జీవితంలో ఏ దశలో చదివినా అందులోనుండి ఎంతో కొంత సారం గ్రహించి జీవితానికి అన్వయించుకోడానికి దోహదపడే పుస్తకాలు కొన్నుంటాయి..టావోయిజానికి మూలగ్రంధమైన 'Tao Te Ching' అటువంటిదే..క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చైనా తత్వవేత్త లావో త్జు రాసిన ఈ గ్రంథాన్ని ఇప్పటికీ పాఠకులు హృదయానికి హత్తుకుంటున్నారు.కన్ఫ్యూషనిజం,చైనాలో బుద్ధిజం వంటి ఇతర తత్వాలపై ఈ రచన బలమైన ప్రభావాన్ని చూపించింది..దీనిని అనువదించిన ఉర్సులా లెగైన్ తన బాల్యంలో 'లావో త్జు' ను చదువుతూ పెరిగానంటూ,ఈ కవితలు తన జీవితంలో ఎదురైన అనేక చిక్కుముడుల్ని సునాయాసంగా విప్పి చూపించాయంటారు..'Tao Te Ching' కు ఇంతకు మునుపు అనేక అనువాదాలు వెలువడ్డా,ఉర్సులా లెగైన్ అనువాదంలో ఒక ప్రత్యేకత ఉంది..అదేమిటంటే కవితల్ని అనువాదం చేసి వదిలెయ్యకుండా,దాని క్రింద ఆమె తనదైన శైలిలో చేసిన విశ్లేషణ,ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.
సాధారణ అంశానికి కూడా సంక్లిష్టతను ఆపాదించి తప్ప సహజంగా చూడడం మర్చిపోయిన నేటి తరానికి సరళత్వం విలువను తెలియజేస్తుందీ పుస్తకం..సంక్లిష్టమైనదాన్నే ఉత్తమమైనదనుకునే భ్రమ బలంగా నాటుకున్న తరుణంలో సహజంగా,నిరాడంబరంగా ఉండడంలో గొప్పదనాన్ని గుర్తుచేస్తుందీ తత్వం..ఇది చదువుతుంటే సంఘర్షణల జీవన వాహినిలో కొట్టుకుపోతున్నవారికి చల్లని చెట్టు క్రింద సేద తీరినట్లు ఉంటుంది..ఇందులో వాక్య నిర్మాణం గద్యాన్నీ,పద్యాన్నీ ఏకకాలంలో తలపిస్తుంది..చైనా సంస్కృతిలో ఏ విషయ సంబంధిత అస్తిత్వాన్నైనా పరస్పర విభిన్నమైన 'ఇన్ అండ్ యాంగ్' (Yin and Yang) లుగా అభివర్ణిస్తారు..టావో అర్ధం కూడా ఇదే..ఇందులో అన్ని పద్యాలూ 'ఇన్-యాంగ్' రూపంలో ఉంటాయి..అంటే మంచి-చెడు,సంతోషం-దుఃఖం,నింగీ-నేల,చావు-బ్రతుకు,కష్టం-సుఖం,ఎత్తు-పల్లం,ముందు-వెనుక మొదలైన పరస్పర భిన్నమైన అంశాలను ఉపయోగించి ఈ పద్యాలను కూర్చారు..లావో దృష్టిలో ఈ వైరుధ్యమే ప్రపంచంలో సంతులనాన్ని నిలబెడుతుంది.
"కోర్కెలను త్యజించినవాడు అంతరాంతరాల్లో దాగి ఉన్న దాన్ని కూడా చూస్తాడు
నిత్యం కోర్కెలతో సతమతమయ్యేవాడు తాను కోరుకున్నది మాత్రమే చూస్తాడు"
అన్నప్పుడు మన దృష్టికోణాన్ని వ్యామోహాలతో మసకబారనీకుండా స్పష్టంగా ఉంచుకుంటే,సృష్టి రహస్యం దానంతట అదే తేటతెల్లమవుతుందని బోధిస్తారు.
(స్వయం) ప్రకాశాన్ని మసకబరుచుకోమని చెప్పే మరో పద్యంలో,
"స్వర్గం ఎప్పటికీ ఉంటుంది,
భూమి తుదకంటా భరిస్తుంది,
ఎందువల్ల ?
వాటి ఉనికి తమకోసం కాదు..
అందుకే వివేకవంతులు తమ ఉనికిని వీడి ముందుకు సాగుతారు.."
మరో పద్యంలో స్వభావంలో సరళత ఆవశ్యకతను గురించి ఈ విధంగా వ్రాస్తారు..
"నిజమైన మంచితనం నీరు వంటిది
నీరు అన్నిటికీ మంచిది
అది దేనితోనూ పోటీ పడదు..
అది తిన్నగా లోతట్టు ప్రాంతంలోని కలుషితమైన నీటి గుండా కూడా
దారి చేసుకుంటూ ముందుకు ప్రయాణిస్తుంది..
ఇల్లు భూమి మీద సమమైన ఎత్తులో ఉంటే మంచిది
ఆలోచన లోతుగా ఉంటే మంచిది
ఇవ్వడంలో ఔదార్యం మంచిది
మాట్లాడడంలో నిజాయితీ మంచిది
ప్రభుత్వానికి చట్టము మంచిది
పనికి నైపుణ్యము మంచిది
కర్మకు తగిన సమయము మంచిది
పోటీతత్వం లేకపోతే నిందన్నదే లేదు.."
అన్నప్పుడు ఈ పుస్తకంలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఒక పద్యం నుండి మరొక పద్యానికి ప్రవహిస్తోందా అనిపిస్తుంది అంటారు ఉర్సులా.
మానసిక శక్తి రహస్యాలను ఛేదించే మార్గాల మీద దృష్టి సారిస్తూ చెప్పిన ఈ పద్యం అన్నిటికంటే నచ్చిన పద్యం.
"తెలిసినవాళ్ళు మాట్లాడరు
మాట్లాడేవారికి తెలియదు
తెరుచుకున్నవాటిని మూసివేయడం,
తలుపులు వేసేయడం,
అంచుల పదును తగ్గించుకోవడం,
బంధాలను కోల్పోవడం,
ప్రకాశాన్ని మసకబరుచుకోవడం ,
మార్గంలోని ధూళిగా మారడం వలన లోతైన సారూప్యతను పొందుతావు
అప్పుడు ప్రేమ-తిరస్కారం నిన్ను నియంత్రించలేవు ..
లాభం-నష్టం నిన్ను నియంత్రించలేవు..
పొగడ్త-అవమానం నిన్ను నియంత్రించలేవు..
నీ కీర్తి ఆకాశం క్రిందంతా వ్యాపించి ఉంటుంది."
అధికశాతం తత్వశాస్త్రాల్లా కాకుండా టావో మార్గం బహు సరళం..ఉర్సులా లెగైన్ టావో సూచించిన మార్గాన్ని తన అనువాదంలో 'way' అని అంటారు..ఇది లావో త్జు దృష్టిలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన దారి..కానీ లావో మార్గంలో మార్పును స్వాగతించని కాఠిన్యం కూడా కొన్ని కవితల్లో ద్యోతకమవుతుంది..మార్పు వినాశనానికి దారి తీస్తుందని ఆయన భావిస్తారు..కానీ స్పష్టత బొత్తిగా ఆపాదించని ఆ పదాలను మరోసారి అవలోకనం చేస్తే బహుశా ఆరోగ్యకరమైన మార్పును కాక 'అతి/తీవ్రమైన' మార్పులను ఉద్దేశించి ఆ విధంగా అన్నారేమో అనిపిస్తుంది..ఈ కవితల్లో ఆదర్శవంతమైన టావో మార్గంలో (Way) లో ప్రయాణించే వ్యక్తిని పలుచోట్ల 'Wise soul' అని సంబోధిస్తారు..సాధారణంగా ఒక జ్ఞానినో,గొప్ప వ్యక్తినో,ఉత్తముడినో,ఋషులనో 'wise soul' అని మనం సంబోధిస్తాము..కానీ టావో చెప్పే 'wise soul' ఒక అజ్ఞాని,నిరక్షరాస్యుడు,అనాగరికుడు ఇలా ఎవరైనా కావచ్చు..అంటే 'ఏ ప్రత్యేకతా లేనివాడు' కూడా లావో సూచించిన మార్గంలో 'వివేకవంతుడు' గా కనబడతాడు.
సరళత/నిరాడంబరత లావో తత్వంలో ప్రధాన వస్తువులు..పుస్తకం చివర్లో ఉర్సులా లెగైన్ ఒక్కో అధ్యాయానికీ చేసిన విశ్లేషణ టావోను మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి దోహదపడుతుంది.
Image Courtesy Google |