Sunday, October 15, 2017

The Oil Jar and Other Stories - Luigi Pirandello

నవలలు ఎక్కువగా ఇష్టపడే నాకు షార్ట్ స్టోరీస్ చదవాలనే ఆసక్తి కలిగించిన బహు కొద్దిమంది రచయితల్లో పిరాండేల్లో ఒకరు..ఆయన రాసిన కథల సంపుటి 'The tales of madness' చదివిన తరువాత ఆయన మరికొన్ని కథలు చదవాలనే ఆసక్తితో 'The Oil Jar and Other Stories' చదవడం జరిగింది..ఇందులో మొత్తం పదకొండు కథలు కాగా చివరి కథ 'Mrs. Frola and Mr. Ponza,her son-in-law' అనే కథ ముందు చెప్పిన పుస్తకంలో కూడా ఉంది,అందులోని పదహారు కథల్లో ఇదొకటి..'The tales of madness' లో తాత్వికత,మానసిక విశ్లేషణల పాళ్ళు ఎక్కువ,అందులో అన్ని కథలూ 'dark tone' లో 'పిచ్చితనం' అనే అంశం చుట్టూ తిరుగుతాయి..కాగా ఈ కథల  సంపుటిలో చాలా వరకూ కథలన్నీ తేలికపాటి హాస్యంతో,సరళమైన ధోరణిలో సాగుతాయి..


ఫిక్షన్,నాన్ ఫిక్షన్ అనే రెండు పాయలనూ రెండు వైపుల నుంచీ సరిసమానంగా అల్లుకొచ్చి చివరకి వాస్తవికతకు ముడి పెట్టడంలో పిరాండేల్లో నైపుణ్యం ప్రతి కథలోనూ కనిపిస్తుంది..ఫిలాసఫీ చదవాలంటే ఒక పుస్తకం,సైకాలజీ చదవాలంటే మరో పుస్తకం,డ్రామా అంటే ఇంకోటీ,Existentialism కోసం మరొకటీ ఇలా ఇన్ని genres ను విడివిడిగా చదవాలనుకోవడం కంటే ఒక్క పిరాండేల్లోని చదివితే చాలు,ఆ పైవన్నీ ఈయన కథల్లో కనిపిస్తాయి..ఈయన కథలు, చదివినవాళ్ళకి అన్ని ఎలిమెంట్స్ సమపాళ్ళలో కుదిరిన ఒక పూర్తి స్థాయి రచన చదివిన తృప్తినిస్తాయి..కథలో ఎక్కడో చాలా సీరియస్ గా ఏదో చెప్తున్నారనుకునేలోపు మధ్యలో చిన్న చమత్కారం దొర్లుతుంది..అలాగే కథలో ఏదో సరదా సందర్భంలో అంతర్లీనంగా నిరాశా నిస్పృహలు,ఇదిగో మేమున్నామంటాయి..ఇంకోచోట మానవసంబంధాలను ఆవిష్కరించే క్రమంలో ఉన్నట్లుండి తాత్వికత తెరపైకొస్తుంది..ఒక్కో కథా పూర్తై పేజీ తిప్పేటప్పుడు ఈయన మాంత్రికుడా లేక కథకుడా అనే అనుమానం కలగలేదంటే ఆశ్చర్యమే..

అన్ని కథల్లోకీ మొదటి కథ Little Hut-Sicilian Sketch కథే కాస్త నిరాశ పరిచింది..మిగతా కథలన్నీ ఒక్కోటీ ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటాయి..రెండో కథ Citrons from Sicily,ఒక వాద్యకారుడు Micuccio Bonavino కథ...తను చేసిన సహాయంతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నప్రేయసి Teresina ను చాలా కాలం తరువాత కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు  Micuccio కు అక్కడ ఎదురైన పరిస్థితులను గురించి వివరిస్తుంది..కాలగతిలో రూపాంతరం చెందే మానవ సంబంధాలూ,ఊహకూ-వాస్తవానికీ నడుమ సంఘర్షణలూ ఈ కథలో ప్రతిబింబిస్తాయి..

He didn’t see her, he no longer saw her as a living, real person in front of him..What was she saying to him?...Not her voice, nor her eyes, nor her laugh: nothing, nothing of hers did he recognize any more in that dream apparition.

మరో కథ With other eyes లో Anna కు చాలా ఏళ్ళ తరువాత యాదృచ్ఛికంగా తన భర్త మొదటి భార్య ఫోటోగ్రాఫ్ కంటపడుతుంది..Anna,చనిపోయిన ఆమె ఫొటోను చూస్తూ,తనకు పరిచయమైన ఆనాటి స్త్రీ పై గతంలో తన ద్వేషపూరితమైన అభిప్రాయాన్నీ,వర్తమానంలో తన అభిప్రాయాన్నీ పోల్చి చూసుకుంటూ ఆమె ఇమేజ్ ను తన మస్తిష్కంలో పునర్నిర్మించుకునే కథ..ఇది Anna జీవితంలో ఆమెకు తెలీకుండా ఏర్పడిన ఖాళీని చూపిస్తుంది..

And it then seemed to her that those kindly eyes, intense with passion and heartbreak, were pitying her in their turn, were condoling with her over that abandonment, that unrequited sacrifice, that love which remained locked up in her breast like a treasure in a casket to which he had the keys but would never use them, like a miser.

మరో కథ Voice కూడా నాకు చాలా నచ్చిన కథ..అంధుడైన తన యజమాని Silvio Borghi కు అతని తల్లి మరణానంతరం తన కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తూ,తన అందమైన స్వరంతో అతనికి దగ్గరై,ప్రేమలో పడుతుంది Miss Lydia Venturi..వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు..కానీ Silvio కు చూపు వస్తుందని తెలిసి,తన స్వరంలో అతని ఊహాప్రపంచంలో రూపుదిద్దుకున్న అందమైన రూపానికీ,తన అసలు రూపానికీ,వ్యక్తిత్వానికీ చాలా భేదం ఉండటంతో Silvio చీకటి ప్రపంచంలో తన స్వరంలో సృజింపబడిన ప్రతిబింబంగానే మిగిలిపోయి అతన్ని విడిచి వెళ్ళిపోతుంది..

She knew how he saw her from the charm of that voice and from the timid replies he received to his insistent, relentless questions; and in front of her mirror she made every effort to resemble that fictitious image he had of her, every effort to see herself the way he saw her in his darkness. And by this time, even for her, her voice no longer issued from her own lips, but from those he imagined she had; and if she laughed, she suddenly had the impression of not having laughed herself, but rather of having imitated a smile that was not hers, the smile of that other self who lived within his mind.

“There, you’re all mine because you don’t see yourself and you don’t know yourself; because your soul is like a prisoner of your misery and needs me to see, to feel.”

నాకు నచ్చిన మరో కథ A character’s Tragedy,ఇది రచయితలకూ,వారు సృష్టించే పాత్రలకు మధ్య ఉండే సంబంధాన్ని చూపించే కథ..ఇందులో కల్పిత పాత్రలన్నీ రచయిత చుట్టూ చేరి తమ గోడు వెళ్ళబోసుకోవడం సరదాగా ఉంటుంది..అందులో Dr. Fileno అనే కల్పిత పాత్ర,తనకు న్యాయం చెయ్యమని రచయితకు తన వాదనను వినిపిస్తాడు..ఆ వాదోపవాదాల్లో చివరకి ఎవరు నెగ్గారనేది కథ..

And often there is such a mob that I have to give my attention to more than one at the same time. Unless, at some point, my mind becomes so distracted and bewildered that it rejects that double or triple nurturing and shouts in its exasperation: “Either one at a time, quietly and calmly, or all three of you can get lost!”

Dr. Fileno hadn’t even the slightest thought of deriving lessons from the past for the present, because he knew it would be a waste of time and a game for fools. History is an idealized amalgam of elements gathered together in accordance with the nature, likes, dislikes, aspirations and opinions of historians. How, then, can this idealized amalgam be applied to living, effective reality, in which the elements are still separate and scattered?

The oil jar కథ ఆద్యంతం సరదాగా సాగిపోతుంది,అలాగే Mrs. Frola and Mr. Ponza,her son-in-law వాస్తవాన్ని అంగీకరించలేని అత్తా అల్లుళ్ళ కథ..మిగతా కథలు It’s not to be taken seriously,The Fly,Think it over, Giacomino,A Prancing horse లాంటి కథలు కూడా దేనికదే ప్రత్యేకమైనవి..సహజంగా చాలా పుస్తకాలు,చదివిన కొంత కాలానికి మర్చిపోతాను..ఇక కథల్లో పాత్రలైతే అలా వచ్చి ఇలా హలో అని పలకరించి వెళ్ళిపోతాయి..కానీ పిరాండేల్లో పాత్రల చిత్రీకరణ సరళంగా,vulnerable గా వాస్తవానికి చాలా దగ్గరగా ఉండటంతో మరపుకి చాలా దూరం..ఏ పాత్ర చూసినా,ఎక్కడో పరిచయస్తుల్లా అనిపిస్తారు..మన ప్రక్కనే కూర్చుని మనతో తమ మనసు లోతుల్లోని ప్రతి భావాన్నీ,భయాన్నీ,ఆందోళనని,పిచ్చితనాన్నీ చాలా కాలానికి కలిసిన బాల్య స్నేహితుల్లా,ఏ దాపరికం లేకుండా మనతో పంచుకుంటారు..ముఖ్యంగా హ్యూమన్ ఎమోషన్స్ ను పండించడంలో ఈయనది ఒక ప్రత్యేక శైలి అనొచ్చు..అలాగే మానవ స్వభావాల వర్ణనల్లో పిరాండేల్లోకి సరిసమానంగా నిలవగల రచయితలు బహు అరుదు అనడం కూడా అతిశయోక్తి కాదేమో..మంచి రచనా నైపుణ్యం కలిగిన ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ని కలవాలంటే Luigi Pirandello ని చదవాల్సిందే.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు,
Strictly speaking, nothing was serious to Perazzetti. Everything depends on the importance you attach to things. If you attach importance to the most ridiculous thing, it can become deadly serious, and vice versa, the most serious matter can become altogether ridiculous. Is there anything more serious than death? And yet, for those many people who attach no importance to it ...

But is it ever possible to feel sorry for certain misfortunes unless you can laugh at them at the same time?

"Humans do many,many things,my friend,without knowing at all why they do them"

Milk and Honey - Rupi Kaur

Image Courtesy Google
ఏ రచన అయినా పాఠకుల మనసు వరకూ వెళ్ళాలంటే అది రచయిత మనసులోంచి వచ్చి ఉండాలి..అక్షరాల్లో అణువణువునా ధ్వనించే నిజాయితీ కంటే చదివివేవాళ్ళని కట్టిపడేసే ఆకర్షణీయమైన విషయం ఏముంటుంది !దేన్నైనా మంచి రైట్ అప్ అనడానికి నా వరకూ ఆ నిజాయితీ ప్రధానార్హత..ఒక్కోసారి రచన క్వాలిటీని నిర్దేశించే అంశాలైన భాష,వ్యాకరణం లాంటివి కూడా ఆ నిజాయితీ ముందు కేవలం అలంకారప్రాయాలుగానే మిగిలిపోతాయి..కెనడా కు చెందిన ప్రవాస భారతీయురాలు,జన్మతః పంజాబీ అయిన రచయిత్రి రూపీ కౌర్ రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ కవితా సంపుటి 'మిల్క్ అండ్ హనీ' కూడా అదే కోవకి చెందుతుంది..ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళలో రూపీ కౌర్ పేజీ గురించి తెలీని వాళ్ళుండరు..మొదట్లో ఇన్స్టాగ్రామ్ ను తన మనసులో భావాలను పంచుకునే వేదికగా చేసుకున్న ఆమె,తన బోల్డ్ రైట్ అప్స్ తో త్వరలోనే అనేకమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

రకరకాల వాయిద్యాలతో పాటు సాకేంతికతను కూడా విరివిగా ఉపయోగించి సృజించిన సంగీతం కూడా అడవుల్లో పచ్చని చెట్ల మీద,స్వేచ్ఛగా ఎగిరే పక్షుల కిలకిలారావాల ముందు దిగదుడుపే..ఎందుకంటే ఈ రెండో దానిలో ఉండే సహజత్వం మొదటిదానిలో కొరవడుతుంది..రూపీ కౌర్ కవితలు అడవి పక్షుల కిలకిలారావాల్లా ఉంటాయి,వర్షానంతరం పచ్చని పచ్చికబయళ్ళ లోనుంచి వచ్చే పచ్చి వాసన వేస్తాయి..స్త్రీల ఋతుచక్రాల మొదలు,లైంగిక వేధింపులు వరకు బోల్డ్,ఇంటిమేట్ విషయాలను ఇంత సున్నితమైన గళంలో చెప్పడం ఆమె ప్రత్యేకత..కవితలన్నిటిలోనూ మనం రిలేట్ చేసుకునే భావోద్వేగాలు ఉండటం వల్ల మనసుకు దగ్గరగా అనిపిస్తాయి..

“Our backs tell stories
no books have the spine to carry”

రూపీ కౌర్ కవితల్లో ధ్వనించే గాంభీర్యం ఆమె అక్షరాల్లో ఎంత వెతికినా కనిపించదు..కానీ చిన్న చిన్న పద్యాల్లా అల్లిన వాక్యాలు మాత్రం చెవులు చిల్లులు పడేలా ధ్వని చేస్తూ సరాసరి హృదయాన్ని తాకుతాయి..ఈ కవితలన్నీ స్త్రీల అస్థిత్వానికి చిరునామాల్లాంటి స్వాభిమానం,ప్రేమ,ద్వేషం,విరహం లాంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతాయి..ఈ సంపుటిని the hurting,the loving,the breaking,the healing అనే నాలుగు భాగాల్లో రాశారు..మొదటి భాగంలో బాల్యంలో ఆల్కహాలిక్ అయిన తండ్రి నుండి వేధింపులు,లైంగిక వేధింపులు,ఒంటరితం లాంటి అంశాలైతే,మిగతా భాగాల్లో ప్రేమ,విరహం,విషాదాల్లాంటి అంశాలపై కవితలుంటాయి..ఆమె పదాల్లో ఆశించని ప్రేమ దక్కని నైరాశ్యం కనిపిస్తుంది..తండ్రి ప్రేమకు నోచుకోని ఒంటరి బాల్యం కనిపిస్తుంది..హిపోక్రసీ నిండిపోయిన సమాజం పట్ల నిరసన గళం వినిపిస్తుంది..ఇవన్నీ రచయిత్రి మనసు తాళం తెరచి,అందులో పాఠకులకు కుర్చీ వేసి కూర్చోపెట్టి మరీ తన వాదన వినిపిస్తుంది..ఆమె పదాల్లో ఎక్కడో ఒక చోట తమను తాము పోల్చుకొని స్త్రీలు,ఆత్మపరిశీలన చేసుకోని పురుషులూ ఉండరేమో..ఇది అణువణువునా ఫెమినిజం నిండిపోయిన పుస్తకం కాబట్టి స్త్రీలందరు తప్పకుండా చదవాలి అంటున్నారు కానీ నాకైతే ఈ పుస్తకం ప్రత్యేకం పురుషుల కోసం,పురుషాధిక్య సమాజం కోసం రాయబడింది అనిపించింది..

“i do not want to have you
to fill the empty parts of me
i want to be full on my own

i want to fill so complete
i could light a whole city
and then
i want to have you
cause the two of
us combined
could set
it on fire”  ఇది ఒక రిలేషన్షిప్ లో స్త్రీ కోరుకునేదేమిటో స్పష్టం చేస్తుంది..

మరో చోట,ఆర్ట్ ను నిర్వచిస్తూ,
“your art
is not about how many people
like your work
your art
is about
if your heart likes your work
if your soul likes your work
it's about how honest
you are with yourself
and you
must never
trade honesty
for relatability”

మరో చోట తనలో సున్నితత్వాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దని హెచ్చరిస్తూ,
“i am water
soft enough
to offer life
tough enough
to drown it away”

చిన్న చిన్న కవితలతో పాటు ప్రక్కన రిలేటెడ్ డ్రాయింగ్స్ ఉండటం వల్ల పుస్తకం నిడివి చాలా తక్కువ..కవిత్వం అంటేనే అదేదో గ్రహాంతర భాష అని భయపడే నేను అర్ధగంట లోపు ఒక పోయెట్రీ పుస్తకాన్ని పూర్తి చేస్తానని కల్లో కూడా అనుకోలేదు..ఎందుకంటే ఇది సామాన్యుల కవిత్వం..సాహిత్యం లో అ ఆ లు రాకపోయినా కూడా ఆస్వాదించడానికి అందుబాటులో ఉండే కవిత్వం.

పుస్తకం నుండి మరికొన్ని,
“i am a museum full of art
but you had your eyes shut”

"The rape will tear you in half
But it will not end you.."

“you tell me to quiet down cause
 my opinions make me less beautiful
 but i was not made with a fire in my belly
 so i could be put out
 i was not made with a lightness on my tongue
 so i could be easy to swallow
 i was made heavy
 half blade and half silk
 difficult to forget and
 not easy for the mind to follow” 

A Horse Walks Into a Bar - David Grossman

'A Horse Walks Into a Bar' అనే టైటిల్ చూసి పుస్తకం చదవడం మొదలుపెట్టిన రెండోరోజే దీనికి MBI అవార్డు వచ్చిందని తెలిసి,పూర్తి చెయ్యాలి అని ఉత్సాహంగా కూర్చుని చదివాను.."fifty-seven years ago today the world became a slightly worse place to live in" అంటూ ఇజ్రాయెల్ కు చెందిన 57 ఏళ్ళ stand-up ఆర్టిస్ట్ అయిన Dovaleh G (Dovaleh  Greenstein) తన కథను చెప్పడం మొదలుపెడతాడు...

Image Courtesy Google
ఇజ్రాయెల్ లోని Netanya లో ఒక సాయంకాలపు ప్రదర్శనలో ఇజ్రాయెల్ లో తన బాల్యాన్ని,దానితో ముడిపడిన చేదు జ్ఞాపకాలనీ ఒక్కొక్కటిగా మనముందుంచుతాడు Dovaleh..ఆ షో కి తన బాల్య స్నేహితుడు,రిటైర్డ్ జడ్జ్ అయిన Avishai Lazar ను బలవంతంగా ఒప్పించి ఆహ్వానిస్తాడు..తన ప్రదర్శనను పూర్తిగా చూసి తక్షణం అనిపించిందేంటో ఉన్నదున్నట్లుగా రాయమని అతన్ని కోరతాడు..అదే షోకు 'medium' అని సంబోధించే అతని చిన్ననాటి స్నేహితురాలు,మానిక్యూరిస్ట్,ఆత్మలతో మాట్లాడగలిగే ఒక స్త్రీ కూడా వస్తుంది..ముందు సరదాగా మొదలు పెట్టిన షోలో క్రమేపీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించడం మొదలు పెట్టడంతో వచ్చిన ప్రేక్షకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటారు..కానీ తుదికంటా కూర్చుని Dovaleh ను చూసిన Avishai కి అతడిలో 57 ఏళ్ళ Dovaleh బదులు తన బాల్యం తాలూకు మానసిక స్థితినుండి ఎదగని 14 ఏళ్ళ పసివాడు కనిపిస్తాడు..Dovaleh ని గురించి తెలుసుకునే క్రమంలో Avishai తనను గురించి తాను తెలుసుకుంటాడు..అసలు Avishai లో ఈ పరివర్తనకు కారణమైన Dovaleh గతం ఏంటనేది మిగతా కథలో తెలుస్తుంది..

ఈ కథని Dovaleh,Avishai ఇద్దరూ ఏకకాలంలో నేరేట్ చేస్తారు..ఇందులో Dovaleh తో సరిసమాన ప్రాధాన్యత కలిగిన పాత్ర Avishai ది...Avishai ప్రదర్శన జరుగుతున్నంతసేపూ వర్తమానంతో గతజ్ఞాపకాల్లో చూసిన Dovaleh ను పోల్చుకుంటూ ఉంటాడు..బాల్యంలో తనకి పరిచయమైన నవ్వుతూ,నవ్విస్తూ సరదాగా ఉండే Dovaleh జీవితం అంత కఠినమైనదని తనకి ఊహామాత్రం కూడా తెలీకపోవడం Avishai ని విస్మయపరుస్తుంది..Dovaleh చిన్ననాటి అనుభవాలను వింటూ తమ చిన్నతనంలో ఇజ్రాయెల్ లోని Be'er Ora అనే స్థలంలో భవిష్యత్తు సైనికుల్ని తయారుచేసే Gadna camp నుండి తన స్నేహితుణ్ణి ఒకరోజు క్యాంపు ట్రక్ లో తీసుకు వెళ్తుంటే ఎక్కడికీ,ఎందుకూ అని కూడా అడగలేదని మధనపడతాడు...క్యాంపులో తాను ప్రేమించిన అమ్మాయి గురించిన ఆలోచనలతో వ్యస్థమై Dovaleh గురించి ఆలోచించలేకపోయానని తన తప్పు తెలుసుకుంటాడు..ఇందులో Avishai ఎవరేమైతే నాకేంటి,నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకునే ప్రతి సమాజానికీ ప్రతినిధిగా అనిపిస్తాడు..మరో వైపు Dovaleh బాధిత వర్గానికి ప్రతినిధిగా కనిపిస్తాడు,అతను చిన్నప్పుడు కొట్టి హింసించే తండ్రి గురించి గానీ,హోలోకాస్ట్ survivor అయిన తల్లి గురించి గానీ ఎప్పుడూ,ఎవరివద్దా పెదవి విప్పలేదు..

 “How, in such a short time, did he manage to turn the audience, even me to some extent, into household members of his soul? And into its hostages?

కథ చెప్పిన విధానంలో తప్ప,కథలో నూతనత్వం అంటూ ఏమీ లేదు..Dovaleh తన 'Frantic Darting' తో హాస్యం,వ్యంగ్యం కలిపి షోకు వచ్చిన ప్రేక్షకులను కూడా అవమానిస్తూ ఉంటాడు..Stand-up షో కాబట్టి కామెడీ,జోక్స్ లాంటివి ఉంటాయనుకున్నా,అవి కూడా ఒకటి రెండు మినహా సహజత్వం లేకుండా టీవీల్లో వచ్చే చవకబారు జోక్స్ ని తలపించాయి..కానీ ప్రేక్షకులు ఆ హాస్యానికి పగలబడి నవ్వడం,అదే సమయంలో Dovaleh తన జీవిత సత్యాలను వెల్లడిస్తున్నప్పుడు అయిష్టతను వ్యక్తం చెయ్యడం లాంటివి ఆధునిక సమాజపు జాడ్యాలను ప్రతిబింబిస్తాయి..ఈ విషయంపై  "That's what they're here for! They're here to laugh at you! Not so, my friends?" అంటాడు Dovaleh..బహుశా జీవితసత్యాలకంటే చవకబారు హాస్యమే జనాదరణకు నోచుకుంటుందని ఆ షో కు వచ్చిన వారినుద్దేశించి చెప్పాలనుకోవడం ఇక్కడ రచయిత అంతరంగం కావొచ్చు..

The angel of death"—he laughs breathlessly—"appears before a lawyer and says his time has come. The lawyer starts crying and wailing: 'But I'm only forty!' Angel of death says, 'Not according to your billable hours!' " A quick punch, a complete spin around.

Exactly at this minute, more or less, in the old Hadassah Hospital in Jerusalem, my mother, Sarah Greenstein, went into labor! Unbelievable, isn't it? A woman who claimed to want only the best for me, and yet she gave birth to me!

పుస్తకం బావుందా అంటే,బావుంది,బాగాలేదు అని రెండు సమాధానాలు చెప్పాలి..కథ నాకు నచ్చలేదు..మొదటి నుంచీ అనేక భావోద్వేగాలను స్పృశిస్తూ పట్టు సడలకుండా నడిపించిన కథనం రెండో భాగానికి వచ్చేసరికి చతికిలపడి,పట్టు వదిలేసింది..కథనం చాలా బావుంది,కానీ అంతవరకు ఆపకుండా చదివించి చివరకి ఇంతేనా అనిపిస్తుంది..దానికి తోడు అక్కడక్కడా కథకు సంబంధంలేని పాత్రలు,అనవసర ప్రసంగాలు లాంటివి వచ్చిపోవడంతో కథ,కథనం రెండిటి మధ్యా సమన్వయం కొరవడిందనిపించింది..రచయిత పదవిన్యాసం అబ్బురపరిచిన సందర్భాలు కొన్నైతే,ఇంత సాగదీత అవసరమా అనుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు.

అవార్డులు,రివార్డులు లాంటివి మర్చిపోయి బ్లాంక్ ఇంప్రెషన్ తో చదివితే David Grossman రచన బావుంది అనచ్చు...కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందిన రచన అనుకుంటేనే అసలు బాధ..అసలీ అవార్డులకు కొలమానాలేంటో అర్ధం కాదు..హోలోకాస్ట్,సివిల్ రైట్స్ మూవ్మెంట్,వరల్డ్ వార్స్,రేసిజం లాంటి plots ఎంచుకున్న,లేదా వాటితో ముడిపడి ఉన్న కథలకే అగ్రతాంబూలాలిస్తున్నారు..చరిత్రలోని  చీకటి ఘట్టాలతో ముడిపడి ఉన్న సంఘర్షణలను తక్కువ చెయ్యడం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు..కానీ ఆ క్రమంలో కథ,కథనాల తూకాలకంటే Inferior party ను డిఫెండ్ చెయ్యడమే సామాజిక బాధ్యతనో లేదా బాధిత వర్గానికి ఎక్కువ ఓట్లు వెయ్యడమే సమంజసమనో జ్యూరీలు భావిస్తున్నాయేమో అనిపించింది..ఇలాంటి కోవకే చెందిన (Paul Beatty రాసిన Sellout చదవలేక మధ్యలోనే వదిలేశాను) పుస్తకాలకు ఈ మధ్య ఈ అవార్డులు రావడం కారణంగా ఉత్తమ సాహిత్యం అంటే బాధిత/పీడిత వర్గాల కథలు మాత్రమేనా అని అనిపించింది..బహుశా నేను ఈ మధ్య కాలంలో ఇవే స్టీరియో టైప్ రచనలు చదవడం వల్ల కలిగిన విసుగు కావచ్చు..."ఓ సాథీ రే " అంటూ కొన్నేళ్ల క్రితం అమితాబ్ ఒక సినిమా పాటలో మొదలు నుండీ తుద వరకూ ఒక స్టేజి మీద కదలకుండా నుంచుని కేవలం తన ముఖ కవళికల్తో తన బాల్యం తాలూకూ ప్రేమను గురించిన పాట ఒకటి ఉంటుంది...శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి,ఆ పాట పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు మనకు తెలీకుండానే బయటకి వస్తుంది..ఈ పుస్తకం మొదలు పెట్టిన తొలి పేజీల్లో నాకు కలిగిన భావన అదే..ఎటొచ్చీ ఇక్కడ మాత్రం పుస్తకం పూర్తయ్యేసరికి హమ్మయ్య అయిపోయింది అని నిట్టూర్పు విడిచాను :)

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు:
Jews గురించి,We really are a special people, aren't we, my friends? You just can't compare any other nation to us Jews. We're the chosen people! God had other options but he picked us!"

I'm beginning to identify the expression. A flash of internal violence. Or perhaps outward violence deeply buried.

What's wrong, table six? What's the panic, dude? It's just a story, you won't have to work your brain gland too hard, you won't even notice you have one. It's just words. Wind and chimes. In one ear, out the other..

Avishai కళ్ళతో చూసిన Dovaleh..
The spectacle looks like a fight between at least two men. Within the whirlwind of limbs and expressions I recognize the countenance that has passed over his face more than once this evening: he is uniting with his abuser. Beating himself with another man's hands.

For an instant, when he looks up, the spotlight creates an optical illusion, and a fifty-seven-year-old boy is reflected out of a fourteen-year-old man.

Dovaleh అంతర్మధనం,
How could a whole lifetime flip over on me in one second just because of the stupid, random thoughts of a stupid kid…

"Such dirt on me, such pollution…God, all the way to my bones…

The Sympathizer - Viet Thanh Nguyen

"If you want to tell people the truth, make them laugh, otherwise they'll kill you" అని ఆస్కార్ వైల్డ్ అన్నారో లేక జార్జ్ బెర్నార్డ్ షా అన్నారో ఖచ్చితంగా తెలీదు గానీ ఈ మాటల్ని అక్షరాలా పాటించారు వియత్నాం అమెరికన్ రచయిత Viet Thanh Nguyen..ఈ రచన 2016 సంవత్సరానికి గాను Pulitzer Prize for Fiction,Edgar Award for Best First Novel తో పాటు రచయితకు మరిన్ని అవార్డులను సాధించిపెట్టింది.

Image Courtesy Google
I am a spy,a sleeper,a spook,a man of two faces.Perhaps not surprisingly,I am also a man of two minds... అంటూ Laos లోని కారాగారంలో ఒక ఖైదీ కన్ఫెషన్ తో 'The Sympathizer' నవల మొదలవుతుంది ..
ఇందులో కథంతా పేరు తెలియని ముఖ్య పాత్రధారి జైలు కమాండెంట్ కు ఇచ్చిన కన్ఫెషన్ లో భాగంగానే చెప్తారు..ఇది వియత్నాం యుద్ధ కాలం,అంటే 1950-60 ల మధ్య జరిగిన కథ కాబట్టి ఈ హిస్టారికల్ ఫిక్షన్ చదివే ముందు వియత్నాం యుద్ధం గురించి కొంత తెలుసుకోవాలి..ఈ యుద్ధం నార్త్ వియత్నాంను సోవియట్ యూనియన్,చైనాలు మరియు సౌత్ వియత్నాంను అమెరికా,థాయిలాండ్ లాంటి anti-కమ్యూనిస్ట్ దేశాలు మద్దతుదార్లుగా అప్పటికే ప్రపంచం నలుమూలలా వేళ్ళూనుకుంటున్న కమ్యూనిజాన్నీ అడ్డుకోవాలని అమెరికా తదితర దేశాల ప్రయత్న ఫలితం..ఇందులో సౌత్ వియత్నాం ప్రభుత్వం పరాజయం పాలై సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంగా ఆవిర్భవించేవరకు జరిగిన సంఘటనల్ని ఒకొక్కటిగా చెప్పుకొస్తారు..

ఇందులో ప్రొటొగోనిస్ట్ ఒక ఫ్రెంచ్ మతాధికారికీ,వియత్నాం యువతీకీ జన్మించి,అక్రమ సంతానమనే ముద్రతో జీవిస్తూ అమెరికాలో విద్యాభ్యాసంతో పాటు Claude అనే అమెరికన్ వద్ద గూఢచారిగా శిక్షణ పూర్తి చేసుకుని వియత్నాం చేరతాడు..కమ్యూనిస్ట్ ఏజెంట్ అయిన అతను సౌత్ వియత్నాంలోని Saigon లో ఆర్మీ కెప్టెన్ గా తన జనరల్ కు నమ్మినబంటుగా నటిస్తూ తన కమ్యూనిస్ట్ సహచరుడూ,బాల్య స్నేహితుడూ అయిన Man కు అవసరమైన రహస్య సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు..తన ద్వంద్వ వైఖరికి కారణం,తన పుట్టుకే అసమంజసమైన వ్యక్తుల/సంస్కృతుల మేళవింపు కావడం వలన అని చెప్తూ,అమెరికాలో విద్యాభ్యాసం చెయ్యడం వలన ఆ దేశం కూడా పాక్షికంగా తన అస్తిత్వంలో ఎలా భాగమైందో చెప్తాడు..

I was already undercover, part scholarship student, part spy-in-training, the lone representative of our people at a sylvan little college called Occidental, its motto Occidens Proximus Orienti. There I passed six idyllic years in the dreamy, sun-besotted world of Southern California during the sixties.

What was it like to live in a time when one’s fate was not war, when one was not led by the craven and the corrupt, when one’s country was not a basket case kept alive only through the intravenous drip of American aid ?

ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి,ఒకటి మంచైతే మరొకటి చెడు..కానీ ఈ రెండు వైపులూ ఒకరి అస్థిత్వంలో భాగమైనప్పుడు పూర్తిగా ఒకే పక్షం తీసుకోవడం సాధ్యమేనా ! అసలు ఆ స్థితిలో మంచి-చెడులు బేరీజు వెయ్యడంలో కూడా తడబాటు సహజమేమో !! మన కథానాయకుడు ఈ దువిధను కథ నడుస్తున్నంతసేపూ తన భుజస్కంధాలపై మోస్తుంటాడు..నార్త్ వియత్నాం తరఫు గూఢచారిగా ఉన్నప్పటికీ, సౌత్ వియత్నాం సైనికుల్లో తనను తాను ఐడెంటిఫై చేసుకుంటూ వారిపై సానుభూతి తప్ప శత్రుత్వం కలగట్లేదంటాడు...ఒక దశలో We cannot represent themselves; We must be represented అంటూ తమ అస్తిత్వం చాటుకునే దిశగా వెళ్తూ ఆ క్రమంలో తమ ఉనికినీ,భవిష్యత్తునీ గుడ్డిగా అమెరికా చేతుల్లో పెట్టామని వాపోతాడు.

ఇందులో ప్రొటొగోనిస్ట్ కు Man,Bon అనే ఇద్దరు బాల్య స్నేహితులుంటారు,వారిని బ్లడ్ బ్రదర్స్ గా పిలుస్తుంటాడు..వారి ముగ్గురి స్నేహాన్ని కూడా చిన్ననాటి విశేషాలతో వర్ణిస్తారు..ఇందులో Man కూడా ప్రొటొగోనిస్ట్ లాగే కమ్యూనిస్ట్ కాగా,Bon మాత్రం anti-కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉండటం కథలో కీలక మలుపులకు కారణమవుతుంది..వీరితో పాటు జనరల్,Claude,crapulent మేజర్,సోనీ,ఏజెంట్ కూడా కథా గమనాన్ని నిర్దేశించే మరికొన్ని కీలక పాత్రలు..కాగా జనరల్ కుమార్తె Lana పాత్రను శాంతిని కాంక్షిస్తూ,తమ భవిష్యత్తును గూర్చి కలలు కనే వియత్నాం యువతకు ప్రతినిధిగా చిత్రించారు..మొత్తం 23 భాగాలుగా రాసిన ఈ కథలో మొదట భాగం Saigon ఆక్రమణ గురించి రాస్తే,రెండో భాగం లాస్ ఏంజెల్స్ లో అమెరికా శరణార్థిగా ప్రొటొగోనిస్ట్,జనరల్,Bon తదితరుల అనుభావాలుంటాయి,మూడో భాగంలో Laos లో జైలు ఖైదీగా ప్రొటొగోనిస్ట్ పడ్డ బాధలు,ఆ పై అతని ద్వంద్వ వైఖరికి పరిష్కారం దొరికే దిశగా ఒకదాని వెంబడి ఒకటిగా  బయటకొచ్చే నిజాలు,చివరగా అతని భావాలు విముక్తి దిశగా ప్రయాణించడంతో కథ ముగుస్తుంది..స్థిరమైన వర్ణనలతో సాగే ఈ నవలలో అక్కడక్కడా పోరాటాలు,హత్యలు,ఎదురు దాడులతో జేమ్స్ బాండ్ సినిమాలను తలపించే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి..నవల చివరి వంద పేజీల దగ్గరకొచ్చేసరికి మాత్రం శ్వాస కూడా తీసుకోవడం మర్చిపోయేంత ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఎదురవుతాయి..

ఇందులో నేరేటర్ ఒక గూఢచారిగా తన అనుభవాలతో పాటు,యుద్ధకాలంలో వియత్నాం,అమెరికా,కాంబోడియా తదితర దేశాల్లోని సామాజిక మార్పులు,రాజకీయ సమీకరణాలపై అనేక విశ్లేషణలు చేశారు..యుద్ధ సమయంలో గూఢచారి వ్యవస్థ పని తీరు,వారి ఇంటరాగేషన్ పద్ధతులు భీతి గొలిపేలా చాలా వివరంగా రాశారు..కేవలం యుద్ధం,చరిత్ర అంటూ చరిత్ర పాఠాన్ని వల్లెవేయకుండా తన intellectual,ఫిలసాఫికల్ విశ్లేషణల ద్వారా చదువరులను కట్టిపడేస్తారు..వియత్నాంకు సంబంధించి ఇందులో రచయిత స్పృశించని అంశమంటూ ఉండదు..ఈ యుద్ధానికి సంబంధించిన వాస్తవాలు కావాలంటే ఏ చరిత్ర పుస్తకాన్ని అడిగినా చెప్తుంది,కానీ వియత్నాంనూ,ఆ యుద్ధాన్నీ ఒక సగటు వియత్నాం దేశస్థుని కళ్ళతో చూడాలంటే ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే..కేవలం వియత్నాం రూపాన్నే కాకుండా హృదయాన్ని కూడా ఆవిష్కరించిన రచన ఏదైనా ఉంటే అది ఇదే అనిపించక మానదు..

ఇందులో కొన్ని సంఘటనలు స్మృతిపథం నుంచి ఎప్పటికీ చెరిగిపోవు,ఉదాహరణకు యుద్ధ కాలంలో సౌత్ వియత్నాం సైనికుల దుర్భర జీవితాన్నీ,తమ కుటుంబాల కోసం తమ దేశభక్తినీ,నిజాయితీని పణంగా పెట్టవలసిన సందర్భాలలో వారి మానసిక సంఘర్షణను,నిస్సహాయతనూ కళ్ళకు కట్టిన తీరు చాలా బావుంటుంది...ఒక చేత్తో Saigon ఆక్రమణ తరువాత రెఫ్యూజీ క్యాంపుల్లో అమెరికా శరణార్థులుగా మారిన ఒక ఆర్మీ జనరల్ కుటుంబం గురించీ,అతని మానసిక స్థితిని గురించీ రాస్తే  మరో చేత్తో యుద్ధ ప్రభావం సామాన్యులను ఎలా ప్రభావితం చేసిందో కూడా రాస్తారు..ఈ యుద్ధాన్నీ,దాని కారణంగా జరిగిన వినాశనాన్నీ వివరించే క్రమంలో Richard Hedd రాసిన Asian Communism and the Oriental Mode of Destruction అంటూ ఒక పుస్తకాన్ని మెటాఫోర్ గా చాలా చోట్ల విరివిగా ప్రస్తావించారు..ఇటువంటివే కాకుండా సందర్భానుసారంగా పుస్తకంలో ప్రస్తావించిన వియత్నాం,అమెరికన్ గీతాలు,సంగీతంలో రచయితకున్న పరిజ్ఞానానికి ఉదాహరణలు..

చేదు నిజాలను చదవడానికి ఇష్టపడనివాళ్ళని సైతం తన వ్యంగ్యం,డార్క్ హ్యూమర్ మేళవించిన ప్రత్యేకమైన రచనా శైలితో మంత్రముగ్ధుల్ని చెయ్యగల రచయిత Viet Thanh Nguyen..పుస్తకంలో అన్నిటికంటే ఆకట్టుకున్న విషయం నేరేషన్..తొలి పేజీ నుండే అలవోకగా,ఒక ప్రవాహంలా సాగే నేరేషన్ పాఠకులకు చరిత్రలోని చీకటి దారుల్లో ప్రయాణిస్తున్నామనే అలుపు అస్సలు తెలియనివ్వదు..పదాలను మంత్రించి రాశారేమో అన్నట్లు,కొన్ని వాక్యాలు పెదవుల మీద చిరునవ్వులు పూయిస్తే అవే వాక్యాలు వెనువెంటనే మౌనంగా ఆలోచనల్లో పడేస్తాయి..ఈ తరహా వివరణలు పుస్తకంలో కోకొల్లలు..ఇందులో బాగా ఆకట్టుకున్న మరో విషయం ప్రోటొగోనిస్ట్ Conscience..చిన్న చిన్న విషయ విశేషాల్లో కూడా లోతైన భావాలను వెలికి తీయగల ప్రోటోగోనిస్ట్ ఆత్మశోధన,అంతఃచేతనలు అమోఘం అనడం తప్ప మరో మాట లేదు..ఈ మధ్య చదివిన పుస్తకాల్లో క్రింద పెట్టనివ్వకుండా చదివించిన పుస్తకమేదైనా ఉంటే అది ఇదే...

"East is East and West is West,and never the twain shall meet" అని కిప్లింగ్ అన్నట్లు,కాలిఫోర్నియాలో తన జీవితాన్ని గురించి రాస్తూ 'Amerasian' గా రెండు ప్రపంచాల మధ్యా ఊగిసలాడుతూ తాము ఏ ప్రపంచానికి చెందుతామో తెలీని దువిధని వర్ణిస్తూ (orient-Occident) తూర్పు పడమరల వైరుధ్యాలను వర్ణించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది..

అమెరికా narcissism ను తూర్పారబడుతూ,
America, a country not content simply to give itself a name on its bloody birth, but one that insisted for the first time in history on a mysterious acronym, USA, a trifecta of letters outdone later only by the quartet of the USSR. Although every country thought itself superior in its own way, was there ever a country that coined so many “super” terms from the federal bank of its narcissism, was not only superconfident but also truly superpowerful, that would not be satisfied until it locked every nation of the world into a full nelson and made it cry Uncle Sam ?

Americans on the average do not trust intellectuals, but they are cowed by power and stunned by celebrity.

యుద్ధానంతరం Saigon జీవన చిత్రం...
This had happened in Da Nang and Nha Trang, where the Americans had fled for their lives and left the residents to turn on one another. But despite this precedent, the atmosphere was strangely quiet in Saigon, most of the Saigonese citizenry behaving like people in a scuppered marriage, willing to cling gamely to each other and drown so long as nobody declared the adulterous truth.

యుద్ధాలతో,ఆక్రమణలతో శిధిలమైన వియత్నాం చిత్రాన్ని వర్ణిస్తూ ఈ విధంగా అంటారు..
We had been forced to adapt to ten years of living in a bubble economy pumped up purely by American imports; three decades of on-again, off-again war, including the sawing in half of the country in ’54 by foreign magicians and the brief Japanese interregnum of World War II; and the previous century of avuncular French molestation.

ఒక గూఢచారిగా తన జీవితాన్ని గురించి రాస్తూ,
I lived like a bonded servant, a refugee whose only job perk was the opportunity to receive welfare. I barely even had the opportunity to sleep, since a sleeper agent is almost constantly afflicted with insomnia. Perhaps James Bond could slumber peacefully on the bed of nails that was a spy’s life, but I could not.

Interrogation is not punishment. Interrogation is a science.

A spy’s task is to hide where everyone can see him and where he can see everything.

ఒక కమ్యూనిస్టుగా తన సందిగ్ధతను విప్పి చెప్తూ,
We Marxists believe that capitalism generates contradictions and will fall apart from them, but only if men take action. But it was not just capitalism that was contradictory. As Hegel said, tragedy was not the conflict between right and wrong but right and right, a dilemma none of us who wanted to participate in history could escape.

కమాండెంట్ ప్రొటొగోనిస్ట్ ని ఉద్దేశించి అన్న మాటలు అతని వ్యక్తిత్వానికి దర్పణం పడతాయి..
Compared to To Huu, you are a communist only in name. In practice, you are a bourgeois intellectual. I’m not blaming you. It’s difficult to escape one’s class and one’s birth, and you are corrupted in both respects. You must remake yourself, as Uncle Ho and Chairman Mao both said bourgeois intellectuals should do. The good news is that you show glimmers of collective revolutionary consciousness. The bad news is that your language betrays you. It is not clear, not succinct, not direct, not simple. It is the language of the elite. You must write for the people.

పుస్తకం నుండి మరికొన్ని,
How could I forget that every truth meant at least two things, that slogans were empty suits draped on the corpse of an idea? The suits depended on how one wore them, and this suit was now worn out.out, a sartorial sensation that only a man of two minds, or a man with no face, dared to wear.

Namely this: while nothing is more precious than independence and freedom, nothing is also more precious than independence and freedom! These two slogans are almost the same, but not quite. The first inspiring slogan was Ho Chi Minh’s empty suit, which he no longer wore. How could he? He was dead. The second slogan was the tricky one, the joke. It was Uncle Ho’s empty suit turned inside out, a sartorial sensation that only a man of two minds, or a man with no face, dared to wear.

But they aren’t innocent. Neither are we, my friend. We’re revolutionaries, and revolutionaries can never be innocent. We know too much and have done too much.

It is always better to admire the best among our foes rather than the worst among our friends. Wouldn’t you agree, Commandant?

I had an abiding respect for the professionalism of career prostitutes, who wore their dishonesty more openly than lawyers, both of whom bill by the hour.

To live was to be haunted by the inevitability of one’s own decay, and to be dead was to be haunted by the memory of living.

No one else has the luxury I have of simply writing and living the life of the mind, I said.

I was guilty of the crime of doing nothing. I was the man to whom things are done because he had done nothing !

Gratitude - Oliver Sacks

చాలా మందికి జీవితాన్ని ప్రేమించడమంటే మృత్యువుని అంగీకరించలేకపోవడం,లేదా మృత్యువు ఉనికిని గుర్తించకుండా ముందుకి సాగిపోవడం..దీన్నే 'పాజిటివ్ లైఫ్' అని అనుకోడం సగటు మనిషి నైజం..కానీ వాస్తవాన్ని అంగీకరిస్తూ కూడా జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు హుందాగా వీడ్కోలు చెప్పడం వివేకవంతులకు మాత్రమే సాధ్యం..ప్రముఖ న్యూరాలజిస్ట్,ప్రొఫెసర్ మరియు రచయిత అయిన Oliver Sacks అదే కోవకి వస్తారు..

Image Courtesy Google
Oliver Sacks కాన్సర్ తో పోరాడుతూ తనకు సమయం తక్కువ ఉందని తెలిసి,ఉన్న కొద్ది సమయంలోనే తన జీవితాన్ని అర్ధవంతంగా గడిపి చివరకు తన జీవితానికి కృతజ్ఞతలు చెప్తూ రాసిన పుస్తకమే ఈ 'Gratitude'...బ్రెయిన్ పికింగ్స్ లో తొలిసారి ఈ పుస్తకం గురించి చూసి చాలా కాలం నుంచీ చదువుదామనుకుంటూ,ఎట్టకేలకి చదివిన పుస్తకం ఇది..ఇందులో Sacks "ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గురించి భయం లేదని అబద్ధం చెప్పను" అంటూ ఎంతో నిజాయితీగా తన మనసులోని భావాలను ఒక్కొక్కటిగా మన ముందుంచుతారు..

I cannot pretend I am without fear. But my predominant feeling is one of gratitude. I have loved and been loved; I have been given much and I have given something in return; I have read and traveled and thought and written. I have had an intercourse with the world, the special intercourse of writers and readers. అంటూ ఒక రీడర్ గా,రైటర్ గా ఈ ప్రపంచంతో తనకు గల ప్రత్యేకమైన అనుబంధాన్ని ప్రేమగా నెమరువేసుకుంటారు Sacks..

Sacks జీవితంలో చివరి రెండేళ్ళలో రాసి The Newyork Times లో విడి విడి వ్యాసాలుగా పబ్లిష్ చెయ్యబడిన Mercury,My Own Life,My Periodic table,Sabbath లను ఈ 'Gratitude' లో పొందుపరిచారు..ఆయన మెమోయిర్ 'On the move' రాసిన 18 నెలల తరువాత ఆయన కంట్లో ఏర్పడిన melanoma,లివర్ కు వ్యాపించడంతో Sacks కు ఆరు నెలల మించి వ్యవధి లేదని వైద్యులు ధృవీకరిస్తారు..
ఇందులో మొదటి భాగం 'మెర్క్యూరీ' పీరియాడిక్ టేబుల్ ప్రకారం ఎనభయ్యో మూలకం..తను ఎనభయ్యో పడిలో పడటానికి ఎదురుచూస్తున్నానంటూ దానికి ఆ పేరు పెట్టానంటారు Sacks ..

రెండో భాగం My Own Life లో మృత్యువు దగ్గరయ్యే సమయంలో ఆయన జీవితంలో ప్రాముఖ్యతలు ఎలా మారాయో చెప్తారు..జీవితంలో ఎంత సాధించినా,మేధో సంపన్నులైనా,ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించినవారికైనా ఈ అందమైన ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతూ ఏదో వెలితిగా అనిపించడం సహజం అంటూ ఇలా అంటారు..
I often feel that life is about to begin, only to realize it is almost over.


మరోచోట మరణానంతర జీవితం గురించి తనకి ఆసక్తి లేదనీ,ఎటొచ్చీ తన అక్షరాల్లో తన తదనంతరం కూడా జీవించే ఉంటాననీ ఆయనలోని రచయిత ఇలా అంటారు..
I have no belief in (or desire for) any postmortem existence, other than in the memories of friends and the hope that some of my books may still “speak” to people after my death.

తన చివరి రోజుల్లో మరణం ఆసన్నమైందని తెలిసిన Sacks జీవితాన్ని ఒక విస్తృతమైన పరిధిలో చూశానంటూ,ఆ సమయంలో జీవితంలో ప్రతి అణువుతో ఒక లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నానేనే భావనతో గడిపానంటారు..

Over the last few days, I have been able to see my life as from a great altitude, as a sort of landscape, and with a deepening sense of the connection of all its parts. This does not mean I am finished with life. On the contrary, I feel intensely alive, and I want and hope in the time that remains to deepen my friendships, to say farewell to those I love, to write more, to travel if I have the strength, to achieve new levels of understanding and insight.This will involve audacity, clarity, and plain speaking; trying to straighten my accounts with the world. But there will be time, too, for some fun (and even some silliness, as well).

చిన్నతనం లోనే దగ్గరవాళ్ళని కోల్పోయిన Sacks,తనను భౌతిక శాస్త్రం దిశగా నడిపించిన కారణాలనూ,సైన్స్ తో తనకు అనుబంధం ఏర్పడిన విధానాన్నీ గురించి ఇలా అంటారు..
Times of stress throughout my life have led me to turn, or return, to the physical sciences, a world where there is no life, but also no death.

పీరియాడిక్ టేబుల్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్తూ,అందులోని మూలకాలతో తన పుట్టినరోజుల్ని లెక్కించుకుంటూ తను Polonium (84) పుట్టినరోజుని ఖచ్చితంగా చూడబోనంటూ,ఈ విధంగా చమత్కరిస్తారు..

I almost certainly will not see my polonium (eighty-fourth) birthday, nor would I want any polonium around, with its intense, murderous radioactivity.

ఇక చివరి భాగం 'Sabbath' లో ఒక సంప్రదాయ జ్యూయిష్ కుటుంబంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ,Jew లకు పవిత్ర దినమైన వారంలో ఏడో రోజైన 'Sabbath' ను గురించి రాస్తారు...జీవితాన్ని ప్రేమించిన వాళ్ళెంతమంది మృత్యువుని కూడా అదే ప్రేమతో ఆహ్వానిస్తారు ! అసలు ఎలా జీవించామన్నది కాదు,ఎలా వీడ్కోలు చెప్పామన్నది ముఖ్యం అని చాలా మంది అంటూ ఉంటారు..కానీ రక్తబిగి ఉన్నప్పుడుండే గాంభీర్యం చివరి క్షణాల్లో సాధ్యమేనా అని చదివేవాళ్ళని ఆలోచనలో పడేసే పుస్తకం ఇది..జీవితం చివర్లో లెక్కలు సరి చూసుకునే సమయంలో అడుగులు తడబడకుండా ఎలా ఉండాలో చూపించే ఒక చిన్న గైడ్ లాంటిది ఇది..పుస్తకం చాలా చిన్నది కావడంతో చదవడం చాలా సులువు,కానీ గంగి గోవు పాలు గరిటెడైనను చాలు రీతిలో చిన్నదైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు...
I’m glad I’m not dead!” sometimes bursts out of me when the weather is perfect. (This is in contrast to a story I heard from a friend who, walking with Samuel Beckett in Paris on a perfect spring morning, said to him, “Doesn’t a day like this make you glad to be alive?” to which Beckett answered, “I wouldn’t go as far as that.”)

Reservoir 13 - Jon McGregor

Jon McGregor రచనల గురించి గార్డియన్ పత్రికలో వచ్చిన కథనాల వల్ల దాదాపు రెండేళ్లుగా 'To read' లిస్టులో ఉంచిన రచయిత..ఇటీవల మాన్ బుకర్ లాంగ్ లిస్ట్ లో ఈయన పుస్తకం ఉండడంతో మళ్ళీ ఇంతకాలానికి గుర్తొచ్చి చదవడం జరిగింది..


న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోడానికి ఇంగ్లాండు లోని Gladstone అనే గ్రామానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఒక పదమూడేళ్ల అమ్మాయి రెబెక్కా షా అదృశ్యమవుతుంది..ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న గ్రామస్థులు,పోలీస్ వారు, మౌంటైన్ రెస్క్యూ టీంలు అని ఒక సస్పెన్స్ తో నవల మొదలవుతుంది..ఈ మిస్టరీ మధ్య ఆ లోయలోని కమ్యూనిటీని మనకు పరిచయం చేస్తారు రచయిత..ముందుగా ఆ గ్రామానికి చెందిన Jackson’s boys గురించి,తరువాత తప్పిపోయిన అమ్మాయి కుటుంబం బస చేసిన హంటర్ ప్లేస్ గురించి,ఆ తరువాత ఆ కమ్యూనిటీలో స్కూల్ ప్రిన్సిపాల్ Mrs Simpson గురించి,స్కూల్ పిల్లలు Liam,James,Deepak,Sophie and Lynsey గురించీ ఇలా ఒక్కొక్కరిగా ఆ గ్రామస్థులను మనకు పరిచయం చెయ్యడం మొదలు పెడతారు..నేను అగాధా క్రిస్టీ 'And then there were none' తొలి వాక్యాలను తలుచుకుంటూ సహజంగానే అవి ప్రధాన పాత్రలేమో అనుకుని ఆ పేర్లు,రచయిత చెప్తున్న వివరాలను మెల్లిగా మెదడులో రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెట్టాను..దోషి ఎవరో రచయిత చెప్పేలోపే ముందే తెలుసుకుని నా ఇంటలిజెన్స్ ని నిరూపించుకోవాలని పెద్ద డిటెక్టివ్ లా ఆ స్థలాలను,నోట్ చేసుకుంటూ చదవడం మొదలుపెట్టాను..

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది..పాఠకులు కథలోని ఒక పాత్రకి హలో చెప్పేలోపు మరో పాత్ర తెరమీదకి వచ్చేస్తుంది..ఒక పాత్రతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం అనుకునే లోపు మరో పాత్ర మధ్యలో వచ్చి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లిపోతుంది..అలా ఆ కమ్యూనిటీ అంతా కేవలం మనకు పరిచయస్థులుగానే మిగిలిపోతారు..అలా ఆ కమ్యూనిటీలో సుమారు ఒక వందమందుంటే ఆ మంద మంది పేర్లు ఇందులో రచయిత చాలా ఓపిగ్గా ప్రస్తావించారు..అయితే పేర్లు,ముఖాలూ అస్సలు గుర్తుండని నాలాంటి వాళ్లకి పుస్తకం సగానికి వచ్చేసరికి అసలీయన ఎవరి గురించి చెప్తున్నారు అని బుర్రగోక్కోవడం మాత్రం తప్పదు..

సరే వీళ్లందరి గురించీ మనకెందుకు 'అసలు రెబెక్కా ఏమైంది ? ఆ రిజర్వాయర్లలో ఎందులోనైనా ప్రమాదవశాత్తూ పడిపోయిందా,లేక ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా,లేక తల్లిదండ్రులే దోషులా' అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందా మిస్టరీని విడదీయాలని మనం కూడా ఓపిగ్గా పేజీలు తిప్పుతుంటాం..ఆమె ఆనవాళ్ళేవీ కూడా లభ్యంకాకపోవడంతో రెబెక్కా ఎక్కడో బ్రతికే ఉందనీ,ఎప్పటికైనా తిరిగిస్తుందనీ ఆమె తల్లిదండ్రులతో సహా ఆ కమ్యూనిటీలో అందరూ నమ్ముతుంటారు..ప్రతి సంవత్సరం ఆమెను స్మరిస్తూ కమ్యూనిటీ హాల్ లో ఒక సభ కూడా నిర్వహిస్తూ ఉంటారు..అలా ఒక సంవత్సరం గడుస్తుంది..తరువాత రెండు,మూడు,నాలుగు,ఇలా ప్రతి న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ తో క్యాలెండరు లో ఇరవై సంవత్సరాలు తిరిగిపోతాయి..కానీ Gladstone లోని మనుషుల జీవితాల్లోంచి మాత్రం రెబెక్కా వెళ్ళదు..మరి రెబెక్కా ఆచూకీ అప్పుడైనా దొరికిందా అంటే పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే..

People just wanted to open their mouths and talk, and they didn’t much mind what came out.

It had been more than six months and still there was nothing. No footprints, no clothing, no persons of interest, no sightings on any CCTV. It was as though the ground had just opened up and swallowed her whole. Journalists used this phrase by way of metaphor or hyperbole; people in the village knew it as a thing that could happen.

There were dreams about her walking home. Walking beside the motorway, walking across the moor, walking up out of one of the reservoirs, rising from the dark grey water with her hair streaming and her clothes draped with long green weeds.

They had wanted to find her. They had wanted to know she was safe. They had felt involved, although they barely knew her.

నేను సహజంగా ప్రకృతి,ప్రదేశాలను గురించిన వర్ణనలు చదవడం అంటే అస్సలు ఇష్టపడను..కానీ నాకు మొదట్నుంచీ బ్రిటిష్ రూరల్ లైఫ్ అంటే ఉన్న ఒక అబ్సెషన్ కారణంగా ఇందులో బ్రిటన్ కంట్రీ సైడ్ వర్ణనలు కట్టిపడేశాయి..దానితోపాటు అక్కడి రూరల్ కమ్యూనిటీ సంస్కృతిలో భాగమైన Harvest festival, Mischief night,Spring dance,Bonfire party ల్లాంటి విషయ,విశేషాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి..రచయిత పదాల్లో ఆయనపై అక్కడి కమ్యూనిటీ ప్రభావం ప్రతి వాక్యంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది..రూరల్ కమ్యూనిటీల్లో సహజంగానే ఉండే భయాలూ,గాసిప్స్,అభిమానాలు,తోడ్పాటు స్వభావం లాంటి వాటి గురించిన వర్ణనలు ఒకప్పుడు చూసిన Cranford బీబీసీ సిరీస్,Hope లాంటి సినిమాలను తలపించాయి..ఈ ఫేస్బుక్ కాలంలో అక్కడ కూడా కంప్యూటర్ అంటే అదేదో బ్రహ్మపదార్ధమని భయపడేవాళ్ళు మనకు తారసపడతారు..

ఒక వ్యక్తి ఇరవయ్యేళ్ళుగా ఆచూకీ లేకుండా పోవడం అంత సుదీర్ఘ కాలంపాటు ఒక కమ్యూనిటీ మొత్తాన్నీ ప్రభావితం చెయ్యడం అవాస్తవికంగా అనిపించింది..ప్రకృతి వర్ణనలు ఇష్టపడేవాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది..అలా కాకుండా కథ,కథనం ఇలా ఉండాలి,పాత్రల్లో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి,మంచి పేజ్ టర్నర్ అవ్వాలి అని నిర్దిష్టమైన అభిరుచులు ఉన్నవాళ్ళు దీని దరిదాపుల్లోకి కూడా వెళ్ళొద్దు..నాకు ఈ పుస్తకం తొలి 100 పేజీలు రెండ్రోజుల్లో చదివి, మిగతా 200 పేజీలు నెలరోజుల్లో చదివిన రికార్డును సాధించిపెట్టింది..ఇక ఈ పుస్తకానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో ఆ రచయిత కనిపిస్తే ఒకసారి ఆయన్ని అడగాలని కుతూహలంగా ఉంది..మొత్తానికి ఈ Reservoir 13 నా సహనానికి పరీక్ష..Man Booker లాంగ్ లిస్ట్ లో Lincoln in the Bardo తప్ప మిగతావేవీ ఇంకా చదవకపోయినా George Saunders బరిలో ఉండగా ఈ రచనతో ఆయనకు గట్టి పోటీ ఇవ్వడం కష్టమే.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

When freedom is outlawed only the outlaws will be free, he said.

Loose lips sink ships.

He sat on a bench and read the Valley Echo while the whippet drank. He knew all the names of the people in the Echo but there were plenty he couldn’t place if they walked by. They didn’t tend to socialise.

On the reservoirs the water was whipped up into whitecaps. It was a decade now the girl had been missing, and although little talked about she was still in people’s thoughts. Her name was Rebecca, or Becky, or Bex. She’d been wearing a white hooded top with a navy-blue body-warmer. She would be twenty-three years old by now. She had been seen in the beech wood, climbing a tree. She had been seen at the railway station. She had been seen by the side of the road. She had been looked for, everywhere. She could have arranged to meet somebody, and been driven safely away. She could have fallen down a hole. She could have been hurt by her parents in some terrible mistake. She could have gone away because she’d chosen to, or because she had no choice. People still wanted to know.

Fantastic night and other stories - Stefan Zweig

Stefan Zweig..ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ..అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ,ఈయన గురించి  తెలీదు..ఈ సంపుటిలో Fantastic Night, Letter from an Unknown Woman,The Fowler Snared,The Invisible Collection మరియు Buchmendel అనే ఐదు కథలుంటాయి.. కానీ మొదటి రెండు కథలూ నిడివి ఎక్కువగా  ఉండే నవలికలు..ఈ కథల్లో విశేషం ఏంటంటే పుస్తకం మొదలు పెట్టడం మాత్రమే గుర్తుంటుంది..మనం ఏదో చదువుతున్నామనే స్పృహ మధ్యలో ఊహామాత్రం కూడా రానివ్వని రచయిత Stefan Zweig..జ్యుయిష్ మతస్థుడైన ఈ ఆస్ట్రియన్ రచయిత కథల్లో హిట్లర్ శకంలో జరిగిన వినాశనం సాధారణ మనుషుల జీవితాల మీద చూపించిన ప్రభావం కనిపిస్తుంది.

Image Courtesy Google
మొదటి కథ Fantastic Night ఆస్ట్రియన్ లెఫ్టనెంట్ అయిన 36 ఏళ్ళ Baron Friedrich Michael von R కథ..ఈ కథలో ముఖ్యపాత్రధారిది చాలా విచిత్రమైన వ్యక్తిత్వం..జన్మతః ఏలోటూ లేకుండా సౌకర్యవంతమైన విలాస జీవితం గడుపుతూ,సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అతనిలో ఉన్న ఏకైక లోపం,మనిషికి సహజంగా ఉండే భావోద్వేగాలు లేకపోవడం..దీని కారణంగా అతనికి సంతోషం,దుఖ్ఖము లాంటి వాటికి కనీస అర్థం తెలీకుండా తనలో ఏదో తెలియని వెలితి ఉందని మాత్రం అనుకుంటూ ఉంటాడు..Bourgeois comfort చట్రాన్ని దాటి వెళ్ళలేని అతనిలో,ఒక రాత్రి వరుసగా జరిగిన సంఘటనలు మంచి పరివర్తన తీసుకొస్తాయి..ఆ రాత్రి అతని జీవితాన్ని సమూలంగా మార్చేసిన సంఘటనల తాలూకూ అనుభవాల్ని వివరిస్తాడు..ఆ క్రమంలో నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసుకుని జీవిత పరమార్థం తెలుసుకునే దిశగా ప్రయాణిస్తాడు..ఈ కథ ముగింపు ఒక ఫీల్ గుడ్ అనుభవాన్నిస్తుంది..

At that moment I was fully aware for the first time how far advanced the process of paralysis already was in me—it was as if I were moving through flowing, bright water without being halted or taking root anywhere, and I knew very well that this chill was something dead and corpse-like, not yet surrounded by the foul breath of decomposition but already numbed beyond recovery, a grimly cold lack of emotion. It was the moment that precedes real, physical death and outwardly visible decay.

There was a kind of sheet of glass between me and my immediate surroundings, and my will was not strong enough to break it.

For this was the world in which I lived—the aura of perfume and elegance that wafted around the kaleidoscopic confusion.

I felt some relationship in myself with what was animal, instinctive, common.

I felt there must be something terribly strange about me that meant I could never mingle with anyone, but was separate from the dense mass, floating like a drop of oil on moving water.

రెండో కథ Letter from an Unknown Woman చాలా విశిష్టమైనది..ఇందులో 'R' అనే ఒక ప్రముఖ రచయిత తన సెలవు రోజుల్ని గడిపి వియన్నాకు తిరిగొచ్చాక రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్ కొంటాడు..అందులో యథాలాపంగా తారీఖు చూసి ఆరోజు తన 41 వ జన్మదినమని గుర్తు చేసుకుంటాడు..ఇంటికి చేరేసరికి తాను లేని సమయంలో వచ్చిన ఒక manuscript ని తలపించే ఉత్తరం చూసి ఎవరు రాశారా అని ఆసక్తితో చదవడం మొదలు పెట్టిన అతనికి ఆ ఉత్తరం ఒక అపరచితురాలు రాసిందని తెలుస్తుంది..“To you, who have never known me.” అనే వాక్యాలతో మొదలైన ఆ ఉత్తరాన్ని సిగరెట్ వెలిగించుకుని తాపీగా చదవడం మొదలుపెట్టిన  అతనికి అందులో తన గురించి తనకు కూడా తెలీని నిజాలు బయటపడతాయి..ఈ కథ ఒక ఆణిముత్యం..ఇందులో ఒక స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో మానసికపరమైన మార్పుల్ని (grotesque absurdities,extravagant fantasies) అత్యద్భుతంగా  ఆవిష్కరించారు..

I realized that you are two people rolled into one: that you are an ardent, lighthearted youth devoted to sport and adventure; and at the same time, in your art, a deeply read and highly cultured man, grave, and with a keen sense of responsibility. Unconsciously I perceived what everyone who knew you came to perceive, that you led two lives. One of these was known to all, it was the life open to the whole world; the other was turned away from the world, and was fully known only to yourself.

I understand now (you have taught me!) that a girl’s or a woman’s face must be for a man something extraordinarily mutable. It is usually nothing more than the reflection of moods which pass as swiftly as an image vanishes from a mirror. A man can readily forget a woman’s face, because age modifies its lights and shades, and because at different times the dress gives it so different a setting. Resignation comes to a woman as her knowledge grows.

మూడో కథ The Fowler Snared లో ఒక వృద్ధుడు సరదాగా కాలక్షేపానికి మొదలుపెట్టిన ఆట విషమించి అతన్ని మానసిక సంక్షోభంలోకి ఎలా నెట్టేసిందో,ఆ క్రమంలో తన దృష్టిలో తానే ఒక దోషిగా ఎలా నిలబడ్డాడో చెప్పే కథ.

Was it the ardent but aimless yearning that was so plainly manifest in her expression, the yearning of those wonderful hours in a girl’s life when her eyes look covetously forth into the universe because she has not yet found the one thing to which in due time she will cling—to rot there as algae cling to and rot on a floating log?

“You seem to be hinting that I have the mannerisms of your German novelists, that I am lyrically diffuse, stilted, sentimental, tedious.

నాలుగో కథ Invisible Collection ఒక విలువైన వస్తువుల్ని సేకరించే వ్యాపారి కుటుంబంపై యుద్ధపరిణామాల తాలూకూ ప్రభావాన్ని గురించి చెప్తుంది..ఒకరిని సంతోషపెట్టడం కోసం అవసరమైతే అసత్యాన్ని ఆశ్రయించడంలో తప్పు లేదని చెప్తూ,ఊహలు వాస్తవాలకంటే అందమైనవి అని మరో మారు రుజువు చేస్తుంది..

An eerie business to watch the handling of these two or three hundred blanks, to chime in at appropriate moments with praise of merits which for the blind collector were so eminently real that again and again (this was my salvation) his faith kindled my own.

As he spoke, his fingers caressed the despoiled portfolios. It was horrible and touching. Not for years, not since 1914, had I witnessed an expression of such unmitigated happiness on the face of a German.

ఐదో కథ Buchmendel నాకు అన్నిటికంటే నచ్చిన కథ...ఇందులో హిట్లర్ శకాన్ని మరోసారి గుర్తు చేస్తారు..సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారి  Jacob  Mendel వియన్నాలో Cafe Gluck అనే చిన్న హోటల్ లో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఒకే టేబుల్ వద్ద కూర్చుని తన పుస్తక ప్రపంచంలో గడుపుతుంటాడు..పుస్తకాల గురించి అణువణువూ తెలిసిన,అరుదైన పుస్తకాల వివరాలు కూడా పేజీలతో సహా ఠక్కున చెప్పగలిగిన Mendel లాంటి అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తి ఆ చిన్న హోటల్ లో కూర్చోవడం ఆ హోటల్ కే గర్వకారణం..ఆ విధంగా ప్రక్కన ఎవరున్నా,చుట్టూ ఏం జరుగుతున్నా తన పుస్తకాల మాటున కళ్ళజోడు సవరించుకుంటూ తన లోకంలో తానుండే Mendel జీవితం ఒకరోజు హఠాత్తుగా మారిపోతుంది..అవధుల్లేని తన పుస్తక ప్రపంచం నుంచి,అడుగడుగునా పరిమితులు విధించే వాస్తవ ప్రపంచలోకి తన ప్రమేయం లేకుండానే వచ్చి పడ్డ Mendel ఆ లోకంలో ఇమడగలిగాడా లేదా అనేది కథాంశం.. Buchmendel పాత్రలో పుస్తక ప్రేమికులు తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు..

This  Galician second-hand book dealer, Jacob Mendel, was the first to reveal to me in my youth the mystery of absolute concentration which characterizes the artist and the scholar, the sage and the imbecile; the first to make me acquainted with the tragical happiness and unhappiness of complete absorption.

The man is a saurian of the book world, an antediluvian survivor of an extinct species.

Apart from books, he knew nothing of the world. The phenomena of existence did not begin to become real for him until they had been set in type, arranged upon a composing stick, collected and, so to say, sterilized in a book. Nor did he read books for their meaning, to extract their spiritual or narrative substance.

జర్మన్ కథల్లో మాత్రమే కనిపించే ఒక రకమైన మేజిక్ ఈ కథల్లో కూడా ఉంది..టాల్స్టాయ్ శైలిని ను ఇష్టపడేవారు Zweig ను కూడా నిస్సందేహం గా ఇష్టపడతారు..Sigmund Freud స్నేహితుడూ/అభిమానీ కావడం వల్లనేమో Zweig కథల్లో విపరీతమైన సైకో అనాలిసిస్ కనిపిస్తుంది..కానీ ఆ అనాలిసిస్ పైకి సరళంగా ఉంటూనే లోతుగా ప్రయాణిస్తుంది..ఈ కారణం వల్లనేమో ఈ కథలు మెదడుకి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా,చదవడానికి చాలా హాయిగా అనిపిస్తాయి..కొంతమంది రచయితలు వాస్తవ పక్షపాతులైతే మరికొందరు కాల్పనికతకు దాసోహమంటారు..మరికొందరు ఆ చేదు నిజాలు మనకొద్దు,ఇదిగో ఊహాప్రపంచం అంటూ మనల్ని అబ్బురపరిచే లోకాలకు తీసుకు వెళ్తారు..కానీ వాస్తవాన్నీ,కాల్పనిక ప్రపంచాన్నీ ఏక కాలంలో అనుభవంలోకి తెచ్చే రచయిత Stefan Zweig.."ఇదిగో ఇది వాస్తవం,కానీ నాకది ఇష్టం లేదు,నా ప్రపంచం ఇలా ఉండాలి,ఇలా ఉంటుంది" అని శాంతిని కాంక్షిస్తూ మనకు తన పండోరా ప్రపంచాన్ని పరిచయం చేస్తారు..ఈ Zweig లోకంలో వ్యక్తులకు వాస్తవంతో పని లేదు..ఒకవేళ గమనించినా,తెలిసినా తెలియనట్లు 'అజ్ఞానం ఆనందం' అని తమ లోకంలో తాముంటారు..వారు కనిపిస్తే ఏదో ధ్యానంలో ఉన్నట్లో,నిష్ఠగా పూజ చేస్తున్నట్లో వారి కళ్ళు మనకి కనిపించని లోకాల్లో విహరిస్తున్నట్లు ఉంటాయి..For only he who lives his life as a mystery is truly alive అని నమ్మే వారి మనస్సుల్లో  తమంతట తాము చెప్తే తప్ప తెలుసుకోలేని రహస్యాలు దాగుంటాయి,వాస్తవికతను ఎదుర్కోలేక తమ ప్రపంచాన్ని చేరుకోలేక ఒక విధమైన ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతుంటారు...Zweig పాత్రలు ముఖ్యంగా ఆదర్శవాదులు..పెర్ఫెక్షనిస్టుల్లా ప్రేమంటే ఇదీ,జీవితం అంటే ఇలా ఉండాలి,ఇలా బ్రతకకపోతే వృధా అన్నట్లు నిర్ధిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు..వారి వ్యక్తిత్వాల్లో రిజిడిటీ,మచ్చలేని అమాయకత్వంతో పాటు అబ్సర్డిటీ కూడా కనిపిస్తుంది..ఈ కథల్లో ఆదర్శవాదం నాకెంతో ఇష్టమైన ఆదుర్తి సుబ్బారావు గారి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హై మెలోడ్రామాను తలపించింది..వరుస సీరియస్ రీడ్స్ తరువాత ఈ కథలు చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని మిగిల్చింది..

పుస్తకం నుండి మరికొన్ని,
He did not smoke; he did not play cards; one might almost say he did not live, were it not that his eyes were alive behind his spectacles, and unceasingly fed his enigmatic brain with words, tides, names. The brain, like a fertile pasture, greedily sucked in this abundant irrigation.

In the upper world of books, where Mendel lived and breathed and had his being, there was no warfare, there were no misunderstandings, only an ever-increasing knowledge of words and figures, of book-titles and authors’ names.

I, who at least should have known that one only makes books in order to keep in touch with one’s fellows after one has ceased to breathe, and thus to defend oneself against the inexorable fate of all that lives—transitoriness and oblivion.

Chokher Bali - Rabindranath Tagore

There is in every true woman's heart, a spark of heavenly fire, which lies dormant in the broad daylight of prosperity, but which kindles up and beams and blazes in the dark hour of adversity.-Washington Irving,The Sketch Book.

స్త్రీ మస్తిష్కంలో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరమూ కాధు....ఆమె హృదయం ఒక లోతైన సముద్రం..ఆ సముద్రాన్ని మధించే యత్నంలో రూపుదిద్దుకున్న బినోదిని పాత్ర ద్వారా అమృతతుల్యమైన స్త్రీ ఔన్నత్యాన్ని తనదైన శైలిలో మనకు రుచి చూపిస్తారు రవీంద్రనాథ్ టాగూర్.."చోఖేర్ బాలి" అంటే "కంట్లో నలుసు(ఇసుక రేణువు) అని అర్థం ..ఏ విధం గా అయితే ఇసుక రేణువు కంట్లో పడి చికాకు పెడుతుందో అదే విధం గా బినోదిని, మహేంద్ర-ఆశల అందమయిన దాంపత్య జీవితం లో కలకలం రేపుతుంది..

An irate queen bee stings everyone that comes in her path,and similarly an irate Binodini was prepared to destroy everyone around her.


కథలోకి వస్తే,ఈ నవల లో కీలక పాత్రధారి బినోదిని ఒక వితంతువు...అనుపమాన సౌందర్యం,వివేకం, తెలివితేటలు అంతకుమించిన కలివిడితనం ఆమె సొంతం..ఇన్ని సుగుణాలను దాచేస్తూ ఆమె శిరస్సు పైన వైధవ్యం అనే శ్వేతవర్ణ పరదా ఆమెకు సుఖప్రదమయిన జీవితాన్ని ఇవ్వలేకపోయింది..సమాజపు కట్టుబాట్ల మధ్య అన్ని ఆనందాలకి దూరంగా,బరసత్ అనే ఒక కుగ్రామం లో భారం గా బ్రతుకు వెళ్ళదీస్తున్న ఆమె కి,కలకత్తా కు చెందిన ధనవంతురాలు మరియు ఆమె బంధువు రాజలక్ష్మి రాక వరం గా పరిణమిస్తుంది..ఆమె బినోదినిని తనతో పాటు నివసించడానికి తన ఇంటికి తీసుకెళ్తుంది.రాజలక్ష్మి తనయుడు మహేంద్ర,మొదట తల్లి నిర్ణయం పట్ల విముఖత ప్రదర్శించినా,భార్య ప్రోద్బలం తో బినోదిని చురుకుతనం, గుణగణాలు చూసి ఆమెతో స్నేహం చేస్తాడు...అంతవరకూ ఒంటరి జీవితం గడిపిన బినోదిని,సర్వ సౌఖ్యాలూ అమరిన ఇల్లు,ఆ ఇంటి బాధ్యత,అన్నిటినీ మించి ఆశ,మహేంద్ర ల స్నేహపూరితమయిన సాంగత్యం,అన్నీ వెరసి ఒక అద్భుత ప్రపంచం లోకి వచ్చినట్లు భావిస్తుంది..వైధవ్యం ఆపాదించిన కట్టుబాట్ల శృంఖలాలు తెంచుకుని ఆధునిక జీవన శైలిలో మమేకమై పట్నవాసంలోని స్వేచ్చని ఆస్వాదిస్తుంది..ఆశ- మహేంద్రల  అన్యోన్య దాంపత్యం గురించి నెచ్చెలి ఆశ తరచూ చెప్పగా విని బినోదిని అలౌకికమయిన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది..

Love turns bland if not seasoned with a touch of pique,like cooking without spices..

Love needed to be rooted in life's labour,otherwise ecstasy would never be profound and enduring.

ఇంతవరకూ అంతా సజావుగానే సాగుతుంది,కానీ మహేంద్ర తల్లి ఒకప్పుడు బినోదిని సంబంధం తెచ్చి పెళ్ళాడమని బలవంతం చేసినప్పటికీ,మహేంద్ర ఆమెను తిరస్కరించి,తన బాల్య మిత్రుడు,వైద్య విద్యనభ్యసిస్తున బిహారీ పెళ్లాడవలసిన ఆశ ను ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు..మహేంద్ర అత్త అన్నపూర్ణకి వరసకు కూతురు,ఆశ ..ఈ సంగతి మనసులో పెట్టుకుని,తనకి దక్కవలసిన సుఖ సంతోషాలని తనతో ఏ మాత్రం సరితూగలేని,అవివేకి,అజ్ఞాని అయిన ఆశ అనుభవిస్తోందని అసూయ చెందుతుంది బినోదిని.ఇది విష బీజమై బినోదిని మనసుని కలుషితం చేస్తుంది.పర్యవసానంగా మహేంద్ర ని తన అందచందాలతో,మితిమీరిన చొరవతో ఆకర్షించడం మొదలు పెడుతుంది..మహేంద్ర ని పొందాలనే ఆకాంక్ష కి మూలం ఆశ పట్ల తనకున్న అసూయ ద్వేషాలే గానీ ప్రేమ కాదని తెలుసుకుంటుంది..అదే సమయం లో తన హృదయం మృదు స్వభావీ,అందరి మంచి కోరే వాడు అయిన  బిహారీ సొంతమని గ్రహించే లోపు చాలా ఆలస్యమైపోతుంది.మహేంద్ర బినోదిని పై ప్రేమోన్మాదంలో పూర్తిగా విచక్షణ కోల్పోతాడు..ఈ క్రమంలో బినోదిని,మహేంద్ర,ఆశ మరియు బిహారీ ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది చోఖేర్ బాలి కథాంశం...

Mahendra's thoughts,
Was there a hint in this letter of an ardour - veiled yet implied, forbidden yet intimate,noxious yet delicious,offered but unrequited ?

This play acting in a down to earth domestic chore,in a sense,rescued him from the improbable task of creating his fairy tale dream world..

Mahendra addressing Binodini,
Why did you at all engage yourself  in this game ? There is now no release for you.If we sink we sink together.

పాత్రల చిత్రీకరణ,మనస్తత్వాల విశ్లేషణలో టాగోర్ శైలి అత్యంత సహజం గా సాగుతుంది ..ముఖ్యం గా స్త్రీ పాత్ర చిత్రీకరణలో ఆయన చూపించే ప్రత్యేకత,పక్షపాతం జగద్విదితం..ఆనాటి సమాజంలో వైధవ్యం పొందిన స్త్రీలు పడే మానసిన సంఘర్షణకి నిలువెత్తు ప్రతిబింబం బినోదిని..భౌతిక వాంఛలను అణచుకోలేక,సమాజపు కట్టుబాట్లకి ఎదురు తిరగనూలేక ఆమె కనపరిచే గాంభీర్యం ఆమె వ్యక్తిత్వానికి దర్పణం..మధ్యలో కొన్ని మానసిక దౌర్బల్యాల వలన విలువలు కోల్పోయినా బిహారీ వివాహ ప్రతిపాదనని హుందాగా తిరస్కరించే సందర్భంలో ఆమె తన ఔన్నత్యాన్ని చాటుతుంది....తల్లి అతి గారాబం,మొండితనం,ఆవేశం,కోరుకున్నది సాధించాలన్న పట్టుదలా కూడి మహేంద్ర వ్యక్తిత్వం..భార్య ఆశను వంటింటికి పరిమితం చెయ్యకుండా,విద్యావంతురాలిని చెయ్యాలనుకునే ఉత్తమమైన నాయక పాత్రగా మొదలై పరస్త్రీ వ్యామోహంతో విలువలు దిగజార్చుకుంటాడు..బిహారీ అందరికీ నోట్లో నాలుకలా మెలుగుతూ,అందరి మంచీ కోరుకుంటూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర గా మొదలై చివరకు నిజమైన నాయకుడిగా అవతరిస్తాడు..మంచితనానికి,త్యాగశీలతకూ,క్షమా గుణానికీ మారు పేరు ఆశాలత,సగటు ఆడపిల్ల కి ప్రతీక...అమ్మగా,అత్తగారిగా రెండు విభిన్నఛాయలతో,కొడుకు మనసులో ప్రథమ స్థానం,తల్లిగా తనకే సొంతమని భావించే రాజలక్ష్మిపాత్ర ప్రతి ఒక్క ఇంటిలో అత్తగారిని తలపిస్తుంది..

"చోఖేర్ బాలి" ప్రత్యేకత "రవీంద్రుని రచన" కావడమే..సమాజపు దురాచారాలను సున్నితంగా విమర్శిస్తూ, వితంతువుల పై సమాజపు అమానుష ధోరణులను ఎత్తి చూపుతుంది..మానవీయ విలువలు,మనస్తత్వ విశ్లేషణలు,మానవ సంబంధాలు,జీవితపు ఆటుపోట్లు ప్రధానాంశాలుగా సాగే ఈ నవల బెంగాలీ సమాజ కట్టుబాట్లకి,సంప్రదాయాలకీ  అద్దం పడుతుంది..మానవ సహజమైన భావోద్వేగాలకు ఎంతటి వారయినా అతీతులు కారని నిరూపిస్తుంది..ఆనాటి సంఘం లో ద్వితీయ వివాహం నిషిద్ధం కావడం తో బినోదిని-బిహారీల వివాహంతో కాకుండా,ఎడబాటుతో ఈ కథకి ముగింపు ఇవ్వవలసి వచ్చినందుకు టాగోర్ అసంతృప్తి వ్యక్తం చేసేవారట. 'బంగదర్శన్' పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల సుఖేందు రే అనువదించగా  300 పేజీల పుస్తకం గా రూపుదిద్దుకుంది..ఈ నవలను 2003 లో రితుపర్నో ఘోష్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్,ప్రసేన్జిత్ చటర్జీ ప్రధాన భూమికలుగా వెండితెర మీద ఆవిష్కరించారు..

Forty Rules of Love - Elif Shafak


ఇది వరకూ ప్రేమ కథలు చాలానే చదివాను,చూశాను.. ఆహా ప్రేమంటే ఇదీ అనుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచాన్ని నడిపించే ప్రేమ కి నిర్వచనాలు బాగా narrow అయిపోయాయి..ఈ టెక్నాలజీ యుగం లో ప్రతి దానికి స్పష్టత ఆపాదించే క్రమంలో ప్రేమ లాంటి అతి సున్నితమైన,పవిత్రమైన భావాలకూ,అనుభూతులకూ సైతం స్పష్టమైన రూపమివ్వాలనే పిచ్చి ప్రయాస మనల్ని ఆ అనుభూతి తాలూకు ఉపరితలం వద్దే ఆపేసి ఆ essence తాలూకు అసలుసిసలు అనుభవానికి చాలా సార్లు దూరం చేస్తోందేమో  అనిపిస్తోంది..కొన్ని సార్లు మనం 'డీటెయిల్స్' దగ్గరే ఆగిపోయి ఎసెన్స్ ని overlook చేసేస్తూ ఉంటామేమో ..కొందరితో పరిచయం మన నిర్వచనాల్ని  సమూలంగా మార్చుకునేలా చేస్తుంది.. కానీ షామ్స్ తో పరిచయం అసలు నిర్వచనాల జోలికే పోవద్దంటుంది..ప్రేమ కి అసలు నిర్వచనాల అవసరమే లేదంటుంది..పరమ ఛాందస సంప్రదాయవాదాల నడుమ రుమి-షామ్స్ ల బంధం 'ప్రేమ' అనే అనుభూతి కి సరికొత్త అర్ధాన్ని చెప్తుంది...

రెండేళ్ళక్రితం అనుకుంటా,Elizabeth Gilbert రాసిన Eat Pray Love చదివినప్పుడు అందులో Soul mate ని నిర్వచించే కొన్ని లైన్స్ బాగా ఆకట్టుకున్నాయి..కానీ అదో మోడరన్ థియరీ లా అనిపించిందే తప్ప somehow నేను కన్విన్స్ కాలేదు..

""""""People think a soul mate is your perfect fit, and that's what everyone wants. But a true soul mate is a mirror, the person who shows you everything that is holding you back, the person who brings you to your own attention so you can change your life.

A true soul mate is probably the most important person you'll ever meet, because they tear down your walls and smack you awake. But to live with a soul mate forever? Nah. Too painful. Soul mates, they come into your life just to reveal another layer of yourself to you, and then leave.
A soul mates purpose is to shake you up, tear apart your ego a little bit, show you your obstacles and addictions, break your heart open so new light can get in, make you so desperate and out of control that you have to transform your life, then introduce you to your spiritual master...”"""""""

ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి Rumi - Shams ల రిలేషన్ చదివాకా ఆ థియరీ నిజమేననిపించింది..మనం ఒక చట్రం లో (అలవాటుగా) బ్రతుకుతున్నప్పుడు ఆ comfortable zone నుంచి మనల్ని బయటకి లాగే చెయ్యే మనం అసలు సిసలైన soul mate..Rumi ని  Shams "నువ్వు ఉండే పాలరాతి సౌధాలను దాటుకుని బయట అసలైన ప్రపంచం ఉంది అదిగో చూడు" అని చెయ్యి పట్టి నడిపించాడు..సంఘర్షణ,ఒడిదుడుకులు తెలియని రూమి జీవితం/పాండిత్యం  అసంపూర్ణమేనని,వాటికి మెరుగులు దిద్ది అతనికి సంపూర్ణత్వం ఆపాదించాడు..

ఒక సందర్భం లో రూమి షామ్స్ గురించి ఇలా అంటాడు..
He and I are one..The same moon has a bright and a dark side.Shams is my unruly side.

Blow after blow,Shams managed to ruin my reputation.Because of him I learned the value of madness and have come to know the taste of loneliness,helplessness,slander,seclusion and finally heartbreak..

ఇలాంటి బంధాల గురించి చదివినప్పుడు నాకు వెంటనే స్ఫురించినవి శంకరాభరణం,మేఘసందేశం..అంత matured సినిమాలు మన వాళ్ళు ఎప్పుడో తీశారు..అసలు ఒకరికొకరికి ఏ సంబంధం లేకుండా,జాతి కుల మత వయో భేదాలకతీతం గా ఏర్పడే ఆ బంధాలు స్వచ్చమైనవి..They just couldn't get on with out 'that' person..ఆ ట్యూనింగ్,ఆ కెమిస్ట్రీ అందరికీ అర్ధం అయ్యేది కాదు..కానీ వాటిని సమాజం హర్షించదు..వారిని వెలి వేస్తుంది.. ప్రాణాలు తీస్తుంది.. షామ్స్ ని కూడా బ్రతకనివ్వలేదు..సమాజం నిర్మించిన కరకు రాతి భవనాల్లో అది రాసిన శిలా శాసనాలకు తలవంచి ముందుకు వెళ్ళే బంధాలు మాత్రమే తుదికంటా మిగిలేవి..కానీ చరిత్రలో వాటి ఉనికి ప్రశ్నార్ధకమే..

Forty rules of love చదువుతున్నప్పుడు కలిగిన అనేక భావోద్వేగాలలో చాలా వరకూ భౌతిక ప్రపంచం అలజడి లో  కొట్టుకుపోయి సమాధైపోగా మిగిలిన ఉపరితలపు ఆలోచనల్లో ఇవి  కొన్ని..సూఫీ మతాన్ని చాలా లోతుగా విశ్లేషించిన పుస్తకం ఇది..నాతో సహా చాలా మందికి ఒక కవిగా Rumi తెలిసినంతగా షామ్స్ తెలియడు..విచిత్రం ఏంటంటే రూమి పదాల్లో ఆత్మ షామ్స్ దే..షామ్స్ లేని రూమి లేడు,అతని అద్భుతమైన కవిత్వమూ లేదు..