Thursday, November 1, 2018

Piano Stories - Felisberto Hernandez

కొన్ని కథలుంటాయి,కాఫీ తాగుతూనో,మధ్యమధ్య ఎవరితోనో మాట్లాడుతూనో కూడా ఆడుతూపాడుతూ చదివెయ్యవచ్చు..అక్షరాల వెంట కళ్ళు పరిగెడితే చాలు,రచయిత అంతరంగం ఉపరితలం వద్దే సునాయాసంగా దొరికేస్తుంది..మరికొన్ని కథలుంటాయి,వీటిలో అక్షరాలకు లోతెక్కువ..అడుగంటా కాలుమోపితే గానీ నీటి స్పర్శ తగలనట్లు అర్ధం అట్టడుగునెక్కడో నిక్షిప్తమై ఉంటుంది..వీటిని కేవలం కళ్ళతో చదవడం సాధ్యపడదు..ఉరుగ్వే రచయిత ఫెలిస్బెర్టో హెర్నాండెజ్ కథలు ఈ రెండో కోవలోకి వస్తాయి..ఈయన రాసిన 'పియానో స్టోరీస్' ను Luis Harss స్పానిష్ నుండి ఆంగ్లంలోకి అనువదించారు,కాగా Francine Prose,Italo Calvino పరిచయ వాక్యాలు రాశారు..తన కథలకు ఎటువంటి లాజికల్ స్ట్రక్చర్ ఉండదని తన మొదటి కథ 'How Not To Explain My Stories' లో చెప్తూనే తన ప్రపంచంలోకి మనల్ని ఆహ్వానిస్తారు రచయిత.

Image Courtesy Google
My stories have no logical structures. Even the consciousness undeviatingly watching over them is unknown to me. At a given moment I think a plant is about to be born in some corner of me. Aware of something strange going on, I begin to watch for it, sensing that it may have artistic promise. I would be happy if the idea weren’t a complete loss. But I can only watch and wait, indefinitely: I don’t know how to nurture the plant or make it bloom. All I have is the feeling or hope that it will grow leaves of poetry or of something that could become poetry when seen by certain eyes.
ఒక్కోసారి మెలకువలో ఏవో సుదూరమైన స్వప్న లోకాలు చుట్టొచ్చిన భావన కలుగుతుంది..ఎక్కడో ఏ మారుమూల ప్రదేశంలోని ఇంటిలో సంచరించినట్లూ,ఎవరో వ్యక్తుల్ని కలిసినట్లూ,మాట్లాడినట్లూ అనిపిస్తుంది..మనం నడిచి వెళ్ళిన చోట్ల పాదస్పర్శలూ,మనం మాట్లాడిన వ్యక్తులూ,ఇంటి లోపలి వస్తువులూ,చేతితో స్పర్శించిన కలమో,కాగితమో మరొకటో ఇలా ఏవేవో ఆబ్జక్ట్స్ అస్పష్టంగా జ్ఞప్తికి వస్తాయి..స్పృహ వచ్చాకా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా గుర్తుకురావు..కష్టం మీద Subconscious లో చెల్లాచెదురుగా పడి ఉన్న ముక్కల్ని ప్రోగుచేసి చూస్తే వాటికి ఒక అర్ధంగానీ,లాజిక్ గానీ ఉండవు..ఈ స్వప్నాలు,జ్ఞాపకాలూ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని తలపిస్తాయి..ఫెలిస్బెర్టో హెర్నాండెజ్ కథలు అటువంటి ఛాయా చిత్రాల్లా అనిపిస్తాయి..హేతువాదానికి సుదూరమైనవీ,స్పష్టంగా నిర్వచించలేనివీ,మన ఆలోచనలకు అంతుపట్టనివీ,వాస్తవికతకు ఆమడ దూరంలో ఉండేవన్నీ నిరర్థకం అనుకుంటే పొరపాటేనని ఫెలిస్బెర్టో కథలు నిరూపిస్తాయి.. ఇందులో మొత్తం 15 కథలున్నాయి.
I’ve lived near other people and collected memories that don’t belong to me.
ఒక సాధారణమైన వస్తువును చూసే విషయంలో ఒక మామూలు వ్యక్తి దృష్టికోణానికీ,ఒక నైపుణ్యమున్న ఫోటోగ్రాఫర్ దృష్టికోణానికీ ఎంతో వైరుధ్యం ఉంటుంది..ఫెలిస్బెర్టో తన కథను ఒక ఛాయాచిత్రంగానూ,కథనాన్ని ఒక స్వప్నావస్థగానూ చూస్తారనిపిస్తుంది..అందుకేనేమో ఇందులో వర్ణనలు పలు ఛాయాచిత్రాలను అతికించిన ప్యాచ్ వర్క్ లా ఉంటాయి..'No One Had Lit a Lamp' అనే కథలో ప్రొటొగోనిస్ట్ ఒక వ్యక్తి పైనుండి తన దృష్టిని మరల్చుకుంటూ, "ఆ గదిలో టేబుల్ పై మంటలు ఎగసిపడుతున్నాయి" అంటారు..మరునిముషంలో ఆ టేబుల్ పై ఉన్నవి మంటలు కాదు,ఫ్లవర్ వేజ్లో ఎరుపూ,పసుపూ రంగుల్లో ఉన్న పువ్వులపై ఎండ పడుతోంది అంటారు..కంటిలోని ప్రతిబింబం మెదడుకి చేరే లోపే ఫెలిస్బెర్టో సన్నివేశాలు ప్రాణం పోసుకుంటాయి..అంటే ఊహకీ,తార్కికతకీ మధ్య ఉండే అతి సన్నని దారుల్లో ఈ కథలు ప్రయాణిస్తాయి..మరో విషయమేంటంటే ఈ కథల్లో సన్నివేశాల మధ్య  పొంతనలుండవు..కార్వర్ కథల్లోలా వీటికి ముగింపులు కూడా ఉండవు..కథ ముగిసే సమయానికి ఆదీ అంతాలు లేని అస్పష్టమైన ఇమేజ్ ఒకటి పాఠకుల మస్తిష్కంలో మిగిలిపోతుంది..అక్షరాల్ని తన కలంతో (కుంచెతో) రంగులుగా మార్చి తన కథల్ని కళ్ళకు చిత్రాలుగా చూపించే నైపుణ్యం ఫెలిస్బెర్టో సొంతం..ఇటాలో కాల్వినో తన ముందు మాటలో ఈయన లాంటి రచయిత వేరొకరు లేరని అనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదనిపిస్తుంది.

టామ్ హాంక్స్ 'Uncommon types' కథల్లో టైప్ రైటర్లలాగా ఈ కథల్లో కూడా 'పియానో' ప్రతి కథలో ఏదో ఒక మూల  ప్రత్యక్షమవుతుంది..కథానాయకులు సహజంగా పియానో వాయించేవారై ఉంటారు..ఈయన కథల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది రెండు విషయాలు:ఒకటి జ్ఞాపకాలు,రెండు స్వప్నాలూ..ప్రౌస్ట్ అభిమాని అయిన ఫెలిస్బెర్టో కథలు కూడా ముఖ్యంగా జ్ఞాపకాల ఆధారంగానే నడుస్తాయి..చెకోవ్,కార్వర్ లాంటివాళ్ళ కథల్లో ప్రకృతిని గురించో,వస్తువులను గురించో వర్ణనలుంటాయి..ఒక మంచుకురిసే రాత్రి మొదలు టేబుల్ మీద ఉన్న ప్లేట్లు,స్పూన్లు,గడియారం,పరదాలూ ఇలా మనం నిత్యజీవితంలో విస్మరించే (ఓవర్ లుక్ చేసే ) చిన్న చిన్న వస్తువుల గురించి కూడా వర్ణిస్తారు..ఆ వర్ణనలు చదివే పాఠకుడు తాను ఆ ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉన్న భావనకు లోనవుతాడు..అలాగే కార్వర్ కథల్లో విరివిగా కనిపించే ఫర్నిచర్ గురించిన వర్ణనలూ,కిటికీలోంచి వచ్చే సన్నటి వెలుతురూ మొదలైన అంశాలు కథలో 'మూడ్' ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తాయి..ఇటువంటి విస్మరణకు గురైన అంశాల్నే ఫెలిస్బెర్టో తన కథలకు పునాదిగా చేసుకుంటారు..ఈ కథల్లో వస్తువులకు వ్యక్తులతో సరి సమానమైన ప్రాతినిథ్యం ఉంటుంది..వస్తువులు సజీవంగా కథలో భాగమై కథనాన్ని ముందుకు నడిపిస్తాయి.
An irresistible desire to cry was bloating up in me. I held it back with all my strength while a nightmarish silence fell about my ears and from my head and face down my whole body. Everything around me — the piano, the lamp, Celina still holding the pencil — radiated a strange heat. At that moment the objects were more alive than we were.
ఫెలిస్బెర్టో పాత్రల చిత్రీకరణ కూడా భలే విచిత్రంగా ఉంటుంది..ఒక్కరూ నార్మల్ గా అనిపించరు..కొన్ని స్త్రీ పాత్రలైతే ఏదో ఒక అబ్సెషన్ తో వింతగా ప్రవర్తిస్తూ Dickens 'Great Expectations' లో మిస్ హవిషంనూ,జేన్ అయిర్ లో రోచెస్టర్ భార్యనూ తలపించాయి..ఒక కథలో యువతి తన ఇంటి బాల్కనీతో ప్రేమలో పడుతుంది..చీకట్లో కూడా చూడగలిగే వ్యక్తి, వరదలతో చుట్టుముట్టిన ఇంటి యజమానురాలు,డైసీ అనే బొమ్మతో ప్రేమలో పడి భార్యను నిర్లక్ష్యం చేసే భర్త ఇలా విభిన్నమైన పాత్రలు తెరమీదకొస్తాయి..ఈ పాత్రలన్నీ మిస్టీరియస్ గా అనిపించే కొత్త కొత్త స్థలాలకీ,ఇళ్ళలోకీ వెళ్తుంటాయి..బొత్తిగా అపరిచితమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి..ఉన్నపళంగా వాస్తవాన్ని వదిలి తమ మెదడులోని కాల్పనిక జగత్తులోకి వెళ్ళిపోతుంటాయి..ఇక్కడ రచయిత కూడా తన కాల్పనిక ప్రపంచంలోకి మనతో పాటు ఒక కొత్త వ్యక్తిలా అడుగుపెడతారు..తాను చూసేది వాస్తవమో,కల్పనో రచయితకు కూడా స్పష్టత లేదనిపిస్తుంది,మనతో పాటు రచయిత కూడా మసక వెలుతురున్న గదుల్లో,చీకటి సొరంగాల్లో,అపరిచితుల ఇళ్ళలో అంతే కుతూహలంగా అడుగులు వేస్తారు..ఈ తరహా సర్రియలిస్టిక్,అబ్సర్డ్ అంశాలన్నీ ఉన్నా ఈ కథలు సాధారణ మెటా ఫిక్షన్ లా మెదడు మీద భారం మోపకుండా సరళంగా,చదవడానికి తేలిగ్గా ఉంటాయి..ఫిక్షన్ రాయడానికి కొన్ని కొలమానాలూ,పరిధులూ పెట్టుకుని దానికి లోబడి పనిచేసే  రచయితలకు దూరంగా ఫెలిస్బెర్టో కథలు వాస్తవానికీ,ఊహకీ మధ్య అస్పష్టమైన గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తాయి..హేతువాదానికి ఆవలితీరంలో ఉండే ఈ కథలు పాఠకుల దృష్టికోణపు పరిథుల్ని విస్తృతం చేస్తాయి..ఈ కథలు చదివితే మన దైనందిన జీవితంలో చూసే ప్రతి చిన్న వస్తువునూ,మనిషినీ,ఇతర అంశాల్నీ మరోసారి సరికొత్తగా చూసే ప్రయత్నం చేస్తాము.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

ఇటాలో కాల్వినో తన ముందుమాటలో ఫెలిస్బెర్టో గురించి ఈ విధంగా రాశారు..
Felisberto Hernández is a writer like no other: like no European, nor any Latin American. He is an “irregular” who eludes all classification and labeling, yet is unmistakable on any page to which one might randomly open one of his books
What never quite went to sleep was the specter of the magnolias. Although I had left behind the trees where they lived, they were with me, hidden in the back of my eyes, and suddenly I felt their presence, light as a breath somehow blown into the air by thought, scattered around the room, and blending into the furniture. Which was why, later on — in spite of the miseries I went through in that room — I never stopped seeing the faint glow of magnolias on the furniture and among the white and black shapes.
Also, just where the breast began, there was a flower with such sharp edges that if you moved too fast you could cut your fingers on it (and I couldn’t see why anyone would have wanted to reproduce a flower that grew wild on every fence along the road).
Her full, kindly face seemed to portray the word “grandmother”: she made me feel how round that word was. (Whenever a friend’s grandmother had a thin face, I thought the word “grandmother” didn’t fit her and she would probably not be as kindhearted as mine.)
What I was thinking just then was, “If I spend much longer in the past I’ll never get out again and I’ll go mad: I’ll be like one of those unhappy souls trapped by a secret in his past for the rest of his life. I’ve got to row with all my might back to the present."
It was on such a night, when I was running past times through my mind, carelessly, the way you let coins slip through your fingers, that the memory of Celina visited me.
My memories are a silent movie: I can put my old eyes on to see them, but my ears are deaf to them.
But until I fell asleep I was at the mercy of my memories, like a spectator obliged to watch two very different companies perform without knowing what scene or which memories would light up first, how they would alternate, or what the relations between the actors would be, because the theater and producer were always the same, usually the same author was involved and the main characters were always a man and a child.
I tried to imagine the character it portrayed but could think of nothing serious enough: perhaps he also had stopped taking himself as seriously as he used to in life and spent his time now playing with the pigeons.
“How you must regret having offered me your hospitality!” 
“On the contrary, I was thinking how unfortunate it will be to have an empty room after you’ve stayed in it.”
I looked out at a dimly lit sky that was trying to unload its bloated clouds on the house.
All these memories lived in some part of me that was like a small lost town known only to itself, cut off from the rest of the world. For many years no one had been born or died there. The founders of the town had been my childhood memories. Then, years later, some foreigners had arrived: my memories of Argentina. This afternoon I had the feeling I was in that town for a rest, as if misery had granted me a holiday.