హెర్మన్ హెస్సే రాబర్ట్ వాల్సర్ గురించి మాట్లాడుతూ “if he had a hundred thousand readers, the world would be a better place,” అంటారు..వాల్సర్ ను చదివినవారికి ఆ మాటలెంత కమ్మగా అనిపిస్తాయో..ఇప్పుడు హెస్సే కవిత్వం చదివినప్పుడు సరిగ్గా నాకు అటువంటి భావనే కలిగింది..ఇలాంటి రచయితల అనుభవసారాన్ని వంటబట్టించుకుంటే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అనిపించింది..ఇరవయ్యో శతాబ్దంలో అనేక సాంస్కృతిక సంక్లిష్టతలనడుమ ఏ మార్గాన్ననుసరించాలో స్పష్టత లేక సతమతమవుతూ ఆధ్యాత్మికాన్వేషణలో ఉన్న యువతకు నోబుల్ గ్రహీత హెర్మన్ హెస్సే 'సిద్ధార్థ' కొన్ని ఆచరణయోగ్యమైన మార్గాలను సూచించిందనడంలో అతిశయోక్తి లేదు..జర్మన్ దేశీయుడైన హెస్సే తూర్పు పడమరల ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసంధానం చేస్తూ రాసిన సిద్ధార్ధను చదవనివారు బహు అరుదు..కానీ హెస్సే గద్యం తెలిసినంతగా పాఠకులకు ఆయన పద్యం గురించి తెలియదు..హెస్సే రాసిన 'The Seasons of the Soul' అనే కవితా సంపుటిలో ఆయన 64 ఏళ్ళ జీవనకాలంలో వివిధ దశల్లో రాసిన 68 కవితలు ఉంటాయి..నేను సిద్ధార్థ,Steppenwolf లు చదివిన చాలా ఏళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఆయన కవిత్వం చదవడం తటస్థించింది,కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయన స్వరంలోని అదే సుపరిచితమైన సహజత్వం,నిజాయితీ,పదాడంబరాలు లేని శైలిలో ఎటువంటి మార్పూ కనిపించలేదు..హెస్సే గద్యంలో కనిపించే సరళత్వమే పద్యంలో కూడా కనిపిస్తుంది..ఈ కవితలు కష్టసుఖాలన్నిటినీ సమానంగా స్వీకరించి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని దర్శించిన వయోవృద్ధుని అనుభవసారాలని చెప్పొచ్చు.
హెస్సే రచనల్లో ఎంతో సునిశిత పరిశీలన చేత మాత్రమే దర్శించగలిగే సూక్ష్మమైన ఆధ్యాత్మిక,తాత్వికపరమైన అంశాలు ఆయన్నొక సాధారణ నవలా రచయితగా కాక ఒక తత్వవేత్తగా నిలబెడతాయి..హెస్సే మీద ఈస్టర్న్ ఫిలాసఫీ,ముఖ్యంగా చైనా ఫిలాసఫీ ప్రభావం ఈ కవితల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది..అదే దేశానికీ చెందిన Friedrich Nietzsche,Arthur Schopenhauer వంటి వారి ఫిలాసఫీలో కనిపించే సంక్లిష్టత,మార్మికత,వాస్తవికతకు దూరం ఉండే ఉన్మాదం లాంటి తీవ్రమైన అంశాలు అణుమాత్రం కూడా కనిపించకపోవడం హెస్సే తత్వంలోని ప్రత్యేకత..సత్యదూరమైన సిద్ధాంతాలు హెస్సే పదాల్లో ఇమడలేవు..ఈ కవితల్లో ఆయన బోధించిన తత్వం కర్మ సిద్ధాంతాన్ననుసరించిన ఒక సామాన్యుని అనుభవాల్లో నుండి పుట్టుకొచ్చినవే గానీ కేవలం పుస్తక జ్ఞానంతోనో,సత్యదూరమైన విశ్లేషణల ఆధారంగానో ఊహామాత్రంగా రాసినవి ఎంతమాత్రం కాదు,బహుశా ఈ కారణంగానే ఆయన కవితల్లో ఒక స్వచ్ఛమైన నిజాయితీ కనిపిస్తుంది..చైనీస్ ఆధ్యాత్మిక గురువులు Li po,Wang Wei వంటివారి ప్రభావం హెస్సే మీద ఉండటం వల్లనేమో ఆయన కవితలు కూడా చైనీస్ కవిత్వమంత సరళంగానూ,సూటిగానూ ఉంటాయి..సహజంగా ఏ ఫిలాసఫీ అయినా స్వార్ధపూరితమైన ఆత్మాభిమానం,అహంకారం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ Self-gratification దిశగా సాగడం ఎక్కువ చూస్తుంటాం..కానీ హెస్సే కవితలు దీనికి విరుద్ధంగా మనిషికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ జీవితపు వైశాల్యాన్ని అర్ధంచేసుకోవడంలో మనిషిని యవ్వనం మొదలు వృద్ధాప్యం వరకూ చేసే ప్రయాణంలో మానసికంగా బలోపేతం చెయ్యడానికి దోహదపడతాయి..ఆయన కవితలన్నీ అనుభవం,విచారణ,విశ్లేషణ, తత్పరిణామంగా జరిగే అనేక అంతఃశోధనల ఫలితం..
ఈ కవితల్లో ద్యోతకమయ్యే ప్రేమరాహిత్యం హెస్సే కు బాల్యం నుండీ వెన్నంటే ఉన్న నేస్తం..ఆయన ఒక సందర్భంలో "I was an orphan whose parents happened to be alive" అంటూ తన బాల్యాన్ని చేదుగా గుర్తు చేసుకుంటారు..అలాగే ఆయన కవిత్వానికి ఎంచుకున్న థీమ్స్ కూడా ప్రకృతితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తాయి..హెస్సే దృష్టికోణంలో ప్రకృతిలోని ప్రతీ పక్షీ,పువ్వూ,ఆకూ మనిషి నుండి వేరు కాదు..ఈ కవితల్లో ప్రకృతిలోని ఋతువులను మెటాఫోర్లుగా వాడుతూ మానవజీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు..స్థలకాలాదులనూ,ఋతువులనూ మానవజీవనానికి మూలాధార సత్యంగా చూపించడం హెస్సే ప్రధానోద్దేశ్యం..మానవ జీవితంలో ప్రతీదీ ఒక విశిష్ట సమయాన్ననుసరించి జరుగుతుంది...తపించడానికో సమయం...విరహానికో సమయం...స్వంతం చేసుకోడానికో సమయం...సేదతీరడానికో సమయం..విడుదలకో సమయం..ఇలా హెస్సే కవిత్వంలో మనిషి కూడా ప్రకృతిలో ఋతువులు రంగులు మార్చుకున్నట్లు ఒక్కో దశలో ఒక్కో తీరుగా రూపాంతరం చెందుతూ ఉంటాడు.
'The Tides of Love' విభాగంలోని కొన్ని కవితల్లో లో హెస్సే వ్యక్తిగత జీవితంలోని విఫలప్రేమల ఛాయలు కనిపిస్తాయి..ఈ కవితల్లో స్త్రీని మనిషిని మస్తిష్కాన్ని కమ్మేసే సుందరమైన మాయగా అభివర్ణిస్తారు..జీవితంలో ప్రేమతో పాటుగా ప్రేమరాహిత్యాన్ని కూడా తుది శ్వాసవరకూ ప్రేమించమంటూ,ఈ విధంగా రాస్తారు..
Wild heart of mine, remember this.
And love each feverish passion
and the bitterness of pain, love too
before you have to enter your eternal rest.
ఇరవయ్యో శతాబ్దాన్ని ఏలుతున్న 'ఆధునికత సంస్కృతి' దుష్పరిణామాలు హెస్సే దృష్టిని దాటిపోలేదు..ఒకానొకప్పుడు ఒక భారతీయ సాధువు డిస్నీ ల్యాండ్ ను సందర్శించినప్పుడు ఆ 'Temple of Distraction' ని చూస్తూ “There must be very little joy in a culture which needs to have that much fun.” అని వ్యాఖ్యానించారట..హెస్సే కూడా ఆయన వాదననే సమర్థిస్తారు..ఆత్మను విస్మరించి భౌతికమైన క్షణికానందాలకు అర్రులుచాస్తున్ననేటి తరానికి స్వాప్నికుని సృజనాత్మక ప్రపంచపు ఔన్నత్యాన్ని వివరించే దిశగా కవిత్వం ప్రాముఖ్యతను గూర్చి 'To Imagine is to Inspire' విభాగంలో కొన్ని కవితలు రాశారు.
'The Living Word' అనే కవితలో ఈ విధంగా రాస్తారు..
Poetry and music invite you
to understand the splendors of creation.
A look into a mirror will confirm it.
What disturbs us often as disjointed
becomes clear and simple in a poem:
Flowers start laughing, the clouds release their rain,
the world regains its soul, and silence speaks.
'In dialogue with the divine' విభాగం అక్కడక్కడా రవీంద్రుని గీతాంజలిని జ్ఞప్తికి తెస్తుంది.. జాతివిద్వేషాల మధ్య యుద్ధం,అశాంతి,హింసలతో సమిధగా మారుతున్న ప్రపంచాన్ని నిస్సహాయంగా చూస్తూ గీతాసారాన్ని గుర్తుచేసుకుంటూ 'భగవద్గీత' అనే ఒక కవిత రాశారు..
“War and peace, they count the same
because no death can touch the spirit realm.
“Whether peace reigns or is ruined,
the world’s woes will wear on.
“You have to struggle, cannot rest.
Apply your strength, it is God’s will!
“But even if you succeed a thousand times,
the world’s heart will beat on unchanged."
అనేక ఇజాలు,ఫిలాసఫీలూ,ఆధ్యాత్మికపరమైన మార్గాలలో ఏది అనుసరణీయమో,ఏది కాదో తెలీక ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి సంక్లిష్టమైన ప్రపంచానికి తన సరళమైన కవిత్వంతో స్వాంతన చేకూర్చే స్వచ్ఛమైన గళం హెర్మన్ హెస్సేది..సూఫీ కవిత్వంలో ప్రశాంతతనూ,గిబ్రాన్ కవిత్వంలో వివేకాన్నీ,జ్ఞానాన్ని కలబోసినట్లుండే హెస్సే కవిత్వం ఈ తరం వారికి ఏ సెల్ఫ్ హెల్ప్,పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లో లేని జీవిత తత్వాన్ని బోధిస్తుంది.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
"In spite of all the pain and sorrow I’m still in love with this mad, mad world"
My mind gazes on life’s landscape with detachment and keeps the homesick, quickened heartbeats at an even pace like a well-tempered tune.
Demons and devils will haunt you everywhere because your true enemy rules your heart, from whom you cannot run or flee.
నాకు నచ్చిన కొన్ని కవితలు..
1) My Misery
My misery comes from my great talent
to wear too many masks too well.
I learned to deceive every one, myself included.
I became a master manipulator of my feelings.
No true song could reach my heart.
Behind each step I take lurks a shrewd scheme.
I know the source of all my suffering.
I have traced it to my innermost core:
Even my heartbeat is controlled and calculated.
I make sure no dream’s deep, dark foreboding,
no imprisoned passion, no stirring sorrow
can break through this armor to my soul.
2) Books
All the books of the world
will not bring you happiness,
but build a secret path
toward your heart.
What you need is in you:
the sun, the stars, the moon,
the illumination you were seeking
shines up from within you.
The quest for wisdom
made you comb the libraries.
Now every page speaks the truth
that flashes forth from you
3) Alone
You can travel so many roads
and so many trails all over this world,
but remember all paths
lead to the same finish.
You can ride, you can drive
in twos or in threes,
but you must take
the last step alone.
No schooling, no skill
will suffice or save you
from having to face
each grave challenge alone
Image Courtesy Google |