Monday, February 26, 2018

Slaughterhouse-Five - Kurt Vonnegut

యుద్ధాన్ని గురించి అందంగా ఆకర్షణీయంగా చెప్పడానికేముంటుంది !!  లోహపు సవ్వడి..చిక్కుల ముడి..అస్తవ్యస్తం...గందరగోళం..అందరూ చివరికి మృత్యువును చేరుకుంటారు..ఇక చెప్పడానికి మాటలు,కోరుకునే కోరికలూ ఏమీ  మిగలవు...నరమేథం తరువాత అంతటా మిగిలేది నిశ్శబ్దమే..పక్షులకి తప్ప..

And what do the birds say? All there is to say about a massacre, things like “Poo-tee-weet?”'

ఈ తరహా డార్క్ హ్యూమర్ సృష్టిలో చేయితిరిగిన రచయిత కర్ట్ వనేగట్ రచన ఈ 'స్లాటర్ హౌస్ ఫైవ్',రెండో ప్రపంచ యుద్ధంలో డ్రెజ్డెన్ (Dresden) పైజరిగిన బాంబు దాడి నేపథ్యంలో అల్లుకున్న సైన్స్ ఫిక్షన్/ Anti-war కథ..ఎంతో హైప్ ఉన్న కొన్ని పుస్తకాలు చాలా కాలం నుంచీ చదువుదామనుకున్న తరువాత చదివితే,గాలి తీసేసినట్లుగా,అసలీ పుస్తకంలో ఇంతేముంది అనిపించడం నాకు చాలా సార్లు అనుభవంలోకొచ్చిన విషయమే..కానీ ఈ పుస్తకం అలాంటి అనుభవాలకి ఖచ్చితమైన మినహాయింపు..
Image Courtesy Google
సెమీ ఆటోబయోగ్రఫీగా భావించే ఈ కథను మనకు వనేగట్ తానే నేరేటర్ గా చెప్తూ ఉంటారు.. యుద్ధాన్ని గురించిన రచన చెయ్యడానికి ముందు ఒక రచయితలో జరిగే సంఘర్షణ,అంతర్మధనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తాయి..ఈ పుస్తకాన్ని గురించి తన స్నేహితుని భార్య మేరీ O'Hare తో చెప్తూ ఈ కథను 'Children’s Crusade' గా అభివర్ణిస్తారు..యుద్ధం గురించి యదార్ధాలు మాత్రమే రాస్తానని ఆమెకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రచనను ఆమెకు అంకితమిచ్చారు..

“I don’t think this book of mine is ever going to be finished. I must have written five thousand pages by now, and thrown them all away. If I ever do finish it, though, I give you my word of honor: there won’t be a part for Frank Sinatra or John Wayne.
“I tell you what,” I said, “I’ll call it ‘The Children’s Crusade.’”

ఒక సందర్భంలో నువ్వు ప్రతినాయక పాత్రలతో ఏ పుస్తకమూ రాయలేదు ఎందుకని అని తండ్రి అడిగితే,యుద్ధానంతరం కాలేజీలో నేర్చుకున్న విషయాల్లో అదొకటి అని రచయిత వనేగట్ చల్లగా సమాధానమిస్తారు..పక్షాలు తీసుకోవడం,మంచి-చెడులు,ధర్మాధర్మాలు బేరీజు వెయ్యడం యుద్ధం విషయంలో సాధ్యం కాదనే ఆయన వాదనలో నిర్లిప్తత,నిస్సహాయతతో కూడిన ఆగ్రహం పెల్లుబుకుతాయి..ఇందులో ఆయన ఎంచుకున్న స్వరం గట్టిగా అరిచి చెప్పే అబద్దంలా కాకుండా,ఆగ్రహాన్ని అదుపు చేసుకుంటూ కోప్పడే తల్లి మందలింపులా సుతిమెత్తగా ఉంటుంది..

“It was all right,” said Billy. “Everything is all right, and everybody has to do exactly what he does. I learned that on Tralfamadore.”

People aren’t supposed to look back. I’m certainly not going to do it anymore. I’ve finished my war book now. The next one I write is going to be fun. This one is a failure, and had to be, since it was written by a pillar of salt.

ఇది అమెరికన్ ఆర్మీలో ఒక మతప్రచారకుని అసిస్టెంటు 'బిల్లీ పిలిగ్రిమ్' కథ..ఈ పిలిగ్రిమ్ (యాత్రికుడు) విచిత్రంగా కాలంలో ప్రయాణిస్తుంటాడు..ఒకసారి కళ్ళు మూసి తెరిచేలోగా ఒక కాలం నుండి మరో కాలానికి వెళ్ళిపోతాడు..ఒక సమయంలో 1944లో జర్మనీలో యుద్ధఖైదీగా పట్టుబడి మంచులో చెప్పుల్లేకుండా నడుస్తుంటే,మరు నిముషంలో 1967 లో యుద్ధఛాయలు లేని ప్రశాంతమైన వాతావరణంలో తన కాడిలాక్ డ్రైవ్ చేస్తుంటాడు..యుద్ధంలో  హీరోలంటూ ఎవరూ ఉండరనీ,ఉండేదల్లా బాధితులేననీ రుజువు చేస్తున్నట్లుగా ఉంటుంది బిల్లీ పాత్ర చిత్రీకరణ..బిల్లీలో మనకొక హీరో కాకుండా ఒక అమాయకుడైన సగటు మనిషి కనిపిస్తాడు...దీనికి తోడు అతని దేహ నిర్మాణం కూడా అర్భకంగా ఉంటుంది..ఈ సగటు మనిషికి యుద్ధం వద్దు..శాంతి కావాలి..తుపాకీ గుళ్ళ శబ్దం కాదు,నిశ్శబ్దం కావాలి..కానీ జరిగేదాన్ని నిస్సహాయంగా,నిమిత్తమాత్రంగా చూస్తూ మానసిక సంతులనం కోల్పోతాడు..Post-traumatic stress disorder తో ఆస్పత్రి పాలవుతాడు..కోలుకున్న తరువాత సంపన్నురాలూ,స్థూలకాయురాలైన (Valencia Merbel) వాలెన్సియా ను వివాహం చేసుకుని బార్బరా,రాబర్ట్ అనే ఇద్దరు పిల్లల తండ్రై ఆప్టోమెట్రీ స్కూల్ ని నడుపుతున్నప్పటికీ యుద్ధం తాలూకూ నీడలు అతన్ని వదిలిపోవు...తన కూతురు వివాహమైన రాత్రి Tralfamadorians అనే గ్రహాంతరవాసులకు పట్టుబడి వారి గ్రహానికి చేరి అక్కడ Montana Wildhack అనే సినీనటితో మరో బిడ్డను కంటాడు..ఈ Tralfamadorians  భూగ్రహ వాసులను గూర్చి వ్యక్తపరిచే అభిప్రాయాలు,వారి సిద్ధాంతాలు,ఆదర్శాలు ఆసక్తికరంగానూ,అబ్సర్డ్ గానూ ఉంటాయి.

ఇందులో డ్రెజ్డెన్ లో ఆ ఉత్పాతానికి ప్రత్యక్ష సాక్షి అయిన బిల్లీ పిలిగ్రిమ్ మనకు చెప్పాలనుకున్నవి ఎన్నో విడమర్చి చెప్పలేదు.."నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను కానీ నాకు దాని గురించి మాట్లాడాలని లేదు,అసలు మాట్లాడుకోడానికేం లేదు" అంటాడు..అతని మౌనంలోనే మనల్ని సమాధానాలు వెతుక్కోమంటాడు..కానీ బిల్లీ చర్యలూ,అతని వింత ప్రవర్తనా ఆ అనుభవాలన్నీ తేటతెల్లం చేస్తాయి...హాస్పటల్లో తల్లీ,స్నేహితుడు మతపరమైన విషయాల గురించీ,అందమైన ప్రపంచాన్ని గురించీ మాట్లాడుకుంటుంటే,అవి అతని చెవులకు కర్ణ కఠోరంగా అనిపించి,వాళ్ళెప్పుడెళ్ళిపోతారా అని దుప్పటి ముసుగులోంచి బిత్తర చూపులు చూసే బిల్లీ పిలిగ్రిమ్ అమాయకపు చేష్టల్లో యుద్ధం తాలూకూ క్రూరత్వం కనిపిస్తుంది..యుద్ధం అతని మనసులో చేసిన గాయాలు చివరి వరకూ పచ్చిగా నెత్తురోడుతూనే ఉంటాయి..

పుస్తకాల్లో,సినిమాల్లో యుద్ధాన్ని గొప్పగా అభివర్ణిస్తారు..ఉహూ,నిజానికి ప్రోత్సహిస్తారు..అందులో హీరోలు పరాక్రమవంతుల్లా చేసే పోరాట సన్నివేశాలుంటాయి..కానీ వాస్తవంలో పిల్లలు,అమాయకులు పాలుపంచుకునే ఆ యుద్ధంలో ప్రాణభీతి మాత్రమే ఉంటుందనే వాదన దిశగా ఈ నవల సాగుతుంది..ఇందులో కూడా వనేగట్ స్త్రీలు ఫన్నీగా ఉంటారు..వారందరిలో గయ్యాళితనం,నోటి దురుసు లాంటివి తగుమోతాదుల్లో,స్త్రీ సహజ ప్రవృత్తిలో అవి కూడా భాగం అన్నట్లు చిత్రిస్తారు.. కూతురు బార్బరాను గురించి చెప్తూ,
All this responsibility at such an early age made her a bitchy flibbertigibbet. అంటారు.. :)

ఒక సందర్భంలో హిరోషిమా దాడి కంటే డ్రెజ్డెన్ లో నరమేధం ఎంత భయనకమో అమెరికనన్లకే తెలీదు,ఆమాటకొస్తే నాకూ తెలీదు..ఎందుకంటే పెద్దగా పబ్లిసిటీ లేదంటారు..మరో సందర్భంలో పవిత్రమైన క్రైస్తవ పీఠాన్ని,వారి వాద్యపరికరాన్నీ వాక్యూం క్లీనర్ కంపెనీ తయారు చేసిందంటారు..మరి అందులో పవిత్రత ఎలా వచ్చిందనేది ఆయన ప్రశ్న.. మతం పేరుతో జరిగే మారణహోమానికి పవిత్రతను ఎలా ఆపాదించాలో అర్ధంకాని తన అసమర్థతను సమర్ధవంతంగా ఇంత తేలికపాటి వాక్యాల్లో ఇమడ్చడం వనేగట్ కు మాత్రమే సాధ్యం..

ఈ కథలో మధ్య మధ్యలో "అదిగో అక్కడ నేనే","అది నేనే" అంటూ మన రచయిత కూడా మెరుపులా మెరిసి మాయమవుతుంటారు..తనది కాని అనుభవాన్ని రాయడం సులభం కాదనే వాదనకి ఈ రచనని మరో ఉదాహరణగా చెప్పొచ్చు..అందుకే ఈ రచనని వనేగట్ సెమీ ఆటోబయోగ్రఫీగా చూస్తారు.మృత్యువు గురించి మాట్లాడిన ప్రతిసారీ "So it goes" అని వాక్యాన్ని ముగించడం,జెర్మన్ల పళ్ళను పియానో మెట్లతో పోల్చడం,ఒక సైనికుని శ్వాసని మస్టర్డ్ గ్యాస్,గులాబీలతో పోల్చడం, “If you’re ever in Cody, Wyoming,” I said to him lazily, “just ask for Wild Bob.” / “You guys go on without me,”అని బిల్లీ చేత పదే పదే అనిపించడం ఇవన్నీ వనేగట్ కి మార్కు డార్క్ హ్యూమర్ కీ,అబ్సర్డిటీకి దర్పణం పడతాయి..ఇందులో ఆయన విసిరిన పంచ్ లూ,సంధించిన వ్యంగ్యాస్త్రాలు కోకొల్లలు..వనేగట్ అభిమానులకు ఈ పుస్తకం ఒక పూర్తి స్థాయి విందు భోజనం చేస్తున్నట్లు ఉంటుంది..సెటైర్ ఇష్టపడేవారైతే తప్పకుండా చదవాల్సిన పుస్తకం..

పుస్తకం నుండి నచ్చిన వాక్యాలు మరికొన్ని,

Billy had an extremely gruesome crucifix hanging on the wall of his little bedroom in Ilium. A military surgeon would have admired the clinical fidelity of the artist’s rendition of all Christ’s wounds—the spear wound, the thorn wounds, the holes that were made by the iron spikes. Billy’s Christ died horribly. He was pitiful. So it goes.

Four inches of unmarked snow blanketed the ground. The Americans had no choice but to leave trails in the snow as unambiguous as diagrams in a book on ballroom dancing—step, slide, rest—step, slide, rest.

It was a pleasure collecting point for prisoners of war. Billy and Weary were taken inside, where it was warm and smoky. There was a fire sizzling and popping in the fireplace. The fuel was furniture. There were about twenty other Americans in there, sitting on the floor with their backs to the wall, staring into the flames—thinking whatever there was to think, which was zero. Nobody talked. Nobody had any good war stories to tell".

Billy’s smile as he came out of the shrubbery was at least as peculiar as Mona Lisa’s, for he was simultaneously on foot in Germany in 1944 and riding his Cadillac in 1967. Germany dropped away, and 1967 became bright and clear, free of interference from any other time.

Among the things Billy Pilgrim could not change were the past, the present, and the future.

Billy found the afternoon stingingly exciting. There was so much to see—dragon’s teeth, killing machines, corpses with bare feet that were blue and ivory. So it goes.

Kilgore Trout became Billy’s favorite living author, and science fiction became the only sort of tales he could read.

She upset Billy simply by being his mother. She made him feel embarrassed and ungrateful and weak because she had gone to so much trouble to give him life, and to keep that life going, and Billy didn’t really like life at all.

“How’s the patient?” he asked Derby. “Dead to the world.” “But not actually dead.”

బిల్లీ చదివిన ఒక సైన్స్ ఫిక్షన్ కథ,
The visitor from outer space made a serious study of Christianity, to learn, if he could,
why Christians found it so easy to be cruel. He concluded that at least part of the trouble was slipshod storytelling in the New Testament. He supposed that the intent of the Gospels was to teach people, among other things, to be merciful, even to the lowest of the low. But the Gospels actually taught this: Before you kill somebody, make absolutely sure he isn’t well connected. So it goes.

Everything was beautiful and nothing hurt..

“All the real soldiers are dead,” she said. It was true. So it goes.

“Are—are you Kilgore Trout?” “Yes.” Trout supposed that Billy had some complaint about the way his newspapers were being delivered. He did not think of himself as a writer for the simple reason that the world had never allowed him to think of himself in this way

Everybody was thrilled to have a real author at the party, even though they had never read his books.

“All he does in his sleep is quit and surrender and apologize and ask to be left alone.”

The battle of the laboratories held fateful risks for us as well as the battles of the air, land, and sea, and we have now won the battle of the laboratories as we have won the other battles. We are now prepared to obliterate more rapidly and completely every productive enterprise the Japanese have above ground in any city, said Harry Truman. We shall destroy their docks, their factories, and their communications. Let there be no mistake; we shall completely destroy Japan’s power to make war. It was to spare— And so on..

Actually, Billy’s outward listlessness was a screen. The listlessness concealed a mind which was fizzing and flashing thrillingly. It was preparing letters and lectures about the flying saucers, the negligibility of death, and the true nature of time.

That was one of the things about the end of the war: Absolutely anybody who wanted a weapon could have one. They were lying all around.

"There’s more to life than what you read in books,” said Weary. “You’ll find that out.”

It was very good for me, because I saw a lot of authentic backgrounds for made-up stories which I will write later on. One of them will be “Russian Baroque” and another will be “No Kissing” and another will be “Dollar Bar” and another will be “If the Accident Will,” and so on. And so on..

Monday, February 19, 2018

కథా - కాలక్షేపం

"అన్ని పుస్తకాలు ఊరికే చదవకపోతే నువ్వు కూడా ఏదైనా రాయొచ్చు కదా,కథలో కాకరకాయలో రాల్తాయి"
నాకు బాగా సన్నిహితులైన మిత్రులు ఒకసారి సరదాగా అన్న మాట ఇది..
"సరిపోయింది ! నువ్వనేది ఎలా ఉందంటే అన్ని సినిమాలు ఊరికే చూడకపోతే ఏదో ఒక సినిమా నువ్వే తియ్యచ్చు కదా ! అన్నట్లుంది మీ వరస" నా సమాధానం.. 

చదివేవాళ్ళందరూ రాయలేరు,రాయవలసిన అవసరమూ లేదు..కానీ రాయాలనుకునేవాళ్ళు అందరూ చదవాలి...శాస్త్రీయ సంగీతం ఆస్వాదించగలిగినవారు అందరూ సంగీతకారులు కాలేరు..ఈ వర్గంవారు రసాస్వాదనకే  పరిమితమవుతారు..అయినా అందరూ రచయితలైపోతే పాఠకులెవరని ?????  :) 

గత సంవత్సరం నుండీ చదివిన కొందరు రచయితలు బుర్రలో తిష్ట వేసుకుని కూర్చుని,స్టోరీ క్రాఫ్టింగ్ గురించి ఆలోచనలో పడేశారు..హోల్డ్ ఆన్..హోల్డ్ ఆన్.. ఇప్పుడు కథలెలా రాయాలో నేను చెప్పబోవటం లేదు..ఈ 'క్రాఫ్టింగ్' అనే బ్రహ్మపదార్థం గురించి గతంలో మహామహులంతా ఎప్పుడో ఉద్గ్రంధాల్లో రాసేసి మన చేతిలో పెట్టారు..ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏదీ లేదు..కానీ కూరలు కొంటున్నప్పుడు చచ్చులూ,పుచ్చులూ లేకుండా నాణ్యమైనవి ఎలా ఏరుకుంటామో,ఒక పాఠకురాలిగా రచనలో నాణ్యతను కోరుకోవడం కూడా సహజం..అయినా ఈ భావజాలాల విషయానికొస్తే Everything is already said...And everything is already done..We all are mere translators..We all are mere followers..అనే నేను నమ్మే ఫిలాసఫీని  ఎప్పుడో ట్విన్ టాక్ చేసినట్లు గుర్తు.. :P 

ఫిలాసఫీని భక్తి శ్రద్ధలతో చదువుతున్న రోజుల్లో,పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువ చదవకూడదేమో ,చదివితే తమకు తెలీకుండానే ఆ రచయితల భావజాలాల్లో కొట్టుకుపోతారేమో అనిపించేది..'రచయితలం ఏదైనా ప్రతిపాదన చేశాక ఆ విషయాన్ని ఆల్రెడీ ఆస్కార్ వైల్డ్ చెప్పేశాడేమో అని ఒక సారి వెరిఫై చేసుకుంటామని' డోరతీ పార్కర్ అన్నట్లు కొన్నిసార్లు భావజాలాలు సంఘర్షించుకోవడం అనివార్యమేమో అనిపిస్తుంది..మళ్ళీ మొన్నామధ్య ఆడమ్ ఫిలిప్స్ 'అన్ ఫర్బిడెన్ ప్లెషర్స్' చదువుతున్నప్పుడు ఇదే విషయం అందులో కూడా చర్చకొచ్చింది..నీషే తన రచనల్లో తాను చదివిన రచయితల ఉనికిని గమనించలేకపోయాననీ,అందువల్లే తన భావజాలంలో స్వఛ్ఛత లోపించిందనీ  వాపోతారు..కానీ రచయితలకు,ముఖ్యంగా ఫిలాసఫర్లకు  ఈ ఐడియాలజీస్ overlap అవ్వకుండా ఆపడం సాధ్యమేనా !!!!!!!

ఫిలాసఫీ గురించి ప్రక్కన పెడితే సిద్ధాంతాలు,ప్రతిపాదనలు అవసరం లేని కథలు అంటూ ఉంటాయా! 'ఏ కథైనా రచయిత భావజాలాన్ని ప్రతిబింబించాలి' అనే సూత్రం తప్పనిసరా  అనేది మరో ప్రశ్న..Kurt Vonnegut,టాల్స్టాయ్,పిరెండెల్లో,కార్వర్,గుల్జార్,మంటో,బ్రాడ్బరీ వంటి వాళ్ళను చదువుతుంటే అసలు కథంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది...ముఖ్యంగా డెబ్భైల ముందు వచ్చిన సాహిత్యానికీ,ఇప్పటి సాహిత్యానికీ నాణ్యతలో ఉన్న తేడా తెలియాలంటే మన ముందు తరాల రచయితల్ని చదవాలి..అందులోనూ కథలు రాయాలనుకున్నవారు తప్పకుండా చదవాలి..ఇన్నేళ్ళుగా మిరియాలు వాడుతూ 'ఘాటు' అనుకునే నాకు పోయినేడాది వాయనాడ్ లో మిరియాల తోటల్లో కోసిన మిరియాల్ని చేతిలోకి తీసుకుని ఒక చిన్న మిరియాన్ని నోట్లో వేసుకుని చూసినప్పుడు గానీ తెలీలేదు,అసలు మిరియాల 'ఘాటు' ఎలా ఉంటుందో..సాహిత్యానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందనుకుంటా..ఆ 'ఘాటు' సమకాలీన సాహిత్యంలో లోపించింది...అసలు రాసేవాళ్ళు ఎంతమంది చదువుతారు అనేది ఇక్కడ మొదట ఆలోచించవలసిన విషయం..నాలుగు పుస్తకాలు చదివి,ఒక్క పుస్తకం రాసి 'సెలబ్రిటీ రైటర్' ట్యాగ్ తగిలించేసుకుంటున్నవాళ్ళలో లోపిస్తున్న అంకితభావం/నిలకడ లాంటి అంశాల గురించి ప్రముఖ రచయిత్రి ఉర్సులా లెగైన్ 'నో టైం టు స్పేర్' లో చాలానే చురకలంటించారు..'As a writer, you should not judge, you should understand.' అని హెమ్మింగ్వే చెప్పిన రచనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని ఎంత మంది ఆచరిస్తున్నారో ఆలోచించవలసిన విషయమే..సమకాలీన సాహిత్యంలో స్త్రీవాదం,దళితవాదం,జాతి-మత-ప్రాంతీయ వాదాల మినహా ఇంకేదైనా దొరకాలంటే భూతద్దంలో వెతుక్కోవడమే అవుతోంది ..అప్పట్లో జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో ఒక ప్రముఖ పబ్లికేషన్ సంస్థ 'మాకు క్వాలిటీ ముఖ్యం..శోభా డే,చేతన్ భగత్ లాంటి వాళ్ళ పుస్తకాలు మేం పబ్లిష్ చెయ్యం' అని ఘంటాపథం గా చెప్పడమే సమకాలీన సాహిత్యానికి చెంపపెట్టులాంటి సంఘటన.

ఒక కథ ద్వారా ప్రపంచానికి ఏదో సందేశం ఇద్దామని,ఒక పది సందేశాలను తయారు చేసుకుని,ఆ సందేశాన్ని సౌకర్యవంతంగా ఒక పాత్ర నోటి ద్వారా కక్కించి,తమ అస్థిత్వపు వైకల్యాలన్నీ సంభాషణల్లో ఇరికించి,ఇసుక పాళ్ళు ఎక్కువైన సిమెంట్ లాంటి కథనంతో బలహీనమైన పునాదుల్ని లేపి,నేపథ్యం లేకుండా కూర్చిన కథ ప్యాచ్ వర్క్ చేసిన చీరలా ఉంటే,ఒక్కో నూలు పోగునీ జాగ్రత్తగా మగ్గం మీద ఓపిగ్గా నేసిన నేత కార్మికుని చీర లాంటిది నాణ్యత కలిగిన కథ..పెద్దవాళ్ళు చెప్పే నీతి బోధలు పసివారికి ఎలా విసుగ్గా ఉంటాయో,రచయితలు ఇది మంచి,ఇది చెడు అని చెయ్యి పట్టుకుని నడిపిస్తుంటే పాఠకులకు కూడా అంతే విసుగ్గా ఉంటుంది..పసి పిల్లవాడు ప్రపంచాన్ని తన అనుభవం ద్వారా తెలుసుకుందామని ఉబలాటపడతాడు..అలాగే పాఠకులకు ఆ అనుభవాన్ని దూరం చేసి ప్రతీదీ తేటతెల్లం చేసి చెప్పడం,నా వరకూ ఒక రచయిత చెయ్యగలిగే క్రూరమైన పని..భావజాలాల చిక్కుముడుల్లోపడి ఉండిపోకుండా,ఆ చిక్కుల్ని విడదీసుకుని రచయిత తన పరిధిని ఎంతగా విస్తరించుకుంటారనేదానిపై ఆ రచన నాణ్యత ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది..స్వఛ్ఛమైన రచన ( A creative piece of work in its purest form) చెయ్యడం ఎవరివల్లా కాని పనైతే కాదు..కానీ అలా సృష్టించడానికి మనిషిలో మనుష్యత్వానికి మించిందేదో ఉండాలి..బహుశా దైవాంశ సంభూతులు అంటారేమో అటువంటి వారిని..ఉదాహరణకు జాన్ బెర్జర్ 'ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పికాసో' చదువుతున్నప్పుడు పికాసో చిత్రాలను గీయడాన్ని 'ఒక స్పృహ లేని స్థితిలో జరిగిన చర్య'గా అభివర్ణిస్తారు..అలా 'తన నుండి తాను విడివడి' సృష్టించే ప్రతీదీ ఒక కళా ఖండమవుతుంది..అసలైన ఆర్ట్ కి Consciousness తో పని లేదంటారు బెర్జర్,వైల్డ్ లాంటివాళ్ళు ..మరి కుల,మత,భాష,లింగ,జాతి భేదాలతో తమను నిర్వచించుకోకుండా పొద్దుపోని ఆర్టిస్టుల నుండి తయారయ్యే కళాఖండాల్లో (?)  ఈ స్వఛ్ఛత కోరుకోవడం అత్యాశేనేమో..

Saturday, February 17, 2018

The Illustrated Man - Ray Bradbury

న న కర్తే ప్యార్ తుమ్హిసే కర్ బైఠే ! అని పాడుకుంటూ ఈ మధ్య సైన్స్ ఫిక్షన్ పుస్తకాల ప్రేమలో పడ్డాను..మొన్న ఉర్సులా లెగైన్ 'నో టైం టు స్పేర్' చదివాక,సైన్స్ ఫిక్షన్/ఫాంటసీలపై నాకున్న చిన్నచూపు ఇప్పుడు లేదు..కానీ ఆ పుస్తకం తరువాత వెంటనే రే బ్రాడ్బరీని చదవడం కేవలం కాకతాళీయం ! ఇందులో ఒక వ్యక్తి శరీరం నిండా పచ్చబొట్లలా పొడిపించుకున్న దృష్టాంతాలు అతని శరీరం నిండా అటూ ఇటూ కదులుతూ నిజమైన కథలుగా జీవం పోసుకుంటాయి..ఈ సంకలనంలో మొత్తం పద్ధెనిమిది కథల్లో తొలి సగం కథలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమైతే మిగతా సగం కాస్త ఓపిగ్గా చదవాల్సిన కథలు..

Image Courtesy Google
So people fire me when my pictures move. They don’t like it when violent things happen in my Illustrations. Each Illustration is a little story. If you watch them, in a few minutes they tell you a tale. In three hours of looking you could see eighteen or twenty stories acted right on my body, you could hear voices and think thoughts. It’s all here, just waiting for you to look.

ఈ డెబ్భైల ముందు కాలంలో వచ్చిన కొన్ని రచనలు చదువుతున్నప్పుడు సమకాలీన సాహిత్యంలో ఏదో వెలితి ఉన్నట్లు అనిపించేది..పుస్తకం చదువుతున్నప్పుడు నచ్చిన వాక్యాలు నోట్స్/కోట్స్ రాద్దామంటే అదేమిటో ఏమీ దొరకవు..మరి సమకాలీన సాహిత్యంలో పేజీకో వాక్యం ఉంటుంది..అంటే ఆ వాక్యం మినహాయిస్తే  మిగలినదంతా సారవిహీనమైన పదబంధాల హడావుడి మాత్రమే..కానీ ఇలాంటి పుస్తకాల దగ్గరకొచ్చేసరికి కథలో ఆఖరిమెట్టు  దిగుతున్నప్పుడు గానీ రచయిత అంతరంగం పూర్తిగా బోధపడదు..ఆ కాలపు రచయితలకు తమ అక్షరాలంటే ఎంత ప్రేమంటే,తమ ఊహాశక్తిని ప్రతి పదానికీ విస్తరించి ప్రతి వాక్యాన్నీ అందంగా,అర్ధవంతంగా అలంకరించిగానీ తృప్తిపడనంత..నిస్సందేహంగా ఇలాంటి రచనలు సమకాలీన సాహిత్యంలో బహు అరుదు..ఇవి సైన్స్ ఫిక్షన్ కథలైనప్పటికీ మంటో,గుల్జార్,పిరాండెల్లో,కార్వర్ ల శైలికీ,ఈ కథల శైలికీ ఎక్కడో దూరపు చుట్టరికం ఉన్నట్లనిపించింది..

బ్రాడ్బరీ కథల్లో నేపధ్యం సమస్త విశ్వం,అందులో పాలపుంతలు,భూమి,మార్స్,వీనస్ లాంటి గ్రహాలూను..కానీ ఈ కథల్లో ఆత్మ మాత్రం మానవీయ విలువల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది..ఇందులో వ్యక్తులు మామూలు మనుషులు కాదు..కొందరు భూగ్రహ వాసులైతే,మరి కొందరు మార్షియన్లుంటారు,కొన్ని చోట్ల వీనస్ వర్షంలో చిక్కుకుపోయిన రాకెట్ మెన్లు కూడా తారస పడతారు..ఇందులో పాత్రలన్నీ అటూ ఇటుగా స్పేస్ ట్రావెల్ చేస్తుంటాయి,వార్ షిప్ లలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్తూ సత్యాన్వేషణ సాగిస్తూ ఉంటాయి..మరి కొన్ని గతించిన కాలంలోకి టైం ట్రావెల్ చేస్తాయి,టెక్నాలజీని తుదికంటా ఉపయోగించుకుని షూ లేసులు కట్టించుకోడం మొదలు అన్నిటికీ రోబోట్లను ఉపయోగిస్తూ ఉంటాయి..1951 లో రాసిన ఈ కథలన్నీ మనల్ని ఒక శతాబ్దం ముందుకి తీసుకెళ్తాయి,అంటే ఇందులో 2051 కాలానికి చెందిన కథలు కూడా ఉంటాయి..భవిష్యత్తును ఊహిస్తూ రాసిన ఈ కథల్లో భూమి మీద సహజవనరులన్నీ యథేచ్ఛగా ఖర్చుపెట్టేసి మిగతా గ్రహాల వైపు ఆశగా చూస్తున్న మానవుడు కనిపిస్తాడు..ఇందులో వ్యక్తుల సమస్యలు కూడా సమస్త విశ్వంతో ముడిపడి ఉంటాయి..పర్యావరణం కూడా మనిషితో సమంగా ఈ కథల్లో కీలక పాత్ర పోషిస్తుంది..

ఇవి సైన్స్ ఫిక్షన్ కథలు కదా అని మెటీరియలిస్టిక్ గా ఉంటాయనుకుంటే పొరపాటే..ప్రతి కథలోనూ భావోద్వేగాలు,నమ్మకాలూ,భక్తి లాంటివి అంతర్లీనంగా ఉంటాయి..అన్ని కథల్లోనూ మానవీయ విలువలకే పెద్ద పీట వేశారు బ్రాడ్బరీ..మనుషుల్ని బానిసలుగా చేసుకుంటున్న టెక్నాలజీ భూతాన్ని గురించి సున్నితంగా హెచ్చరించారు..అన్నిటిలోను నాకు బాగా నచ్చిన "The Veldt" కథ ఈ కాలానికి సరిగ్గా సరిపడే కథ..ముఖ్యంగా పెద్దలు తప్పకుండా చదవాల్సిన కథ..ఇది పిల్లలకు సెల్ ఫోన్లు,టీవీలు 24/7 అందుబాటులో ఉంచుతున్న పెద్దవాళ్ళకు హెచ్చరిక లాంటి కథ.."Kaleidoscope" అనే మరో కథ మనిషి జీవితంలో  ప్రాధాన్యతల్ని విశ్లేషించే కథ.. అలాగే  "The Other Foot" అనే కథ జాతి విద్వేషాలను ప్రక్కకు పెట్టి మనుషుల్ని సోదరభావంతో చూడాలనే నీతిని బోధిస్తుంది.. "The Man" ఇందులో నాకు బాగా నచ్చిన ఇంకో కథ..ఈ కథ అంధ మతవిశ్వాశాలను పునః సమీక్షించుకోమంటూ దైవత్వానికి సరైన నిర్వచనమిచ్చే కథ.. వరల్డ్ వార్ నేపథ్యంలో రాసిన "The Highway" కథలో కాస్త అబ్సర్డిటీ కూడా తొంగిచూస్తుంది..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కథలో ఒక్కో నీతి దాగుంటుంది..

బ్రాడ్బరీ కథల్లో నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే ఆయన ఎక్కడా భారీ నిర్వచనాల జోలికి పోలేదు..హద్దులు గీయడానికి అస్సలు ప్రయత్నించలేదు..ఈ కథల పరిధి చాలా విశాలం..బిగ్ పిక్చర్ చూసేవాళ్ళయితే వీటికి మరింత  బాగా కనెక్ట్ అవుతారు..ఈ కథలకు హద్దులు నాలుగ్గోడలో,లేక ఊరి పొలిమేరలో,దేశాంతరాలొ,ఖండాంతరాలో కాదు..ఇవి మనిషిని కూడా పర్యావరణంలో భాగంగా చిత్రిస్తూ,విశాల విశ్వంలో అణువంత కూడా లేని  మనిషి,తన ఉనికిని తానే ప్రశ్నించుకునేలా చేస్తాయి..టెక్నాలజీ మోజులో తన ప్రాధాన్యతల్ని మర్చిపోయిన మానవ జాతి పట్ల రచయితలో పేరుకున్న అసంతృప్తి అన్ని కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.."The Exiles" అనే మరో కథలో ఊహాశక్తికి తిలోదకాలిచ్చి ,టెక్నాలజీ పిచ్చి పరాకాష్టకు చేరగా భూమి మీద కాల్పనిక సాహిత్యాన్నంతటినీ కాల్చి బూడిద చెయ్యడానికి మనిషి పూనుకోవడం లాంటి కొన్ని కీలకాంశాలు మనల్ని ఖచ్చితంగా ఆలోచనల్లో పడేస్తాయి..ఇటువంటి కథల్ని ఇప్పటి వరకూ చదవలేదు అనడం చాలా అలవాటైన మాటే అయినా మరో సారి చెప్పక తప్పేట్లు లేదు..అవును ఇటువంటి కథల్ని ఇప్పటివరకూ చదవలేదు..

పుస్తకం నుండి మరి కొన్ని..
“That isn’t important,” said Hollis. And it was not. It was gone. When life is over it is like a flicker of bright film, an instant on the screen, all of its prejudices and passions condensed and illumined for an instant on space, and before you could cry out, “There was a happy day, there a bad one, there an evil face, there a good one,” the film burned to a cinder, the screen went dark.

There were differences between memories and dreams. He had only dreams of things he had wanted to do, while Lespere had memories of things done and accomplished. And this knowledge began to pull Hollis apart, with a slow, quivering precision.

“Maybe we’re looking for peace and quiet. Certainly there’s none on Earth,” said Martin.

Why, the chances are one in billions we’d arrived at one certain planet among millions of planets the day after  he  came! You must know where he’s gone!”
"Each finds him in his own way,” replied the mayor gently.

"Don’t ever be a Rocket Man.” I stopped.
“I mean it,” he said. “Because when you’re out there you want to be here, and when you’re here you want to be out there. Don’t start that. Don’t let it get hold of you.”

I remembered him in the garden, sweating, and all the traveling and doing and listening, and I knew that he did this to convince himself that the sea and the towns and the land and his family were the only real things and the good things.

Coming out of space was like coming out of the most beautiful cathedral they had ever seen. Touching Mars was like touching the ordinary pavement outside the church five minutes after having  really  known your love for God.

I’ve always figured it that you die each day and each day is a box, you see, all numbered and neat; but never go back and lift the lids, because you’ve died a couple of thousand times in your life, and that’s a lot of corpses, each dead a different way, each with a worse expression. Each of those days is a different you, somebody you don’t know or understand or want to understand.”

“We’re all fools,” said Clemens, “all the time. It’s just we’re a different kind each day. We think, I’m not a fool today. I’ve learned my lesson. I was a fool yesterday but not this morning. Then tomorrow we find out that, yes, we were a fool today too. I think the only way we can grow and get on in this world is to accept the fact we’re not perfect and live accordingly.”

Did you know I wanted to be a writer? Oh yes, one of those men who always talk about writing but rarely write. And too much temper.

“There are blond robots with pink rubber bodies, real, but somehow unreal, alive but somehow automatic in all responses, living in caves all of their lives. Their  derrières  are incredible in girth. Their eyes are fixed and motionless from an endless time of staring at picture screens. The only muscles they have occur in their jaws from their ceaseless chewing of gum.

Wednesday, February 7, 2018

No Time to Spare:Thinking About What Matters - Ursula K. Le Guin

సాధారణంగా రచనావ్యాసంగంలో ఉన్నవారు (లేదా కళాకారులు ఎవరైనాసరే) పాఠకలోకానికి వీలైనంత దూరంగా ఉండడానికి ఇష్టపడతారు..అందులోనూ అంతర్ముఖులైన రచయితల సంగతైతే ఇహ చెప్పనే అక్కర్లేదు..అలా అని తమ ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఆరాటం వారికి ఉండదని కాదు..బాహ్య ప్రపంచంతో మమేకమవ్వడానికి వారెన్నుకునే మార్గం వేరంతే..ఈ కోవకి చెందిన వారు తాము రాసిన అక్షరాల మాటున దాగి తమను ఎవరైనా గుర్తిస్తారా ! లేదా ! అని వేచి చూస్తుంటారు..కానీ అలాంటివారికి కూడా కీర్తి ప్రతిష్టలను ఆర్జించి,ఒక స్థాయికి వచ్చాకా,ఆ ముసుగును తీసేసి అందరితో తనంత తానుగా కలవాలనే వింత కోరిక కలుగుతుందేమో..అలా తాను సృష్టించిన పాత్రల స్వరంలో,వారి  వ్యక్తిత్వంలో ఆవిష్కరించిన తన అంతరంగాన్ని తనదైన స్వరంలో బహిర్గతం చెయ్యాలనే ఆలోచనే ఈ రచనకు పునాది అంటారు అమెరికన్ రచయిత్రి ఉర్సులా లెగైన్..చిన్నారులను,పెద్దలనూ కూడా  తానూ సృష్టించిన ఫాంటసీ ప్రపంచాల్లో విహరింపజేసిన ఉర్సులా లెగైన్ ఎనభయ్యో పడిలోకి  అడుగుపెట్టాకా స్వేఛ్చగా తన గళాన్ని వినిపించాలనే కోరిక కలిగింది అంటారు..85 ఏళ్ళ వయసులో జోస్ సరమగో రాసిన బ్లాగ్ తనకు ఈ వ్యాసాలు రాసే స్ఫూర్తినిచ్చిందంటారు..

I never wanted to blog before. I’ve never liked the word blog—I suppose it is meant to stand for bio-log or something like that, but it sounds like a sodden tree trunk in a bog, or maybe an obstruction in the nasal passage (Oh, she talks that way because she has such terrible blogs in her nose). I was also put off by the idea that a blog ought to be “interactive,” that the blogger is expected to read people’s comments in order to reply to them and carry on a limitless conversation with strangers. I am much too introverted to want to do that at all. I am happy with strangers only if I can write a story or a poem and hide from them behind it, letting it speak for me.


Image courtesy Google
సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ లంటే మొదట్నుంచీ అయిష్టత ఉన్న నేను ఉర్సులా లెగైన్ రచనలు చదవలేదు ! కానీ మొన్న జనవరి 22 న గతించిన ఉర్సులా గురించి అనేక పత్రికల్లో విశేషంగా ప్రచురించిన వ్యాసాల్లో ఆమెను కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ రచయిత్రిగానే చూడడం సరికాదనే వాదన వినిపించింది..దానికి తోడు బ్రెయిన్ పికింగ్స్ లో రాసిన కొన్ని ఆర్టికల్స్ ఈవిడ రచనలు చదవాలనే ఆసక్తి కలిగించాయి..ఉర్సులా లెగైన్ బ్లాగ్ లో రాసిన వ్యాసాల్లో కొన్ని ఉత్తమమైనవాటిని సంగ్రహించి ఈ పుస్తకాన్ని ప్రచురించారట..

No Time to Spare:Thinking About What Matters అనే ఈ పుస్తకంలో సరమగో వ్యాసాల్లా రాజకీయ,సామాజిక అంశాలు కాక ఉర్సులా వ్యక్తిగత జీవితానికీ,అనుభవాలకూ సంబంధించిన విశేషాలు ఉంటాయి..మనకు బాగా తెలిసిన ఒక బామ్మగారింటికెళ్తే ఆవిడ తన జీవిత సారాన్నంతా ఓపిగ్గా మనకు పిచ్చాపాటీ కబుర్లలో రంగరించి చెప్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ పుస్తకం చదువుతుంటే అలా ఉంటుంది..అన్నట్లు ఈ బామ్మగారి హుషారు చూసి పొరపాటున "మీకు వయసైపోలేదు బామ్మగారూ,మీరు జస్ట్ ఇరవైల్లో ఉన్నారు" అన్నారా !! అంతే సంగతులు..బామ్మగారి ఆగ్రహానికి గురికాక తప్పదు..

వృద్ధాప్యం గురించి రాస్తూ, Old age isn’t a state of mind. It’s an existential situation. అంటారు ఉర్సులా..పాజిటివ్ థింకింగ్ మంచిదేగానీ వయసైపోయిందన్న నిజాన్ని ఒప్పుకోవడంలో ఒక హుందాతనముందంటారు..వృద్ధాప్యంలో కూడా ఇరవైల్లో ఉన్నామనుకుని మనసుని మభ్యపెట్టుకోవడం అబద్ధాన్ని జీవించడమే అంటారు..

Encouragement by denial, however well-meaning, backfires. Fear is seldom wise and never kind.

“old age is for anyone who gets there.”

'Spare time' గురించి మాట్లాడుతూ డబ్బు సంపాదనకు దోహదపడనంత మాత్రానా ఏ వ్యాపకమూ  విలువ లేనిది అయిపోదు అంటారు..అన్నట్లు క్యాపిటలిస్టు విధానాలంటే సరిపడని ఈ బామ్మగారు అర్ధం పర్ధం లేని ప్రశ్నల్ని అడిగారని హార్వర్డ్ యూనివర్సిటీకి ఇచ్చిన ఒక చక్కని సమాధానం ఏంటంటే,

The second is “Economic stability and growth for the U.S.”
That stymied me totally. What a marvelous example of capitalist thinking, or nonthinking: to consider growth and stability as the same thing!
I finally wrote in the margin, “You can’t have both,” and didn’t check a box.

అందమైన కథలు చెప్పే ఈ బామ్మగారికి కోపం కూడా జాస్తి..కానీ అదుపులో ఉన్నంతవరకు కోపం మంచిదే కాక అవసరం కూడా అంటారు..ముఖ్యంగా ఆవిడకు అస్సలు నచ్చని రచయితలను గూర్చిన ప్రశంసలు విన్నప్పుడు తనలో అసూయతో కూడిన అసహనం,కోపం పుట్టుకొస్తాయని చెప్పడం ఆమెలోని నిజాయితీకి ఒక చిన్న ఉదాహరణ..

Jealousy sticks its nasty yellow-green snout mostly into my life as a writer. I’m jealous of other writers who soar to success on wings of praise, I’m contemptuously angry at them, at the people who praise them—if I don’t like their writing. I’d like to kick Ernest Hemingway for faking and posturing when he had the talent to succeed without faking. I snarl at what I see as the unending overestimation of James Joyce. The enshrinement of Philip Roth infuriates me. But all this jealous anger happens only if I don’t like what they write. If I like a writer’s writing, praise of that writer makes me happy. I can read endless appreciations of Virginia Woolf. A good article about José Saramago makes my day. So evidently the cause of my anger isn’t so much jealousy or envy as, once again, fear. Fear that if Hemingway, Joyce, and Roth really are The Greatest, there’s no way I can ever be very good or very highly considered as a writer—because there’s no way I am ever going to write anything like what they write or please the readers and critics they please.

Anger’s connection with hatred is surely very complicated, and I don’t understand it at all, but again fear seems to be involved. If you aren’t afraid of someone or something threatening or unpleasant, you can as a rule despise it, ignore it, or even forget it. If you fear it, you have to hate it. I guess hatred uses anger as fuel. I don’t know. I don’t really like going to this place.

ఈ బామ్మగారికి పార్డ్ (Pard) అనే ఒక పెంపుడు పిల్లి కూడా ఉంది..ఆవిడకి అదంటే ఎంత ఇష్టమో,ఆవిడ సంభాషణల్లో దాని గురించిన కబుర్లు దొర్లని సందర్భాలు బహు అరుదు..
భాష/వ్యాకరణ దోషాలు ఈ బామ్మగారికి అస్సలు గిట్టవు..Would you please f...ing stop ? అనే వ్యాసం చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను..వాక్యాన్ని ఎలా పూర్తి చెయ్యాలో తెలియని ఆధునిక రచయితలు,సినిమా వాళ్ళు ఈ F..K,S..T  లాంటి పదాలను తరచూ వాడటం పట్ల తీవ్రమైన అసహనం వెళ్ళగక్కారు..సరిగ్గా చెప్పాలంటే బాగా గడ్డి పెట్టారు..

And finally we began to hear them from the lips of the stars of Hollywood. So now the only place to get away from them is movies before 1990 or books before 1970 or way, way out in the wilderness.But make sure there aren’t any hunters out in the wilderness about to come up to your bleeding body and say, Aw, shit, man, I thought you was a fucking moose.

ఇక ఈ పుస్తకంలో రచయిత్రి స్పృశించని అంశాలు లేవు..అమెరికా క్యాపిటలిస్ట్ విధానాలను తనదైన శైలిలో పలుచోట్ల తూర్పారబట్టారు..సైనికుల యూనిఫామ్ మొదలు,ఆహారపు అలవాట్లు,గ్లోబలైజేషన్,కాలుష్యం లాంటి సామాజిక అంశాలూ,పలు రచనల గురించి తన అభిప్రాయాలూ,రచయితల గురించిన విషయవిశేషాలూ ఆసక్తి కరంగా రాశారు..తనకు పాఠకుల దగ్గర్నుంచి,ముఖ్యంగా పిల్లల దగ్గర్నుంచి వచ్చే ఉత్తరాలు  ప్రియమంటూనే,కొన్ని విసిగించిన సందర్భాలు గురించి కూడా రాస్తారు..కథలు రాయాలనుకున్నవాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది..ఒక సుప్రసిద్ధ రచయిత్రిగా ఉర్సులా అనుభవాలు రచయితలకు మార్గదర్శకాలు..తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక సారి నెబ్యులా ప్రైజ్ ను తిరస్కరించడం గురించి రాస్తూ మార్కెటింగ్ పేరుతో సాహిత్యానికి బెస్ట్ సెల్లర్,నోబెల్ విన్నర్ లాంటి ట్యాగ్ లను తగిలించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు..ఫెమినిజం గురించి రాస్తూ వర్జీనియా ఉల్ఫ్ అభిమానిగా సాహిత్య రంగంలో స్తీల పట్ల ఉన్న వివక్షను దుయ్యబట్టారు..సాహిత్యం ఈ బహుమతులు,జాతి,లింగ వివక్షలన్నిటికీ అతీతమైనది అన్న ఆమె పట్ల అపారమయిన గౌరవం కలిగిన సందర్భం అది..

I began quite a while ago to resist declarations of literary greatness in the sense of singling out any one book as TGAN, or even making lists of the Great American Books. Partly because the supposed categories of excellence omitting all genre writing, and the awards and reading lists and canons routinely and unquestioningly favoring work by men in the eastern half of the United States, made no sense to me. But mostly because I didn’t and don’t think we have much idea of what’s enduringly excellent until it’s endured. Been around quite a long time. Five or six decades, to start with.

రచయిత్రిగా అక్షరాలతో తన అనుబంధాన్ని అంతే అందమైన అక్షరాల్లో పొందుపరిచారు..

And right along with that, inseparably, I like the dances of meaning words do with one another, the endless changes and complexities of their interrelationships in sentence or text, by which imaginary worlds are built and shared. Writing engages me in both these aspects of words, in an inexhaustible playing, which is my lifework.

Words are my matter—my stuff. Words are my skein of yarn, my lump of wet clay, my block of uncarved wood. Words are my magic, antiproverbial cake. I eat it, and I still have it.

ఆమెకిష్టమైన హోమర్ రచనల్ని The Iliad,The Odyssey లను ప్రస్తావిస్తూ ఇలియడ్ ను మహాభారతంతో పోలుస్తూ ఆమె ఆలోచనల్ని పంచుకున్నారు..

I don’t know any war story comparable to The Iliad except maybe the huge Indian epic the Mahabharata. Its five brother-heroes are certainly heroes, it’s their story—but it’s also the story of their enemies, also heroes, some of whom are really great guys—and it’s all so immense and complicated and full of rights and wrongs and implications and gods who interfere even more directly than the Greek gods do—and then, after all, is the end tragic or is it comic? The whole thing is like a giant cauldron of ever-replenished food you can dive your fork into and come out with whatever you need most to nourish you just then. But next time it may taste quite different. And the taste of the Mahabharata as a whole is very, very different from that of The Iliad, above all because The Iliad is (unjust divine intervention aside) appallingly realistic and bloodthirstily callous about what goes on in a war. The Mahabharata’s war is all dazzling fantasy, from the superhuman exploits to the super­duper weapons. It’s only in their spiritual suffering that the Indian heroes become suddenly, heartbreakingly, heart-changingly real.

రాయడం గురించి ఆవిడ వెలిబుచ్చిన కొన్ని అమూల్యమైన అభిప్రాయాలు,

Writing is a risky bidness. No guarantees. You have to take the chance. I’m happy to take it. I love taking it. So my stuff gets misread, misunderstood, misinterpreted—so what? If it’s the real stuff, it will survive almost any abuse other than being ignored, disappeared, not read.

It’s a job I do as a reviewer, and I enjoy it. But my job as a fiction writer is to write fiction, not to review it. Art isn’t explanation. Art is what an artist does, not what an artist explains. (Or so it seems to me, which is why I have a problem with the kind of modern museum art that involves reading what the artist says about a work in order to find out why one should look at it or “how to experience” it.)

A biography, for instance, can’t really have a plot, unless the subject obligingly provided one by living it. But the great biographers make you feel that the story of the life they’ve told has an aesthetic completeness equal to that of plotted fiction. Lesser biographers and memoirists often invent a plot to foist onto their factual story—they don’t trust it to work by itself, so they make it untrustworthy.

The Grapes of Wrath ను తన దృష్టిలో The Great American Novel గా అభివర్ణిస్తూ,ఆర్ట్ ను ఇలా నిర్వచించారు,

Art is not a horse race. Literature is not the Olympics. The hell with The Great American Novel. We have all the great novels we need right now—and right now some man or woman is writing a new one we won’t know we needed till we read it.

Where is the great American novel by anybody? And I’d answer that: Who cares?  I think this is pretty much what Mr. Hamid says more politely, when he says that art   is bigger than notions of black or white, male or female, American or non. Human beings don’t necessarily exist inside of (or correspond to) the neat racial, gendered or national boxes into which we often unthinkingly place them. It’s a mistake to ask literature to reinforce such structures. Literature tends to crack them. Literature is where we free ourselves.
Three cheers and Amen to that.

పిల్లల గురించి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు పెద్దలకు పాఠాల్లా అనిపించాయి..

No wonder kids always ask, “Are we there yet?” Because they are there. It’s just the harried parents who aren’t, who have to have all this huge distance between things and have to drive and drive and drive to get to there. That makes no sense to a kid. Maybe that’s why they can’t see scenery. Scenery is between where they are.

చివరగా మనిషి పురోభివృద్ధికి,సాక్ష్యాలు అడిగే సైన్స్ ఎంత ముఖ్యమో మతపరమైన,సంప్రదాయపరమైన విషయాల్లో నమ్మకం కలిగివుండటం కూడా అంతే అవసరం అని మూలాల్ని మర్చిపోకూడదని హితవు చెప్తారు.. పిల్లల్లో ఈ నమ్మకం ఏర్పరచడం మరింత అవసరం అంటారు..

Our kids had Santa Claus; we read the poem, and left milk and cookies out for him; and so do their kids. To me, that’s what’s important. That the bonding ritual be honored, the myth reenacted and carried forward in time.

ఈ సోషల్ మీడియా కాలంలో పర్సనల్ ఒపీనియన్ పాత్రను విశదీకరిస్తూ ఆమె అన్న ఈ మాటలు మనల్ని ఖచ్చితంగా ఆలోచనలో పడేస్తాయి,
When there’s no social pressure behind it, respectful behavior becomes a decision, an individual choice. Americans, even when they pay pious lip service to Judeo-Christian rules of moral behavior, tend to regard moral behavior as a personal decision, above rules, and often above laws. This is morally problematic when personal decision is confused with personal opinion. A decision worthy of the name is based on observation, factual information, intellectual and ethical judgment. Opinion—that darling of the press, the politician, and the poll—may be based on no information at all. At worst, unchecked by either judgment or moral tradition, personal opinion may reflect nothing but ignorance, jealousy, and fear.

పుస్తకం నుండి మరికొన్ని,

MY DEAR,

The creative adult is the child who survived. The creative adult is the child who survived after the world tried killing them, making them “grown up.” The creative adult is the child who survived the blandness of schooling, the unhelpful words of bad teachers, and the nay-saying ways of the world. The creative adult is in essence simply that, a child.

Falsely yours,
Ursula Le Guin.

ఫాంటసీ ప్రపంచం గురించి ఉర్సులా మాటల్లోనే,

Fantasy doesn’t say, “Nothing is”—that’s nihilism. And it doesn’t say, “It ought to be this way”—that’s utopianism, a different enterprise. Fantasy isn’t meliorative. The happy ending, however enjoyable to the reader, applies to the characters only; this is fiction, not prediction and not prescription.

Those who dismiss fantasy less fiercely, from a less absolutist stance, usually call it dreaming, or escapism. Dream and fantastic literature are related only on a very deep, usually inaccessible level of the mind. Dream is free of intellectual control; its narratives are irrational and unstable, and its aesthetic value is mostly accidental. Fantastic literature, like all the verbal arts, must satisfy the intellectual as well as the aesthetic faculty. Fantasy, odd as it sounds to say so, is a perfectly rational undertaking.

Saturday, February 3, 2018

A Happy Death - Albert Camus

What mattered was to humble himself, to organize his heart to match the rhythm of the days instead of submitting their rhythm to the curve of human hopes. Just as there is a moment when the artist must stop, when the sculpture must be left as it is, the painting untouched—just as a determination not to know serves the maker more than all the resources of clairvoyance—so there must be a minimum of ignorance in order to perfect a life in happiness. Those who lack such a thing must set about acquiring it: unintelligence must be earned.

కామూను ఇష్టపడడానికి ఇలాంటి ఆణిముత్యాల్లాంటి వాక్య నిర్మాణంకంటే వేరే కారణాలేవీ అవసరంలేదనుకుంటా  ! అసలు ఇలాంటివి చదివి చప్పట్లు కొట్టకుండా ఉండటం సాధ్యమేనా ! అమాంతం పెదవుల పైకి వచ్చిన చిరునవ్వును కాసేపు ఆగమని రెండు మూడు సార్లు ఈ వాక్యాలను తృప్తిగా చదువుకున్నాను..

Image courtesy Google
హ్యాపీ లైఫ్ గురించి తెలుసుగానీ ఈ హ్యాపీ డెత్ ఏంటబ్బా ? అసలు మరణంలో సంతోషం ఏంటి ! మరణమంటేనే విషాదం కదా ! అసలు మనిషన్నాకా అంతిమఘడియల్లో కూడా ఆనందంగా ఉండటం సాధ్యమేనా ! పూర్తి స్థాయి మెలకువతో రెప్పపాటు కాలంలో వదిలిపోయే తుదిశ్వాసని ఆహ్వానించడం అసలు అయ్యేపనేనా ! ఈ కోణంలో ఈ 'హ్యాపీ డెత్' అనే పుస్తకం సాగుతుంది..
అటు పుట్టుకకీ,ఇటు మరణానికీ మధ్యన ఏదో ఉంటుంది..దాన్ని నిర్వచించడానికి సులువుగా 'జీవితం' అనే మూడక్షరాల చిన్న పదం వాడేస్తాం..కానీ జీవితమంటే అనే ప్రశ్న వచ్చినప్పుడు,దాని అర్ధం-పరమార్ధం వెతికేవారికి తన వెతుకులాటలో తనకు  తెలిసిన సమాధానాలను ఇందులో పొందుపరిచారు కామూ..కామూ ఇరవైల తొలినాళ్ళలో రాసిన ప్రతుల్ని  ఆయన మరణానంతరం,అంటే సుమారు పదేళ్ళ తరువాత ప్రచురించారు..ఈ రచన మరణం గురించిన స్పృహ కలిగిన కొత్తల్లో కామూ ఆలోచనలకు అద్దం పడుతుంది,Belcourt లోని వర్కింగ్ మెన్ డిస్ట్రిక్ట్ లో కామూ బాల్యం,సెంట్రల్ యూరోప్ యాత్రలు,Fichu హౌస్ జ్ఞాపకాలను వెలికితీస్తుంది..

ఈ నవలని Natural Death,Conscious Death అని రెండు భాగాలుగా విడదీశారు..మొదటి భాగం 'నేచురల్ డెత్' లో Belcourt లోని Algiers Municipal Depot లో ఒక సాధారణ ఉద్యోగి పాట్రిస్ మెర్సల్ట్ తన ప్రియురాలు మార్తే(Marthe) మాజీ ప్రియుడు,ప్రస్తుతం రెండు కాళ్ళు పోగొట్టుకున్న జాగ్రెస్ (Roland Zagreus) ను హత్య చేసి అతని డబ్బు తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోవడంతో మొదలవుతుంది..రెండో భాగం “Conscious Death” భూత-వర్తమాన కాలాల మధ్య ఏకకాలంలో నడుస్తుంది..తల్లి మరణానంతరం ఒంటరిగా తన గదిలో మెర్సల్ట్ పేదరికం,మెర్సల్ట్ ఇంట్లో అద్దెకుంటున్న మరో ఒంటరి Cardona కథ,మార్తే తో మెర్సల్ట్ సంబంధం,Zagreus తో సుదీర్ఘమైన సంభాషణలు ఉంటాయి..దేశం వదిలిన మెర్సల్ట్  ప్రేగ్ లో కొంతకాలం గడిపి 'ఆనందం' ఎండమావి కావడంతో తన దేశానికి (అల్జీరియా ను సూర్యుడున్న చోటుగా అభివర్ణిస్తారు) తిరుగు ప్రయాణమవుతాడు..

He was back, convinced that travel now meant an alien way of life to him: wandering seemed no more than the happiness of an anxious man.

అటు తరువాత ఆనందాన్ని చేరుకునే క్రమంలో రెండు విధాలుగా జీవిస్తాడు..మొదట 'House above the World' లో ముగ్గురు పిల్లలు Catherine, Rose, and Claire లతో గడిపి ఆ పైన Chenoua లో ఒక సముద్రతీరపు ఇంట్లో ఏకాంతంగా (ascetic solitude) జీవిస్తాడు..అదే సమయంలో తీవ్ర అనారోగ్యం పాలై స్నేహితుడు/డాక్టర్ బెర్నార్డ్,భార్య Lucienne,మిత్రుల రాకపోకలతో తన గమ్యమైన ఆనందాన్ని అంతిమ ఘడియల్లో చేరుకుంటాడు..డబ్బుతో సంతోషం ముడిపడి ఉంటుందనే ఆలోచనని తొలి భాగంలో కలుగజేస్తే,జీవితం పట్ల మన దృక్పధాన్ని మించింది లేదని రెండో భాగంలో తీర్మానిస్తారు..

“You make the mistake of thinking you have to choose, that you have to do what you want, that there are conditions for happiness. What matters—all that matters, really— is the will to happiness, a kind of enormous, ever-present consciousness. The rest—women, art, success—is nothing but excuses. A canvas waiting for our embroideries."

ఈ కథలో సంక్లిష్టమైన కామూ మార్కు అబ్సర్డిటీ పాళ్ళ సంగతి అటుంచితే మంచి మంచి సంభాషణలుంటాయి..ముఖ్యంగా జాగ్రెస్-మెర్సల్ట్ మధ్య జరిగే సంభాషణలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి..తానేమీ మాట్లాడకుండానే ఎదుటివాళ్ళనుంచి సమాధానాలు రాబట్టే మెర్సల్ట్ వ్యక్తిత్వం కూడా ఆసక్తికరంగా ఉంటుంది..కానీ కామూ మిగతా పుస్తకాలతో పోలిస్తే ఇందులో మెర్సల్ట్ కు కాస్త వాక్స్వాతంత్య్రం దొరికిందనే చెప్పచ్చు..ముఖ్యంగా స్ట్రేంజర్,ఫాల్ లతో పోలిస్తే ఇందులో ప్రొటొగోనిస్ట్ పాట్రిస్ మెర్సల్ట్ పాత్ర నిర్మాణం మరింత సజీవంగా ఉండి,యువకుడైన కామూను అర్ధం చేసుకోడానికి దోహదపడుతుంది..అల్జీరియా సముద్రపు అలల వర్ణనల్లో,ఏప్రిల్ మాసపు నునువెచ్చని సూర్యకాంతుల్లో,ఫ్యాక్టరీ సైరన్ల మోతలో,ఇలా రచయితకు తన పరిసరాలతో ఉన్న అనుబంధం, అల్జీరియా పట్ల ఆయనకున్న ప్రేమ అడుగడుగునా వ్యక్తమవుతూనే ఉంటుంది..కామూ రచయితగా తొలిదశలో రాండమ్ గా రాసిన ప్రతులు కావడంతో వాటికి పుస్తక రూపం ఇవ్వడంలో  రచయిత లేని లోటు స్పష్టంగా కనపడుతుంది .. కాస్త దీనికి Jean Sarocchi రాసిన ఆఫ్టర్ వర్డ్  కొంతవరకూ రచనలోని సంక్లిష్టతను అర్ధం చేసుకోడానికి ఉపయోగపడింది..

At the summer’s end, the carobs drench all Algeria with the smell of love, and in the evening or after the rain, it is as if the entire earth were resting, after giving itself to the sun, its womb drenched with a sperm smelling of bitter almonds.

మెర్సల్ట్ కు స్త్రీలతో ఉన్న సంబంధాలు,అదే సమయంలో ఆ సంబంధాల పట్ల అతని నిర్లిప్త వైఖరి కామూ ఆలోచనల్లో స్తీని ఆవిష్కరిస్తుంది..

"There’s the risk of being loved, little Catherine, and that would keep me from being happy.”

"People don’t love each other at our age, Marthe-they please each other, that’s all. Later on, when you’re old and impotent, you can love someone. At our age, you just think you do. That’s all it is.”

He decided that she was probably not very intelligent, and that pleased him. There is something divine in mindless beauty.

జీవన్మరణాల మధ్య కాలాన్ని సంతోషంగా గడపడమే మనిషి ఏకైక లక్ష్యమనే కామూ వాదనలో ఆశావహదృక్పధం కనిపిస్తుంది..అదే సమయంలో ఆ సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి ధనవంతుడై ఉండాలన్న జాగ్రెస్ వాదనను విని మెర్సల్ట్ అతన్నే హత్య చేసి ఏ శిక్షా లేకుండా తప్పించుకోవడంలో అబ్సర్డిటీ కనిపిస్తుంది..అసలు జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేనివారికే అది విషాదం అంటారు కామూ..

Staggering slightly, he stopped and took a deep breath. Millions of tiny white smiles thronged down from the blue sky. They played over the leaves still cupping the rain, over the damp earth of the paths, soared to the blood-red tile roofs, then back into the lakes of air and light from which they had just overflowed. A tiny plane hummed its way across the sky. In this flowering of air, this fertility of the heavens, it seemed as if a man’s one duty was to live and be happy.

We don’t have time to be ourselves. We only have time to be happy.

Zagreus was staring at the window now. A car drove slowly past, making a faint chewing sound. Motionless, Zagreus seemed to be contemplating all the inhuman beauty of this April morning.

Consciousness తొలిదశలో మెర్సల్ట్ ఆలోచనలు..నేను వాహ్ అనుకోకుండా ఉండలేని మరో అద్భుతమైన వర్ణన..
Mersault wrote his name with one finger on the steamed-over percolator. He blinked his eyes. Every day his life alternated between this calm consumptive and Emmanuel bursting into song, between the smell of coffee and the smell of tar, alienated from himself and his interests, from his heart, his truth. Things that in other circumstances would have excited him left him unmoved now, for they were simply part of his life, until the moment he was back in his room using all his strength and care to smother the flame of life that burned within him.

మరణాన్ని గురించి మెర్సల్ట్ అనుభవాలు..
But now the poverty in solitude was misery. And when Mersault thought sadly of the dead woman, his pity was actually for himself.

And holding out the photograph, he stammered: “I loved her, I loved her,” and Mersault translated: “She loved me.” “She’s dead,” and Mersault understood: “I’m alone.

And for ten years, the sick woman endured that life. The suffering had lasted so long that those around her grew accustomed to her disease and forgot that she was deathly ill, that she would die. One day she died.

మనిషి ఆనందంగా జీవించడంలో డబ్బు చాలా కీలకమైన అంశమని చెప్తూ మెర్సల్ట్ తో జాగ్రెస్ అనే మాటలు ఆలోచింపజేస్తాయి..సమయాన్ని డబ్బుతో ముడిపెడుతూ జాగ్రెస్ సంభాషణలు..

Time is money, equally true, in the reverse: Money is time—“For a man who is ‘well born,’ to be happy is to partake of the common lot not with the will to renunciation, but with the will to happiness. In order to be happy, time is necessary—a great deal of time. Happiness too is a long patience. And time is the need for money which robs us of it. Time can be bought. Everything can be bought. To be rich is to have time to be happy when one is worthy of being so.”

“What I’m sure of,” he began, “is that you can’t be happy without money. That’s all. I don’t like superficiality and I don’t like romanticisim. I like to be conscious. And what I’ve noticed is that there’s a kind of spiritual snobbism in certain ‘superior beings’ who think that money isn’t necessary for happiness. Which is stupid, which is false, and to a certain degree cowardly.

“You see, Mersault, all the misery and cruelty of our civilization can be measured by this one stupid axiom: happy nations have no history.

Don’t think I’m saying that money makes happiness. I only mean that for a certain class of beings happiness is possible, provided they have time, and that having money is a way of being free of money.

పుస్తకం నుండి మరికొన్ని...

Mersault realized that his rebellion was the only authentic thing in him, and that everything else was misery and submission.

The god worshipped here was the god man fears and honors, not the god who laughs with man before the warm frolic of sea and sun.

Eliane, whom Mersault calls the Idealist. “Why?” Eliane asks. “Because when you hear something true that upsets you, you say, ‘That’s true, but it’s not good.’ ”

He discovered the cruel paradox by which we always deceive ourselves twice about the people we love—first to their advantage, then to their dis-advantage.

The apartment was over a horse butcher’s. Leaning over his balcony, he could smell blood as he read the sign: “To Man’s Noblest Conquest.”

He did not want to die like a sick man. He did not want his sickness to be what it is so often, an attenuation, a transition to death. What he really wanted was the encounter between his life—a life filled with blood and health—and death.