would reflect a precise, sharp image. I wanted to see a whole person, not a fragmented one. But that person wasn’t there. Because of my double identity I saw only fluctuation, distortion, dissimulation. I saw something hybrid, out of focus, always jumbled.
I think that not being able to see a specific image in the frame is the torment of my life. The absence of the image I was seeking distresses me. I’m afraid that the mirror reflects only a void, that it reflects nothing.
As I said, I believe that reading in a foreign language is the most intimate way of reading.
Image Courtesy Google |

"నిజానికి నాకు ఇటాలియన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.నేను ఇటలీలో నివసించను,నాకు ఇటాలియన్ మిత్రులూ లేరు..నాకున్నది నేర్చుకోవాలనే పిచ్చి కోరిక మాత్రమే..అనేక ప్యాషనేట్ రిలేషన్షిప్స్ లో లాగే భాషపట్ల నా ఈ వ్యామోహం కూడా ఒక ఆరాధనగా,ఒక అబ్సెషన్ గా రూపాంతరం చెందింది..నాలో ఎప్పుడూ ఒక అస్థిరమైన,అవ్యక్తమైన భావన ఏదో ఉంటూ వచ్చింది..నేను ప్రేమలో ఉన్నాను,కానీ నేను ప్రేమించిన దానికి నా ఉనికి ఎంతమాత్రమూ పట్టదు..ఎందుకంటే ఆ భాషకు నా అవసరం లేదు."
"నాకు పరాయిభాషలో చదవడం ఇంగ్లీష్ లో చదవడం కంటే మరింత సన్నిహితంగా అనిపిస్తుంది..ఎందుకంటే ఆ పరాయి భాషకూ నాకూ బహుస్వల్పకాల పరిచయం..మేమిద్దరం ఒకే ప్రాంతానికి చెందినవారం కాదు,ఒకే కుటుంబానికి చెందినవారం అంతకంటే కాదు..మేము కలిసిమెలిసి పెరగలేదు..ఈ భాష నా రక్తంలోనూ,నా మూలుగుల్లోనూ లేదు..నాకు ఆ భాషంటే ఆకర్షణా,భయమూ రెండూను..నా దృష్టిలో ఆ భాష ఒక ప్రియమైన రహస్యంగా మిగిలిపోయింది..నా భావోద్వేగాలకు అది ప్రతిస్పందించదు."
"మనుషులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే మాతృభాషకి దూరంగా ఉన్నప్పుడు దాన్ని బ్రతికించుకోడానికి చెయ్యగలిగినదంతా చేస్తారు..ఎందుకంటే పదాలు గతాన్ని పునరావృతం చేస్తాయి : ప్రాంతం,మనుషులు ,జీవితం,వీధులు ,వెలుతురు,ఆకాశం,పువ్వులు,ధ్వనులు ఇవన్నీ భాషలో జీవం పోసుకుంటాయి..నువ్వు నీ సొంత భాషకి దూరంగా జీవిస్తున్నప్పుడు అస్తిత్వలేమితో తేలికైపోతావు,అదే సమయంలో ఆ లేమి తాలూకా భారాన్ని కూడా నీవు మోయలేవు..నీవున్న ఉపరితలానికి సంబంధంలేని ఎత్తులో మరో క్రొత్త మిశ్రమాలతో కూడిన గాలిని శ్వాసిస్తావు..కానీ నీకెప్పుడూ ఆ తేడా అనుభవమవుతూనే ఉంటుంది."
"నేనొక రచయిత్రిని: నా ఉనికిని భాషలోనే వెతుక్కుంటాను,నా పని భాషతోనే..అయినప్పటికీ ఒక కంటికి కనిపించని గోడ ఏదో నన్ను దూరం పెడుతుంది,నా నుండి నన్ను వేరు చేస్తుంది..అనివార్యమైన ఈ అడ్డుగోడ నేను వెళ్ళిన చోటుకల్లా నాతో పాటు వస్తుంది..ఒక్కోసారి బహుశా ఆ గోడ నేనేనేమో అనిపిస్తుంది..ఆ గోడను పగులగొట్టి,నన్ను నేను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించుకోడానికే నేను రాస్తాను..నా రూపానికీ,నా పేరుకీ నా రచనతో సంబంధం లేదు..ఎటువంటి వడపోతలూ,విచారణా లేకుండా ఒక అదృశ్యం రూపంలో నేను కనబడకుండా వినబడతాను..ఆ క్రమంలో నేను నా అక్షరాలుగా మారిపోతాను,నా అక్షరాలు నాలా మారిపోతాయి."ఈ పుస్తకాన్ని ఒక జియోగ్రఫిక్ రచన కంటే ఒక ట్రావెలోగ్ గా చూడాలంటూ,ఈ పుస్తకాన్ని అనేక రకాలుగా నిర్వచించారు..
"ఈ రచన నా ఉనికిని వ్రేళ్ళతో సహా పెకలించివేసిన ఒక జ్ఞాపకం..ఒక అస్థిమితత్వం,ఒక కొత్త ఆవిష్కరణ...కొన్ని సార్లు ఆసక్తి గాను,మరి కొన్నిసార్లు అలసటగానూ అనిపించే ప్రయాణం..తన గమ్యాన్ని చేరలేకపోయిన యాత్రికుడి 'అబ్సర్డ్ జర్నీ'..ఈ పుస్తకం ఒక వెతుకులాట..ఒక విజయం..ఒక నిరంతర వైఫల్యం..బాల్యం మరియు యవ్వనం,ఒక పరిణామం,ఒక విప్లవం,ఒక స్వాతంత్య్రం,ఒక సహకారం,ఒక ఏకాంతం."