కొన్నేళ్ళ క్రితం బ్రెయిన్ పికింగ్స్ ద్వారా పరిచయమైన 'సుసాన్ సోంటాగ్' వ్యాసాల్ని అప్పుడప్పుడూ చదువుతుండేదాన్ని..కానీ ఒక్కటి మినహాయిస్తే ఆమె పుస్తకాలేవీ పూర్తిగా చదివింది లేదు,నిజానికి ఆమెను ఏకబిగిన చదవడం నాకు సాధ్యం కాలేదు..నిజం చెప్పొద్దూ,రాతల ద్వారా ఇష్టపడిన రచయితలు కొందరైతే రచయితని చూసి ఇష్టపడి చదివిన రాతలు కొన్ని..ఈ పుస్తకం కవర్ లాగే సుసాన్ క్లాసిక్ బ్లాక్ & వైట్ ఫోటోలోని స్థిరగంభీరమైన అయస్కాంతం లాంటి ఆకర్షణ శక్తేదో ఆమెవైపు ఎవర్నైనా ఇట్టే లాగేసుకుంటుంది..రీడింగ్ టార్గెట్స్ ని ప్రక్కకి నెట్టేసి ఈ నెలంతా మరొక రచయితను చదవలేదు,ఆమె చదవనివ్వలేదు..కొన్ని వ్యాసాలూ,ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్,చివరగా బెంజమిన్ మోసర్ రాసిన సుమారు ఎనిమిది వందల పేజీల బయోగ్రఫీ 'సోంటాగ్' చదివిన తరువాత ఈ వ్యాసం రాయాలని కంప్యూటర్ కీబోర్డ్ మీద పెట్టిన చేతులు కాసేపు అలాగే స్థిరంగా చలనం లేకుండా ఉండిపోయాయి,ఈ ఆర్టికల్ రాద్దామని నేను తయారుచేసుకున్న నోట్సే సుమారు యాభై అరవై పేజీలు తయారయ్యింది మరి !
నిజానికి నిర్వచనాల్ని తోసి పారేసిన వ్యక్తిని నిర్వచించడం సాధ్యమేనా ! లేబుల్స్ అంటే అసహ్యం అన్న వ్యక్తికి ట్యాగ్ లు తగిలించే ప్రయత్నం చెయ్యగలమా ! అసలు ఏదో ఒక చట్రంలో ఆమె ఇముడుతుందా ! ఆమె గురించి కేవలం కొన్ని పదాల్లో,ఒక్క వ్యాసంలో చెప్పడమంటే ఎలా ఉంటుందంటే,ఒక గొప్ప విస్ఫోటనం తరువాత మెరుపువేగంతో విశ్వం నలుమూలలకూ చొచ్చుకుపోయిన గ్రహ శకలాల్ని ప్రోగుచేసి పొదివిపట్టుకోవాలనే పిచ్చి ప్రయత్నంలా ఉంటుంది..అందుచేత నిర్వచనాలకు దూరంగా 'సుసాన్ సోంటాగ్' అనే విస్ఫోటనం తాలూకూ శకలాల్ని ఒకచోట పేర్చాలనే వృథా ప్రయత్నం మానేసి,ఆమెను ఆమె 'అబ్స్ట్రాక్ట్ సెల్ఫ్' అంత స్వచ్ఛంగానే చూపిస్తూ,ఈ 'సోంటాగ్' అనే టిపికల్ జిగ్సా పజిల్ ముక్కల్ని ఎవరికి తోచినట్లు వారే పేర్చుకుని ఆమెను నిర్వచించుకునే పనిని మీకే వదిలేస్తూ ఈ వ్యాసం రాసే ప్రయత్నం చేస్తున్నాను.
---------------------------------------------------------------------------------
1970 ల ముందు వరకూ బయోగ్రఫీలకు అయితే రాచరికపు స్త్రీలవో,లేక ప్రముఖ పురుషుల జీవితాల్లో కీలక పాత్రను పోషించిన స్త్రీలవో మాత్రమే అర్హత కలిగుండేవంటారు స్త్రీవాదీ,విమర్శకురాలు అయిన Carolyn Heilbrun..అంతవరకూ పురుషుని విజయాల్లో అతడి పట్ల అంకితభావంతో తెరవెనుక ఉంటూ సహాయసహకారాలనందించిన స్త్రీల గాథలు మాత్రమే చెప్పబడేవి..స్వతంత్రంగా తమతమ రంగాల్లో విజయపతాకాల్ని ఎగురవేసిన స్త్రీల జీవిత చరిత్రలపై పురుషస్వామ్యపు సమాజం సీతకన్నువేసేది..సాహితీ రంగంలో ఉత్కృష్ట శిఖరాలనధిరోహించిన వర్జీనియా వూల్ఫ్ ని సైతం అమెరికన్ విమర్శకుల్లో 'డీన్' హోదాకలిగిన లియోనెల్ ట్రిల్లింగ్ తీసిపారేశారు..చివరకు ట్రిల్లింగ్ భార్య వ్యంగ్యంగా,తన స్వంత విజయాలు ఎన్నున్నా తుదకు తన సమాధిపై “Diana Trilling Dies at 150. Widow of Distinguished Professor and Literary Critic Lionel Trilling.” అని రాయడం అనివార్యమని చురక అంటించారుట. :)
-----------------------------------------------------------------------------------------
సోంటాగ్ గురించి మాట్లాడేటప్పుడు ఆవిణ్ణి ఒక గొప్ప అమెరికన్ ఇంటెలెక్చువల్ గా మాత్రమే మాట్లాడడం అసంభవం..ఆమెకు చరిత్ర లేదు,ఆమె తన చరిత్రను తిరస్కరించింది..సాహితీలోకంలో జ్యూయిష్ మూలాలున్న స్త్రీ రచయితల్లో క్లారిస్ లిస్పెక్టర్,సుసాన్ సోంటాగ్,హన్నా ఆరెండ్ట్ లు ముగ్గురూ శిఖర సామానులు కాగా,లిస్పెక్టర్ కళ మానవ మస్తిష్కపు పరిథుల్ని దాటి ఆవలకు వెళ్ళలేదు,హన్నా ఫిలాసఫీలో పొలిటికల్ థియరీలకు ప్రాధాన్యతనిచ్చారు..ఇక సుసాన్ విషయానికొస్తే ఆమె ఫోటోగ్రఫీ,సినిమా,పెయింటింగ్,లిటరేచర్ ఇలా అన్ని రకాల 'ఆర్ట్' ఫార్మ్స్ గురించీ విస్తృతంగా వ్యాసాలు రాశారు..అక్కడే ఆగిపోకుండా రాజకీయాలూ,సామాజికాంశాల మొదలు ఎయిడ్స్,కాన్సర్ వంటి క్రానికల్ డిసీజస్ వరకూ సోంటాగ్ దృష్టి ప్రసరించని రంగమంటూ లేదు..Susan Rosenblatt పేరుతో జ్యూయిష్ కుటుంబంలో పుట్టినప్పటికీ సోంటాగ్ తన ఉనికిని కేవలం ఒక జాతికో,ఒక ప్రాంతానికో పరిమితం చేసుకోకుండా ప్రపంచం నలుమూలలకూ విస్తరించుకున్నారు..సోంటాగ్ ను చదవడం అంటే మొత్తం ప్రపంచ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఇక సాధారణంగా బయోగ్రఫీలనగానే మహాత్ముడూ,ఐన్స్టీన్ లాంటి 'లార్జర్ దాన్ లైఫ్' పర్సనాలిటీలను కూడా తీసుకొచ్చి డొమెస్టిక్ పరిథిలో కుదించే ప్రయత్నం జరుగుతుంటుంది..ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే,సుసాన్ వ్యక్తిగత జీవితం వద్దే ఆగిపోకుండా ఆమె అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో వేసిన ముద్రల్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తుంది..ముఖ్యంగా ఇందులో ప్రస్తావించిన పలు అంశాలు సోంటాగ్ జర్నల్స్ నుండీ,ఆమె స్నేహితుల,సన్నిహితుల,గురువుల,మెంటర్ల,కుటుంబ సభ్యుల అభిప్రాయాలూ,అనుభవాల నుండీ సంగ్రహించినవి..కేవలం ఒక సమూహానికో,ఒక జాతికో,ఒక రంగానికో పరిమితం కాని ఆమె గురించి అనేక వ్యక్తుల అభిప్రాయాల్ని పొందుపరచడం వల్ల ఈ బయోగ్రఫీలో సోంటాగ్ పై ప్రశంసలెన్ని ఉన్నాయో విమర్శలూ కూడా అదే స్థాయిలో ఉంటాయి..ఈ పేజీల్లో 1960-70 ల కాలంలో న్యూయార్క్ సాహితీ ప్రపంచంలో ఒక సమున్నత స్థానంలో వెలుగొందిన సోంటాగ్ మేథస్సుకి అబ్బురపడుతూ అనేక పర్యాయాలు ఆమెను ఒక Outworldly పర్సనాలిటీగా ఆరాధిస్తే,కొంచెం కూడా సాటి మనిషి భావాల పట్ల సున్నితత్వంలేని ఆమెను అంతే ద్వేషిస్తాం.
అయినా ఇటువంటి అసాధారణమైన వ్యక్తుల్ని ఒక సాధారణ వ్యక్తికి సంబంధించిన మేలు విలువల తూకపురాళ్ళతో తూచాలని ప్రయత్నించడం ఎంతటి దుస్సాహసం !!
-------------------------------------------------------------------------------------------
సంక్లిష్టమైన బాల్యం రచయితకు వరమని కొందరు రచయితలంటుంటారు..
వాస్తవాన్ని అంగీకరించని "The queen of denial" మిల్డ్రెడ్ ఇద్దరు కూతుళ్ళలో ఒకరైన సుసాన్ పుట్టిన నిముషం నుండీ తల్లి నిర్లక్ష్యానికి గురైంది..ఐదవ ఏటనే తండ్రి టీబీ తో మరణించగా,సుసాన్ లో ఒంటరినైపోతానేమోననే భయం,తత్పరిణామంగా సన్నిహితంగా వచ్చిన వాళ్ళని ఆ భయంతోనే దూరంగా నెట్టెయ్యమని ప్రేరేపించే తత్వం సుసాన్ వ్యక్తిత్వానికి హాల్ మార్క్ గా మారాయి..మొదట్నుంచీ తల్లి మీద సుసాన్ కు ఒక అబ్సెషన్ ఉండేదట..మిల్డ్రెడ్ attention కోసం ఆమె నిరంతరం తపించేది..ఈ సమయంలో మిల్డ్రెడ్ ను కలిసిన సుసాన్ మొదటి గర్ల్ ఫ్రెండ్ Harriet Sohmers “She was clearly in love with her mother,She was always criticizing her about how cruel she was, how selfish she was, how vain she was, but it was like a lover talking about a person that they were in love with.” అంటారు.
తాగుబోతు తల్లి మిల్డ్రెడ్ తో సుసాన్ అనుభవాలు ఆమెను మొదట్నుంచీ బాల్యానికి దూరం చేశాయి..మిల్డ్రెడ్ తన వివాహేతర సంబంధాలతో పిల్లల్ని ఒక్కోసారి పట్టించుకోవడం,ఒక్కోసారి పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం చేసేది. .ఈ 'కేరింగ్,నాట్ కేరింగ్' అనే సందిగ్ధత మధ్య సుసాన్ వ్యక్తిత్వాన్ని జీవితాంతం వెంటాడిన 'Sadomasochism' జీవంపోసుకుంది..కానీ ఆమె బాల్యాన్ని అంతగా కాలరాసిన మిల్డ్రెడ్ కూడా సుసాన్ కు ఒక మేలు చేసింది,"నీకేదైనా నచ్చకపోతే నీ గదికి వెళ్ళి చదువుకో" అంటూ సుసాన్ ను ఫెయిరీ టేల్ ప్రపంచంలో సేద తీరమని ప్రోత్సహించేది.అలా సుసాన్ జీవితంలో వివర్ణమైన వాస్తవాన్ని సుందరమయం చేస్తూ పుస్తకాలు ఆమెకు స్వాంతన చేకూర్చేవి..వాస్తవంనుండి దూరంగా జరగాలనుకున్న ప్రతిసారీ పుస్తకాలు ఆమెకు చేదోడువాదోడుగా నిలబడ్డాయి.
“She was never able to know what goes on in another person,” అంటారు సుసాన్ ప్రేమికుల్లో ఒకరు..దైనందిన జీవితంలో మనం సహజంగా తోటిమనిషి భావలపట్ల చూపే సున్నితత్వం సుసాన్ లో ఉండేది కాదు..దీనికి తోడు పుస్తకాలతో స్నేహం పూర్తిగా కుదరకుండానే సుసాన్ కు తానొక misfit అనే విషయం అర్ధమైంది..స్కూల్లో తోటిపిల్లల మధ్య ఇమడలేని నిరాసక్తత,ఇంట్లో దుఃఖ్ఖపూరిత వాతావరణం,అనారోగ్యం వీటన్నిటి మధ్యా ఆమె బంగారు భవిష్యత్తు గురించి ఆశగా ఎదురుచూసేది..But the woman who would inspire bookish girls everywhere had few models when she herself was a bookish girl.
సాహిత్యంతో సాహచర్యం తనకు జాత్యాహంకారపు సంకెళ్ళనుండీ,ప్రాంతీయ దురభిమానాలనుండీ,బ్రష్టుపట్టిన విద్యావిధానాలనుండీ,లోపభూయిష్టమైన తన విధినుండీ,భోగలాలసత్వంనుండీ విముక్తి ప్రసాదించిందంటారు సోంటాగ్..ఆవిడ నమ్మకం ప్రకారం మానసిక స్వేఛ్చ శారీరక స్వేఛ్చతో సమానం.

సుసాన్ సోంటాగ్ సాంస్కృతిక ప్రపంచంలో ఒక 'ఇన్సైడర్' మాత్రమే కాదు,ఆ 'ఇన్సయిడెర్నెస్' ని సింబలైజ్ చేసింది కూడా ఆవిడే..ఆమెలా మునుపూ ముందూ ఆర్ట్ కీ ఆర్టిస్టుకీ ప్రాధాన్యతను ఆపాదించిపెట్టగలిగిన వాళ్ళు లేరు..చివరకు సోంటాగ్ విమర్శకులు సైతం హేతువుపట్ల శ్రద్ధ కనబర్చడంలో ఆమె వైఫల్యాన్ని ఒకవైపు నిందిస్తూనే మరోవైపు ఆమెను ప్రశంసిస్తారు..మన్హట్టన్ తాళాలు తన చేతుల్లోకి తీసుకుని న్యూయార్క్ నగరంలో సాంస్కృతిక ప్రాభవం నలుదిశలా ప్రసరించడానికి ఆవిడ తరంలో మరే రచయితా చెయ్యనంత కృషి చేశారామె..
----------------------------------------------------------------------------------------------
తొలినాళ్ళలో రచనా వ్యాసంగంలో రచయిత ఎదుర్కునే ఆటుపోట్లను గురించి జాక్ లండన్ రాసిన 'మార్టిన్ ఈడెన్' సుసాన్ మీద చాలా ప్రభావం చూపించింది..ఆ నవలలో ప్రొటొగోనిస్ట్ అనుభవించే ఏకాకితనం,స్వాప్నికతల్లో ఆమె తనను తాను చూసుకుంది..ప్రచురణకు పంపిన తన రచన కి సంబంధించి మొదటి రిజెక్షన్ లెటర్ అందుకున్నప్పుడు, "నేనేమి నిరాశ చెందడం లేదు,పైగా చాలా ఉద్వేగంగా ఉంది,ఎందుకంటే మార్టిన్ ఈడెన్ ను గురించి ఆలోచిస్తే నాకర్థమైన విషయం ఏంటంటే ఈ తిరస్కారం ఒక రచయిత్రిగా నా ఉనికికి తొలి చిహ్నం." అంటుంది.
1966 లో 33 ఏళ్ళ వయసులో Against Interpretation పేరిట సోంటాగ్ ప్రచురించిన వ్యాసాలు రివ్యూయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి..
స్పష్టత కంటే అబ్స్ట్రాక్ట్ పట్ల సుసాన్ కున్న అబ్సెషన్ గురించి రాస్తూ అమెరికన్- జర్మన్ తత్వవేత్త Herbert Marcuse “She can make a theory out of a potato peel,” అంటారు.
ఫిక్షన్ రాయడంలో సోంటాగ్ శైలి లో 'అనిశ్చితి' ప్రధానంగా కనిపిస్తుంది..ఏమీ చెప్పకుండానే ఏదో చెప్పాలనే తపనతో,తన పాత్రల గురించి గానీ,అవి ఉన్న సందర్భం గురించి గానీ ఎటువంటి స్పష్టతా లేని ఆమె నేరేటివ్స్ పాఠకుల్లో భావోద్వేగాలను కదిలించడంలో ఘోరంగా విఫలమయ్యేవి..పాఠకులు కూడా తమను ఏవో సిద్ధాంతపరమైన వర్ణనలతో జిమ్మిక్కు చేసి రచయిత మోసం చేసినట్లు భావించేవారు..కానీ ఈ తరహా శైలిని అవలంబించడంలో సుసాన్ ఉద్దేశ్యం వేరు..దీనికి 'ఫాసినేటింగ్ ఫాసిజం' అనే వ్యాసాన్ని ఉదహరిస్తే,'ఆ వ్యాసం ఉద్దేశ్యం నిజానికి ఏదో నొక్కి చెప్పాలనో లేదో ఎవర్నో దూషించాలనో కాదు..మృతమైనదాన్ని(తండ్రి) పునర్జీవింపజెయ్యాలనే తపన..తన ఆలోచనకందనిదాన్ని ఆలోచించాలనే కోరిక (Artaud),అనిర్వచనీయమైనదాన్ని నిర్వచించాలనే తాపత్రయం (ఆమె రాసిన Camp అనే వ్యాసం)..నిజానికి ఇవన్నీ చర్చల్ని సమాధి చేసే రాతలు కావు,చర్చను ఆహ్వానించే రాతలు..ఆమె రాతలు ఆలోచనలు రేకెత్తిస్తాయి,మేథస్సుకు పదును పెట్టమంటాయి..చర్చకు ప్రేరణగా నిలవడం ఒక గొప్ప విమర్శకురాలి లక్షణం.'

కేవలం వారం రోజుల పరిచయం తరువాత 17 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ ఫిలిప్ రీఫ్ ను వివాహం చేసుకున్న సోంటాగ్,వివాహబంధాన్ని 'యజమాని-బానిస' సంబంధంగా మాత్రమే చూశారు..ఒకరి స్వేచ్ఛనొకరు హరించేసుకుంటూ,ఒకరికొకరు లొంగిబ్రతకడం అనే భావంతో మొదలైన వాళ్ళ సంసారం విఫలం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
రీఫ్ తో వివాహ వైఫల్యం గురించి సోంటాగ్ ఇలా రాశారు :
"పెళ్ళిని నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లైతే నేనసలు పెళ్ళిచేసుకునేదాన్ని కాదు..పెళ్ళిలో ఉండే 'ప్రత్యేకత','ఊపిరిసలపనివ్వని అతిప్రేమ' అంటే నాకు ఏవగింపు..ప్రతీ జంటా ఆ సాన్నిహిత్యంలో ఒకప్రక్క విసిగిపోతూ కూడా తమ బంధాన్ని ప్రపంచానికెదురీది మరీ కాపాడుకుంటూ ఉంటారు..
ఒకవేళ మొదట్నుంచీ మేము వివాహాన్ని వేరుగా అర్ధం చేసుకునుంటే...ఒకవేళ మేము ప్రేమలో కాకుండా,ప్రేమ అనే ఐడియా తో పీకల్లోతు ప్రేమలో ఉండి ఉండకపోతే....ఈలోకంలో వ్యభిచారం,నాగరికమైన సర్దుబాట్లు,సౌకర్యార్ధం చేసుకునే పెళ్ళిళ్ళు లేదా సహజీవనాలూ ఇవన్నీ ఉంటాయి,అన్నిసార్లూ చెల్లుబాటవుతాయి కూడా..కానీ ఇవేవీ నీకూ,నాకూ వర్తించవు..అవునా ?
మనమిద్దరం పిరికివాళ్ళం,సులువుగా గాయపడేవాళ్ళం,సెంటిమెంటల్ ఫూల్స్ మనం.."
సెక్సువల్ ప్లెషర్ విషయంలో Freud ప్రతిపాదించిన “the sadistic conception of coitus” ప్రభావానికి లోనుకావడంతో బాటుగా,తల్లితండ్రుల ప్రభావంలేని 'ఆదర్శవంతమైన ప్రేమ' (Freud again) ను సాధించడం సోంటాగ్ విషయంలో అసాధ్యం కావడంతో ఆమె సన్నిహిత సంబంధాలన్నీ ఒకదాని వెంబడి మరొకటి తెగిపోసాగాయి..తనపై తల్లితండ్రుల ప్రభావాన్ని సోంటాగ్ ఒక “profoundest experience” గా అభివర్ణిస్తారు..వివాహ వైఫల్యానంతరం కొన్నేళ్ళకు ఆమె ఇలా రాశారు, “In each case, which was I to be? I found more gratification as a slave; I was more nourished. But—Master or slave, one is equally unfree.”
Ironically, though, she turned her lovers, including Irene, Carlotta, Nicole, and Lucinda, into avatars of her own mother.
---------------------------------------------------------------------------------------------
'సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్' దిశగా అడుగులు వేసే వారిపట్ల మాత్రమే నాకు ఆసక్తి అంటారు సుసాన్..సుసాన్ కుమారుడు డేవిడ్ రీఫ్ తల్లి వ్యక్తిత్వం గురించి చెప్తూ,"వర్తమానంలో ఆనందంగా ఎలా జీవించాలో తెలీకపోవడం సుసాన్ జీవితంలోని ఒక గొప్ప విచారం" అంటారు.
"Susan had grown up “trying both to see and not to see,” ప్రపంచాన్ని ఉన్నదున్నట్లుగా చూడడమనే అతి సాధారణమైన పని సోంటాగ్ చాలా ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సొచ్చేది..ఒక్కోసారి ఆమెలో ఇలా చూడడాన్ని ప్రతిఘటించే అంశమేదో ఆమెలో బలంగా ఉండేది..బస్సుల్లోనూ,ట్రైన్లలోనూ ప్రయాణించేటప్పుడు ఆమె డేవిడ్ ను కిటికీ బయటకు చూడనిచ్చేది కాదని డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ Joanna Robertson అంటారు..ఒక ప్రాంతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాస్తవాలూ,చరిత్రా రూపంలో వింటేనే అర్ధమవుతుంది గానీ,కేవలం కిటికీలోంచి ఆ ప్రదేశాల్ని చూడడం వల్ల ఆ ప్రాంతం గురించి తెలిసే అవకాశం లేదనేవారట సోంటాగ్.. ఒకసారి డేవిడ్ లండన్ వెళ్ళిన కొత్తల్లో కిటికీ బయటకి చూస్తుంటే వద్దని తీవ్రంగా శాసించారట సోంటాగ్..సోంటాగ్ చివరి రోజుల్లో ఒకసారి ముగ్గురూ ట్రైన్లో ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా ఎదురుగా చూస్తూ కూర్చున్న ఆమెను చూసి ఇద్దరం నవ్వుకున్నామంటారు జోన్నా..“I remember David and I winking at each other—an inside joke about her utter refusal to just look out there and take in what she saw. The world as is, in the raw, happening now. No connection.”
------------------------------------------------------------------------------------------
'సుసాన్ సోంటాగ్' అనే సాహితీ దిగ్గజపు ముసుగు చాటు 'సుసాన్' నిజానికి చాలా బలహీనురాలని అంటారు ఆమె గర్ల్ ఫ్రెండ్ హారియట్,సోంటాగ్ కూడా కొన్ని చోట్ల తనని తాను 'puny' అని రాసుకునేవారు..కాల్పనిక ప్రపంచంలో పెస్సోవా,వలేరి వంటి రచయితలు ఆల్టర్ ఇగోలను తమ గళాన్ని వినిపించడానికి ఉపయోగించుకున్నంత సహజంగా సుసాన్ తన ఆల్టర్ ఇగోలను వాస్తవ జీవితంలో తన బై సెక్సువాలిటీ ని దాచుకునే రక్షణ కవచాలుగా ధరించింది..ఆల్టర్ ఇగోలను అంత సమర్ధవంతంగా నిజజీవితానికి అన్వయించిన సోంటాగ్ ను ఈ కారణంగా ఒక్క వ్యక్తిగా చూడడం అసంభవం..బోస్నియా యుద్ధ వాతవరణంలో ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రాణాలు సైతం లెక్ఖ చెయ్యకుండా సరజేవో చేరుకొని,ప్రపంచానికి అక్కడి ఆర్తనాదాలు వినిపించేలా బెకెట్ 'వెయిటింగ్ ఫర్ గోడోట్' నాటకాన్ని పలుమార్లు నిర్వహించిన ధీరోదాత్తత ఆమెదే,సహచరి Anne Leibovitz పట్ల అథారిటీతో కూడిన కాఠిన్యం ఆమెదే,కొడుకు డేవిడ్ ను క్యాన్సర్ సమయంలో వదిలేసి సహచరితో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన స్వార్థం కూడా ఆమెదే..సల్మాన్ రష్దీ కి కష్టకాలంలో కోటగోడలా నిలబడిన బలమైన వ్యక్తిత్వం ఆమెదే..సుసాన్ సోంటాగ్ అనేక వ్యక్తులూ,వ్యక్తిత్వాల మేళవింపు.
డేవిడ్ ఫ్రెండ్ మరియు రచయిత అయిన Jamaica Kincaid డేవిడ్ కాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా మాములుగా తిరిగి వచ్చిన సుసాన్ గురించి రాస్తూ,
Then Susan came back and became the adoring mother. But David was very wounded by this, and that was the first exposure I had to her. It’s not ruthlessness. It’s just Susan-ness. None of the words or the ways of characterizing her behavior really fit. Yes, she was cruel and so on, but it wasn’t that, she was also very kind. She was just a great person. I don’t think I ever wanted to be a great person after I knew Susan. అంటారు.
ఆమె అందం,లైంగికత ఆమెలో అసలు వ్యక్తి కంటే 'సోంటాగ్ అనే ఇమేజ్' ను తయారుచేసుకోవడంలో ఆమెకు ఎక్కువగా సహాయపడ్డాయి..తన బలహీనతల్ని కప్పేస్తూ ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో వ్యక్తిత్వాన్ని ప్రదర్శనకు పెట్టిన ఆ 'సోంటాగ్ ఇమేజ్' ఆమెకు ఊపిరాడనిచ్చేది కాదు..దీనికితోడు సేదతీరడానికి కుటుంబం,ఆస్తిపాస్తులు-వృత్తి అందించే స్థిరత్వం,రక్షణ లాంటివేవీ లేని ఆమె చివరకు తనకు అత్యంత సన్నిహితుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ జీవితాంతం ఒక 'ఆల్టర్నేట్ సెల్ఫ్' క్రింద తలదాచుకున్నారు.. Through writing, she said, “I create myself.”And it was to this other self that she appealed now: “Give me strength, tall lonely walker of my journals!” “To have two selves is the definition of a pathetic fate,” she later wrote.
సోంటాగ్ చుట్టూ ఎవరూ లేనప్పుడు వ్యక్తమయ్యే ఆమె ప్రైవేట్ సెల్ఫ్/సెక్సువల్ సెల్ఫ్ ఒకవైపైతే, నలుగురిలోనూ ఆమెకు ప్రాతినిథ్యం వహించే సోషల్ సెల్ఫ్ (ఒక మెటఫోర్/ ఒక మాస్క్) మరోవైపు ఉండేవి..వీటితోపాటు సోంటాగ్ ను జీవితాంతం వెంటాడిన మరో ఆల్టర్ ఇగో,సుసాన్ సోంటాగ్ తాను ఇలా ఉండాలని కలలుగన్న 'ఐడియల్ సెల్ఫ్'.“That person who has been watching me as long as I can remember is looking now,” she wrote at just fourteen.
తనలోని ఈ ఆల్టర్ ఈగోలే తాను రచయితగా మారడానికి కారణమంటూ 1959 లో ఆవిడ ఈవిధంగా రాశారు : "నాలో రాయాలనే కోరిక నా హోమోసెక్సువాలిటీతో బలంగా ముడిపడి ఉంది..నా హోమోసెక్సువాలిటీకి సమాజం నుండి ఎదురయ్యే తిరస్కారమనే ఆయుధాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మరో ఆయుధం నాకు చాలా అవసరం..ఆ ఆయుధం నాకు 'రచయిత' అనే ఐడెంటిటీ."

సుసాన్ తొలినాళ్ళలో లెఫ్ట్వింగ్ ఇంటెలెక్చువల్ గా మనిషి లైంగికతనూ,conformity భావజాలాల్నీ ప్రశ్నిస్తూ పాలనా వ్యవస్థపై ధిక్కారస్వరం వినిపించారు..'రాడికలిజాన్ని' వ్యక్తి స్వేఛ్చకూ,సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి వాటికి అవకాశమిచ్చేదిగా భావించారు..కానీ సోంటాగ్ వాదాలన్నీ నర్మగర్భంగా,అస్పష్టంగా ఉండేవి..But when she hinted at her attraction to women, she only did so obliquely. “She would talk about how you’ve got to grow out of this society where it assumes you’re all one thing,” he said.
సుసాన్ కు కళపట్ల సెన్సిటివిటీ లేదని చాలా మంది అభిప్రాయపడతారు..
కానీ ఆ లేకపోవడంలోనే ఆవిడ వ్యాసాలను మిగతావాటికంటే వేరుగా నిలబెట్టే ప్రత్యేకత కూడా ఉంది..తనలో రాయాలనే కోరికకు ప్రేరణ గురించి రాస్తూ, "నాలో అహంకారానికి ప్రతిగా నాకు రాయడం అవసరం అనుకుంటాను..నేనేదో చెప్పితీరాలి కాబట్టి రాస్తాను అనేకంటే,కాస్త గర్వాన్ని ప్రోగేసుకుని ఈ జర్నల్స్ లో ఉన్న fait accompli లాగా నేను 'రచయిత' అనే ప్రత్యేకమైన వ్యక్తిని కావాలనుకుంటాను కాబట్టి రాస్తాను..నిజానికి మంచి రచయితలందరూ ఉన్మాద స్థాయిలో గొంతెత్తి తమ ఉనికిని చాటుకునే అహంకారులే." అంటారు.
నిజమైన సుసాన్ పబ్లిక్ లో తెరవెనుక అదృశ్యంగా ఉంటూ తన రచనల ద్వారా తనకు తెలియని అపరిచిత పాఠకుడికి తనను తాను తెలియజేసుకునేది..ఒక ఎంటర్టైన్మెంట్ గా కంటే ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' గా చూడవలసిన ఆమె రచన 'The Benefactor' ను దీనికి ఒక ఉదాహరణగా చెప్తారు..సోంటాగ్ లో ఇతరుల్ని నిజమైన మనుషులుగా యధాతథంగా చూడలేనితనం ఈ రచనలో కనిపిస్తుందంటారు..As much as this question is intellectualized and abstracted in The Benefactor—and Sontag always abstracted and intellectualized precisely the things she cared about most.
“X, The Scourge” offers a magnificent example of her ability to see things and situations with uncanny accuracy—and of her inability to use this intellectual knowledge in a practical, emotional way.
---------------------------------------------------------------------------------------
'న్యూ యార్క్ రివ్యూ బుక్స్' ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన సుసాన్ సోంటాగ్ ను ఒక వ్యాసకర్తగానే చూడాలంటూ,ఆమెకు ఫిక్షన్ రాయడం చేతకాదని తరచూ వినిపించే అభిప్రాయం ఆమె స్థాయిని తగ్గించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు బెంజమిన్.
It is a need to cut Sontag down to size: to humble a person who seemed so intimidating. It is, moreover, twice wrong. Sontag wrote some excellent fiction, and she wrote some awful essays. Her successes were inextricable from her failures, both products of a mind in constant flux.
సోంటాగ్ "On Style" లో ప్రపంచాన్ని ఒక 'aesthetic phenomenon' గా అభివర్ణిస్తారు..ఈ కారణంగా ఆమె జీవితంలో తొలినాళ్ళలో రాజకీయాలకూ,ఐడియాలజీలకూ,మానవసంబంధాలకూ--వీటన్నిటిపై మానవీయ దుష్ప్రభావాలకూ అతీతంగా గడిపారు..ఆమె మలినాళ్ళలో రాజకీయాలకు చాలా దగ్గరగా గడపడానికి కారణం కూడా ఇదే కావచ్చు.
-------------------------------------------------------------------------------------
ఈ పుస్తకంలో సుసాన్ ను ఒక రచయిత్రిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా,ఆమె కష్టసుఖాల్లో తోడు నీడలా వెన్నంటి నిలచిన Farrar, Straus & Giroux (FSG) పబ్లిషింగ్ సంస్థ అధినేత రోజర్ స్ట్రాస్,'రోలింగ్ స్టోన్' పత్రిక కవర్ పేజీ ఫోటోలతో పాటు అనేక మంది ప్రముఖుల్ని తన కెమెరాలో బంధించిన ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ Annie Leibovitz,ఫిలిప్ రీఫ్,డేవిడ్ రీఫ్,జోసెఫ్ బ్రాడ్స్కీ,డియాన్ ఆర్బస్,Lucinda Childs,పాల్ థెక్,వార్హోల్,వాల్టర్ బెంజమిన్,బార్తెస్ మొదలగు అనేకమంది కళాకారుల,సాహితీలోకపు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయవిశేషాలుంటాయి..ఈ పుస్తకం పాఠకులకు ఒక పూర్తి స్థాయి 'కల్చరల్ ఫీస్ట్'.

కొంచెం కూడా దయాదాక్షిణ్యంలేని 'సెల్ఫ్ అవేర్నెస్' సోంటాగ్ సొంతం..ఆమెకు జీవితంపై ఎంత వ్యామోహమంటే చిన్న కునుకు పడితే కూడా,ఆ క్షణాల్లో జీవితం ఎక్కడ చేజారిపోతుందేమో అన్నంత ఉన్మాద స్థాయిలో ఉండేదట..వారాల తరబడి నిద్రలేకుండా,కార్టన్ల కొద్దీ మార్ల్బోరోస్ సిగరెట్లు,కాఫీ ప్రవాహాల్లో గొంతులోకి జారిపోయే డెక్సీడ్రైన్ బాటిళ్ళ మధ్య మెదడుకీ,శరీరానికీ భేదాన్ని పూర్తిగా చెరిపేసిన వ్యక్తి సోంటాగ్ : "నాకు శరీరం లేదు,నాకున్నదల్లా మెదడూ,దాని ఆలోచనా మాత్రమే" అని అనడం పైపైన నటించే వ్యక్తికి సహజమైనప్పటికీ,ఆ వ్యక్తి తాలూకూ ఇమేజ్ వెనుక అసలైన భౌతిక శరీరం ప్రతిఘటించకుండా ఊరుకోదు కదా ! నలభై ఏళ్ళ వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది.."నా స్వభావసిద్ధతను ప్రపంచం నుండి దాచి ఒక పిరికిదానిలా జీవించాను కాబట్టి నేను కాన్సర్ ను కోరి ఆహ్వానించుకున్నానంటారు" సోంటాగ్.
This portrait of repression, inwardness, and sadness—the one she denounces as punitive and medieval—coincides, however, exactly with the self-portrait in her journals, the hidden self that she almost never allowed to appear in public or in her writings: the persona, or mask, that she had evolved as a means of survival. “I’m responsible for my cancer,” she wrote. “I lived as a coward, repressing my desire, my rage.” Susan blamed herself bitterly.
-----------------------------------------------------------------------------------------------
ఈ పుస్తకం మొత్తంలో సోంటాగ్ ఒక మామూలు స్త్రీ లా ఆలోచించిన ఒకే ఒక సందర్భం :
"నాకెప్పుడూ బుల్లీస్ నచ్చుతారు..నేను అందంగా ఉండనని ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళై ఉంటారు..ఆ తిరస్కరించడంలో వాళ్ళలో నాకు సుపీరియర్ క్వాలిటీస్ ,మంచి అభిరుచి కనిపిస్తాయి" అంటారు (ఉదాహరణకు ఆమెను చులకనగా చూసిన హారియట్,ఆల్ఫ్రెడ్,ఐరీన్ ల పట్ల ఆమెకున్న ప్రేమ).."నా మీద నాకు గౌరవం లేదు..నేను ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తున్నా,ఆ ప్రేమరాహిత్యానికి ఎదురెళ్ళి పోరాడుతున్న నాలోని సైనికురాల్ని గౌరవిస్తాను..నేను మళ్ళీ బుల్లీస్ పట్ల ఎప్పుడూ ఆకర్షితురాల్ని అవ్వను" అంటారు.

'Styles of Radical Will' పుస్తకంలో ‘Thinking Against Oneself’: Reflections on Cioran.” పేరిట రాసిన వ్యాసంలో “To exist is a habit I do not despair of acquiring.” అంటారు సుసాన్..మనం మానవీయ స్పృహ(మేథస్సు) కారణంగా ఉత్పన్నమైన అనేక ఉపద్రవాలను సవరించే ప్రయత్నం ఎంత చేసినా 'హ్యూమన్ కాన్షియస్నెస్' ను ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని అంటూ,ఈ మార్గంలో మనిషికి వెనక్కి తిరగడం అసాధ్యమనీ,ముందుకు అడుగేసి 'ఆలోచన' తుదివరకూ పూర్తి స్పృహతో ప్రయాణించడంలోనే మనిషికి గౌరవం ఉందనీ అంటారు.
For Sontag, it would be no easy thing to unite the beastly body to the intellectual realm, the realm of language, metaphor, and art.

ఫోటోగ్రఫీ గురించి రాస్తూ, “Photographing is essentially an act of non-intervention,” అంటారు సోంటాగ్. 'On Photography' అనే పుస్తకంలో ఆమె ఫోటోగ్రాఫ్ ని 'వినియోగదారుని చవకబారు కృత్రిమ కళా సృష్టి' (consumerist kitsch) గా అభివర్ణిస్తారు..ఫొటోగ్రాఫ్స్ ను 'నిరంకుశత్వపు నిఘా' అంటూ, కెమెరాలను “వేటగాని ఆయుధాలనీ',ఫొటోగ్రాఫర్లను 'పీపింగ్ టామ్స్' అనీ,voyeurs,సైకోపాత్స్ అనీ అంటారు : కెమెరాను ప్రతి వాడకంలోనూ నిస్సందేహంగా ఒక 'దురాక్రమణ ధోరణి' ఉంటుందంటారు.
ఇందులో డియాన్ ఆర్బస్ ఫోటోగ్రఫీ గురించి ఆమె రాసిన వ్యాసాలను బెంజమిన్ విశ్లేషించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది :
ఆర్బస్ ఫోటోగ్రఫీని సోంటాగ్ ఏ దృష్టితో చూశారో రాస్తూ,
ఆ వ్యాసాల్లో 'ఫోటోగ్రాఫర్ ఆర్బస్' ఆమే,అతడు ఫోటో తీసిన 'పిచ్చివాడూ' ఆమే..'ఫోటోగ్రాఫరూ',అతడి 'సబ్జెక్టు' ఈ రెండూ కూడా ఆమే..ఇందులో జడ్జి,నిందితుడూ రెండూ ఆమే అంటూ సోంటాగ్ లో ఈ సందిగ్ధతకి కారణం,ఈ రాతలన్నీ ఆమె తనకోసం తాను రాసుకోవడమేనంటారు..సుసాన్ వ్యక్తిత్వంలో కీలక భాగమైన అపనమ్మకాన్ని ఈ వ్యాసాల ద్వారా ప్రక్షాళన చేసుకునే దిశగా ఇదంతా తనకు తాను చెప్పుకుంది,అందుకే సుసాన్ కి ఫోటోగ్రఫీ అంటే ద్వేషమని అనుకునేవాళ్ళదెంత మూర్ఖత్వమో,ఆమెకు ఫోటోగ్రఫీ అంటే ప్రేమ అనుకునేవాళ్ళదంతే మూర్ఖత్వం అంటారు.
ఆమె తనను తానెంత అపనమ్మకంతో చూసుకుందో,ఫోటోగ్రఫీని కూడా సరిగ్గా అదే దృష్టితో చూసింది సుసాన్ : the division she had described in 1960 between “I’m no good” and “I’m great".
ఆర్బస్ ఫోటోగ్రఫీ లో ప్రధానంగా కనిపించే 'విషాదపూరితమైన స్పృహ' సోంటాగ్ రచనల్లో కూడా ప్రస్ఫు టంగా కనిపిస్తుంది..'On photography' లో ఫోటోగ్రఫీ అనే సబ్జెక్టును వస్తువులూ,వాటి ప్రతిబింబాలూ / వర్ణన,దాని చుట్టూ ఉన్న వాస్తవికతల్లా విభజిస్తూ ఒక 'డివైడెడ్ కాన్షియస్' తో చూసినా, వాస్తవానికీ,కల్పనకూ మధ్య ఉండే స్పేస్ ని అర్థంచేసుకోవడం పట్ల ఆమెకున్న అబ్సెషన్ కనిపిస్తుంది.. the camera, which packages reality into an easily accessible consumer good. The desire to “acquire” reality should not be reduced to consumerism, since for Sontag it went far deeper. But it is true that the camera allows people’s freakishness—their suffering—to be sliced up, placed on the wall, sold: transformed into a product.

ఈ పుస్తకంలో సోంటాగ్ గర్ల్ ఫ్రెండ్స్ Harriet, Irene, and Carlotta, Nicole లతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని పేజీలు కేటాయించారు..కాగా
సుసాన్ స్నేహితుల్లోకెల్లా చాలా ముఖ్యమైన మిత్రుడు మరియు మెంటర్ అయిన కవి జోసెఫ్ బ్రాడ్స్కీ తో ఆమె అనుబంధాన్ని గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి..సుసాన్ లాంటి వ్యక్తిని సైతం తన అథారిటీతో కూడిన వ్యక్తిత్వంతో కట్టిపడెయ్యగల సమర్థత ఉన్న ఏకైక వ్యక్తి బ్రాడ్స్కీ..అతడు 'ఆమె టస్కన్ లోను,షెర్మాన్ ఓక్స్ లోనూ కలలుగన్న మిత్రుడు..భర్త ఫిలిప్ రీఫ్ లో చూడాలని కలలుగన్నగురువు..జీవిత సహచరుడు,తనకు సరిసాటైన మేథావీ,కళాకారుడూ..కొన్నిసార్లు అతడు ఆమెకు సుపీరియర్ కూడా'..అతడికంటే సోంటాగ్ కు అభిరుచులు కలిసిన అనుకూలమైన వ్యక్తి మరొకరు తారసపడలేదు.,and it was in these terms that she mourned his premature death, at fifty-five: “I’m all alone,” she told a friend. “There’s nobody with whom I can share my ideas, my thoughts.”
ఈ పుస్తకంలో జోసెఫ్ బ్రాడ్స్కీ తో పాటు సుసాన్ జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ఒకరైన వాల్టర్ బెంజమిన్ కి కేటాయించిన పేజీలు అద్భుతంగా ఉన్నాయి..సుసాన్ శైలినీ,బెంజమిన్ శైలినీ పోలుస్తూ చేసిన విశ్లేషణలు సుసాన్ లో melancholic తత్వాన్ని అర్ధం చేసుకోడానికి మరింత దోహదపడతాయి..'Under the sign of Saturn' పుస్తకంలో వాల్టర్ మీద ఆమె ఒక వ్యాసాన్ని రాశారు..Saturnine sign క్రింద పుట్టిన వ్యక్తులు స్వభావసిద్ధంగా విచారగ్రస్తమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు..అసత్యమాడడం,రహస్యాలు దాచడం వీరికి సహజం..కానీ ఇవన్నీ ఆ వ్యక్తిత్వానికి కవచ కుండలాల్లాంటివి..దీనికితోడు వీళ్ళు స్వేఛ్ఛాజీవులు కావడంతో సుసాన్ లాగే వాల్టర్ కూడా స్నేహితుల్ని దూరంగా తోసేసేవారట ..ఈ ఇమడలేకపోవడాన్నీ,అసంతృప్తినీ విస్తృతంగా చదవడం,రాయడం వెనుక దాచుకునేవారు వాల్టర్.
ఈ తత్వం ఉన్న వ్యక్తులకు వాళ్ళ అస్తిత్వంతో సమానమైన 'కళ' ను పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరం..వాల్టర్ పుస్తకాలను ఒక ఉన్మాదంతో ప్రోగుచేసేవారట..పుస్తకాల ద్వారా,ఆబ్జెక్ట్స్ ద్వారా తనను తాను నిరంతరం పునర్నిర్మించుకుంటూ ఉండేవారట..ఆయన ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాల్లో నాజీల చేత చిక్కి కోల్పోయిన ఆయన లైబ్రరీ కూడా ఒక కారణం అంటారు.
“The only pleasure a melancholic permits himself, and it is a powerful one, is allegory,” Benjamin wrote, and Sontag quoted him approvingly.
--------------------------------------------------------------------------------------------
ఇంత గొప్ప వ్యక్తి కదా మరి ఫెమినిస్టుల జాబితాలో సుసాన్ పేరు కనిపించదెందుకని ఒకప్పుడు ఆశ్చర్యం వేసేది..దీనికి కూడా ఒక కారణం ఉంది..ఆమె 1974 లో ప్రచురించిన 'Fascinating Fascism' అనే వ్యాసంలో 'నాజీ ప్రాపగోండిస్ట్' గా ముద్ర పడిన అమెరికన్-జర్మన్ దర్శకురాలు Leni Riefenstahl పై ఆధారాలు లేని విమర్శలు చేశారు..Leni కి కేవలం ఒక స్త్రీ కావడం వలన గుర్తింపు వచ్చిందే గానీ ఆమె ఆర్ట్ కూడా 'ఒక అందమైన ఫాసిజం' అని అని విమర్శించారట..అప్పట్లో సోంటాగ్ స్థాయికి తగ్గని రచయిత్రి,విమర్శకురాలు అయిన Adrienne Rich సోంటాగ్ వ్యాఖ్యల్ని ఖండించగా,సోంటాగ్ రిచ్ పై విమర్శలతో ఎదురుదాడికి దిగిన కారణంగా సాటి ఫెమినిస్టు ప్రపంచం ఆమెను ఎప్పుడూ తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడలేదంటారు..సోంటాగ్ స్త్రీవాద రచనలు కాలగర్భంలో కలిసిపోడానికి ఇదొక కారణం.
Although it is a lot of fun to do, the essay that was written most quickly was, of course, the Leni Riefenstahl because it’s much easier to write when you feel angry, self-righteous and you know you are right.”
ఈ పుస్తకంలో సరజేవోలో ఉన్నసమయంలో సోంటాగ్ “You have no right to a public opinion unless you’ve been there.” అన్న తన మాటలకే విరుద్ధంగా సెప్టెంబర్ 11 అటాక్స్ జరిగిన సమయంలో అమెరికా విదేశాంగ విధానాల్ని దుయ్యబడుతూ రాసిన వ్యాసం చదివి తీరాల్సిందే..ఈ సందర్భంగా ఆమెను విమర్శిస్తూ ఆమెకు వ్యతిరేకంగా క్యాంపైన్లు జరిగినప్పటికీ సోంటాగ్ తన మాటల్ని వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం.

చివరగా సుసాన్ రాయడం గురించి ఒక యువ రచయితకు సూచనలు చేస్తూ
నోబుల్ గ్రహీత Halldor Laxness 'Under the Glacier' నవలలో ఒక బిషప్ రచయితకు చేసిన సూచనలను quote చేస్తారు :
"మరీ వ్యక్తిగతంగా రాయకు..పొడిపొడిగా రాయి !.. సాధ్యమైనంత ప్రథమ పురుషలోనే రాయడానికి ప్రయత్నం చెయ్యి..రాసినదాన్ని పరీక్షించకు !..బహుశా చాలామంది మొత్తం నిజాన్ని కాదు సరికదా,అసలు నిజంలో కూడా చాలా కొద్ది భాగమే చెప్తారని మర్చిపోవద్దు..నిజం చెప్తున్నా,అబద్ధం చెప్తున్నా కూడా మనుషులు మాట్లాడుతున్నప్పుడు తమని తాము తెలియపరుచుకుంటారు..ఉద్దేశ్యపూర్వకంగా నీకు చెప్పిన అబద్ధం కూడా,నీకు నిజాయితీతో చెప్పిన నిజం కంటే కూడా అనేకసార్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకో..వాళ్ళని సరిచెయ్యకు,సరిదిద్దకు,వాళ్ళని అర్థం చేసుకోవాలని(interpret) అసలే ప్రయత్నించకు."
--------------------------------------------------------------------------------------
కొందరు వ్యక్తుల్ని తెలుసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదు..కేవలం కంటికి కనిపించే మనిషి కంటే లోపల అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ కలిగి ఉంటారు వాళ్ళు..అటువంటి వారిని చదవడం సాగర మధన సమానం..సుసాన్ సోంటాగ్ అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు..ఈ పేజీల మధ్య 'సుసాన్' అనే ఐడియా తో ఎన్నోసార్లు ప్రేమలో పడ్డాను..అలాగే 'సోంటాగ్' ను అనేకసార్లు ద్వేషించాను..ప్రేమ్ నగర్ లో నాగేశ్వర్రావు డైలాగ్ ఒకటుంటుంది,"ఇవన్నీ భరించాలంటే మనిషి మీద అభిమానం ఉండాలని" :) సోంటాగ్ మీద ఆ అభిమానం ఉంటే మాత్రం ఈ పుస్తకం తప్పక చదవండి.
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు,
“Susan literally sat at the feet of only two people. If she came into a room and saw either of these two people she’d sit right here on the floor: Hannah Arendt and Carlotta.
Inauthenticity was the price Sontag paid for maintaining her cultural centrality; and the center of that culture was about to shift.
Fritz told me that what got him through his nearly three years in the prison camp in Arizona was that he was allowed access to books: he had spent those years reading and rereading the English and American classics. And I told him that what saved me as a schoolchild in Arizona, waiting to grow up, waiting to escape into a larger reality, was reading books, books in translation as well as those written in English.
To have access to literature, world literature, was to escape the prison of national vanity,of philistinism, of compulsory provincialism, of inane schooling, of imperfect destinies and bad luck. Literature was the passport to enter a larger life; that is, the zone of freedom. Literature was freedom. Especially in a time in which the values of reading and inwardness are so strenuously challenged, literature is freedom.
Susan exploded. “It is not your job to reject yourself. It is their job. You put your name in the hat. If they reject you, that is their job. It has nothing to do with you! Why are you making it all about yourself? You are so egotistical!” Brenda dutifully applied—and applied, and applied, and applied, and applied. Finally, on her eleventh attempt, she got it.
Annie Leibovitz సోంటాగ్ గురించి రాస్తూ,
She was very, very tough. She was very hard to please. Ever since I met her, I tried to please her, but it didn’t always work. She was always raising the bar. . . . She was a very tough critic, but also a great admirer, my biggest fan
A belief in the reality of dreams had created Sontag and kept her going through a difficult life. So many of her difficulties came from her refusal to see what most people thought of as reality. But there was a usefulness to the dreamworld. “Create ‘dream picture,’” the Smokenders instructor said. “Something pleasing, relaxing . . . use for distraction.” As it happened, she had lived her life in the “dream picture.” In certain respects, this was a strength, and an anesthetic. She refused to accept limitations—to her talent, to her achievements, to her possibilities for reinvention—that would have stymied more clear-eyed people.
It was as if I had accused her of never having read Proust, or of watching soap operas all day. Her face instantly darkened and she snapped at me violently. Why on earth did I think she’d been having a nap? Didn’t I know she never had naps? Of course she wasn’t having a nap! She would never have a nap! Never in a million years! What a stupid remark to make! How had I gotten so stupid? A nap—for God’s sake!
America, we’re told, is “where the poor can become rich and everyone stands equal before the law, where streets are paved with gold.” America is “where the future is being born.” America is where “everything is supposed to be possible.” “The American,” Ryszard declares in a letter, “is someone who is always leaving everything behind.”
జోసెఫ్ బ్రాడ్స్కీ గురించి సుసాన్,
” With his red hair and bright green eyes, he was very attractive to women, and much of his magnetism derived from the authority he claimed, unapologe“He made a stunning impression,” Susan said. “He was so authoritative personallytically, as a great poet’s birthright. That status brought obligations, the first of which was a dedication to the very highest artistic standards, those his syllabus reflected: “One should write to please not one’s contemporaries but one’s predecessors,” he declared; Susan might have written the same, and in his idea of culture, she found her own.“Man’s greatest enemy is not Communism, not Socialism, not Capitalism,” Brodsky wrote, “but rather the vulgarity of the human heart, of human imagination."
The modern authors can be recognized by their effort to disestablish themselves, by their will not to be morally useful to the community, by their inclination to present themselves not as social critics but as seers, spiritual adventurers, and social pariahs.
Image Courtesy Google |