Tuesday, December 14, 2021

ముళ్ళకంపల వాస్తవంపై విరబూసిన కల్పన - ‘సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ

1932 లో మాక్సిమ్ గోర్కీ ని సిగిజ్మండ్  క్రిఝిఝానోవ్‍స్కీ (1887–1950) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని కోరారట. నిజానికి  సిగిజ్మండ్ సాహితీరంగంలో ఆనాటికి ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. అప్పటికే 'ఆల్ యూనియన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియెట్ రైటర్స్' కి తొలి ఛైర్మన్ గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్న గోర్కీ, సోవియెట్ యువ రచయితలకు 'సోషలిస్ట్ వాస్తవిక సాహిత్యం' భవిష్యత్తు విషయంలో దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కానీ తన రచనల్ని పరిశీలించే నిమిత్తం గోర్కీ చేతిలో పెట్టడమనే ఈ ఒక్క తప్పిదానికీ సిగిజ్మండ్ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సొచ్చింది. గోర్కీ విమర్శలు సిగిజ్మండ్ కు ఒక రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన 'సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ' అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్ రచనలు ఆనాటి 'సోవియెట్ లిటరరీ ఎస్థెటిక్స్' కి  తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పరబట్టారట : "నేను మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్ని వాటి యొక్క తాత్వికమైన విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో, తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం,పాండిత్య ప్రకర్ష ఆనాటి మేథావి వర్గాల్లో ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలమది. పండితులందరూ సమోవర్ చుట్టూ సమావేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్ వర్డ్ ప్లే - lukavoe prazdnoslovie) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవజాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి కంటే అతడి కర్మల ద్వారానే సృష్టించబడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అందువల్ల మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనలకు ప్రచురణకర్తలు దొరుకుతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ  దొరికినప్పటికీ వాళ్ళు నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా ! "

Image Courtesy Google

ఇటువంటి తీవ్రమైన విమర్శలు చెయ్యడం ద్వారా గోర్కీ సిగిజ్మండ్ ఒక రచయితగా వాస్తవదూరమైన  విషయాసక్తితో (Self-indulgent untimeliness) ఘోరమైన పాపానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బాధ్యతగల రచయితగా సోసియెట్ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. యుద్ధ సమయంలో రచయితలు  వాస్తవాన్ని విస్మరించి పదసౌందర్యాలపై అనురక్తితో తాత్వికమైన విషయాల్లో మునిగితేలడం నేరమన్నది గోర్కీ భావన. నిజానికి గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్ ను 19 వ శతాబ్దానికి చెందిన రచయితగానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్ పై 19వ శతాబ్దపు రష్యన్ సింబాలిజాన్ని పెద్ద ఎత్తులో నిర్వచించిన నీకొలాయ్ గొగోల్, ఎడ్గర్ అలాన్ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్ శైలికీ  గొగోల్ శైలికీ చాలా పొంతనలుంటాయి. ఉదాహరణకు 'ది రన్ అవే ఫింగర్స్' (1922) అనే కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతడి చెయ్యినొదిలి పారిపోవడం గొగోల్ 'ది నోస్' కథను తలపిస్తుంది. సిగిజ్మండ్ కథానాయకులు కూడా గొగోల్ కథానాయకుల్లాగే కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్ 'ది ఓవర్ కోట్', సిగిజ్మండ్ 'క్వాడ్రాటురిన్' కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథానాయకులు వృత్తి,ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టు సిగిజ్మండ్ ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయినట్లుండే ఆయన కథలు అర్థంకావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్ లాంటి సిగిజ్మండ్ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.

ఉక్రెయిన్ లోని కీవ్ లో పుట్టిన పోలిష్ మాట్లాడే కుటుంబానికి చెందిన సిగిజ్మండ్ డొమినికోవిచ్ క్రిఝిఝానోవ్‍స్కీ 1919-1950 ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే ప్రచురించబడ్డాయి. మాస్కో సాహితీలోకంలో పలు మేథావుల మన్ననలందుకున్నప్పటికీ క్రిఝిఝానోవ్‍స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల,ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగా 1949 లో గుండెపోటుతో రచయితగా సిగిజ్మండ్ కెరీర్ ముగిసిపోయేవరకూ ఆయన మాస్కో సాహితీలోకంలో (నాన్ అకడమిక్) విమర్శకునిగా,సంపాదకునిగా మాత్రమే పనిచేశారు. దీనికి తోడు సిగిజ్మండ్ స్టాలిన్ కంటే మూడేళ్ళు ముందుగానే మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధవాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్ లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్ 1920 ల తొలి కాలంలో ఈ నియంతృత్వపు కాలాన్ని 'ఫెంటాస్టిక్' శైలిలో రూపకాలు,ఉపమానాలతో కూడిన కాల్పనిక  సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు. 

భావవ్యక్తీకరణ నేరమైన నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయితలూ,కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్ శకంలో ఇటువంటి రచయితలు  రెండు రకాలనుకుంటే,  అలెగ్జాండర్‌ సోల్జెనిత్సిన్‌, విక్టర్ సెర్జీ, మిఖాయిల్ బల్గకోవ్, బోరిస్ పాస్టర్నాక్ వంటి రచయితలు స్టాలిన్ సోవియెట్ రష్యా విప్లవం, సివిల్ వార్ కాలం నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవిధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృదయాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిఝిఝానోవ్‍స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని కౄరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి తీసుకువెళతాయి. 1930 ల్లో సిగిజ్మండ్ జీవించి ఉన్న కాలంలో తనను తాను రచయితగా కంటే థియేటర్ ప్రొఫెషనల్ గా, సాహితీ విమర్శకునిగానే చూసుకున్నారంటారు. షేక్స్పియర్,జార్జ్ బెర్నార్డ్ షా ల ప్రభావం అధికంగా ఉన్న తన కథలను నిర్లక్ష్యం చేసినా వారిద్దరి రచనల్నీ మాత్రం తనదైన శైలిలో విశ్లేషిస్తూ విస్తృతమైన పరిశోధనలు చేసి పలు వ్యాసాలు ప్రచురించారు. ఈ కారణంగా సాహితీ రంగంలో సిగిజ్మండ్ ఒక ప్రత్యేకమైన 'nonacademic sort of Shakespeare critic'  గా పేరు తెచ్చుకున్నారు. 

క్రిఝిఝానోవ్‍స్కీ రచనలపై షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన తనను తాను ప్రప్రథమంగా 'ఎక్స్పెరిమెంటల్ రియలిస్టునని' చెప్పుకునేవారు. స్టాలినిస్ట్ సెన్సార్షిప్ కారణంగా సిగిజ్మండ్ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా Joanne Turnbull, Nikolai Formozov వంటి సంపాదకుల దృష్టికి వచ్చి 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలు వెలువడ్డాయి. రచయితలుగా భిన్న ధృవాలైనప్పటికీ సిగిజ్మండ్ రచనా శైలిని ఆధునిక రచయితల్లో ఒకరైన వ్లాదిమిర్ షరోవ్ శైలితో పోలుస్తారు కార్ల్ ఎమర్సన్. వీరిద్దరి శైలుల్లో ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సినెస్థీసియా అంటారు, అంటే కథ చెప్పేటప్పుడు ఇద్దరూ సినెస్థీసియాను మూలాధారంగా చేసుకుని చెబుతారు. నిజానికి మనిషికుండే  పంచేంద్రియాలు మెదడులోని వేర్వేరు భాగాలను చైతన్యవంతం చేస్తాయంటారు. కానీ సినెస్థీసియా కారణంగా ఒక ఇంద్రియ చైతన్యం మరో ఇంద్రియం చేత ఉద్దీపితమవుతుంది. ఉదాహరణకు సంగీతం విన్నప్పుడు మనం కొన్ని రంగుల్ని చూడడం తటస్థిస్తుంది. లేదా ఏవైనా అంకెలు చూసినప్పుడు మనకు కొన్ని రంగులు జ్ఞప్తికి వస్తాయి, ధ్వనులకు వాసనలుంటాయి, స్వరాలకు వర్ణాలుంటాయి, లేదా ఏదైనా వాక్యాలను విన్నా,చదివినా శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణం జనించిన భావన కలుగుతుంది, ఇలా మెదడు అనేక అనుభూతులకు లోనవుతుంది. నిజానికి జీవశాస్త్ర పరంగా చూస్తే ఈ సినెస్థీసియా ఇంద్రియ సంబంధమైనది కాదు. ఈ సాహితీ ప్రక్రియ పాఠకులపై ప్రభావం చూపే రీతిలో అర్ధవంతమైన వాక్యాలను శ్రద్ధగా ఏర్చి కూర్చిన కృత్రిమమైన నిర్మాణం. ఈ సినెస్థీసియాను పాఠకులపై సమర్థవంతంగా ప్రయోగించడానికి రష్యన్ విప్లవం, సివిల్ వార్లను వేదికగా చేసుకున్నారు సిగిజ్మండ్.

సిగిజ్మండ్ దృష్టిలో భాష గతిశీలమైనది. కొన్ని కథల్లో సిగిజ్మండ్ పదాలూ,అక్షరాలూ పేజీని వీడి పైకి ఎగసిపడుతున్న అలల్లా ఒకదానితో ఒకటి తలపడుతున్నట్లుంటాయి. దీనికి తోడు ప్రవృత్తి రీత్యా ఏకాకి జీవితాన్ని ఇష్టపడే అంతర్ముఖత్వం సిగిజ్మండ్ కథల్లో కాంటియన్ భావజాలానికి సంబంధించిన మెటాఫిజికల్ ప్రపంచాలు ఎక్కువ కనబడడానికి ఒక ముఖ్య కారణం. కథ చెప్పే సమయంలో సిగిజ్మండ్ దృష్టి ఎల్లప్పుడూ మానవ మస్తిష్కం లోలోపలి పొరల్లో ఎవరూ చొరబడడానికి సాహసించని మారుమూల ఏకాంత ప్రదేశాలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన కథా వస్తువు (లేదా కథానాయకుడు) ఆ మెదడు లోపలి పొరల్లోంచి సూటిగా వెలుపలికి ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున వెలుపలికి దూసుకువచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ సమయంలో ఎటువంటి వైకల్యాలకూ తావివ్వకపోవడం సిగిజ్మండ్ ప్రత్యేకత.

యుద్ధంతో వినాశనాన్ని చవిచూసిన కీవ్ నుండి బయటపడి 1922 లో మాస్కో లో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్. కాసేపు సిగరెట్ ముట్టించి అది కాలే లోగా కథ రాసి సిగరెట్ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచయితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ,ప్రవృత్తికీ నిజాయితీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్. నార్వే రచయిత కనూట్ హాంసన్ బాటలోనే సిగిజ్మండ్ కూడా కథ రాయడం కోసం ఏకంగా తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సిగిజ్మండ్ అనువాదకుల్లో ఒకరైన కార్ల్ ఎమర్సన్ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. ఎమర్సన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి రాసిన ఒక వ్యాసంలో సిగిజ్మండ్ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలిలోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునేవారని అంటారు. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక,మానసిక సమతౌల్యంలోనుంచి పుడుతుందనీ సిగిజ్మండ్ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి. 

అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి  'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్ ఎమర్సన్ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిఝిఝానోవ్‍స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవిచూసిన క్రిఝిఝానోవ్‍స్కీ  ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "డూ యూ లవ్ పుష్కిన్ ?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక "ఐ...ఐ......" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య బోవ్షెక్ చెప్తూ, ఆ సమయంలో ముప్ఫయ్ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అన్న ఊహ రాక మానదు. 'కాంటియన్ థింకర్' (ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న క్రిఝిఝానోవ్‍స్కీ రచనలు మోతాదుమించిన తార్కికతతో ఉండడం వల్ల వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ  తీర్మానించడంతో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" క్రిఝిఝానోవ్‍స్కీ వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం.

క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి 'లెటర్ కిల్లర్స్ క్లబ్' లో టైడ్ (రచయిత) అనే పాత్ర ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్' అనే అంశం తోడ్పడుతుంది. కథలను అల్లే విధానాన్ని బట్టి సాహితీ ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్, పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయంటాడు టైడ్. వీటిల్లో పీపుల్ ప్లాట్స్ అనేవి వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే సాధారణమైన కథలన్నమాట. ఈ కథల్లో వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది. కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి, ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించివై ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్ అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యవు, పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన క్రిఝిఝానోవ్‍స్కీ కి ఈ రెండవ పద్ధతి అంటే ప్రాణం, ఈ కారణంగానే ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాశారు.

'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరికొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్ అనే రచయిత చెప్పే 'ఎక్సెస్' (Exes) అనే డిస్టోపియాన్ హారర్ స్టోరీ మరో కథల సంపుటి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆరోజుల్లోనే అలవోకగా రాశారు క్రిఝిఝానోవ్‍స్కీ. కొన్ని చోట్ల కథలో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి తత్వాన్ని ప్రస్తావిస్తూ సాగే సిగిజ్మండ్ లోతైన కథనంలోని ప్రవాహపు వేగాన్ని అందుకుంటూ చదవడం పాఠకులకు కత్తిమీద సాములా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు రచయితకు దైనందిన జీవితంలో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలే కాకుండా పలు రాజకీయ, సామాజిక, విజ్ఞాన, తత్వ, శాస్త్ర సాంకేతికత వంటి విభిన్నమైన అంశాలపై ఉండవలసిన జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది.  మరోచోట ఫెవ్ అనే రచయిత చెప్పిన 'టేల్ ఆఫ్ ది త్రీ మౌత్స్' అనే కథలో ఇంగ్, నిగ్, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిఝిఝానోవ్‍స్కీ ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. "తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని" ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిఝిఝానోవ్‍స్కీ. ప్రవాహానికి ఎదురెళ్ళడమనేదే విప్లవమనుకుంటే మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంపై తన వినూత్నమైన కథలతో తిరుగుబాటు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠకులు ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఈయన రచనల్లో దొరకని ఒకే ఒక్క వస్తువు 'అనుసరణ' (conformity).

క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివే భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం, బోర్హెస్ కథల్లోలాగే ఆయన కథల్లో కూడా తరచూ కనిపించే భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు !! బోర్హెస్, ఉర్సులా లెగైన్ వంటి కొందరు 'ఫెంటాస్టిక్ జానర్' రచయితల్లాగే క్రిఝిఝానోవ్‍స్కీ కి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిఝిఝానోవ్‍స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక రుజువులు కనిపిస్తాయి. గూగుల్ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు దేశవిదేశీ  సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్, కాఫ్కా వంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్ కు అందుబాటులో లేనప్పటికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్, పో, గోగోల్  వంటివారు కొలువుదీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న 'షూ బాక్స్' సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ ని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

రచయితగా క్రిఝిఝానోవ్‍స్కీ దృష్టి అంతా తనలో చెలరేగే నిరంతరమైన తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనిపించదు. 'ఇన్ ది ప్యూపిల్'  వంటి కథల్ని చూస్తే పాఠకులు తన వేగాన్ని అందుకుంటున్నారో లేదో కూడా గమనించని లోతైన క్రిఝిఝానోవ్‍స్కీ కథనం సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి, ,కెమిస్ట్రీ నుంచి కాల్పనికతకూ పాదరసంలా చురుకుగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది. ప్రేమలూ, వాటిల్లో రకాలూ, మానవ సంబంధాలను సర్రియలిస్టిక్ అంశాలతో జతచేసి రాసిన ఇటువంటి కథల్లో వ్యక్తుల బదులు చిత్రాలు (ఇమేజస్) ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి. క్రిఝిఝానోవ్‍స్కీ అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే  'నేను' కథా, కథనాల్ని బట్టి రూపాంతరం చెందుతుంటుంది. ఈ 'నేను' కి ప్రత్యేకమైన ఆకారంగానీ గుణగణాలుగానీ ఉండవు, సైన్సు పరిభాషలో చెప్పాలంటే క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో 'నేను' ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే కనపడుతుంది. "Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని ఆడమ్ థిర్వెల్ ఒక పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగథాల్లోకి తొంగి చూడమంటాయి. ఈ రష్యన్ రచయితను ఒకసారి చదివితే పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా  క్రిఝిఝానోవ్‍స్కీ ని చదవక మునుపు, క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి. 

రెండు స్థితుల నడుమ ఊగిసలాడే క్రిఝిఝానోవ్‍స్కీ స్థిర స్థావరమైన ఈ ఫెంటాస్టిక్ జానర్ కూడా అత్యంత సంక్లిష్టమైనది. ఒక స్థితిలో వట్టి భ్రమలా అద్భుతంగా  కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది. మరో ప్రక్క కొన్ని కథల్లో ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు. కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన తాత్వికత క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో కీలకమైన అంశం. ఈయన్ని చదివేటప్పుడు పదాలనూ, వాక్యాలనూ దాటి reading between the lines/seeing through the gaps తప్పనిసరి. ఎందుకంటే ఆయన పాఠకులతో చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య ఇరుకు సందుల్లో దాచేస్తారు. నిజానికి మన దృష్టిని దాటిపోయిన అతి చిన్న బిందువు వద్దే క్రిఝిఝానోవ్‍స్కీ కథకు రూపకల్పన మొదలవుతుంది. అదే విధంగా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.

ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది. ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్తిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం. కానీ క్రిఝిఝానోవ్‍స్కీ కథలెన్ని చదివినా ఆయన పాఠకులకు ఒక అంతుపట్టని ఎనిగ్మా గానే మిగిలిపోతారు. ఇలాంటి రచయితలు పాఠకుల ఊహలకు రెక్కలిస్తారే గానీ దిశానిర్దేశం చెయ్యరు. వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన. ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేస్తారు క్రిఝిఝానోవ్‍స్కీ. మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా, కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా, పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా, ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే, మరో ప్రక్క నిజమేనని తొందరగానే నమ్మేస్తాం. వాస్తవంలో సాధ్యం కాని విషయాలను సృజనాత్మకతతో సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక సాధనంగా ఎంత నేర్పుగా ఉపయోగించవచ్చో క్రిఝిఝానోవ్‍స్కీ కథలు చదివితే అర్థమవుతుంది. ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో, మాన్ బుకర్, నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో క్రిఝిఝానోవ్‍స్కీ లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉండే ఉంటారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 13  డిసెంబర్ 2021

https://www.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977

https://m.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977?fbclid=IwAR06wgTQdLluiVRwc4uLBCImxKt1WnUCln4jsO1qRa17Tut07np3RtPv_Ko

Tuesday, October 19, 2021

The Secret Heart of the Clock : Notes, Aphorisms, Fragments, 1973-1985 - Elias Canetti

ప్రఖ్యాత జర్మన్ రచయితా, నోబెల్ గ్రహీతా ఎలైస్ కానెట్టి పేరు పలుమార్లు విని చాలా కాలంగా ఆయన రచనలు చదవాలనుకున్నప్పటికీ గత ఏడాది చదివిన సోంటాగ్ వ్యాసాల్లో ఆయన గురించిన ప్రస్తావనలు ఎట్టకేలకు ఆయన రచనల్ని వెలికి తీయించాయి. కానెట్టి వ్యాసాలు అప్పుడొకటీ ఇప్పుడొకటీ మినహా ఆయన రచనలేవీ నేను పూర్తి స్థాయిలో చదివింది లేదు. అనుకున్నంతలో ఆయన నోట్స్, ఫ్రాగ్మెంట్స్, అఫోరిజంస్ కలిగిన 'ది సీక్రెట్ హార్ట్ ఆఫ్ ది క్లాక్'  కనిపించింది.  ఈ రచన పాక్షికంగా మెమోయిర్ లా, మరికొంత మ్యూజింగ్స్ లా ఉండడం ఆయనను తొలిసారిగా పరిచయం చేసుకోవడాన్ని సులభం చేసింది.

Image Courtesy Google

ఈ పుస్తకంలో కానెట్టి తన జీవితసారాన్నంతటినీ చిన్న చిన్న వాక్యాల్లో పొందుపరిచినట్లు ఉంటుంది. ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉండడం వల్ల కథలా చెప్పే మెమోయిర్స్ లో ఉండే అనవసర ప్రస్తావనలు ఈ పుస్తకంలో కనపడవు. మరో విషయం ఏమిటంటే ఆయన ఫస్ట్ పర్సన్ నెరేటివ్ ని వాడకుండా థర్డ్ పర్సన్ నేరేటివ్ లో ఈ పుస్తకాన్నంతా రాయడం ఈ రచనకు అదనపు హంగు అనిపించింది. ఉత్తమ పురుషలో రాయకుండా ప్రథమ పురుషలో రాయడం వల్ల ఇటువంటి రచనలు ఆత్మవిమర్శగా, స్వోత్కర్షగా ధ్వనించే అవకాశం ఉండదు. రచయిత కూడా 'నేను' అనకుండా రచనలు చెయ్యడం వల్ల తన ఇజాలనూ,తీర్మానాలనూ, దృక్పథాలనూ పాఠకుల మీద రుద్దినట్లు అనిపించదు. రాండీ పాష్చ్ 'ది లాస్ట్ లెక్చర్' లో అనుకుంటా "మన అభిప్రాయాలను ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పడం మేలుచేస్తుంది" అంటారు. కానెట్టి ఈ రచనలో థర్డ్ పర్సన్ నేరేటివ్ లో 'He' అని సంబోధిస్తూ తనకు తాను దూరంగా నిలబడి ఒక ప్రేక్షకుడిలా జీవితమనే వేదికపై నిలబడ్డ తననూ, తన గతాన్నీ విశ్లేషించుకున్నట్లు తోస్తుంది. ఈ పుస్తకంలో అధిక భాగం వృద్ధాప్యం, మృత్యువు వంటి అంశాల గురించిన విశ్లేషణలు ఉంటాయి. 

ఇందులో కొన్ని వాక్యాలకు నా స్వేచ్ఛానువాదం :

* జీవితంలో మృత్యువు కూడా భాగమన్న సత్యాన్ని ఎందుకు ప్రతిఘటిస్తావు ?  మృత్యువు నీలో లేదా ? 

* ప్రపంచ సాహిత్యం అంటే వారికి పూర్తిగా విస్మరించదగ్గదని అర్థం.

* తన పరిథులకు అతి జాగ్రత్తగా కావలికాసుకునే వ్యక్తి సమక్షంలో ఎక్కువ సమయం గడపడం కోసం నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవడమనేది అస్సలు భరించలేని విషయం. 

* నీ జీవితాన్ని కథగా రాసేటప్పుడు అందులో ప్రతి ఒక్క పేజీలో ఎప్పుడూ ఎవరూ వినని ఒక కొత్త సంగతి ఉండాలి. 

నాకు ఉనామునో అంటే ఇష్టం : నాలో ఉన్న చెడు లక్షణాలే అతడిలో కూడా ఉన్నాయి, కానీ అతడికి తనలోని ఆ లక్షణాలను చూసి సిగ్గుపడాలని స్ఫురించదు.

* ఏమీ ఆశించనివాడే స్వేచ్ఛాజీవి. మరి స్వేచ్ఛగా ఉండడం కోసం ఏమాశిస్తాడు ?  

* నిజానికి నిన్ను నిన్నుగా పూర్తిగా ప్రేమించే స్నేహితులెవరూ ఉండరు, అది అవినీతి. 

నీ గురించి ప్రతి ఒక్క 'సెల్ఫ్ డిస్ప్లే' నీ విలువను కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది. 

తనను తాను అదుపులో పెట్టుకుంటూ రాసే రచయితలంటే నాకు గౌరవం. తమ తెలివితేటల్ని ఒక పరిథిని మించకుండా, వాటి నుండి తనను తాను రక్షించుకుంటూ, అలాగని వాటిని పూర్తిగా వదిలివెయ్యకుండా రాసేవాళ్ళంటే నాకు అభిమానం. అదీ కాకపోతే కొత్తగా తెలివి వచ్చిన రచయితలూ, కాస్త ఆలస్యంగా తెలివిని సంపాదించినవాళ్ళూ / తమకు తెలివితేటలున్నాయని గ్రహించినవాళ్ళూ  నా దృష్టిలో మంచి రచయితలు. స్వల్పమైన  విషయాలను సైతం కళ్ళువిప్పార్చుకుని చూస్తూ ఉత్తేజితమయ్యేవాళ్ళు : అద్భుతం. నిరంతరం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న గొప్ప గొప్ప విషయాల వల్ల  మాత్రమే ఉత్తేజాన్ని పొందేవాళ్ళు : భయానకం.

అతడికి తెలియనీ, అతడు చూడని ప్రతీదీ అతణ్ణి సజీవంగా ఉంచుతుంది.

అతడు వెలుగులోకి నెట్టివేయబడ్డాడు. ఇంతకీ అతడు ఆనందంగా ఉన్నాడా ?

నువ్వు అందుబాటులో లేకుండా దాక్కుంటున్నావని వారికి నువ్వంటే ద్వేషం. నువ్వు ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేస్తూ వారి ముందు ఊరేగినా వారు నిన్నేమీ తక్కువ ద్వేషించరు.  

ఏ స్థాయిలోనూ ఒకర్నొకరు అర్ధం చేసుకోవాల్సిన అవసరంలేని వృద్ధాప్యంలో సన్నిహితంగా కూర్చోవడం పరమానందం.

ఎనభయ్యోపడిలో పడిన తరువాత ఆదర్శాలు లేకుండా బ్రతకడం సాధ్యమేనా ! మరచిన కుతూహలాన్ని మళ్ళీ నేర్చుకో, జ్ఞాన సముపార్జనకోసం వెంపర్లాడకు, గతించినకాలపు అలవాట్లను త్యజించు, ఆ ఖరీదైన అలవాట్లలో నువ్వు మునిగిపోతున్నావని గ్రహించు, కొత్తవాళ్ళను గమనించు, నువ్వు ఆదర్శవంతంగా తీసుకోలేనివారిపై దృష్టిసారించు. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్కు నీ కర్మకు సరితూగేలా జీవించు. 

తనను తాను త్యజించిన పిమ్మట అతడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడికి తన గురించి మరెప్పుడూ ఇంకేమీ తెలుసుకోవాలనే ఇచ్ఛ లేదు.

* స్నేహితులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం స్నేహితులను మనం బహిరంగంగా గొప్పగా అందరికీ పరిచయం చేసుకుంటాం. నలుగురిలో వారిని నోరారా కీర్తిస్తాం. వారి మీద ప్రతి చిన్న అవసరానికి ఆధారపడతాం. వాళ్ళెప్పుడూ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులోనే ఉంటారని భావిస్తాం, వాళ్ళు కూడా సాధారణంగా అలాగే ఉంటారు. ఏదైనా సాక్ష్యానికి అవసరమైతే వాళ్ళనే పిలుస్తాం. వాళ్ళ బలాలూ,బలహీనతలూ మనకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఎంత భారమైనా మనల్ని భరించగల శక్తి వారికి ఉందని విశ్వసిస్తాం. వాళ్ళకి పూర్తిగా స్వార్ధం లేకుండా ఉండడం సాధ్యంకాకపోయినా వాళ్ళని నిస్వార్ధపరులుగా,సొంత రక్తసంబంధీకుల కంటే ఎక్కువగా అనుకుంటాం. వాళ్ళ గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ గురించి తెలిసిన వారందరికీ వారు కూడా తెలుస్తారు.

* ఇక రెండవ రకం స్నేహితులు : నీ రహస్యాలు తెలిసినవాళ్ళు , వాటిని దాచేవాళ్ళు. మొహాన ముసుగు లేకుండా నిన్నూ,నీ ఉనికినీ పూర్తిగా ఎరిగిన వాళ్ళు. వారి ప్రస్తావన మనం ఎవరివద్దా తీసుకురాము, వాళ్ళ గురించి మాట్లాడకుండా తప్పించుకుంటాము. వారి నుండి తగినంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, వారిని అరుదుగా కలుస్తాం. మనకు వాళ్ళను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండదు, వాళ్ళకు మనకు తెలియని అనేక లక్షణాలు ఉంటాయి. చివరకు కాలయంత్రపు రహస్యం అయినాసరే , ఒకసారంటూ నీకు తెలిసిపోయాక అది నీ ఆలోచనలను ఆహ్వానించదు, అవి ఎప్పటికీ అస్పృశ్యంగా ఉండిపోతాయి, ఎంత అంటరానివిగా ఉండిపోతాయంటే అవి ప్రతీ ఒక్క కలయికతోనూ నిన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇటువంటి స్నేహితులు శాశ్వత స్నేహితులమని చెప్పుకునే వారికంటే చాలా అరుదైనవారు.

* ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా రెండవ రకం రహస్య స్నేహితుల్ని కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే అటువంటి స్నేహితుల స్నేహాన్ని ఎవరూ తమ హక్కుగా భావించరు. అటువంటి స్నేహితులు జీవితంలో చివరి మజిలీగా ఉంటారు. ఈ ఒక్క విషయంలో వాళ్ళ స్నేహాన్ని హక్కుగా భావించవచ్చు. మన జీవితంలో వాళ్ళ స్థానం కదిలించ వీలులేనిది, కానీ విచిత్రంగా వారికి ఆ నిజాన్ని గూర్చిన స్పృహ ఉండదు.

Monday, October 11, 2021

The Ink Dark Moon : Love Poems by Ono no Komachi and Izumi Shikibu, Women of the Ancient Court of Japan

జాపనీస్ సాహిత్యంలో స్వర్ణయుగంగా (Heian era) పరిగణించే 794-1185 ల మధ్య కాలానికి చెందిన ఇద్దరు కీలకమైన కవయిత్రులు ఓనో నో కొమచి,ఇజుమీ షికిబు ల కవితలను అమెరికన్ కవయిత్రి జేన్ హిర్ష్ఫీల్డ్  'ఇంక్ డార్క్ మూన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కవయిత్రులిద్దరూ జపాన్ రాజ్యసభలో (అనగా ఇప్పటి క్యోటో) భాగంగా ఉండేవారట. ఓనో కొమచి తన కవితల్లో ప్రేమ విరహం,శృంగారం,సంతాపం వంటి విషయాల్లో స్త్రీ సహజమైన భావోద్వేగాలకూ,స్పందనలకూ తాత్విక దృష్టితో అక్షరరూపమిస్తే , షికిబు కవితలలో శృంగారంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాముఖ్యతనిస్తూ రాసిన కవితలు ఉంటాయి. నిజానికి విరహాన్నీ,ప్రేమనూ స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో మగవారికి ఉండే స్వేచ్ఛ గానీ,సాధనాలు గానీ స్త్రీకి అందుబాటులో లేని కాలం అది. 4,5 శతాబ్దాలలో చైనీస్ భాష జపాన్ లో మొట్ట మొదటి లిపి ఉన్న భాషగా వ్యవహారంలో ఉండేదట, కానీ 8 వ శతాబ్దం వరకూ ఆ భాష స్త్రీలకు అందుబాటులోకి రాలేదు.

జపాను కవిత్వానికి మూలాలు మానవ మస్తిష్కంలోనుండి వ్రేళ్ళూనుకుని  ఉంటాయి కాబట్టి గాఢమైన అనుభవప్రధానమైన ఈ కవితలు హృదయపు లోతుల్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. ఎంతమంది మనుషులుంటే అన్ని విధాలైన వ్యక్తీకరణ మార్గాలు గనుక ఈ కవితల్లో ఆ కాలపు సంస్కృతిలో కన్నవీ,విన్నవీ యథాతథంగా అక్షరీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. కొమ్మల్లో దాక్కుని కూసే కోయిల, తటాకాల్లోని కలువల మధ్య నుండి వినిపించే కప్పల సందడి వంటివి ఈ కవితల్లో విరివిగా ప్రస్తావనకొస్తాయి.

Image Courtesy Google

సహజంగా ఎప్పుడూ ముందుమాట పుస్తకం చివర్లో చదివే అలవాటు నాకు. గద్యం చదివేటప్పుడు ఈ అలవాటు ఫర్వాలేకపోయింది కానీ ఈ మధ్య కవిత్వం చదివేటప్పుడు ఖచ్చితంగా ముందుమాట చదివిన తరువాతే మిగతా పేజీల్లోకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కవిత్వం చదివేముందు పరిచయ వాక్యాలు చదివితే కవితల నేపథ్యం అర్థమై ఆ వాక్యాలు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి, లేకపోతే కాంటెక్స్ట్ తెలీని ఖాళీ వాక్యాల్లా మిగిలిపోతాయి. ముఖ్యంగా ప్రాచీన కవిత్వం చదివే విషయంలో కవితల నేపథ్యం తెలియడం మరింత ముఖ్యమని తమిళ కవి ఎ.కె. రామానుజన్ కూడా అభిప్రాయపడతారు. నిజానికి ఈ కవితలు విడివిడిగా చదివినప్పుడు నాకంత గొప్పగా అనిపించలేదు. కానీ నేపథ్యం తెలిశాకా అవే కవితలు మరింత అర్థవంతంగా ధ్వనించాయి. 

స్త్రీ పురుష సంబంధాలు ప్రధాన వస్తువుగా ఉండే ఈ కవితలపై ఆ కాలపు సామజిక పరిమితులూ, పితృస్వామ్యం వంటి అంశాల ప్రభావం కనిపిస్తుంది. ఆ కాలంలో కులీన వర్గాల్లో వివాహితుడైన పురుషుడు ఎంత మంది స్త్రీలతోనైనా సంబంధం కలిగి ఉండవచ్చు. కానీ వివాహిత అయిన స్త్రీ మాత్రం పాతివ్రత్యంతో భర్త పట్ల విధేయతతో మెలగాలి. అవివాహిత స్త్రీలకు మాత్రం ఈ  విషయంలో మినహాయింపు ఉండేది కానీ సాధారణంగా వారు ఇటువంటి సంబంధాలను రహస్యంగా నెరపేవారట. ఈ పుస్తకంలో కోర్టింగ్ విషయంలో రాసిన మరి కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ కాలంలో మగవారు ఎవరినైనా ఇష్టపడితే ఆ స్త్రీకి లిఖితరూపంలో నాలుగైదు పంక్తుల కవిత రాసి పంపేవారట. ఆమెకు ఆ కవిత్వం, కవిత్వపు భాష గనుక నచ్చితే అదే మార్గంలో తిరిగి జవాబు అందేదట. అంటే కవిత్వానికీ, భాషకీ ఆ కాలంలో అంతటి ప్రాముఖ్యత ఉండేదని అర్ధమవుతుంది.

ఇందులోని కొన్ని కవితలకు నా స్వేచ్ఛానువాదం :

నీ విరహంలో ఈ హృదయం వెయ్యి ముక్కలైంది

నేనొక్క ముక్కను కూడా కోల్పోలేదు. 

 

నేను నీకోసం పరితపిస్తున్నప్పుడు నీవు చేరువకాకుండా దూరంగా ఉండి ఉంటే

ఈపాటికి నేను నిన్ను మరచిపోయి ఉండేదాన్ని.


ఈ ప్రపంచమొక జాగృత స్వప్నమని నీకు తెలియదా ?

నేను నీకోసం తపించిన ఆనాటి క్షణాలు, అవి కూడా అశాశ్వతమైన భావనలే  కదా !


నేను నీ పేరు పదేపదే పలవరించినా  ఈ వాస్తవం నా హృదయపు  తీవ్రతను ప్రతిబింబించగలదా ?  


నా సన్నిహితుడూ, నా శరీరమూ  కూడా  త్వరలో మేఘాలుగా  రూపాంతరం చెంది  

తలోదిక్కుకీ ప్రవహిస్తాయి.


నిరంతరం అలుపెరగక నా స్వప్నాల దారుల వెంట అతన్ని చేరుకోవడం

వాస్తవ ప్రపంచానికి వచ్చేసరికి ఒక క్రీగంట చూపుతో  సరిసమానం కాదు.  

 

అతడి ఆలోచనలతో నిద్రకుపక్రమించాను కాబట్టి అతడు నా నిదురలో అగుపించాడా !

అది స్వప్నమని అవగతమైతే నేను నిదుర మేల్కొనేదాన్నే కాదు !

 

ఈ విరహపు తీవ్రత అవధుల్లేనిది. 

నిశీధి స్వప్నాల దారులవెంట నీ చెంతకు చేరుకునే వేళ

కనీసం నన్నెవరూ నిందించలేరు.

   

నీవు వదిలివెళ్ళిన జ్ఞాపకాల బహుమతులు

నాకు శత్రువులుగా  మారాయి. 

అవి లేకపోతే కనీసం క్షణకాలపు మరుపు సాధ్యమయ్యేది.

Saturday, October 9, 2021

A Moveable Feast - Ernest Hemingway

పాండెమిక్ రోజులు. నాకేమో అర్జెంటుగా ఎక్కడికో అక్కడికి ప్రయాణమై వెళ్ళాలని ఉంది. అనుకున్నదే తడవు పారిస్ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఒంటరిగా వెళ్ళడం బోర్. పోనీ హెమ్మింగ్వేతో కలిసి వెళ్తే !!! ఆయనకు పారిస్ వీధులన్నీ కొట్టిన పిండి అంటారు. కానీ పారిస్ అంతా చుట్టి రావాలంటే కనీసం నాలుగైదు రోజులైనా పడుతుంది. ఎర్నెస్ట్ కాస్త కోపిష్టి అని ఇదివరకే విని ఉన్నాను కాబట్టి ఆయనతో ప్రయాణం గురించి ముందుగానే ప్రిపేర్ అయ్యాను. :) 

పారిస్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేవి కేఫ్స్. అసలు పారిస్ అనగానే వర్షపు రోజుల్లో ఊరంతా గ్రే కలర్ పెయింట్ చేసినట్లు ఉండే వాతావరణంలో, ఖాళీగా ఉండే కేఫ్ లో ఏదో ఒక మూలగా కూర్చుని రచయితలు స్టైల్ గా సిగార్స్ పీలుస్తూ మధ్యమధ్యలో డ్రింక్స్ సిప్ చేస్తూ తమను తాము మర్చిపోయి రాసుకోవడం ఊహకొస్తుంది. కాఫీలు ఏదో ఒక కేఫ్ లో తాగొచ్చులెమ్మని నేనూ,హెమ్మింగ్వే పొద్దున్నే నగర సంచారానికి బయలుదేరాం. వర్షంలో పారిస్ వీధుల్లో నడుచుకుంటూ వెడుతుంటే ముందుగా St-Michel లోని Cafe des Amateurs కనిపించింది. నిరంతరం వచ్చేపోయే జనాలతో ఆ కేఫ్ ఖాళీ ఎరుగదు. లోపల మనుషుల రద్దీ,సిగరెట్ల వేడీ వెరసి ఆ కేఫ్ అద్దాలు ఎప్పుడూ పొగచూరిపోయి ఉంటాయి. ఈ గందరగోళంలో కూర్చుని కుదురుగా రాసుకోవడం అయ్యేపని కాదు గానీ మరో చోటికి వెళదాం అంటూ ముందుకు సాగారు హెమ్మింగ్వే. నేను మారుమాటాడకుండా ఆయన్ను అనుసరించాను. వర్షంలో Boulevard St. German ని దాటుకుని కేఫ్ లు ఉన్న దాఖలాలేమైనా కనిపిస్తాయేమో అని భవనాలపై చిమ్నీ పొగల ఆనవాళ్ళు వెతుకుతూ ముందుకు వెళ్ళగా Closerie des Lilas అనే ఒక కేఫ్ కనిపించింది. నిశ్శబ్దంగా మమ్మల్ని ఆహ్వానించిన 'లిలాస్' హెమ్మింగ్వేకు ఎంతో ఇష్టమైన కేఫ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ మాటకొస్తే హెమ్మింగ్వే మాత్రమే కాదు,1920ల్లో ఫిట్జ్ గెరాల్డ్,ఎజ్రా పౌండ్,పికాసో, జేమ్స్ జాయ్స్,గెర్ట్రూడ్ స్టెయిన్ వంటి అనేకమంది కళాకారులు ఆ కేఫ్ లో తరచూ సమయం గడిపేవారట. ఇప్పటికీ వారి గుర్తుగా కొన్ని టేబుల్స్ మీద ఆయా రచయితల,కళాకారుల పేర్లు మెటల్ ప్లేట్స్ మీద రాసి ఉంటాయంటారు. ఈలోగా పారిస్ వచ్చిన కొత్తల్లో తన సాహితీ ప్రస్థానం గురించీ, తనకు ఇష్టమైన ప్రదేశాల గురించీ, సాహితీవేత్తల గురించీ నాకు మెల్లి మెల్లిగా తనదైన శైలిలో పరిచయాలు మొదలుపెట్టారు హెమ్మింగ్వే.

ఈ సందర్భంలో ఒక చిన్న జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక వర్షపురోజు ఆ కేఫ్ లో కూర్చుని తన జేబులోని నోట్ బుక్కూ ,పెన్సిలు బయటకు తీసి మధ్య మధ్యలో St.James రమ్ తాగుతూ రాసుకుంటున్న సమయంలో ఆయన ఎదురుగా కాస్త దూరంలో మరో టేబుల్ దగ్గర కూర్చున్న అందమైన యువతి కనిపించిందట. ఆ క్షణంలో ఆయనలోని కళాకారుడికి ఆమె రూపంలో మరో కథ దొరికింది. 

I've seen you, beauty, and you belong to me now, whoever you are waiting for and if I never see you again, I thought. You belong to me and all Paris belongs to me and I belong to this notebook and this pencil.

Image Courtesy Google

పారిస్ లో ఉంటూ గెర్ట్రూడ్ స్టెయిన్, పికాసో లను కలవని వారుంటారా ! హెమ్మింగ్వేకు సహజంగానే గెర్ట్రూడ్ తో మంచి దోస్తీ కుదిరింది. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆనతి కాలంలోనే ఆ స్నేహం వెలిసిపోయింది. ఇది నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు,పర్వతాలను పోలే ఇగోలకు నెలవైన ఇంటెలెక్చువల్ వర్గాల్లో ఇటువంటివి సర్వసాధారణం. గెర్ట్రూడ్ స్టెయిన్ తో స్నేహం గురించి హెమ్మింగ్వే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు. నాకైతే ఆయన చెప్పినదాన్ని బట్టి ఆమె చాలా సూపర్ఫీషియల్ గా అనిపించారు. తన రచనలపట్ల సానుకూలంగా స్పందించని రచయిల గురించి ఆమె ఒక్క మంచి మాట మాట్లాడగా వినలేదంటారు హెమ్మింగ్వే.

She quarrelled with nearly all of us that were fond of her except Juan Gris and she couldn't quarrel with him because he was dead.అని ఛలోక్తి విసురుతారు.

అమెరికన్ రచయిత షేర్వుడ్ ఆండర్సన్ ప్రస్తావన వచ్చినప్పుడు స్టెయిన్ ఆయన ఇటాలియన్ నీలి కళ్ళనూ,ఛరిష్మానీ పొగిడినంతగా ఆయన కథలను గూర్చి మాట్లాడలేదనేది హెమ్మింగ్వే ఫిర్యాదు. ఏం పుస్తకాలు చదువుతున్నావు అని హెమ్మింగ్వేను అడిగి, ఆయన ఆల్డస్ హక్స్లే , డి.హెచ్. లారెన్స్ లను చదువుతున్నానని చెప్తే , 'Huxley is a dead man', 'Why do you want to read a dead man? Can't you see he is dead?' 'You should only read what is truly good or what is frankly bad.' అని ఆ రచయితల్ని తీసిపారేశారట గెర్ట్రూడ్. ఆమెకు 'నచ్చడం' విషయంలో చాలా పేచీలున్నట్లున్నాయి. ఆమె ఇంట్లో eau-de-vie సిప్ చేస్తూ హెమ్మింగ్వే కూ గెర్ట్రూడ్ కూ మధ్య జరిగిన సంభాషణల్లో 1920ల నాటి పారిస్ సాహితీ ప్రపంచం అంతా కళ్ళముందు కనిపిస్తుంది. రాత్రి వేళల్లో బంగారు కాంతుల ధగధలతో మెరిసిపోయే పారిస్ లో ఏవగింపు కలిగించే చీకటి కోణాలను గురించి హెమ్మింగ్వేకు చెబుతూ, ఈ విధంగా అంటారు గెర్ట్రూడ్. ఈ మాటల్లో మిస్ గెర్ట్రూడ్ లోని హార్డుకోర్ ఫెమినిస్టు అలా తళుక్కున ఒకసారి మెరిసి మాయమౌతారు :

'You know nothing about any of this really, Hemingway,' she said. 'You've met known criminals and sick people and vicious people. The main thing is that the act male homosexuals commit is ugly and repugnant and afterwards they are disgusted with themselves. They drink and take drugs, to palliate this, but they are disgusted with the act and they are always changing partners and cannot be really happy.'

'In women it is the opposite. They do nothing that they are disgusted by and nothing that is repulsive and afterwards they are happy and they can lead happy lives together.'

ఇక సాహితీ ప్రియులన్నాక పారిస్ కు వెళ్ళి rue de l'Odeon లోని 'షేక్స్పియర్ అండ్ కో' బుక్ షాప్ కి వెళ్ళకపోతే ఎలా ! పారిస్ వెళ్ళిన కొత్తల్లో హెమ్మింగ్వేకు పుస్తకాలు కొనుక్కుని చదివే స్తోమత లేక ఆ బుక్ షాప్ ఓనర్ సిల్వియా బీచ్ రెంటల్ లైబ్రరీలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకునేవారట. ఆయన మొదటిసారి ఆ షాప్ కు వెళ్ళినప్పుడు రెంటల్ లైబ్రరీలో జాయిన్ అవ్వడానికి కూడా సరిపడా డబ్బు లేకపోతే సిల్వియా "డిపాజిట్ ఎప్పుడైనా కట్టవచ్చు, ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పట్టుకెళ్ళండి" అని మెంబర్షిప్ కార్డు తయారుచేసి ఇచ్చారని ఎంతో అభిమానంగా తలచుకున్నారు హెమ్మింగ్వే. ఆ లైబ్రరీలోనే తుర్గెనెవ్,గొగోల్,టాల్స్టాయ్,చెహోవ్ వంటి రష్యన్ సాహితీవేత్తల రచనల్ని ఔపాసన పట్టారాయన. పారిస్ కు రాక మునుపు టోరెంటోలో ఉండగా క్యాథెరిన్ మాన్స్ఫీల్డ్ గొప్ప కథా రచయిత్రి అని విన్నాననీ, కానీ సహజమైన శైలిలో రాసే డాక్టర్ చెహోవ్ ని చదివిన తరువాత క్యాథెరిన్ ని చదివితే ఒక 'యంగ్ ఓల్డ్-మెయిడ్' అతి జాగ్రత్తగా కూర్చిన కృత్రిమమైన కథల్ని వింటున్నట్లు ఉందనీ అంటారు. Mansfield was like near-beer. It was better to drink water. But Chehov was not water except for the clarity. అంటారాయన.

పారిస్లో తొలి చివురులు తొడిగే వసంత ఋతువు (ఫాల్స్ స్ప్రింగ్) శోభను వర్ణిస్తూ, ఆనందంగా ఉండడానికి ఇంతకంటే మరో కారణం అఖ్ఖర్లేదంటారు హెమ్మింగ్వే. ఆ అందమైన వాతావరణాన్ని చెడగొట్టగల శక్తి మనుషులకు మాత్రమే ఉంది కాబట్టి,ఆ సమయంలో మనుషులను దూరం పెట్టగలిగితే వసంత ఋతువులో ప్రతిరోజూ సుదీర్ఘమైనదే అంటూ, People were always the limiters of happiness except for the very few that were as good as spring itself. అని ముక్తాయింపునిస్తారు.

జర్నలిజాన్ని వదిలేసి, సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బుతో పారిస్ కు వచ్చి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టాలనుకున్న హెమ్మింగ్వే దంపతులు పారిస్లో విలాసవంతవంతమైన జీవితాన్ని జీవించారనుకుంటే పొరపాటే. కొత్త ప్రపంచంలో తాత్కాలికంగా గుర్రపు పందాలూ,తాగుడూ వంటి ఖరీదైన వ్యసనాలకు బానిసలైనా,వాటిని కూడా క్రమశిక్షణతో అధిగమించారు. పారిస్లో గడిపిన కాలంలో పేదరికంతో పాటు హెమ్మింగ్వేకు ఆకలి బాధ కూడా తెలుసు. ఆయన వద్ద ఒక్కోసారి డబ్బులేక పస్తులుండవలసిన అవసరమొచ్చినప్పుడు Luxembourg గార్డెన్స్ లో రెండుగంటల పాటు ఊరికే చక్కర్లు కొట్టి,ఇంటికి వచ్చాకా మాత్రం స్నేహితులతో కలిసి మధ్యాహ్నం బ్రహ్మాండమైన విందు చేశానని భార్య వద్ద కోతలుకోసేవారట.

There is never any ending to Paris and the memory of each person who has lived in it differs from that of any other. We always returned to it no matter who we were or how it was changed or with what difficulties, or ease, it could be reached. Paris was always worth it and you received return for whatever you brought to it. But this is how Paris was in the early days when we were very poor and very happy.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు జగమెరిగిన సత్యాలైతే మరికొన్ని ఎవరికీ తెలియని రహస్యాలు. ఇక ఏదైనా ప్రాంతాన్ని గురించిన ప్రస్తావన, అక్కడ నివసించిన మనుషుల గురించి చెప్పుకోకపోతే పూర్తవ్వదు కదా ! ఇందులో హెమ్మింగ్వే పారిస్ ఆత్మను పట్టుకోవడంతోపాటుగా  తన సమకాలీన రచయితల గురించి కూడా అనేక విషయ విశేషాలను పొందుపరిచారు. ముఖ్యంగా హెమ్మింగ్వేకు సన్నిహితులైన ఫిట్జ్ గెరాల్డ్,జెల్డాల అస్తవ్యస్థమైన దాంపత్యాన్ని గురించీ, ఎజ్రా పౌండ్ ఎల్లలులేని మంచితనం గురించీ, గెర్ట్రూడ్ స్టెయిన్ సూపర్ఫీషియల్ వ్యక్తిత్వాన్ని గురించీ ప్రత్యేకం కొన్ని పేజీలు కేటాయించారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ,ట్రావెలాగ్ లను ఏకకాలంలో చదువుతున్నట్లు అనిపించింది. కావాలంటే ఈ రచనను పాఠకులు కాస్త కాల్పనిక దృష్టితో చూసే వెసులుబాటును తమకు తామే కల్పించుకోవచ్చని అంటారు హెమ్మింగ్వే. పుస్తకం పేరుకు అక్షరాలా న్యాయం చేకూర్చిన ఈ రచన పాఠకులకు పూర్తిస్థాయి విందులానే ఉంటుంది.

యాత్ర పూర్తై ఇల్లు చేరినా కూడా ఆ అనుభవాలు మాత్రం ఇంకా నన్ను వదిలిపోలేదు. ఇక అసలు విషయానికొస్తే,ఆన్లైన్ క్లాసులకు కూడా వేసవి సెలవులు ఇవ్వడంతో ఇది వరకూ చూసిన సినిమాలే మా తిలక్ ని కోవిడ్ సమయంలో ఎంగేజ్ చెయ్యడానికి మరోసారి వాడితో కలిసి చూశాము. అందులో 'మిడ్నైట్ ఇన్ పారిస్' ఒకటి. 1920 ల నాటి పారిస్ ప్రపంచాన్ని అంత అందంగా చూపించిన సినిమాలు నేనైతే మరింకేవీ చూడలేదు. ఫిట్జ్ గెరాల్డ్, గెర్ట్రూడ్ స్టెయిన్, పికాసో, కోల్ పోర్టర్, హెమ్మింగ్వే వంటి పలు సాహితీవేత్తలూ,చిత్రకారులూ,సంగీతకారులూ ఈ సినిమాలో సజీవమైన పాత్రలుగా దర్శనమిస్తారు. నిడివి తక్కువున్నా ఆ పాత్రల్లో మా అందరికీ బాగా నచ్చిన పాత్ర హెమ్మింగ్వే ది. ముఖ్యంగా St.Michel ప్రాంతంలోని ఒక కేఫ్ లో హెమ్మింగ్వేకూ,హీరోకూ మధ్య జరిగే 4,5 నిముషాల సంభాషణ ముక్కుసూటి మనిషైన హెమ్మింగ్వే వ్యక్తిత్వాన్ని యధాతథంగా పట్టుకుందనిపించింది. ఆ సినిమా చూశాక హెమ్మింగ్వే పారిస్ అనుభవాల గురించి రాసిన 'ఎ మూవబుల్ ఫీస్ట్' చదవాలనిపించింది. సహజంగా ప్రకృతి వర్ణనలూ,ప్రదేశాల గురించి వర్ణనలూ చదవాలంటే నాకు చాలా విసుగు. అటువంటివి పుస్తకాల్లో చదవడంకంటే ప్రత్యక్షంగా చూడాలనుకుంటాను. కానీ 'మిడ్నైట్ ఇన్ పారిస్' సినిమా చూశాక పారిస్ ను హెమ్మింగ్వే కళ్ళతో మరోసారి చూడాలన్న కోరిక కలిగింది. దాని ఫలితమే ఇది.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

Don't you know all writers ever talk about is their troubles?

'Never to go on trips with anyone you do not love.'

In the end everyone, or not quite everyone, made friends again in order not to be stuffy or righteous. I did too. But I could never make friends again truly, neither in my heart nor in my head. When you cannot make friends any more in your head is the worst.

రచయితలకు హెమ్మింగ్వే పారిస్ లో తన అనుభవాల రూపంలో ఇచ్చిన సలహాలూ,సూచనలు : 

After writing a story I was always empty and both sad and happy, as though I had made love, and I was sure this was a very good story although I would not know truly how good until I read it over the next day.

When I was writing, it was necessary for me to read after I had written. If you kept thinking about it, you would lose the thing that you were writing before you could go on with it the next day. It was necessary to get exercise, to be tired in the body, and it was very good to make love with whom you loved. That was better than anything. But afterwards, when you were empty, it was necessary to read in order not to think or worry about your work until you could do it again. I had learned already never to empty the well of my writing, but always stop when there was still something there in the deep part of the well, and let it refill at night from the springs that fed it. 

All you have to do is write one true sentence. Write the truest sentence that you know.' So finally I would write one true sentence, and then go on from there. It was easy then because there was always one true sentence that I knew or had seen or had heard someone say. If I started to write elaborately, or like someone introducing or presenting something, I found that I could cut that scrollwork or ornament out and throw it away and start with the first true simple declarative sentence I had written. Up in that room I decided that I would write one story about each thing that I knew about. I was trying to do this all the time I was writing, and it was good and severe discipline.

It made me feel sick for people to talk about my writing to my face, and I looked at him and his marked-for-death look and I thought, you con man conning me with your con.

I've been wondering about Dostoevsky,' I said. 'How can a man write so badly, so unbelievably badly, and make you feel so deeply?

But Ezra, who was a very great poet, played a good game of tennis too. Evan Shipman, who was a very fine poet and who truly did not care if his poems were ever published, felt that it should remain a mystery.

'We need more true mystery in our lives, Hem,' he once said to me. 'The completely unambitious writer and the really good unpublished poem are the things we lack most at this time. There is, of course, the problem of sustenance.'

If a man liked his friends' painting or writing, I thought it was probably like those people who like their families, and it was not polite to criticize them. Sometimes you can go quite a long time before you criticize families, your own or those by marriage, but it is easier with bad painters because they do not do terrible things and make intimate harm as families can do. With bad painters all you need to do is not look at them. But even when you have learned not to look at families nor listen to them and have learned not to answer letters, families have many ways of being dangerous. Ezra was kinder and more Christian about people than I was. His own writing, when he would hit it right, was so perfect, and he was so sincere in his mistakes and so enamoured of his errors, and so kind to people that I always thought of him as a sort of saint. He was also irascible but so perhaps have been many saints.

When I woke with the windows open and the moonlight on the roofs of the tall houses, it was there. I put my face away from the moonlight into the shadow but I could not sleep and lay awake thinking about it. We had both wakened twice in the night and my wife slept sweetly now with the moonlight on her face. I had to try to think it out and I was too stupid. Life had seemed so simple that morning when I had wakened and found the false spring and heard the pipes of the man with his herd of goats and gone out and bought the racing paper.

But Paris was a very old city and we were young and nothing was simple there, not even poverty, nor sudden money, nor the moonlight, nor right and wrong, nor the breathing of someone who lay beside you in the moonlight.

By then I knew that everything good and bad left an emptiness when it stopped. But if it was bad, the emptiness filled up by itself. If it was good you could only fill it by finding something better.

Monday, October 4, 2021

Because He Is - Meghna Gulzar

"ప్రముఖుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కూతుళ్ళూ,అల్లుళ్ళూ లాంటి వారు వారి బయోగ్రఫీలు రాసే సాహసం చెయ్యరాదు. ఒకవేళ చేసినా పాఠకుల విలువైన సమయం వృథా చెయ్యరాదు." (పైన వేరే తెలుగు పదాలు వాడాలని స్ట్రాంగ్ గా అనిపించినా , I'm just trying to be decent & polite) గుల్జార్ గురించి ఆయన కుమార్తె మేఘనా గుల్జార్ రాసిన 'బికాజ్ హీ ఈజ్' అనే పుస్తకం చదివాక నాకనిపించిన మొట్టమొదటి ఆలోచన ఇది. నిజానికి నేను బయోగ్రఫీలు,మెమోయిర్స్ లాంటివి ఎందుకు చదువుతాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ప్రముఖుల గురించి అందునా సినిమా రంగంలో ఉన్నవారి గురించి మనకు ఎక్కడ చూసినా కావాల్సినంత సమాచారం లభ్యమవుతూనే ఉంటుంది. ఫలానా నటుడు ఫలానా హోటల్ లో ఇడ్లీ,చట్నీ రోజూ తెప్పించుకుని తింటాడనీ, ఫలానా నటికి మనుషుల కంటే కుక్కలూ,పిల్లులూ,బల్లులూ అంటే ఎక్కువ ప్రీతీ అనీ, ఫలానా సింగర్ కి చీర కంటే సల్వార్ సూట్ వేసుకోవడమే ఇష్టమనీ, ఫలానా దర్శకుడికి స్విట్జర్లాండ్ వెళ్తేనే గానీ షూటింగ్ కి అవసరమైన 'క్రియేటివ్ మ్యూజ్' రాదనీ, ఫలానా సపోర్టింగ్ ఆక్టర్ షూటింగ్ లో రోజుకో పుస్తకం నమిలెయ్యనిదే నిద్రపోడనీ పత్రికలూ,మీడియా అరిగిపోయిన రికార్డుల్లా రోజుకో పదిసార్లు టీవీల్లో,సోషల్ మీడియాలో,పత్రికల్లో చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ పుస్తకం విషయానికొద్దాం. 

Image Courtesy Google

నేను 'తల్వార్' చూసినప్పటి నుండీ మేఘన ఫ్యాన్ ని. 'రాజీ' తో ఆమె అంటే ఇష్టం మరింత పెరిగింది. సహజంగా నేను ముట్టని ఇటువంటి ఒక పుస్తకం చదవడానికి కారణం అదే. ఆమె రాసింది ఎవరి గురించో కాదు 'గుల్జార్' గురించి. చాలా లోతైనమనిషి గుల్జార్ గురించి ఆమె ఏం రాసుంటుందా అనే కుతూహలం. కానీ ఈ పుస్తకం రాసిన రచయిత్రి మేఘన తనకు అత్యంత ఇష్టమైన తండ్రి గురించి అంతే ప్రేమగా ఐదేళ్ళ పసిపాప పరిణితితో రాసిందనిపించింది. ఉదాహరణకు మనం సహజంగా మన అమ్మా,నాన్న గురించి చెబుతాం చూడండి, "మా నాన్నగారు అలా చేసేవారూ" , "మా అమ్మగారు ఇలా అన్నారు" , "అప్పుడేమైందో తెలుసా, మా ఇంటికి చుట్టాలొచ్చారు", " ఆ అంకుల్ నాకెప్పుడూ చాకోలెట్స్ తేకుండా రారు తెలుసా "," అపుడు మేమంతా కలిసి పిక్నిక్ కి వెళ్ళాం". మేమంతా కలిసి ఫలానా చోట క్రికెట్ ఆడుకున్నాం." etc etc  వివరాలు అన్నమాట. మేఘన ఈ రచనలో ఒక తండ్రిగా 'పాపి' ని (ఆయన్ను కూతురు అలా పిలుస్తుంది) పరిచయం చేశారు. నిజానికి గుల్జార్ కంటే ఆయన కూతురుగా మేఘనా గుల్జార్ గురించే ఈ పుస్తకంలో ఎక్కువ విషయాలున్నాయి. ఇందులో రచయిత్రి  గుల్జార్ పుట్టిన ఊరు మొదలు,ఆయన హిస్టారికల్ డీటెయిల్స్ వగైరా వగైరా అంటే ఏమేం సినిమాలు తీశారు,ఎంతమందితో కలిసి పనిచేశారూ వంటి ఆధార్ కార్డుకి అవసరమైన అన్ని పైపై వివరాలూ చదివి అలసి సొలసి విరక్తి వచ్చేసింది. ఏమన్నా అంటే అన్నామంటారు, గుల్జార్ తన పంచె లాల్చీ ఎక్కడ ఐరన్ చేయించుకుంటే మనకెందుకు చెప్పండి ! మనలో మనమాట ఆయన గెడ్డం ఎవరు గీస్తే మనకెందుకు. ఏదేమైనా మేఘనకి ఇంత ఛాదస్తం ఉంటుందనుకోలేదు. ఇక గుల్జార్ బాల్యం, ఒంటరితనం, కుటుంబం గురించి ఆమె రాసిన కొన్ని వివరాలు మాత్రం ఆ మహాకవిని మరో సాధారణ కోణంలో చూసే అవకాశాన్నిస్తాయి. 

ఈ పుస్తకం చదవడం ద్వారా తెలిసిన సంపూరణ్ సింగ్ కల్రా కంటే ఆయన కవిత్వం,పాటల ద్వారా తెలిసిన గుల్జార్ మనకు ఎక్కువ సన్నిహితంగా అనిపిస్తారు. గుల్జార్ గురించి చదువుతున్నాం అనుకోకుండా ఒక తండ్రి గురించీ, పిల్లల పెంపకం గురించీ చదువుతున్నాం అనుకుంటే ఇది ఒక మంచి పుస్తకమే. అక్కడక్కడా తళుక్కున మెరిసిన గుల్జార్ 'unpublished poems' పాఠకులకు కాస్త ఊరట.

ఫాక్ట్స్....   ఫాక్ట్స్...  ఫాక్ట్స్.... ఎవరిక్కావాలి ఈ ఫాక్ట్స్.. అవి వినీ,చదివే వయసు దాటిపోయాననీ, నాకు వయసైపోతోందనీ ఈ పుస్తకం చదివిన తరువాత కలిగిన చిరాకు వల్ల అర్ధమవుతోంది. ఈ పుస్తకానికి ఇంతకంటే పరిచయం అనవసరం. కవర్ మీద గుల్జార్ ఫోటో చూసి నాలా బలైపోకుండా ముందస్తు హెచ్చరిక అన్నమాట. 

సో .... నో హ్యాపీ రీడింగ్.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,    

పుస్తకం ముందుమాటలో గుల్జార్ :

One thing we all fail to realize is that as they are growing up, our children observe and absorb so much about their parents, about us, that their truths about their parents, about us, could shock us…

They know if we don’t wash our hands before meals … They know the language we use if we abuse our servants … They know if we are at home and have conveyed a message on the phone saying that we have left … They know we tell lies … They instinctively know our relations with our friends and relatives. They know our hypocrisies…

తల్లి రాఖీ,తండ్రి గుల్జార్ విడిపోవడం గురించి ఆమె రాసిన వాక్యాలు నాకు నచ్చాయి : 

Speculations are aplenty, as are the reasons. I would like to believe that they are two good people, who were just not good together. And since nobody questioned why they came together, they needn’t have to explain why they parted. What transpires between two people should remain just there – between the two people. I was raised to respect their reasons and appreciate the fact that I was spared the emotional scars of squabbling parents and bitter mudslinging.

He’s been a very egalitarian father – never talking down to me, but always talking to me, never instructing, but rather suggesting. And yet, he instilled a sense of discipline and respect in me. It was a very novel way of parenting, according to me.

Dil kuchh is tarah se bhar aaya tha mera ke pet bharne ki gunjaaish nahin thi.


sheher ki bijli gayi

band kamre mein bahot der talak kuchh bhi dikhai na diya

tum gayi thi jis din

us roz bhi aisa hi hua tha

aur bahot der ke baad

aankhen tariki se maanus hui toh

phir se darvaaze ka khaaka sa nazar aaya mujhe


kai pinjron ka qaidi hoon

kai pinjron mein basta hoon

mujhe bhaata hai qaiden kaatna

aur apni marzi se

chunav karte rehna

apne pinjron ka

meyaaden tai nahin karta main rishton ki

aseeri dhoondta hoon main

aseeri achchhi lagti hai

‘You must give respect to earn respect’ – it’s not just a hollow saying. But very often parents erroneously expect respect from their children just because they’re parents. What the child really feels is probably more fear than respect. Papi respected me as an individual even while I was a toddler and, as a result, I have grown up with a tremendous sense of respect for the person he is – not only because he is my father. 

Tuesday, September 21, 2021

The Housekeeper and the Professor - Yoko Ogawa

బంధాలను ఎప్పటికప్పుడు గతాన్నుంచి వేరు చేసి కొత్త వెలుగులో చూడడం కష్టమైన పని అనిపిస్తుంది. ముఖ్యంగా జ్ఞాపకాలతోనే ముడిపడి ఉండే సన్నిహిత సంబంధాల విషయంలో ఇది మరింత అసాధ్యమనిపిస్తుంది ! కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తుంది జాపనీస్ రచయిత్రి యోకో ఒగావా నవల 'ది హౌస్ కీపర్ అండ్ ది ప్రొఫెసర్'. 1975 లో ఒక కార్ ఆక్సిడెంట్ లో తలకు తగిలిన బలమైన గాయం కారణంగా కేవలం ఎనభై నిముషాల పాటు మాత్రమే ఏదైనా జ్ఞాపకం ఉండే అరవై ఐదేళ్ళ జీనియస్ మాథ్స్ ప్రొఫెసర్ ఈ కథలో ప్రధాన పాత్రధారి. కాగా ప్రొఫెసర్ బాగోగులు చూడడానికి అతడి ఇంటికి హౌస్ కీపర్ గా వచ్చిన ప్రొటొగోనిస్ట్,ఆమె పదకొండేళ్ళ కొడుకు 'రూట్' ల చుట్టూ ఈ కథంతా తిరుగుతుంది. యోకో ఒగావా 2003 లో రాసిన ఈ నవలను స్టీఫెన్ స్నైడర్ 2009 లో ఆంగ్లంలోకి అనువదించారు.

Image Courtesy Google

కథ విషయానికొస్తే ప్రొఫెసర్ జ్ఞాపకాలన్నీ 1975 దగ్గరే ఆగిపోయిన కారణంగా ఆయనకు కొత్త విషయాలూ, మనుషులూ 80 నిముషాలకు మించి గుర్తు ఉండరు. ఈ కారణంగా తనకి అవసరమైన వివరాలన్నీ చిన్న చిన్న నోట్స్ లా రాసుకుని ఆ కాగితాలన్నీ రోజూ ధరించే పాత కోటు మీద  అంటించుకుంటారు. ప్రొఫెసర్ రోజులో అధికభాగం తన స్టడీ రూమ్ లో తనకు ఎంతో ఇష్టమైన లెక్కలే ప్రపంచంగా కొత్త కొత్త ఫార్ములాలూ,థియరీలూ సృష్టిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయం ప్రొఫెసర్ ఇంటికి వచ్చే హౌస్ కీపర్ ని ఆమె పుట్టినప్పుడు ఎంత బరువుంది ? ఆమె పుట్టినరోజు ఎప్పుడు లాంటి వివరాలడిగి ఆ అంకెలతో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తికాని హౌస్ కీపర్నీ,స్కూల్లో చదువుకునే ఆమె కొడుకు 'రూట్' నీ (చదునుగా ఉన్న అతడి తల చూసి స్క్వేర్ రూట్ ఆకారంలో ఉందని ఆ పేరు పెడతారు ప్రొఫెసర్ ) లెక్కల్లో ప్రశ్నలు అడుగుతూ వారిని కేవలం తనకు మాత్రమే సొంతమైన గణిత ప్రపంచంలోకి ఆహ్వానిస్తారు. దీనికి తోడు బేస్ బాల్ గురించిన ఆ ముగ్గురికీ ఉమ్మడిగా ఉన్న ఆసక్తి కూడా వారి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి దోహదపడుతుంది. వయోభేదాలనూ,సామాజికవర్గ వైరుధ్యాలనూ దాటుకుని వారి ముగ్గురి బంధం, మనిషిని సాటిమనిషితో కలిపే ప్రేమ,దయ,మానవత్వం పునాదులుగా రోజురోజుకీ బలపడుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజులు గడిచిపోతుండగా ఒకరోజు హౌస్ కీపర్ కి ఇక మీదట ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళనవసరం లేదని ఆమె పని చేస్తున్న ఏజెన్సీ నుంచి ఫోన్ వస్తుంది. విడదీయలేనంతగా పెనవేసుకున్న వారి ముగ్గురి జీవితాల్లో ఆ తరువాత ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నది మిగతా కథ.

సింహభాగం జాపనీస్ కథల్లోలాగే ఈ కథలో కూడా కథనం బాహ్య ప్రపంచానికి సంబంధించిన భారీ వర్ణనలకు దూరంగా సరళమైన అంతఃప్రపంచపు భావోద్వేగాల మిశ్రమంగా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ కథల్లో కథ కంటే నేపథ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఎక్కువ కనబడుతుంది. దీనికితోడు కథను చెప్పే విషయంలో జాపనీస్ రచయితలకూ రష్యన్ రచయితలకూ ఒక సారూప్యత ఉంది,ఏదైనా ఒక ఇంటిని గురించి కథ చెప్పాలంటే రష్యన్లలాగే జాపనీస్ కూడా పాఠకుల్ని ఇంటి వరండాలో కూర్చోబెట్టకుండా ముందుగా ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. తాము సృష్టించిన పాత్రలతో మొక్కుబడి మాటామంతీతో సరిపెట్టకుండా,వారిని  పాఠకులకు ఆత్మీయంగా పరిచయం చేస్తారు. తీరా ఇంట్లోకి అడుగుపెట్టాకా అతిథులకు కేవలం కాఫీ టిఫిన్లతో సరిపెట్టరు. చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళిపోకుండా తమతో కొన్ని రోజులు గడపమంటారు, వారి సరళమైన దైనందిన జీవితానికి ప్రత్యక్ష సాక్షులుగా చేసుకుంటారు. ఉదాహరణకు హౌస్ కీపర్ వంట చేస్తున్న సమయంలో వాలుకుర్చీలో కూర్చుని ప్రొఫెసర్ గణితప్రపంచంలోకి మెల్లిగా జారుకోవడం, రూట్ పట్ల ప్రొఫెసర్ కనబరిచే ప్రేమాభిమానాలూ, సాయంకాలం కిటికీ తలుపుల్లోంచి కాళ్ళమీద పడే చిరుజల్లులూ, కిటికీ బయట కొండల్లో పొద్దుగుంకడం లాంటివి ఇందులో కళ్ళకుకట్టినట్లు వర్ణించారు. నేను చాలా కాలం క్రితం చదివిన యసునారీ కావబాతా 'బ్యూటీ అండ్ సాడ్నెస్' లో వర్ణించిన 'క్యోటో' ప్రపంచం ఈరోజుకీ నా మనసులో తాజాగా ఉంది. జాపనీస్ కథల్లో ప్రత్యేకత ఏంటంటే కథ చదివిన చాలా కాలం వరకూ కథనూ,పాత్రల్నీ మర్చిపోయినా ఆ పరిసరాలూ,నేపథ్యం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. ఈ రచనలో గణితాన్ని పొయెటిక్ సెన్స్ లో చూపించే ప్రయత్నం చేశారు. నేరేషన్ లో చిన్న చిన్న లెక్కలూ,పజిల్స్,సిద్ధాంతాలూ,గణిత శాస్త్రజ్ఞుల ప్రస్తావనలూ ఉంటాయి. కాల్పనికతను గణితాన్ని జోడించి సున్నితమైన  భావోద్వేగాల్ని పట్టుకున్న యోకో ఒగావా రచన ఫిక్షన్ లో ఒక అరుదైన ప్రయోగంలా అనిపించింది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు : 

The desk was a bit too high, and Root was forced to sit up very straight as he leaned over his problem, a well-chewed pencil clutched tightly in his hand. The Professor sat back, legs crossed and looking relaxed, and his hand drifted to his unshaven chin from time to time as he watched Root work. He was no longer a frail old man, nor a scholar lost in his thoughts, but the rightful protector of a child. Their profiles seemed to come together, superimposed on one another, forming a single line. The gentle patter of the rain was punctuated by the scratching of pencil on paper.

When he had solved a contest problem from one of his journals and was making a clean copy to put in the mail, you could often hear him murmur, "How peaceful ..." He seemed to be perfectly calm in these moments, as though everything were in its rightful place, with nothing left to add or subtract. "Peaceful" was, to him, the highest compliment.

"Eternal truths are ultimately invisible, and you won't find them in material things or natural phenomena, or even in human emotions. Mathematics, however, can illuminate them, can give them expression—in fact, nothing can prevent it from doing so."

In my imagination, I saw the creator of the universe sitting in some distant corner of the sky, weaving a pattern of delicate lace so fine that even the faintest light would shine through it. The lace stretches out infinitely in every direction, billowing gently in the cosmic breeze. You want desperately to touch it, hold it up to the light, rub it against your cheek. And all we ask is to be able to re-create the pattern, weave it again with numbers, somehow, in our own language; to make even the tiniest fragment our own, to bring it back to earth.

If you added 1 to e elevated to the power of π times i, you got 0: eπi + 1 = 0.

I looked at the Professor's note again. A number that cycled on forever and another vague figure that never revealed its true nature now traced a short and elegant trajectory to a single point. Though there was no circle in evidence, π had descended from somewhere to join hands with e. There they rested, slumped against each other, and it only remained for a human being to add 1, and the world suddenly changed. Everything resolved into nothing, zero.

Perhaps all mathematicians underestimated the importance of their accomplishments. Or perhaps this was just the Professor's nature. Surely there must be ambitious mathematicians who wanted to be known for the advancements they made in their field. But none of that seemed to matter to the Professor. He was completely indifferent to a problem as soon as he had solved it. Once the object of his attention had yielded, showing its true form, the Professor lost interest. He simply walked away in search of the next challenge.

Monday, September 20, 2021

A Kitchen in the Corner of the House - Ambai (C. S. Lakshmi)

ఇప్పటివరకూ నేను చదివిన కొందరు స్త్రీవాద రచయిత్రులలో కనుబొమ్మలెగరెయ్యకుండా నా చేత స్త్రీ వాదాన్ని చదివించగల శక్తి ఒక్క మార్గరెట్ ఆట్వుడ్ కు మాత్రమే ఉందనుకునేదాన్ని. కానీ  అటువంటి మరో రచయిత్రి పరిచయమైనందుకు సంతోషం అనిపించింది. తమిళ రచయిత్రి సి.ఎస్ లక్ష్మి aka అంబై కూడా ఆ కోవకే వస్తారు. మనుషులందరూ సమానమని అంటూనే స్త్రీవాదం విషయానికొచ్చేసరికి మాత్రం మగవాళ్ళని మరో జాతిలోకి నెట్టేసి, వాళ్ళని శత్రువుల్లా చిత్రిస్తూ, ఏకపక్షంగా విపరీతమైన ద్వేషంతో కూడిన నిందారోపణలు చేసే రచనలు చదివినప్పుడు చాలా విసుగొచ్చేది. బహుశా ఈ విముఖత కారణంగానే నేను స్త్రీవాద రచనల జోలికి వెళ్ళడం మానేశాను. ఒకనాటి పితృస్వామ్యపు కాలంలో పురుషజాతిని ఎలివేట్ చేస్తూ తమ రచనల్లో మగవాడి వైపు నించి మాత్రమే కథను చెప్పుకొచ్చేవారు. అదే విధంగా నేడు అధిక శాతం స్త్రీవాద రచనలు చూస్తే అందులో కేవలం స్త్రీవైపు నుండే కథను చెబుతున్నారు. నాణానికి రెండు వైపులూ చర్చించడం విషయం అటుంచితే అప్పుడూ ఇప్పుడూ 'బిగ్ పిక్చర్' చూడడంలో రెండు వర్గాలూ విఫలమయ్యాయి అనిపిస్తుంది. అంబై రచనలు ఇలాంటి కాలంచెల్లిన వాదాలకు స్వస్తి చెబుతూ వివక్ష మూలలను వెదికే ప్రయత్నం చేస్తాయి. స్త్రీల పట్ల వివక్షకు ముఖ్యంగా తల్లితండ్రులనూ, సమాజాన్నీ ,యావత్ వ్యవస్థనూ దోషిగా పరిగణిస్తారు అంబై. స్త్రీ,పురుషుల్లో ఈ అసమానతల భావజాలానికి పునాదులు ప్రాథమికంగా కుటుంబంనుండే పడతాయని నమ్ముతారావిడ. 'ఎ కిచెన్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది హౌస్' లో అంబై రాసిన 25 కథలున్నాయి. వీటిని లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ ఆంగ్లంలోకి అనువదించారు.

Image Courtesy Google

ఈ కథల్లో నేను చదివిన 'In a forest, a deer : Stories' లో ఉన్న Parasakti and Others in a Plastic Box, మూడు 'జర్నీ' కథలతో పాటు మరికొన్ని చదివిన కథలే పునరావృతమయ్యాయి. అంబై కథలను గురించి మునుపటి వ్యాసంలో వివరంగా ప్రస్తావించి ఉన్నాను కాబట్టి ఆమె కథల శైలిని  గురించీ, ఒక్కో కథ గురించీ నేను మళ్ళీ ప్రస్తావించబోవడంలేదు. ఇందులో బాగా  నచ్చిన 'వన్స్ అగైన్' అనే కథ గురించి మాత్రం చెప్పుకుందాం. తల్లితండ్రులు పిల్లల మనసుల్లో చిన్నతనంనుండీ లింగవివక్షకు బీజాలెలా నాటతారో చెప్పడానికి 'వన్స్ అగైన్' అనే కథ మంచి ఉదాహరణ. ఆర్భాటాలులేని సరళమైన కథనం ఈ కథ ప్రత్యేకత. కథ అతి మామూలు మాటల్లో,  కాన్వాస్ మీద అలవోకగా బ్రష్ తో రెండు మూడు చిన్న చిన్న లైన్స్ గీసినట్లు ఈ విధంగా మొదలవుతుంది.

మరొక్కసారి

ఆ ఇద్దరి సృష్టి జరిగింది. 

లోకిదాస్.

శబరి.

"లోకూ నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు ? 

"నాకు నచ్చినన్ని లోలి పప్స్ తిందామనుకుంటున్నాను. "

"వెధవా,అంకుల్ కీ అంటీకీ సరిగ్గా చెప్పు. "

"నాకో కుక్కపిల్ల కొనుక్కుంటాను."

"ఈరోజు వీడు మంచి మూడ్ లో లేడండీ. సరిగ్గా చెప్పు నువ్వు ఏం ఉద్యోగం చేద్దామనుకుంటున్నావు ? "

"నేను ఇంజనీర్ అవుదామనుకుంటున్నాను."

"కరెక్ట్. చూశారా ఎలా చెప్పాడో. సహజంగా వెంటనే చెబుతాడు. ఈరోజు కాస్త మొండికేశాడు."

"ఇప్పుడు షోలే లో డైలోగ్స్ చెప్పు. "

"నేను చెప్పను. "

"నేను బయటకెళ్ళి ఆడుకోవాలి. ముందుచెప్పు,తరువాత ఆడుకోవచ్చు.చెప్పకపోతే నీకు నీ బాల్ ఇవ్వను. "

"అరే ఓ సాంబా"

"వెరీ గుడ్."

------

"శబరి కుట్టీ నువ్వు పెద్దయ్యాక ఎవర్ని పెళ్ళి చేసుకుంటావు ?"

"మా క్లాస్ లో అబ్దుల్లాని"

"ఆ పిల్లవాడు ముస్లిం కదా,నువ్వు అతణ్ణి చేసుకోకూడదు.తప్పు. "

"నువ్వు పెద్దదానివయ్యావు. ఆ మురళితో ఆటలేమిటి ? గాలిపటాలెగరెయ్యడం ఏంటి ? వెళ్ళి ఏ పుస్తకమో చదువుకోవచ్చుగా."

"వుమన్ సెక్రటరీ ని అప్పోయింట్ చేద్దాం,ఆమె పని చెయ్యడం సంగతటుంచితే ఆఫీసు కళగా ఉంటుంది. "

----

లోకిదాస్,శబరి అనే రెండు స్త్రీ పురుష పాత్రల్ని సమాంతరంగా చిన్నప్పటినుంచీ వర్ణిస్తారు. ఈ కథ సోషల్ కండిషనింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తూ ఆడమ్-ఈవ్ కథను రీటెల్లింగ్ చేసినట్లు ఉంటుంది.సమాజంలో లింగ వివక్ష,కులమత వివక్షలకు బీజాలు ఎక్కడ పడతాయో ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అంబై.

"నువ్వు పెద్దయ్యాక ఇంజినీర్ అవ్వాలి సరేనా ? మగవాడన్నాక  సంపాదించాలి,సంపాదనలేని వాడు మగాడే కాదు. బాగా సంపాదిస్తేనే అమ్మాయిలు నీ వెంట పడతారు. ఆడపిల్లలా అలా ఏడుస్తావేమిరా ? ఎకనామిక్స్ చదివి ఏమి చేస్తావు ? లెక్కలు తీసుకో. రేపు పెళ్ళైతే నీకు వండి పెట్టడానికి ఒకరు ఉంటారు. నువ్వు ఆ క్రిస్టియన్ కుర్రాడితో చర్చి కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.

"You are the one who earns money
You go out to work
You are the one who has many rights
You are the one who casts the vote
You are the one who mustn’t cry
You are strong
You make decisions
You can change the world
You have firmness of mind
You enjoy women
You are forceful in bed
You want to impress your boss
You are a man."

అలా అబ్బాయిలతో మాట్లాడకు.అలా అటూ ఇటూ పరిగెత్తకు,ఆడపిల్లన్నాక అణకువ అవసరం. ఇంజనీరింగ్ ఆ ? చదివి ఏమి చేస్తావ్ ? వంట నేర్చుకో. లేకపోతే అత్తారింట్లో చెప్పు దెబ్బలు తినాలి. సెక్స్ గురించి మాట్లాడుతున్నావేమిటి నీ స్నేహితురాళ్ళతో ? తప్పు. ఆ కుర్రాడు ముస్లిం  కదా,స్నేహం చెయ్యకు. చీర కట్టుకోవడం నేర్చుకో. ఆడపిల్లకు సహనం ఉండాలి.

"You look after the house
You know that beauty products are for your use
You are modest
You listen to decisions
You are a goddess
You are always helpful
You work outside the house only when in dire need
You need protection
You are a woman."

లింగ వివక్ష అనేది మొత్తం వ్యవస్థకు సంబంధించిన విషయం. సమాజంలో స్త్రీ పురుషుల పాత్రలు వాళ్ళు పుట్టకమునుపే సమాజం నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులు ఆ సాంఘిక నియమాలను గుడ్డిగా అమలు చేస్తారు. నిజానికి నియమాలను ధిక్కరిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా హర్షించదు. సమాజంలో 'ఆదర్శమైన వ్యక్తి' చెయ్యాల్సిన పని నియమాలను పాటించడం, పెద్దలను అనుసరించడం మాత్రమే. ఆదర్శ సంఘ జీవిగా సమాజంలో ఇమడడానికి మనిషి చెల్లిస్తున్న మూల్యం ఏమిటి అని మరో సారి ప్రశ్నించుకోమంటుందీ కథ.

Friday, September 17, 2021

In a Forest, A Deer : Stories - Ambai

"One writes because the act of writing has become as close to one as breathing. It is difficult to stop."  అని తన ముందు మాటలో రాసిన తమిళ రచయిత్రి అంబై కథలన్నీ అడ్డుకట్ట తెగిపోయిన  అనుభవాల ప్రవాహంలా ఉంటాయి. పదేళ్ళ కాలంలో వివిధ సమయాల్లో పత్రికలకు పంపిన ఈ కథలన్నీ రాయడానికి డెడ్ లైన్స్ లేవంటారావిడ. మొత్తం 18 కథలున్న ఈ అనువాదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. 'In a forest, A Deer' పేరిట అంబై కథలకు లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ చేసిన అనువాదం విషయమై రచయిత్రి పంచుకున్న విషయాలు నాకు చాలా నచ్చాయి. 

"అనువాదంలో నా పాత్రలు నాకు కొత్తగా కనిపించాయి. పాత్రల చిత్రీకరణ వేరుగా ఉంది,చిత్రీకరణలో నేనూహించుకున్న వర్ణాలు వేరు. శబ్దాలు కూడా భిన్నంగా ధ్వనించాయి. అనువాదంలో కొత్త భాషను సొంతం చేసుకుని చదివేకొద్దీ మన కథలు కొత్తగా రెక్కలు విప్పుకుని రెండు భాషల మధ్య దూరాలను చెరిపేసే దిశగా ప్రయాణిస్తాయి. జాలరి పడవను సముద్రంలోకి నెట్టే విధంగా అనువాదం ఒక భాషలోని కథను సాగరసమానమైన మరో భాషలోకి సున్నితంగా నెట్టి వదిలేస్తుంది."

Image Courtesy Google

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేను చదివిన కొందరు భారతీయ రచయితల్లో అంబై ఒకరు. ఈ మధ్య ఫెమినిస్టు కథలు చదివే ఆసక్తి బాగా తగ్గిపోయింది. కానీ ఇన్నేళ్ళుగా తమిళనాట ఉండీ  కూడా నలభై ఏళ్ళుగా రచనా వ్యాసంగంలో ఉన్న ప్రముఖ తమిళ రచయిత్రి అంబై కథలను చదవలేదే అనిపించింది . అందుకే రోజుకో కథ అనుకుని 'In a Forest, A Deer : Stories' ను చదువుతూ వచ్చాను. నిజానికి సాంస్కృతికపరమైన వివరణలతో చక్కగా చిక్కగా అల్లిన ఈ కథలన్నీ ఏకబిగిన చదవలేం. అంబై చెప్పే చిన్న చిన్న సంగతుల్ని పట్టుకోడానికీ,ఆమె పరిచయం చేసే ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకోడానికీ ఒక ప్రత్యేకమైన మూడ్ కావాలి. 

అంబై కలం పేరుతో రాసే 'సి.ఎస్.లక్ష్మి' కథలన్నిటిలో స్త్రీ కేంద్రబిందువు. అన్ని కథల్లోనూ ప్రోటొగోనిస్ట్ గా స్త్రీ కంఠస్వరమే వినిపిస్తుంది. కోయింబత్తుర్ లో పుట్టి, ముంబై,బెంగళూరుల్లో పెరిగి, ఢిల్లీలో పీహెచ్డీ చెయ్యడం వల్ల ఆమె కథల్లో క్రాస్-కల్చరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తాయి. పెరుమాళ్ మురుగన్ వంటి కొందరు తమిళ రచయితల కథల్లోలా  సాంస్కృతికపరమైన అంశాలన్నీ కేవలం తమిళ సంస్కృతికి మాత్రమే పరిమితం కాకపోవడం అంబై కథల్లోని ప్రత్యేకత. తన కథల్లో ఆమె తన తమిళ అస్తిత్వపు మూలాల్ని వెలికితీసి అనుభవాలను పంచుకున్నారే గానీ ఎక్కడా తమిళ సంస్కృతిని గుడ్డిగా భుజాన మోసిన దాఖలాల్లేవు. ఆ మాటకొస్తే కొన్ని చోట్ల తమిళ సంస్కృతీ,సంప్రదాయాల పేరిట జరిగే అణచివేతపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అలాగే ఈ కథల్లో స్త్రీవాదం పేరిట మూలాల్ని త్యజించి నేల విడిచి సాము చెయ్యలేదు. ఒకవైపు తన సాంస్కృతిక మూలాలను వదలకుండా ఒడిసి పట్టుకుంటూనే మరోవైపు ఈ కథలను ఆమె ఒక 'డిటాచ్మెంట్' తో రాశారనిపించింది. ఆమె తన కథల ద్వారా స్త్రీ కి వ్యవస్థను 'కండిషనింగ్' పేరిట తృణీకరించమని పిలుపునివ్వలేదు. స్త్రీ తన స్వేచ్ఛను విస్మరించకుండా ఆరోగ్యకరమైన వ్యవస్థలో భాగంగా మారడానికి అనువైన మార్గాల కోసం మాత్రమే ఆమె అన్వేషించారు.

ఈ కథల్లో అంబై తీవ్ర విముఖత కనబర్చిన విషయం 'రామాయణం'. కొన్ని కథల్లో రాముని ధర్మంపై తీవ్ర విమర్శలు చేశారు. Camel ride అనే కథలో ముక్కులోంచి రక్తమోడుతున్న ఒంటెను చూసి "ఇది సముద్రతీరంలో షికారుకు తీసుకెళ్ళనని మొండిగా మొరాయిస్తూ శూర్ఫణఖలా కూర్చుంది. శూర్ఫణఖ అంటే తన ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేసినందుకు మన పురాణాల్లో ఒక వీరుడి వల్ల ముక్కు పగలగొట్టించుకుందీ, ఆమే. గుర్తుందా ? " అంటారు.సాధారణంగా రామాయణంపై  ఇటువంటి విషయాలు చాలా చోట్ల చదివి నాకు విసుగ్గా అనిపించినా ఈ కథల్లో ఆమె విమర్శలు పంటిక్రింద రాళ్ళలా తగలకపోవడం విశేషం. దానికి కారణం కూడా ఉంది. దేన్నైనా విమర్శించే ముంది ఆ విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. కావ్యాలు చదవకుండా వాటిలో  అనుకూలమైన కొన్ని వాదాల్ని మాత్రం ఎంపిక చేసుకుని ఆమె విమర్శలకు పాల్పడలేదు. అంబై ప్రస్తావించే విషయాలు చూస్తే ఆమె రామాయణం ఔపాసన పట్టకుండా కేవలం ఒక ఫెమినిస్టు కోణంలో గాల్లోంచి విషయాలను ఏరుకొచ్చి ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఈ విమర్శలు చెయ్యలేదని అర్ధమవుతుంది. పురాణాల్లో ఒక్కో సంఘటననీ,చిన్న చిన్న వివరాల సహితంగా ఎందుకు నచ్చలేదో పరిశీలిస్తూ రాసిన విశ్లేషణలు కావడంతో ఆమెకు పాఠకుల్ని తనదారికి ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసనిపించింది. మంచి రచయిత తన కథ ద్వారా అయితే పాఠకుల్ని ఆలోచించేలా చెయ్యగలగాలీ లేదా ఒప్పించగలగాలి. ఈ రెండు విషయాల్లో అంబై కి మంచి నేర్పూ,ఓర్పూ ఉన్నాయి. మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, హిందుస్థానీ,కర్ణాటిక్ సంగీతాన్నీ,హిందీ,తమిళ సినిమా పాటల్నీ సందర్భోచితంగా తన నేరేషన్ లో వాడుకోవడం అంబైకు సంగీతం మీద ఉన్న ప్రీతిని చెప్పకనే చెబుతాయి.

ఒక కథలో మన ఎన్.టి.రామారావు రాముడిగా, శివాజీ గణేశన్ భరతుడిగా (నేను ఉత్సాహం కొద్దీ యూ ట్యూబ్ లో ఒక క్లిప్పింగ్ చూశాను,భరతుడు అంతఃపురం అదిరిపోయేలా చేసిన నటన మీరూహించినట్లే ఉంది :) ) తమిళంలో నటించిన 'సంపూర్ణ రామాయణం' గురించి రాశారు.

But as she grew up, there were some aspects of Rama that she began to dislike. She was stung to anger at the notion of Rama, in his original form of Vishnu, lying on the serpent Adisesha, with Lakshmi relegated firmly to his feet. She preferred Shiva. She liked the indifferent and defiant nature of Shiva as he went about smoking gartja, wandering as he chose, and dancing his immortal taandavam. Then, after she saw the film Sampurna Ramayanam, as far as she was concerned, Rama became the actor N.T. Rama Rao. What’s more, when she heard T.K. Bhagavati singing as Ravana, (Ga gamagagari rigaririsa rigaririsarisa nidapadasa’ in Kambodhi Raga, her heart inclined more and more towards the rakshasa.

 First Poems అనే మరో కథలో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది: రాముడన్నా,శివుడన్నా రవివర్మ చిత్రాల తరువాత గుర్తొచ్చేది ఎన్.టి.రామారావు అని ఆమె రాస్తే చదివి సంబరంగా అనిపించింది.

The idea that a girl should marry no one other than God fascinated her. At the same time they were learning about Akkamahadevi in their Kannada lessons. Mahadeviakka too, had renounced everything for the sake of Shiva. It struck her, though, that there might be a few problems in accepting God as one’s husband, when it actually came to practice. In the first place, she was scared to think in what form the gods might actually manifest themselves, even if they looked so beautiful as statues, and in the paintings by Ravi Varma. In the second place, it was N.T. Rama Rao who took the roles of Rama and Shiva in the cinema, in those days. Suppose, after she had given herself up to God, he then knocked on her door in the shape of Rama Rao? The thought confused her.

అంబై కథల్లో నాకు తెలిసిన తమిళ ప్రపంచాన్ని వెతికాను. కనిపించలేదు. ఆమె కథల్లో 'చెన్నై, కోయింబత్తూర్' లు లేవు, తెలుగు,తమిళ సంస్కృతులు కలగలిసిన 'మద్రాసు' మాత్రమే కనిపిస్తుంది. బాల్యం నుండీ అంబై అనుభవాలు ఆమె సృజించిన అనేక పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. తన చుట్టూ ఉన్న  ప్రపంచంతో గాఢమైన అనుబంధం,తన ఉనికి పట్ల స్పష్టత ఈ రెండూ అంబై పాత్రల్లో ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. గమనింపు రచయితకు ఎంత అవసరమో ఆమె రాసిన వివరాలు చెబుతాయి. చెవిలో పడిన ప్రతీ కీర్తనా, మాటా, అభిప్రాయాలూ, ఏ శబ్దమూ ఆమె గమనికను దాటిపోలేదనిపించింది. ఈ కథల్లో దేనికదే ప్రత్యేకంగా ఉన్నప్పటికీ నాకు బాగా నచ్చిన రెండు కథలు 1. Parasakti and Others in a Plastic Box 2. Wrestling.

ఇందులో అన్నీ స్త్రీవాదానికి సంబంధించిన కథలే అనుకుంటే పొరపాటే. ఆమె కథల్లో 'స్వేచ్ఛ' కు పేద పీట వేశారు అంబై. ఉదాహరణకు One and another కథ LGBT అంశానికి సంబంధించినది ; A Rat, a Sparrow /  A Saffron-coloured Ganesha on the Seashore / A Movement, a Folder, some Tears / Camel ride వంటి కథలు సామజిక సమస్యలు,సెక్కులరిజం,బాబ్రీ మసీద్ కూల్చివేత నేపథ్యాల్లో రాసినవి. A Rose-coloured Sari Woven with Birds and Swans / Parasakti and Others in a Plastic Box ఈ రెండు కథలూ ఒక తరంలో మనుషులకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఈ కథలు చదివినప్పుడు గతించిన తరాల్ని ప్రేమగా గుర్తుచేసుకోని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు. నేటి తరం స్వేచ్ఛ పేరిట ఏం కోల్పోతోందో, దానికి చెల్లిస్తున్న మూల్యం ఏమిటో, ఎన్ని ఉన్నా జీవితాల్లో ఒంటరితనంతో కూడిన ఖాళీ ఏర్పడడానికి  కారణాలేమిటో పరిశీలించుకోమంటాయీ కథలు. మనుషులతో సహా తన అస్తిత్వంతో ముడిపడిన వస్తువుల్ని కూడా నిముషంలో వదిలించుకుంటూ 'డిస్కార్డ్' మంత్రాన్ని జపిస్తున్న నేటి తరాన్ని ఈ కథలు ఆలోచనలో పడేస్తాయి.

‘“Is that what you call freedom? I can’t understand it,” she fretted.’ ‘As soon as she arrived, she was anxious to make all those things like rasam and sambar powders before the monsoons set in. Now, look, within one week, all these powders are ready in my house. And there are still three months to go before the beginning of the rains! Day before yesterday she went and bought a quantity of limes, chopped them up, and made salt pickle and hot pickle in two separate lots. Ginger murabha and ginger pickle have also been prepared.

But Amma is one who is deeply bound to the earth. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Certainly, she could stay either at my house or at yours. But it is bound to be hard for her. She’ll tell a thousand little lies: this one to hide that, that to hide this. It’s not just that Amma needs a place to live; she must reign indisputably in that space. Because Amma isn’t just an individual, she’s an institution.Her need is not simply a small space in which she can keep her plastic box. The pity is, she is wandering about seeking after a realm of her own. And if you and I wish to do so, we could give it to her. The jewellery that you and I possess were all given to us by Amma. 

అంబై కథల్లో నన్ను ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే ఆమె పాత్రల్లో స్త్రీ కి ప్రాధాన్యత ఉంది గానీ,స్త్రీల పట్ల పక్షపాతం లేదు. దీనికి తోడు ఆమె స్త్రీవాదాన్ని వినిపించడానికి ఎన్నుకున్న అంశాలూ, నేపథ్యాలూ వైవిధ్యంగా ఉన్నాయి. ఒక కథలో ముంబై లో సామజిక కార్యకర్తగా ; మరో కథలో కవి అయిన భర్తకు రచయిత్రి భార్యగా ; ఇంకో కథలో భర్తనూ,కుటుంబాన్నీ వదిలేసి తన ఐడెంటిటీని వెతుక్కుంటూ అడవుల్లో ఒంటరిగా నివసించడానికి వెళ్ళిన స్త్రీగా ; మరో కథలో తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కూతురితో సంబంధాన్ని సైతం తెంచుకున్న అమ్మగా ; ఇంకో కథలో తల్లి మనసు అర్ధం చేసుకున్న కూతురిగా ఇలా ఆమె స్త్రీలు విభిన్న రూపాల్లో కనిపిస్తారు.  

Unpublished Manuscript నాకు నచ్చిన మరో కథ. ఒక కవిని ప్రేమించి పెళ్ళిచేసుకుని అణచివేతకు గురైన స్త్రీ మూర్తి కథ. చదువుకుని,సాధికారికంగా ఉండే స్త్రీల విషయంలో భర్తల్లో ఉండే ఆత్మన్యూనతను గురించి చెబుతుంది. ఆర్టిస్టులు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదని రుజువు చేస్తుంది. తన భార్యను నిందిస్తూ 'Are you a woman?’ అని పదే పదే అడిగే భర్తను గురించి చదివినప్పుడు మన పురుషాధిక్య సమాజంలో ఉన్న జాడ్యాలను అతడు గొంతెత్తి అరిచి  చెప్తున్నట్లుగా ఉంటుంది.

She wondered why something that seemed perfectly all right when done by a man seemed like an act of madness when done by a woman instead? Once, by a rare chance, there was a showing of the old film Karnatt. Devika sang a love song in it, and during the entire time Sivaji Ganesan sat stiffly, one hand placed on his thigh. Perhaps, this was because Karnan was a warrior? Devika circled around him again and again, like a butterfly. Even Sivaji Ganesan’s smile was like squeezing toothpaste out of an empty tube. If men can soften and dissolve and melt through bhakti, why can’t they do so out of love? She decided firmly on the sort of man she could respect. He would have to know how to melt. ‘Melting, melting to the heart’s core.’

Amma answered that it was easier to live with Appa’s poetry than with a poet like Appa.

A Rose-Coloured Sari అనే కథలో ఈ వాక్యాలు దృష్టి, ధ్వనీ, వాసనలతో కూడిన అంబై విశాలమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తాయి : 

The sweet smell that fills the air as soon as a jackfruit is split open. The knots and swirls and scatterings as Mali begins the opening alaapanai of his Kaapi raagam. The steam that hits your face as you open the lid of the water-pot, the firewood still burning underneath, and as you bend over it, chembu in hand, ready to pour out the water into a bucket. Drops of sweat blooming on Balasaraswati’s forehead as she danced. Birju Maharaj’s Kathak dance-leaps. The smell of cooking when a properly-soured batter is just spreading on a heavy dosai griddle. The smell of sesame in the chilli powder. The smell of gingili oil, unstrained, fresh from the oilpress. The tenderness of Bhimsen Joshi’s Lalit raagam. The deep resonance of Gangubai Hangal’s voice. Girija Devi’s lilting tones. The kisses she and her lover had exchanged as they stood under a chestnut tree in a small village in Himachal Pradesh. The journey past her house every day, of bodies going to the cremation ground. Funeral fires burning at a distance. The voice of her Tamil teacher who had loved and read Tirumular, ‘I nurtured my body; indeed I nurtured my life-source.’ The poet Ghalib pleading, ‘Lord, they have not understood me; they will not understand me. Give them different hearts. Or at least give me a new language.’ Which of these things would her mind seek and at what moment? Would it seek after any of these at all? Or would it be soothed by Festivals of India?

How convenient a nostril is, for piercing and for threading a rope through! Like that folk tale from oral tradition. In a forest there lived a woman who was independent, under no one’s control, and who wandered about at her own will and pleasure. Later on, a man— when they tell this tale, they describe him as a great warrior and a man of great prowess—put a ring through her nose, subdued her, and dragged her home. Sometime later, she began to wear the same ring as an ornament.

పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు : 

‘It is my life, isn’t it? A life that many hands have tossed about, like a ball. Now, let me take hold of it; take it into my hands.’ So saying, Sita lifted the rudravinai and laid it on her lap.

హాస్యంతో కూడిన మరో చిన్న సంగతి :

Deva kaappaadu... O God, help me,’ Kempamma called out. Then thinking perhaps that it was wrong to summon God familiarly, in the singular, she called out again, ‘Devari kaappaadu'

Wednesday, September 8, 2021

How to Take Your Time - Alain de Botton

ప్రూస్ట్ రాసిన పుస్తకాల సైజు చూసి ఆయన్నీ,జాయిస్ నీ,ఈ తరహా సుదీర్ఘమైన రచనలు చేసే క్లబ్బుకి చెందిన మరి కొందరు రచయితల్నీ బాధ్యతలన్నీ తీరిపోయాక, తీరుబడిగా రిటైర్మెంట్ తరువాత చదువుదామని అనుకున్నాను. ఈలోగా బ్రిటిష్ తత్వవేత్త అలైన్ డి బటన్ రాసిన 'How Proust Can Change Your Life' అనే పుస్తకం కంటబడింది. "ప్రూస్ట్ ని ఎందుకు చదవాలి ?" అనే దిశగా రాసిన పుస్తకంలా అనిపించిన ఆ టైటిల్ నన్ను చాలా ఆకర్షించింది. సినిమా ముందు టీజర్ లా ఈ పుస్తకం చదివితే ప్రూస్ట్ రాసిన బృహద్గ్రంథాలని ఇంకొంచెం సులభంగా చదవవచ్చునేమో అన్న ఆలోచన వచ్చింది. మరో కారణం ఏమిటంటే,గత ఏడాది ప్రూస్ట్ రాసిన 'డేస్ ఆఫ్ రీడింగ్' చదివాను. అందులో జిగిబిగి అల్లికల చిక్కని వచనం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చిక్కుముడులు విడదీసుకుంటూ, కొన్ని పంక్తులకు ఆదీ-అంతం ఎక్కడో వెతుక్కుంటూ ఆ పుస్తకం పూర్తి చేసేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఏదైతేనేం "ప్రూస్ట్ ని చదవడం అంత వీజీ కాదు" అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. 

Image Courtesy Google

పోనీ కాస్త ఓపిక చేసుకుని క్లాసిక్స్ కాబట్టో, తరాలుగా పాఠకుల మన్ననలందుకుంటున్న రచనలనో చదువుదామనుకున్నా ఆ భారీ వాలూమ్స్ చూస్తే ఎవరికి మాత్రం భయమెయ్యదూ !! "చదివితే చదవాలి,లేదా ప్రక్కన పడెయ్యాలి,అంతేగానీ ఒక పుస్తకం చదవడానికి ఇంత ఆలోచన అవసరమా" అంటారా ! మిగతావాళ్ళ సంగతి ప్రక్కన పెడితే ప్రూస్ట్ విషయంలో ఖచ్చితంగా అవసరమే. అసలు ఇక్కడ సమస్య ఏమిటంటే దొరికే కాస్త ఖాళీ సమయంలో ఒక వందా,పోనీ రెండు వందలు,అదీ కాకపోతే పోనీ మరో వంద కలుపుకుని మూడు వందలనుకుందాం. కనీసం మూడొందల పేజీలున్న ఒక పుస్తకాన్ని నేను చదివినట్లు తాబేలులా చదవడానికి ఎంత సమయం వెచ్చించాలి ! అసలే కాలమూ దాని విలువా తెలిసిన పిసినారిని,స్వార్థపరురాలిని. చేతికి కలం,కాగితం దొరికాయి కదాని బొత్తిగా పొదుపుకి అర్థం తెలీకుండా, పాఠకులపై కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రూస్ట్ పేజీలకు పేజీలు రాసి పడేసిన బృహద్గ్రంథాలను నా విలువైన సమయం వెచ్చించి నేనెందుకు చదవాలి ? (బృహద్గ్రంథాలు అని ఊరికే అనడం లేదు,ఆయన 'In Search of Lost Time' పేజిల కౌంటు వికీలో చూస్తే అక్షరాలా నాలుగు వేల రెండువందల పదిహేను పేజీలు.)

1913 లో ప్రూస్ట్ ఏడు వాల్యూముల 'In Search of Lost Time' ని ప్రచురించడానికి ఆయన స్నేహితుడు లూయిస్ డి రాబర్ట్ ఆయనకు సహాయపడదామనుకున్నారట. లూయిస్ తన రచనల్ని ప్రచురించే ప్రముఖ సంస్థ 'ఓలెన్ డోర్ఫ్' కు ఆ ప్రతుల్ని పంపినప్పుడు ప్రచురణ సంస్థ యజమాని ఆల్ఫ్రెడ్ హమ్బ్లోట్ అటువంటి విచిత్రాన్ని (వైపరీత్యం అనాలేమో :) ) మునుపెన్నడూ చూడక పాపం నోరెళ్ళబెట్టారట. మొహమాటం కొద్దీ వాటిని కొంత చదివిన తరువాత ఆయన, 

“My dear friend, I may be dense,” replied Humblot after taking a brief and clearly bewildering glance at the opening of the novel, “but I fail to see why a chap needs thirty pages to describe how he tosses and turns in bed before falling asleep.” అన్నారట :) 

ఇలా అన్నది ఆయనొక్కరే అనుకుంటే పొరపాటే. పై ఉదంతం జరిగిన కొన్ని మాసాల ముందు   ఫాస్కేల్లే అనే మరో ప్రచురణ సంస్థకు చెందిన పాఠకుడు జాక్వెస్ మడెలైన్ ఇవే ప్రతుల మోపుని చదివే సాహసం చేశారు. ఆయన స్పందన ఏమిటంటే,

“At the end of seven hundred and twelve pages of this manuscript,” he had reported, “after innumerable griefs at being drowned in unfathomable developments and irritating impatience at never being able to rise to the surface—one doesn’t have a single, but not a single clue of what this is about. What is the point of all this? What does it all mean? Where is it all leading? Impossible to know anything about it! Impossible to say anything about it!” అంటూ కళ్ళు తేలేశారట.

ఇక సాక్షాత్తూ ప్రూస్ట్ సోదరుడు రాబర్ట్ మాటల్లో చెప్పాలంటే : "బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రూస్ట్ రాసిన 'In Search of Lost Time' చదవాలంటే పాఠకులు చాలా తీవ్రమైన అనారోగ్యంతోనో లేదా కాలు విరిగిపోయి దీర్ఘకాలం మంచంపట్టి ఉంటేనో తప్ప వీలుపడదు."

And as they lie in bed with their limb newly encased in plaster or a tubercle bacillus diagnosed in their lungs, they face another challenge in the length of individual Proustian sentences, snakelike constructions, the very longest of which, located in the fifth volume, would, if arranged along a single line in standardized text, run on for a little short of four meters and stretch around the base of a bottle of wine seventeen times.

ఇక ప్రూస్ట్ ప్రతుల్ని చదివి విరక్తి చెందిన మరో అందమైన యువతి ఆయనకు స్వయంగా ఉత్తరం రాసి,

“I don’t understand a thing, but absolutely nothing. Dear Marcel Proust, stop being a poseur and come down to earth. Just tell me in two lines what you really wanted to say.”అని అందట.

ఇవన్నీ చదివి నాకు మహదానందం కలిగింది. ఆయన వచనం మింగుడుపడనిది నాకు మాత్రమే  కాదన్నమాట ! కానీ ఇంతమంది విమర్శించినా పాఠకుల సహనాన్ని పరీక్షించే ప్రూస్ట్ వచనాన్ని చదవడం లాభదాయకమైన వ్యవహారమే అంటారు అలైన్ డి బటన్. అది ఎందుకో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ఫాస్ట్ ఫుడ్,ఫాస్ట్ లైఫ్,ఫాస్ట్ అఫైర్స్ ఇలా అన్నీ సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతున్న ఈ తరంలో ప్రూస్ట్ లాంటి రచయితల్ని చదవడం మరింత అవసరం. n’allez pas trop vite (Don't go very fast) అనే ప్రూస్ట్ స్లోగన్ జీవితాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ జీవించమని బోధిస్తుంది. వేగాన్ని తగ్గించి మెల్లిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడంలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే,ప్రపంచం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అంటారు బటన్. ఈ  పుస్తకంలో ప్రూస్ట్ శైలి గురించే కాకుండా ఆయన జీవన విధానాన్నీ,అలవాట్లనూ,తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల నిబద్ధతతో కూడిన ఆయన గమనింపునూ ప్రస్తావిస్తారు బటన్. 'వింటేజ్ షార్ట్స్' సిరీస్' లో భాగంగా పెంగ్విన్ రాండమ్ హౌస్ వారు ప్రచురించిన ఈ 'How to Take Your Time' (How Proust Can Change Your Life నుండి సంగ్రహించబడింది) ప్రూస్ట్ ని చదవడానికి  మరోసారి ప్రయత్నించాలనే ఆసక్తి  కలుగజేసింది. ఈ చిన్ని పుస్తకాన్ని ఎయిర్పోర్ట్ లోనో,రైల్వే స్టేషన్లోనో వెయిటింగ్ సమయంలో హాయిగా చదివేసుకోవచ్చు.హ్యాపీ రీడింగ్.

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన అంశాలు : 

Madeleine nevertheless had a go at summarizing the events of the first seventeen pages: “A man has insomnia. He turns over in bed, he recaptures his impressions and hallucinations of half-sleep, some of which have to do with the difficulty of getting to sleep when he was a boy in his room in the country house of his parents in Combray. Seventeen pages! Where one sentence (at the end of page 4 and page 5) goes on for forty-four lines.”

Proust’s novel ostensibly tells of the irrevocability of time lost, of innocence and experience, the reinstatement of extra-temporal values and time regained. Ultimately the novel is both optimistic and set within the context of human religious experience.

These literary quotations were not simply designed to impress (though Proust did happen to feel that “one must never miss an opportunity of quoting things by others which are always more interesting than those one thinks up oneself”)

The truth is that as we grow older, we kill all those who love us by the cares we give them, by the anxious tenderness we inspire in them and constantly arouse.”

Friday, September 3, 2021

Notes from the Hinterland : Stories and Essays - Shashi Tharoor

వర్చ్యువల్ రియాలిటీకీ వాస్తవానికీ తేడా పూర్తిగా చెరిగిపోయిన ఈ తరంలో ఫేస్బుక్ కిటికీల్లోంచి చూసే జీవితాలకీ వాస్తవ జీవితాలకీ ఎంత ఉంటుందో, అధికార పక్షాల గుప్పిట్లో చిక్కుకున్న మీడియా చూపించే ప్రతిబింబాలకీ,వాస్తవానికీ కూడా అంతే తేడా ఉంటుంది. జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తూ ఏసీ కారుల అద్దాల్లో నుండి ప్రపంచాన్ని చూసే ఉంటారు, ఎటుచూసినా శుభ్రంగా,అందంగా ఉంటుంది. కానీ కారు దిగి రహదారులు దాటుకుని ఇరుకు సందుల గుండా మురికివాడల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో నడిస్తేనే గానీ దాని నిజస్వరూపం తెలియదు. మన దేశ వాస్తవిక స్థితి క్యాపిటలిజం కొలువుదీరిన ఆకాశహర్మ్యాల్లో కంటే  ముంబై లోని ధారావి,ఢిల్లీ లోని కుసుంపూర్ పహాడీ లాంటి మురికివాడల్లోనూ, బళ్ళారి వైపు గనుల్లో కార్మికుల ప్లాస్టిక్ గుడారాల్లోనూ ఎక్కువ కనిపిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో నేను చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఈ 'నోట్స్ ఫ్రమ్ ది హింటర్ల్యాండ్' ఒకటి. ఈ పుస్తకం కాలు కదపకుండా ఇంట్లో కూర్చున్న పాఠకులకు భారతీయ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిస్తుంది. నాకు తెలిసిన సుందర భారతం ఎవరమూ గుర్తుపట్టలేని విధంగా ఈ ఏడాది మరీ వికృతంగా మారిపోవడంవల్ల కావచ్చు,ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో భారతీయ రచయితల పుస్తకాలపై మనసుపోయింది. బహుశా కరోనా తరంగాల తాకిడిలో కొట్టుకుపోయిన గతించినకాలపు సహజమైన జీవనశైలినీ,జీవితానుభవాలనూ తిరిగి వెతుక్కునే ప్రయత్నం కావచ్చు.

Images Courtesy Google

ఈ పుస్తకంలో కొత్త నీరూ,పాత నీరూ పాయలుగా కలుపుతూ పలు భారతీయ రచయితలు రాసిన మొత్తం పది కథలున్నాయి. వీటిల్లో తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఒక కథ ఉండడం విశేషం. చక్కని అనువాదంతో కూడిన తిలక్ కథను చదివి చాలా సంతోషమేసింది. పేరుకి అతి పెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశాన్ని ప్రత్యక్షంగా శాసించేవి ముఖ్యంగా రెండే రెండు అంశాలు : ఒకటి కులం,రెండవది మతం. ఇక మూఢనమ్మకాలూ,ఛాందస భావాలూ, స్వార్థపరత్వంలాంటివి పరోక్షంగా తమ వంతు పాత్రను ఎటూ పోషిస్తాయి. వీటి బారినపడిన ప్రజాస్వామ్యం దిక్కులేక కొన ఊపిరితో కొట్టుకుంటూ  ప్రపంచానికి గర్వంగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుంటుంది. ఈ రచనలో తిలక్,శ్రీలాల్ శుక్లా,రస్కిన్ బాండ్,శశి థరూర్, రహి మసూమ్ రజా వంటి కొందరు రాసిన కథలు కాల్పనికతకు దూరంగా వాస్తవికతకు అద్దంపట్టేవిగా ఉంటాయి. వీటితోబాటు పాలగుమ్మి సాయి నాథ్ (మరో తెలుగాయన :) ) ,అభిమన్యు కుమార్ వంటి జర్నలిస్టులు రాసిన వాస్తవిక అనుభవాలతో కూడిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

ఈ పుస్తకానికి సంపాదకత్వం చేసిన శశి థరూర్ రాసిన వ్యాసం లాంటి కథ 'Scheduled Castes, Unscheduled Change' తో ఇందులో కథలు మొదలవుతాయి. ఈ కథను నేను ఇది వరకే మరొకచోట చదివాను. ఇదే కథను అనితా నాయర్ ఎడిట్ చేసిన 'Where the Rain is Born: Writings about Kerala' అనే పుస్తకంలో 'ఛార్లీస్ అండ్ ఐ' పేరుతో ప్రచురించారు. అప్పట్లో చాలా నచ్చి అనువాదం చేద్దామనుకున్నా వీలుపడలేదు. కేరళలో బలంగా వ్రేళ్ళూనుకుపోయిన వర్ణ వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను థరూర్ కేరళలో తన బాల్యానుభవాలతో ముడిపెడుతూ వివరించిన కథ ఇది. శశి థరూర్ అనగానే ఆయన సిగ్నేచర్ ఆంగ్ల పదగాంభీర్యాలు గుర్తొచ్చి, పేజీకో పదిసార్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తిరగేసే ఓపిక లేక ఆయన రచనలేవీ చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఈ కథ చదివినప్పటినుండీ థరూర్ మరికొన్ని కథలను చదవాలనే ఆసక్తి కలిగింది. ఈ కథలో ఆయన నేరేషన్ చాలా సహజత్వంతో సరళమైన పదాలతో ఒక ప్రవాహంలా సాగుతుంది.

రస్కిన్ బాండ్ రాసిన రెండో కథ 'The Night Train at Deoli' లో కాలేజీ కుర్రవాడైన కథానాయకుడు వేసవి సెలవుల్లో డెహ్రాడూన్ లో తన అమ్మమ్మతో గడపడానికి వెళ్ళే ట్రైన్ డియోలీ అనే స్టేషన్ దగ్గర ఆగుతుంది. "Why it stopped at Deoli, I don’t know. Nothing ever happened there. Nobody got off the train and nobody got on." అనుకుంటుండగా ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద వెదురుబుట్టలు అమ్ముకుంటూ ఆకర్షణీయమైన చారడేసి కళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. ఇద్దరి మధ్యనా పెద్ద సంభాషణ జరగపోయినా ఆమె రూపం అతడి మనసులో ముద్రపడిపోతుంది. ఈలోగా ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ రెండు నెలల తరువాత తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు అతడి కళ్ళు ఆమెకోసం ఆత్రంగా వెతుకుతాయి. విచిత్రంగా ఆమె మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ కనపడుతుంది. ఆమెతో మాటలు కలుపుతూ,"నేను ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ వస్తాను,నువ్వు  ఇక్కడ ఉంటావు కదా" అని మాట తీసుకుంటాడు. మళ్ళీ ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ ఏడాది కాలేజీకి సెలవులివ్వగానే అతడు ఆమెను చూస్తాననే నమ్మకంతో ప్రయాణమవుతాడు. ఈ కథకు ముగింపు చదవాల్సిందే. బాండ్ తన కథల్లో ప్రకృతి వర్ణనల సున్నితత్వంతో పోటీపడుతూ తొలిప్రేమ తాజాదనాన్ని వర్ణించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇందులో మూసపోసినట్లుండే కథల్లో కాస్త భిన్నమైన కథ ఇదొక్కటే.

మూడో కథ ఆర్.కె.నారాయణ్ రాసిన 'An Astrologer’s Day' మాల్గుడి తరహా భారతీయ గ్రామీణ వాతావరణాన్ని మరోసారి గుర్తుచేస్తుంది. ఆయన కథల్లో నేపథ్యానికీ,పరిసరాల వర్ణనలకూ పెద్ద పీట వేస్తారని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కథలో చిన్న బజారులో మున్సిపాలిటీ వీధి దీపాలు లేకుండా కేవలం షాపుల్లో ఉన్న దీపాలతోనూ,గ్యాస్ లైట్ల వెలుతురుతోనూ నిండిన ఆ ప్రాంతాన్ని పాఠకుల మనస్సులో ఇట్టే చిత్రిస్తారు నారాయణ్.

నాలుగో కథ రంగా రావు గారు తెలుగు నుండి ఆంగ్లానికి అనువాదం చేసిన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన 'The Man Who Saw God' మానవత్వం గొప్పదా ? మతం గొప్పదా ? అనే ప్రశ్నల్ని మరోసారి రేకెత్తిస్తుంది. కరణాలూ,మునసబులూ,అవధానులూ వంటివారు సామజిక నియమాలను శాసిస్తూ  పంచాయితీలలో ప్రముఖపాత్ర పోషించే అలనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కథ ఇది. గవరయ్య నాస్తికుడు,తోలు వ్యాపారం చేస్తుంటాడు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్న తీరులో అతడు తన మానాన తాను బ్రతుకుతుంటాడు. భక్తీ, పాపభీతి లేని కారణంగానే అతడి వయసులో సగం వయసున్న భార్య టైలరుతో వెళ్ళిపోయిందని అంటూ అతడిలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంటారు ఊరిపెద్దలు. ఈలోగా గవరయ్య భార్య నిండు గర్భిణిగా దీనమైన స్థితిలో ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తరువాతేమి జరిగిందనేది మిగతా కథ. ఈ కథ మానవత్వానికీ, మత మౌఢ్యానీకీ మధ్య జరిగే సంఘర్షణనను చూపిస్తుంది.

ఐదో కథ ప్రముఖ ఉర్దూ కవీ,రచయితా రహి మసూమ్ రజా రాసిన 'A Village Divided' ను Gillian Wright ఆంగ్లంలోకి అనువదించారు. మసూమ్ రజా పేరు వినగానే దూరదర్శన్ లో వచ్చిన చోప్రా  'మహాభారత్' కు రాసిన స్క్రీన్ ప్లే గుర్తొస్తుంది. మతంపేరుతో విషం కక్కే సమాజంలో ఇలాంటివి నిజంగా అద్భుతాలు అనిపిస్తాయి. ఈ కథలో రజా స్వస్థలమైన ఘాజీపూర్ నుండి బ్రతుకుతెరువుకు కోల్కతా,ముంబై,కాన్పూర్ వంటి చోట్లకు జనపనార మిల్లులో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళే యువకుల గురించి రాస్తారు. అడుగడుగునా పద్యాన్ని తలపించే ఆయన గద్యం నాకు చాలా నచ్చింది.

Calcutta is not the name of a city. For the sons and daughters of Ghazipur it is another name for the yearning that comes of separation. This yearning is a whole story in itself, in which the kajal lining the eyes of countless women has been washed away by tears, and then dried. Every year thousands upon thousands of men far from home send back thousands upon thousands of messages with the monsoon clouds. Perhaps that’s why clouds burst over Ghazipur and, in these rains, seeds of yearning sprout in new and old walls, in the roofs of mosques and temples, in the cracks of school windows and doors, and the pain of separation awakes and begins to sing : 

No one stirs out in the monsoon rains,
Only you would leave for a distant land.

ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్ (పాలగుమ్మి సాయి నాథ్) రాసిన 'Ganpati Yadav’s Gripping Life Cycle' అనే కథ 'Everybody Loves a Good Drought' అనే కథల సంపుటి నుండి సంగ్రహించబడింది. మహారాష్ట్రలోని రామాపుర్ కి చెందిన 97 ఏళ్ళ రైతు /స్వాతంత్య్ర సమరయోధుడు గణపతి యాదవ్ అనుభవాలు అలనాటి స్వాతంత్య్ర సమరపు రోజుల్ని జ్ఞప్తికి తెస్తాయి. ఢిల్లీ కి చెందిన జర్నలిస్టు అభిమన్యు కుమార్ రాసిన వ్యాసం 'The Lynching That Changed India', స్నిగ్ధా పూనమ్ రాసిన 'The Man Who Lived' బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండీ మతంపేరిట జరుగుతున్న మరణహోమాల్ని కళ్ళకుకడితే, మాధురీ విజయ్ రాసిన 'Lorry Raja' కథ కర్ణాటక గనుల్లో పనిచేసే కార్మికుల దుర్భర జీవితాలకు అద్దం పడుతుంది. ఇక Gillian Wright హిందీ నుండి అనువదించిన శ్రీ లాల్ శుక్లా కథ 'Raag Darbari' భారత దేశంలో లంచగొండితనానీ,వ్యవస్థలో లొసుగుల్నీ చూపిస్తుంది. రెండు భిన్న తరాల రచయితలు రాసిన కథలు కావడంతో వీటిల్లో శైలుల వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. సమకాలీన రచయితల కథలలో భాషా సౌందర్య లేమీ,లోతులేని ఉపరితలానికి పరిమితమైన  వర్ణనలూ స్పష్టంగా కనిపించాయి. ఏదేమైనా థరూర్ ఎంపిక చేసిన ఈ కథల్లో నాకైతే ఇది చెడ్డ కథ అని ఏమీ అనిపించలేదు. ఒక్కో కథా ఒక్కో ప్రత్యేకమైన శైలికీ,సంస్కృతికీ,కాలానికీ చెందినవైనా ఈ కథల సంకలనంలో అన్నీ కలిసి భారతీయ భిన్నత్వంలోని ఏకత్వాన్ని మరోమారు చాటి చెప్పాయి. భౌతిక స్వరూపం కంటే భారతీయ ఆత్మను పట్టి ఇచ్చే ఈ కథలన్నీ మనకు తెలిసిన భారతాన్ని సరికొత్త వెలుగులో చూపిస్తాయి.