Saturday, September 19, 2020

A Cat - Leonard Michaels

నాకు పెట్స్ అంటే మహా ఎలర్జీ..కానీ కొన్ని మినహాయింపులున్నాయి,కుక్కపిల్లలంటే ఎంత ముద్దో,కుక్కలంటే అంత అసహ్యం,ఎస్ కాస్త కాంప్లికేటెడ్ వ్యవహారం అన్నమాట..అవి నాలుక చాపి ప్రేమగా మొహమంతా నాకడం,మట్టి కళ్ళతో మనమీద ఎక్కడం,వాటి జూలు క్లౌడ్స్ లా ఇల్లంతా వ్యాపించడం ఇదంతా మహా చిరాగ్గా ఉంటుంది..అలా అని నాకు కుక్కలతో అనుబంధం లేకపోవడం ఏమీ లేదు,ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే నా జీవితంలో కూడా ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది,దాని పేరు బన్సీ..పదేళ్ళ వయసులో రోడ్డు మీద అటు ఇటు పరుగులు పెడుతూ పిల్లలతో ఆడుకుంటుంటే మా మామయ్య సైకిల్ మీద వస్తూ దారిలో ఆగారు..సైకిల్ హ్యాండిల్ కి చిన్న కూరగాయల బుట్ట తగిలించి ఉంది.."ఓయ్ పిల్లలూ,ఇటు చూడండి" అన్నారు,చూద్దుము కదా,బుట్టలో చిన్న దొంతర వేసిన బట్టల మధ్య ఒక తెల్లని బుజ్జి కుక్కపిల్ల..దాన్ని చూడగానే అందరం దానితో ప్రేమలో పడిపోయాం,మా అందరికీ ఇక దానితోడిదే లోకం అయిపోయింది..అది బుల్లి బుల్లి కాళ్ళతో గడప దాటడానికి అవస్థ పడుతుంటే చూసి పగలబడి నవ్వేవాళ్ళం..దానికి పాలు నేను పడతానంటే నేను పడతానని పోటీలుపడి పోట్లాడుకునేవాళ్ళం,అది వయసైపోయి మమ్మల్ని వదిలివెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మరో కుక్కపిల్లని పెంచడానికి ధైర్యం చాలలేదు..అధికశాతం మంది పిల్లులకంటే కుక్కల్ని ఇష్టపడతారు..పిల్లుల్ని చూస్తే వాటి సైజుని మించిన గర్వంతో పొగరుబోతుల్లా 'నీ లెక్క నాకేంటోయ్' అన్నట్లు కనిపిస్తాయేమో.

Image Courtesy Google
సాధారణంగా పిల్లుల్ని ఇష్టపడేవారు కూడా ప్రత్యేకమైన వ్యక్తులై ఉంటారు..రెసిప్రొకసీ లేకుండా(?) ప్రేమను పంచడం అంత సులభం కాదు మరి..ముఖ్యంగా ఇంట్రావర్టులకీ,మిస్ఫిట్ లకీ,పిల్లులకీ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది..కుక్కపిల్లలు యజమానిని నిజాయితీగా ప్రేమిస్తాయి,యజమాని కష్టసుఖాల్లో మేమున్నామంటూ తమ ప్రేమని చిన్న చిన్న సంజ్ఞలతో వ్యక్తం చేస్తాయి,ఇంటిని కాపలా కాస్తాయి,వాటిని ట్రైన్ చెయ్యడం వీలుపడుతుంది..కానీ పిల్లుల సంగతి వేరు..అవి సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాయి,ట్రైనింగ్ వాటికి సరిపడదు,వినయవిధేయతలు,తలొగ్గి ఉండడం లాంటివి వాటికి చేతకాదు..రాక్ స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ లాగే అమెరికన్ రచయిత లియోనార్డ్ మైఖేల్స్ కు కూడా పిల్లులంటే ప్రాణం..పిల్లుల గురించి శాస్త్రీయంగా కనుగొన్న వివరాలు కాకుండా వాటి సహచర్యంలో తన అనుభవాల ద్వారా ఈ పుస్తకాన్ని రాశారు మైఖేల్స్..ఇందులో ఈ మిస్టీరియస్ జీవిని గురించి చాలా ఆసక్తికరమైన విషయవిశేషాలున్నాయి..పిల్లుల పలు భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ చక్కని చిత్రాలతో కూడిన ప్రోజ్ పీసెస్ పుస్తకాన్ని క్రిందపెట్టకుండా వన్ సిట్టింగ్ లో చదివిస్తాయి..కాగా పలు నవలలతో పాటుగా సొంటాగ్ మెమోయిర్ కూడా రాసిన సిగ్రిడ్ నూనెజ్ దీనికి ముందుమాట రాశారు.

A cat is content to be a cat. A cat is not owned by anybody. అనే వాక్యంతో పిల్లుల సర్వస్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ఈ పుస్తకం మొదలవుతుంది.పిల్లి కళ్ళుమూసుకుని పాలు త్రాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట. 

A cat doesn’t look at itself when you hold it up to a mirror. It acts as if nothing appeared in the glass. That’s because a cat believes it is invisible. A cat has to believe this,because, when stalking, it has to be invisible in the eyes of its prey. To be a cat you must be invisible and very real at the same time. Worshippers believe this of God.

“The soul of another is a dark forest”sounds like what a cat might say,but it comes from a story by Chekhov.

ఈ క్రింద వాక్యంలో పిల్లి స్వభావం ఇంట్రావర్ట్ లక్షణాల్ని తలపిస్తుంది..ఇంట్రావర్టులు మొదట్లో వెనకడుగువేసినా,సాన్నిహిత్యాన్ని ఇష్టపడకపోయినా,ఎవరైనా మచ్చిక చేసుకుని స్నేహం చేస్తే వారి కంపెనీని ఇష్టపడతారు.

"Touch it wrong, or at the wrong moment,and a cat slips out of reach. It doesn’t want to be touched. But catch it anyway and a cat goes limp in your arms.It wants to be touched."

ఏకాంతాన్ని ఇష్టపడేవాళ్ళకి కుక్కల కంటే పిల్లులు మంచి సాహచర్యాన్ని అందిస్తాయి అంటారు మైఖేల్స్..కుక్కపిల్లలు చేసే హడావుడి,అటెన్షన్ సీకింగ్ పిల్లి పిల్లుల విషయంలో ఉండదు..అవి యజమాని మౌనాన్ని అన్నివిధాలా గౌరవిస్తాయి.

"When it comes to loneliness, a cat is excellent company. It is a lonely animal. It understands what you feel. A dog also understands, but it makes such a big deal of being there for you, bumping against you, flopping about your feet, licking your face. It keeps saying, “Here I am.” Your loneliness then seems lugubrious. A cat will just be, suffering with you in philosophical silence."

"With a dog in the house, you imagine yourself protected against intruders and you sleep better. With a cat in the bed,you don’t think about intruders. You feel innocent,and it seems no harm will come. A cat can’t protect you against intruders, only against dreams,the terrors within."

"When a cat decides—entirely on its own—to come to you,it is moved entirely from within. A cat does not feel compelled to do anything by convention or custom or guilt, so its decision is freely made, natural, and profound. It offers you truly personal recognition, a pleasure otherwise received only from a lover,though never so pure and trustworthy."

జీవితంలో నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి..మనిషన్నాకా ఏదైనా సాధించాలి అనుకునేవారు కొందరైతే,జీవించి ఉండడమే ఒక వరమని భావించేవాళ్ళు మరికొందరు..వీళ్ళకి ఎటువంటి ఆదుర్దా,హడావుడి లేకుండా చుట్టూ ప్రపంచాన్ని పరికిస్తూ ప్రశాంతంగా జీవించడమే గొప్ప విషయం. 

"It isn’t that a cat has nothing to say, but it wouldn’t want to write a poem or a book or anything. In contrast Virginia Woolf felt the day had been wasted if she didn’t write in her diary. For a cat, just to live is splendid."

"A cat may love you, but unlike people it can’t say, “I love you like a million dollars,”or “I love you so much I want to eat you up,” or “I’d die for you.” With its little soul,a cat loves you as much as it can without insisting, without risk to you of disappointment, humiliation, or grief."

"A cat demands respect for the distance between itself and other creatures, but anytime it likes it smears its face against you, leaps into your lap or into your bed, and sleeps with you. It shows no respect for distance. This is paradoxical and self-contradictory, but a cat isn’t worried about logic. From a certain point of view, such godlike arrogance demonstrates enlightenment, the achievement of nirvana."

మనుషులు పరుల సమక్షంలో ఉన్న సమయంలో ముఖాలకు అందమైన ముసుగులు ధరిస్తారు..ఎక్కడ ఉన్నా తమలా తాము ఉండగలగడం నేటి ఆధునికతరంలో చాలామంది విషయంలో ఒక లగ్జరీ..వేసే ప్రతి అడుగులోనూ సమాజం యొక్క ఆమోదం,అంగీకారం నేటి నాగరికునికి అత్యావశ్యకమైన అంశం..కానీ పిల్లులకు అటువంటి అవసరంలేదు.   

"Watch a cat closely for a long time and you will begin to wonder if it isn’t conscious of being watched, playing a role, pretending to be a cat."

ఇది కేవలం పిల్లుల గురించిన పుస్తకం మాత్రమే అనుకుంటే పొరపాటే..హెలెన్ మాక్ డోనాల్డ్ రచన 'H is for Hawk',పాట్రిక్ స్వెన్సన్ రచన 'The Book of Eels' ల తరహాలో ఇవి మానవనైజాన్ని పశునైజంతో  పోలుస్తూ లియోనార్డ్ రాసిన ఫిలసాఫికల్ మ్యూజింగ్స్..హ్యాపీ రీడింగ్.

Thursday, September 17, 2020

The Days of Abandonment - Elena Ferrante

Basically,I am convinced that not only are there no “major” or “minor” writers, but writers themselves do not exist — or at least they do not count for much. అంటారు నోబుల్ గ్రహీత ఇటాలో కాల్వినో..అదే విధంగా ఒక రచన అక్షర రూపం దాల్చాక ఆ రచనకూ,రచయితకూ మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది అంటారు రోలాండ్ బార్త్..ఈ ప్రతిపాదనలను తన రచనావ్యాసంగానికి తు.చ తప్పకుండా అన్వయించుకున్నారు ఇటలీకి చెందిన నియోపోలిటన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే..సమకాలీన రచయిత్రులలో ప్రముఖురాలైనప్పటికీ ఆమె ఈనాటికీ తన ఐడెంటిటీ ని గోప్యంగానే ఉంచారు..ఇక్కడ తొలిసారిగా ఒక రచయిత్రి ఫోటో బదులు ఆమె అనేక రచనల్ని అనువదించిన ఆన్ గోల్డ్స్టయిన్ ఫోటో జత చేయాల్సి వచ్చింది.

Image Courtesy Google

కళనూ,కళాకారుణ్ణీ ఎంత వేరు చేసి చూసే ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో కళ మీద కళాకారుడి ఛరిష్మా కనబరిచే ఆధిపత్యం విస్మరించలేనిది..అలాగే కొన్నిసార్లు  రచనల కంటే వాటి వెనుక ఉన్న మిస్టీరియస్ రచయితలు మరింత ఆసక్తికరంగా అనిపించడం సర్వసాధారణం..ఏదైనా ఒక పుస్తకంలో ప్రథమ పురుషలో ఉన్న నేరేషన్ చదువుతున్నామనుకోండి,ఎక్కడో ఒక సందర్భంలో ప్రొటొగోనిస్ట్ అభిప్రాయాలు మనల్ని విస్మయపరిచినప్పుడు మనం మధ్యలో కథ చదవడం ఆపేసి ఆ రచయిత పూర్వాపరాలు ఏమిటా అని గూగుల్ లో సెర్చ్ చేస్తాం..ఆ అనుభవాల వెనకున్న ముఖాన్ని నిశితంగా పరిశీలిస్తాం,వెలిబుచ్చిన అభిప్రాయాలకు మూలం ఏమిటా అని అతడి వ్యక్తిగత జీవితంపై దృష్టిసారిస్తాం..చివరగా మన ఊహాత్మకతకు రచయిత రూపంలో ఒక స్పష్టమైన ఆకారాన్ని తయారుచేసుకుంటాం..ఇది చాలామంది పాఠకులకు అనుభవంలో ఉన్న విషయమే..కానీ ఈ కథను చదివినప్పుడు మన ఊహలకు అటువంటి స్పష్టత దొరకదు,ఎందుకంటే కథలో ప్రొటొగోనిస్ట్ ముఖాన్ని రచయిత్రిలో వెతికే అవకాశం మనకు లేదు..చాలా ఏళ్ళ క్రితం ఎలిజబెత్ గిల్బర్ట్ రచన 'ఈట్,ప్రే,లవ్' చదివినప్పుడు,ఏమిటో ఈ కడుపునిండిన కష్టాలు అనిపించింది..ఆ తరువాత కమలా దాస్ 'మై స్టోరీ' చదివినప్పుడు ఆమె అర్థంపర్థంలేని ఆలోచనా ధోరణికి ఆమెపై తీవ్రమైన విముఖత కలిగింది (బహుశా ఇరవైలలో చదవడం వల్ల కావచ్చు,ఇప్పుడు చదివితే ఎలా ఉంటుందో చెప్పడం కష్టం) ఎలెనా ఫెరాంటే ఐడెంటిటీ తెలియదు గనుక ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలకు ఆమె వ్యక్తిగత జీవితానికీ ముడిపెట్టి ఆమెను విమర్శించే అవకాశం పాఠకులకు లేదు..ఇది నిస్సందేహంగా ఈ రచనకు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చింది అనిపించింది.

ఇక కథ విషయానికొస్తే 15 ఏళ్ళ కాపురం తరువాత పరస్త్రీ వ్యామోహంలోపడి ప్రొటొగోనిస్ట్ వోల్గా (38) ను ఆమె భర్త మారియో (40) హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోతాడు..ఇద్దరు పిల్లలు జన్నీ,ఇలారియాల బాధ్యతతో పాటు జీవితంలో హఠాత్తుగా ఏర్పడిన ఊహించని ఖాళీని ఎలా పూరించుకోవాలో తెలీక తీవ్రమైన వత్తిడికి లోనవుతుంది ఓల్గా..అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో ఒక స్త్రీ పడే సంఘర్షణను మనసుకు హత్తుకునే గద్య కవిత్వంగా మలిచారు ఫెరాంటే..ఈ కథలో చాలా వ్యక్తిగతమైన వివరాలతో భార్యా భర్తల మధ్య ఏర్పడే ఖాళీతనాన్ని,దాంపత్య సంబంధాల్లో మొనాటనీని విశ్లేషిస్తారు ఫెరాంటే..ఇందులో కథ చాలా సాధారణమైన అంశమే గానీ కథనం మాత్రం ప్రత్యేకమైనది.

ఒక స్త్రీనీ,పురుషుడినీ కేవలం వివాహమనే సామజిక కట్టుబాటు మాత్రమే కలిపి ఉంచుతుందంటే ఎందుకో నమ్మబుద్ధి కాదు..దాన్ని నిలబెట్టుకోవడంలో వ్యక్తిగత నిబధ్ధత అన్నివేళలా కీలకపాత్ర పోషిస్తుంది..అనేక సర్దుబాట్లు,రాజీలు,త్యాగాలు,ఆమోదాలు వీటన్నిటి మధ్యా ఒకరిలో ఉన్న లోపాలను మరొకరు అంగీకరిస్తూ ముందుకు సాగడమే చక్కని దాంపత్యానికి సూత్రం అంటూ ఉంటారు..కానీ మనసు కోతిలాంటిది,మారియోకు యవ్వనంలో ఉన్న కార్లా (19) పై వ్యామోహం కలుగుతుంది..తనలో అనిశ్చితినీ,అస్థిరమైన మనస్తత్వాన్నీ సమర్ధించుకోలేక ఆమెకు నిజం చెప్పకుండా,తన చేదు బాల్యాన్ని అడ్డుపెట్టుకుని ఓల్గాతో విడిపోతాడు..'An absence of sense, he explained, with unusual emphasis, repeating the expression he had used years before..కానీ తన భావాలను తాను తెలుసుకోలేని అస్పష్టతను మొదట్నుంచీ మారియో సహజ స్వభావంగా భావించి ఎప్పటిలాగే అతడు తిరిగి వస్తాడేమో అని ఎదురుచూస్తుంది ఓల్గా.. Mario was like that, I said to myself: tranquil for years, without a single moment of confusion, and then suddenly thrown off by a nothing.

తొలినాళ్ళలో చాలా ఓర్పుగా అతడికోసం ఎదురు చూసిన ఓల్గాలో క్రమేపీ సహనం నశిస్తుంది..కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా మాయమైపోయి మళ్ళీ 34 రోజుల తరువాత చాలా మాములుగా ఏమీ జరగనట్లు పిల్లల్ని చూడడానికి వచ్చిన మారియోని చూసి ఆశ్చర్యపోతుంది ఓల్గా..ఒకప్రక్క తాను అతడి ధ్యాసలో డిప్రెషన్ కు గురై క్రుంగి కృశించిపోతే అతడు మాత్రం చాలా ప్రశాంతంగా ఏమీ జరగనట్లు ఆనందంగా కనపడడం ఆమెకు మనసు మెలితిప్పిన భావన కలుగుతుంది..దానికి కారణం అతడి జీవితంలో నాలుగేళ్ళ క్రితం పరిచయమైన మరో స్త్రీ కార్లా అని తెలుసుకుంటుంది.
While I bore—as soon as his startled gaze touched me I was certain of it—all the signs of suffering, he could not hide those of well-being, perhaps of happiness.
Women without love lose the light in their eyes, women without love die while they are still alive.
నిజానికి భార్యాభర్తల మధ్య ఉండేది కేవలం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అయితే,అది కేవలం మానసికమైనదే కాబట్టి కొంతకాలం బాధపడినా ప్రాక్టికల్ గా చూస్తే బంధాన్ని తెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..కానీ జీవిత భాగస్వాములు ఆర్ధికంగా,శారీరకంగా,మానసికంగా,సామాజికంగా ఇలా అనేక విధాలుగా  ఒకరిపై ఒకరు ఆధారపడతారు..అందులోనూ ఆర్థికస్వాతంత్య్రం లేని స్త్రీ అయితే మరింత భర్తపై ఆధారపడుతుంది..15 ఏళ్ళ సంసారంలో భర్తకూ,పిల్లలకూ సపర్యలు చేసే క్రమంలో ఓల్గా తనను తాను పూర్తిగా కోల్పోతుంది..తన ఇష్టాయిష్టాలు,అభిరుచులు అన్నీ మర్చిపోయి మారియో కెరీర్ ను స్థిరపరిచే క్రమంలో ఓల్గా కుటుంబం,పిల్లల బాధ్యతను నెత్తిన వేసుకుని తన కెరీర్ ను సైతం పణంగా పెడుతుంది..కానీ రేవు దాటాక తెప్ప తగలేసిన తీరులో మారియో జీవితంలో స్థిరపడగానే కుటుంబాన్ని విస్మరించి స్వార్ధంగా తనదారి తాను చూసుకుంటాడు..ఓల్గా సంఘర్షణలో మరో కోణం కూడా ఉంది..భార్యాభర్తలమధ్య అవగాహనా రాహిత్యం వల్ల మనస్పర్థలు తలెత్తి విడిపోవడం సర్వసాధారణంగా జరిగేదే..కానీ భర్త పరాయి స్త్రీపై వ్యామోహంతో భార్యను వదిలివెయ్యడంలో ఒకరకమైన క్రూరత్వం ఉంది..ఈ రెండో కోణంలో బాధితురాలైన (poverella-ఇటాలియన్) స్త్రీ ఘోరమైన అవమానానికీ,తిరస్కారానికీ గురవుతుంది..ఈ కారణంగా ఓల్గాలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది,తనలో లేనిదేమిటో కార్లా లో ఉన్నదేమిటో అర్థంకాక,ఆమె తాను అందంగా లేననే అభద్రతా భావంతో మానసికంగా,శారీరకంగా కృంగిపోతుంది..కానీ మారియో విషయంలో ఇవేమీ జరగవు..అతడికి తన పురుషాధిక్యతను మరోసారి నిరూపించుకోడానికి కార్లా రూపంలో మరో అవకాశం దొరికింది అంతే..ఓల్గాకు మారియో పై ప్రేమ మొదట ద్వేషంగా,అటుపై ఏ భావమూ లేనితనంగా రూపాంతరం చెందే క్రమాన్ని రచయిత్రి ఎక్కడా పట్టుసడలకుండా రాసుకొచ్చారు..మారియో కి ఇష్టమైన కుక్కపిల్ల ఒట్టో మరణంతో ఓల్గా కు మారియో పై ప్రేమ కూడా పూర్తిగా చచ్చిపోతుంది..దానితో పాటు ఆమె అనుభవించిన దుక్ఖం నుండి కూడా విడుదల లభిస్తుంది..మరి మారియో మళ్ళీ వచ్చాడా ? ఓల్గా అతణ్ణి క్షమించగలిగిందా ? తెలుసుకోవాలంటే పుస్తకం చదవండి.
When my eyes dried and the last sobs died in my breast, I realized that Mario had become again the good man he had perhaps always been, I no longer loved him.

జీవితంలో ఎంతో జాగ్రత్తగా చేసుకునే ఏ ఛాయిస్ అయినప్పటికీ అందులో మంచి-చెడూ రెండూ ఉంటాయి..ఎవర్నైనా గుడ్డిగా ప్రేమించడం తప్పనీ,ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదనీ,దాని వల్ల బాధపడకుండా బయటపడగలమనీ నేటి మేనేజ్మెంట్ గురువులు ఘోషిస్తున్నారు..నిజమే బాధపడకుండా బయటపడగలమేమో ,అలాగే ఎక్కడ హర్ట్ అవుతామో అని నిరంతరం భయపడుతూ జీవితాన్ని సంపూర్ణంగా జీవించకుండా మిగిలిపోనూగలం..భవిష్యత్తుని స్పష్టంగా ఊహించడం కష్టం..కానీ ఆ అనిశ్చితిలోనే అంతర్లీనమైన జీవన మాధుర్యం ఉంటుంది..ఎదురయ్యే ఎత్తుపల్లాలను ఎదుర్కునే ధైర్యాన్నికూడా ఇలాంటి సంఘర్షణలనుండే నేర్చుకుని మనిషి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారతాడు..పడిపోవడం తప్పు కాదు..పడిన చోటే ఉండిపోయి లేవకపోవడమే తప్పు అన్నారెవరో.

పుస్తకంనుండి మరికొన్ని వాక్యాలు, 
So I had learned to speak little and in a thoughtful manner, never to hurry, not to run even for a bus, but rather to draw out as long as possible the time for reaction, filling it with puzzled looks, uncertain smiles.
I saw the cover again in every detail. My French teacher had assigned it when I had told her too impetuously, with ingenuous passion, that I wanted to be a writer. It was 1978, more than twenty years earlier. “Read this,” she had said to me, and diligently I had read it. But when I gave her back the volume, I made an arrogant statement: these women are stupid. Cultured women, in comfortable circumstances, they broke like knickknacks in the hands of their straying men. They seemed to me sentimental fools: I wanted to be different, I wanted to write stories about women with resources, women of invincible words, not a manual for the abandoned wife with her lost love at the top of her thoughts. I was young, I had pretensions.
I didn’t like the impenetrable page, like a lowered blind. I liked light, air between the slats. I wanted to write stories full of breezes, of filtered rays where dust motes danced. And then I loved the writers who made you look through every line, to gaze downward and feel the vertigo of the depths, the blackness of inferno. I said it breathlessly, all in one gulp, which was something I never did, and my teacher smiled ironically, a little bitterly. She, too, must have lost someone, something.
All the fault of spies, I thought, false friends, people who always side with those who enjoy themselves, happy and free, never with the unhappy. I knew it very well. They preferred new, lighthearted couples, who are out and about long into the night, the satisfied faces of those who do nothing but fuck.
I had disappeared into his minutes, into his hours, so that he could concentrate. I had taken care of the house, I had taken care of the meals, I had taken care of the children, I had taken care of all the boring details of everyday life, while he stubbornly climbed the ladder up from our unprivileged beginnings. And now, now he had left me, carrying off, abruptly, all that time, all that energy, all that effort I had given him, to enjoy its fruits with someone else, a stranger who had not lifted a finger to bear him and rear him and make him become what he had become.
Habitual acts, they are performed in the head even when you don’t perform them. Or you perform them in reality,even when the head out of habit has stopped taking account of them.
But I immediately removed that idea of solicitude attributed to a man from whom I solicited nothing anymore. I was an obsolete wife, a cast-off body, my illness is only female life that has outlived its usefulness.
In the evening after that encounter, before going to sleep, I felt that his smell still emanated from the closets, was exhaled by the drawer of his night table, the walls, the shoe rack. In the past months that olfactory signal had provoked nostalgia, desire, rage. Now I associated it with Otto’s death and it no longer moved me. I discovered that it had become like the memory of the odor of an old man who, on a bus, has rubbed off on us the desires of his dying flesh. This fact annoyed me, depressed me.
What a complex foamy mixture a couple is. Even if the relationship shatters and ends, it continues to act in secret pathways, it doesn’t die, it doesn’t want to die.
I took a pair of scissors and, for a whole long silent evening, cut out eyes, ears, legs, noses, hands of mine, of the children, of Mario. I pasted them onto a piece of drawing paper. The result was a single body of monstrous futurist indecipherability, which I immediately threw in the garbage.

Friday, September 11, 2020

Love Thy Critic - Ruskin Bond

'రైటింగ్ ఈజ్ ఎ సోలిటరీ బిజినెస్' అనో 'ఎ రైటర్ షుడ్ బీ రెడ్,నాట్ హర్డ్' అనో ఎంతమంది రచయితలు చెప్పినా రాయడం వెనకున్న అర్థం పరమార్థం కొందరు రచయితలకు బోథపడుతున్నట్లు అనిపించదు..ఒకప్పుడు ఇండియా టుడే లో రస్కిన్ బాండ్ తన పుస్తకం గురించి ఒక ఘోరమైన పదజాలంతో కూడిన విమర్శ చదివారట. 1937 లో హెమ్మింగ్వే కు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఆయనేం చేశారో గుర్తు తెచ్చుకున్నారట..మాక్స్ ఈస్టమన్ అనే విమర్శకుడు హెమ్మింగ్వే 'డెత్ ఇన్ ది ఆఫ్టర్నూన్' ను సమీక్షిస్తూ అందులో హెమ్మింగ్వే మగతనాన్ని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా ఆ పుస్తకానికి 'బుల్ ఇన్ ది ఆఫ్టర్నూన్' అని పేరు పెట్టారట..ఆ తరువాత ఒక సందర్భంలో హెమ్మింగ్వే కు మాక్స్ ఈస్టమన్ తారసపడినప్పుడు మాక్స్ తలమీద పుస్తకంతో ఒక్కటి బాది,ఆయనను మట్టికరిపించారట..కానీ ఇప్పుడు రస్కిన్ విషయంలో చిక్కేమిటంటే ఆయన విమర్శకురాలు ఒక స్త్రీ.."ఆమెతో కుస్తీకి దిగితే ఖచ్చితంగా నేను ఓడిపోతానని తెలుసు" అని చమత్కరిస్తారు రస్కిన్..ఇక్కడ రచయితలకు రెండే రెండు మార్గాలు,పాఠకుల విమర్శను పట్టించుకోకుండా తమ సృజనాత్మక శక్తిని తమ రచనలపై పెట్టి తమ పని తాము చేసుకోవడం,లేదా వారితో పబ్లిక్ గా మల్లయుద్ధానికి దిగడం.

Image Courtesy Google

ఒక్కోసారి పరువూ,మర్యాదలకు భంగం కలిగిస్తూనో,నిజమైన టాలెంట్ ను కూడా చిన్నచూపు చూసే రీతిలోనో విమర్శకులకూ,రచయితలకూ మధ్య చాలా అభ్యంతరకరమైన రీతిలో వాగ్వివాదాలు జరుగుతాయి..అందులోనూ చాలా దిగజారుడు స్థాయి విమర్శకులు మాత్రమే రచయితల రచనలను గూర్చి కాకుండా వారిపై వ్యక్తిగతమైన దూషణలకు దిగుతారు..ఇది కేవలం అసూయనో,దుర్భుద్ధితోనో చేసేపని కాకా మరొకటి కాదంటారు రస్కిన్.

రచయితలపై కొన్ని తీవ్ర విమర్శలు చేసిన విమర్శకులను గురించి ప్రస్తావిస్తూ,

* Thomas Carlyle called Emerson ‘a hoary-headed and toothless baboon’ and wrote of Charles Lamb: ‘a more pitiful, rickety, gasping, staggering Tomfool I do not know.’ కానీ మనం ఎమెర్సన్ నీ,లాంబ్ నీ చదువుతాం గానీ కార్లైల్ ని ఎవరు చదువుతారు ??

* Of Walt Whitman, one reviewer said: ‘Whitman is as unacquainted with art as a hog is with mathematics.’ 

* Swift was accused of having ‘a diseased mind’ and Henry James was called an ‘idiot and a Boston idiot to boot, than which there is nothing lower in the world’. 

*Their critics have long been forgotten, but just occasionally an author turns critic with equal virulence. There was the classic Dorothy Parker review which read: ‘This is not a novel to be tossed aside lightly. It should be thrown with great force.

* Macaulay sneered at Wordsworth’s ‘crazy mystical metaphysics, the endless wilderness of dull, flat, prosaic twaddle’, 

ఇలాంటి అనేకమంది ప్రముఖ రచయితల గురించి రాస్తూ,ఇంతవరకూ షేక్స్పియర్ ను మించి ఎవరూ విమర్శింపబడలేదు అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Hamlet was described by Voltaire as ‘the work of a drunken savage’, and Pepys said A Midsummer Night’s Dream was ‘the most insipid, ridiculous play that I ever saw in my life’.

కానీ ఇక్కడ గ్రహించిన విషయం ఏమిటంటే ఆర్ట్ విషయంలో మహామహులు కూడా విమర్శలకు అతీతులు కాదు అని..ఇంతకుమునుపు చాలా వ్యాసాల్లో ప్రస్తావించినట్లుగానే వ్యక్తిగత విమర్శ కానంత వరకూ ఒక రచన గురించిన విమర్శను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నవారే రచనావ్యాసంగం జోలికి వెళ్తే మంచిది..ఎందుకంటే ఒకటి,పాఠకుల ఊహాత్మకతను అదుపు చేసే అవకాశం రచయితకు లేదు గనుక..రెండు,తమ రచన ఉత్తమమైనదని ప్రతీ పాఠకుడినీ ఒప్పించడం రచయితకు సాధ్యం కాదు గనుక.

కానీ రచయితలు ఈ తిరస్కారాల్నీ,విమర్శల్నీ తీసుకోవాలా అనే ప్రశ్న వస్తే రాజకీయనాయకులకూ,స్పోర్ట్స్ పర్సన్స్ కీ,నటులకీ తప్పనప్పుడు రచయితలే విధంగా మినహాయింపు అంటారు రస్కిన్.

As E.M. Forster once said: ‘No author has the right to whine. He was not obliged to be an author. He invited publicity, and he must take the publicity that comes along Of course, some reviewers do go a little too far, like the one who once referred to ‘that well-known typist Harold Robbins’.

రచనావ్యాసంగాన్ని జీవనోపాధిగా చేసుకోవడాన్ని యుద్దరంగంలో నిరాయుధులుగా ఉండడంతో సరిసమానంగా అభివర్ణిస్తూ, అప్పుడప్పుడూ కొంతమంది అపరిచిత వ్యక్తులు తారసపడి "మీరు మంచి రచయితేనా ? " అని అడిగినప్పుడు ఏమి చెప్పాలో పాలుపోక దిక్కులు చూస్తానంటారు రస్కిన్ బాండ్ :) 

ఇక విమర్శ విషయానికొద్దాం..విమర్శకు కొలమానాలేమిటి ? పెద్ద గీతా చిన్న గీతా తరహాలో ఒక రచన నాణ్యత తెలియాలంటే దానిని మిగతా రచనలతో పోల్చి చూడడం తప్పనిసరి..ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది..మన సాహిత్యం గొప్పదా ? పరాయి సాహిత్యం గొప్పదా ? మన బావిలో నీళ్ళ పరిమాణం అంచనా వెయ్యాలంటే మరో బావిని పరిశీలించాలి లేదా బావి బయట తలపెట్టి సముద్రాన్నో,నదినో,అదీ కాకపోతే ఒక చెరువునో చూస్తేనే మన నీళ్ళ పరిమాణం,నాణ్యత లాంటివి అవగతమవుతాయి..మనదంతా ఉత్తమ సాహిత్యం పరాయిదంతా వట్టి పైత్యం అనుకుంటూ తమ బావిని దాటి బయటకు వెళ్ళే అలవాటులేని విమర్శకులు (?) ,సాహిత్యకారులు (?) చేసే తీర్మానాలు ఉత్త కాలక్షేపం కబుర్లుగా కొట్టిపారెయ్యవచ్చు..వాటికి అంతకు మించిన విలువను ఆపాదించడం అనవసరం..చందమామ అంటే వల్లమాలిన ఇష్టం ఉన్నా,చలం,విశ్వనాథల మీద అభిమానం ఉన్నా జీవితమంతా కేవలం చందమామ గుణగణాలను భట్రాజు బృందంలా పొగుడుకుంటూ బ్రతికెయ్యడం 'అసలుసిసలు' పాఠకులూ,సాహితీ అభిలాష ఉన్నవారూ,సాహితీ వేత్తలూ  చెయ్యరు..అక్కడే ఆగిపోకుండా 'వాట్ నెక్స్ట్ ?' అని ఆసక్తిగా చుట్టూ చూస్తారు..నాలుగుపుస్తకాలు చదవగానే,రాయగానే విమర్శకులూ,రచయితలూ అయిపోయామనుకున్న భ్రమలో తాము తయారుచేసుకున్న కోటరీల కరతాళ ధ్వనులమధ్య మరో శబ్దం చెవులకు వినిపించనంత మైకంలో మైమరిచిపోయిన రచయితలు దీర్ఘకాలికంగా గుర్తుండిపోయే రచనలు చేసే సృజనకారులు ఎంతమాత్రం కాలేరు,ఇక ఏబీసీడీలు నేర్చుకోగానే మన చదువు పూర్తైపోయిందనుకునే పాఠకుల గురించి మాట్లాడుకోనవసరం అసలే లేదు..సాహితీమథనానికి ఆకాశమే హద్దు..ఎన్ని చదివినా,ఎంత రాసినా ఇంకా మన అజ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తూ ఏదో మిగిలిపోయిందనే స్పృహ పాఠకుడినో,రచయితనో ముందుకు నడిపించాలి..తమ ఊహాత్మకతను,ఆర్టిస్టిక్ మ్యూజ్ నూ నిరంతరం విమర్శకులకు ధీటైన జవాబిచ్చే క్రమంలో తాకట్టు పెట్టుకోవడం సృజనకారులు విషయంలో వృథాప్రయాస తప్ప మరొకటి కాదు..ఇది ఎలా ఉంటుందంటే పాఠకుడికి మన రచనను చదివి ఏమి ఆలోచించాలో,ఏమి ఊహించుకోవాలో మన దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించే ప్రయత్నం చెయ్యడంలా ఉంటుంది..సిగిస్మండ్ క్రిఝిజానోవ్స్కీ,ఫెర్నాండో పెస్సోవా లాంటి దిగ్గజాలే తమ రచనలకు వారి కాలంలో సరైన ఆదరణ లేక అనామకులుగా జీవించి ఈ లోకం నుండి నిష్క్రమించారు..ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళలో వారి రచనలు వెలుగుచూశాయి,కాలపరీక్షకు ఎదురీది నిలిచి ఇప్పటికీ పాఠకుల నీరాజనాలందుకుంటున్నాయి..అదేమీ కాదు మా శ్రమకు తగ్గ ఫలం,ఫలితం దక్కనప్పుడు మేమెందుకు రచనలు చెయ్యాలి అంటారా ? అయితే మీరు మరో వ్యాపకం చూసుకుంటే మంచిదండీ...Art is definitely not for you.

Friday, August 28, 2020

Michel Foucault on Freedom - Michel Foucault : Key Concepts by Dianna Taylor (Editor)

ఈ 'స్వేఛ్చ' అనే రెండక్షరాల పదం చూడ్డానికి కనిపించింత సరళంగా జీవితానికి అన్వయించుకునే సమయంలో అనిపించదు..అసలీ స్వేచ్ఛకు నిర్వచనం ఏమిటి ? స్వేఛ్చ శరీరానికి సంబంధించిందా లేదా మానసికమైనదా ? అనే ప్రశ్నలు అనేక సందర్భాల్లో తలెత్తుతాయి..సహజంగా మన దృష్టిలో స్వేచ్ఛ రెండు రకాలు..ఒకటి వ్యక్తిగతమైతే,రెండు సామజికమైనది..కానీ సంఘజీవిగా సమూహాల్లో కొనసాగడం అనివార్యమైన మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ,సామజిక స్వేచ్ఛ మీద ఆధారపడి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది..ఫిలాసఫర్స్ సహజంగా ఈ స్వేచ్ఛను మెటాఫిజికల్,పొలిటికల్ అనే రెండు కోణాల్లో చూస్తారు..కానీ Michel Foucault దృష్టిలో స్వేఛ్చకు మరో మూడో పార్శ్వం కూడా ఉంది..ఆయన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను సమర్ధించలేదు,అలాగే దాన్ని తిరస్కరించనూలేదంటారు..ఆయన స్వేఛ్ఛను నిర్వచించే క్రమంలో ఎన్నుకున్న కాన్వాస్ చాలా పెద్దదీ,చారిత్రకమైనదీను.."After all,what would be knowledgeable-ness and not,in one way or another and to the extent possible,in the knower's straying afield of himself "? అంటారు Foucault.

Image Courtesy Google
మెటాఫిజికల్ ఫ్రీడమ్ విషయానికొస్తే మెదడు శరీరాన్ని అదుపు చేస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే..ఆ విధంగా చూస్తే సోంటాగ్ అన్నట్లు మానసిక స్వేఛ్చ(ఫ్రీ విల్) శారీరక స్వేఛ్చకు దారితీస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి ? దీనిని లోతుగా అర్థం చేసుకోడానికి కొన్ని వాదాలను తెరపైకి తీసుకొచ్చారు రచయిత..వాటిల్లో మొదటిది 'డాక్ట్రిన్ ఆఫ్ డిటెర్మినేషన్'..మన ఆలోచనలూ,కర్మలూ మన అదుపాజ్ఞల్లో ఉండవని చెప్తుంది డిటెర్మినిజం (నిర్ణయాత్మకత)..మనం చేసే పనులన్నింటికీ మూలాలు వెతికితే అవి మన consciousness పరిథికి ఆవల వాస్తవిక ప్రపంచంలో వ్రేళ్ళూనుకుని ఉంటాయంటారు..అదే విధంగా 'జెనెటిక్ డిటెర్మినిస్టులు' మన వ్యవహారశైలి,విషయాల పట్ల మనం స్పందించే తీరు మన జీన్స్ లో ముందుగానే కోడింగ్ చెయ్యబడి ఉందని ప్రతిపాదిస్తారు..అదే కాల్వనిస్టులు (జాన్ కాల్విన్) దీనిని ఒక మతపరమైన కోణంలో చూస్తారు..దేవుని చేతిలో అంతా ముందే లిఖితమై విధి పేరిట ప్రతి కర్మా నిర్ణయింపబడిందని వీరి నమ్మకం..మనం దేవుని చేతిలో కేవలం కీలు బొమ్మలమని వీరి భావన..ఇక ప్రవర్తనావాదులు మన వ్యక్తిత్వం మనమున్న పరిసరాలను బట్టి రూపుదిద్దుకుంటుందని అంటారు..మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి-చెడులు మనల్ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైన ఈ వాదాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే,జీవితంలో ఏ ఒక్క విషయం,సందర్భం మన అదుపులో లేదన్న చేదు నిజం ఈ వాదాలన్నిటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుందని (బాహ్య ప్రపంచంతో సంబంధంలేని అంతఃప్రపంచం ఉంటుందని) నమ్మేవాళ్ళు ఈ వాదనను ఖండిస్తారు..ఇకపోతే నిర్ణయాధికారం,జడ్జిమెంట్ లనేవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి కొలమానాలుగా ఆలివర్ సాక్స్ పరిగణించినట్లు,మానసిక సంతులనం కోల్పోయినవారు తప్ప మిగతా వాళ్ళకి తమ ఆలోచనల పట్ల,నిర్ణయాలపట్ల కాస్తో కూస్తో అదుపు ఉండే తీరుతుంది..అదే విధంగా పొలిటికల్ ఫ్రీడమ్ బాహ్యప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వేషభాషలు,కులమతాలు,హక్కులూ,అధికారాలు మొదలగు సాంస్కృతికపరమైన అన్ని అంశాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది..One could be metaphysically free without any type of political liberty అనుకుంటే సాధారణ వ్యక్తుల కంటే ఆర్టిస్టులకు ఈ మెటాఫిజికల్ ఫ్రీడమ్ గురించిన అవగాహన కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది.

నిజానికి పొలిటికల్ ఫ్రీడమ్ లా కాకుండా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది,కానీ ఈ తరహా స్వేచ్ఛ ఉంటుందనే గ్రహింపు మాత్రం అందరికీ ఉండకపోవచ్చు..ఇదంతా చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.

* పొలిటికల్ ఫ్రీడమ్ తో సంబంధం లేని పక్షంలో,బాహ్య ప్రపంచపు హద్దులు,వత్తిళ్ళు,నియమాలూ లేని మనుషులు మెటాఫిజికల్ ఫ్రీడమ్ తో సర్వస్వతంత్రులు అవుతారా అంటే పూర్తి స్వేఛ్ఛను అనుభవించగలరా ?
* స్వేఛ్చ విషయంలో మనిషి ఎవరితో సంఘర్షిస్తాడు ?
* మనం చెయ్యాలనుకున్నది చెయ్యగలగడం స్వేఛ్ఛా ? లేక చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఉండడం స్వేఛ్ఛా ? వీటిపై మొరాలిటీ ప్రభావం ఏమిటి ?

అన్ని అడ్డంకులూ దాటుకుంటూ,బంధాలు తెంచుకుని తనకు నచ్చిన విధంగా జీవితాన్ని స్వేఛ్ఛగా బ్రతకాలనుకునే క్రమంలో మనిషి చేసే తొలి యుధ్ధం బహుశా తనతోనే..ఒక్కోసారి మెదడు చెయ్యమని ప్రోత్సహించిన పనిని consciousness (స్పృహ ? లేక ఆత్మ ?) వద్దని వారిస్తుంది..మెదడు జడ్జిమెంట్ తప్పైనా మానవ సహజమైన నైతిక విలువలతో కూడిన స్పృహ జడ్జిమెంట్ ఎప్పుడూ కరక్టే..పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నా లేకపోయినా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అనుభవించడానికి కూడా అడుగడుక్కీ ఎంతో కొంత సంఘర్షణ తప్పనిసరి..ముఖ్యంగా ఆ సంఘర్షణ మనతోనే మొదలయినప్పుడు,ఆలోచనా మాత్రంగానే అయినప్పటికీ పూర్తి స్థాయి స్వేఛ్చను అనుభవించడం అసంభవమనిపిస్తుంది.
Todd May : Image Courtesy Google
ఇక Foucault సిద్ధాంతానికొస్తే ఆయన ప్రశ్న ఎప్పుడూ "మనం స్వేఛ్ఛా జీవులమా ?" అని కాకుండా "చరిత్ర మన స్వేఛ్ఛను ఏ విధంగా శాసిస్తోంది ? ఈ విషయమై మనం ఏ చర్యలు తీసుకోగలం ?" అనే దిశగానే సాగాయంటారు ఈ వ్యాసాన్ని రాసిన రచయిత Todd May..మనకి ఏం ఆలోచించాలో,ఎలా ఆలోచించాలో చెప్పకుండా ఈ రెండవ ప్రశ్నకు సంబంధించి అన్ని చారిత్రక కోణాల్లోనూ విశ్లేషణలు మాత్రం చేశారు Foucault...ఈ విషయమై
There is an optimism that consists in saying that things couldn’t be better. My optimism would consist in saying that so many things can be changed, fragile as they are, more arbitrary than self-evident, more a matter of complex, but temporary, historical circumstances than with inevitable anthropological constraints.అని రాస్తారు.

ఈ విషయమై Foucault రచన 'డిసిప్లిన్ అండ్ పనిష్' ను ప్రస్తావించారు Todd ..ఆ పుస్తకంలో,క్యాపిటలిజం సమాజాన్ని శాసిస్తున్న తరుణంలో పాలకవర్గాలు మన స్వేఛ్ఛను హరిస్తున్నాయి అనేకంటే,అవి మనల్ని కొన్ని నిర్ణీత వర్గాలుగా విభజించి నిరంతరం మన ఆలోచనల్ని అదుపు చేస్తున్నాయని  (psychological monitoring and intervention) అంటారు Foucault..ఇలా తయారైన సమాజంలో ప్రజల్ని Docile Bodies (Foucault argues that individuals are under constant surveillance and regulation in ways that are often subtle and thereby seemingly invisible, leading to normalization and acceptance of such systems) గా అభివర్ణిస్తారు..ఈ విధంగా రూపుదిద్దుకున్న సమాజంలో ప్రజలు తమను తాము 'సైకలాజికల్ బీయింగ్స్' గా మాత్రమే భావిస్తున్నారంటారు..తత్ఫలితంగా తమ బాధలకు కారణం సమాజపు తీరుతెన్నుల్లో ఉన్న లోపమనో,సామజిక వైఫల్యమనో గ్రహించి దాన్ని ప్రశ్నించకుండా,తమ బాధలన్నీ కేవలం మానసికపరమైనవని తీర్మానించుకుని,వాటికి మానసికవైద్యం అవసరమని భ్రమిస్తున్నారనేది Foucault వాదన..నిజానికి స్వేఛ్ఛను ప్రత్యక్షంగా హరించడం కంటే మనుషుల్ని ఈ సైకలాజికల్ బీయింగ్స్ గా మార్చే క్రమంలో వారిని ఒక పథకం ప్రకారం conformity కి గురిచేసి,విభిన్న జీవన విధానాలను అవలంబించకుండా చేసి సమాజానికి ఎదురుతిరగకుండా నిరోధించడం మరింత తేలిక అంటారాయన..దీనికీ స్వేఛ్చకూ సంబంధం ఏమిటంటే,ఇటువంటి పద్ధతులు పరోక్షంగా మన ఆలోచనా విధానాన్ని శాసిస్తూ మనకు తెలీకుండానే మన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను అదుపు చేస్తున్నాయి..ఇటువంటి చారిత్రక అంశాలు మనం ఏం ఆలోచించాలి ? ఎలా ఆలోచించాలి ? అనే నిర్ణయాధికారాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాయి..Foucault స్వేఛ్ఛను సాంఘిక,ఆధ్యాత్మిక కోణాల్లోను,స్వేఛ్చ అమలు పరచడం గురించీ చేసిన విశ్లేషనల గురించి ఇంకో వ్యాసంలో మరింకెప్పుడైనా.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు,

One must observe that there cannot be relations of power unless the subjects are free. If one or the other were completely at the disposition of the other and became his thing, an object on which he can exercise an infinite and unlimited violence, there would not be relations of power. In order to exercise a relation of power, there must be on both sides at least a certain form of liberty

Saturday, August 22, 2020

Experience : Early Writings (1910–1917) - Walter Benjamin

ఈ మధ్య వాల్టర్ బెంజమిన్ ఎర్లీ రైటింగ్స్ లో కొన్ని వ్యాసాలు చదివాను..ఇందులో కొన్ని ఆయన  అంతరంగాన్ని మనకు పరిచయం చేసే వ్యక్తిగతమైన వ్యాసాలు..ఈ అక్షరాల్లో ఒక యువకుడిగా బెంజమిన్ మనకు అత్యంత సన్నిహితమైన సహచరునిలా అనిపిస్తారు..ఒక వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు అతడి భావాలు ఎలా ఉంటాయి ? అతడి కలలూ,కల్పనలూ వాస్తవిక ప్రపంచపు దాడికి గురైనప్పుడు అతడి ఆలోచనలు ఎటువంటి ఎదురుదాడి చేస్తాయి ? బెంజమిన్ దృష్టిలో అనుభవానికి నిర్వచనం ఏమిటి ? 'అనుభవం' వ్యాసానికి నా స్వేఛ్ఛానువాదం.

అనుభవం : 

యవ్వనపుపొంగు దాటి పరిణితి చెందిన వ్యక్తిగా మారిన ప్రతివారూ ముఖానికి అనుభవమనే ముసుగును ధరిస్తారు (కోవిడ్ మాస్క్ కాదన్నమాట :) )..మనిషికి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఈ ముసుగుతో నిత్య సంఘర్షణ పరిపాటి..ఈ ముసుగు అభేద్యమైనది,ఏ విధమైన మార్పూ,వ్యక్తీకరిణా లేనిదీను..అడల్ట్ గా మనం పిలుచుకునే వ్యక్తి,తన జీవితంలో దాదాపు అన్నీ అనుభవించి ఉంటాడు..యవ్వనం,ఆదర్శాలు,ఆశలు,ఆశయాలూ, అమ్మాయిలూ : కానీ చివరకు ఇదంతా ఉత్త భ్రమ అని తేల్చిపారేస్తాడు -- ఇది విని మనం భయానికి లోనవుతాం,ఆ అనుభవాలన్నీ విషతుల్యమని భావిస్తాం..బహుశా ఒకవిధంగా అతడు కరక్టే కావచ్చునేమో..కానీ అతడి వాదనను మనమేవిధంగా ఎదుర్కొంటాం ? "అబ్బే,మేమింకా ఏమీ అనుభవించనిదే !!"

ఆ ముసుగును ఒకసారి తొలగించి చూసే ప్రయత్నం చేద్దాం..నిజానికి ఈ అడల్ట్ తన జీవితంలో ఏమి అనుభవించాడు ? మనకు అసలు ఏం ఋజువు చేద్దామనుకుంటున్నాడు ?  అతడు కూడా ఒకప్పుడు యవ్వనాన్ని అనుభవించి ఉంటాడు,తన మనసుకి నచ్చినదేదో కోరుకునే ఉంటాడు,తల్లితండ్రులు చెప్పినవన్నీ నమ్మకుండా ,ఉట్టి అబద్ధాలని కొట్టిపారేసే ఉంటాడు..కానీ క్రమంగా జీవితం వాళ్ళు చెప్పినవన్నీ నిజమేనని నేర్పించింది..మనతో ఈ మాట అంటూ అతడు గంభీరంగా ఒక సుపీరియర్ ఫ్యాషన్ లో చిరునవ్వు నవ్వుతాడు : ఇదే మీ  విషయంలో కూడా జరుగుతుంది,కావాలంటే చూస్తూ ఉండండి అంటాడు..కానీ ఈలోగా మన పసితనపు చేష్టల్ని అతడు అవహేళన చేస్తాడు..అతడికి వయసుతో బాటుగా వచ్చిన హుందాతనం మనకు కూడా అలవడే వరకూ,మన యవ్వనాన్ని కేవలం చిలిపితనంగా,మన ఆలోచనల్నీ,ఆశయాల్నీ అపరిపక్వతతో కూడిన  చిన్నపిల్లలచేష్టలుగా,విలువలేనివిగా కొట్టిపారేస్తాడు..మరికాస్త ముందువెళ్తే,కొంతమంది ప్రబోధకుల దృష్టిలో యవ్వనానికి అసలు గుర్తింపే ఉండదు : 'అన్నప్రాసనరోజే ఆవకాయపచ్చడి' రీతిలో వీళ్ళు చాలా కఠినంగా తమ అనుభవసారాన్నంతా బోధించి మనల్ని ఉన్నపళంగా ఆ జీవితపు క్రూరత్వపు రొంపిలోకి తోసేసే ప్రయత్నం చేస్తారు..అడుగడుక్కీ రాజీపడే సందర్భాలూ,భావదారిద్య్రములు,భావావేశాల్ని అదుపులో ఉంచే ఉదాసీనత : ఇదే జీవితం,ఇదే మా అనుభవసారమంటారు సదరు పెద్దవాళ్ళు..మనపై ఈ రకమైన దాడి జరిగిన ప్రతిసారీ యవ్వనం అంటే నిత్యం వేసే తప్పటడుగుల్ని సరిదిద్దుకోవడమనో లేక ఈ కాలం నిరర్ధకమైనదనో,క్షణికమైనదనో భావన కలుగుతుంది..కానీ మన జీవితం కూడా చివరకు మరో గొప్ప అనుభవంగా రూపాంతరం చెందుతుంది.

ఈ పెద్దవాళ్ళ అనుభవం అంతే : జీవితం యొక్క నిరర్థకత,కౄరత్వం,ఇంతకుమించి మరొకటి కాదు..ఇటువంటి నిరాశావాదం తప్ప వాళ్ళు ఎప్పుడైనా మనల్ని భవిష్యత్తును మరో క్రొత్త కోణంలో ఆశావహదృక్పథంతో చూడమని ప్రోత్సహించారా ? ఉహూ..ఆ అవకాశం లేదు..ఎందుకంటే అటువంటివి వాళ్ళు కూడా బహుశా అనుభవించి ఉండరు..నిజానికి సత్యం,ధర్మం,జీవన సౌందర్యం ఇవన్నీ సుస్థిరమైనవి,మరి వీటన్నిటి మధ్యా అనుభవం ప్రాముఖ్యత ఏమిటి ? - అసలు రహస్యం ఇక్కడే ఉంది..మేథోసంబంధమైన ,అర్థవంతమైన విషయాలపై దృష్టిసారించని ఫిలిస్టిన్ కేవలం అనుభవప్రధానంగా జీవిస్తాడు..అతడి దృష్టిలో 'అనుభవం' జీవితపు సాధారణ తత్వానికి ఒక అనుమతిపత్రం  లాంటిది..నిజానికి ఈ అనుభవానికి ఆవలవైపు మనం నిర్వర్తించవలసిన విలువలనేవి ఉంటాయని అతడు కనీసం గ్రహించడు..బహుశా అనుభవం తప్ప మరొకటి తెలీని కారణంగానే అతడికి జీవితం నిత్యం అశాంతిగా,నిరర్థకంగా  అనిపిస్తుంది..అనుభవసారాన్ని భద్రపరుచుకున్న అతడి మనస్సును మినహాయిస్తే అతడి ఉనికి దాదాపూ శూన్యం..సాధారణ జీవితానికి సంబంధించి దైనందిన విషయవిశేషాలపై తప్ప అతడు వేరే ఏ ఒక్క విషయంతోనూ కూడా ఏ రకమైన ఆంతరంగిక సంబంధాన్నీ కలిగి ఉండడు.

కానీ అనుభవం మనకు ఇవ్వలేనిదీ,మన దగ్గర నుంచి తీసుకోలేనిదీ ఒకటుంటుంది : మునుపటి ఆలోచనలన్నీ భ్రమలైనప్పటికీ చివరకు మిగిలే సత్యం..లేదా ఎవరూ పాటించనప్పటికీ కేవలం మన సంకల్పబలం చేత నిలబెట్టుకునే విశ్వనీయత..ఏదేమైనా మన పెద్దవాళ్ళు అలసిపోయిన హావభావాలతో కూడిన ఒక సుపీరియర్ నిస్సహాయతతో ఒక్క విషయంలో మాత్రం నిజం చెప్తారు : మనం అనుభవించినదంతా దుఃఖపూరితమైనది,మనం అనుభవించలేనిది మాత్రమే శక్తివంతమైనదీ,అర్థవంతమైనదీ అనీను (?)..అప్పుడు మాత్రమే ఆత్మ పరిపూర్ణమైన స్వేఛ్చననుభవిస్తుంది..అయినప్పటికీ జీవితం దాన్ని కాలుపట్టి క్రిందకి లాగుతూనే ఉంటుంది,ఎందుకంటే జీవితం యొక్క అనుభవసారం అశాంతి మాత్రమేనని తేల్చేస్తారు.

ఏదేమైనా మనమిలాంటి విషయాలు ఇకపై అర్థంచేసుకోలేము..కానీ సోమరితనంతో కూడిన అహంకారంతో నిరాసక్తిగా,నిదానంగా ఆత్మ గురించిన అవగాహన బొత్తిగా లేనివాళ్ళ జీవితాన్నే మనం కూడా జీవిస్తున్నామా ? కాదేమో..ప్రతీ జీవితానుభవమూ ప్రత్యేకమైనది..మనం మన ఆంతరంగిక ప్రపంచపు సౌందర్యం (ఆత్మసౌందర్యం) తో అనుభవానికి ఒక ప్రత్యేకతను  ఆపాదిస్తాము - కానీ సరైన ఆలోచనలేనివాడు తన జీవితంలోకి పొరపాట్లను ఆహ్వానిస్తాడు..మనలాంటి సత్యశోధకులతో "నీవెప్పటికీ సత్యం అంటే ఏమిటో తెలుసుకోలేవు,అది నా స్వానుభవం " అంటాడు..ఏదేమైనా శోధకులకు ఈ పొరపాట్లనేవి సత్యానికి చేరుకోడానికి ఒక ఊతం లాంటివి..కేవలం ఆత్మ ఉనికిని పరిత్యజించిన వారికి మాత్రమే అనుభవం నిరర్థకమైనదిగా అనిపిస్తుంది..నిరంతరం ప్రయత్నించేవాడికి అనుభవం బాధాకరంగా పరిణమించినప్పటికీ అతడిని నిరాశవైపు ఖచ్చితంగా మళ్ళించదు.

అటువంటి శోధకుడు నిస్సందేహంగా ఫిలిస్టిన్ భావజాలపు మాయలో పడి ఓటమిని అంగీకరించడు..కానీ ఫిలిస్టిన్ మాత్రం నిరంతరం అర్థరహితమైనదానిలో మాత్రమే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు..ఆత్మలేదని తనని తాను నమ్మించుకుంటూ,తాను ప్రయాణించే మార్గం మాత్రమే సరైనదని భావిస్తాడు..కానీ విచిత్రమేమిటంటే అతడి కంటే ఎక్కువ ఖచ్చితమైన స్వాధీనతనూ,గౌరవాన్నీ వేరెవ్వరూ ఆశించరు..ఎందుకంటే విమర్శించాలంటే సృజించడం కూడా తెలియాలి..కానీ అది అతడికి చేతకాదు..బహుశా ఈ కారణంగానే అతడి సంకల్పానికి విరుద్ధంగా జరిగే ఆత్మానుభవం కూడా అతడికి ఆత్మవిహీనంగా,డొల్లతనంగా అనిపిస్తుంది.

Tell him
He should honor the dreams of his youth
When he becomes a man.

ఫిలిస్టిన్ యవ్వనప్రాయపు స్వప్నాలను తీవ్రంగా ద్వేషిస్తాడు..ఈ ద్వేషానికి అతడు తరచూ సెంటిమెంటాలిటీ రంగునద్దే ప్రయత్నం కూడా చేస్తాడు..ఎందుకంటే ఈ స్వప్నాలు అతణ్ణి భయపెడతాయి,నిద్రలో ఉలిక్కిపడేలా చేస్తాయి..యవ్వనంలో అందరికీ వినపడే ఆ స్వప్నాల్లోని ఆత్మఘోష అతణ్ణి కూడా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది..అందుకే అతడు దానితో నిత్యం సంఘర్షిస్తూ ఉంటాడు..తనకు ఊపిరాడకుండా చేసిన ఆ అనుభవాన్ని యువతకు చెపుతూ,వాళ్ళకు తమను చూసి తాము నవ్వుకోవడం ఎలాగో నేర్పిస్తాడు..నిజానికి  ఆత్మహీనమైన అనుభవం నిరాశాజనకమైనదే కాదు,చాలా సౌకర్యవంతమైనది కూడా.

ఇది కాకుండా మనకు మరొక అనుభవం గురించి కూడా తెలుసు..పరిణితిలేని వయసులో ఆత్మ గురించిన గ్రహింపులేని అనుభవం ఎన్నో కలల్ని మొగ్గతొడుగుతున్న దశలోనే నాశనం చేస్తుంది,అయినప్పటికీ దీనిలో కూడా ఒక రకమైన సహజత్వం ఉంది..ఇది చాలా స్వఛ్ఛమైనది,ఏదీ స్పృశించ సాధ్యం కానిదీ,సత్వరమైనదీను..ఎందుకంటే మనం యవ్వన ప్రాయంలో ఉన్నంతవరకూ యేది చేసినా ఆత్మసహేతుకంగానే చేస్తాం..Always one experiences only oneself,as Zarathustra says at the end of his wanderings..ఫిలిస్టిన్ కు కూడా తన అనుభవం తనకుంటుంది ; దానిని ఆత్మవిహీనమైన గొప్ప అనుభవంగా చూడవచ్చు..కానీ యవ్వనం ఆత్మసహేతుకంగా శ్వాసిస్తుంది..తాను అడుగుపెట్టిన ప్రతిచోటులోనూ,ప్రతి మనిషిలోనూ  ఆత్మను చూడగలిగినవాడు పెద్ద ప్రయత్నమేమీ చెయ్యకుండానే గొప్పవాటిని సాధించగలడు - అతడు అడల్ట్ గా మారగానే అతడి యవ్వనం అతడిలో కారుణ్యంగా స్థిరపడుతుంది..దీనికి విరుద్ధంగా ఫిలిస్టిన్ మాత్రం తీవ్రమైన అసహనంతో మిగిలిపోతాడు.

Saturday, August 15, 2020

Intimations : Six Essays - Zadie Smith

మామూలు మనుషులకు శ్వాసించడమెంత సహజమైన అవసరమో ఆర్టిస్టులకు ఇన్స్పిరేషన్ కూడా అంతే అవసరం..ఈ ప్రేరణను సహజంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మనుషులనుండీ,అనుభవాలనుండీ సంగ్రహిస్తారు..కానీ ఉన్నచోటు నుండి కదలకుండా ఉండాల్సిన నిర్బంధ పరిస్థితుల్లో ఆర్టిస్టులు కూడా మరో ఆర్టిస్టుల రచనలనుండి స్ఫూర్తి పొందుతారు..ఆవిధంగా క్వారంటైన్ సమయంలో మార్కస్ ఆరీలియస్ మెడిటేషన్స్ ను ధ్యానమగ్నమై చదువుతున్న సమయంలో జాడీ స్మిత్ కు రెండు విషయాలు దృష్టిలోకి వచ్చాయట..అవేమిటంటే,Talking to yourself can be useful. And writing means being overheard..ఉరకలు పరుగుల న్యూయార్క్ జీవితం కోవిడ్ కారణంగా అమాంతం స్టిల్ లైఫ్ చిత్రంలా మారిపోయిన సమయంలో ఆరీలియస్ ఇచ్చిన ప్రేరణతో ఆమె తనతో తాను చెప్పుకున్న సంగతులకు 'ఇంటిమేషన్స్' పేరిట అక్షరరూపమిచ్చారు..ఇందులో ఉన్న ఆరు వ్యాసాలూ వ్యక్తిగతమైనవే.
Image Courtesy Google
స్కూళ్ళు,ఆఫీసులు,వ్యాపారాలు,రోజువారీ పనులతో ఊపిరిసలపకుండా ఉరకలు పరుగులతో అనునిత్యం పరుగెత్తే ఆధునిక జీవనశైలికి కోవిడ్ కారణంగా ఒక సడెన్ బ్రేక్ పడ్డట్లైంది..ఫ్యాషన్ స్టేట్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ Cy లకు పాపం బొత్తిగా పనిలేకుండాపోయింది..క్వారంటైన్ లో ఇంట్లో పైజామాల్లో,ముడతలు పడిన టీ షర్టుల్లో గడిచిపోతున్న సాదాసీదా జీవితం,యువతతో పాటు అన్ని వర్గాల వారికీ వయోభేదం లేకుండా అంతఃప్రపంచానికి దారులు చూపించింది..వ్యక్తిత్వపు నిర్వచనాలు చర్మపు తొలి పొరల వద్దే ఆగిపోయే దృష్టిని దాటుకుని ఆధునికత ఉట్టిపడే బ్రాండెడ్ దుస్తులు,బాహ్యాడంబరాలు కాక వ్యక్తిత్వం అంటే మరొకటేదో ఉంటుందనే ఆలోచనకు ఆస్కారం ఇచ్చింది..ప్రతిపూటా స్విగ్గీలు,జొమాటోల్లో లేదా టేక్ అవే కౌంటర్లలో ఆహారం ఆర్డర్ చేసుకునే అలవాటు తప్పించి అందరి చేతా లింగవివక్ష లేకుండా గరిట పట్టించింది..రోజువారీ పనులతో,ఇంట్లో వ్యాపకాలతో పొరుగింటివాళ్ళ పేరు కూడా తెలుసుకోలేని బిజీ జీవితాల మధ్య అందరినీ ఒకచోట చేర్చి మానవీయ సంబంధాలు పటిష్టపరిచింది..సినిమా హీరోల కథలకు బదులు కోవిడ్ బారిన పడిన వారికి అవసరమైనవి సమకూరుస్తూ,దయతో ఆదుకుంటున్న నిజజీవితపు హీరోల మానవత్వపు కథలను సగర్వంగా చెప్పుకునేలా చేసింది..ముఖ్యంగా బాహ్య ప్రపంచంతో పాటు అంతఃప్రపంచం అనేది కూడా ఒకటుంటుందని మర్చిపోయిన మనుషులకు ఆ విషయాన్ని కాస్త కఠినంగానే గుర్తుచేసింది.ఈ పుస్తకంలో వ్యాసాలన్నీ దాదాపు ఇటువంటి అనుభవాలకు సంబంధించిన కథలే..వీటితోపాటు అమెరికన్ హెల్త్ కేర్ విధానాల్నీ,సూపర్ పవర్ ఇగోను విమర్శిస్తూ,,'బ్లాక్ లైవ్స్ మేటర్' క్యాంపెయిన్ ను సమర్ధిస్తూ రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి.

తొలి వ్యాసం Peonies లో జాడీ స్మిత్ ఫెమినిస్ట్ కోణంలో ఆర్టిస్టుగా తన ఆలోచనలు మనతో పంచుకుంటారు..చాలా మంది స్త్రీలకు తాము స్త్రీగా పుట్టామనే బాధేమీ ఉండదు..నిజానికి వాళ్ళు ఒక స్త్రీగా తమ ప్రత్యేకతను,శరీరాన్ని ప్రేమిస్తారు కూడా..కానీ ఇక్కడ స్త్రీ అనే వాస్తవం కంటే దానిచుట్టూ సమాజం తయారుచేసిన స్త్రీ అనే పరిస్థితి తాలూకా బోనులో బందీగా ఉండడం తనకు అంగీకారం కాదంటారు స్మిత్..ఈ క్రమంలో నబకోవ్ 'లోలిటా' సృష్టికి కారణమైన జెనెసిస్ ను నబకోవ్ మాటల్లోనే మనకు గుర్తుచేస్తారు..“As far as I can recall, the initial shiver of inspiration was somehow prompted by a newspaper story about an ape in the Jardin des Plantes, who, after months of coaxing by a scientist, produced the first drawing ever charcoaled by an animal: this sketch showed the bars of the poor creature’s cage.” అంటారు నబకోవ్..శాస్త్రవేత్తలు ఒక కోతి చేతికి బొగ్గు ముక్క ఇచ్చి దాన్ని పెయింటింగ్ వెయ్యమంటే అది ఆర్టిస్టులా తన అంతఃప్రపంచానికి రూపునిచ్చే ప్రయత్నం చేస్తుందని భావించిన శాస్త్రవేత్తలను ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఆ కోతి తను బందీగా ఉన్న బోను చువ్వల్ని (ఇమ్మీడియట్ రియాలిటీ) చిత్రించిందట..స్త్రీలు ఎదుర్కునే లింగ వివక్ష కూడా ఇటువంటిదే అంటారు స్మిత్.

The ape is caged in by its nature, by its instincts, and by its circumstance. (Which of these takes the primary role is for zoologists to debate.) So it goes.What I didn’t like was what I thought it signified: that I was tied to my “nature,” to my animal body—to the whole simian realm of instinct—and far more elementally so than, say, my brothers.I had “cycles.” They did not. I was to pay attention to “clocks.” They needn’t. There were special words for me, lurking on the horizon, prepackaged to mark the possible future stages of my existence. I might become a spinster. I might become a crone. I might be a babe or a MILF or “childless.” My brothers, no matter what else might befall them, would remain men. And in the end of it all, if I was lucky, I would become that most piteous of things, an old lady, whom I already understood was a figure everybody felt free to patronize, even children.

అదే విధంగా మగవాడు కూడా స్వభావరీత్యా తనదైన ప్రత్యేకమైన బోనులో బందీ అయ్యి ఉన్నప్పటికీ,అది సమాజం స్త్రీలకు కేటాయించిన బోనులా సహజమైన బోను కాదంటారు..

You could make someone feel like a “real” man—no doubt its own kind of cage—but never a natural one. A man was a man was a man. He bent nature to his will. He did not submit to it, except in death. Submission to nature was to be my realm, but I wanted no part of that, and so I would refuse to keep any track whatsoever of my menstrual cycle, preferring to cry on Monday and find out the (supposed) reason for my tears on Tuesday. Yes, much better this than to properly prepare for a blue Monday or believe it in any way inevitable. My moods were my own. They had no reflection in nature. I refused to countenance the idea that anything about me might have a cyclic, monthly motion.

మన మనుషులందరికీ ఒక విచిత్రమైన జబ్బు ఉంది..ఉన్నవెయ్యిన్నొక్క బ్లెస్సింగ్స్ ను కౌంట్ చేసుకోకుండా లేని సూదిమొనంత విషయం గురించి ఏదో లేదని బాధపడడం..నిజానికి ఈ నిరాశావాదం ఒక నయం చెయ్యలేని రోగం..Suffering Like Mel Gibson అనే మరో వ్యాసం,కోవిడ్ కారణంగా రోజువారీ కూలీలు,చిన్న చిన్న వ్యాపారులు,రైతులు ఒక ప్రక్క అష్టకష్టాలు పడుతుంటే పాలరాతి సౌధాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ కూడా కోవిడ్ వల్ల ఇంట్లో ఉండి తాము ఎంత కష్టపడుతున్నదీ చాలా దీనంగా వివరించే వారిమీద సెటైర్ లా రాసిన వ్యాసం..మనకు లేనిదాన్ని గురించి బాధపడేకంటే ఉన్నదాని విలువ తెలుసుకుని బ్రతకడం అవసరమంటూ,గ్రాటిట్యూడ్ అనేదొకటుంటుందని ఈ వ్యాసం పాఠకులకు సుతిమెత్తగా గుర్తుచేస్తుంది.
Image Courtesy Google
ఇందులో ఆరు వ్యాసాలూ వేటికవే బావున్నా,మూడో వ్యాసం 'Something to do' నాకు చాలా నచ్చిన,మనలో చాలా మంది సులభంగా కనెక్ట్ అవ్వగలిగిన వ్యాసం.
 "మనం ఇష్టపడి చేసే పనేదీ కష్టం కాదు అంటారు..కానీ ఏ పనైనా చెయ్యడంలో  ఈ 'ప్రేమ' అనే పదార్థం కలపడం చాలా ముఖ్యం..ప్రేమ అంటే మనం చేసే ఏదో పని కాదు,అది అనుభవించవలసినది,దేహం వాయులీనమైనంత సహజంగా మనం ఆ అనుభవం గుండా ప్రయాణించాలి-బహుశా ఈ కారణంగానే మనలో చాలా మందికి అదంటే భయం,అందుకే దాన్ని ప్రత్యక్షంగా ముఖాముఖీ చూడలేక పరోక్షంగా ఎదుర్కోవాలని చూస్తాం..ఇదిగో ఈ నవల,ప్రేమగా రాశాను..ఇదిగో ఈ బనానా బ్రెడ్ ప్రేమతో చేశాను..నిజానికి ఇటువంటి అస్పష్టత తలెత్తకపోతే  ప్రపంచంలో సంస్కృతి పుట్టుకకు ఆస్కారం లేదు,మనకెవరికీ అర్థవంతమైన చిన్న చిన్న ఆనందాలు అనుభవించే అవకాశం అంతకంటే లేదు..శక్తివంతమైన కళ జీవితానుభవంనుండి పుట్టినా దాని వ్యక్తీకరణ ప్రేమ ద్వారానే సాధ్యం..ఈ కళకు అర్థంపరమార్థం ఆపాదించగలిగింది ప్రేమ మాత్రమే..బహుశా ఈ కారణంవల్లనే ప్రపంచంలో పూర్తి స్థాయి ఒంటరితనం అనుభవించేవాళ్ళు మాత్రమే తమ చేతిలో ఉన్న పనిపై మనసు కేంద్రీకరించి మంచి కళను సృజించగలరు..ప్రేమించే వాళ్ళు తమ చుట్టూ ఉండేవాళ్ళ విషయంలో ఇటువంటి కళాసృజన సాధ్యం కాదు."
అటువంటి ఆర్ట్ అరుదంటూనే,
Such art is rare: we can’t all sit cross-legged like Buddhists day and night meditating on ultimate matters.* Or I can’t. But I also don’t want to just do time anymore, the way I used to. And yet, in my case, I can’t let it go: old habits die hard. I can’t rid myself of the need to do “something,” to make “something,” to feel that this new expanse of time hasn’t been “wasted.” Still, it’s nice to have company.అంటారు.
ఈ అలవాటులేని నిర్బంధం లేదా స్వేచ్ఛ గురించి కూడా మనలో చాలా సందిగ్ధత ఉంది..నిజానికి పరుగు ఆపడమనే కళ మనకెవరికైనా తెలుసా ? అటు ప్యూరిటన్ వ్యవస్థలోనూ,ఇటు గీతాసారంలోనూ ప్రబోధించిన కర్మ సిద్ధాంతం పాటిస్తూ గృహస్థు చెయ్యాల్సిన ఇంటి,వంట పనులన్నీ చేసుకుంటాం,గార్డెనింగ్ ప్రాజెక్ట్ మొదలుపెడతాం,పుస్తకాలు రాస్తాం,చదువుతాం,నడకకు వెళతాం,బట్టలు కుడతాం,మైన్క్రాఫ్ట్ లో అన్ని లెవెల్స్ పూర్తి చేస్తాం..ఇదంతా కూడా ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి చేస్తాం..చేసిన వాటికి ఫోటోలు తీస్తాం..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం..మాకు లైఫ్ ఉంది,మేము బ్రతుకుతున్నాం చూడండోహో అంటూ చాటింపు వేసుకుంటాం..మన మనసుల్లో మన భావాలతో పాటుగా వాటికొచ్చే రియాక్షన్స్ అన్నీ కూడా మిక్స్డ్ రియాక్షన్స్..ఏదో ఒకటి చేస్తున్నా కూడా మనల్ని మనం నిందించుకుంటాం : You use this extremity as only another occasion for self-improvement, another pointless act of self-realization. But isn’t it the case that everybody finds their capabilities returning to them, even if it’s only the capacity to mourn what we have lost? We had delegated so much.
ఏప్రిల్ చివర్లో Ottessa Moshfegh రాసిన మరో వ్యాసాన్ని ప్రస్తావించారు :

I read this line about love: “Without it, life is just ‘doing time.’” I don’t think she intended by this only romantic love, or parental love, or familial love or really any kind of love in particular. At least, I read it in the Platonic sense: Love with a capital L, an ideal form and essential part of the universe—like “Beauty” or the color red—from which all particular examples on earth take their nature. Without this element present, in some form, somewhere in our lives, there really is only time, and there will always be too much of it. Busyness will not disguise its lack. Even if you’re working from home every moment God gives—even if you don’t have a minute to spare—still all of that time, without love, will feel empty and endless.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

Ever since I was a child my only thought or insight into apocalypse, disaster or war has been that I myself have no “survival instinct,” nor any strong desire to survive, especially if what lies on the other side of survival is just me.

I always tell my students: “A style is a means of insisting on something.” A line of Sontag’s.

I have to remind myself to remember this: their style is all they have. They are insisting on their existence in a vacuum.

I can be very dumb about things that seem to others straightforward and obvious.

When in the presence of a child, get on the floor. Or else bend down until your own and the child’s eyes meet. Mothering is an art. Housekeeping is an art. Gardening is an art. Baking is an art. Those of us who have no natural gifts in these areas—or perhaps no interest—too easily dismiss them. Making small talk is an art, and never to be despised just because you yourself dread making it. Knowing all your neighbors’ names is an art. Sending cards at holidays, to everybody you know—this, too, is an art. But above all these: playing. The tales of adult women who still know how to play with children—these should be honored. Collected in a history book, like Vasari’s Lives of the Artists. Instead, their grandchildren remember.

Privilege and suffering have a lot in common. They both manifest as bubbles, containing a person and distorting their vision. But it is possible to penetrate the bubble of privilege and even pop it—whereas the suffering bubble is impermeable.

Monday, August 10, 2020

The Bus Driver Who Wanted To Be God & Other Stories - Etgar Keret

ఇజ్రాయెల్ రచయిత ఎట్గర్ కెరెట్ 'Fly Already' కథలు తొలిసారిగా చదివినప్పుడే ఆయన శైలితో ప్రేమలో పడిపోయాను..If you can't explain it simply, you don't understand it well enough అని ఐన్స్టీన్ అన్నట్లు పాఠకులను పదగాంభీర్యాలతో కూడిన అనవసరమైన విశేషణాలతో,విశ్లేషణలతో మరో గత్యంతరంలేక పేజీలు తిప్పించి విసిగించే కథలూ,నవలలూ రాసే రచయితల ఆలోచనల్లో స్పష్టత లోపించిందని అర్ధం..ఎంతటి లోతైన,గాఢమైన విషయమైనా సూటిగా సుత్తిలేకుండా చెప్పడంలో ఇటాలో కాల్వినో తరువాత కెరెట్ పేరే గుర్తొస్తుంది నాకు..ఇక ఈ టైటిల్ కూడా ఆయన పుస్తకం చదవాలనిపించడానికి మరొక కారణం..ఈ సంపుటిలో ప్రత్యేకత ఏమిటంటే ఒక్క కెరెట్ శైలి క్రాఫ్టింగ్ తప్ప ఇందులో కథలకు ఒకదానికొకటి పొంతన ఉండదు..ఒక్కో కథనూ చెప్పడానికి ఒక్కో వైవిధ్యమైన థీమ్ ను ఎంచుకున్నారు కెరెట్..ఈ క్రమంలో ఒక ఆర్టిస్టుగా తన కుంచెకు అద్దగలిగిన ఒక్క వర్ణాన్ని కూడా వదిలిపెట్టలేదంటే అతిశయోక్తి కాదేమో.
Image Courtesy Google
అలాగని ఇందులో అన్ని కథలూ బావున్నాయని చెప్పలేను..మొదటి కథ 'The Bus Driver Who Wanted To Be God' కథ సాటి మనుషులపట్ల కరుణ ఆవశ్యకతను గుర్తుచేసే కథ..తీవ్రమైన భావోద్వేగాలు సైతం కెరెట్ కలంలో సరళత్వాన్ని ఆపాదించుకుంటాయి..బిగ్గరగా అరిచి చెప్పవలసిన విషయాన్ని సైతం సున్నితంగా దగ్గరకు లాక్కుని చెవిలో గుసగుసలాడినట్లు చెప్పగల కెరెట్ నైపుణ్యం ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక మరో కథ 'Goodman' మనుషుల్లో నైతికతను ప్రశ్నించే కథ..ఒక సెనేటర్ ను హత్య చేసిన నేరంలో శిక్షపడబోతున్న గుడ్ మాన్ అనే పేరు గల వ్యక్తి గురించి అతడి స్నేహితుడు మనకు కథను చెప్తుంటాడు..ఈ క్రమంలో దోషిని నిందిస్తూ అతడి స్నేహితులు,సన్నిహితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రాస్తారు కెరెట్..తీరా చూస్తే దోషిని తిడుతున్నవాళ్ళెవరూ ధర్మపరులు కాదు..“You never know what goes on in people’s heads.” అనే వాక్యం మెటఫోర్ లా మళ్ళీ మళ్ళీ వారి మధ్య జరిగే సంభాషణల్లో దొర్లుతూ అందరూ నీతిమంతులు కారన్న విషయాన్ని అంతర్లీనంగా ప్రతిధ్వనిస్తుంది..ఈ కథ ముగిసే సమయానికి అసలు నేరం అంటే ఏమిటి ? నైతికత అంటే ఏమిటి ? దోషి ఎవరు ? ఎటువంటి దోషాలు శిక్షార్హం ? అనే పలు ప్రశ్నలు పాఠకుల మనస్సులో ఉత్పన్నమవుతాయి..చివరకు మన నైతికతనూ,మంచితనాన్నీ మనమే ప్రశ్నించుకుని,ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునే అవసరం తీసుకొస్తారు కెరెట్..ఒక వేలు ఎదుటివాళ్ళవైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయనే నానుడికి ఈ కథ మంచి ఉదాహరణ.

మరో కథ, A Souvenir of Hell సర్రియలిస్టిక్ చిత్రంగా కనిపిస్తుంది..ఇందులో ఒక నరక ద్వారం వెలుపల ఉండే సాధారణ ప్రపంచంలోకి యాత్రికులు వస్తుంటారు,వీరు మిలిటరీ ప్రభుత్వానికి ప్రతినిధుల్లా అనిపిస్తారు..అలా ఒక దుకాణంలో వస్తువులు కొనుగోలు చేద్దామని వచ్చిన ఒక యాత్రికునితో దుకాణదారుని కూతురు ప్రేమలో పడుతుంది..ఆమె స్వప్నాలు రెండు ప్రపంచాల మధ్య రాకపోకలకు వీలులేకుండా మూసుకుపోయిన నరకద్వారంతో పాటుగా సమాధైపోగా,ఆమె తరువాతి తరాలకు తన అనుభవాలను కథలు కథలుగా చెప్తుంటుంది అంటూ కథను ముగిస్తారు..'ఉజ్బెకిస్థాన్ గ్రామానికి వందేళ్ళకొకసారి సెలవుమీద వచ్చిన సైనికుల్లా' అనే వాక్యం ఈ కథను ఇజ్రాయెల్ చరిత్రకు ముడిపెట్టి చూడమంటుంది..హోలోకాస్ట్ లో మరణించిన వాళ్ళందరూ నరకంలో నుండి భూమ్మీదకు వచ్చి వందేళ్ళకు సరిపడా తలుచుకునే చరిత్రగా మిగిలిపోవడం ఈ కథలో కీలకాంశం..ఇందులో Cocked and Locked,Shoes,Rabin లాంటి కొన్ని కథలు అర్ధం కావాలంటే ఇజ్రాయెల్-పాలస్తీనా వైషమ్యాల గురించీ,ఇజ్రాయెల్ చరిత్ర గురించీ అవగాహన ఉండాలి..ఈ కథల్లో ఇజ్రాయెల్ సంస్కృతిని ప్రతిబింబించే లిరా,షెకెల్ వంటి అనేక హీబ్రూ పదాలు దొర్లడం చూస్తాం..కాగా ఇందులో కెరెట్ స్వస్థలమైన Tel Aviv బ్యాక్ డ్రాప్ లో రాసిన కొన్ని కథలు కూడా ఉన్నాయి..Katzenstein అనే మరో కథ కూడా మూలం వేరైనప్పటికీ మరణానంతరం స్వర్గ/నరకాలను చేరడం గురించిన కథే.

They come in, ask how much, gift wrap/no gift wrap, and that’s that. They’re all kind of very short-term guests, spending the day and then going back to Hell. And you never see the same one twice, cause they only come out every one hundred years. That’s just how it is. Those are the rules. Like in the army when you only get one weekend off out of three, or on guard duty, when you’re only allowed to sit down for five minutes every hour on the hour. It’s the same with the people in Hell: one day off every hundred years. If there ever was an  explanation, nobody remembers it anymore. By now it’s more a matter of maintaining the status quo.

Korbi's Girl అనే కథలో ఈ ఓపెనింగ్ లైన్స్ అచ్చంగా కెరెట్ మార్కు హాస్యానికీ,వ్యంగ్యానికీ మచ్చుతునకలు.

Korbi was a punk like all punks. The kind that you don’t know whether they’re uglier or stupider. And like all punks he had a beautiful girlfriend, who no one could understand what she was doing with him.

Shoes అనే మరో కథ హోలోకాస్ట్ నేపథ్యంలో కూర్చిన కథ..హోలోకాస్ట్ మెమోరియల్ డే సందర్భంగా ఒక హోలోకాస్ట్ సర్వైవర్ అయిన వృద్ధుని లెక్చర్ విన్న ఒక చిన్నపిల్లవాడు ఇంటికి వచ్చాకా తల్లితండ్రులు కొన్న జర్మన్ మేడ్ షూస్ ని చూసినప్పుడు అతడి మనస్థితిని విశ్లేషించే కథ..ఈ కథలో కెరెట్ తన బాల్య జ్ఞాపకాల్ని మనతో పంచుకున్నారా అనిపిస్తుంది..బాల్యానికి సంబంధించిన మరో కథ 'Breaking the Pig' పసితనపు అమాయకత్వాన్ని అమాంతం పాఠకుల అనుభవంలోకి తీసుకొస్తుంది.

Because when he went with his parents to Germany fifty years ago everything looked nice, but it ended in hell. People have short memories, he said, especially when bad things are concerned. People tend to forget, he said, but you won’t forget. Every time you see a German, you’ll remember what I told you. Every time you see German products, be it television (since most televisions here are made by German manufacturers) or anything else, you’ll always remember that underneath the elegant wrapping are hidden parts and tubes made of bones and skin and flesh of dead Jews.

Missing Kissinger కథ ప్రేమను నిరూపించుకోవాల్సిన దుస్థితిని గురించిన కథ..నిజానికి భావోద్వేగాలకు నిరూపణలు అవసరం లేదు..అవి అనుభవంలో తెలుసుకోవాల్సిన విషయాలు మాత్రమే..అనుమానాలూ,అపార్ధాలూ ఉన్న చోట ప్రేమకు ఆస్కారం లేదు అని నిరూపిస్తూ,There are two kinds of people, the ones who like sleeping next to the wall, and the ones who like sleeping next to the people who push them off the bed. అంటారు కెరెట్.

ఈ కథల్లో Pipes నాకు చాలా నచ్చిన మరో కథ..ప్రతి మనిషీ ప్రత్యేకం,కానీ మన సమాజంలో వస్తువుల్ని వర్గీకరించినట్లే మనుషుల్ని కూడా విభజించి విడదీస్తారు..సామజిక పరమైన వర్గీకరణ సంగతి అటుంచితే వారి జన్యుపరమైన లోపాలకు,మనోవైకల్యాలకు సంబంధించిన నైపుణ్యాలను బట్టి కూడా జడ్జి చేసే సమాజంపై వ్యంగ్యోక్తిగా రాసిన కథ ఇది..ప్రపంచాన్ని ఒక్కొక్కరూ ఒక్కో దృష్టితో చూస్తారు..సగం నీళ్ళతో ఉన్న గ్లాసుని చూసి సగం ఖాళీగా ఉందని అనేవారు కొందరైతే,సగం నిండి ఉందని అనేవారు మరికొందరు..ఇక్కడ ఎవరి దృష్టికోణం సరైనది ? అనే ప్రశ్న వేస్తుందీ కథ.

My boss was an engineer with a diploma from a top technical college. A brilliant guy. If you showed him a picture of a kid without ears or something like that, he’d figure it out in no time.

When I saw it all in one piece, waiting for me, I remembered my social studies teacher who said once that the first human being to use a club wasn’t the strongest person in his tribe or the smartest. It’s just that the others didn’t need a club, while he did. He needed a club more than anyone, to survive and to make up for being weak. I don’t think there was another human being in the whole world who wanted to disappear more than I did, and that’s why it was me who invented the pipe. Me, and not that brilliant engineer with his technical college degree who runs the factory.

I always used to think that Heaven is a place for people who’ve spent their whole life being good, but it isn’t. God is too merciful and kind to make a decision like that. Heaven is simply a place for people who were genuinely unable to be happy on earth. They told me here that people who kill themselves return to live their life all over again, because the fact that they didn’t like it the first time doesn’t mean they won’t fit in the second time. But the ones who really don’t fit in the world wind up here. They each have their own way of getting to Heaven.

ఇలా చెప్పుకుంటూపోతే ఇందులో కథలన్నీ పాఠకుల ఊహాత్మకతకు రెక్కలిచ్చేవే..కథలన్నీ చిన్న చిన్నవీ,సరళమైనవీ అయినప్పటికీ కథల్లో మూలం సంక్లిష్టంగా ఉండటం వల్ల ఈ కథల్ని  ఒక్క సిట్టింగ్ లో చదవడం సాధ్యపడదు..ఇందులో ఒకే ఒక్క నవలిక Kneller's Happy Campers ఎందుకంత పాపులర్ అయ్యిందో నాకు అర్ధం కాలేదు..నాలుగైదు చాప్టర్లు చదివేసరికి అందులో ఉపయోగించిన భాష నాన్ స్టాప్ ర్యాంటింగ్ గా చాలా విసుగు తెప్పించింది..ఆ ఒక్కటీ మరోసారి ఓపిగ్గా చదవాలి.

చివరి కథ 'One last story and that's it' ఆర్టిస్టుకు,వాస్తవికతకు మధ్య సంబంధాన్ని తర్కిస్తూ కళ ప్రాథాన్యతను సున్నితంగా గుర్తుచేసే కథ.
It’s always the nice ones who give you the biggest hassle. With the obnoxious ones he never had any problem. You get there, remove the soul, undo the Velcro, pull out the talent, and that’s that.

Rabin కథ నుండి :
Everything in life is just luck. Even the original Rabin—after everyone sang the Hymn to Peace at the big rally in the Square, if instead of going down those stairs he’d hung around a little longer, he’d still be alive. And they would have shot Peres instead.

Plague of the Firstborn కథ నుండి :
“Even as a very young man, I knew that my family is like a plant. Uproot it, and it will wilt. Pluck away at it, and it will die. But leave it to thrive in the soil, untouched, and it will weather both gods and winds. It is born with the soil, and it will live so long as the soil shall live."