Wednesday, March 25, 2020

In Other Words - Jhumpa Lahiri

ప్రపంచీకరణ వలన అనేకమైన లాభాలతో పాటు ఒక పూడ్చలేని నష్టం కూడా జరిగింది..అదేమిటంటే అది మనిషికీ-మనిషికీ ప్రత్యేకంగా ఉండే సాంస్కృతిక మూలాలను వ్రేళ్ళతో సహా పెకలించివేసింది..మనుషులు ఏళ్ళ తరబడి ఒకే ప్రాంతానికి పరిమితమై నివసించడం వల్ల వాళ్ళకి ఆ ప్రాంతపు సంస్కృతీ సంప్రదాయాలూ,వేషభాషలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది..అటువంటి అనుబంధం ఉన్నవాళ్ళు పొట్టకూటికోసం రెక్కలుకట్టుకుని ప్రపంచంలో ఏ మారుమూలకు వలస పోయినా,తిరిగి తన సొంత గూటిని వెతుక్కుంటూ వెనక్కిరావడానికి  తపిస్తారు..గ్లోబలైజేషన్ ఈ తరానికి ఆ అనుభవాన్ని  మెల్లిమెల్లిగా దూరంచేస్తోంది..ఒకప్రక్క 'జగమంత కుటుంబం' నీదని భరోసా ఇస్తూనే మనిషి ఉనికికి కీలకమైన మూలాలనుండి అతడిని దూరం చేసింది..మనిషి అస్తిత్వాన్ని నిర్వచించడంలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుంది..అనేక భాషలు,సంస్కృతులు సొంతం చేసుకునే క్రమంలో ఈతరం మనిషి,ప్రత్యేకించి తనవైన సాంస్కృతిక మూలాలు బలహీనపడుతుండగా,తెగిన గాలిపటంలా ఒక 'belongingness' కోసం తపిస్తున్నాడు..ఇండియన్-అమెరికన్ రచయిత్రి ఝంపా లహిరి నాన్ ఫిక్షన్ రచన  'In Other Words' లో ఈ తపనే కనిపిస్తుంది.
Image Courtesy Google
చాలా ఏళ్ళ క్రితం పులిట్జర్ ప్రైజ్ గ్రహీత ఝంపా లహిరి 'Interpreter of Maladies' చదివాను,అప్పట్లో ఎందుకో ఆవిడ శైలి పెద్దగా రుచించక పోవడంతో లహిరి ఇతరత్రా రచనల జోలికి వెళ్ళలేదు..మళ్ళీ ఇంతకాలానికి ఆవిడ నాన్ ఫిక్షన్ రచన 'In Other Words' చదవడం తటస్థించింది..ఝంపా లహిరి మాతృభాష బెంగాలీ అయినప్పటికీ అమెరికాలో పూర్తి ఆంగ్ల మాధ్యమంలో చదువు ఆమెకు మాతృభాషపై ఆధిపత్యాన్ని కట్టబెట్టడంలో విఫలమైంది..దీనికి తోడు తమ భాషను సజీవంగా ఉంచుకోవాలనే ఆరాటంతో ఇంట్లో బెంగాలీ మాత్రమే మాట్లాడాలని తల్లితండ్రులు పెట్టిన నియమం తన ఉనికిని రెండుగా చీల్చిందంటారు ఝంపా..తనకు 'బెంగాలీ' తల్లి లా అనిపిస్తే,'ఇంగ్లీష్' సవతి తల్లిలా అనిపించేదంటారు..ఇంగ్లీష్ భాషపై ఆమెకు మంచి పట్టున్నప్పటికీ అది ఆమెకు పరాయి భాష క్రిందే లెక్ఖ..ఈ రెండు ఐడెంటిటీలతో సతమవుతున్న సమయంలో ఇటాలియన్ పై ఆమెకున్న అబ్సెషన్ ఆమె అస్తిత్వంలో మూడో పార్శ్వానికి తెరతీసింది..ఆంగ్లంలో సాధికారకమైన రచనలు చేసిన ఝంపా,ఇటాలియన్ భాష పై ఉన్న మక్కువ కారణంగా ఆ భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు..ఇటాలియన్ రచయిత 'సెజారే పవేసే' లా ఇటాలియన్ లో రచనలు చెయ్యాలని కలలు కనేవారు..ఒక సమయంలో తన నివాసాన్ని సైతం రోమ్ కి మార్చుకుని ఇటాలియన్ భాషపై ఆమె ఏ విధంగా పట్టు సాధించారన్నది ఈ పుస్తకం సారాంశం..'In Other Words' ఝంపా లహిరి ఇటాలియన్ లో రాసిన తొలి రచన..ఒక పరాయి భాషను నేర్చుకునే క్రమంలో రచయితలు ఎదుర్కునే సంఘర్షణల్నీ,అనుభవాల్నీ ఈ అందమైన పుస్తకంగా మలిచారు ఝంపా..ఇంగ్లీష్ లో రచయిత్రిగా స్థిరపడ్డాక కూడా ఇటాలియన్ లో రచనలు చెయ్యాలనే తలంపు ఎందుకొచ్చిందీ అంటే : "ఒక ఆర్టిస్టుకి తనను తాను నిరంతరం వైవిధ్యంగా ఆవిష్కరించుకోవాలనే తపన ఉంటుంది,ఈ క్రమంలో తనను ఎప్పటికప్పుడు కొత్తగా అభివ్యక్తీకరించుకోవడానికి నూతన ప్రయోగాలు చేస్తూ తన తీరుని మార్చుకుంటూ వెళ్తాడు,ఇదీ అంతే" అంటారు..పెస్సోవా అనేక హెటెరోనిమ్స్ ద్వారా నిరంతరం తన ఉనికిని మార్చుకున్న తరహాలోనే,తన అస్తిత్వంలో భాగమైన ఇంగ్లీష్,బెంగాలీ భాషల్ని కాదని ఇటాలియన్ లో రచనలు చెయ్యడం,తన అస్తిత్వానికి కొత్తరూపునిచ్చే ప్రయత్నమే అంటారు.  

As I went through the show, I recognized an artist who at a certain point felt the need to change course, to express himself differently. Who had the mad impulse to abandon one type of vision, even a particular creative identity, for another. I thought of my writing in Italian: a similarly intricate process, a similarly rudimentary result compared with my work in English. Writing in another language represents an act of demolition, a new beginning.

ఈ పుస్తకంలో అడుగడుగునా ఝంపా లహిరి కి ఇటాలియన్ భాషపై ఉన్న అబ్సెషన్ స్పష్టంగా కనిపిస్తుంది.ఒక పరాయి భాషపై ఈ రకమైన అబ్సెషన్ సాధ్యమేనా అంటే సాధ్యమే అంటాను నేను..నాకు ఊహ తెలిసినప్పటినుండీ బ్రిటిష్ రూరల్  కల్చర్ పై ఉన్న అబ్సెషన్ దాదాపు ఇటువంటిదే..నిర్వచనాలకందని  వ్యామోహమది..విచిత్రంగా నాకు అస్సలు పరిచయం లేని సంస్కృతితో చిన్నప్పటినుండీ ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించేది..వారి వేషభాషలతో,సంప్రదాయాలతో ఏ పూర్వ జన్మలోదో అనిపించే సాన్నిహిత్యం,కానీ నా జ్ఞాపకాల దొంతరల్లో ఛాయామాత్రంగా కనిపించే ఆ సంస్కృతి తాలూకా నీడలు మాత్రం వాస్తవం..ఆరో క్లాసు చదువుతున్నప్పుడు జేన్ ఆస్టిన్ పెంబర్లీ ఎస్టేట్ ని పెయింట్ చేసి దాచుకున్న జ్ఞాపకాలు నా ఈ అబ్సెషన్ కి సాక్ష్యాలు.

What do I recognize? It’s beautiful, certainly, but beauty doesn’t enter into it. It seems like a language with which I have to have a relationship. It’s like a person met one day by chance, with whom I immediately feel a connection, of whom I feel fond. As if I had known it for years, even though there is still everything to discover. I would be unsatisfied, incomplete, if I didn’t learn it. I realize that there is a space inside me to welcome it.

I feel a connection and at the same time a detachment. A closeness and at the same time a distance. What I feel is something physical, inexplicable. It stirs an indiscreet, absurd longing. An exquisite tension. Love at first sight.

ఝంపా లహిరి ఇటాలియన్ భాషను నేర్చుకునే క్రమంలో తన అనుభవాలను అందమైన మెటాఫోర్లుగా మార్చి ఈ పుస్తకాన్ని రాశారు..ఇందులో అత్యంత సన్నిహితమైన వర్ణనలు  'Cultural deprivation' విషయంలో దాదాపూ ప్రతీ మనిషీ ఎదుర్కునే సంఘర్షణలకు అద్దంపడతాయి.
"నిజానికి నాకు ఇటాలియన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.నేను ఇటలీలో నివసించను,నాకు ఇటాలియన్ మిత్రులూ లేరు..నాకున్నది నేర్చుకోవాలనే పిచ్చి కోరిక మాత్రమే..అనేక ప్యాషనేట్ రిలేషన్షిప్స్ లో లాగే భాషపట్ల నా ఈ వ్యామోహం కూడా ఒక ఆరాధనగా,ఒక అబ్సెషన్ గా రూపాంతరం చెందింది..నాలో ఎప్పుడూ ఒక అస్థిరమైన,అవ్యక్తమైన భావన ఏదో ఉంటూ వచ్చింది..నేను ప్రేమలో ఉన్నాను,కానీ నేను ప్రేమించిన దానికి నా ఉనికి ఎంతమాత్రమూ పట్టదు..ఎందుకంటే ఆ భాషకు నా అవసరం లేదు."
"నాకు పరాయిభాషలో చదవడం ఇంగ్లీష్ లో చదవడం కంటే మరింత సన్నిహితంగా అనిపిస్తుంది..ఎందుకంటే ఆ పరాయి భాషకూ నాకూ బహుస్వల్పకాల పరిచయం..మేమిద్దరం ఒకే ప్రాంతానికి చెందినవారం కాదు,ఒకే కుటుంబానికి చెందినవారం అంతకంటే కాదు..మేము కలిసిమెలిసి పెరగలేదు..ఈ భాష నా రక్తంలోనూ,నా మూలుగుల్లోనూ లేదు..నాకు ఆ భాషంటే ఆకర్షణా,భయమూ రెండూను..నా దృష్టిలో ఆ భాష ఒక ప్రియమైన రహస్యంగా మిగిలిపోయింది..నా భావోద్వేగాలకు అది ప్రతిస్పందించదు." 
"మనుషులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే మాతృభాషకి దూరంగా ఉన్నప్పుడు దాన్ని బ్రతికించుకోడానికి చెయ్యగలిగినదంతా చేస్తారు..ఎందుకంటే పదాలు గతాన్ని పునరావృతం చేస్తాయి : ప్రాంతం,మనుషులు ,జీవితం,వీధులు ,వెలుతురు,ఆకాశం,పువ్వులు,ధ్వనులు ఇవన్నీ భాషలో జీవం పోసుకుంటాయి..నువ్వు నీ సొంత భాషకి దూరంగా జీవిస్తున్నప్పుడు అస్తిత్వలేమితో తేలికైపోతావు,అదే సమయంలో ఆ లేమి తాలూకా భారాన్ని కూడా నీవు మోయలేవు..నీవున్న ఉపరితలానికి సంబంధంలేని ఎత్తులో మరో క్రొత్త మిశ్రమాలతో కూడిన గాలిని శ్వాసిస్తావు..కానీ నీకెప్పుడూ ఆ తేడా అనుభవమవుతూనే ఉంటుంది."
"నేనొక రచయిత్రిని: నా ఉనికిని భాషలోనే వెతుక్కుంటాను,నా పని భాషతోనే..అయినప్పటికీ ఒక కంటికి కనిపించని గోడ ఏదో నన్ను దూరం పెడుతుంది,నా నుండి నన్ను వేరు చేస్తుంది..అనివార్యమైన ఈ అడ్డుగోడ నేను వెళ్ళిన చోటుకల్లా నాతో పాటు వస్తుంది..ఒక్కోసారి బహుశా ఆ గోడ నేనేనేమో అనిపిస్తుంది..ఆ గోడను పగులగొట్టి,నన్ను నేను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించుకోడానికే నేను రాస్తాను..నా రూపానికీ,నా పేరుకీ నా రచనతో సంబంధం లేదు..ఎటువంటి వడపోతలూ,విచారణా లేకుండా ఒక అదృశ్యం రూపంలో నేను కనబడకుండా వినబడతాను..ఆ క్రమంలో నేను నా అక్షరాలుగా మారిపోతాను,నా అక్షరాలు నాలా మారిపోతాయి."
ఈ పుస్తకాన్ని ఒక జియోగ్రఫిక్ రచన కంటే ఒక ట్రావెలోగ్ గా చూడాలంటూ,ఈ పుస్తకాన్ని అనేక రకాలుగా నిర్వచించారు..
"ఈ రచన నా ఉనికిని వ్రేళ్ళతో సహా పెకలించివేసిన ఒక జ్ఞాపకం..ఒక అస్థిమితత్వం,ఒక కొత్త ఆవిష్కరణ...కొన్ని సార్లు ఆసక్తి గాను,మరి కొన్నిసార్లు అలసటగానూ అనిపించే ప్రయాణం..తన గమ్యాన్ని చేరలేకపోయిన యాత్రికుడి 'అబ్సర్డ్ జర్నీ'..ఈ పుస్తకం ఒక వెతుకులాట..ఒక విజయం..ఒక నిరంతర వైఫల్యం..బాల్యం మరియు యవ్వనం,ఒక పరిణామం,ఒక విప్లవం,ఒక  స్వాతంత్య్రం,ఒక సహకారం,ఒక ఏకాంతం."

I’ve come for a week, to see the buildings, to admire the squares, the churches. But from the start my relationship with Italy is as auditory as it is visual. Although there aren’t many cars, the city is humming. I’m aware of a sound that I like, of conversations, phrases, words that I hear wherever I go. As if the whole city were a theater in which a slightly restless audience is chatting before the show begins.

ఒక ప్రదేశంలో నాటిన చిన్న మొక్క తన లేలేత వ్రేళ్ళను మెల్లిగా విస్తరించుకుంటూ సరిగ్గా మట్టితో అనుబంధం పెనవేసుకునే సమయంలో దాన్ని వ్రేళ్ళతో సహా పెకలించివేసి తీసుకెళ్ళి మరో ప్రదేశంలో పూర్తి వైవిధ్యమైన వాతావరణంలో నాటినప్పుడు అది జీవసహజమైన సర్వైవల్ ఇన్స్టింక్ట్ తో ఆ మార్పును తట్టుకుని జీవిస్తుంది గానీ దాని మూలాలు మాత్రం తీవ్రంగా బలహీనపడతాయి..మా తిలక్ పుట్టినప్పటినుండీ మూడు రాష్ట్రాల్లో ఉండడంతో ఈ పదేళ్ళలో ఇంగ్లీష్ తో పాటుగా మరో మూడు భాషలైన తెలుగు,తమిళం,మలయాళంలను కూడా own చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది..ఒక భాష కాస్త వస్తోంది అనుకోగానే మరో రాష్ట్రానికి వలస పోవాల్సొచ్చేది..ఈ కారణంగా నాలుగు భాషలొచ్చినప్పటికీ వాడికి ఇంగ్లీష్ తప్ప మరే ప్రాంతీయ భాషా వ్యాకరణసహితంగా,లోతుగా రాదు..దక్షిణ భారతంలో నాలుగు విడి విడి భాషల్ని కలిపి ఖిచిడీ వండి వాడు మాట్లాడే భాష మన భిన్నత్వంలో ఏకత్వానికి చిరు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది..ఇక విదేశాల్లో ఉన్న పిల్లల సంగతి సరేసరి..వాళ్ళు ఈ 'కల్చరల్ క్లాష్' ని మరింత తీవ్రంగా ఎదుర్కుంటారు..గ్లోబలైజేషన్ కారణంగా ఈ తరంలో పిల్లలకు మాతృభాషతో అనుబంధం ముడిపడే అవకాశాలు బలహీనపడుతున్నాయి..ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక సామజిక అవసరంగానూ ,ఇతరత్రా భాషలు నేర్చుకోవడం ఒక లగ్జరీగానూ మారిపోయింది..ప్రాంతీయ భాషల్ని భాష మీద ప్రేమతో,మక్కువ కొద్దీ నేర్చుకోవాలి తప్ప నిజానికి వాటి అవసరం నేటి సమాజంలో ప్రశ్నార్థకమే !

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

The unknown words remind me that there’s a lot I don’t know in this world.

At the end of the day the basket is heavy, overflowing. I feel loaded down, wealthy, in high spirits. My words seem more valuable than money. I am like a beggar who finds a pile of gold, a bag of jewels.

Even though I now speak the language fairly well, the spoken language doesn’t help me. A conversation involves a sort of collaboration and, often, an act of forgiveness. When I speak I can make mistakes, but I’m somehow able to make myself understood. On the page I am alone. The spoken language is a kind of antechamber with respect to the written, which has a stricter, more elusive logic.

Why do I write? To investigate the mystery of existence. To tolerate myself. To get closer to everything that is outside of me.

Because in the end to learn a language, to feel connected to it, you have to have a dialogue, however childlike, however imperfect.

I’ve been writing since I was a child in order to forget my imperfections, in order to hide in the background of life. In a certain sense writing is an extended homage to imperfection. A book, like a person, remains imperfect, incomplete, during its entire creation. At the end of the gestation the person is born, then grows, but I consider a book alive only during the writing. Afterward, at least for me, it dies.

All my life I wanted to see, in the frame, something specific. I wanted a mirror to exist inside the frame that would reflect a precise, sharp image. I wanted to see a whole person, not a fragmented one. But that person wasn’t there. Because of my double identity I saw only fluctuation, distortion, dissimulation. I saw something hybrid, out of focus, always jumbled.
I think that not being able to see a specific image in the frame is the torment of my life. The absence of the image I was seeking distresses me. I’m afraid that the mirror reflects only a void, that it reflects nothing.

As I said, I believe that reading in a foreign language is the most intimate way of reading.

Saturday, February 29, 2020

Sontag : Her Life and Work - Benjamin Moser

కొన్నేళ్ళ క్రితం బ్రెయిన్ పికింగ్స్ ద్వారా పరిచయమైన 'సుసాన్ సోంటాగ్' వ్యాసాల్ని అప్పుడప్పుడూ చదువుతుండేదాన్ని..కానీ ఒక్కటి మినహాయిస్తే ఆమె పుస్తకాలేవీ పూర్తిగా చదివింది లేదు,నిజానికి ఆమెను ఏకబిగిన చదవడం నాకు సాధ్యం కాలేదు..నిజం చెప్పొద్దూ,రాతల ద్వారా ఇష్టపడిన రచయితలు కొందరైతే  రచయితని చూసి ఇష్టపడి చదివిన రాతలు కొన్ని..ఈ పుస్తకం కవర్ లాగే సుసాన్ క్లాసిక్ బ్లాక్ & వైట్ ఫోటోలోని స్థిరగంభీరమైన అయస్కాంతం లాంటి ఆకర్షణ శక్తేదో ఆమెవైపు ఎవర్నైనా ఇట్టే లాగేసుకుంటుంది..రీడింగ్ టార్గెట్స్ ని ప్రక్కకి నెట్టేసి ఈ నెలంతా మరొక రచయితను చదవలేదు,ఆమె చదవనివ్వలేదు..కొన్ని వ్యాసాలూ,ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్,చివరగా బెంజమిన్ మోసర్ రాసిన సుమారు ఎనిమిది వందల పేజీల బయోగ్రఫీ 'సోంటాగ్' చదివిన తరువాత ఈ వ్యాసం రాయాలని కంప్యూటర్ కీబోర్డ్ మీద పెట్టిన చేతులు కాసేపు అలాగే స్థిరంగా చలనం లేకుండా ఉండిపోయాయి,ఈ ఆర్టికల్ రాద్దామని నేను తయారుచేసుకున్న నోట్సే సుమారు యాభై అరవై పేజీలు తయారయ్యింది మరి !
Image Courtesy Google
నిజానికి నిర్వచనాల్ని తోసి పారేసిన వ్యక్తిని నిర్వచించడం సాధ్యమేనా ! లేబుల్స్ అంటే అసహ్యం అన్న వ్యక్తికి ట్యాగ్ లు తగిలించే ప్రయత్నం చెయ్యగలమా ! అసలు ఏదో ఒక చట్రంలో ఆమె ఇముడుతుందా ! ఆమె గురించి కేవలం కొన్ని పదాల్లో,ఒక్క వ్యాసంలో చెప్పడమంటే ఎలా ఉంటుందంటే,ఒక గొప్ప విస్ఫోటనం తరువాత మెరుపువేగంతో విశ్వం నలుమూలలకూ చొచ్చుకుపోయిన గ్రహ శకలాల్ని ప్రోగుచేసి పొదివిపట్టుకోవాలనే పిచ్చి ప్రయత్నంలా ఉంటుంది..అందుచేత నిర్వచనాలకు దూరంగా 'సుసాన్ సోంటాగ్' అనే విస్ఫోటనం తాలూకూ శకలాల్ని ఒకచోట పేర్చాలనే వృథా ప్రయత్నం మానేసి,ఆమెను ఆమె 'అబ్స్ట్రాక్ట్ సెల్ఫ్' అంత స్వచ్ఛంగానే చూపిస్తూ,ఈ 'సోంటాగ్' అనే టిపికల్ జిగ్సా పజిల్ ముక్కల్ని ఎవరికి తోచినట్లు వారే పేర్చుకుని ఆమెను నిర్వచించుకునే పనిని మీకే వదిలేస్తూ ఈ వ్యాసం రాసే ప్రయత్నం చేస్తున్నాను.

---------------------------------------------------------------------------------

1970 ల ముందు వరకూ బయోగ్రఫీలకు అయితే రాచరికపు స్త్రీలవో,లేక ప్రముఖ పురుషుల జీవితాల్లో కీలక పాత్రను పోషించిన స్త్రీలవో మాత్రమే అర్హత కలిగుండేవంటారు స్త్రీవాదీ,విమర్శకురాలు అయిన Carolyn Heilbrun..అంతవరకూ పురుషుని విజయాల్లో అతడి పట్ల అంకితభావంతో తెరవెనుక ఉంటూ సహాయసహకారాలనందించిన స్త్రీల గాథలు మాత్రమే చెప్పబడేవి..స్వతంత్రంగా తమతమ రంగాల్లో విజయపతాకాల్ని ఎగురవేసిన స్త్రీల జీవిత చరిత్రలపై పురుషస్వామ్యపు సమాజం సీతకన్నువేసేది..సాహితీ రంగంలో ఉత్కృష్ట శిఖరాలనధిరోహించిన వర్జీనియా వూల్ఫ్ ని సైతం అమెరికన్ విమర్శకుల్లో 'డీన్' హోదాకలిగిన లియోనెల్ ట్రిల్లింగ్  తీసిపారేశారు..చివరకు ట్రిల్లింగ్ భార్య వ్యంగ్యంగా,తన స్వంత విజయాలు ఎన్నున్నా తుదకు తన సమాధిపై “Diana Trilling Dies at 150. Widow of Distinguished Professor and Literary Critic Lionel Trilling.” అని రాయడం అనివార్యమని చురక అంటించారుట. :)

-----------------------------------------------------------------------------------------

సోంటాగ్ గురించి మాట్లాడేటప్పుడు ఆవిణ్ణి ఒక గొప్ప అమెరికన్ ఇంటెలెక్చువల్ గా మాత్రమే మాట్లాడడం అసంభవం..ఆమెకు చరిత్ర లేదు,ఆమె తన చరిత్రను తిరస్కరించింది..సాహితీలోకంలో జ్యూయిష్ మూలాలున్న స్త్రీ రచయితల్లో క్లారిస్ లిస్పెక్టర్,సుసాన్ సోంటాగ్,హన్నా ఆరెండ్ట్ లు ముగ్గురూ శిఖర సామానులు కాగా,లిస్పెక్టర్ కళ మానవ మస్తిష్కపు పరిథుల్ని దాటి ఆవలకు వెళ్ళలేదు,హన్నా ఫిలాసఫీలో పొలిటికల్ థియరీలకు ప్రాధాన్యతనిచ్చారు..ఇక సుసాన్ విషయానికొస్తే ఆమె ఫోటోగ్రఫీ,సినిమా,పెయింటింగ్,లిటరేచర్ ఇలా అన్ని రకాల 'ఆర్ట్' ఫార్మ్స్ గురించీ విస్తృతంగా వ్యాసాలు రాశారు..అక్కడే ఆగిపోకుండా రాజకీయాలూ,సామాజికాంశాల మొదలు ఎయిడ్స్,కాన్సర్ వంటి క్రానికల్ డిసీజస్ వరకూ సోంటాగ్ దృష్టి ప్రసరించని  రంగమంటూ లేదు..Susan Rosenblatt పేరుతో జ్యూయిష్ కుటుంబంలో పుట్టినప్పటికీ సోంటాగ్ తన ఉనికిని కేవలం ఒక జాతికో,ఒక ప్రాంతానికో పరిమితం చేసుకోకుండా ప్రపంచం నలుమూలలకూ విస్తరించుకున్నారు..సోంటాగ్ ను చదవడం అంటే మొత్తం ప్రపంచ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

ఇక సాధారణంగా బయోగ్రఫీలనగానే మహాత్ముడూ,ఐన్స్టీన్ లాంటి 'లార్జర్ దాన్ లైఫ్' పర్సనాలిటీలను కూడా తీసుకొచ్చి డొమెస్టిక్ పరిథిలో కుదించే  ప్రయత్నం జరుగుతుంటుంది..ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే,సుసాన్ వ్యక్తిగత జీవితం వద్దే ఆగిపోకుండా ఆమె అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో వేసిన ముద్రల్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తుంది..ముఖ్యంగా ఇందులో ప్రస్తావించిన పలు అంశాలు సోంటాగ్ జర్నల్స్ నుండీ,ఆమె స్నేహితుల,సన్నిహితుల,గురువుల,మెంటర్ల,కుటుంబ సభ్యుల అభిప్రాయాలూ,అనుభవాల నుండీ సంగ్రహించినవి..కేవలం ఒక సమూహానికో,ఒక జాతికో,ఒక రంగానికో పరిమితం కాని ఆమె గురించి అనేక వ్యక్తుల అభిప్రాయాల్ని పొందుపరచడం వల్ల ఈ బయోగ్రఫీలో సోంటాగ్ పై ప్రశంసలెన్ని ఉన్నాయో విమర్శలూ కూడా అదే స్థాయిలో ఉంటాయి..ఈ పేజీల్లో 1960-70 ల కాలంలో న్యూయార్క్ సాహితీ ప్రపంచంలో ఒక సమున్నత స్థానంలో వెలుగొందిన సోంటాగ్ మేథస్సుకి అబ్బురపడుతూ అనేక పర్యాయాలు ఆమెను ఒక Outworldly పర్సనాలిటీగా ఆరాధిస్తే,కొంచెం కూడా సాటి మనిషి భావాల పట్ల సున్నితత్వంలేని ఆమెను అంతే ద్వేషిస్తాం.
అయినా ఇటువంటి అసాధారణమైన వ్యక్తుల్ని ఒక సాధారణ వ్యక్తికి సంబంధించిన మేలు విలువల తూకపురాళ్ళతో తూచాలని ప్రయత్నించడం ఎంతటి దుస్సాహసం !!

-------------------------------------------------------------------------------------------

సంక్లిష్టమైన బాల్యం రచయితకు వరమని కొందరు రచయితలంటుంటారు..
వాస్తవాన్ని అంగీకరించని "The queen of denial" మిల్డ్రెడ్ ఇద్దరు కూతుళ్ళలో ఒకరైన సుసాన్ పుట్టిన నిముషం నుండీ తల్లి నిర్లక్ష్యానికి గురైంది..ఐదవ ఏటనే తండ్రి టీబీ తో మరణించగా,సుసాన్ లో ఒంటరినైపోతానేమోననే భయం,తత్పరిణామంగా సన్నిహితంగా వచ్చిన వాళ్ళని ఆ భయంతోనే దూరంగా నెట్టెయ్యమని ప్రేరేపించే తత్వం సుసాన్ వ్యక్తిత్వానికి హాల్ మార్క్ గా మారాయి..మొదట్నుంచీ తల్లి మీద సుసాన్ కు ఒక అబ్సెషన్ ఉండేదట..మిల్డ్రెడ్ attention కోసం ఆమె నిరంతరం తపించేది..ఈ సమయంలో మిల్డ్రెడ్ ను కలిసిన సుసాన్ మొదటి గర్ల్ ఫ్రెండ్ Harriet Sohmers “She was clearly in love with her mother,She was always criticizing her about how cruel she was, how selfish she was, how vain she was, but it was like a lover talking about a person that they were in love with.” అంటారు.

తాగుబోతు తల్లి మిల్డ్రెడ్ తో సుసాన్ అనుభవాలు ఆమెను మొదట్నుంచీ బాల్యానికి దూరం చేశాయి..మిల్డ్రెడ్ తన వివాహేతర సంబంధాలతో పిల్లల్ని ఒక్కోసారి పట్టించుకోవడం,ఒక్కోసారి పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం చేసేది. .ఈ 'కేరింగ్,నాట్ కేరింగ్' అనే సందిగ్ధత మధ్య సుసాన్ వ్యక్తిత్వాన్ని జీవితాంతం వెంటాడిన 'Sadomasochism' జీవంపోసుకుంది..కానీ ఆమె బాల్యాన్ని అంతగా కాలరాసిన మిల్డ్రెడ్ కూడా సుసాన్ కు ఒక మేలు చేసింది,"నీకేదైనా నచ్చకపోతే నీ గదికి వెళ్ళి చదువుకో" అంటూ సుసాన్ ను ఫెయిరీ టేల్ ప్రపంచంలో సేద తీరమని ప్రోత్సహించేది.అలా సుసాన్ జీవితంలో వివర్ణమైన వాస్తవాన్ని సుందరమయం చేస్తూ పుస్తకాలు ఆమెకు స్వాంతన చేకూర్చేవి..వాస్తవంనుండి దూరంగా జరగాలనుకున్న ప్రతిసారీ పుస్తకాలు ఆమెకు చేదోడువాదోడుగా నిలబడ్డాయి.

“She was never able to know what goes on in another person,” అంటారు సుసాన్ ప్రేమికుల్లో ఒకరు..దైనందిన జీవితంలో మనం సహజంగా తోటిమనిషి భావలపట్ల చూపే సున్నితత్వం సుసాన్ లో ఉండేది కాదు..దీనికి తోడు పుస్తకాలతో స్నేహం పూర్తిగా కుదరకుండానే సుసాన్ కు తానొక misfit అనే విషయం అర్ధమైంది..స్కూల్లో తోటిపిల్లల మధ్య ఇమడలేని నిరాసక్తత,ఇంట్లో దుఃఖ్ఖపూరిత వాతావరణం,అనారోగ్యం వీటన్నిటి మధ్యా ఆమె బంగారు భవిష్యత్తు గురించి ఆశగా ఎదురుచూసేది..But the woman who would inspire bookish girls everywhere had few models when she herself was a bookish girl.

సాహిత్యంతో సాహచర్యం తనకు జాత్యాహంకారపు సంకెళ్ళనుండీ,ప్రాంతీయ దురభిమానాలనుండీ,బ్రష్టుపట్టిన విద్యావిధానాలనుండీ,లోపభూయిష్టమైన తన విధినుండీ,భోగలాలసత్వంనుండీ విముక్తి ప్రసాదించిందంటారు సోంటాగ్..ఆవిడ నమ్మకం ప్రకారం మానసిక స్వేఛ్చ శారీరక స్వేఛ్చతో సమానం.

-----------------------------------------------------------------------------------------

సుసాన్ సోంటాగ్ సాంస్కృతిక ప్రపంచంలో ఒక 'ఇన్సైడర్' మాత్రమే కాదు,ఆ 'ఇన్సయిడెర్నెస్' ని సింబలైజ్ చేసింది కూడా ఆవిడే..ఆమెలా మునుపూ ముందూ ఆర్ట్ కీ ఆర్టిస్టుకీ ప్రాధాన్యతను ఆపాదించిపెట్టగలిగిన వాళ్ళు లేరు..చివరకు సోంటాగ్ విమర్శకులు సైతం హేతువుపట్ల శ్రద్ధ కనబర్చడంలో ఆమె వైఫల్యాన్ని ఒకవైపు నిందిస్తూనే మరోవైపు ఆమెను ప్రశంసిస్తారు..మన్హట్టన్ తాళాలు తన చేతుల్లోకి తీసుకుని న్యూయార్క్ నగరంలో సాంస్కృతిక ప్రాభవం నలుదిశలా ప్రసరించడానికి ఆవిడ తరంలో మరే రచయితా చెయ్యనంత కృషి చేశారామె..

----------------------------------------------------------------------------------------------

తొలినాళ్ళలో రచనా వ్యాసంగంలో రచయిత ఎదుర్కునే ఆటుపోట్లను గురించి జాక్ లండన్ రాసిన 'మార్టిన్ ఈడెన్' సుసాన్ మీద చాలా ప్రభావం చూపించింది..ఆ నవలలో ప్రొటొగోనిస్ట్ అనుభవించే ఏకాకితనం,స్వాప్నికతల్లో ఆమె తనను తాను చూసుకుంది..ప్రచురణకు పంపిన తన రచన కి సంబంధించి మొదటి రిజెక్షన్ లెటర్ అందుకున్నప్పుడు, "నేనేమి నిరాశ చెందడం లేదు,పైగా చాలా ఉద్వేగంగా ఉంది,ఎందుకంటే మార్టిన్ ఈడెన్ ను గురించి ఆలోచిస్తే నాకర్థమైన విషయం ఏంటంటే ఈ తిరస్కారం ఒక రచయిత్రిగా నా ఉనికికి తొలి చిహ్నం." అంటుంది.

1966 లో 33 ఏళ్ళ వయసులో Against Interpretation పేరిట సోంటాగ్ ప్రచురించిన వ్యాసాలు రివ్యూయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి..
స్పష్టత కంటే అబ్స్ట్రాక్ట్ పట్ల సుసాన్ కున్న అబ్సెషన్ గురించి రాస్తూ అమెరికన్- జర్మన్ తత్వవేత్త Herbert Marcuse “She can make a theory out of a potato peel,” అంటారు.

ఫిక్షన్ రాయడంలో సోంటాగ్ శైలి లో 'అనిశ్చితి' ప్రధానంగా కనిపిస్తుంది..ఏమీ చెప్పకుండానే ఏదో చెప్పాలనే తపనతో,తన పాత్రల గురించి గానీ,అవి ఉన్న సందర్భం గురించి గానీ ఎటువంటి స్పష్టతా లేని ఆమె నేరేటివ్స్ పాఠకుల్లో భావోద్వేగాలను కదిలించడంలో ఘోరంగా విఫలమయ్యేవి..పాఠకులు కూడా తమను ఏవో సిద్ధాంతపరమైన వర్ణనలతో జిమ్మిక్కు చేసి రచయిత మోసం చేసినట్లు భావించేవారు..కానీ ఈ తరహా శైలిని అవలంబించడంలో సుసాన్ ఉద్దేశ్యం వేరు..దీనికి 'ఫాసినేటింగ్ ఫాసిజం' అనే వ్యాసాన్ని ఉదహరిస్తే,'ఆ వ్యాసం ఉద్దేశ్యం నిజానికి ఏదో నొక్కి చెప్పాలనో లేదో ఎవర్నో దూషించాలనో కాదు..మృతమైనదాన్ని(తండ్రి) పునర్జీవింపజెయ్యాలనే తపన..తన ఆలోచనకందనిదాన్ని ఆలోచించాలనే కోరిక (Artaud),అనిర్వచనీయమైనదాన్ని నిర్వచించాలనే  తాపత్రయం (ఆమె రాసిన Camp అనే వ్యాసం)..నిజానికి ఇవన్నీ చర్చల్ని సమాధి చేసే రాతలు కావు,చర్చను ఆహ్వానించే రాతలు..ఆమె రాతలు ఆలోచనలు రేకెత్తిస్తాయి,మేథస్సుకు పదును పెట్టమంటాయి..చర్చకు ప్రేరణగా నిలవడం ఒక గొప్ప విమర్శకురాలి లక్షణం.'

-----------------------------------------------------------------------------------------

కేవలం వారం రోజుల పరిచయం తరువాత 17 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ ఫిలిప్ రీఫ్ ను వివాహం చేసుకున్న సోంటాగ్,వివాహబంధాన్ని 'యజమాని-బానిస' సంబంధంగా మాత్రమే చూశారు..ఒకరి స్వేచ్ఛనొకరు హరించేసుకుంటూ,ఒకరికొకరు లొంగిబ్రతకడం అనే భావంతో మొదలైన వాళ్ళ సంసారం విఫలం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

రీఫ్ తో వివాహ వైఫల్యం గురించి సోంటాగ్ ఇలా రాశారు :
"పెళ్ళిని నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లైతే  నేనసలు పెళ్ళిచేసుకునేదాన్ని కాదు..పెళ్ళిలో ఉండే 'ప్రత్యేకత','ఊపిరిసలపనివ్వని అతిప్రేమ' అంటే నాకు ఏవగింపు..ప్రతీ జంటా ఆ సాన్నిహిత్యంలో ఒకప్రక్క విసిగిపోతూ కూడా తమ బంధాన్ని ప్రపంచానికెదురీది మరీ కాపాడుకుంటూ ఉంటారు..
ఒకవేళ మొదట్నుంచీ మేము వివాహాన్ని వేరుగా అర్ధం చేసుకునుంటే...ఒకవేళ మేము ప్రేమలో కాకుండా,ప్రేమ అనే ఐడియా తో పీకల్లోతు ప్రేమలో ఉండి ఉండకపోతే....ఈలోకంలో వ్యభిచారం,నాగరికమైన సర్దుబాట్లు,సౌకర్యార్ధం చేసుకునే పెళ్ళిళ్ళు లేదా సహజీవనాలూ ఇవన్నీ ఉంటాయి,అన్నిసార్లూ   చెల్లుబాటవుతాయి కూడా..కానీ ఇవేవీ నీకూ,నాకూ వర్తించవు..అవునా ?
మనమిద్దరం పిరికివాళ్ళం,సులువుగా గాయపడేవాళ్ళం,సెంటిమెంటల్ ఫూల్స్ మనం.."

సెక్సువల్ ప్లెషర్ విషయంలో Freud ప్రతిపాదించిన “the sadistic conception of coitus” ప్రభావానికి లోనుకావడంతో బాటుగా,తల్లితండ్రుల ప్రభావంలేని 'ఆదర్శవంతమైన ప్రేమ' (Freud again) ను సాధించడం సోంటాగ్ విషయంలో అసాధ్యం కావడంతో ఆమె సన్నిహిత సంబంధాలన్నీ ఒకదాని వెంబడి మరొకటి తెగిపోసాగాయి..తనపై తల్లితండ్రుల ప్రభావాన్ని సోంటాగ్ ఒక “profoundest experience” గా అభివర్ణిస్తారు..వివాహ వైఫల్యానంతరం కొన్నేళ్ళకు ఆమె ఇలా రాశారు, “In each case, which was I to be? I found more gratification as a slave; I was more nourished. But—Master or slave, one is equally unfree.”

Ironically, though, she turned her lovers, including Irene, Carlotta, Nicole, and Lucinda, into avatars of her own mother.

---------------------------------------------------------------------------------------------

'సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్' దిశగా అడుగులు వేసే వారిపట్ల మాత్రమే నాకు ఆసక్తి అంటారు సుసాన్..సుసాన్ కుమారుడు డేవిడ్ రీఫ్ తల్లి వ్యక్తిత్వం గురించి చెప్తూ,"వర్తమానంలో ఆనందంగా ఎలా జీవించాలో తెలీకపోవడం సుసాన్ జీవితంలోని ఒక గొప్ప విచారం" అంటారు.

"Susan had grown up “trying both to see and not to see,” ప్రపంచాన్ని ఉన్నదున్నట్లుగా చూడడమనే అతి సాధారణమైన పని సోంటాగ్ చాలా  ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సొచ్చేది..ఒక్కోసారి ఆమెలో ఇలా చూడడాన్ని ప్రతిఘటించే అంశమేదో ఆమెలో బలంగా ఉండేది..బస్సుల్లోనూ,ట్రైన్లలోనూ ప్రయాణించేటప్పుడు ఆమె డేవిడ్ ను కిటికీ బయటకు చూడనిచ్చేది కాదని డేవిడ్ గర్ల్ ఫ్రెండ్  Joanna Robertson అంటారు..ఒక ప్రాంతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాస్తవాలూ,చరిత్రా రూపంలో వింటేనే అర్ధమవుతుంది గానీ,కేవలం కిటికీలోంచి ఆ ప్రదేశాల్ని చూడడం వల్ల ఆ ప్రాంతం గురించి తెలిసే అవకాశం లేదనేవారట సోంటాగ్.. ఒకసారి డేవిడ్ లండన్ వెళ్ళిన కొత్తల్లో కిటికీ బయటకి చూస్తుంటే వద్దని తీవ్రంగా శాసించారట సోంటాగ్..సోంటాగ్ చివరి రోజుల్లో ఒకసారి ముగ్గురూ  ట్రైన్లో ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా ఎదురుగా చూస్తూ కూర్చున్న ఆమెను చూసి ఇద్దరం నవ్వుకున్నామంటారు జోన్నా..“I remember David and I winking at each other—an inside joke about her utter refusal to just look out there and take in what she saw. The world as is, in the raw, happening now. No connection.”

------------------------------------------------------------------------------------------

'సుసాన్ సోంటాగ్' అనే సాహితీ దిగ్గజపు ముసుగు చాటు 'సుసాన్' నిజానికి చాలా బలహీనురాలని అంటారు ఆమె గర్ల్ ఫ్రెండ్ హారియట్,సోంటాగ్ కూడా  కొన్ని చోట్ల తనని తాను 'puny' అని రాసుకునేవారు..కాల్పనిక ప్రపంచంలో పెస్సోవా,వలేరి వంటి రచయితలు ఆల్టర్ ఇగోలను తమ గళాన్ని వినిపించడానికి ఉపయోగించుకున్నంత సహజంగా సుసాన్ తన ఆల్టర్ ఇగోలను వాస్తవ జీవితంలో తన బై  సెక్సువాలిటీ ని దాచుకునే రక్షణ కవచాలుగా ధరించింది..ఆల్టర్ ఇగోలను అంత సమర్ధవంతంగా నిజజీవితానికి అన్వయించిన సోంటాగ్ ను ఈ కారణంగా ఒక్క వ్యక్తిగా చూడడం అసంభవం..బోస్నియా యుద్ధ వాతవరణంలో ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రాణాలు సైతం లెక్ఖ చెయ్యకుండా సరజేవో చేరుకొని,ప్రపంచానికి అక్కడి ఆర్తనాదాలు వినిపించేలా బెకెట్ 'వెయిటింగ్ ఫర్ గోడోట్' నాటకాన్ని పలుమార్లు నిర్వహించిన ధీరోదాత్తత ఆమెదే,సహచరి Anne Leibovitz పట్ల అథారిటీతో కూడిన కాఠిన్యం ఆమెదే,కొడుకు డేవిడ్ ను క్యాన్సర్ సమయంలో వదిలేసి సహచరితో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన స్వార్థం కూడా ఆమెదే..సల్మాన్ రష్దీ కి కష్టకాలంలో కోటగోడలా నిలబడిన బలమైన వ్యక్తిత్వం ఆమెదే..సుసాన్ సోంటాగ్ అనేక వ్యక్తులూ,వ్యక్తిత్వాల మేళవింపు.

డేవిడ్ ఫ్రెండ్ మరియు రచయిత అయిన Jamaica Kincaid డేవిడ్ కాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా మాములుగా తిరిగి వచ్చిన సుసాన్ గురించి రాస్తూ,
Then Susan came back and became the adoring mother. But David was very wounded by this, and that was the first exposure I had to her. It’s not ruthlessness. It’s just Susan-ness. None of the words or the ways of characterizing her behavior really fit. Yes, she was cruel and so on, but it wasn’t that, she was also very kind. She was just a great person. I don’t think I ever wanted to be a great person after I knew Susan. అంటారు.

ఆమె అందం,లైంగికత ఆమెలో అసలు వ్యక్తి కంటే 'సోంటాగ్ అనే ఇమేజ్' ను తయారుచేసుకోవడంలో ఆమెకు ఎక్కువగా సహాయపడ్డాయి..తన బలహీనతల్ని కప్పేస్తూ ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో వ్యక్తిత్వాన్ని ప్రదర్శనకు పెట్టిన ఆ 'సోంటాగ్ ఇమేజ్' ఆమెకు ఊపిరాడనిచ్చేది కాదు..దీనికితోడు సేదతీరడానికి కుటుంబం,ఆస్తిపాస్తులు-వృత్తి అందించే స్థిరత్వం,రక్షణ లాంటివేవీ లేని ఆమె చివరకు తనకు అత్యంత సన్నిహితుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ జీవితాంతం ఒక 'ఆల్టర్నేట్ సెల్ఫ్' క్రింద తలదాచుకున్నారు.. Through writing, she said, “I create myself.”And it was to this other self that she appealed now: “Give me strength, tall lonely walker of my journals!” “To have two selves is the definition of a pathetic fate,” she later wrote.

సోంటాగ్ చుట్టూ ఎవరూ లేనప్పుడు వ్యక్తమయ్యే ఆమె ప్రైవేట్ సెల్ఫ్/సెక్సువల్ సెల్ఫ్ ఒకవైపైతే, నలుగురిలోనూ ఆమెకు ప్రాతినిథ్యం వహించే సోషల్ సెల్ఫ్ (ఒక మెటఫోర్/ ఒక మాస్క్) మరోవైపు ఉండేవి..వీటితోపాటు సోంటాగ్ ను జీవితాంతం వెంటాడిన మరో ఆల్టర్ ఇగో,సుసాన్ సోంటాగ్ తాను ఇలా ఉండాలని కలలుగన్న 'ఐడియల్ సెల్ఫ్'.“That person who has been watching me as long as I can remember is looking now,” she wrote at just fourteen.

తనలోని ఈ ఆల్టర్ ఈగోలే తాను రచయితగా మారడానికి కారణమంటూ 1959 లో ఆవిడ ఈవిధంగా రాశారు : "నాలో రాయాలనే కోరిక నా హోమోసెక్సువాలిటీతో బలంగా ముడిపడి ఉంది..నా హోమోసెక్సువాలిటీకి సమాజం నుండి ఎదురయ్యే తిరస్కారమనే ఆయుధాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మరో ఆయుధం నాకు చాలా అవసరం..ఆ ఆయుధం నాకు 'రచయిత' అనే ఐడెంటిటీ."

-------------------------------------------------------------------------------------------

సుసాన్ తొలినాళ్ళలో లెఫ్ట్వింగ్ ఇంటెలెక్చువల్ గా మనిషి లైంగికతనూ,conformity భావజాలాల్నీ ప్రశ్నిస్తూ పాలనా వ్యవస్థపై ధిక్కారస్వరం వినిపించారు..'రాడికలిజాన్ని' వ్యక్తి స్వేఛ్చకూ,సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి వాటికి అవకాశమిచ్చేదిగా భావించారు..కానీ సోంటాగ్  వాదాలన్నీ నర్మగర్భంగా,అస్పష్టంగా ఉండేవి..But when she hinted at her attraction to women, she only did so obliquely. “She would talk about how you’ve got to grow out of this society where it assumes you’re all one thing,” he said.

సుసాన్ కు కళపట్ల సెన్సిటివిటీ లేదని చాలా మంది అభిప్రాయపడతారు..
కానీ ఆ లేకపోవడంలోనే  ఆవిడ వ్యాసాలను మిగతావాటికంటే వేరుగా నిలబెట్టే ప్రత్యేకత కూడా ఉంది..తనలో రాయాలనే కోరికకు ప్రేరణ గురించి రాస్తూ, "నాలో అహంకారానికి ప్రతిగా నాకు రాయడం అవసరం అనుకుంటాను..నేనేదో చెప్పితీరాలి కాబట్టి రాస్తాను అనేకంటే,కాస్త గర్వాన్ని ప్రోగేసుకుని ఈ జర్నల్స్ లో ఉన్న fait accompli లాగా నేను 'రచయిత' అనే ప్రత్యేకమైన వ్యక్తిని కావాలనుకుంటాను కాబట్టి రాస్తాను..నిజానికి మంచి రచయితలందరూ ఉన్మాద స్థాయిలో గొంతెత్తి తమ ఉనికిని చాటుకునే అహంకారులే." అంటారు.

నిజమైన సుసాన్ పబ్లిక్ లో తెరవెనుక అదృశ్యంగా ఉంటూ తన రచనల ద్వారా తనకు తెలియని అపరిచిత పాఠకుడికి తనను తాను తెలియజేసుకునేది..ఒక ఎంటర్టైన్మెంట్ గా కంటే ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' గా  చూడవలసిన ఆమె రచన 'The Benefactor' ను దీనికి ఒక ఉదాహరణగా చెప్తారు..సోంటాగ్ లో ఇతరుల్ని నిజమైన మనుషులుగా యధాతథంగా చూడలేనితనం ఈ రచనలో కనిపిస్తుందంటారు..As much as this question is intellectualized and abstracted in The Benefactor—and Sontag always abstracted and intellectualized precisely the things she cared about most.

“X, The Scourge” offers a magnificent example of her ability to see things and situations with uncanny accuracy—and of her inability to use this intellectual knowledge in a practical, emotional way.

---------------------------------------------------------------------------------------

'న్యూ యార్క్ రివ్యూ బుక్స్' ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన సుసాన్ సోంటాగ్ ను ఒక వ్యాసకర్తగానే చూడాలంటూ,ఆమెకు ఫిక్షన్ రాయడం చేతకాదని తరచూ వినిపించే అభిప్రాయం ఆమె స్థాయిని తగ్గించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు బెంజమిన్.
It is a need to cut Sontag down to size: to humble a person who seemed so intimidating. It is, moreover, twice wrong. Sontag wrote some excellent fiction, and she wrote some awful essays. Her successes were inextricable from her failures, both products of a mind in constant flux.

సోంటాగ్ "On Style" లో ప్రపంచాన్ని ఒక 'aesthetic phenomenon' గా అభివర్ణిస్తారు..ఈ కారణంగా ఆమె జీవితంలో తొలినాళ్ళలో రాజకీయాలకూ,ఐడియాలజీలకూ,మానవసంబంధాలకూ--వీటన్నిటిపై మానవీయ దుష్ప్రభావాలకూ అతీతంగా గడిపారు..ఆమె మలినాళ్ళలో రాజకీయాలకు చాలా దగ్గరగా గడపడానికి కారణం కూడా ఇదే కావచ్చు.

-------------------------------------------------------------------------------------

ఈ పుస్తకంలో సుసాన్ ను ఒక రచయిత్రిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా,ఆమె కష్టసుఖాల్లో తోడు నీడలా వెన్నంటి నిలచిన Farrar, Straus & Giroux (FSG) పబ్లిషింగ్ సంస్థ అధినేత రోజర్ స్ట్రాస్,'రోలింగ్ స్టోన్' పత్రిక కవర్ పేజీ ఫోటోలతో పాటు అనేక మంది ప్రముఖుల్ని తన కెమెరాలో బంధించిన ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ Annie Leibovitz,ఫిలిప్ రీఫ్,డేవిడ్ రీఫ్,జోసెఫ్ బ్రాడ్స్కీ,డియాన్ ఆర్బస్,Lucinda Childs,పాల్ థెక్,వార్హోల్,వాల్టర్ బెంజమిన్,బార్తెస్ మొదలగు అనేకమంది కళాకారుల,సాహితీలోకపు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయవిశేషాలుంటాయి..ఈ పుస్తకం పాఠకులకు ఒక పూర్తి స్థాయి 'కల్చరల్ ఫీస్ట్'.

------------------------------------------------------------------------------------------

కొంచెం కూడా దయాదాక్షిణ్యంలేని 'సెల్ఫ్ అవేర్నెస్' సోంటాగ్ సొంతం..ఆమెకు జీవితంపై ఎంత వ్యామోహమంటే చిన్న కునుకు పడితే కూడా,ఆ క్షణాల్లో జీవితం ఎక్కడ చేజారిపోతుందేమో అన్నంత ఉన్మాద స్థాయిలో ఉండేదట..వారాల తరబడి నిద్రలేకుండా,కార్టన్ల కొద్దీ మార్ల్బోరోస్ సిగరెట్లు,కాఫీ ప్రవాహాల్లో గొంతులోకి జారిపోయే డెక్సీడ్రైన్ బాటిళ్ళ మధ్య మెదడుకీ,శరీరానికీ భేదాన్ని పూర్తిగా చెరిపేసిన వ్యక్తి సోంటాగ్  : "నాకు శరీరం లేదు,నాకున్నదల్లా మెదడూ,దాని ఆలోచనా మాత్రమే" అని అనడం పైపైన నటించే వ్యక్తికి సహజమైనప్పటికీ,ఆ వ్యక్తి తాలూకూ ఇమేజ్ వెనుక అసలైన భౌతిక శరీరం ప్రతిఘటించకుండా ఊరుకోదు కదా ! నలభై ఏళ్ళ వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది.."నా స్వభావసిద్ధతను ప్రపంచం నుండి దాచి ఒక పిరికిదానిలా జీవించాను కాబట్టి నేను కాన్సర్ ను కోరి ఆహ్వానించుకున్నానంటారు" సోంటాగ్.

This portrait of repression, inwardness, and sadness—the one she denounces as punitive and medieval—coincides, however, exactly with the self-portrait in her journals, the hidden self that she almost never allowed to appear in public or in her writings: the persona, or mask, that she had evolved as a means of survival. “I’m responsible for my cancer,” she wrote. “I lived as a coward, repressing my desire, my rage.” Susan blamed herself bitterly.

-----------------------------------------------------------------------------------------------

ఈ పుస్తకం మొత్తంలో సోంటాగ్ ఒక మామూలు స్త్రీ లా ఆలోచించిన ఒకే ఒక సందర్భం :
"నాకెప్పుడూ బుల్లీస్ నచ్చుతారు..నేను అందంగా ఉండనని ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళై ఉంటారు..ఆ తిరస్కరించడంలో వాళ్ళలో నాకు సుపీరియర్ క్వాలిటీస్ ,మంచి అభిరుచి కనిపిస్తాయి" అంటారు (ఉదాహరణకు ఆమెను చులకనగా చూసిన హారియట్,ఆల్ఫ్రెడ్,ఐరీన్ ల పట్ల ఆమెకున్న ప్రేమ).."నా మీద నాకు గౌరవం లేదు..నేను ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తున్నా,ఆ ప్రేమరాహిత్యానికి ఎదురెళ్ళి పోరాడుతున్న నాలోని సైనికురాల్ని గౌరవిస్తాను..నేను మళ్ళీ బుల్లీస్ పట్ల ఎప్పుడూ ఆకర్షితురాల్ని అవ్వను" అంటారు.

---------------------------------------------------------------------------------------

'Styles of Radical Will' పుస్తకంలో ‘Thinking Against Oneself’: Reflections on Cioran.” పేరిట రాసిన వ్యాసంలో  “To exist is a habit I do not despair of acquiring.” అంటారు సుసాన్..మనం మానవీయ స్పృహ(మేథస్సు) కారణంగా ఉత్పన్నమైన అనేక ఉపద్రవాలను సవరించే ప్రయత్నం ఎంత చేసినా 'హ్యూమన్ కాన్షియస్నెస్' ను ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని అంటూ,ఈ మార్గంలో మనిషికి వెనక్కి తిరగడం అసాధ్యమనీ,ముందుకు అడుగేసి 'ఆలోచన' తుదివరకూ పూర్తి స్పృహతో ప్రయాణించడంలోనే మనిషికి గౌరవం ఉందనీ అంటారు.

For Sontag, it would be no easy thing to unite the beastly body to the intellectual realm, the realm of language, metaphor, and art.

----------------------------------------------------------------------------------------------

ఫోటోగ్రఫీ గురించి రాస్తూ, “Photographing is essentially an act of non-intervention,” అంటారు సోంటాగ్. 'On Photography' అనే పుస్తకంలో ఆమె ఫోటోగ్రాఫ్ ని 'వినియోగదారుని చవకబారు కృత్రిమ కళా సృష్టి' (consumerist kitsch) గా అభివర్ణిస్తారు..ఫొటోగ్రాఫ్స్ ను 'నిరంకుశత్వపు నిఘా' అంటూ, కెమెరాలను “వేటగాని ఆయుధాలనీ',ఫొటోగ్రాఫర్లను 'పీపింగ్ టామ్స్' అనీ,voyeurs,సైకోపాత్స్ అనీ అంటారు : కెమెరాను ప్రతి వాడకంలోనూ నిస్సందేహంగా ఒక 'దురాక్రమణ ధోరణి' ఉంటుందంటారు.

ఇందులో డియాన్ ఆర్బస్ ఫోటోగ్రఫీ గురించి ఆమె రాసిన వ్యాసాలను బెంజమిన్ విశ్లేషించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది :
ఆర్బస్ ఫోటోగ్రఫీని సోంటాగ్ ఏ దృష్టితో చూశారో రాస్తూ,

ఆ వ్యాసాల్లో 'ఫోటోగ్రాఫర్ ఆర్బస్' ఆమే,అతడు ఫోటో తీసిన 'పిచ్చివాడూ' ఆమే..'ఫోటోగ్రాఫరూ',అతడి 'సబ్జెక్టు' ఈ రెండూ కూడా ఆమే..ఇందులో జడ్జి,నిందితుడూ రెండూ ఆమే అంటూ సోంటాగ్ లో ఈ సందిగ్ధతకి కారణం,ఈ రాతలన్నీ ఆమె తనకోసం తాను రాసుకోవడమేనంటారు..సుసాన్ వ్యక్తిత్వంలో కీలక భాగమైన అపనమ్మకాన్ని ఈ వ్యాసాల ద్వారా ప్రక్షాళన చేసుకునే దిశగా ఇదంతా తనకు తాను చెప్పుకుంది,అందుకే సుసాన్ కి ఫోటోగ్రఫీ అంటే ద్వేషమని అనుకునేవాళ్ళదెంత మూర్ఖత్వమో,ఆమెకు ఫోటోగ్రఫీ అంటే ప్రేమ అనుకునేవాళ్ళదంతే మూర్ఖత్వం అంటారు.
ఆమె తనను తానెంత అపనమ్మకంతో చూసుకుందో,ఫోటోగ్రఫీని కూడా సరిగ్గా అదే దృష్టితో  చూసింది సుసాన్ : the division she had described in 1960 between “I’m no good” and “I’m great".

ఆర్బస్ ఫోటోగ్రఫీ లో ప్రధానంగా కనిపించే 'విషాదపూరితమైన స్పృహ' సోంటాగ్ రచనల్లో కూడా ప్రస్ఫు టంగా కనిపిస్తుంది..'On photography' లో ఫోటోగ్రఫీ అనే సబ్జెక్టును వస్తువులూ,వాటి ప్రతిబింబాలూ / వర్ణన,దాని చుట్టూ ఉన్న వాస్తవికతల్లా విభజిస్తూ ఒక 'డివైడెడ్ కాన్షియస్' తో చూసినా, వాస్తవానికీ,కల్పనకూ మధ్య ఉండే స్పేస్ ని అర్థంచేసుకోవడం పట్ల   ఆమెకున్న అబ్సెషన్ కనిపిస్తుంది.. the camera, which packages reality into an easily accessible consumer good. The desire to “acquire” reality should not be reduced to consumerism, since for Sontag it went far deeper. But it is true that the camera allows people’s freakishness—their suffering—to be sliced up, placed on the wall, sold: transformed into a product.

---------------------------------------------------------------------------------------------

ఈ పుస్తకంలో సోంటాగ్ గర్ల్ ఫ్రెండ్స్ Harriet, Irene, and Carlotta, Nicole లతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని పేజీలు కేటాయించారు..కాగా
సుసాన్ స్నేహితుల్లోకెల్లా చాలా ముఖ్యమైన మిత్రుడు మరియు మెంటర్ అయిన కవి  జోసెఫ్ బ్రాడ్స్కీ తో ఆమె అనుబంధాన్ని గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి..సుసాన్ లాంటి వ్యక్తిని సైతం తన అథారిటీతో కూడిన వ్యక్తిత్వంతో కట్టిపడెయ్యగల సమర్థత ఉన్న ఏకైక వ్యక్తి బ్రాడ్స్కీ..అతడు 'ఆమె టస్కన్ లోను,షెర్మాన్ ఓక్స్ లోనూ కలలుగన్న మిత్రుడు..భర్త ఫిలిప్ రీఫ్ లో చూడాలని కలలుగన్నగురువు..జీవిత సహచరుడు,తనకు సరిసాటైన మేథావీ,కళాకారుడూ..కొన్నిసార్లు అతడు ఆమెకు సుపీరియర్ కూడా'..అతడికంటే సోంటాగ్ కు అభిరుచులు కలిసిన అనుకూలమైన వ్యక్తి మరొకరు తారసపడలేదు.,and it was in these terms that she mourned his premature death, at fifty-five: “I’m all alone,” she told a friend. “There’s nobody with whom I can share my ideas, my thoughts.”

ఈ పుస్తకంలో జోసెఫ్ బ్రాడ్స్కీ తో పాటు సుసాన్ జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ఒకరైన వాల్టర్ బెంజమిన్ కి కేటాయించిన పేజీలు అద్భుతంగా ఉన్నాయి..సుసాన్ శైలినీ,బెంజమిన్ శైలినీ పోలుస్తూ చేసిన విశ్లేషణలు సుసాన్ లో melancholic తత్వాన్ని అర్ధం చేసుకోడానికి మరింత దోహదపడతాయి..'Under the sign of Saturn' పుస్తకంలో వాల్టర్ మీద ఆమె ఒక వ్యాసాన్ని రాశారు..Saturnine sign క్రింద పుట్టిన వ్యక్తులు స్వభావసిద్ధంగా విచారగ్రస్తమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు..అసత్యమాడడం,రహస్యాలు దాచడం వీరికి సహజం..కానీ ఇవన్నీ ఆ వ్యక్తిత్వానికి కవచ కుండలాల్లాంటివి..దీనికితోడు వీళ్ళు స్వేఛ్ఛాజీవులు కావడంతో సుసాన్ లాగే వాల్టర్ కూడా స్నేహితుల్ని దూరంగా తోసేసేవారట ..ఈ ఇమడలేకపోవడాన్నీ,అసంతృప్తినీ విస్తృతంగా చదవడం,రాయడం వెనుక దాచుకునేవారు వాల్టర్.

ఈ తత్వం ఉన్న వ్యక్తులకు వాళ్ళ అస్తిత్వంతో సమానమైన 'కళ' ను పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరం..వాల్టర్ పుస్తకాలను ఒక ఉన్మాదంతో ప్రోగుచేసేవారట..పుస్తకాల ద్వారా,ఆబ్జెక్ట్స్ ద్వారా తనను తాను నిరంతరం  పునర్నిర్మించుకుంటూ ఉండేవారట..ఆయన ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాల్లో నాజీల చేత చిక్కి కోల్పోయిన ఆయన లైబ్రరీ కూడా ఒక కారణం అంటారు.

“The only pleasure a melancholic permits himself, and it is a powerful one, is allegory,” Benjamin wrote, and Sontag quoted him approvingly.

--------------------------------------------------------------------------------------------

ఇంత గొప్ప వ్యక్తి కదా మరి ఫెమినిస్టుల జాబితాలో సుసాన్ పేరు కనిపించదెందుకని ఒకప్పుడు ఆశ్చర్యం వేసేది..దీనికి కూడా ఒక కారణం ఉంది..ఆమె 1974 లో ప్రచురించిన 'Fascinating Fascism' అనే వ్యాసంలో 'నాజీ ప్రాపగోండిస్ట్' గా ముద్ర పడిన అమెరికన్-జర్మన్ దర్శకురాలు Leni Riefenstahl పై ఆధారాలు లేని విమర్శలు చేశారు..Leni కి కేవలం ఒక స్త్రీ కావడం వలన గుర్తింపు వచ్చిందే గానీ ఆమె ఆర్ట్ కూడా 'ఒక అందమైన ఫాసిజం' అని అని విమర్శించారట..అప్పట్లో సోంటాగ్ స్థాయికి తగ్గని రచయిత్రి,విమర్శకురాలు అయిన Adrienne Rich సోంటాగ్  వ్యాఖ్యల్ని ఖండించగా,సోంటాగ్ రిచ్ పై విమర్శలతో ఎదురుదాడికి దిగిన కారణంగా సాటి ఫెమినిస్టు ప్రపంచం ఆమెను ఎప్పుడూ తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడలేదంటారు..సోంటాగ్ స్త్రీవాద రచనలు కాలగర్భంలో కలిసిపోడానికి ఇదొక కారణం.

Although it is a lot of fun to do, the essay that was written most quickly was, of course, the Leni Riefenstahl because it’s much easier to write when you feel angry, self-righteous and you know you are right.”

ఈ పుస్తకంలో సరజేవోలో ఉన్నసమయంలో సోంటాగ్ “You have no right to a public opinion unless you’ve been there.” అన్న తన మాటలకే విరుద్ధంగా సెప్టెంబర్ 11 అటాక్స్ జరిగిన సమయంలో అమెరికా విదేశాంగ విధానాల్ని దుయ్యబడుతూ రాసిన వ్యాసం చదివి తీరాల్సిందే..ఈ సందర్భంగా ఆమెను విమర్శిస్తూ ఆమెకు వ్యతిరేకంగా క్యాంపైన్లు జరిగినప్పటికీ సోంటాగ్ తన మాటల్ని వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం.

---------------------------------------------------------------------------------------

చివరగా సుసాన్ రాయడం గురించి ఒక యువ రచయితకు సూచనలు చేస్తూ
నోబుల్ గ్రహీత Halldor Laxness 'Under the Glacier' నవలలో ఒక బిషప్ రచయితకు చేసిన సూచనలను quote చేస్తారు :
"మరీ వ్యక్తిగతంగా రాయకు..పొడిపొడిగా రాయి !.. సాధ్యమైనంత ప్రథమ పురుషలోనే రాయడానికి ప్రయత్నం చెయ్యి..రాసినదాన్ని పరీక్షించకు !..బహుశా చాలామంది మొత్తం నిజాన్ని కాదు సరికదా,అసలు నిజంలో కూడా చాలా కొద్ది భాగమే చెప్తారని మర్చిపోవద్దు..నిజం చెప్తున్నా,అబద్ధం చెప్తున్నా కూడా మనుషులు మాట్లాడుతున్నప్పుడు తమని తాము తెలియపరుచుకుంటారు..ఉద్దేశ్యపూర్వకంగా నీకు చెప్పిన అబద్ధం కూడా,నీకు నిజాయితీతో చెప్పిన నిజం కంటే కూడా అనేకసార్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకో..వాళ్ళని సరిచెయ్యకు,సరిదిద్దకు,వాళ్ళని అర్థం చేసుకోవాలని(interpret) అసలే  ప్రయత్నించకు."

--------------------------------------------------------------------------------------

కొందరు వ్యక్తుల్ని తెలుసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదు..కేవలం కంటికి కనిపించే మనిషి కంటే లోపల అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ కలిగి ఉంటారు వాళ్ళు..అటువంటి వారిని చదవడం సాగర మధన సమానం..సుసాన్ సోంటాగ్ అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు..ఈ పేజీల మధ్య 'సుసాన్' అనే ఐడియా తో ఎన్నోసార్లు ప్రేమలో పడ్డాను..అలాగే 'సోంటాగ్' ను అనేకసార్లు ద్వేషించాను..ప్రేమ్ నగర్ లో నాగేశ్వర్రావు డైలాగ్ ఒకటుంటుంది,"ఇవన్నీ భరించాలంటే మనిషి మీద అభిమానం ఉండాలని" :) సోంటాగ్ మీద ఆ అభిమానం ఉంటే మాత్రం ఈ పుస్తకం తప్పక చదవండి.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు,

“Susan literally sat at the feet of only two people. If she came into a room and saw either of these two people she’d sit right here on the floor: Hannah Arendt and Carlotta.

Inauthenticity was the price Sontag paid for maintaining her cultural centrality; and the center of that culture was about to shift.

Fritz told me that what got him through his nearly three years in the prison camp in Arizona was that he was allowed access to books: he had spent those years reading and rereading the English and American classics. And I told him that what saved me as a schoolchild in Arizona, waiting to grow up, waiting to escape into a larger reality, was reading books, books in translation as well as those written in English.
To have access to literature, world literature, was to escape the prison of national vanity,of philistinism, of compulsory provincialism, of inane schooling, of imperfect destinies and bad luck. Literature was the passport to enter a larger life; that is, the zone of freedom. Literature was freedom. Especially in a time in which the values of reading and inwardness are so strenuously challenged, literature is freedom.

Susan exploded. “It is not your job to reject yourself. It is their job. You put your name in the hat. If they reject you, that is their job. It has nothing to do with you! Why are you making it all about yourself? You are so egotistical!” Brenda dutifully applied—and applied, and applied, and applied, and applied. Finally, on her eleventh attempt, she got it.

Annie Leibovitz సోంటాగ్ గురించి రాస్తూ,
She was very, very tough. She was very hard to please. Ever since I met her, I tried to please her, but it didn’t always work. She was always raising the bar. . . . She was a very tough critic, but also a great admirer, my biggest fan

A belief in the reality of dreams had created Sontag and kept her going through a difficult life. So many of her difficulties came from her refusal to see what most people thought of as reality. But there was a usefulness to the dreamworld. “Create ‘dream picture,’” the Smokenders instructor said. “Something pleasing, relaxing . . . use for distraction.” As it happened, she had lived her life in the “dream picture.” In certain respects, this was a strength, and an anesthetic. She refused to accept limitations—to her talent, to her achievements, to her possibilities for reinvention—that would have stymied more clear-eyed people.

It was as if I had accused her of never having read Proust, or of watching soap operas all day. Her face instantly darkened and she snapped at me violently. Why on earth did I think she’d been having a nap? Didn’t I know she never had naps? Of course she wasn’t having a nap! She would never have a nap! Never in a million years! What a stupid remark to make! How had I gotten so stupid? A nap—for God’s sake!

America, we’re told, is “where the poor can become rich and everyone stands equal before the law, where streets are paved with gold.” America is “where the future is being born.” America is where “everything is supposed to be possible.” “The American,” Ryszard declares in a letter, “is someone who is always leaving everything behind.”

జోసెఫ్ బ్రాడ్స్కీ గురించి సుసాన్,
” With his red hair and bright green eyes, he was very attractive to women, and much of his magnetism derived from the authority he claimed, unapologe“He made a stunning impression,” Susan said. “He was so authoritative personallytically, as a great poet’s birthright. That status brought obligations, the first of which was a dedication to the very highest artistic standards, those his syllabus reflected: “One should write to please not one’s contemporaries but one’s predecessors,” he declared; Susan might have written the same, and in his idea of culture, she found her own.“Man’s greatest enemy is not Communism, not Socialism, not Capitalism,” Brodsky wrote, “but rather the vulgarity of the human heart, of human imagination."

The modern authors can be recognized by their effort to disestablish themselves, by their will not to be morally useful to the community, by their inclination to present themselves not as social critics but as seers, spiritual adventurers, and social pariahs.

Tuesday, January 28, 2020

Inadvertent (Why I Write) - Karl Ove Knausgaard

ప్రతీ మనిషి లోపలా రాయని పుస్తకం ఒకటుంటుంది..కానీ తమ లోపలి పుస్తకానికి అక్షరాల ఆయుష్షునిచ్చి ప్రాణం పోసే శక్తి అందరికీ ఉండదు,ఆ శక్తి ఉన్నది రచయితలకు మాత్రమే.."మీరెందుకు రాస్తారు?" అనే ప్రశ్న ఒక్కోసారి క్లిష్టమైందిగా అనిపిస్తే మరికొన్నిసార్లు కామికల్ గా అనిపిస్తుంది..అయినా అదేం పిచ్చి ప్రశ్న! ఎవరైనా రాయగలరు కాబట్టి రాస్తారు అంటారు కొందరు.. నిజానికి రాయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి..అవి మనిషి మనిషికీ మారతాయి..కొంతమంది విడుదల కోసం రాస్తే,మరికొంతమంది తమ ఉనికిని వెతుక్కోవడం కోసం రాస్తారు..కొంతమంది తమ స్వరాన్ని వినిపించాలని రాస్తే,మరికొంతమంది తమలో చెలరేగే ఆలోచనల అలజడిని తగ్గించుకోడానికి రాస్తారు.

Image Courtesy Google
 నార్వే రచయిత 'కార్ల్ ఓవే కెనాస్గార్డ్' ('K' సైలెంట్ అనుకున్నా ఇంతకాలం) కు కూడా కొన్ని బలమైన కారణాలున్నాయి.. కాఫ్కాలాగే కెనాస్గార్డ్ కి కూడా మొదట్నుంచీ తండ్రితో సత్సంబంధాలు లేవు..తనను తానుగా స్పష్టంగా చూడలేనీ,అంగీకరించలేనీ తండ్రి కాఠిన్యం ఆయన బాల్యం మీద చెరగని ముద్ర వేసిందంటారు.తనలో రచయిత కావాలన్న కోరికకు బీజం పడింది అక్కడే అంటారాయన.."సాహిత్యం నేను ఎవరికీ కనపడకుండా తలదాచుకునే చోటు.అదే సమయంలో అది నేను నేనుగా కనిపించే చోటు " అనడంలో కెనాస్గార్డ్ బాల్యంలో కోల్పోయిన ఉనికిని వెతుక్కునే ప్రయత్నం కనిపిస్తుంది.

రాయడం గురించి ఏ రచయితనడిగినా మొదట వచ్చే సమాధానం "నీకు తెలిసింది రాయి" అనే..కెనాస్గార్డ్ తనకు తెలిసిందే రాశారు..తన జీవిత విశేషాలను,ముఖ్యంగా తన తండ్రితో ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని గురించి ఆయన రాసిన మెమొయిర్ 'మై స్ట్రగుల్' సిరీస్ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది..యేల్ యూనివర్సిటీ ప్రెస్ పాటీ స్మిత్ 'డివోషన్' తరువాత 'Why I Write' సిరీస్ లో భాగంగా ప్రచురించిన రెండో పుస్తకమిది.ఈ పుస్తకంలో ప్రస్తావించిన అనేక విషయాల గురించి పూర్తిగా రాయడం సాధ్యం కాదు కాబట్టి,నాకు నచ్చిన కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను.

కెనాస్గార్డ్ "మీరెందుకు రాస్తారు?" అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమంటూనే రచనావ్యాసంగంలో తన అనుభవాలను  నిజాయితీగా వివరించే ప్రయత్నం చేశారు..కెనాస్గార్డ్ ఆర్థర్ రింబాడ్ లా లిటరేచర్ ప్రాడిజీ కాదు,కేవలం సాహిత్యం పట్ల అభిరుచితో రచయితలవుదామని కలలుగనే సగటు రచయితలకు ప్రతినిధి మాత్రమే..ఈ కారణంగా రాయడమనే కళ ఆయనకు అంత సులభంగా పట్టుబడలేదు..బ్రిటిష్ డైలీ 'గార్డియన్' పత్రిక 'ట్రాష్' అని విమర్శించినా,స్నేహితుడు ఆయన ప్రతుల్ని పడేసి మళ్ళీ ప్రయత్నం చెయ్యమని సలహా ఇచ్చినా,తన పుస్తకం ప్రచురణకు తిరస్కరించబడినా కూడా ఆయన రాయడం మాత్రం మానలేదు..తొలినాళ్ళలో రచయితనవ్వాలనే తన ఆలోచనల గురించి రాస్తూ ఈ విధంగా అంటారు,
"మొదటిసారి నేను రచయితను కావాలని అనుకుని లిటరరీ టెక్స్ట్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు.నిజానికి నేనెందుకు రాయాలనుకున్నానో నాకిప్పుడు గుర్తులేదు..బహుశా రాయడం పెద్దగా శ్రమపడకుండా నాకు అందుబాటులో ఉన్న విషయం కావచ్చు..అప్పుడు ఉత్తర నార్వేలోని సముద్రపు ఒడ్డున ఒక చిన్న పల్లెటూరిలో టీచరుగా ఉద్యోగం చేస్తున్నాను..అక్కడ నాకెవరూ పరిచయస్థులు లేరు,అందువల్ల నాకు రాసుకోడానికి కావాల్సినంత ఏకాంత సమయం దొరికింది అనుకున్నాను..కానీ అలా జరగలేదు..మహా అయితే నెలకో షార్ట్ స్టోరీ రాయగలిగేవాణ్ణి..ఆ సమయంలో రాసిన కథలన్నీ మా నాన్న ఆథిపత్యంలో నా చిన్ననాటి భయాలు,అనుభవాల సారాంశంగా రాసినవే."
ఈ పుస్తకంలో చాలా అంశాలు నన్ను ఆలోచనలో పడేశాయి..ముఖ్యంగా సంక్లిష్టమైనదే సాహిత్యమనే సిద్ధాంతంతో కెనాస్గార్డ్ తీవ్రంగా విభేదించారు..ఇందులో వివరణలన్నీ ఆయన స్వంత శైలి అయిన రియలిస్టిక్ ఫిక్షన్ ను సమర్ధించే దిశగా సాగాయి..కుందేరా,బోర్హెస్,జేమ్స్ జోయ్స్ వంటివారి ప్రతిభా పాటవాలనూ,రచనా వ్యాసంగంలో విభిన్నమైన ప్రయోగాత్మక శైలుల్నీ ఒక ప్రక్క మెచ్చుకుంటూనే అన్నివేళలా సాహిత్యానికి సంక్లిష్టతను ఆపాదించి రచయిత వాస్తవిక దృక్పథంపై పరిథులు విధించడంపట్ల అసహనం వ్యక్తం చేస్తారు.

తన వాదనను సమర్ధించుకునే దిశగా కనుట్ హంసున్ (Knut Hamsun) 'Hunger' ను,మిలన్ కుందేరా 'The Unbearable Lightness of Being' తో పోలుస్తూ చేసిన విశ్లేషణను ప్రత్యేకంగా ప్రస్తావించాలి..ఈమధ్య మిత్రులొకరు కుందేరాతో తన స్వానుభవాన్ని గురించి చెప్తూ "ఆయన చాలా మీన్ ఫెల్లో" అన్నారు..కుందేరా అభిమానిగా నేను కాస్త ఆశ్చర్యపోయినా ఈ పుస్తకంలో కెనాస్గార్డ్ ఎనాలిసిస్ చదివి ఓహో అనుకున్నాను..కెనాస్గార్డ్ తనకు కనుట్ హంసున్ 'హంగర్' అద్భుతంగా అనిపిస్తే కుందేరా రచన పట్ల మాత్రం 'స్వభావసిద్ధమైన అయిష్టత' కలిగిందని అంటారు..ఎంత అయిష్టత అంటే దాని గురించి రాయాలనిపించడం లేదని అంటూ,"As if I could have written about it had I wanted to!" అని చమత్కరిస్తారు.

కెనాస్గార్డ్ విశ్లేషణ ఇలా సాగుతుంది:
"హంసన్ తన రచనలో తన ప్రొటొగోనిస్ట్ ని చాలా సన్నిహితంగా  వెంబడిస్తాడు..ప్రత్యేకమైన ప్లాట్ గానీ,పాత్ర నిర్మాణంతో గానీ పని లేకుండా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది..ప్రొటొగోనిస్ట్ చుట్టూ ఉన్న ప్రపంచం యథాతథంగా ఆ పాత్ర ద్వారానే బహిర్గతమవుతుంది..పాఠకుడి పఠనానుభవంలో అదే ప్రపంచం ఆ ప్రధానపాత్ర ద్వారా వర్తమానంలో వాస్తవంగా రూపాంతరం చెందడంతో అతడికి భూతభవిష్యద్ కాలాల మీద అనవసర ధ్యాస ఉండదు..కానీ కుందేరా నేరేటర్ అలా కాదు,అతడు సర్వజ్ఞుడు..చుట్టూ ఉన్న పాత్రలతో తనకు నచ్చినట్లు వ్యవహరిస్తాడు,అసంబద్ధమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాడు..వాళ్ళకి దూరంగా అంటీముట్టనట్లు ఉంటూ వాళ్ళని తోలుబొమ్మల్లా చేసి ఆడిస్తాడు..ఈ స్థితిలో పాఠకుడి అనుభవంలో 'ఇల్యూజన్ ఆఫ్ రియాలిటీ ' పదేపదే ముక్కలవుతుంటుంది."
Kundera is a writer of ideas, a master of superstructure, and as an essayist he has no peer in contemporary letters. అంటూనే,తన పఠనానుభవంలో  'సానుభూతి' కి చాలా ప్రాధాన్యతనిస్తాను కాబట్టి కుందేరా శైలికీ,లిటరరీ స్ట్రాటజీలకీ స్వతహాగానే దూరం జరిగానంటారు కెనాస్గార్డ్..పాఠకుడి ప్రాథాన్యతలు విస్మరించలేనివనీ,సాహిత్యంలో సాన్నిహిత్యాన్నీ,ఉనికినీ వెతుక్కోవడం తనకు అలవాటని అంటూ,అటువంటి అనుభవాన్ని ఇవ్వని రచనలు పాఠకుణ్ణి ప్రాపంచిక అనుభవాలకూ,వాస్తవికతకూ దూరం చేస్తాయనడం గమనార్హం.

ఈ పుస్తకంలో ఎందుకు రాస్తారని ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కెనాస్గార్డ్ విశ్లేషణలన్నీ ఆ ఐడియా చుట్టూనే తిరుగుతాయి..
There are some fundamental rules of writing, for example that one shouldn’t psychologize when describing characters, or the related dictum “Show, don’t tell,” both of which spring from the realization that literature by its very nature always seeks complexity and ambiguity, and that monologic claims of truth about the world are antiliterary. In line with this, the statement “I write because I am going to die” is antiliterature, but the author with his sweater tucked into his trousers saying that he writes because he is going to die is literature.
ఈ పుస్తకం రైటింగ్ గురించే అయినప్పటికీ ఇందులో రచయితలతో పాటు రచయితలు కావాలనుకునే వాళ్ళూ,పాఠకులూ ఏకకాలంలో ఐడెంటిఫై చేసుకునే అంశాలు అనేకం ఉన్నాయి..ముఖ్యంగా కెనాస్గార్డ్ ఒక రచయిత స్వరంలో కాకుండా ఒక సాహితీ ప్రేమికుడి స్వరంలో చర్చించిన పలు అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి.Must read for readers and writers.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

That identity and our understanding of the world at one and the same time fit yet are arbitrary is, I think, the reason why art and literature exist. Art and literature constitute a continual negotiation with reality, they represent an exchange between identity and culture and the material, physical, and endlessly complex world they arise from.

Every Tuesday I brought home a shopping bag full of books. What I gained from this I don’t know; the essential thing about the books, I think, was that they constituted a place in the world where I could be, where nothing was demanded of me, where on the contrary I got what I wanted. I didn’t know anyone else who read except my brother, so I never talked about what I experienced in books, but it didn’t matter, the whole point of them being precisely that I read them alone, and yet it never felt like that, for while you were reading you were always together with someone else. I never thought about the books once I had finished them, and I didn’t learn anything from them, or rather, that was never the point. I consumed them, passed the time with them, escaped in them.

But as it happens, writing is precisely about disregarding how something seems in the eyes of others, it is precisely about freeing oneself from all kinds of judgments and from posturing and positioning. Writing is about making something accessible, allowing something to reveal itself.

The contradiction between the illimitable that dwells within us and our simultaneous limitation and earthboundness is the driving force behind all literature and all art, or so I believe, but not only that; the longing to  equalize the difference, suspend the contradiction and simply exist in the world, undifferentiated from it, is also an important part of all religious practice.

Of course, that kind of literary experience was what my childhood reading was all about, and this is why the step from reading to writing was such a short one when I turned eighteen: I wanted to be there, in that state of utter absorption where everything else vanished and you were, in a sense, out of the world. To read is to be the citizen of another country, in a parallel realm which every book is a door to.Feelings were generally a problem for me, I felt too easily and too much, and reading somehow provided relief from that, at the same time that it generated new and unfamiliar emotions. In my reading I was in a sense exploring and charting the boundless inner world that Tolstoy had written about. All of it fit within me, and my inner world expanded radically, while the world I was in remained unchanged.

Saturday, January 25, 2020

Sugandhi Alias Andal Devanayaki - T.D.Ramakrishnan

పొరుగుదేశమైన శ్రీలంక భౌగోళిక స్వరూపం గురించి తెలిసినంత దాని అంతర్గత స్వరూపం గురించి నాకు తెలియదు..శ్రీలంక అంటే ఫ్లడ్ లైట్స్ వెలుగులో పచ్చటి మైదానంలో డేగకళ్ళతో గ్రౌండ్ ని కలియజూస్తూ ఓపెనింగ్ కి దిగే అరవింద డిసిల్వా...బ్యాట్ పట్టుకుంటే కన్నూమిన్నూ కానకుండా బంతిని చితక్కొట్టే సనత్ జయసూర్యా..ఇవేవీ కాకపోతే గుర్తొచ్చేది LTTE మాత్రమే..ఇక 'శ్రీలంక సాహిత్యం' : ఈ మాట ఒక పారడాక్స్ లా అనిపిస్తోంది..ఈ వ్యాసం రాసేముందు అసలు శ్రీలంక రచయితలెవరున్నారా అని ఒకసారి గూగుల్ చేసి చూడాల్సొచ్చింది..నిజానికి ఇప్పుడు పరిచయం చెయ్యబోయే పుస్తకం కూడా సింహళంలో రాసిన స్వచ్ఛమైన శ్రీలంక సాహిత్యం కాదు,కేరళ రచయిత టి.డి.రామకృష్ణన్ మలయాళంలో రాసిన 'సుగంధి అలియాస్ ఆండాళ్ దేవనాయకి' శ్రీలంకను గురించిన రచన..2016 లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు,మలయత్తూర్ అవార్డులతో పాటు,2017 లో వాయలార్ అవార్డు కూడా గెలుచుకున్న ఈ నవలను ఇటీవలే ప్రియ కె.నాయర్ ఆంగ్లంలోకి అనువదించారు.
Image Courtesy Google
'యూనివర్సిటీ ఆఫ్ జాఫ్నా'లో లెక్చరర్ గా పనిచేసిన ప్రముఖ తమిళ హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ 'డాక్టర్ రజిని తిరనాగమా' ఎల్టీటీఈ కి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను ఆవిణ్ణి 1989 సెప్టెంబర్ లో తమిళ టైగర్లు పట్టపగలే కాల్చిచంపారు..ఈ నవలను ఆవిడ కథ ఆధారంగా రాశారు..కథ విషయానికొస్తే ఆ హత్యను తమకు అనుకూలంగా మార్చుకుందామనుకున్న శ్రీలంక ప్రభుత్వం,రజిని జీవితాన్ని ఆధారంగా తీస్తున్న ఒక అంతర్జాతీయ సినిమా ప్రాజెక్ట్ కు సహాయసహకారాలనందిస్తానని ఆ చిత్ర యూనిట్ ను కొలంబోకి  ఆహ్వానిస్తుంది.ఆ చిత్ర దర్శకుడు పీటర్ జీవానందం రజిని జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నంలో స్క్రిప్ట్ తయారుచేస్తూనే,ఎల్టీటీఈ లో పనిచేసి వాళ్ళకు వ్యతిరేకంగా గళం విప్పిన కారణంగా ఉన్నట్లుండి అదృశ్యమైపోయిన తన ప్రియురాలు సుగంథిని కూడా వెతుకుతుంటాడు..ఎల్టీటీఈ ఘాతుకాలకు ప్రత్యక్ష సాక్షి అయిన సుగంథి దొరికితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ కి మరింత ప్రయోజనం చేకూరుతుందని అతడి యోచన..మరి పీటర్ ఈ ప్రయత్నంలో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు ! అతడు సుగంథిని కలిశాడా లేదా ! అన్నది మిగతా కథ..మానవహక్కుల్ని కాలరాస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలించిన మహిందా రాజపక్స నియంతృత్వంలోని శ్రీలంక ఫాసిస్టు ప్రభుత్వం ఒకవైపూ, స్వాతంత్య్ర ఉద్యమం ముసుగులో అనేక ఘోరాలకూ,నేరాలకూ పాల్పడిన ఎల్టీటీఈ మరోవైపూ,వీరిద్దరూ కాక ఈ ఘోరాలకు తగిన సాయమందించడానికి వచ్చిన భారత శాంతి దళాలూ ఇంకోవైపూ,అన్నీ కలిసి శ్రీలంకలో సామాన్య ప్రజల జీవితాలను ఎంత నరకప్రాయంగా మార్చాయో ఈ నవల సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది.

ఇక రజిని కథను చెప్పడానికి పీటర్ తన స్క్రిప్ట్ లో భాగంగా తయారుచేసుకున్న చారిత్రాత్మక ఆధారాలున్న కథ దేవనాయకిది..రజిని కథకు సరిగ్గా సమాంతరంగా నడిచే ఈ కథ పాళీ భాషలో వందల ఏళ్ళ క్రితం శ్రీలంకలోని సిగిరియా అనే స్థలంలో లభ్యమైన 'సుసాన సూపిన' అనే చారిత్రాత్మక గ్రంథం ఆధారంగా రాశారు..దేవనాయకి కథలో,'కథలోపలి కథలు' అనేకం ఉంటాయి,అంతే కాకుండా,ఇందులో ఆసక్తిగొలిపే ఫాంటసీ ఎలిమెంట్స్ త్వర త్వరగా పేజీలు తిప్పేలా చేస్తాయి.

ఈ కథను ముఖ్యంగా స్త్రీవాద కోణంలో చూపించే ప్రయత్నం చేశారు..శ్రీలంక మహిళలపై అటు మిలిటరీ,ఇటు ఎల్టీటీఈ ల ఘాతుకాలను వర్ణించిన తీరు వెన్నులోంచి చలి పుట్టిస్తుంది..రాజపక్స నియంతృత్వంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలనుండి విముక్తి ప్రసాదిస్తామంటూ స్వేఛ్ఛా మంత్రాన్ని జపించినట్లు నటించి స్త్రీలను,పిల్లల్నీ తమ గొడుకు క్రిందకి బలవంతంగా చేర్చుకున్న ఎల్టీటీఈ లో అంతర్గతంగా వ్రేళ్లూనుకున్న పురుషస్వామ్య విధానాలను ఈ నవలలో తూర్పారబట్టారు..ఇంటెలెక్చువల్ వర్గాలూ,జర్నలిస్టులూ,రచయితలూ,మానవహక్కుల సంఘాలూ ఎన్నున్నా శ్రీలంక ఫాసిజం వాళ్ళ నోరు నొక్కేసింది..హింసకు ఎదురు తిరిగిన కొందర్ని దేశ బహిష్కారం చేస్తే,మరి కొందర్ని చంపేస్తారు.ఇక స్త్రీల సంగతైతే మరీ దారుణం..రేప్ విక్టింస్ ని బ్రెయిన్ వాష్ చేసి సూసైడ్ బాంబర్లుగా మార్చడం
అంతా మనకు తెలిసిన చరిత్రే.

‘Peter, almost all the women activists in Sri Lanka are rape victims,’I could feel tears welling up in my eyes. These words contained the answer to the question why Sri Lankan women chose to become suicide bombers.

సంక్లిష్టమైన శ్రీలంక పొలిటికల్ సినారియోను రచయిత కాల్పనికతకు  కుదించి సరళీకరించిన తీరు ఆకట్టుకుంటుంది..ఏ ప్రభుత్వమైనా,విప్లవమైనా ప్రజాస్వామిక పరిధుల్ని దాటి స్వతంత్రంగా వ్యవహరించినప్పుడు దేశంలో ఎటువంటి హింసాత్మక వాతావరణం నెలకొంటుందో చెప్పడానికి శ్రీ లంక ఒక మంచి ఉదహరణ అంటారు రామకృష్ణన్..ఈ కథలో శ్రీలంక రాజకీయ చరిత్రలో భాగంగా ఉన్న ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్,రజిని,రాజపక్స లాంటి నిజజీవిత వ్యక్తులతో బాటు దేవకాయకి,పీటర్,సుగంధి,మీనాక్షి లాంటి కాల్పనిక పాత్రలూ,రాజరాజచోళుడూ,మహేంద్రవర్మ లాంటి చరిత్ర సంబంధిత  వ్యక్తులూ కూడా కలగలిసిపోయి ఉండటంతో ఏది నిజమైన పాత్రో,ఏది అభూత కల్పనో కనుక్కోవడం కష్టం..రెండు కథల్ని బ్యాక్ టు బ్యాక్ చెప్తూ,హిస్టారికల్ ఫిక్షన్ నీ,పొలిటికల్ ఫిక్షన్ నీ,మ్యాజికల్ రియలిజాన్నీ ఫ్యూషన్ చేస్తూ అన్ని పాయల్నీ చివర్లో కలిపి ముడివేసిన తీరు చాలా బావుంది..నాన్ ఫిక్షన్ లో తప్ప ఫిక్షన్ లో బహు అరుదుగా కనిపించే 'రీసెర్చ్' ఈ పుస్తకంలో మరో మెచ్చుకోదగ్గ అంశం..నాకు తెలిసిన రచయితల్లో అయాన్ మక్ ఇవాన్ తరువాత మళ్ళీ అంత వివరంగా ఆల్టర్నేట్ హిస్టరీస్ మీద రీసెర్చ్ చేసి కథ రాసిన రచయిత ఈయనే.

ఈ కథను చెప్పడానికి రామకృష్ణన్ ఎన్నుకున్న కాన్వాస్ చాలా పెద్దది..చివర్లో ఒక ఇంటర్వ్యూలో "కేరళవారై ఉండి శ్రీలంక కథనెలా రాశారని" అడిగితే, గ్లోబలైజేషన్ పుణ్యమాని సాహిత్యం కూడా ప్రాంతీయ పరిమితుల్ని దాటి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయిందంటూ,అంతర్జాతీయంగా పాఠకుల్ని ఆకట్టుకోవాలంటే రచయితలు తమ ప్రాంతీయ పరిథుల్ని దాటి బైటకి రావడమొక్కటే మార్గం అంటారు రాధాకృష్ణన్..Umberto Eco "Why write novels ? To rewrite history." అంటారు..రామకృష్ణన్ ఈ మాటల్ని తు.చ తప్పకుండా పాటించారనిపించింది..ఆల్టర్నేట్ హిస్టరీలను శోధించి చరిత్రనూ,పుక్కిటి పురాణాల్నీ కలిపి రాసిన ఈ కథ వాస్తవమో,కల్పనో కూడా అర్ధం కానంతగా పాఠకుల్ని మోసం చేస్తుంది..పుస్తకం చదువుతున్నంతసేపూ పాఠకుల మదిలో పదే పదే మెదిలే ఒకే ఒక ప్రశ్న "ఇది నిజమేనా ?" ఈ కారణంగా ఆయనిచ్చిన రిఫరెన్సుల చిట్టా పట్టుకుని గూగుల్ చెయ్యకుండా ఈ పుస్తకం చదవడం అసంభవం..అక్కడక్కడా అవసరంలేని కొన్ని వివరాలతో కూడిన నేరేషన్ విషయంలో నాకు చిన్న చిన్న పేచీలున్నా,ఈ మధ్య కాలంలో ఇలాంటి పుస్తకం చదవలేదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను..ఆపకుండా చదివించే గుణమున్నదే అసలుసిసలు రచన అనుకుంటే ఈ పుస్తకం ఖచ్చితంగా ఒక మంచి రచనే..రాజకీయాలూ,చరిత్ర ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవాల్సిన రచన ఈ 'సుగంధీ అలియాస్ ఆండాళ్ దేవనాయకి'.

"My fiction is an aesthetic rebellion against fascist structures" అంటారు ఈ పుస్తకం చివర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాధాకృష్ణన్.

పుస్తకం నుండి కొన్ని అంశాలు :

But in those days I didn’t know of Rosa Luxemburg’s stand on nationalism, and it was only much later that I realized the Eelam movement was not a class struggle of the proletariat against the bourgeoisie. I was only led by a thirst for revenge against the Sinhalese nationalists who had massacred my family..

Your mother Madhavi said that outspokenness is your only fault.

The temple Thanumalayan and Devanayaki built on the spot where the gods appeared later came to be known as the Thanumalayan temple. Devanayaki gave birth to two more sons and a daughter, and they all lived happily together for a long time. This was the Kurava dynasty that later ruled Nanjinad. After the rule of the Konangi Kuravas and the Nanji Kuravas who ruled in the twelfth century, the Kurava dynasty slowly declined. Brahmins took control of the temple. The high-born Brahmins,who had only contempt for the Kuravas, transformed Devanayaki’s story into the legend of Atri and his wife Anasuya. The story of Devanayaki was successfully Aryanized. Their version was that the gods wanted to test Anasuya’s chastity and so they came in the guise of sages and asked her to serve food to them naked. She sprinkled the water with which she had washed her husband’s feet on them, transforming them into babies.


But the leader of the Tigers and Thambimuthu had political motivations. For them, the movie was an effort to answer the accusation that the Tigers had been responsible for Rajini’s death, and to establish that Rajini, who had been on their side to begin with, had never shifted loyalties. It was an attempt to whitewash their anti-human-rights activities.

Neither of us knew then that the Tigers were responsible for Rajini’s murder. Bhuvana and I believed that it was either the Indian Peace Keeping Force or the Sri Lankan army. We planned the movie so that Rajini would be portrayed as the prey of both the government and the military.

They had realized that the Iyakkam, the Sri Lankan army and the Indian Peace Keeping Force were all crushing the lives of the ordinary people. They wanted to expose this and sensitize the public against violence.

I explained the concepts of human rights activism to them in detail. Human rights activists fight armed enemies without weapons. As individuals we might lose, but ultimately society will win. Most often, victory is attained after we die. That is the path Christ has shown us. The path Gandhi has shown us. That was the route the UTHR activists took.

The Sri Lankan military and the Indian Peace Keeping Force were able to justify themselves saying that they were military activities. But the Iyakkam, which claimed that it was acting for the people, was unable to justify its misdeeds. By this time, they had moved away from democratic principles and were trying to silence their critics through torture and murder.

‘You are right, Mary. All of them spoke with fear in their hearts. The audience too were victims of fear. This is today’s Sri Lanka. Clouds of fear surround us. Nothing is democratic. Everyone is under surveillance. We too are definitely being watched. Both the government that is celebrating freedom from terrorism, and the Iyakkam that is searching for a way to climb out of the abyss of complete failure, are afraid of the common people.And the hapless people of this country? They fear everyone. It’s quite a paradox.

We need such icons in these times, because all wars are essentially wars against women. They are cruelly exploited, emotionally, physically and sexually. For men clad in battledress, whether they come with swords or guns, on horseback or in armoured cars, the value of their conquest seems heightened by the violation of women. This is a reality that Rajini showed us, which we must recognize. There need to be resistance movements against wars.

‘But often, we have to pay a very dear price for this. Rajini was willing to make that sacrifice. That is why she was able to write a few months before her death that, “One day, a gun will silence me and it will not be held by an outsider, but by a son born in the womb of this very society, from a woman with whom I share a history.”

As authorized Sri Lankan history itself is the product of great political manipulation, nobody considers this wrong.

When I rewrote the script, intertwining the myth of Devanayaki with the murder of Rajini Thiranagama, albeit without any evidence to back it up, it became the story of every woman in Sri Lanka. They started resembling Devanayaki in her myriad moods. While Rajini countered violence with the message of peace, many other women were burning with the fire of revenge. Revenge against anyone who hurt the mind or body of a woman. The emotions of love, lust, sympathy, peace and revenge were all mixed up in it.

Though I spent the entire night bathed in blood, I did not die.’ Meenakshi’s story ended. In shock, we looked at our hands to make sure they were still there.

Though I paid money to the Iyakkam regularly, I hated them. It was not just because they killed Dr Sridhar that I felt angry. Is this how freedom is obtained? Haven’t you heard of Mahatma Gandhi? He won freedom for such a large country like India without using guns or bombs. What did these people gain after so much bloodshed ?

This is the newest face of fascism. It is no longer what it used to be when Hitler and Mussolini were around. In the twenty-first century, fascism dons several masks: that of pseudo-democracy, development, and even that of peace. It is one of the strategies of power. It gives the majority the opportunity to ennoble their narrow racist feelings. It turns democracy, which we consider great,into something that is anti-people. The majority rapes, kills and silences the minority. I don’t feel a peaceful, dignified resistance against this sort of power structure will suffice. But we cannot adopt the fascist ploys of the Iyakkam either. We have to forge a new path. Our enemy is not a person or the state, but the mindset of the majority.’

Thursday, January 23, 2020

మహా నిశ్శబ్దం(The Great Silence) - Ted Chiang

Image Courtesy Google
ఈ మానవులు గ్రహాంతరజీవులను వెతకడం కోసం అరెసీబో టెలిస్కోపును తయారు చేసుకున్నారు. ఈ విశాల విశ్వంలో మేధోజీవులు ఇతర గ్రహాలపై ఎక్కడో ఉండేవుంటారన్న నమ్మకం, వారితో మాట్లాడాలన్న కోరిక, ఎంత బలమైనవి అంటే ఇలా ఖగోళం ఆ చివరినుంచి ఈ చివరిదాకా వినగలగడానికి ఇలా ఒక పెద్ద చెవి తయారు చేసుకున్నారు.

మరి నేనూ, నా తోటి చిలుకలూ ఇక్కడే ఉన్నాం కదా. మనుషులతో మాట్లాడగలిగే, వారితో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్న మానవేతర జాతులం మేము. వారి అన్వేషణ కచ్చితంగా మాలాంటి వారికోసమే కదా! కాని, వాళ్ళు మేము చెప్పేది వినడానికి మాత్రం ఏమాత్రం ఆసక్తి ఎందుకు చూపరు?

ఈ విశ్వం ఎంతో పెద్దది. తప్పకుండా ఇందులో ఎన్నోచోట్ల మేధోజీవులు పుట్టే ఉండివుండాలి. పుట్టింది మనం ఒక్కళ్ళమే అనుకోవడం అసంబద్ధంగా తోస్తుంది. ఈ విశ్వం ఎంతో పాతది కాబట్టి ఆ జీవుల్లో ఏ ఒక్క జాతికయినా ఈ పాటికి పాలపుంత మొత్తం వ్యాపించేంత సమయమూ ఉండివుండాలి. కానీ విచిత్రంగా ఒక్క భూమ్మీద తప్ప మరే ఇతర గ్రహంలోనూ జీవం ఉందన్న ఉనికి కాని, కనీసం ఒక చిన్నపాటి సంకేతం కాని లేదు. ఈ మానవులకు ఇదొక అర్థం కాని చిక్కుముడి. అందుకే దీనిని ఫెర్మి పారడాక్స్ అని పిలుచుకుంటారు.

ఈ ఫెర్మి పారడాక్స్ ఛేదించడానికి శాస్త్రజ్ఞులు సూచించిన ఒక పరిష్కారం ఏంటంటే, మేధోజీవులు శత్రుదురాక్రమణలకు లక్ష్యం కాకుండా తమ ఉనికిని దాచుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయట. మానవాళి చేసిన తప్పిదాల కారణంగా ఇప్పుడు అంతరించిపోవడానికి చేరువలో ఉన్న మా చిలుకలను చూశాక ఇలా ఉనికిని దాచుకోవడం చాలా మంచి వ్యూహమని నేను నిశ్చయంగా చెప్పగలను! తమ ఉనికిని కాపాడుకునే దిశగా ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా, నిశ్శబ్దంగా తమపని తాము చేసుకోవడం మేధోజీవులు అవలంబించవలసిన అత్యవసర మార్గంగా తోస్తోంది.

ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి ఈ విశాల విశ్వం అంతానూ ప్రాణికోటితో, వివిధ గ్రహాలపై వివిధ జాతులకు చెందిన వైవిధ్యమైన కంఠధ్వనుల రొదలతో నిండిపోయుండాలి కదా! కానీ దీనికి విరుద్ధంగా ఎటు చూసినా కలవరపరిచేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందుకే కదా ఆ ఫెర్మి అన్న శాస్త్రవేత్త ‘బట్, వేర్ ఆర్ దే?’ అని అడిగాడు. అందుకేనేమో, ఈ సృష్టివైరుధ్యాన్ని మహా నిశ్శబ్దం అని పిలుచుకుంటారు ఈ మనుషులు.

మేధోజీవులు అంతరిక్షంలోకి వ్యాప్తి చెందేలోపే అంతరించిపోతాయని కొందరు శాస్త్రవేత్తల వాదన. ఈ వాదన నిజమనుకుంటే, నిశీధివేళ నిర్మలాకాశపు నిశ్చలత్వం నిజానికి ఒక శ్మశాన నిశ్శబ్దం మాత్రమే.

వందల సంవత్సరాల పూర్వం మా జాతి ఎంత సమృద్ధిగా ఉండేదో తెలుసా! ఇదిగో ఈ అరసీబో టెలిస్కోపుకు ఆనుకునే ఉన్న రియో అబాహో అడవులు మా చిలుకల మాటలతో మారుమోగిపోయేవి. ఇప్పుడు మేము సుమారుగా అంతరించిపోయే దశలో ఉన్నాం. అతి త్వరలోనే ఈ రెయిన్ ఫారెస్ట్ కూడా ఆ చీకటి ఆకాశంలాగా నిశ్శబ్దంగా అయిపోతుంది.

మాలో అలెక్స్ అనే ఒక ఆఫ్రికన్ గ్రే జాతి చిలుక ఉండేవాడు. భలే తెలివైనవాడని పేరు. మాలో కాదు, ఈ మనుషుల్లోలెండి. ఐరీన్ పెపర్‌బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ముప్పై ఏళ్ళపాటు అలెక్స్‌ను అధ్యయనం చేసింది. అలెక్స్‌కు కేవలం ఆకారాలూ, రంగుల పేర్లూ తెలియడమే కాకుండా వాడికి వాటి తత్వాన్ని కూడా అర్ధం చేసుకోగల తెలివితేటలు ఉన్నాయని కనిపెట్టింది. చాలామంది శాస్త్రజ్ఞులు ఒక పక్షికి ఇలాంటి నైరూప్య భావనలు అర్థం అవుతాయని నమ్మరు. ఈ మానవులు తాము మిగతా జీవరాశులకంటే శ్రేష్ఠులమనీ, అసమానులమనీ భావిస్తుంటారు. కానీ చివరకు పెపర్‌బర్గ్ అలెక్స్ కేవలం పదాలను పునరుచ్చరించడం లేదని, తాను పలుకుతున్న మాటలకు అర్ధం కూడా తెలుసుననీ వారిని ఒప్పించింది.

మా బంధువులందరిలోనూ అలెక్స్ ఒక్కడే కొద్దో గొప్పో ఈ మనుషులకు కాస్త మేధోజీవిలాగా, వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోగలిగిన వాడిలాగా కనిపించాడు.

కాని అలెక్స్ అనుకోకుండా చిన్నవయసులోనే పోయాడు. తాను చనిపోవడానికి ముందురోజు సాయంత్రం అలెక్స్ పెపర్‌బర్గ్‌తో చెప్పాడట. “You be good. I’ll see you tomorrow. I love you.”

మానవేతర మేధ కోసం వెతుకుతూ వారితో మాట్లాడాలని ఇంతగా తపించిపోతున్న ఈ మనుషులకు ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి?

మీకు మేమందరం ఒకేలా కనిపించవచ్చు కాని, మాలో ఏ ఇద్దరమూ ఒకేలా ఉండం. మాలో ప్రతీ చిలుకకూ ఒక ప్రత్యేకమైన కూత ఉంటుంది. అదే దాని గుర్తింపు. మీ బయాలజిస్టులు దీన్నే కాంటాక్ట్ కాల్ అంటారు.

1974లో అరెసీబో టెలిస్కోప్ నుంచి శాస్త్రజ్ఞులు విశ్వంతరాలలోకి తమ గురించిన ఒక చిన్న సందేశం ప్రసారం చేశారు, దానిలో తమను, ‘మేము ఈ రకమైన మేధోజీవులం’ అని పరిచయం చేసుకుంటూ. అది మానవాళి కాంటాక్ట్ కాల్.

అరణ్యంలో చిలుకలం కూడా మీలాగే ఒకర్నొకరం పేరు పెట్టి పిలుచుకుంటాం. మరొక చిలుక దృష్టిని ఆకర్షించడానికి మేము దాని కాంటాక్ట్ కాల్‌ను అనుకరిస్తాం. అలాగే, ఎప్పుడైనా మానవులు విశ్వంలోకి ప్రసారం చేసిన అరెసీబో సందేశం భూమికి తిరిగి వస్తే, గ్రహాంతరవాసులెవరో మానవుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని గమనించాలి.

మేము విని నేర్చుకుంటాం. కొత్త శబ్దాలు వింటే వాటిని మళ్ళీ ఉచ్చరించగలం. ఆ సామర్థ్యం చాలా కొద్ది జంతువులకు మాత్రమే ఉంది. మీ కుక్క మీ ఆజ్ఞలను అన్నిటినీ అర్ధం చేసుకోగలదు, కానీ అది కేవలం మొరగడం తప్ప ఇంక వేరేదీ చెయ్యలేదు. మానవులు కూడా విని నేర్చుకోగలరు. చిలుకలకు మానవులకు ఉన్న ఒక సామాన్య లక్షణం ఇది, ఇలా శబ్దంతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండడం. మనుషుల మాటల్లాగే మా కూతలు కూడానూ, మేము ఊరికే కూయం. ప్రతీ పదం స్పష్టంగా ఉచ్చరిస్తాం.

బహుశా అందువల్లేనేమో మానవులు అరెసీబోని అలా తయారుచేశారు. టెలిస్కోప్ అనేది ఒక రిసీవర్. అది ప్రసారం కూడా చేయాలన్న నియమం లేదు. కానీ అరెసీబో ఈ మానవులకు మాట్లాడే నోరు మాత్రమే కాదు. వినే చెవి కూడా.

ఇన్ని వేల సంవత్సరాలు ఈ మానవులు మాతో కలిసే బతికారు కాని ఇప్పుడిప్పుడే మేము కూడా మేధోజీవులం అన్న విషయం వారికి మెల్లిగా తెలిసివస్తున్నట్టుంది. కాని, వారిని నిందించలేను. నిజం చెప్పాలంటే మేము చిలుకలం కూడా చాలా కాలం మానవులు ఏమంత తెలివైనవారు కాదనే అనుకునేవాళ్ళం. మనకు విరుద్ధమైన స్వభావాన్ని అర్ధం చేసుకోవడం కష్టం కదా!

ఏదేమైనా మానవులకూ, చిలుకలకూ మధ్య ఉన్నన్ని సారూప్యతలు వారికీ వారు వెతుకుతున్న మరే గ్రహాంతరవాసులకీ మధ్యా ఉండవు, ఉండబోవని కచ్చితంగా చెప్పగలను. మానవులు మమ్మల్ని అతి దగ్గరనుండి గమనించగలరు. మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలరు. మాతో మాట్లాడగలరు. అవేమీ చేయరు. కానీ వీళ్ళు గ్రహాంతర మేధస్సును గుర్తు పట్టగలమని అనుకుంటారు! ఎలా? వీళ్ళు చేస్తున్నదల్లా కాంతి సంవత్సరాల దూరం నుండి చెవి ఒగ్గి వినడమే కదా.

ఇంగ్లీష్ భాషలో ఆస్పిరేషన్ అనే పదం ఉంది. దానికి రెండర్థాలున్నాయి, ఒకటి కోరిక, రెండవది శ్వాసక్రియ. ఇది కాకతాళీయం కాదని నాకనిపిస్తుంది. మనం మన ఊపిరితిత్తుల శ్వాసను వాడేకదా మన ఆలోచనలను మాటలుగా మార్చేది. ఆ మాటలే కదా మన కోరికను తెలిపేవి, మన ప్రాణశక్తిని చాటేవి. అందుకే నేను అంటున్నాను, I speak, therefore I am. ఇందులో నిజం విని నేర్చుకునే జాతులైన మానవులకూ, చిలుకలకూ తెలిసినంతగా మరే ఇతర జాతికీ తెలిసే అవకాశం లేదు.

పెదవులను కదుపుతూ, ఊపిరితో శబ్దాన్ని పుట్టిస్తూ వాటిని పదాలుగా మార్చడంలో ఒక గొప్ప ఆనందం ఉంది. అనాదిగా మానవులలో ఇది ఒక ముఖ్యమైన, ఆంతరంగికమైన భావనగా ఏర్పడిపోయింది. అందుకే వారు శబ్దాన్ని ఐహికానికి, దైవానికి దారి చూపేదిగా భావిస్తారు. పైథాగరియన్ యోగులు అచ్చు శబ్దాలను గ్రహాలకు ప్రాతినిధ్యం వహించేవి అని నమ్మి, ఆ శక్తిని సంగ్రహించడానికి వాటిని జపించేవారట. పెంటెకోస్టల్ క్రిస్టియన్లు తమ ప్రార్థనలో వాడే భాషను దేవతలు మాట్లాడే భాషగా పరిగణిస్తారు. హిందూ బ్రాహ్మణులు మంత్రపఠనం ద్వారా వాస్తవికత పునాదులను పటిష్ఠం చేస్తున్నామని నమ్ముతారు.

వీటన్నిటినీ బట్టి, శబ్దాన్ని అభ్యసించే ప్రత్యేకమైన జాతులు మాత్రమే వారి పురాణాల్లో శబ్దానికి అంత ప్రాముఖ్యతను ఆపాదిస్తాయి. ఇది చాలా అభినందనీయమైన విషయమని మా చిలుకల భావన.

హిందూ పురాణాల ప్రకారం, ఈ విశ్వం అంతా ఓంకారనాదం చేత సృష్టించబడింది: ఈ ఓమ్‌ అనే శబ్దం భూతభవిష్యద్వర్తమానాలన్నిటినీ తనలో నిబిడీకృతం చేసుకుని ఉంటుందని హిందువుల నమ్మకం.

అరెసీబో టెలీస్కోప్‌ను అంతరిక్షపు లోతుల్లోకి, నక్షత్రాల నడుమకు గురి చేసినప్పుడు, అది ఒక సన్నని రొదను వినిపిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు దీనినే ‘కాస్మిక్ మైక్రోవేవ్ బాక్‌గ్రౌండ్’ అని అంటారు. ఇది పద్నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక గొప్ప పేలుడుతో విశ్వాన్ని సృష్టించిన బిగ్‌బాంగ్ యొక్క రేడియోధార్మిక అవశేషం.

ఇది మైక్రోవేవ్ బాక్‌గ్రౌండ్ కాదు, ఇది అస్పష్టంగా వినిపిస్తున్న ఓంకారనాదం అని కూడా మీరు అనుకోవచ్చు. ఆ శబ్దం ఎంత గొప్పదంటే ఈ విశ్వం ఉన్నంత కాలం రాత్రిళ్ళు ఆకాశం ఆ ఓమ్ శబ్దాన్ని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎన్నటికీ. అరెసీబో మరింకేమీ విననప్పుడు, సృష్టి యొక్క ఈ ప్రతిధ్వనిని మాత్రం వింటూవుంటుంది.

అన్నట్టు పురాణాలూ, ఇతిహాసాలూ మీకే కాదు, మా ప్యూర్టోరికన్ చిలుకలకు కూడా సొంత పురాణాలున్నాయి. ఎటొచ్చీ మీ కథలకంటే మావి కాస్త సరళమైనవి, కానీ మానవులకు అవి కూడా ఆహ్లాదాన్ని పంచుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ అయ్యో, మా పురాణాలు కూడా మా జాతితో బాటే అతి త్వరలో అంతరించిపోనున్నాయి. అవి పూర్తిగా క్షయమైపోయేలోపు మానవులు మా భాషని అర్ధం చేసుకోగలరో లేదోనని నాకు అనుమానంగానే ఉంది. ఇక్కడ మా జాతి అంతరించిపోవడమంటే కేవలం ఒక రకమైన పక్షులు మాత్రమే పోయాయని కాదు. మా భాష, మా ఆచారాలు, మా సంప్రదాయాలు, అన్నీ కూడా అంతరించిపోవడం ఇది. మా గొంతులు నొక్కివేయడం ఇది.

మానవ సమాజం మా జాతిని వినాశనపు అంచుల వరకూ తీసుకొచ్చింది, కానీ ఈ కారణంగా నేను వారిని నిందించలేను. వారు ఇదంతా మా మీద ద్వేషభావంతోనో, కక్షతోనో కావాలని చెయ్యలేదు. వారికి వారు చేస్తున్న వినాశనం పట్ల గమనింపు లేదు. వారి కోరికలు, ఆకాంక్షలు, వాటిని సాధించుకొనే పద్ధతులూ తీవ్రమైనవి. అద్భుతమైన పురాణగాథలకు రూపకల్పన చేసిన మానవజాతి సృజనాత్మకత అపూర్వమైనదీ, సాటిలేనిదీను. బహుశా అందువల్లే వారి ఆకాంక్షలకు తీవ్రత ఎక్కువ. అరెసీబోనే చూడండి. అటువంటి ఒక అత్యద్భుతమైన, అతివినూత్నమైన పరికరాన్ని తయారుచెయ్యగలిగిన సామర్ధ్యం కలిగివున్న జాతి తప్పకుండా ఒక గొప్ప జాతి అయివుంటుంది.

మేమిక ఎక్కువ కాలం మనలేకపోవచ్చు; బహుశా, పరిణామక్రమంలో సహజంగా అంతరించే సమయంకన్నా ముందే మేమందరం మరణించి మహా నిశ్శబ్దంలో కలిసిపోవచ్చు. కానీ, మేము ఈ భూమ్మీద నుండి శాశ్వతంగా అదృశ్యమైపోయేలోపు మానవాళికి మా అందరి తరఫునా ఒక సందేశం పంపుతున్నాం. అరెసీబో టెలీస్కోప్ మా సందేశాన్ని మానవులు వినడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. మా సందేశం ఇది:

You be good. I love you.


First Publication : https://eemaata.com/em/issues/202001/21541.html

Monday, January 20, 2020

One Part Woman & Trial By Silence - Perumal Murugan

మొదట్లో మనిషి భౌతిక అవసరాలనూ,పునరుత్పత్తినీ క్రమబద్ధీకరించే విధంగా ఏర్పడిన వివాహ వ్యవస్థకు తరువాతి కాలంలో సంప్రదాయపు ముసుగులు తొడిగింది సమాజం..విదేశాలతో పోలిస్తే,పిల్లలు పుట్టడం,పుట్టకపోవడం అనే ప్రకృతి సహజమైన అంశాలకు భారతీయ సమాజంలో చాలా ప్రాథాన్యత ఉంది..ఎంతంటే పిల్లలు పుట్టకపోతే మరణానంతరం స్వర్గంలో తాము కూర్చోబోయే కుర్చీమీద అడ్వాన్సుగా కర్చీఫు వేసుకునే అవకాశం కోల్పోయినట్లు భావిస్తారు..ఇక కొడుకులైతే పున్నామనరకాలు తప్పిస్తారనే తరహా నమ్మకాలకు దురదృష్టవశాత్తూ ఈనాటికీ కాలం చెల్లలేదు..ఇటువంటి కొన్ని నమ్మకాలు వ్రేళ్ళూనుకుని ఉన్న సంస్కృతిని కథాంశంగా చేసుకుని ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ 2010 లో 'వన్ పార్ట్ వుమన్' అనే పుస్తకాన్ని రాశారు..హిందూత్వాన్ని కించపరిచే విధంగా ఉందంటూ తీవ్ర వివాదాలపాలై,చివరకు మురుగన్ చేత కొంత కాలంపాటు బలవంతపు అస్త్ర సన్యాసం చేయించిన ఈ రచనకు తరువాత రెండు రకాల ముగింపులనిస్తూ 2018 లో 'ట్రయల్ బై సైలెన్స్','ఎ లోన్లీ హార్వెస్ట్' అనే రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.
Image Courtesy Google
ఇక కథ విషయానికొస్తే 1940ల కాలంలో తమిళనాడులోని కొంగునాడు ప్రాంతానికి చెందిన రైతుకుటుంబానికి చెందిన కాళీ,పొన్నా లకు పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు కలగరు..కానీ వారిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం..కాళీకి భార్యే సర్వస్వం,అందుచేత పెద్దలు ఎంత ప్రయత్నించినా మారుమనువుకి కూడా ఒప్పుకోడు..కానీ పిల్లల్లేని కారణంగా ఆ ఊరి జనమంతా వాళ్ళని నానామాటలూ అంటుంటారు..ముఖ్యంగా స్త్రీ కావడం వల్ల పొన్నా మరిన్ని అవమానాలపాలవుతుంటుంది..సామాజికపరమైన వత్తిళ్ళు తట్టుకోలేక విసిగివేసారిన ఆ దంపతులకు పిల్లలు పుట్టడానికి లోపాయికారిగా ఒక  మార్గాన్ని సూచిస్తారు కుటుంబ పెద్దలు..దక్షిణ భారతంలోని తిరుచెంగోడ్ అర్థనారీశ్వరాలయంలో ప్రతియేడూ జరిగే జాతరలో పధ్నాలుగో రోజున ఒక వింత ఆచారం ఉంటుంది..పిల్లలు కలగని స్త్రీ ఆ రాత్రి కొండమీద ఏ పురుషుని ద్వారానైనా తల్లి కావచ్చు..ఆ ఒక్కరోజూ కొండమీద జాతరకు వచ్చిన మగవారందరు దేవుళ్ళని నమ్ముతారు,తద్వారా కలిగిన సంతానాన్ని దేవుని ప్రసాదంగా భావిస్తారు..కానీ ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంటుంది..కాళీకి ఈ ఆచారం సుతరామూ ఇష్టం ఉండదు..కానీ పెద్దల జోక్యం వల్ల తప్పని పరిస్థితుల్లో పొన్నా ఆ రాత్రి కొండ మీదకు వెళుతుంది..ఆ తరువాత ఏమైంది,కాళీ పొన్నాల వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నది మిగతా కథ.

కథలో నూతనత్వం,కాంట్రవర్సీ చేసినంత విషయమూ నాకు కనపడలేదు గానీ కథనం మాత్రం చాలా బావుంది..పెరుమాళ్ మురుగన్  కొంగునాడు ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని,ఆనాటి ప్రజల జీవన విధానాన్నీ సజీవంగా కళ్ళముందుకు తీసుకొస్తారు..ప్రతీ చిన్న పక్షీ,ఆకూ,మొక్కా,చెట్టూ చేమా,జంతుజాలాలన్నీ మురుగన్ కలంలో ప్రాణం పోసుకుంటాయి..ముఖ్యంగా ఆయన వర్ణనల్లో గాఢత,లోతూ చాలా నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి..సమకాలీన సాహిత్యంలో ఎటువంటి గమనింపులూ లేకుండా ఒక ఉపరితలం మీద ఫ్లాట్ గా సాగిపోయే చప్పని వర్ణనల మధ్య ఈ కథలో అంతర్భాగంగా రాసిన చిన్న చిన్న సంగతులూ,విషయ విశేషాలూ అమితంగా ఆకట్టుకుంటాయి..ఒక రచయితకు కథ చెప్పేటప్పుడు 'డిటైల్స్' పట్ల పెట్టాల్సిన శ్రద్ధ గురించి తెలియాలంటే ఈ కథను మంచి ఉదాహరణగా చూపించవచ్చు..పల్లె ప్రాంతపు ప్రకృతి వర్ణనలతో బాటు సాంఘిక కట్టుబాట్లూ,దురాచారాలూ,సంస్కృతి సంబంధితమైన ఏ ఒక్క చిన్న వివరాన్నీ వదలకుండా,అలాగే ఎక్కడా అనవసర సాగతీతలతో విసుగుతెప్పించకుండా కథను ఆపకుండా చదివిస్తారు రచయిత.

ఆవులూ ఈనడం,పొలం పనులూ లాంటి వివరాల మొదలు గంగరావి చెట్టు కొమ్మల నీడన భార్యా భర్తా చెప్పుకునే ఊసులూ,అల్లరిగా అటుఇటు తిరిగే కోడిపిల్లలూ,కాళీ,పొన్నాలు ఇష్టంగా పెంచుకునే వంకాయ పాదులూ,ఎడ్లబళ్ళెక్కి తిరనాళ్ళకి వెళ్ళే గ్రామస్థులూ,కాలినడకన గుళ్ళకి వెళ్తూ అలసట తెలీకుండా నల్లుపయ్యన్ మామ చెప్పే పిట్ట కథలూ (Vulgar renditions of Original stories),ఇవన్నీ తమిళనాడు రూరల్ ప్రపంచాన్ని అచ్చంగా కళ్ళముందుకు తెస్తాయి.

ఇక పాత్రల విషయానికొస్తే 'వన్ పార్ట్ వుమన్' లో కథ ముఖ్యంగా కాళీ పొన్నా,నల్లుపయ్యన్ లాంటి ముఖ్య పాత్రల చుట్టూ తిరిగితే 'ట్రయల్ బై సైలెన్స్' లో కాళీ తల్లి శీరాయి,పొన్నా అన్నగారు ముత్తు పాత్రలు కూడా ప్రధానపాత్రలతో సరి సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి..వయసుపైబడుతున్నా అటు కొడుకుకి సర్దిచెప్తూ,కోడల్ని కంటికి రెప్పలా చూసుకునే ముదుసలి శీరాయి పాత్రని మర్చిపోవడం కష్టం..ఒక దశలో ఆమె మూఢనమ్మకాలూ,అజ్ఞానం కూడా ఆమెపై కోపం తెప్పించకపోవడం ఆశ్చర్యం..ఇక తన అభ్యుదయ భావాలతో సమాజానికి ఎదురీది బ్రతికే నల్లుపయ్యన్ పాత్ర ద్వారా రచయిత తన స్వంత అభిప్రాయాలకు గళాన్నిచ్చే ప్రయత్నం చేశారేమో అనిపించింది.

తప్పొప్పుల నిర్వచనాలు తరతరానికీ మారుతుంటాయి..ఒక తరానికి సరైన  సంప్రదాయం మరో తరానికొచ్చేసరికి ఛాందసత్వంగా మారుతుంది..జీవితంలో సగభాగం తమిళనాడులో గడిచిన కారణంగా ఇక్కడి పల్లె జీవితం,సంస్కృతీ సంప్రదాయాలూ నాకు కొత్తేమీ కాదు..తమిళులకు భాషే కాదు,సంప్రదాయం అంటే కూడా మక్కువ ఎక్కువే..ఇక్కడి పల్లెల్లో ఇప్పటికీ సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబాలు కోకొల్లలు..పట్టణాల్లో నాకు తెలిసిన ప్రపంచంతో ఎంతమాత్రమూ పోలిక లేని మరో సమాంతర ప్రపంచం ఇది..శిలంబం (కర్రసాము) నేర్చుకునే పిల్లలూ,లంకంత ఇళ్ళున్నా సాయంత్రం కాగానే చుట్ట కాలుస్తూ రోడ్ మీదే కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆసాములూ,పత్తి,జొన్న పంటల్లో కూనిరాగాలు తీస్తూ పనులు చేసుకునే రైతులూ,అమ్మవారి జాతరలూ లాంటివి ఇక్కడ సర్వ సాధారణ  దృశ్యాలు..కానీ పెరుమాళ్ మురుగన్ రచనల్లో నాకు తెలిసిన ప్రపంచాన్ని అక్షరాల్లో చదువుకోవడం మరింత బావుంది..మీ పుస్తకానుభవాన్ని
పాడుచేసే ఉదేశ్యం లేదు గనుక ముగింపుల జోలికి పోవడం లేదు,కానీ నేను రెండు పారలెల్ సీక్వెల్స్ లో 'ట్రయిల్ బై సైలెన్స్' చదివాను..ఇక రెండో ముగింపు నాకు ఆసక్తి లేనిది కాబట్టి దాన్ని వదిలేశాను.

తమ కూతకు భిన్నంగా కూసిందని సదరు పక్షిని తమ సమూహానికి చెందదని వెలివేస్తాయి మిగతా పక్షులు..ఇది వరకూ చెప్పినట్టు,సమూహాల్లో మసలాడానికి ఆ సమూహపు నియమాల్ని ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాలి..మనిషి కూడా దీనికి భిన్నమేమీ కాదు,తనకు భిన్నంగా ఉన్నదానిని ఒక రకమైన శత్రుభావంతో చూస్తాడు..దీనికి కారణం తనకు తెలియని విషయం పట్ల మనిషికుండే భయం తప్ప మరొకటి కాదంటుంది మనస్తత్వ శాస్త్రం..ఈ మధ్య అనేక పాశ్చాత్య దేశాల్లో పిల్లల్ని కనడాన్ని ఒక ఛాయిస్ గా చేసుకుంటున్నారు..కానీ వేషభాషల్లో ఆధునిక సంస్కృతిని వేలంవెర్రిగా అనుసరించే భారతీయ సమాజంలో నేటికీ కట్టుబాట్ల రూపంలో కొన్ని జాడ్యాలు అమలులోనే ఉన్నాయి..ఒకవేళ మనిషి ఆ కట్టుబాట్ల చట్రానికావల అడుగుపెడితే అది పాపమనీ,దోషమనీ హెచ్చరిస్తూ మళ్ళీ తన గుంపులోకి లాగడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తుంది చుట్టూ ఉన్న సమాజం..వివాహ వ్యవస్థలో పిల్లలు కనడం అందరు చెయ్యాల్సిన పని(?) కాబట్టి దంపతులందరూ పిల్లల్ని కనితీరాలి,లేకపోతే అరిష్టమనీ,అశుభమనీ వాళ్ళని సామజిక వృత్తాల నుండి వెలివేస్తారు..అవమానాలు చేస్తారు.ఈమధ్య కాలంలో సామజిక స్థితిగతుల్లో స్థాయీ భేదం లేకుండా అన్ని వర్గాల వారినీ కలచివేస్తున్న ఒక ముఖ్యమైన సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు రాబోయే కాలంలో సమాజానికి ఎంతో అవసరం..ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్ లోనూ,ప్రతిష్టాత్మక పుష్కిన్ ప్రెస్ అనువాదాల్లోనూ పెరుమాళ్ మురుగన్ పుస్తకాలను చూసి సంతోషంగా అనిపించింది..మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ లో ఆంగ్ల సాహిత్యం మాత్రమే కాకుండా ప్రాంతీయ సాహిత్యం కూడా ప్రపంచ వ్యాప్తంగా అనువాదాలకు వెళ్ళడం మంచి పరిణామం.

ఈ రెండు పుస్తకాల నుండీ కొన్ని వాక్యాలు,
Nallayyan defended himself right away. ‘All stories have such a version, let me tell you. I know so many of them. Why don’t you tell me a story? I will tell you a bawdy version of your story too.’

Even when you have spent years with some : people, their real faces are revealed only when the right time comes. God knows how many faces lie concealed forever, with no opportunity to reveal themselves.

నల్లుపయ్యన్ భావాలు,
Why? For whom do I hang my head low now? It is only you who is relentlessly talking about having children. All right, go ahead and have a child. But do you know how you should live? Like that crow that has built a nest on that palm tree.When it knows it is going to lay eggs, it builds its nest. Then it incubates the eggs and hatches them. It finds food for the little ones and takes care of them until they grow their own wings. Once that happens, what do you think is the relationship between the baby crow and its mother? They go their separate ways. “You got your wings, now get out of here, and fend for yourself.” That’s the way to live. Instead, we give birth, raise them, get them married, save money and struggle. Is this any way to live? If we were more like crows and cuckoos, I’d also like to have children.

'Trial by silence' నుండి కొన్ని,

‘Who are we to decide right and wrong? Something that seemed right to your father now seems wrong to you. And what seems right to you now will seem wrong to your son in the future. These are all big questions. You just do your thing and keep moving.

Pointing to a man who walked with a large bundle on his head and two other bundles on his shoulders, he said, ‘He is like a load-bearing rock. We can place as much weight as we want on him. It will stay rock solid, but it will be very difficult to move it.’ Then he pointed to a man who carried a large bundle on his back, and said, ‘He is a donkey. He can carry things, but he knows nothing else. A donkey is happy as long as it finds a place where it can be by itself.’ Then he directed Kali’s attention to a man who carried a lot of pots and pans and was walking with his family. About him, Nallayyan said, ‘Look at him carefully. He is basically carrying his entire household on his head. No matter where he goes, he can never set that burden down. I cannot show you worse idiocy than this.’ Kali laughed at all these remarks.

Thursday, January 9, 2020

Doris Lessing Stories

ఈ ఏడాది చదువు నోబుల్ గ్రహీత డోరిస్ లెస్సింగ్ (బ్రిటిష్-జింబాబ్వే రచయిత్రి) ను చదవడంతో మొదలయ్యింది..మొదలుపెట్టడం నవలలతో కాకుండా ఆవిడ కథలతో మొదలుపెట్టి మంచిపని చేశాననిపించింది..ఒక రచయిత తాలూకూ ఊహాప్రపంచంలో తనివితీరా విహరించి వచ్చాకా,ఆ కంఫర్టబుల్ జోన్ లో నుండి మళ్ళీ మరో కొత్త ప్రపంచానికి వెంటనే ప్రయాణం కట్టడం నాకు మొదట్నుంచీ కాస్త కష్టంతో కూడుకున్న పని,పాత ప్రపంచపు జ్ఞాపకాలు నెమరేసుకోడానికి కాస్త సమయం తీసుకుంటాను..కానీ డోరిస్ లెస్సింగ్ కథలు చదివినప్పుడు ఆ పరాయితనం అనిపించలేదు,ఆవిడ  శైలి పాఠకుల్ని చాలా సులభంగా దగ్గర చేసుకుంటుంది..మరో విశేషమేంటంటే,డోరిస్ అనేక మంది రచయితల్లాగా ఒకే చట్రంలో ఇమిడిపోకుండా రియలిస్టిక్ ఫిక్షన్ తో పాటు సైన్స్ ఫిక్షన్,ఫాంటసీ మొదలైన విభిన్నమైన జానర్స్ లో కూడా విశిష్టమైన రచనలు చేశారు..నేను చదివిన కథలన్నీ రియలిస్టిక్ ఫిక్షన్ జానర్ కి చెందినవి..ఈ నాలుగు పుస్తకాలూ అమెజాన్ లో కిండిల్ ఎడిషన్స్ గా లభ్యమవుతున్నాయి.ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కథ An Old Woman and Her Cat.

Image Courtesy Google
An Old Woman and Her Cat :
ఉద్యోగరీత్యా ఊరూరా తిరిగే క్రమంలో అపార్ట్మెంట్ కల్చర్ లో భాగంగా గమనించిన విషయమేంటంటే,చిన్నప్పుడు ఇంట్లో పాలు అలమరాలో పెట్టి గొళ్ళెం వెయ్యడం మర్చిపోయి బయటే వదిలేస్తే దొంగతనంగా తాగేసి పోయే పిల్లులు గానీ,పరిసరాల్లో ఊరకుక్కలు గానీ ఆ నగరాల్లో ఎక్కువ కనిపించేవి కాదు..వయసుపైబడిన జంతువుల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇంజెక్షన్లు చేసి శాశ్వత నిద్రలోకి పంపించేస్తుంటారనేది తెలిసిన విషయమే..ఇక పిచుకలు,కాకుల సంగతి సరేసరి..నగరీకరణ నేపథ్యంలో చిన్న చిన్న ఇళ్ళ స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలిసిన పర్యవసానాలివి..మనం మనుషులం ఎంత స్వార్థపరులమంటే ఆ ప్రాణులకూ కూడా మనతోపాటు ఈ భూమ్మీద  జీవించే హక్కు ఉందనే చిన్న సంగతిని విస్మరిస్తాం..మన నాగరికతలో,సంస్కృతిలో,సౌకర్యాలలో వాటికీ,వాటి అల్పమైన (?) జీవితాలకూ ఎంతమాత్రం ప్రాముఖ్యత ఇచ్చే పనిలేదు.

ఈ నేపథ్యాన్నే ఆధారంగా చేసుకుని నోబుల్ గ్రహీత డోరిస్ లెస్సింగ్ 'An Old Woman and Her Cat' అనే ఒక కథ రాశారు..ఇది హెట్టీ అనే డెబ్భై ఏళ్ళ వృద్ధురాలి కథ..హెట్టీ అందరిలాంటి సాధారణమైన స్త్రీ కాదు,సాహసోపేతమైన జిప్సీ మనస్తత్వం కలిగిన విలక్షణమైన వ్యక్తి..ఆమెలోని ఈ ప్రత్యేకతను చూసే ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్త ఫ్రెడ్ పెన్నేఫాథర్ మధ్యవయస్సులోనే నిమోనియాతో మరణిస్తాడు..కానీ హెట్టీ స్వతంత్ర భావాల్నీ,నిలకడ లేని స్వభావాన్నీ తమకు తలవంపులుగా భావించిన ఆమె నలుగురు పిల్లలూ వృద్ధాప్యంలో ఆమెను ఒంటరిగా వదిలేస్తారు..వాడిపారేసిన బట్టల్ని అమ్ముకుంటూ స్వేచ్ఛగా సంచార జీవితాన్ని గడుపుతుంటుంది హెట్టీ.. She was enjoying herself too much, particularly the moving about the streets with her old perambulator, in which she crammed what she was buying or selling. She liked the gossiping,the bargaining, the wheedling from householders..కానీ ఆమె స్వేఛ్ఛా జీవితం కంటగింపుగా మారిన సమాజం ఆమెను అగౌరవంగా,తిరస్కారంగా చూస్తుంది..అలా ఒంటరిగా రోజులు వెళ్ళదీస్తున్న హెట్టీ కి ఒకరోజు టిబ్బీ అనే పిల్లి దొరుకుతుంది..టిబ్బీ కి హెట్టీ సాహసోపేతమైన జీవితంలో భాగంగా మారడానికి అట్టే కాలం పట్టదు..తాను పావురాళ్ళను పట్టుకుని చంపి తింటూ స్వతంత్రంగా ఉంటూ తన యజమానికి కూడా తినడానికి మరో పావురాన్ని పట్టి తెస్తుంది టిబ్బీ..టిబ్బీ రాకతో ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోయిన హెట్టీకి మరో సమస్య ఎదురవుతుంది..లండన్ కొత్తరూపును సంతరించుకునే క్రమంలో నగరనిర్మాణంలో భాగంగా పేదవాళ్ళని ఇళ్ళు ఖాళీ చేయిస్తారు,అలా వాళ్ళుండే ఇంటిని వదిలి మురికివాడలకు మకాం మారుస్తారు హెట్టీ,టిబ్బీలు..ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఈ కథ నాగరికుడుగా మారే క్రమంలో భూతదయకూ,భావోద్వేగాలకూ పూర్తిగా తిలోదకాలిచ్చి యంత్రంగా మారుతున్న మనిషికి పశుపక్ష్యాదులు కూడా మానవజీవితంలో అవసరమైన భాగమని గుర్తుచేస్తుంది..అనవసరమైన ఒక్క వివరమూ లేకుండా లెస్సింగ్ వాక్యంలో పొదుపు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది,ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూస్తే, హెట్టీ జిప్సీ మనస్తత్వాన్ని పరిచయం చేస్తూ,ఎటువంటి హంగులూ,ఆర్భాటాలూ లేకుండా క్లుప్తంగా She liked to see people moving about, ‘coming and going from all those foreign places’ అంటారు..హెట్టీ కి చివరి ఘడియలు ఆసన్నమయ్యాయని గమనించి టిబ్బీ మూడు రాత్రులపాటు పావురాళ్ళను పట్టుకోడానికి వెళ్ళకపోవడం,ముసలిదైపోతున్న టిబ్బీని చంపేస్తారనే భయంతో హెట్టీ సోషల్ సర్వీస్ వాళ్ళ కంటబడకుండా తను జీవించే అవకాశాన్ని త్రోసివేయ్యడం లాంటి అంశాలు కనుమరుగైపోతున్న మానవీయ విలువల్ని గుర్తుచేస్తాయి..కథలోని సంక్లిష్టతను కథనంలో చొరబడనీయకుండా జాగ్రత్తపడుతూ అతి ముఖ్యమైన అంశాలను ఎత్తి చూపే ఈ కథను మర్చిపోవడం అంత సులభం కాదు..
వస్తువో మరొకటో పాడైతే దాన్ని బాగుచేయించి తిరిగి వాడుకునే తరం నుండి,వాడుకకు పనికిరాని ప్రతిదాన్నీ విసిరిపారేసే సంస్కృతికి చేరిన మానవ నాగరికత ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతోంది..అదేంటో తెలుసా ! మనిషి కూడా ఎప్పుడో అప్పుడు అలాగే వాడుకకు పనికిరాకుండా పోతాడని..ఆ విషయాన్ని సున్నితంగా గుర్తుచేస్తూ నిద్రావస్థలో ఉన్న పాఠకుణ్ణి తట్టిలేపుతుందీ కథ.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
Hetty was sharp with the five children, complaining about their noise and mess, but she slipped them bits of money and sweets after telling their mother that ‘she was a fool to put herself out for them, because they wouldn’t appreciate it’. She was living well, even without her pension.

And he knew and deplored the fact – an institution in which the old were treated like naughty and dim-witted children until they had the good fortune to die.


Through the Tunnel :
పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపించే తల్లికి ఎప్పుడో ఒకప్పుడు ఆ చెయ్యి వదలాల్సిన సందర్భం ఎదురవుతుంది..కానీ ఆ సందర్భం హఠాత్తుగా ఎదురైనప్పుడు లోలోపల భయపడుతూనే పైకి మాత్రం ధైర్యం నటిస్తూ "ఏమీ ఫర్వాలేదు,వాడు ఎదుగుతున్నాడు" అని తల్లి తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది..మాములుగా చూస్తే ఇది అతి సర్వసాధారణమైన విషయం..కానీ ఈ మామూలు విషయమే డోరిస్ లెస్సింగ్ 'గమనింపు'లో చాలా ప్రాముఖ్యత కలిగిన విషయంగా రూపాంతరం చెందుతుంది..She was thinking. Of course he's old enough to be safe without me. Have I been keeping him too close? He mustn't feel he ought to be with me. I must be careful. She was determined to be neither possessive nor lacking in devotion అంటారు జెర్రీ అనే పిల్లవాడి తల్లి ఆలోచనల గురించి రాస్తూ..అలాగే కొంతవయసొచ్చాకా అంతవరకూ తల్లి చాటున పెరిగిన పిల్లవాడికి బయటప్రపంచంలోకి తనంతట తానే స్వేచ్ఛగా రెక్కలు విప్పుకోవాలనే ఆరాటం కలుగుతుంది..'And yet, as he ran, he looked back over his shoulder at the wild bay; and all morning, as he played on the safe beach, he was thinking of it'..మరో వైపు జెర్రీ తల్లి చేతిని ఎలాగైనా విడిపించుకుని ప్రపంచంలో తన ఉనికిని వెతుక్కుంటూ తనదైన భవిష్యత్తు దిశగా చూస్తుంటాడు..సరిగ్గా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ దగ్గరే ఈ కథ జీవం పోసుకుంటుంది..అతి సాధారణమైన విషయంగా మనం కొట్టి పారేసే లేదా మన దృష్టిని దాటిపోయే ఈ సున్నితమైన అంశాన్ని సరళమైన సంభాషణలతో కలిపి ఒక చక్కని తల్లీ కొడుకుల కథలా రాశారు లెస్సింగ్..జెర్రీ అనే పదకొండేళ్ళ పిల్లవాడు భవిష్యత్తును ఎదుర్కోడానికి సంసిద్ధమయ్యే క్రమంలో సముద్ర గర్భంలోని రహస్య సొరంగాన్ని ఈదాలనే లక్ష్యంతో ఒక సాహసం చేస్తాడు..ఈ కథలో 'టన్నెల్' ను ఆ పిల్లవాడి ట్రాన్సిషన్ కు సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశారు..తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక ఆమెతో సేఫ్ బీచ్ కి వెళ్ళిన జెర్రీ ఆలోచనల గురించి, It was a torment to him to waste a" day of his careful self-training, but he stayed with her on that other beach, which now seemed a place for small children, a place where his mother might lie safe in the sun. అని రాస్తూ It was not his beach అని ముగించడం రచయితగా డోరిస్ లెస్సింగ్ ప్రతిభకు ఒక మచ్చు తునక మాత్రమే.


The Day Stalin Died
లెస్సింగ్ రాసిన రియలిస్టిక్ ఫిక్షన్ అంతా చాలా వరకూ ఆమె స్వానుభవాల ఆధారంగా రాసినవేనని అంటుంటారు..ఒక చారిత్రాత్మక అంశాన్ని ఆధారంగా చేసుకుని రాసిన ఈ కథను మొదటిసాటి చదివినప్పుడు సరిగ్గా అర్ధం కాలేదు,కథకు ఆధారభూతమైన లెస్సింగ్ పొలిటికల్ వ్యూస్ గురించిన కొన్ని వ్యాసాలు చదివిన తరువాత మళ్ళీ రెండోసారి చదివినప్పుడు అర్ధమైంది..అక్కడక్కడా వచ్చి పోయే లెస్సింగ్ మార్కు చెణుకులు కొన్ని మినహాయిస్తే ఈ కథ కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి..ఈ కథలో స్టాలిన్ మరణించిన రోజు కమ్యూనిస్టు పక్షపాతి అయిన ఒక యువతి జీవితంలో జరిగిన పలు సంఘటనలను వర్ణిస్తారు..వృత్తిరీత్యా రైటర్ అయిన ప్రొటొగోనిస్ట్ యొక్క ఇంటెలెక్చువల్ లెన్స్ లోనుండి మనుషుల దైనందిన జీవితాన్ని వాళ్ళ పొలిటికల్ వ్యూస్ ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని విభిన్న పాత్రల అభిప్రాయాల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు..డోరిస్ ప్రపంచ యుద్ధానంతర సమయంలో రాజకీయ పరిణామాల మూలాంశంగా రాసిన ఈ కథను జడ్జిమెంటల్గా,తన పొలిటికల్ వ్యూస్ కలపకుండా వృత్తం బయట నిలబడి చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది.

ఆంట్ ఎమ్మా కూ ప్రొటొగోనిస్ట్ కూ మధ్య జరిగే సంభాషణలో భాగంగా రాసిన ఈ వాక్యాలు ఈ కథలో నాడిని పట్టుకుంటాయి..
Tell me, dear,’ said Aunt Emma, suddenly rougish, ‘about all the exciting things you are doing.’
Aunt Emma always says this; and always I try hard to think of portions of my life suitable for presentation to Aunt Emma.‘What have you been doing today, for instance?’
 I considered Bill; I considered Beatrice; I considered comrade Jean.
‘I had lunch,’ I said, ‘with the daughter of a Bishop.’
‘Did you, dear?’ she said doubtfully.

ఈ కథలో ఒక వాక్యం బాగా నచ్చింది,కానీ తన స్వంత పిల్లల్ని తన ప్రస్థానంలో దూరం చేసుకున్న డోరిస్ ఈ వాక్యాలు రాయడం ఆర్టు ఆర్టిస్టు వేర్వేరనే భావనను మరోసారి రుజువు చేసింది.
It’s better to love a child too much than too little.

The Old Chief Mshlanga :
డోరిస్ లెస్సింగ్ బాల్యం అంతా (1925-49 మధ్య కాలంలో) ఆఫ్రికాలోనే గడిచిన కారణంగా ఆకాలంలో నల్లజాతీయులపై జరిగిన దాష్టీకాలకు ఆమె ఒక ప్రత్యక్ష సాక్షి..అప్పుడు ప్రోగుచేసుకున్న అనుభవాల ఆధారంగా రాసిన ఈ కథలో ఆనాటి సమాజంలో వ్రేళ్ళూనుకున్న జాత్యహంకారాన్ని పధ్నాలుగేళ్ళ తెల్లజాతీయురాలైన బాలిక(డోరిస్ ?) దృష్టికోణం నుండి చూపించే ప్రయత్నం చేశారు..ఇందులో ఆఫ్రికా ఖండపు సౌందర్యాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే వర్ణనలుంటాయి..ఉదాహరణకు ప్రకృతి సౌందర్యాన్నీ,జాత్యహంకారాన్నీ ఒకే ఫ్రేములో బంధిస్తూ యజమాని జోర్డాన్ కూ,నల్లజాతీయుల తెగకు ముఖ్యుడు Mshlanga కూ మధ్య వాదన జరిగే  సందర్భాన్ని బాలిక దృష్టికోణం నుండి చూపిస్తూ,ఈ విధంగా రాస్తారు.
It was now in the late sunset, the sky a welter of colours, the birds singing their last songs, and the cattle, lowing peacefully, moving past us towards their sheds for the night. It was the hour when Africa is most beautiful; and here was this pathetic, ugly scene, doing no one any good.

ఈ కొన్ని కథలతోనే డోరిస్ లెస్సింగ్ నేనెంతో అభిమానించే రచయిత్రులు ఉర్సులా లెగైన్,మార్గరెట్ ఆట్వుడ్ ల ప్రక్కన కులాసాగా మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. :)
Happy Reading Everyone :)