కథని ఉన్నదున్నట్టుగా,జరిగింది జరిగినట్లుగా పూస గుచ్చినట్లు చెప్పేస్తే ఇక పాఠకులకు తరువాత ఆలోచించడానికీ,ఊహించుకోడానికీ ఏమీ మిగలదు..అందుకే పాఠకులకు చదివిన అనుభూతి కొంతైనా మిగల్చడానికీ,వారిని తమ కథలో భాగంగా చేసుకోవడానికి కొన్ని విషయాలను వారి ఊహకు వదిలేస్తుంటారు రచయితలు..ఈ క్రమంలో కొందరు రచయితలు చెప్పాలనుకున్న విషయం సౌమ్యంగా చెప్తారు,మరికొందరు బిగ్గరగా అరిచి చెప్తారు,మరి కొందరు కర్ర విరక్కూడదు,పాము చావకూడదు అన్న రీతిలో నిగూఢంగా తాము చెప్పదలుచుకున్న అంశాన్ని విసిగించి,విసిగించి చెప్తారు..పోలిష్ రచయిత విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ఈ మూడో రకానికి చెందిన రచయిత..1965 లో ప్రచురించిన ఈ నవలను Danuta Borchardt ఆంగ్లంలోకి అనువదించారు..అవార్డు విన్నింగ్ పుస్తకాలజోలికి వెళ్ళకూడదని లెంపలు వేసుకుని ఏడాది తిరగకుండానే,మళ్ళీ ఈ పుస్తకం చదివే సాహసం చేశాను..ఈ రచన 'ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్' ను సొంతం చేసుకుంది మరి.
సుసాన్ సోంటాగ్ కొన్ని వ్యాసాల్లో ఈ పోలిష్ రచయిత విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ను ఇరవయ్యవ శతాబ్దపు లిటరేచర్ లో 'అండర్ డాగ్' అని తెగ పొగిడేశారు,దానికి తోడు ఇటీవల చదివిన 'బార్టిల్బీ అండ్ కో' లో కూడా ఈయన గురించి పలుమార్లు ప్రస్తావించారు..సరే ఈయన ప్రత్యేకత ఏంటో చూద్దామని చదవడం మొదలుపెట్టాను..కథ విషయానికొస్తే ఇద్దరు యువకులు Witold,Fuks తమ దైనందిన జీవితాల్లోని సమస్యల నుండి ఉపశమనం కోసం Zakopane కు ప్రయాణమవుతారు..వీరిలో విద్యార్థి అయిన విటోల్డ్ కు తండ్రితో విభేదాలు ఉండగా,ఉద్యోగి Fuks కు యజమానితో సరిపడదు..రిసార్ట్ చేరే దారిలో వారిద్దరూ ఒకచోట ఉరివేయబడి ఉన్న పిచ్చుకను చూస్తారు..ఆ వింత దృశ్యం వారి మనస్సులో అలజడి రేపి,అనుమానాలకు దారి తీస్తుంది..తదుపరి వాళ్ళు బస చేసిన ఇంటి యజమాని Leon కుటుంబం ధోరణి కూడా వింతగా అనిపిస్తుంది..లియోన్ భార్య రోలీ-పోలీ,కూతురు లీనా,అల్లుడు లుడ్విక్,పనిమనిషి కటాసియా ఇలా విభిన్న పాత్రలు తెరమీదకొస్తాయి..ఆ యువకుల అనుమానాలకి ఊతమిస్తూ జరిగే మరికొన్ని వరుస సంఘటనలు ఈ కథను ఒక డిటెక్టివ్ కథేమో అనిపించేలా నడిపిస్తాయి..ఇక ఆ క్షణం నుంచీ ఆ ఇద్దరు యువకులూ తమ దృష్టిలో పడిన ప్రతి చిన్న అంశాన్నీ,సంఘటనల్నీ,వస్తువుల్నీ కలుపుకుంటూ తమ ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పద్ధతిలో మైండ్ కాన్ఫిగరేషన్స్ చేసుకుంటూ ఒక ఊహాప్రపంచాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు..మరి వారి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా లేదా అన్నది మిగతా కథ.
ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం మీద ఆధారపడుతుందంటారు..ఏదైనా ఒక సందర్భానికి అర్ధాలను వెతికే క్రమంలో (interpretation) ఒక వస్తువును/విషయాన్నే చూస్తాం గానీ దానివెనుక సత్యం ఎప్పుడూ మన దృష్టిని దాటిపోతుంది లేదా అదృశ్యం గానో,నిగూఢంగా ఉండిపోతుంది..సత్యం మన కళ్ళకు చిక్కేది కాదు..ఈ పుస్తకంలో గోమ్బ్రోవిచ్ చెప్పాలనుకున్న విషయం అదే...కానీ ఇందులో ఏ విషయాన్నీ అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పరు..అయినా కూడా ఓపిగ్గా చదవడం పూర్తి చేసి,విసుగ్గా ఈయన మన టైం ఎందుకు వేస్ట్ చేశారు అని అనుకునేలోపు ఆ ఆలోచనల్లోంచి అసలు విషయం స్ఫూరణకొస్తుంది..ఈ కథలో ఆ ఇద్దరు యువకుల్లో కనిపించే పిచ్చితనం మనందరిలో కూడా ఎంతో కొంతశాతం ఉంటుందేమో కదా అని ! ఈ రచనలో మానవ మస్తిష్కంలోని సంక్లిష్టతల్ని ఆవిష్కరించడంలో గోమ్బ్రోవిచ్ చేసిన అలుపెరుగని ప్రయత్నం కనిపిస్తుంది..డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ,అనుభవాలను పొదివిపట్టుకుంటూ,వాటి ఆధారంగా భవిష్యత్తుని ఊహించే పిచ్చి పని మనం అందరం కూడా చేస్తామేమో..జీవితమనే అనంతమైన చుక్కల ముగ్గులో,చివరి మజిలీ ఏంటో చేరేదాకా తెలీని చోటకి జాగ్రత్తగా ఒక్కో చుక్కనూ కలుపుకుంటూ,తప్పటడుగులు దిద్దుకుంటూ,జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంటాము..ఈ ఆదీ-అంతాలకి మధ్యలో హ్యూమన్ బ్రెయిన్ లోని ఆలోచనల స్వరూపానికి ఒక ఆకారం ఇచ్చే ప్రయత్నం చేశారు రచయిత..చివరకు ఈ తీవ్రమైన ఆలోచనలన్నీ పిచ్చితనమని నిరూపిస్తూ కథని ముగిస్తారు..రచయిత అంతరంగం తెలియగానే పెస్సోవా కవిత ఒకటి గుర్తుకొచ్చింది..ఈ పుస్తకాన్ని వర్ణించడానికి ఈ కవిత చక్కగా సరిపోతుంది..
పాఠకుల మనోగతం కనిపెట్టిన రచయిత మాటలు,
"And don’t think, sir, that I have a screw loose . . . I’m playing a crazy man to make it easier . . . But in truth I am a monk and a bishop. What time is it?”
ఒక చర్చలో తన గురించి రచయిత చెప్పుకున్న ఈ మాటలు కాస్మోస్ చదివాకా అక్షరసత్యమనిపిస్తాయి...
“I am a humorist, a clown, a tightrope walker, a provocateur, my works stand on their head to please, I am a circus, lyricism, poetry, terror, struggle, fun and games—what more do you want?”
గోమ్బ్రోవిచ్ తన రచన కాస్మోస్ గురించి ఈ విధంగా అన్నారట,
Gombrowicz said, “Cosmos for me, is black, first and foremost black, something like a black churning current full of whirls, stoppages, flood waters, a black water carrying lots of refuse, and there is man gazing at it—gazing at it and swept up by it—trying to decipher, to understand and to bind it into some kind of a whole . . ."
పుస్తకం నుండి మరికొన్ని,
Who hanged it, why, for what reason? . . . my thoughts were entangled in this overgrowth abounding in a million combinations, the jolting train ride, the night filled with the rumble of the train, lack of sleep, the air, the sun, the march here with this Fuks, there was Jasia and my mother, the mess with the letter, the way I had “cold-shouldered” my father, there was Roman, and also Fuks’s problem with his boss in the office (that he’s been telling me about), ruts, clods of dirt, heels, pant legs, pebbles, leaves, all of it suddenly fell down before the bird, like a crowd on its knees, and the bird, the eccentric, seized the reign . . . and reigned in this nook.
On the other hand . . . what if she stood over me out of sheer kindness? It was hard to tell, there are substantial obstacles to watching people, it’s different with inanimate objects, it’s only objects that we can truly watch.
From furrow to furrow, from twig to pebble, our gaze lowered, we were absorbed by the ground that unfolded before us—gray, yellowish, rusty-dark, boring, complex, sleepy, monotonous, barren, and hard. I wiped the sweat off my face. It was all a waste of time.
An onerous task . . . because, even if something were hiding here, to which the arrow, on the ceiling, in our room, was pointing, how would we find it in this entanglement, among weeds, among bits and pieces, in the litter, surpassing in number everything that could be happening on walls, on ceilings? An overwhelming abundance of connections, associations . . .How many sentences can one create out of the twenty-four letters of the alphabet? How many meanings can one glean from hundreds of weeds, clods of dirt, and other trifles? Heaps and multitudes gushed also from the boards of the shed, from the wall. I got bored.
He would not accept defeat. He stood over me. It was unpleasant because in this remote place the emptiness of our boredom met with the emptiness of these supposed signs, with evidence that wasn’t evidence, with this total nonsense—two emptinesses and the two of us caught between them. I yawned.
With a wave of his arm he encompassed the garden and the house: “Perhaps the place is swarming with signs . . ."
the world was indeed a kind of screen and did not manifest itself other than by passing me on and on—I was just the bouncing ball that objects played with!
కొద్దిగా హ్యూమర్ ..
What now? Reality intruded with lightning speed—everything returned to normal, as if called to order. Katasia: a respectable housekeeper who had injured her lip in a car accident; we: a couple of lunatics . . .
Was this ass planning to play detective?
But the trouble was that there was so much of everything, the labyrinth was expanding, lots of things, lots of places, lots of events, isn’t it so that every pulsation of our life is composed of billions of trifles, what is one to do? That’s it, I didn’t know what to do. I had absolutely nothing to do. I was unemployed.
I wasn’t present. Isn’t it true (I thought), that one is almost never present, or rather never fully present, and that’s because we have only a halfhearted, chaotic and slipshod, disgraceful and vile relationship with our surroundings; and, what’s more, people who take part in social games, on an excursion for example (I figured), are not even ten percent present.
I was vanishing, next to me Lena was vanishing. Jolting. Trotting. Scanty, sleepy little conversations with the new couple. Nothing really, except that I’m moving away with Lena from the house where Katasia stayed behind, and moment by moment we are farther away, and in a moment we’ll be even farther away, while there, the house is there, the wicket-gate, the puny whitewashed trees tied to stakes, and the house is there, while we are moving farther and farther away.
It will be difficult to continue this story of mine. I don’t even know if it is a story. It is difficult to call this a story, this constant . . . clustering and falling apart . . . of elements .
Image Courtesy Google |
ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం మీద ఆధారపడుతుందంటారు..ఏదైనా ఒక సందర్భానికి అర్ధాలను వెతికే క్రమంలో (interpretation) ఒక వస్తువును/విషయాన్నే చూస్తాం గానీ దానివెనుక సత్యం ఎప్పుడూ మన దృష్టిని దాటిపోతుంది లేదా అదృశ్యం గానో,నిగూఢంగా ఉండిపోతుంది..సత్యం మన కళ్ళకు చిక్కేది కాదు..ఈ పుస్తకంలో గోమ్బ్రోవిచ్ చెప్పాలనుకున్న విషయం అదే...కానీ ఇందులో ఏ విషయాన్నీ అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పరు..అయినా కూడా ఓపిగ్గా చదవడం పూర్తి చేసి,విసుగ్గా ఈయన మన టైం ఎందుకు వేస్ట్ చేశారు అని అనుకునేలోపు ఆ ఆలోచనల్లోంచి అసలు విషయం స్ఫూరణకొస్తుంది..ఈ కథలో ఆ ఇద్దరు యువకుల్లో కనిపించే పిచ్చితనం మనందరిలో కూడా ఎంతో కొంతశాతం ఉంటుందేమో కదా అని ! ఈ రచనలో మానవ మస్తిష్కంలోని సంక్లిష్టతల్ని ఆవిష్కరించడంలో గోమ్బ్రోవిచ్ చేసిన అలుపెరుగని ప్రయత్నం కనిపిస్తుంది..డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ,అనుభవాలను పొదివిపట్టుకుంటూ,వాటి ఆధారంగా భవిష్యత్తుని ఊహించే పిచ్చి పని మనం అందరం కూడా చేస్తామేమో..జీవితమనే అనంతమైన చుక్కల ముగ్గులో,చివరి మజిలీ ఏంటో చేరేదాకా తెలీని చోటకి జాగ్రత్తగా ఒక్కో చుక్కనూ కలుపుకుంటూ,తప్పటడుగులు దిద్దుకుంటూ,జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంటాము..ఈ ఆదీ-అంతాలకి మధ్యలో హ్యూమన్ బ్రెయిన్ లోని ఆలోచనల స్వరూపానికి ఒక ఆకారం ఇచ్చే ప్రయత్నం చేశారు రచయిత..చివరకు ఈ తీవ్రమైన ఆలోచనలన్నీ పిచ్చితనమని నిరూపిస్తూ కథని ముగిస్తారు..రచయిత అంతరంగం తెలియగానే పెస్సోవా కవిత ఒకటి గుర్తుకొచ్చింది..ఈ పుస్తకాన్ని వర్ణించడానికి ఈ కవిత చక్కగా సరిపోతుంది..
There’s enough metaphysics in not thinking about anything.కాస్మోస్ లో కథనం అంతా చిక్కుముడులతో సంక్లిష్టమైన నేరేషన్ కలిగి ఉంటుంది..పదాల్నీ,వాక్యాల్నీ చుట్టచుట్టి పడేసినట్లుగా ఉండే పొడవైన పేరాగ్రాఫుల్ని చదువుతున్నప్పుడు నాకైతే శంకర్ మహాదేవన్ 'Breathless' పాట గుర్తుకువచ్చింది..విటోల్డ్ గోమ్బ్రోవిచ్ శైలి ఆద్యంతం లిరికల్ మోడ్ లో కొనసాగుతుంది కాబట్టి ఆపి ఆపి చదవడం వల్ల ఆసక్తి పోతుంది..ముఖ్యంగా గోమ్బ్రోవిచ్ కథనాన్ని ప్రవాహం మధ్యలో పట్టుతప్పిపోకుండా ఉండేందుకు వాడే తాడులా జాగ్రత్తగా పట్టుకోవాలి..సుదీర్ఘంగా,చిక్కులుపడిపోయినట్లుండే వాక్యనిర్మాణం కారణంగా మధ్యమధ్యలో కథనం పట్టు తప్పిపోతుంటుంది..అసలు కథ రాయడానికి ముందు ఏం రాద్దామనుకుంటున్నారో ఈ రచయితకు అవగాహన ఉందా అని చాలాసార్లు అనుమానం వస్తుంది..ఒక మతి స్థిమితం లేని వ్యక్తి తన మనసులోకి వచ్చిన ఆలోచనలు ఉన్నదున్నట్లుగా పేపర్ మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గోమ్బ్రోవిచ్ కథనం..ఇందులో వాక్యాలకు ఫుల్ స్టాప్లూ,కామాలూ ఉండవు..ఎటొచ్చీ ఎడారిలో మంచు కురిసినట్లు అడపాదడపా వచ్చిపోయే కాసింత డార్క్ హ్యూమర్ కాస్త ఉపశమనం..అడుగడుగునా అబ్సర్డిటీ,పర్వర్షన్,ఇన్సానిటీ లాంటివి తప్ప ఇక్కడ లాజిక్కులూ,మ్యాజిక్కులు లాంటివి ఏమీ కనపడవు..అయినా కూడా చివరకు ఏమి జరుగుతుందో అనే చిన్నపాటి కుతూహలం ఎక్కడో లోలోపల మిణుకుమిణుకుమంటుండగా కాస్త సహనం ఉన్న పాఠకులు పేజీలు తిప్పుతారు..పుస్తకం సగానికి వచ్చేసరికి లియోన్,విటోల్డ్ ల మధ్య జరిగే సంభాషణ మన సహనానికి నిస్సందేహంగా పరీక్షపెడుతుంది..అక్కడ రెండే దారులు,పుస్తకం మూసెయ్యడం,లేదా ఈ పద్మవ్యూహం ఏంటో ఛేదించాలని పట్టుదలగా ముందుకు వెళ్ళడం..చివరకు వచ్చేసరికి హతవిధీ ! అనుకోవడం మాత్రం తప్పదు..మీకు కాస్త కుతూహలం,భూదేవంత సహనం ఈ రెండూ ఉంటే విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ను చదివే ప్రయత్నం చెయ్యవచ్చు.
What do I think about the world?
I have no idea what I think about the world!
If I get sick I’ll think about that stuff.
What idea do I have about things?
What opinion do I have about cause and effect?
What have I meditated on God and the soul
And on the creation of the world?
I don’t know. For me thinking about that stuff is shutting my eyes
And not thinking. It’s closing the curtains
(But my window doesn’t have curtains).
The mystery of things? I have no idea what mystery is!
The only mystery is there being someone who thinks about mystery.
When you’re in the sun and shut your eyes,
You start not knowing what the sun is
And you think a lot of things full of heat.
But you open your eyes and look at the sun
And you can’t think about anything anymore,
Because the sun’s light is worth more than the thoughts
Of all philosophers and all poets.
The light of the sun doesn’t know what it’s doing
So it’s never wrong and it’s common and good.
- Fernando Pessoa
పాఠకుల మనోగతం కనిపెట్టిన రచయిత మాటలు,
"And don’t think, sir, that I have a screw loose . . . I’m playing a crazy man to make it easier . . . But in truth I am a monk and a bishop. What time is it?”
ఒక చర్చలో తన గురించి రచయిత చెప్పుకున్న ఈ మాటలు కాస్మోస్ చదివాకా అక్షరసత్యమనిపిస్తాయి...
“I am a humorist, a clown, a tightrope walker, a provocateur, my works stand on their head to please, I am a circus, lyricism, poetry, terror, struggle, fun and games—what more do you want?”
గోమ్బ్రోవిచ్ తన రచన కాస్మోస్ గురించి ఈ విధంగా అన్నారట,
Gombrowicz said, “Cosmos for me, is black, first and foremost black, something like a black churning current full of whirls, stoppages, flood waters, a black water carrying lots of refuse, and there is man gazing at it—gazing at it and swept up by it—trying to decipher, to understand and to bind it into some kind of a whole . . ."
పుస్తకం నుండి మరికొన్ని,
Who hanged it, why, for what reason? . . . my thoughts were entangled in this overgrowth abounding in a million combinations, the jolting train ride, the night filled with the rumble of the train, lack of sleep, the air, the sun, the march here with this Fuks, there was Jasia and my mother, the mess with the letter, the way I had “cold-shouldered” my father, there was Roman, and also Fuks’s problem with his boss in the office (that he’s been telling me about), ruts, clods of dirt, heels, pant legs, pebbles, leaves, all of it suddenly fell down before the bird, like a crowd on its knees, and the bird, the eccentric, seized the reign . . . and reigned in this nook.
On the other hand . . . what if she stood over me out of sheer kindness? It was hard to tell, there are substantial obstacles to watching people, it’s different with inanimate objects, it’s only objects that we can truly watch.
From furrow to furrow, from twig to pebble, our gaze lowered, we were absorbed by the ground that unfolded before us—gray, yellowish, rusty-dark, boring, complex, sleepy, monotonous, barren, and hard. I wiped the sweat off my face. It was all a waste of time.
An onerous task . . . because, even if something were hiding here, to which the arrow, on the ceiling, in our room, was pointing, how would we find it in this entanglement, among weeds, among bits and pieces, in the litter, surpassing in number everything that could be happening on walls, on ceilings? An overwhelming abundance of connections, associations . . .How many sentences can one create out of the twenty-four letters of the alphabet? How many meanings can one glean from hundreds of weeds, clods of dirt, and other trifles? Heaps and multitudes gushed also from the boards of the shed, from the wall. I got bored.
He would not accept defeat. He stood over me. It was unpleasant because in this remote place the emptiness of our boredom met with the emptiness of these supposed signs, with evidence that wasn’t evidence, with this total nonsense—two emptinesses and the two of us caught between them. I yawned.
With a wave of his arm he encompassed the garden and the house: “Perhaps the place is swarming with signs . . ."
the world was indeed a kind of screen and did not manifest itself other than by passing me on and on—I was just the bouncing ball that objects played with!
కొద్దిగా హ్యూమర్ ..
What now? Reality intruded with lightning speed—everything returned to normal, as if called to order. Katasia: a respectable housekeeper who had injured her lip in a car accident; we: a couple of lunatics . . .
Was this ass planning to play detective?
But the trouble was that there was so much of everything, the labyrinth was expanding, lots of things, lots of places, lots of events, isn’t it so that every pulsation of our life is composed of billions of trifles, what is one to do? That’s it, I didn’t know what to do. I had absolutely nothing to do. I was unemployed.
I wasn’t present. Isn’t it true (I thought), that one is almost never present, or rather never fully present, and that’s because we have only a halfhearted, chaotic and slipshod, disgraceful and vile relationship with our surroundings; and, what’s more, people who take part in social games, on an excursion for example (I figured), are not even ten percent present.
I was vanishing, next to me Lena was vanishing. Jolting. Trotting. Scanty, sleepy little conversations with the new couple. Nothing really, except that I’m moving away with Lena from the house where Katasia stayed behind, and moment by moment we are farther away, and in a moment we’ll be even farther away, while there, the house is there, the wicket-gate, the puny whitewashed trees tied to stakes, and the house is there, while we are moving farther and farther away.
No comments:
Post a Comment