Tuesday, July 14, 2020

The Storyteller Essays - Walter Benjamin

న్యూయార్క్ రివ్యూ బుక్స్ క్లాసిక్స్ జర్మన్ రచయిత,తత్వవేత్త వాల్టర్ బెంజమిన్ రాసిన 'ది స్టోరీ టెల్లర్ ఎస్సేస్' కి కొత్త అనువాదాన్ని ప్రచురించింది..కొన్ని పుస్తకాలు చదవడం ఒక తరంలో సాంస్కృతిక వైశాల్యపు పరిథుల్ని పూర్తి స్థాయిలో అవలోకనం చెయ్యడంతో సమానం..అందుచేత ఈ నూట ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం చదవడానికి మధ్యలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ తో కలిపి నాకు ఒక వారం పట్టింది..ఇందులో వ్యాసాలన్నీ ప్రధానంగా స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ ఎందుకు అంతరించిపోతోంది ? స్టోరీ టెల్లింగ్ పై ప్రభావం చూపే అంశాలేమిటి ? రచయితల్లో సృజనాత్మకత లోపించడానికి,భావదారిద్య్రమునకు కారణాలేమిటి ? వంటి ప్రశ్నల చుట్టూ తిరుగుతాయి.
Image Courtesy Google
చెన్నై లో అన్నా సెంటినరీ లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేకించి స్టోరీ టెల్లింగ్ సెషన్స్ జరిగేవి..అక్కడ పిల్లలకు తీరుబాటు వేళల్లో కథలు చెప్పగలిగిన కళ తెలిసినవాళ్ళు వచ్చి కథలు చెప్తుండేవారు..కథకులు చక్కని హావభావాలతో ఎంతో ఉత్సాహంగా పిల్లలకు కథలు చెప్పడం నావరకూ నాకొక అద్భుతంగా తోచేది..అవకాశం ఉండేది కాదుగానీ రోజంతా అక్కడ కూర్చుని వాళ్ళ కథలు వినాలనిపించేది..జీవంలేని పుస్తకంలోని పేజీలతో ఏకపక్షమైన మౌన సంభాషణ కంటే ఓరల్ స్టోరీ టెల్లింగ్ లో అదనపు మానవీయ కోణం విస్మరించలేనిది.. ఒకానొకప్పుడు కథలు ఒక నోటి నుండి మరొక నోటికి చేరుతూ ఒక తరంనుండి మరో తరానికి సాంస్కృతిక వారసత్వం రూపంలో అందించబడేవి..ఈ ప్రక్రియలో శబ్దం,ఉఛ్ఛారణతో పాటు చేతులు,ముఖ కవళికల ద్వారా కథను అభినయిస్తూ చెప్పడంలో చెప్పేవారికీ వినేవారికి మధ్య ఒక సత్సంబంధం ఏర్పడుతుంది..తరువాత కథాకాలక్షేపాలూ,హరికథలూ,బుర్ర కథల్లాంటి కొన్ని పద్ధతుల ద్వారా ఇది కొనసాగినప్పటికీ పుస్తకాలు,ప్రచురణలు (టెక్స్ట్) వెలుగుచూశాక ఓరల్ స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ దాదాపు అంతరించిపోయిందని చెప్పవచ్చు.
Thus it is the voice of a born storyteller we hear opposing the novelist when we read: “Nor will I speak of the fact that I consider it useful . . . to liberate the epic from the book, useful above all with regard to language. The book is the death of real language. The most vital creative forces of language escape the epic poet who only writes.”
On the other hand, with the dominance of the middle class—for which the press is one of the most essential instruments in the era of fully fledged capitalism—a form of communication comes into play, which, however ancient its origins, had never before influenced the epic form in a decisive way.
మరి కథలు చెప్పగలిగే సామర్థ్యం ఎవరికుంటుంది ! తమ జీవిత కాలంలో ఎప్పుడూ 'బోర్ డమ్' ఎరుగని వాళ్ళెవరూ కథలు చెప్పలేరంటారు వాల్టర్..మరి ఇప్పుడు కథలకు తీవ్రమైన కొరత రావడానికి కారణం మన జీవితాల్లో ఈ బోర్డమ్ కు స్థానం లేకపోవడమేనేమో..ఒకప్పుడు పొలాల్లో పని చేస్తూనో,మగ్గం నేస్తూనో,నీళ్ళు తోడుతూనో,చెరువు గట్టున బట్టలుతుకుతూనో,వుడ్ వర్క్ చేస్తూనో,హ్యాండీ క్రాఫ్ట్స్ తయారు చేస్తూనో ఇలా అనేక శారీరకమైన పనులు చేస్తూ అలసటలో ఆటవిడుపుగా ఒకరికొకరు కథలు చెప్పుకునేవారు..అదే యాత్రికులు ఎదురైతే సుదూరప్రాంతాల సంగతులను అతడి చుట్టూ చేరి అమితాశ్చర్యంతో వినేవారు..ఇప్పుడు గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం మొత్తానికి సంబంధించిన సమాచారం నట్టింట్లో దొరికేస్తోంది..ఎంత 'No man is an Island' అనుకున్నా ఈరోజుల్లో డబ్బుంటే చాలు సాటి మనిషితో అవసరంలేని జీవన శైలి అమలులోకి వచ్చింది..మనిషిలో భావోద్వేగాలను ఒక్క కుదుపు కుదిపి లేపే మృత్యువు,వ్యాధులు వంటివి ఒక తరానికి దైనందిన జీవితంలో అత్యంత సహజమైనవి..ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ మరణాన్ని చూడని గదులు చాలా అరుదంటారు వాల్టర్..కానీ ఈరోజుల్లో మనుషులు మృత్యువు ఛాయలు పడని గదుల్లో నివసిస్తున్నారు..తుదిదశకు చేరిన తరువాత శానిటోరియంలోనో,హాస్పిటల్లోనో విడిచే శ్వాసలే ఎక్కువ..అశాశ్వతాన్నీ,వికారాన్నీ,అస్థిరత్వాన్నీ,ఏకాంతాన్నీ ఆమడ దూరంలో పెట్టి నలుగురి మెప్పు కోసం,నలుగురి మధ్యలో ఊపిరాడని బిజీ జీవితాలతో భోగలాలసత్వానికి అలవాటుపడిన ఆధునిక తరంలో కథలు సృష్టించడానికి అవసరమైన సృజనాత్మకత అడుగంటా అంతరించిపోవడానికి వేరే కారణాలు అక్కర్లేదు..జీవితాన్ని ఏ రంగుటద్దాల ఆసరా లేకుండా దాని పూర్తి స్వాభావికమైన స్వరూపంలో చూసే శక్తి ఈ తరానికి లేదు..ఇది నిజానికి అన్నిటికంటే అతి పెద్ద మానవ వైఫల్యం.
Let us admit it: our poverty of experience is not only an impoverishment of private experience but of human experience as a whole. It is, therefore, a new kind of barbarism.
Boredom is the dream bird that broods the egg of experience. A rustling in the leaves is enough to scare it away. Its nests—those activities intimately connected to boredom—have already died out in the cities and are declining in the countryside as well. With them, the gift of listening is being lost, and the community of listeners is disappearing.
“No one dies so poor that he does not leave something behind,” అంటారు Pascal..కటిక పేద కూడా చివరకు ఈ భూమ్మీద తనవైన కొన్ని జ్ఞాపకాలైనా మిగిల్చి వెళ్తాడు..కానీ ఆ జ్ఞాపకాలకు వారసత్వం దొరకడమే కష్టం..ఇలాంటి వారసత్వాన్ని నవలా రచయిత అందిపుచ్చుకుంటాడు..వివేకశూన్యత (the epic side of truth, that is, wisdom ) వల్ల కథా సంస్కృతి ఒకవైపు తెరమరుగైపోతున్నప్పటికీ అదృష్టవశాత్తూ నవలా నిర్మాణంలో కీలకమైన బిల్డంగ్స్రోమన్ ప్రక్రియ మాత్రం ఇంకా అంతరించిపోలేదు..జననమరణాల మధ్య మనిషి తాత్విక,ఆధ్యాత్మిక ప్రయాణానికి దారులు ఏర్పరుస్తూ మనిషి వ్యక్తిగతాభివృద్ధిపై ప్రభావాన్ని చూపే ఆర్ధిక,సామాజిక,రాజకీయ,నైతిక పరమైన అంశాలు ఇప్పటికీ కంచుకోటలా నవలాప్రక్రియను ముందుకు నడిపిస్తున్నాయంటారు వాల్టర్.

ఇందులో నవలా ప్రక్రియతో పాటు జాతీయాల (సామెతలు) గురించి రాసిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి..మనుషులకు జీవితంలో నేర్చుకునే పాఠాల ద్వారా ఎదురైన వ్యక్తిగతానుభావాలను ప్రక్షాళన చేసుకునే అవకాశం చాలా తక్కువ..కానీ సామెతలు ఆ అనుభవాలకు స్పష్టమైన నిర్వచనాలనిస్తాయి.
Proverbs turn knowledge gained from experience into a wave in the endless, breathing chain of life lessons that come to us from eternity.
ఇందులో ఎపిక్ (పురాణము,గాథ,చరిత్ర,కథ) గురించి రాస్తూ నవలాకారుడికీ,కవికీ ఉన్న భేదాన్ని వివరించిన సందర్భం ఒకటుంది,
నిజానికి సముద్రాన్ని మించిన ఎపిక్ లేదు..అనంతమైన సముద్రానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు..ఉదాహరణకు కొందరు సముద్రతీరంలో విశ్రాంతి తీసుకుంటారు,అలలఘోషను శ్రద్ధగా వింటారు,అలలతో పాటుగా తీరానికి కొట్టుకొచ్చిన గవ్వలు ఏరుకుంటారు..ఇది కవి చేసే పని..మరికొందరు అనేక కారణాల వల్ల,లేక ఏ కారణమూ లేకుండానే సముద్రయానం చేస్తారు..కనుచూపుమేరలో తీరం కనిపించని చోట సముద్రం మధ్యలో కేవలం సముద్రతరంగాలు,ఆకాశం,నక్షత్రాలు మాత్రమే కనిపించే చోట్లకు ప్రయాణిస్తారు..ఇది నవలాకారుడు చేసే పని..ఈ ప్రక్రియలో అతడు పూర్తి ఒంటరి..మౌని.
కథలు అంతరించిపోవడానికి వార్తాపత్రికలు,మీడియా చేసే చేటు కూడా విస్మరించలేనిది..వాల్టర్ బెంజమిన్ నౌకా ప్రయాణంలో ఎదురైన ఒక స్టోరీ టెల్లర్ కెప్టెన్ O..ఆయనెప్పుడూ వార్తాపత్రిక చదవగా చూడలేదంటారు వాల్టర్..అదేమని అడిగితే వార్తా పత్రిక చదవడం వల్ల నువ్వు ఏదీ నేర్చుకునే అవకాశం లేదంటారు కెప్టెన్ O..మితిమీరిన వివరణలు కథకు బలాన్నివ్వవు సరికదా కథలో చెప్పదల్చుకున్న అంశాన్ని క్షీణింపజేస్తాయి..ఈ క్రమంలో వివరణలకు దూరంగా ఉండే కథల ఆవశ్యకతను గురించి రాస్తూ హెరోడోటస్ 'హిస్టరీస్' లో కథను ఇందులో పలుమార్లు ప్రస్తావించారు.
“They always want to explain everything to you.” Indeed: isn’t half the art of journalism keeping your reports free of explanation? And didn’t the ancients set an example for us by presenting events dry, so to speak, drained of all psychological motivation and any opinion whatsoever? In any case, one has to admit that the captain kept his own stories free of any superfluous explanations, and it seemed to me that they lost nothing as a result.
కథలకు స్వస్థత చేకూర్చే శక్తులున్నాయని రుజువు చేసే క్రమంలో జర్మన్ లో పురాతనమైన స్టోరీ టెల్లింగ్ సంస్కృతి అయిన Merseburg incantations ను ప్రస్తావించారు..ఉదాహరణకు మెర్స్బర్గ్ ఛార్మ్స్ లో నార్స్ మైథాలజీలో పాగన్స్ (వైకింగ్స్ etc) యొక్క దేవుడు ఓడిన్ మంత్రాలను కేవలం ప్రస్తావించి ఊరుకోరు..అతడు ఆ మంత్రాలను ఎటువంటి సందర్భంలో,ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో సహేతుకమైన వివరణలు కూడా ఇస్తారు..ఇది ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట తన బాధను వివరించడం లాంటిదేనంటూ దానిని స్వస్థతకు మొదటి అడుగుగా అభివర్ణిస్తారు వాల్టర్.

మరో వ్యాసంలో నవలలు చదవడం గురించి రాస్తూ అన్ని పుస్తకాలనూ ఒకే విధంగా చదవకూడదంటారు..
నవలల్ని ఎంపతీ తో చదవకూడదు,వాటిని ఆవురావురుమంటున్న  ఆకలితో తినేసి జీర్ణం చేసేసుకోవాలి..హీరో స్థానంలో పాఠకుడు తనను తాను ఊహించుకోనక్కర్లేదు. రుచీపచీలేని పచ్చిగా ఉన్న ఆహార పదార్ధాల్ని తిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం..నవల అటువంటి మ్రింగుడు పడని పచ్చి వాస్తవాలకు అనేక స్పైసెస్ జోడించి దానిని తినడానికి అనువుగా మారుస్తుంది.
ఫ్లాబర్ట్ తన రచనల్లో రిథమిక్  పర్ఫెక్షన్ ని పరీక్షించుకోడానికి తన వాక్యాలను తానే పైకి బిగ్గరగా చదువుకునేవారట..అందుకే ఆయన వాక్యాలు ఒకదానికొకటి కట్టుదిట్టమైన ఇటుకలతో కట్టిన గోడలా ఉంటాయంటారు..
Nothing more was needed to establish the cult of “construction” with its echoes of sonorous “prosody,” all very much to the advantage of ambitious impotence. But if the novel is a structure, it is less like one designed by an architect than like logs stacked in the fireplace by the maid. It is not meant to be durable but to burn brightly.
ఈ పుస్తకంలో అడుగంటిపోతున్న మానవీయ అనుభవాలను గురించిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది..అదే Paul Scheerbart 'గ్లాస్ ఉటోపియా'..“Every object I want to own becomes opaque to me.” అంటారు André Gide..ఒక సగటు మనిషి ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లోకి అడుగుపెట్టినప్పుడు అక్కడకు వచ్చిన అపరిచిత వ్యక్తికి అక్కడ "ఇక్కడ నీకేమీ పని లేదు" అని చెప్పకనే చెపుతున్న నలిగిన సోఫా కవర్లు,దుమ్ము పేరుకున్న కిటికీ ఊచలు,సగం సగం తాగి పెట్టిన కాఫీ కప్పూ,సగం సగం చదువుతూ పేజీ మడత పెట్టిన సగం తెరిచిన పుస్తకంలాంటివన్నీ స్వాగతం పలుకుతాయి..అటువంటి ఇంట్లో యజమాని దైనందిన జీవితపు ముద్రలు పడని స్థానమంటూ ఉండదు..అక్కడ నూతనత్వానికి అవకాశం చాలా తక్కువ..మానవ జీవితంలో సింహభాగం మూసుకుపోయిన నాలుగ్గోడల మధ్యే గడిచిపోతుంది..ఈ కారణంగా అత్యంత విలువైన మానవీయ అనుభవాన్నికోల్పోతున్నామని జర్మన్ రచయితా,ఆర్కిటెక్ట్ అయిన Paul Scheerbart అభిప్రాయపడతారు..ఈ మొనాటనీ ని ఎదుర్కోడానికి ఆయన 'గ్లాస్ ఉటోపియా' ను ప్రతిపాదించారు..దాని ప్రకారం ఇటుకలతో కట్టిన గోడలన్నీ గ్లాస్ తో పునఃనిర్మించాలని ఆయన సూచించారు..సూర్యోదయాలు,సూర్యాస్తమయాలూ,ఆకాశంలో నక్షత్రాలతో సహా ఇటువంటి ఇళ్లు మానవీయ అనుభవానికి మనల్ని దగ్గర చేస్తాయని ఆయన భావన..ఆచరణయోగ్యమా కదా అన్న విషయం ప్రక్కన పెడితే ఈ సూచన ఆసక్తికరంగా అనిపించింది.
Brecht had a fine phrase that will help us get away, far away: “Erase all traces!” is the refrain in the first poem of “A Reader for Those Who Live in Cities."
కథలకు ముడిసరుకు అనుభవం..కానీ ఇన్ని రంగులున్న ప్రపంచంలో ఏ తరంలోనైనా ఈ అనుభవలేమికి కారణాలేమిటి అన్న ఆలోచన కలిగింది..నిరంతరాన్వేషి అయిన మనిషి నూతన అనుభవాలకు దూరంగా జరుగుతున్నాడా ? బహుశా కాదేమో..అతడు అలిసిపోయి ఉంటాడు..రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన అంతులేని విషాదం,క్రూరత్వం,దానికి తోడు సాంస్కృతికపరమైన వత్తిడులు,నిరంతరం ఊపిరాడకుండా ప్రపంచం నలుమూలల్నుంచీ వచ్చి ముంచెత్తుతున్న సమాచారం వీటన్నిటి నడుమా నేటి తరం మనిషి కొత్త అనుభవాలు మిగిల్చే అడ్రినలిన్ రష్ కంటే శాశ్వతమైన శాంతిని  కోరుకుంటున్నాడు..కానీ శాంతి ఉన్న చోట సృజనాత్మతకు,ఊహాత్మకతకూ స్థానం లేదు..ఇక కథలు పుట్టే అవకాశం అస్సలే లేదు..
రచనలు చెయ్యడంలో భావ దారిద్య్రం గురించి ప్రస్తావిస్తూ,నేటి తరం వారు అజ్ఞానులూ,అనుభవశూన్యులూ కాదని అభిప్రాయపడతారు వాల్టర్..నిజానికి మనుషులు నూతనమైన అనుభవాల్ని ఆశిస్తున్నారా ? అంటే లేదంటారాయన..నేటి తరం రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనుషుల్నీ,సంస్కృతినీ,చరిత్రనూ అన్నిటినీ జీర్ణించుకుని చివరకు వివిధ సాంస్కృతిక పరమైన వత్తిడుల క్రింద ఊపిరాడకుండా నలిగిపోతుందంటారు..తత్పరిణామంగా వారు నూతనమైన అనుభవాలనుంచి దూరంగా జరుగుతున్నారనేది వాల్టర్ వాదన..కథా సంస్కృతి అంతరించిపోవడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్పుకొస్తారాయన.

No one feels the sting of Scheerbart’s words more than they: “You are all so tired—and the only reason is that you do not focus all your thoughts on a very simple but very magnificent plan.”

Didn’t everyone notice at the end of the war that men returned from the battlefield completely mute, not richer in experiences they could share, but poorer?

ఈ వ్యాసాల చివర్లో Johann Peter Hebel,Ernst Bloch,Paul Valéry,Georg Lukács,Herodotus లాంటి వారి కొన్ని కథలూ,ఆ కథల్లో శైలిని గూర్చిన ఆసక్తికరమైన పలు విశ్లేషణాలు ఉన్నాయి..ఈ పుస్తకంలో విసిగించిన విషయమేంటంటే ఎడిటింగ్ బాగాలేదు..ఈ పుస్తకం NYRB వారి ప్రచురణ అంటే కాస్త ఆశ్చర్యం వేసింది..ఎడిటింగ్ విషయంలో ఇంతటి దీనావస్థ వారి పుస్తకాల్లో మునుపెప్పుడూ చూసింది లేదు..ఇందులో గ్రీక్ స్టోరీ టెల్లర్ హేరోడోటస్ కథ నాలుగు సార్లు రిపీట్ అవ్వడం,చెప్పిన అంశాలే మళ్ళీ మళ్ళీ చెప్పడంలాంటివి ఎడిటర్ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు,
This new form of communication is information.
Leskov was a master at this (think of stories like “The Deception” or “The White Eagle".Extraordinary and miraculous events are recounted with great precision, but the psychological context is not forced on the reader. He is left the freedom to interpret the situation as he understands it, and the story thus acquires a breadth that information lacks.
Telling stories, after all, is the art of retelling those we have heard, and that is lost when stories are no longer remembered. They are being lost because no one spins or weaves any longer while listening to them. The more self-forgetful the listener, the deeper what is heard is inscribed in him. When he is caught up in the rhythm of his work, he listens to the stories in such a way that the art of telling them descends on him of its own accord. In this way, the web is woven in which the gift of storytelling is embedded. Today this web is unraveling on all sides after having been woven thousands of years ago in the domain of the oldest forms of craftsmanship.
Few lines come closer to expressing the meaning of this important story than those written by Paul Valéry in a completely different context. “The artist’s observation can achieve an almost mystical profundity,” he writes in reflections on the artist [Camille Corot]:The objects illuminated by it lose their names: light and shadows create very particular systems and problems that do not depend on any science or relate to any practice, but are given their existence and value exclusively from certain special accordances between the soul, the eye, and the hand of one born to spot them in his inner self and reproduce them.
Lovers unbearable passion : I am miserable, indeed, deprived of all my senses. As soon as I catch sight of you, Lesbia, I lose my reason and cannot utter a word; my tongue freezes; a slender flame spreads through my limbs, my ears ring and darkness covers my eyes.
All passions that can be relished and digested are necessarily mediocre ones.

Friday, June 26, 2020

The Book of Eels: Our Enduring Fascination with the Most Mysterious Creature in the Natural World Book - Patrik Svensson

"The world where everything’s explained is a world that has come to an end" అని ఈ పుస్తకంలో ఒకచోట అన్నట్లు,సమాధానాలు వెతకాల్సిన పనిలేని ప్రపంచం చాలా నిస్సారంగా ఉంటుంది..మనిషికి కుతూహలం అవసరం,సాధించడానికి కొన్ని లక్ష్యాలు అవసరం,మరి కాస్త ఛేదించాడనికి అవకాశమున్న మిస్టరీలు కూడా అవసరం.

మనిషికి జన్మతః ఉండే కుతూహలంతో సృష్టిలో ప్రతిదానికీ సమాధానాలు వెతుకుతున్నప్పటికీ ఇంకా కొన్ని సృష్టి రహస్యాలు సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి..అస్పష్టత,అశాశ్వతత్వం ఈ రెండూ స్వతః సిద్ధంగా మేథోజీవి అయిన మనిషికి కొరుకుడుపడని రెండు విపరీతాంశాలుగా మిగిలిపోయాయి..ఇటువంటి సందర్భాల్లోనే మనిషి అయిష్టంగానే అయినప్పటికీ తనకు తెలీని 'సూపర్ పవర్' ఏదో ఈ సమస్త విశ్వాన్నీ నడిపిస్తోందన్న అభిప్రాయానికొస్తాడు..ఈ నమ్మకాన్ని సమర్ధించుకునే దిశగా ఆధ్యాత్మికతకు పునాదులు పడ్డాయి..నిజానికి లాజిక్ / రీజనింగ్ ఈ రెండిటికీ అందనివన్నీ 'నమ్మకం' (Faith) ఖాతాలో వేసేసుకోవడం మనిషి అహంభావానికి కాస్త స్వాంతన చేకూరుస్తుంది.
Image Courtesy Google
స్వీడిష్ రచయితా,జర్నలిస్టు అయిన పాట్రిక్ స్వెన్సన్,జలచరాల్లో చాలా మిస్టీరియస్ జీవిగా పేరుగాంచిన ఈల్స్ గురించి రాసిన ఈ మెమోయిర్ 'The Book of Eels: Our Enduring Fascination with the Most Mysterious Creature in the Natural World Book' అటువంటి నమ్మకానికి సంబంధించిన రచన..పాట్రిక్ బాల్యం అంతా ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకుంటూ గడిచింది..చిన్నతనంలో తండ్రితో పాటుగా ఈల్స్ ను పట్టుకోడానికి వెళ్ళిన జ్ఞాపకాలను ఈ మెమోయిర్ లో మనతో పంచుకుంటారు పాట్రిక్..ఈ మెమోయిర్ ప్రకృతిపై నేటి తరానికి తప్పకుండా ఉండవలసిన అవగాహనను మరోసారి గుర్తుచేస్తూ,అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉండవని సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ సాహితీరంగంలో కొత్త అలల్ని సృష్టిస్తోంది.

అట్లాంటిక్ సముద్రంలో భాగమైన సర్గాస్సో సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది..దీనికి స్పష్టమైన భూపరిమితులు లేని కారణంగా,ఈ సముద్రం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో కనుక్కోవడం కష్టం..ఈ సముద్రం క్యూబా కూ,బహమాస్ కూ కొద్దిగా ఈశాన్యంలో,ఉత్తర అమెరికా తీరానికి కాస్త తూర్పులో నాలుగు పాయల సమాగమంగా (In the west by the life-giving Gulf Stream; in the north by its extension, the North Atlantic Drift; in the east by the Canary Current; and in the south by the North Equatorial Current) ఉందని సుమారుగా చెప్పవచ్చు..ఈ సముద్రాన్ని ఒక కలగా అభివర్ణిస్తూ,The Sargasso Sea is like a dream: you can rarely pinpoint the moment you enter or exit; all you know is that you’ve been there.అంటారు పాట్రిక్.

అరిస్టాటిల్ పరిశోధనల అనంతరం రెండువేల సంవత్సరాల తరువాత కూడా 'ఈల్' ఒక సైంటిఫిక్ ఎనిగ్మా గా,మెటాఫిజికల్ సింబల్ గా మిగిలిపోయింది..ప్రకృతి జీవాల్లో అందులోనూ జలచరాల్లో ఈ 'ఈల్' ను జీవశాస్త్రజ్ఞులు ఒక సవాలుగానే చూశారు..ఈ ఈల్ పరిణామక్రమం కూడా విచిత్రంగా ఉంటుంది..మొదట్లో పసుపుపచ్చని రంగులో ఉండే ఈల్ సరస్సులనూ,కాలువలనూ దాటుకుంటూ మహానదుల్ని,చెరువుల్నీ అన్నిటినీ అవలీలగా దాటి క్రమేపీ సిల్వర్ కలర్ లోకి మారిపోతుంది..ఈ మార్పు అది ప్రత్యుత్పత్తికి సిద్ధంగా ఉందన్న సంకేతం అన్నమాట..ఈల్ అవసరమైన సందర్భాల్లో చిత్తడినేలల్నీ,మురుగుకాలువల్నీ కూడా దాటుకుంటూ అన్ని ప్రతికూల పరిస్థితుల్నీ  ఎదుర్కొంటు కూడా ప్రయాణం చెయ్యగలదు..ఇక నీటి ప్రవాహం లేని చోట్ల కూడా పొడి నెలల్లో తేమ తో కూడిన గడ్డిని ఆసరా చేసుకుని నీటి వైపు ప్రయాణిస్తూ చాలా గంటలు పైగానే జీవించగలదు..The eel is, thus,a fish that transcends the piscine condition. Perhaps it doesn’t even realize it is a fish.అంటారు పాట్రిక్...బ్రౌనిష్ ఎల్లో కలర్ ఈల్ నిర్థిష్ట గమ్యం లేకుండా హైబర్నేషన్ కూ,ఆక్టివిటీకీ మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది..జీవితానికి ప్రత్యేకమైన లక్ష్యం అంటే సెన్స్ ఆఫ్ పర్పస్ అనేది లేకుండా తన జీవితాన్ని ఆహారాన్నీ,నివాసాన్ని వెతుక్కోడానికి మాత్రమే పరిమితం చేసుకుంటుంది..As though life was first and foremost about waiting and its meaning found in the gaps or in an abstract future that can’t be brought about by any means other than patience.అంటారు.

మానవజాతికి తమ ఉనికి అశాశ్వతమని తెలుసు కాబట్టి తమ తదనంతరం తన గుర్తుగా ఈ భూమ్మీద కొన్ని జాడలు వదిలివెళ్ళాలని తాపత్రయపడుతుంది..అందునా మానవీయ అనుభవం అంటే అది కేవలం ఒక వ్యక్తిగత అనుభవానికి పరిమితం కాదు..అది ముందు తరాలకు పదే పదే కథలుగా చెప్పుకుంటూ ఆచరించడానికీ అందించగలిగిన ఒక మొత్తం జాతికి సంబంధించిన అనుభవంగా చూడాల్సిన అవసరం ఉంది..ఈల్స్ ను పట్టడం క్లాస్ రూమ్ లోనో,లేబొరేటరీలోనో నేర్చుకుంటే అబ్బె విద్య కాదు,ఇది శతాబ్దాల తరబడి ఒక తరం మరొక తరానికి అందిస్తూ వచ్చిన సంస్కృతి..దీనిని 'ఎవరూ రాయడానికి పూనుకోని ప్రాచీన చరిత్ర'గా అభివర్ణిస్తారు పాట్రిక్. How to craft a homma or how to flay an eel, how to read the sea and the weather and how to interpret the eel’s movements under the surface: this specific and particular knowledge has been transmitted through practical work, as a shared experience transcending the ages.

ఈల్స్ ను పట్టడమనే అంతరించిపోతున్న ఫిషింగ్ సంస్కృతిని గురించి ఈ విధంగా రాస్తారు,

After all, people have a need to be part of something lasting, to feel that they are part of a line that started before them and will continue after they’re gone. They need to be part of something bigger.
Knowledge can, of course, be the bigger context. All kinds of knowledge, about crafts or work or ancient insane fishing methods. Knowledge can, in and of itself, constitute a context, and once you become a link in the chain of transmission, from one person to another, from one time to another, knowledge becomes meaningful in itself, quite apart from considerations of utility or profit. It’s at the heart of everything.

ఈల్ గురించి మనం చదువుతున్న కొద్దీ,ఈల్ జీవితానికీ,మనకు పరిచయమున్న విశ్వపు పరిమితులకూ చాలా దగ్గర పరిచయం ఉన్నట్లు అనేక సారూప్యతలు కనిపిస్తాయి..తీవ్రమైన సముద్రపు అలల తాకిడిని ఎదుర్కుంటూ ఈల్ దాని నివాస స్థానాన్ని వదిలి ఆదీ అంతం ఎరుగని సరగాస్సో సముద్రానికి ఐదువేల మైళ్ళు ప్రత్యుత్పత్తి కోసం ప్రయాణం చెయ్యడం..మళ్ళీ అక్కడ నుండి తిరుగుప్రయాణం చెయ్యడం లాంటివన్నీ  చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో 'ఈల్ మిస్టరీ',మనుషులు తమలో తాము వేసుకునే "నేనెవరు ?" ,"ఎక్కడ నుండి వచ్చాను ?" "ఎక్కడికి ప్రయాణిస్తున్నాను ?" లాంటి సంక్లిష్టమైన ప్రశ్నలకు మెటాఫోర్ లా కనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ఈల్ తో ముడిపడిన పలు సాంస్కృతికపరమైన విషయవిశేషాలున్నాయి ..1620 లో 'మే ఫ్లవర్' నార్త్ అమెరికా తీరం చేరిన సమయంలో సుమారు సగం మంది యాత్రికులు క్షయ,నిమోనియా వంటి వ్యాధుల బారిన పది మరణించగా (53/102) మిగిలిన యాభై మంది 'టిస్క్వాంటమ్' అనే బానిస సాయంతో ఈల్ ను పట్టుకుని తినడం ద్వారా కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు..అదే నార్త్ అమెరికన్ కలోనైలేజషన్ కి నాంది..ఈల్ పట్ల ఉండే ఏహ్యభావం వల్ల కావచ్చు నార్త్ అమెరికన్ కలోనలైజేషన్లో,థాంక్స్ గివింగ్ కి సంబంధించిన మిత్స్,లెజెండ్స్ లలో ఈ ఈల్ కథ మాత్రం ఎక్కడా కనిపించదు అంటారు రచయిత.

On Thanksgiving, Americans eat turkey, not eel, and other animals—buffalo, eagles, horses—have been the ones to shoulder the symbolic weight of the patriotic narrative of the United States of America. True, the colonizers continued to catch and eat eels, and by the end of the nineteenth century the eel was still an important ingredient in the American kitchen. But it gradually disappeared from dinner tables.

ఈల్ కథ మానవజాతిలో ఉన్న ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలాన్ని గురించీ,సృష్టిలో ప్రతిదానికీ ఆదీ అంతం ఎక్కడో,దానికి అర్ధ పరమార్థం ఏమిటో సత్యశోధన చేసి తెలుసుకుని తీరాలనే బలమైన ఆరాటం గురించీ చెప్తుంది..అంతేకాకుండా మానవాళి మనుగడకు 'మిస్టరీ' ఆవశ్యకతను గురించి కూడా చెప్తుంది.“Now there is much the eel can tell us about curiosity—rather more indeed than curiosity can inform us of the eel.

మానవేతర జీవులకు మానవ లక్షణాలను ఆపాదించడం సాహిత్యం,సినిమా,ఆర్ట్,ఫెయిరీ టేల్స్ లో చాలా సహజంగా చూస్తూ ఉంటాము..ఇలా 'ఆంథ్రోపోమోర్ఫైజ్' చెయ్యబడిన జీవులు మనుషుల్లాగా మాట్లాడడం,భావావేశాలు కలిగుండడం,మొరాలిటీ స్పృహ కలిగి ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం..రిలీజియన్ లో కూడా ఇది కొత్తేమీ కాదు..మన వినాయకుడు,హనుమంతుడు ఇలా అనేక ఉదాహరణలు చూపించవచ్చు..అమెరికన్ మెరైన్ బయాలజిస్ట్,రచయిత్రి అయిన రేచెల్ కార్సన్ ఈ ఈల్ ను కేవలం తన పరిశోధనలో భాగంగా చూడకుండా,తన రచనల్లో దానికి మానవీయ లక్షణాలను ఆపాదించి 'ఆంథ్రోపోమోర్ఫైజ్' చేశారట.

As soon as Rachel Carson learned how to read and write, she started making little books, illustrated pamphlets with fact-filled stories about mice, frogs, owls, and fish. It’s said she was a lonely child, with few, if any, close friends, but she never felt alone or out of place in nature. That was the world she got to know better than any other.

కార్సన్ దృష్టిలో 'ఈల్' మిస్టరీ :
She explains in a letter to her publisher: “I know many people shudder at the sight of an eel. To me (and I believe to anyone who knows its story) to see an eel is something like meeting a person who has traveled to the most remote and wonderful places of the earth; in a flash I see a vivid picture of the strange places that eel has been—places which I, being merely human, can never visit.

ఈ 'ఈల్' మిస్టరీని ఛేదించడంలో అరిస్టాటిల్ 'ది హిస్టరీ ఆఫ్ ఆనిమల్స్' నుండీ ,సిగ్మన్డ్ ఫ్రాయిడ్ ట్రిస్టే లో చేసిన పరిశోధనల నుండీ అనేక అంశాలు ప్రస్తావించారు..సిగ్మన్డ్ ఫ్రాయిడ్ ట్రిస్టే లో ఈల్ గురించి చేసిన పరిశోధనలు ఈల్ మిస్టరీని ఛేదించలేకపోయినా,ఈల్స్ తో పాటు మానవమస్తిష్కంలో కూడా కొన్ని రహస్యాలు ఎంత లోతైనవో అనే అవగాహనను ఆయనలో కలిగించాయి,తత్పరిణామంగా 'మోడరన్ సైకో ఎనాలిసిస్' జీవం పోసుకుంది.. Johannes Schmidt మొదలు రేచెల్ కార్సన్ వరకూ పలు జీవశాస్త్రజ్ఞుల పరిశోధనలను గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇందులో చదవవచ్చు..అంతే కాకుండా సాహిత్యంలో ఈ ఈల్ ను వికర్షణకు మెటాఫోర్ గా వాడడం గురించి రాస్తూ గుంటెర్ గ్రాస్ 1959లో రాసిన 'టిన్ డ్రమ్' ను ప్రస్తావిస్తారు..ఇలా చదువుతూపోతే ఈల్ తో ముడిపడి ఉన్న అనేక ఆసక్తికరమైన పిట్ట కథలు,మిత్స్,లెజెండ్స్ ఇందులో ఎన్నో..ఈ ఈల్స్ గురించి చదువుతున్నప్పుడు చిన్నప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మిరాకల్స్ గురించి చాలా ఆసక్తిగా చదివిన సందర్భాలు అనేకం గుర్తుకొచ్చాయి..కొన్నేళ్ళ క్రితం చదివిన హెలెన్ మెక్ డోనాల్డ్ 'H is for Hawk' అనే మెమోయిర్ లో తండ్రి మృతి తాలూకా దుక్ఖంలో ఉన్న హెలెన్ కథలో ఆమె పెంపుడు హాక్ గురించి చదివినప్పుడు మనిషితో ఆకారస్వరూపాల్లో ఏమాత్రం సారూప్యతలేని ఆ పక్షి స్వభావంలో మనిషి స్వభావపు సారూప్యతలు అనేకం కనిపిస్తాయి..ఆ మెమోయిర్ చదివినప్పుడు మనిషీ, ప్రకృతీ వేర్వేరు కావనే విశ్వాసం కలుగుతుంది..అదేవిధంగా ఈ పుస్తకం అంతా ముఖ్యంగా ఈల్స్ గురించే అయినప్పటికీ,ఈ  ఈల్ మిస్టరీని ఛేదించే క్రమంలో మనం ఈల్స్ గురించి కంటే మన గురించే మనం ఎక్కువ తెలుసుకుంటున్నామని అర్ధమవుతుంది..ఆంథ్రోపాలజీ,సైన్స్ లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన రచన ఇది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు,

A PERSON SEEKING THE ORIGIN OF SOMETHING IS ALSO SEEKING HIS own origin.

Perhaps there are people who simply don’t give up once they’ve set their minds to answering a question that arouses their curiosity, who forge ahead until they find what they seek, no matter how long it takes, how alone they are, or how hopeless things seem. Like a Jason aboard the Argo, seeking the Golden Fleece.

Ambition and self-realization had to yield to duty and family loyalty.

I CAN’T RECALL US EVER TALKING ABOUT ANYTHING OTHER THAN eels and how to best catch them,down there by the stream. I can’t remember us speaking at all.Maybe because we never did. Because we were in a place where the need for talking was limited, a place whose nature was best enjoyed in silence. The reflected moonlight, the hissing grass, the shadows of the trees, the monotonous rushing of the stream, and the bats like hovering asterisks above it all. You had to be quiet to make yourself part of the whole.

More specifically, the uncanny is the unique unease we experience when something we think we know or understand turns out to be something else. The familiar that suddenly becomes unfamiliar. An object, a creature, a person, who is not what we first thought. A well-crafted wax figure. A stuffed animal. A rosy-cheeked corpse.

Despite the contradictory feeling the eel arouses, up close, in its natural habitat, it gives the impression of being fairly jovial. It rarely puts on airs. It doesn’t cause a scene. It eats what its surroundings offer. It stays on the sidelines, demanding neither attention nor appreciation. The eel is different from, for instance, the salmon, which sparkles and shimmers and makes wild dashes and daring jumps. The salmon comes off as a self-absorbed, vain fish. The eel seems more content. It doesn’t make a big deal of its existence.

From this we can learn that time is unreliable company and that no matter how slowly the seconds tick by, life is over in the blink of an eye: we are born with a home and a heritage and we do everything we can to free ourselves from this fate, and maybe we even succeed, but soon enough, we realize we have no choice but to travel back to where we came from, and if we can’t get there, we’re never really finished, and there we are, in the light of our sudden epiphany, feeling like we’ve lived our whole lives at the bottom of a dark well, with no idea who we really are, and then suddenly, one day, it’s too late.

We should be glad that knowledge has its limits. This response isn’t just a defense mechanism; it’s also a way for us to understand the fact that the world is an incomprehensible place. There is something compelling about the mysterious.

Maybe eels are, quite simply, individuals, who not only have different abilities but also different means and methods of reaching their goal. Maybe they’re all aiming for the same destination, but no two journeys back to the origin are exactly the same.

The ideomotoric effect cannot explain this, of course. Maybe it depends on our subtle sensory impressions. Maybe we subconsciously read our surroundings and come to conclusions we don’t even understand ourselves. Either way, we’re making these same unconscious decisions continuously.

Perhaps, after all, it’s just chance that tells us when it is time to move a muscle. When it is time to stay, or when it is time to leave.

The underlying premise is a belief that nonliving matter can be turned into living matter, that the living and the dead are in fact dependent on one another and that some kind of life can exist in something seemingly dead. When the eel could not be understood or explained, that kind of thinking was clearly close at hand; the eel became a reflection of the deeper mystery of life’s origins.

What makes eels special, however, is that we’re still forced to rely on faith to some extent as we try to understand them. We may think we now know everything about the life and reproduction of the eel—its long journey from the Sargasso Sea, its metamorphoses, its patience, its journey back to breed and die—but even though that is all probably true and correct, much of it is nevertheless still based on assumption.

The stream represented his roots, everything familiar he always returned to. But the eels moving through its depths, occasionally revealing themselves to us, represented something else entirely. They were, if anything, a reminder of how little a person can really know, about eels or other people, about where you come from and where you’re going.

Wednesday, June 10, 2020

Blue Horses - Mary Oliver

క్వారంటైన్ సమయం నుండి విముక్తి లభించిన ఆనందంలో 'కొండా కోనల్లో లోయల్లో' అని పాడుకుంటూ నీలగిరుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలసిసొలసి హోమ్ స్వీట్ హోమ్ అనుకుంటూ ఇల్లు చేరిన తరువాత సగంలో ఉన్న పుస్తకాలు ప్రక్కన పెట్టి మరీ ఈ మేరీ ఆలివర్ 'బ్లూ హార్సెస్' చదివాను..ఉదగమండలంలో చూసిన ప్రకృతి సౌందర్యం తనివితీరక ఆ అనుభవాన్ని ఆలివర్ కవితల్లో మరోసారి పొందాలని చేసిన ప్రయత్నం ఇది..ఆమె కవితలు చదివిన మనసుతో చూస్తే ప్రకృతిలో ఎన్నెన్ని వర్ణాల్లో ! సంపాదన,సంసారం,ఇవేమీ చాలనట్లు నిరంతరం వెయ్యి గొంతుకలెత్తి వాదులాడుకునే సోషల్ మీడియా రణగొణ ధ్వనుల మధ్య భవసాగరాల్లో ఊపిరాడకుండా కొట్టుకుపోతున్న మనిషికి ఆగి తన చుట్టూ ఉన్నప్రపంచాన్ని చూడడం నేర్పిస్తారు ఆలివర్..నిశ్శబ్దంగా సెలయేటి ఒడ్డున కూర్చుని తనలోతాను ధ్యానమగ్నమై ఆ ప్రవాహపు సంగీతాన్ని వినమంటారు ..తొలకరి జల్లుల్లో మైమరచిపోయి తడవడం తప్ప మరో ముఖ్యమైన పని లేదంటారు..పూర్ణోదయాలూ,సంధ్యాసమయాల మధ్య నులివెచ్చని అపరాహ్నవేళల్ని అనుభవించడాన్ని మించిన మోక్షం,జీవిత సాక్షాత్కారం వేరే ఏముంటుందంటారు ! పచ్చని పసిరిక వాసనలు,తొలకరి చినుకుల సోయగాలు,ఎండుటాకుల గలగలలు ఆహా ఎన్నని చెప్పగలం ! ఆమె కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి స్వచ్ఛమైన ప్రతీకలుగా కనిపిస్తాయి..మనిషీ ప్రకృతీ వేర్వేరు కాదని ఘంటాపథంగా చెప్తాయి..ఇందులో ఒక కవితకు నా స్వేచ్ఛానువాదం :
Image Courtesy Google
I'm Feeling Fabulous,Possibly Too Much So.But I Love It  - Mary Oliver.

ఈ వసంతోత్సవం జరుపుకోవడానికి మాకింగ్బర్డ్ తనకు తాను సరికొత్త మార్గాలు నేర్పుకుంటోంది.
ఇక ఈ ఈదురుగాలులు మోసుకొచ్చే అర్ధంపర్ధంలేని కబుర్లు ఊహించగలవా.
ఒకప్రక్క ఆకాశం క్రొంగొత్తగా ముస్తాబవుతూ తనకు తాను చక్కని చిక్కని నీలి రంగులద్దుకుంటోంది,
ఎటొచ్చీ ఆ నీలంలో చాలా భాగం ప్రక్కనే ఉన్న కొలనులో ఒలికిపోతోంది.
నేనేమంత బరువైనదానిని కానుగానీ,ఈ క్షణంలో అయితే
మరీ దూదిపింజలా ఉన్నాను.
నువ్వంటావూ నా మనసంతా మిశ్రమభావాలతో కలగలిసిపోయి ఉందనీ.

ఒక గొంతుక,ఆహా అదిగో అది మాకింగ్బర్డ్ అంటోంది.
మరో గొంతుక,ఈ కొలను మునుపెన్నడూ ఇంత నీలంగా లేదే అంటోంది.
ఇంకో గొంతుక,ఈ క్షణంలో నేను ఈ ప్రపంచంలో భాగమై ఉన్నాను,ఇంతకంటే అద్భుతమైన ప్రపంచం మరొకటుండే అవకాశమే లేదంటోంది.
ఈలోగా ఆనందపారవశ్యంతో కూడిన ఒక ఊహ తళుక్కుమంది,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలనని.
నాకు నమ్మకమే,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలను.

మరో గొంతుక,ఇక ఈ తేలియాడే మేఘాల్లోంచి క్రిందకి దిగి వద్దామా ? అంటోంది.
ఇంకో గొంతుక సమాధానమిచ్చింది,సరేలే.
కానీ శాశ్వతంగా కాదు,కాసేపటికి వద్దాంలే.

Vishnu Sharma English Chaduvu - Viswanatha Satyanarayana


Image Courtesy Google
చాలా ఏళ్ళ క్రితం చదివిన విశ్వనాథవారి 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' నుండి సేవ్ చేసుకున్న కొన్ని వాక్యాలు ఈరోజు అనుకోకుండా కంటబడ్డాయి..ఈ బ్లాగ్ లో అనేక ఇంగ్లీష్ పుస్తకాల మధ్య కాస్త వెరైటీగా కూడా ఉంటుంది,కొంత విరామం తరువాత బ్లాగ్ పునః ప్రారంభోత్సవం ఆ వాక్యాలతో చేస్తే ఎలా ఉంటుందా అని సరదా ఆలోచన వచ్చింది..అందుకే క్వారంటైన్ సమయంలో ఫేస్బుక్ లో సమయం వృథా చేసిన పాపాన్ని ప్రక్షాళన గావించే ఉద్దేశ్యంతో,అటకెక్కిన చదువుని అటకమీద నుండి దించుతూ,పుస్తకాల బూజు దులుపుతూ అటు రివ్యూ కాని,ఇటు వ్యాసం అంతకంటే కాని ఈ నాలుగు ముక్కల అచ్చ తెలుగు పోస్టు..విశ్వనాథ వారి హాస్య ప్రియత్వం,వ్యంగ్యోక్తులు ఆద్యంతం ఆసక్తికరంగా పుస్తకాన్ని క్రిందపెట్టనివ్వకుండా చదివించాయి.

ఈ పుస్తకంలో విద్యకూ వివేకానికీ చాలా భేదం ఉందని రుజువు చేస్తూ,అందరూ అదేదో బ్రహ్మ పదార్థమనుకుని అబ్బుర పడుతూ చూసే ఇంగ్లీషు విద్య వివేకాన్నీ,విచక్షణనూ ఇవ్వదని వాదిస్తూ విశ్వనాథవారు తనదైన శైలిలో పెట్టిన అనేక వాతలు ఉంటాయి.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు..
వ్రాయగలవాడవు అలా అనకు.. కాలాన్ని అనుసరించి వ్రాయి..
కాలం నన్నెందుకనుసరించకూడదు ??  తనని అనుసరించమని కాలం నన్నెందుకు అడగాలి.. ఆ కాలం గొప్ప ఏమిటి ? అదైనా నేనైనా ఆలోచన మీద ఆధారపడి కదా నడవాలి.. "నేను కాలాన్ని గనుక ఆలోచించను" అని అది అంటే నేనేమనాలి ? నీవు కాలానివైనా సరే..నీవు ఆలోచించి ప్రవర్తించకపోతే నేను నిన్ను అనుసరించను అనాలి.. అంతే . 
కారణమునందు లేని గుణము కార్యము నందు సంక్రమించదు కదా.. 
ఆ తిక్కన్న గారిలో పేచీ పద్యాలు చాలా ఉన్నవట .. 
విష్ణు శర్మ ""మీ తాత తాత ఉండాలి కదా ఆయన చిన్నప్పుడే చచ్చిపోయినాడు..మీ తాత తండ్రిని కనక ముందే చచ్చిపోయినాడు.. తరువాత మీ తాత పుట్టాడు ఏమంటావు ?""  మీ తాత తాతే అంతే నన్నాను  
ఈ దేశం లో ప్రతిదాన్ని గురించీ చర్చలే తప్ప సారాంశమనేది ఉండదు.. 
వాడు చెప్పినదానికి నీవు సమాధానం చెప్పలేకపోతే,పూర్వ కాలం లో అవతలవాళ్ళు చెప్పింది ఒప్పుకొనేవాళ్ళు .. ఈ కాలంలోనో వాడు భేదించేందుకు అడుగుతాడు.. ఇక దేని తత్వం ఎట్లా నిర్ణయింపబడుతుంది ?  
ఈ దేశం లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళేనన్నమాట.. కనీసం నూటికి తొంభై తొమ్మండుగురికి ఇంగ్లీషు రాదు,తెలుగూ రాదని అర్థం..ఎందుచేతనంటే ఒక భాష మాతృ భాష అయితే ఆ భాష మాట్లాడేస్తూ ఉండటం వల్ల ఆ భాషంతా నోటికి వస్తుంది.. తరువాత వ్యాకరణము తెలుసుకుంటాము.. వ్యాకరణం తెలియటంతోనే నీవు పండితుడవని అర్థం.. నీవు నాలుగు వందల పుస్తకాలు చదివినా సరే నీకు వ్యాకరణం తెలియకపోతే అపండితుడవు... మీరందరూ అపండితులు.

Friday, May 22, 2020

Star - Yukio Mishima

రష్యన్ రచయితలు లాండ్స్కేప్స్ ని వర్ణించడంలో కనబరిచే నైపుణ్యం జపనీస్ రచనల్లో భావోద్వేగాల వర్ణనల్లో కనిపిస్తుంది..ముఖ్యంగా 'melancholy' వర్ణనలో వీళ్ళు సిద్ధహస్తులు..నేను చదివిన జాపనీస్ రచయితల్లో హరుకీ మురాకమీ,యసునారీ కవాబాతా,అకుతాగావా,కజువో ఇషిగురో వంటివారి రచనల్లో తరచూ ఒక విషయం గమనింపుకొచ్చేది..అదేమిటంటే ప్రతీ కథలోనూ అంతర్లీనంగా వర్ణించనలవికాని వ్యాకులత్వం,విచారం వ్యక్తమయ్యేవి..మూడేళ్ళ క్రితం వీళ్ళని చదువుతున్నప్పుడు నేను తెలుసుకున్న నీతి ఏంటంటే 'One should not read Japanese authors when one is already sad' అని..అందుకే కావాలనే కొంతకాలంగా జాపనీస్ సాహిత్యాన్ని దూరంపెడుతూ వచ్చాను..మళ్ళీ ఇప్పుడు ఋతువులు మారడంతో ఎప్పటినుండో దాటవేస్తున్న మిషిమాని చదువుదామని కోరిక కలిగింది..నిజానికి మిషిమాను చదవాలంటే 'Confessions of a Mask' నుండి మొదలుపెట్టాలి,కానీ అనుకోకుండా కంటబడిన 'స్టార్' తో ఈ రచయితను పరిచయం చేసుకున్నాను..నాకు మిషిమా శైలికీ ఇషిగురో (An Artist of the Floating World చదివాను) శైలికీ చాలా దగ్గర పోలికలు కనిపించాయి.
Image Courtesy Google
ఆస్కార్ వైల్డ్ అంటారు,"జీవితంలో రెండే రెండు ట్రాజెడీలు ఉంటాయి..ఒకటి నువ్వు కోరుకున్నవేవీ జరగకపోవడం,రెండు నువ్వు కోరుకున్నవన్నీ జరిగిపోవడం" అని..ఈ ఆధునిక తరంలో సకల సౌకర్యాల మధ్యా కూడా మనుషుల్లో పెరిగిపోతున్న అశాంతికి కారణం ఒకవిధంగా ఇదేనేమో అనిపిస్తుంది..జీవితం వడ్డించిన విస్తరిగా,ఇక సాధించాల్సినవేవీ మిగలకపోవడాన్ని మించిన ట్రాజెడీ మరొకటుంటుందా ! అతి పిన్నవయసులోనే ధనకీర్తులతోబాటుగా,ప్రముఖ హీరోగా సమాజంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిన 23 ఏళ్ళ కథానాయకుడు 'రిచీ మిజునో' జీవితం అతి త్వరలోనే కాంతివిహీనంగా తయారవుతుంది..నటుడి జీవితాన్ని మినహాయిస్తే అతడికి తన వ్యక్తిగత జీవితంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంటుంది..అందుకేనేమో రిచీ తనకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని చెప్తే అతడి అసిస్టెంట్ 'కాయో' “You’re twenty-four, at the top of your game. A heartthrob. A movie star, more famous by the day. No poor relatives to take care of, in perfect health. Everything is set for you to die. అంటుంది.

కెమెరా సృష్టించిన భ్రాంతిలో చిక్కుకుపోయి వాస్తవ ప్రపంచానికి దారులు వెతుకుతూ Unreal time resumed its flow. I was stripped bare — deep inside a dream అనుకుంటాడు రిచీ..కెమెరా ముందు తప్ప వాస్తవ జీవితంలో అతడి ఉనికి దాదాపు శూన్యం..షాట్ కి ముందు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ 'My reflection was boyish and alive, but all the life was in the makeup. Since my face looked a little greasy, I applied some more powder, but I knew that there was nothing shining underneath. My physique was rugged and my build was solid, but the old power was escaping me. Once a mold has finished casting its share of copies, it cools and becomes deformed and useless.' అనుకుంటాడు..తన చుట్టూ చేరే ఫ్యాన్స్ అంటే అతడికి అమితమైన ఏహ్య భావం..నలువైపులనుండీ చుట్టేసి తన ప్రతి కదలికనూ శల్యపరీక్ష చేసి చూసే కళ్ళల్లోని తీక్షణత అతడిని గుచ్చుకుంటూ ఉంటుంది..Eyes, countless as the gravel at a shrine, pressed in all around me. They found their center — my image coalesced. అనుకుంటాడొకచోట.

పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేకపోయినా నలభై ఏళ్ళ వయసున్నట్లు కనిపించే రిచీ అసిస్టెంట్ 'కాయో' తో అతడికి శారీరక సంబంధం ఉంటుంది..లైమ్ లైట్ లో వ్యక్తిగతమంటూ ఎరుగని రిచీ,లోకం కళ్ళుగప్పి ఎవరూ ఊహించలేని విధంగా అతడికేమాత్రం ఈడూ జోడూ కాని కాయోతో సంబంధం కలిగి ఉండడంలో సమాజంపై ఒకరకమైన తిరస్కారంతో కూడిన విజయం సాధించినట్లు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు..ఎందుకంటే కాయోతో ఉన్న సంబంధం రిచీ తనకి మాత్రమే స్వంతమని చెప్పుకోగలిగే ఏకైక అనుభవం.

ఇక నేరేషన్ విషయానికొస్తే మిషిమా ప్రత్యేకత ఏమిటంటే ఈ రచయితకు సైకిక్ పవర్స్ ఉన్నాయేమో అనిపించేలా పాఠకుల మెదళ్ళను హ్యాక్ చేసి పూర్తిగా తన స్వాధీనంలోకి తీసేసుకుంటారు..దీనికి ఫస్ట్ పర్సన్ నేరేషన్ కూడా దోహదపడింది..ఈ కథలో రిచీ మానసిక ప్రపంచాన్ని రెండుగా విభజిస్తూ, అతడి భావాలను ఏకకాలంలో ఆల్టర్నేట్ రియాలిటీస్ లో చూపించే ప్రయత్నం చేస్తారు..అలాగని కథ అబ్స్ట్రాక్ట్,ఫాంటసీల వైపు వెళ్ళిపోకుండా జాగ్రత్తపడుతూ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకుని కథనాన్ని నియంత్రిస్తారు..ఒక వాస్తవికత పై మరో వాస్తవికతను జోడిస్తూ చాలా సులభంగా మల్టీ లేయర్స్ లో అల్లేసిన కథనంలో సరళత్వమే తప్ప క్లిష్టత ఎక్కడా కనిపించదు..తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎల్లప్పుడూ చుట్టూ మూగే సమాజంపట్ల అయిష్టతను దాచుకుంటూ కెమెరా ముందు నటించే నటుడు రిచీ ఆలోచనలు ఒకవైపూ,పబ్లిక్ పెర్సొనా కి సంబంధం లేని ఒక 23 ఏళ్ళ సాధారణ యువకుడు రిచీ ఆలోచనలు మరొకవైపుగా కథ నడుస్తుంది..సెలబ్రిటీ జీవితపు వెలుగునూ,ఆ వెలుగుకు వెన్నంటే ఉండే చీకటినీ కలగలిపి కథనానికి ఒక ఫిలసాఫికల్ (Yin and yang) రూపాన్నిచ్చే ప్రయత్నం చేశారు మిషిమా..'ఫేమ్' ఒక్కోసారి మనుషుల్ని ఒంటరిని చేసేస్తుంది..ఎంతమందిలో ఉన్నా ఎవరికీ చెందని ఏకాకితనం గురించి ఏమని చెప్తే అర్ధమవుతుంది ! It’s useless trying to explain what it feels like in the spotlight .The very thing that makes a star spectacular is the same thing that strikes him from the world at large and makes him an outsider.

ఈ కథలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన సందర్భం ఒకటుంది..కృత్రిమత్వానికీ,సహజత్వానికీ తేడాను చూపించడంలో ఇటువంటి ఒక వర్ణన మునుపు ఎక్కడా చదవలేదు..రిచీ సినిమా షూటింగ్ సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్టు 'యూరి' సరిగ్గా నటించలేక పోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పిస్తారు..ఆ బాధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది..ఆ సందర్భంలో విషపూరితమైన శరీరంతో ఆమె ప్రమేయం లేని శరీరపు కదలికల్ని వర్ణిస్తూ,తన కృత్రిమమైన నటనతో ఆమె దేహభాషలో సహజత్వాన్ని పోల్చుకుంటాడు రిచీ.
The position of her body made the spectacle supreme. With her eyes firmly shut, fake eyelashes and all, and undistracted by her senses, Yuri was submerged. That’s right. Her mind was underwater. Her senses had been caught in the blurred grayness at the bottom of the sea, but her body had made it to the surface, its every curve and crevice bathed in the violent light. When Yuri yelled “It hurts!” her voice was aimed at the abyss. This was not a cry out into the world, and certainly not a message. It was a frank display of physicality, expressed through pure presence and pure flesh, unburdened by the weight of consciousness.  I wanted to study her, to watch her do it all over again. She had managed to attain the sublime state that actors always dream of. That two-bit actress had really pulled it off . . . without even knowing she had done it.
మరొకచోట స్త్రీపురుషుల సంబంధాలను గురించిన వర్ణనలో నటుడు రిచీని ప్రేమించి అతడి ఫోటో చూస్తూ అతడితో స్వప్నంలో సాన్నిహిత్యాన్ని ఊహించుకున్న అమ్మాయి ఉత్తరం గురించి రాస్తూ Real love always plays out at a distance అంటారు :
But the girl was anything but dreaming. She wove her cloth with steady focus and fastidious attention.  Nobody was watching. There was no way my photograph was looking back at her. But there I was, under her voracious gaze! Through this sort of exchange, a man and woman can consummate a pure and timeless intimacy without ever actually meeting. In some deserted square, in the middle of a sunny day — it would manifest and consummate, without either of us ever knowing.Real love always plays out at a distance. 
ఏ రచయిత ప్రతిభైనా ఒక గొప్ప విషయాన్ని తీసుకుని గొప్పగా చెప్పడంలో కంటే ఒక అతి సాధారణమైన అంశాన్ని తీసుకుని దాన్ని అసాధారణంగా చూపడంలో కనిపిస్తుంది..నిజానికి ఈ కథలో కొత్తదనమేమీ లేదు..ఒక సినిమా ఆర్టిస్టు జీవితం ఎంత యాంత్రికంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే,కానీ ఇటువంటి మామూలు విషయాన్ని మిషిమా ఒక పూర్తి స్థాయి సైకలాజికల్ ఫిక్షన్ గా చాలా ఆసక్తికరంగా రాశారు..కూర్చున్న చోటు నుండి కదలకుండా సింగిల్ సిట్టింగ్లో పూర్తి చెయ్యగలిగే పుస్తకం ఇది..నిజానికి అలా చదివితేనే పట్టుసడలని కథనంలో నూతనత్వం స్పష్టంగా అనుభవంలోకొస్తుంది.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

I hate witnessing ambition, even in a woman. I had to look away.

He planned his scenes shot by shot, like a criminal plotting out the perfect crime.

The flag spasmed in the breeze. Just as it would fall limp, it whipped against the sky, snapping between shadow and light, as if any moment it would tear free and fly away. I don’t know why, but watching it infused me with a sadness that ran down to the deepest limits of my soul and made me think of suicide. There are so many ways to die.

I was once more overtaken by a deep fatigue; my thoughts returned to death. If I was going to die, now would be as good a time as any. Rather than a death cushioned by pleasure, I would die embracing a despicable filth. Cheek in the gutter, curled up against the corpse of a stray cat.

When we were filming, Takahama was always squatting by the camera. He was lanky, skeletal, and had a long, hyperactive nose and a tiny little mouth. His whole face was darkened from incessant exposure to the brutal world of dreams. Habitually dismissing the commotion of his surroundings to give himself the space to think, his gaze was lonely and parched, a gaze most people could never wear in public. It felt so private, like something I was never meant to see. He had the eyes of a child locked naked in a secret room.

My job was to come up with a backstory of violence. I’d been a shy kid. All I did was draw. I never came close to fighting anybody. Instead of gambling with the other kids, I chose the blue sky, and treasured not the gold leaf on their playing cards, but the golden sundown rimming actual young leaves. Looking back, I can say that loving nature was an error. Not seeing my affection for the weakness that it was, I put a stain upon my youth.

The yakuza with his simplistic attitude toward death and the pretty woman who resists him, hiding her true feelings, are bearers of a special kind of vulgar, trifling poetry. A hidden poetry that will be lost if any mediocrity is shed. Genius is a casualty. The poetry must never be conspicuous — its scent is only detectable when subtle. What makes the majority of these films so great is that they’re shot in a way that overlooks the poetry entirely.

*In the pale light of midnight’s foggy street, I’m haunted by the goodbye in your eyes.*
Who would ever notice that this cheap and tired lyric has terms so rigid not a single word could be replaced? People permit its existence because they think it’s harmless and derivative, with the lifespan of a mayfly, but in fact it’s the only thing that’s certain to survive. Just as evil never dies, neither does the sentimental. Like suckerfish clinging to the belly of a shark, threads of permanence cling to the underbelly of all formulaic poetry. It comes as a false shadow, the refuse of originality, the body dragged around by genius. It’s the light that flashes from a tin roof with a tawdry grace. A tragic swiftness only the superficial can possess. That elaborate beauty and pathos offered only by an undiscerning soul. A crude confession, like a sunset that backlights clumsy silhouettes. I love any story guarded by these principles, with this poetry at its core.

The piercing fidelity of the landscape must have meant that I was watching from the gates of death. What I saw was as comprehensive as a memory, poor and wretched as a memory, as quiet, as fluorescent. I was putting it together in the way you would before you die, a last attempt to connect the life flashing before you with an acute vision of the future. I let the neon wash over me, knowing this was something I could never see again. I was no longer on a set, but in an undeniable reality, a layer within the strata of my memory.

It was nothing short of a miracle that I’d stepped into this textured landscape, a living version of memory. It may sound contradictory, but it felt like I had stepped into a painting on the wall and was standing, dumbfounded, inside its panorama.

In the flow of unreal time, I expect things to proceed as planned. The future is fixed; I know its every detail and can see the route ahead of me, like a car negotiating a winding slope. This girl was not part of the plan.

I had slipped into another dimension, an actual place — all of it was real! The neon, the lanterns, the signboards, the willows, the telephone poles, and the glass door of the realtor. I’d been imagining they were all artificial, but now I was awake. I was positive that in about ten hours the sun would sweep the landscape, a newborn sun rising between the hunkered roofs.

Monday, May 18, 2020

A Country Doctor's Notebook - Mikhail Bulgakov

ఒక్క ఎలక్ట్రిక్ లైట్ కనిపించాలంటే కనీసం ముప్ఫై రెండు మైళ్ళు ప్రయాణం చెయ్యాల్సిన దూరంలో,బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా,కనీసం ఫోన్ సదుపాయం కూడా లేని రష్యన్ మారుమూల పల్లెటూర్లో ఏమాత్రం వృత్తిరీత్యా అనుభవంలేని యువవైద్యుడు అక్కడి నిరక్షరాస్యులైన పేషెంట్స్ తో తన అనుభవాలను గురించి రాస్తూ ఎన్నిసార్లు విసుక్కుంటాడో,'ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళిపోతే ఎంత బావుండును,నాకేంటి ఈ శిక్ష' అని !పగటి వేళలు పేషెంట్స్ కి నయం చెయ్యడంలో గడిచిపోయినా రాత్రి అయ్యేసరికి తన గదిలో గుడ్డి దీపపు కాంతిలో భయంకరమైన ఒంటరితనంతో ఒక్కడూ బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్ళదీస్తుంటాడు..మాస్కో పట్టణపు ఆధునికతనూ,అందాలను పదే  పదే తలచుకుంటాడు..కానీ అర్జెంటుగా ఏదైనా కేసు వచ్చినప్పుడు మాత్రం ఈ అస్తిత్వవాదమంతా ఉఫ్ మని ఊదేసినట్లు మాయమైపోతుంది ,ఉన్నపళంగా సాహసికుడి అవతరమెత్తి గుఱ్ఱపు బగ్గీలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా బయలుదేరతాడు..మంచుతుఫానుల్లో దారిలో పొంచి ఉండే ప్రమాదాలను ఎదుర్కుంటూ,అక్కడక్కడా కాపు కాసే తోడేళ్ళ బారినుండి చిన్న పిస్టల్ సాయంతో తనను తాను రక్షించుకుంటూ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటాడు..పైకి సాధారణంగా కనిపిస్తూనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడే అసాధారణమైన హీరో మన బల్గకోవ్ కథానాయకుడు..మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్ లో డాక్టర్ గా పనిచేసి,రెండుసార్లు గాయపడిన తరువాత తన ఉద్యోగం వదిలేసి మళ్ళీ కాస్త కోలుకున్నాకా మోర్ఫిన్ వ్యసనం బారినపడి,ఆ తరువాత Smolensk ప్రావిన్స్ లో పనిచేసిన సమయంలో బల్గకోవ్ తన అనుభవాలకు 'A Country Doctor's Notebook' పేరుతో అక్షరరూపం ఇచ్చారంటారు.
Image Courtesy Google
చెహోవ్,సోమర్సెట్ మామ్ లాంటి పలు డాక్టర్ రచయితల సరసన చెప్పుకోదగ్గ మరో పేరు మిఖాయిల్ బల్గకోవ్ ది..స్టాలిన్ కి ఇష్టుడుగా మసులుకున్న రష్యన్ రచయిత బల్గకోవ్ ..రష్యన్ మారుమూల పల్లెటూర్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన స్వానుభవాలకు కొంత కాల్పనికతను జోడించి ఈ తొమ్మిది కథలుగా మలిచారు..ఈ కథలు సముద్రంలో పడినవాడికి ఈత దానంతటదే వచ్చేస్తుందనే నానుడిని నిజం చేస్తూ,ప్రోటొగోనిస్ట్ పూర్తి స్థాయి వైద్యుడిగా రూపాంతరం చెందే క్రమంలో ప్రత్యక్ష జీవన్మరణ సంఘర్షణకు మధ్యవర్తిగా వ్యవహరించడంలో ఎదుర్కునే పరిస్థితులను వివరిస్తాయి..ఈ నూనూగు మీసాల డాక్టర్ పేషెంట్స్ బాధను తన బాధగా చేసుకుని అల్లాడిపోతాడు..సర్జరీ గురించి థియరీ చదవడమే తప్ప ప్రాక్టికల్ అనుభవం ఎంతమాత్రం లేని యూనివర్సిటీ చదువుతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు వణికే చేతుల్తో ఫోర్సెప్స్ తీసుకుని,అప్పటికప్పుడు కేసుకు అవసరమైన సర్జరీ మాన్యువల్స్ పేజీలు తిప్పుతూ,మరోప్రక్క నుదుటి మీద పట్టిన చిరుచెమటల్ని తుడుచుకుంటూ,పేషెంట్ కేసి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తున్నప్పుడు 'ఈ పేషెంట్ నా చేతుల్లో మరణిస్తే నా పరిస్థితి ఏంటి !' అనుకునే ఈ యువవైద్యుడి రూపం పాఠకుల మనసులో అలా ముద్రపడిపోతుంది.

ఈ కథలన్నీ అవ్వడానికి క్లినికల్ టేల్స్ అయినా బల్గకోవ్ వీటిలో డాక్టర్-పేషెంట్ సంబంధాలకు పెద్దపీట వేస్తూ మానవీయకోణాన్ని వాస్తవికతకు జతచేస్తూ కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశారు..దీనికి తోడు చెహోవ్ శైలిని తలపించే ప్రకృతి వర్ణనలు ఈ కథల్లో మరో ప్రత్యేకత..ఈ వేర్వేరు కథలకు ఎంచుకున్న ఉమ్మడి కాన్వాస్ ఒక ఆర్టిస్టు ఏకాగ్రతతో గీసిన స్కెచ్ అంత స్పష్టంగా ఉంటుంది..శీతాకాలపు రాత్రుళ్ళు,మంచుతుఫానులు ,మినుకుమినుకు మంటూ కథానాయకుడి గదిలో ఉన్న ఆకుపచ్చని ఛాయలో వెలిగే దీపం,హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న మరొక దీపం మినహా కనుచూపుమేరా కన్నూమిన్నూ కానని కటిక చీకటి..ఈ పరిసరాలన్నీ కథలతోపాటు సమాంతరంగా జీవంపోసుకోగా సువిశాలమైన రష్యన్ లాండ్స్కేప్ ఉన్నపళంగా మన కళ్ళముందు తెల్లని తైలవర్ణ చిత్రంలా దర్శనమిస్తుంది.

ఈ కథలన్నిటిలోకీ కాస్త వైవిధ్యంగా ఉన్న కథ 'Morphine' ఒక్కటే.ఇది మొదటి ప్రపంచయుద్ధ సమయం నాటి బోల్షివిక్ విప్లవం సమయానికి సంబంధించిన కథ..ఇదొక్కటీ మినహాయిస్తే మిగతా కథలన్నీ హాస్పిటల్ లో రకరకాల పేషెంట్స్ కి సంబంధించిన కథలే..డాక్టర్ గా ప్రాక్టీస్ తొలినాళ్లలో అనేకమంది అనుభవమున్న డాక్టర్ల మధ్య నేర్చుకుంటూ అప్రెంటిస్షిప్ చెయ్యడం వేరు,అన్న ప్రాసనరోజే ఆవకాయ్ పచ్చడి తీరుగా ఏకాకి వైద్యుడుగా ఎమర్జెన్సీ కేసులను అటెండ్ చెయ్యడం వేరు..తన డైరీలో కష్టాలను ఏకరువు పెడుతున్నపుడు బగ్లకోవ్ హాస్యోక్తులు కథనాన్ని మరింత రక్తి కట్టిస్తాయి.

ఉదాహరణకు,The Embroidered Towel కథలో వైద్యం పూర్తయ్యి కోలుకున్న అందమైన యువతి తండ్రి కృతజ్ఞతా భావంతో డాక్టర్ చేతిని ముద్దుపెట్టుకోమని కూతుర్ని ఆదేశిస్తే దగ్గరకు వచ్చిన ఆమెను గూర్చి 'I was so confused that I kissed her on the nose instead of the lips.' అంటారు బల్గకోవ్ :)

మరో కథలో పేషెంట్ పన్ను పీకబోయి అతడి దవడను పీకేసిన డాక్టర్ ఆత్మవిమర్శను వర్ణిస్తూ,
‘What about the soldier’s jaw? Answer, miserable graduate!’ అంటారు.

తీవ్రమైన మంచుతుఫాను మధ్య చిక్కుకున్న సమయంలో చావుబ్రతుకుల మధ్య డాక్టర్ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి.. Well, somewhere on the back page of a Moscow newspaper there would be a report of how Doctor So-and-So, Pelagea Ivanovna, a driver and a pair of horses had perished from the ‘rigours of the service’. Peace to their ashes, out there in the sea of snow. Dear me, what rubbish creeps into one’s head when called out on a journey in the so-called line of duty.

మరో కథలో టాల్స్టాయ్ మీద ఛలోక్తి విసురుతూ,
I suddenly remembered a short story I had read and for some reason felt a burst of resentment at Leo Tolstoy.‘It was all right for him, living comfortably at Yasnaya Polyana,’ I thought, ‘I bet he was never called out to people who were dying …’అంటారు.

ఇంకో కథలో వింతశిశువు గురించి రాస్తూ,
At university I was not once permitted to hold a pair of obstetrical forceps, yet here—trembling, I admit—I applied them in a moment.I must confess that one baby I delivered looked rather odd: half of its head was swollen, bluish-purple and without an eye. I turned cold, dimly hearing Pelagea Ivanovna as she said consolingly:‘It’s all right, doctor, you’ve just put one half of the forceps over his eye.' అంటారు..ఇలాంటి డార్క్ హ్యూమర్ ఈ కథల్లో అణువణువునా కనిపిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే,ఈ పుస్తకంలో యువ డాక్టర్ చేసే సాహసాలెన్నో,కేసు ఎటువంటి మలుపు తీసుకుంటుందో అని పాఠకులకు ఉత్కంఠ కలిగించే సందర్భాలెన్నో..ఒక చిన్ననాటి స్నేహితుడు సెలవులకు ఇంటికొచ్చినప్పుడు తీరుబడిగా చెప్పే కబుర్లంత సహజంగా,తియ్యగా ఉంటాయి బగ్లకోవ్ వర్ణనలు...అతడి దగ్గరకి వైద్యానికి వచ్చినా,మొహంలో పసితనపు ఛాయలు ఇంకా పోనీ ఆ కుర్ర డాక్టర్ వైద్యం మీద నమ్మకం లేక అతడిని ఎగతాళి చేసే నిరక్షరాస్యులైన రైతుల మధ్య అనేక ఒత్తిళ్ళను ఎదుర్కుంటూ వైద్య వృత్తిలో అనుభవం సంపాదించి ఎలా నిలదొక్కుకున్నదీ ఈ కథల సారాంశం.

పుస్తకం నుండి మరొకొన్ని అంశాలు,
I needn’t have offered to do the operation, and Lidka could have died quietly in the ward. As it is she will die with her throat slit open and I can never prove that she would have died anyway, that I couldn’t have made it any worse …’
‘As soon as I get back to my room, I’ll shoot myself.’

‘You did the operation brilliantly, doctor.’ I thought she was making fun of me and glowered at her.

Anna Nikolaevna described to me how my predecessor, an experienced surgeon, had performed versions. I listened avidly to her, trying not to miss a single word. Those ten minutes told me more than everything I had read on obstetrics for my qualifying exams, in which I had actually passed the obstetrics paper ‘with distinction’. From her brief remarks, unfinished sentences and passing hints I learned the essentials which are not to be found in any textbooks.

And an interesting thing happened: all the previously obscure passages became entirely comprehensible, as though they had been flooded with light; and there, at night, under the lamplight in the depth of the countryside I realised what real knowledge was.‘One can gain a lot of experience in a country practice,’

It was, in fact, less of a conversation than a monologue—a brilliant monologue by me, which would have earned a final year student the highest marks from any professor.

I felt the customary stab of cold in the pit of my stomach as I always do when I see death face to face. I hate it.

God, how the sweat ran down my back! For an instant I somehow imagined that some huge, grim, black figure would appear and burst into the cottage, saying in a stony voice: ‘Aha! Take away his degree !'

I felt my heart gripped by loneliness, by cold, by awareness of my utter isolation. What was more, by breaking the baby’s arm I might have actually committed a crime. I felt like driving off somewhere to cast myself at someone’s feet and confess that I, Doctor So-and-So, had broken a child’s arm—take away my degree, dear colleagues, I am unworthy of it, send me to Sakhalin! God, how neurotic I felt!

In a year, up to the very hour of that evening, I had seen 15,613 patients;200 inpatients had been admitted, of whom only six died.

CLEVER PEOPLE HAVE LONG BEEN AWARE THAT happiness is like good health: when you have it, you don’t notice it. But as the years go by, oh, the memories, the memories of happiness past!

ఏకాంతాన్ని గురించిన వర్ణన,
For an addict there is one pleasure of which no one can deprive him—his ability to spend his time in absolute solitude. And solitude means deep, significant thought; it means, calm, contemplation—and wisdom. 
The night flows on, black and silent. Somewhere out there is the bare leafless forest, beyond it the river,the chill air of autumn. Far away lies the strife-torn, restless city of Moscow.
Nothing concerns me, I need nothing and there is nowhere for me to go. 
The flame in my lamp burns softly; I want to rest after my adventures in Moscow and forget them. 
And I have forgotten them.

Friday, May 15, 2020

Roland Barthes on Feminism

Image Courtesy Google
మనకి ఖాళీల్ని పూరించడం ఇష్టం..కప్ బోర్డులను బట్టలతోనూ,ఖాళీ గదుల్ని వస్తువులతోనూ,మెదడుని సమాచారంతోనూ,జీవితాన్ని మనుషులతోనూ  నింపుకోవడం ఇష్టం...ఏదీ ఖాళీగా ఉండకూడదు,ఖాళీలు భయపెడతాయి..మనం జన్మతః ఒంటరివాళ్ళమని ఓరకంట చూస్తూ గేలి చేస్తాయి..ఆ ఖాళీలను పూరించి తీరాలి.ఆ దిశగా చదువు,ఉద్యోగం,వివాహం,సంతానం,రిటైర్మెంట్ లాంటివన్నీ నలుగురితో పాటు అదే వరుసలో పాటించిన మనిషి సమాజంలో గౌరవస్థానంలో ఉంచబడతాడు..కానీ ఇవన్నీ మనిషికి ఆహారనిద్రా మైథునాల్లా కనీసావసరాలా ? ప్రాచీన కాలంనుండీ విభిన్న సంస్కృతుల పరిణామక్రమంలో సంఘజీవిగా మనిషి సౌకర్యార్థం 'ఏవయసుకా ముచ్చట' ప్రాతిపదికన ఈ క్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటారు..కానీ కాలం గడుస్తున్నా ఈ క్రమంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు..జనాభా పెరుగుదలకూ,ప్రకృతి వనరులకూ మధ్య త్వరితగతిని మారుతున్న నిష్పత్తుల్లో భూమ్యాకాశాల సామ్యం కనిపిస్తునప్పుడు కూడా ఇంకా పెళ్ళి కాలేదా,పిల్లలు లేరా వంటి ఛాందసత్వాలు మాత్రం పోవడం లేదు..స్త్రీ శరీరం సంతానోత్పత్తికి అనువుగా ఉన్నంత మాత్రాన సంతానం ఉత్పత్తి చెయ్యాలా ? ఈ విషయంలో ఆమెకు నిర్ణయాధికారం లేదా ? ఈ ప్రశ్నల్ని సాహిత్యానికీ,ఫెమినిజానికీ ముడిపెడుతూ రోలాండ్ బార్త్ మైథాలజీస్ లో 'నోవెల్స్ అండ్ చిల్డ్రన్' అనే ఒక వ్యాసం రాశారు..ఇది చదువుతున్నప్పుడు దీని గురించి ప్రత్యేకించి ఒక నోట్ రాయాలనుకున్నాను.

ఇక్కడ మనిషి తన సౌకర్యార్ధం ఏర్పాటు చేసుకున్నక్రమాన్ని విమర్శించడం,లేదా అది సరికాదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు..నలుగురూ పాటించే క్రమాన్ని పాటించాలా వద్దా అనే విషయంలో ప్రతీ మనిషికి సంపూర్ణ నిర్ణయాధికారం ఉండాలి అని మాత్రం అనుకుంటాను.

ఇక వ్యాసంలోకి వస్తే,ఇది బార్త్ ఫెమినిస్ట్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది..ఒకసారి ఫ్రాన్స్ లో వెలువడే Elle అనే పత్రిక డెబ్భై మంది రచయిత్రులను ఒకే ఫ్రేములో బంధించిన ఫోటోను ప్రచురించిందట..మంచిదే..కానీ ఆ పత్రికలో రచయిత్రులను ఈ విధంగా వర్గీకరిస్తూ పరిచయం చేశారట.

Jacqueline Lenoir (two daughters, one novel); Marina Grey (one son, one novel); Nicole Dutreil (two sons, four novels), etc.

అసలేమిటిది ? దీనికి అర్థమేమిటి ?
"రైటింగ్ ను ఒక సాహసోపేతమైన వృత్తిగా రైటర్ ని కాస్తో కూస్తో బొహేమియనిజానికి అర్హుడుగా భావిస్తారు..రచయిత అన్నివిధాలా స్వతంత్రుడు,'రైట్ టు ఇండివిడ్యువాలిటీ' కి చిరునామాలాంటివాడు..అతడి వృత్తి రచయితగా సంఘంలో గౌరవంతో పాటు జీవనోపాధిని కూడా అందిస్తుంది..కానీ ఈ నియమాలన్నీ మగవారికే వర్తిస్తాయి..రచయిత్రులు పొరపాటున కూడా స్త్రీ ప్రప్రథమంగా చెయ్యాల్సిన డ్యూటీ (submitted to the eternal statute of womanhood),అనగా మాతృత్వానికి న్యాయం చెయ్యకుండా ఆ ఆర్టిస్టుల నియమావళిని తమకు అనుకూలంగా భావించకూడదు..నిజానికి స్త్రీలు ఈ భూమి మీద సృష్టించబడిందే పురుషులకు సంతానాన్ని కని ఇవ్వడానికి ; వాళ్ళు ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు,వాళ్ళ పరిస్థితుల్ని ఎంత కావాలంటే అంత సుందరమయంగా తీర్చిదిద్దుకోవచ్చు,కానీ వాళ్ళ స్త్రీ అస్తిత్వపు సహజస్థితికి దూరంగా జరగడం మాత్రం నిషిద్ధం..అన్నిటినీ మించి రచయిత్రిగా వారి ఆర్టిస్టు హోదా వారికి ఆపాదించిన బైబిలికల్ ఫేట్ ను భంగపరిచేదిగా ఉండకూడదు..అందువల్ల వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏమిటంటే,వెనువెంటనే వాళ్ళు 'మదర్ హుడ్' కి ట్రిబ్యూట్ ఇస్తూ తమను తాము రుజువు చేసుకోవాలి."
"మీ స్త్రీమూర్తులు స్వతహాగా ధైర్యవంతులు,స్వతంత్రులు,పురుషులతో సమానంగా అన్ని పనులూ చెయ్యగలరు,రాయడంతో సహా ; కానీ పురుషులకంటే ఒకడుగు ముందుకు వెళ్ళిపోయి మాత్రం కాదు ; వారి కనుసన్నలలో మెలుగుతూ,మీరు రాసే పుస్తకాలను మీ పిల్లలతో భర్తీ చెయ్యాలి ; కొంతకాలం సాధికారత స్వతంత్రత అనుభవించవచ్చు,తప్పేమీ లేదు..కానీ మళ్ళీ వెనుదిరిగి మీకు కేటాయించిన స్థానంలోకి మీరు వచ్చెయ్యాలి..ఒక నవల,ఒక సంతానం,కాస్త ఫెమినిజం,మరికాస్త దాంపత్యం..ఇదీ మీ క్రమం." 
"మీ రచయిత్రుల ఆర్టిస్టిక్ మ్యూజ్ ని తీసుకొచ్చి బలమైన కుటుంబ వ్యవస్థ దూలాలకు వ్రేళ్ళాడదీద్దాం..నిజానికి ఈ కాంబినేషన్ వలన రెండువైపులా ప్రయోజనం చేకూరుతుంది..ఇటువంటి మిథ్యల విషయంలో పరస్పరం సహాయం చేసుకోవడం ఎప్పుడూ లాభదాయకమే."
"For instance, the Muse will give its sublimity to the humble tasks of the home; and in exchange, to thank her for this favour, the myth of child-bearing will lend to the Muse, who sometimes has the reputation of being a little wanton, the guarantee of its respectability, the touching decor of the nursery. "
"ఈ విధంగా Elle పత్రిక పాఠకులకు చెప్పి ఒప్పించాలనుకున్న మిథ్య అందరికీ ఆనందదాయకమే..స్త్రీలు శక్తిస్వరూపిణులుగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి : వాళ్ళకి కూడా పురుషులతోపాటు గొప్ప సృజనాత్మక ప్రపంచంలోకి (సుపీరియర్ స్టేటస్ ఆఫ్ క్రియేషన్) అడుగుపెట్టే హక్కుని కట్టబెట్టాలి..కానీ ఇవన్నీ చూసి మగవారు బెదురుతారేమో,వారిని భయపడొద్దని భరోసా ఇస్తూ భుజం తడదాం ; స్త్రీలు ఎప్పటికీ మీ స్థానాన్ని లాగేసుకోరు,స్త్రీ సహజమైన మాతృత్వానికి దూరం జరగరు."
"Elle nimbly plays a Molièresque scene, says yes on one side and no on the other, and busies herself in displeasing no one; like Don Juan between his two peasant girls, Elle says to women: you are worth just as much as men; and to men: your women will never be anything but women." 
"Man at first seems absent from this double parturition;ఇక ఈ పత్రిక చూసిన మగవారికి పిల్లలూ,నవలలూ ఒకేలా కనిపిస్తారు..తమ ప్రమేయం లేకుండా వాటంతటవే ఏదో అద్భుతంలా సృష్టించబడి భూమ్మీదకి అకస్మాత్తుగా వచ్చేసినట్లు,పూర్తిగా తల్లికి మాత్రమే చెందినట్లు..అందునా డెబ్భై మంది స్త్రీలనూ, వారి పిల్లలనూ,పుస్తకాలనూ కలిపి ఒకే ఫోటో లో చూపించడం వల్ల నిజంగానే అవన్నీ ఒక మిరాకల్ లా సృజనాత్మకత,స్వప్నాల సరిసమాన ఫలితమేమో (the miraculous products of an ideal parthenogenesis ) అనిపించేస్తుంది..కానీ ఈ మొత్తం ఫామిలీ పిక్చర్ లో మగవాడు ఎక్కడ ? "
"Nowhere and everywhere, like the sky, the horizon, an authority which at once determines and limits a condition. Such is the world of Elle: women there are always a homogeneous species, an established body jealous of its privileges, still more enamoured of the burdens that go with them. Man is never inside, femininity is pure, free, powerful; but man is everywhere around, he presses on all sides, he makes everything exist; he is in all eternity the creative absence, that of the Racinian deity: the feminine world of Elle, a world without men, but entirely constituted by the gaze of man, is very exactly that of the gynaeceum. "
"ఈ విధంగా Elle పత్రికలో ప్రతీ భాగంలో ఈ ద్వంద్వ వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..ప్రాచీన గ్రీకు రోమన్ సంస్కృతుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన 'జానీసియం' అనే అంతఃపురాలను కేటాయించేవారు..ఇవన్నీ పురుషుల కనుసన్నలలో మెలుగుతూ స్వతంత్రంగా (?) వ్యవహరిస్తాయి..ఎటొచ్చీ ఆ అంతఃపురాలకు తాళాలు ఉంటాయి..స్త్రీలను వాటిలోపల స్వేచ్ఛగా తిరగమని వదులుతారు..ప్రేమించు,పనిచెయ్యి,రచనలు చెయ్యి,వ్యాపారవేత్తగా మారు,నీ ఇష్టం కానీ ఎప్పుడూ పురుషుడి ఉనికిని గుర్తుపెట్టుకో..నువ్వు అతడిలా సృష్టింపబడలేదని జ్ఞాపకం పెట్టుకో ;ఈ కారణంగా నీ ఉనికి అతడి మీద ఆధారపడుతుందని మరవొద్దు..నీ స్వేచ్ఛ కేవలం ఒక లగ్జరీ,ఆ లగ్జరీ నీకెప్పుడు దక్కుతుందంటే నువ్వు నీ స్త్రీ సహజ ప్రవృత్తిని గుర్తించి,అంగీకరించినప్పుడే..నీకు రాయాలనుంటే రాయి..సాటి మనుషులుగా మేమందరం నిన్ను చూసి గర్వపడతాము,కానీ మరో చేత్తో స్త్రీగా పిల్లలను కనవలసిన నీ విధిని మాత్రం మర్చిపోవద్దు..ఎందుకంటే అదే నీ డెస్టినీ..ఒక jesuitic morality: అందువల్ల నీ మోరల్ రూల్ ఆఫ్ కండిషన్ ను స్వీకరించు..కానీ అది నిలబడిన నమ్మకపు పునాదుల(dogma) విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీపడకు."