Monday, September 3, 2018

First Love - Ivan Turgenev

కొన్ని సార్లు పాఠకులకు కేవలం చెప్పీ చెప్పకుండా ఉపరితలం వద్దే ఆగిపోయే కథలు
కాదు కావాల్సింది,ఒక్కోసారి రచయితతో అంతకుమించిన దగ్గరితనం కూడా కోరుకుంటారు..కొందరు రచయితలు కేవలం పరిచయస్తుల్లా మిగిలిపోతే మరికొంతమంది మాత్రం సన్నిహితులుగా మారతారు..ఈ సాన్నిహిత్యం కథ చెప్పే రచయిత పాఠకులకి ఇచ్చే గౌరవం అనుకుంటాను..మరి చాలా నమ్మకస్తులకి మాత్రమే కదా మనసులో భావాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పడానికి సంకోచించం..ఇవాన్ తుర్గెనెవ్ తొలి పరిచయంలోనే ఒక సన్నిహితునిలా అనిపిస్తారు..అందుకేనేమో రచనల్లో హ్యూమన్ ఎమోషన్స్ కి పెద్దపీట వేసే యురోపియన్ పాఠకుల 'రుచి' ని గ్రహించి వారిని సైతం మెప్పించగలిగారు..

Image courtesy Google
మనసుకి హత్తుకునేలా భావోద్వేగాల్ని వర్ణించడంలో రష్యన్ రచయితలు సిద్ధహస్తులు..టాల్స్టాయ్,చెఖోవ్,స్టీఫెన్ జ్వెయిగ్ లాంటివారి శైలిని తలపించే మరొక రచయిత ఇవాన్ తుర్గెనెవ్..తుర్గెనెవ్ ని చదివాక సంప్రదాయవాదాన్నీ,హేతువాదాన్నీ రెండిటినీ సమన్వయం చేస్తూ కథను నడిపించడం రష్యాన్లకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించింది..ఈయన రచన 'ఫస్ట్ లవ్' ఒక మామూలు ప్రేమ కథ అనుకుంటే పొరపాటే..దీనిని ఒక సెమీ ఆటోబయోగ్రఫికల్ నవలగా చెప్పుకుంటారు ఇవాన్..ఈ రచనలో మనిషి జీవితంలోని వివిధ దశల్లో మానసిక పరిపక్వత సాధించే క్రమంలో ఎదురయ్యే  సంక్లిష్టతల్ని  అంచెలంచెలుగా వివరిస్తారు...కథ విషయానికొస్తే Sergey Nicolayevich ఆతిధ్యాన్ని స్వీకరించే సందర్భంలో Vladimir Petrovich తన తొలిప్రేమను కథగా రాసి వినిపించడంతో ఈ కథ మొదలవుతుంది...పదహారేళ్ళ వ్లాడిమిర్ తన పొరుగింటికి కొత్తగా వచ్చిన జినైదాతో తొలి చూపు లోనే ప్రేమలో పడతాడు..ప్రేమ ఎప్పుడు,ఎందుకు,ఎలా పుడుతుందో చెప్పలేమంటారు ప్రేమికులు..'తాను అంటూ ఉన్నాననే స్పృహ లేని స్థితి' అది..ఈ స్థితిలో బహుశా వయసుతారతమ్యాలు,సామజిక స్థితిగతులు,కులాలు,మతాలు ఇవేవీ కనిపించవు..వ్లాడిమిర్ కు జినైదా మీద కలిగింది అచ్చంగా అటువంటి ప్రేమే..బ్రతికి చెడ్డ రాజకుటుంబానికి చెందిన ఇరవయ్యొక్కేళ్ళ జినైదా,ఆమె తల్లి Princess Zasyekin పేదరికాన్నుండి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు..జినైదా విచిత్రమైన వ్యక్తిత్వం కల అమ్మాయి..తన అందచందాలకు ముగ్ధులై తన చుట్టూ చేరిన యువకుల్ని చలాకీతనంతో నవ్విస్తూ,కవ్విస్తూ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది.. తానేమిటో తనకు స్పష్టంగా తెలిసిన అమ్మాయి..“I’m a flirt, I’m heartless, I’m an actress in my instincts,” అని తన గురించి తానే చెప్పుకుంటుంది...సహజంగానే తొలియవ్వనపు పొంగులో జినైదా పట్ల ఆకర్షితుడైన వ్లాడిమిర్ ఆమె వేరొకరితో ప్రేమలో పడిందని తెలుసుకుని భగ్న హృదయంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని హతమార్చాలని ఒక రాత్రి కత్తి చేతబూని తోటలో వేచి చూస్తుంటాడు..ఆ చీకట్లో తన తండ్రే ఆ వ్యక్తి అని తెలుసుకుని హతాశుడవుతాడు.."The jealous Othello, ready for murder, was suddenly transformed into a schoolboy.."

జినైదాలాగే ఈ కథలో వ్లాడిమిర్ తండ్రి పెట్రోవిచ్ పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది..తనకంటే పదేళ్ళు పెద్దదైన స్త్రీని (వ్లాడిమిర్ తల్లి) పెళ్ళాడిన ఒక సాధారణమైన వ్యక్తి పెట్రోవిచ్.. మితభాషిగా,స్థితప్రజ్ఞుడిలా,గంభీరమైన ఆహార్యంతో ఉంటారు...విచిత్రంగా అంతమంది యువకులు వెంటపడినా,తాను అంతగా ప్రేమించిన జినైదా ప్రేమను పొందిన తండ్రిపట్ల వ్లాడిమిర్ కు ఆశ్చర్యంతో కూడిన గౌరవం కలుగుతుంది..
"but I had no ill-feeling against my father. On the contrary he had, as it were, gained in my eyes … let psychologists explain the contradiction as best they can..."

మరి వివాహితుడైన వ్లాడిమిర్ తండ్రి,జినైదా ల మధ్య చిగురించిన ప్రేమ ఎటువంటి మలుపులు తీసుకుందో,వాటి పరిణామాలు వ్లాడిమిర్ హృదయం మీద ఎటువంటి  ప్రభావం చూపించాయన్నది మిగతా కథ...యవ్వనం తనతో పాటు మోసుకొచ్చే ఒంటరితనాలూ,భయాలూ,అశాంతులూ,సంఘర్షణల్ని ఈ కథలో అద్భుతంగా ఆవిష్కరించారు..తొలిప్రేమ బారినపడ్డ వ్లాడిమిర్ తన మనసులో ఇలా అనుకుంటాడు.. "such an unhappy, lonely, and melancholy youth, that I felt sorry for myself—"

I burnt as in a fire in her presence … but what did I care to know what the fire was in which I burned and melted—it was enough that it was sweet to burn and melt.

'నిశ్శబ్ద్','లమ్హే' లాంటి సినిమాలు మీకు ఇష్టమైతే ఈ కథ కూడా మీకు నచ్చుతుంది..బిగ్ బీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన నన్ను ఆయన అద్భుతంగా నటించిన సినిమా పేరు చెప్పమంటే వెంటనే ఎందుకో 'నిశ్శబ్ద్' గుర్తుకొస్తుంది..మనిషిలోని అన్ని భావోద్వేగాల్లో చాలా సున్నితమైన 'గిల్టీనెస్' ని తెర మీద చూపించి మెప్పించడం అంత సులభమైన విషయం అని నేను అనుకోను..ఇకపోతే ఈ కథ మొదట 'Art of novella' సిరీస్ లో ప్రచురించిన అనువాదంలో చదివాను..కానీ పెంగ్విన్ ప్రచురణ ఇంకా బావుంది..పెంగ్విన్ ప్రచురణలో Isaiah Berlin అనువాదానికి V. S. Pritchett ఒక అద్భుతమైన ముందుమాట రాశారు.

ఈ కథలో తండ్రి వ్లాడిమిర్ కు తన అనుభవసారాన్ని రంగరించి ఈ రెండు విషయాలూ చెప్తాడు..
“Take for yourself what you can, and don’t be ruled by others; to belong to oneself—the whole savour of life lies in that,”
"Beware of the love of women; beware of that ecstasy-that slow poison."

యువకుడైన వ్లాదిమిర్ కు డాక్టర్ Lushin జ్ఞానబోధ..
 “Liberty,” he repeated; “and do you know what can give a man liberty?”
 “What?”
 “Will, his own will, and it gives power, which is better than liberty. Know how to will, and you will be free, and will lead."

పుస్తకం నుండి మరికొన్ని,
I knew a great deal of poetry by heart; my blood was in a ferment and my heart ached—so sweetly and absurdly; I was all hope and anticipation, was a little frightened of something and full of wonder at everything, and was on the tiptoe of expectation; my imagination played continually, fluttering rapidly about the same fancies, like martins about a bell-tower at dawn; I dreamed, was sad, even wept; but through the tears and through the sadness, inspired by a musical verse, or the beauty of evening, shot up like grass in spring the delicious sense of youth and effervescent life.

I sat down and read “On the Hills of Georgia.” “ ‘That the heart cannot choose but love,’ ” repeated Zinaïda. “That’s where poetry’s so fine; it tells us what is not, and what’s not only better than what is, but much more like the truth, ‘cannot choose but love,’—it might want not to, but it can’t help it.”

Sunday, September 2, 2018

Mario Vargas Llosa on Albert Camus and the Morality of Limits

నోబెల్ బహుమతి గ్రహీత మారియో వర్గస్ లోసా పుస్తకాలు చదవడం మొదలుపెట్టి,ఆయన రచనల్లోని ఎరోటిక్ కంటెంట్ చదివే సంసిద్ధతా,ఆసక్తీ రెండూ  నాకు లేకపోవడంతో నచ్చక పక్కన పెట్టేశాను..ఆ సమయంలో ఆయన వ్యాసాలు కంటపడ్డాయి,ఆయన రాసిన 'మేకింగ్ వేవ్స్' లో కొన్ని ఆర్టికల్స్ చదివాను..ఆల్బర్ట్ కామూ పంఖాని కాబట్టి వాటిల్లో కామూ గురించి లోసా రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది..మొదట్నుంచీ సాత్రే అభిమాని అయిన మారియో వర్గస్ లోసా కి కామూ అంటే అయిష్టత ఉండేదట..ఆయన అబ్సర్డిటీని ఒక మేధో గేయకావ్యంగా భావించే లోసాకి కామూ ఆలోచనలు సత్యదూరంగా,ఉటోపియన్ డ్రీం లా అనిపించేవి..కానీ లిమా లో జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో కామూ 'రెబెల్' ని మరోసారి చదివినప్పుడు కామూని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయాననీ,గమనించగా తాను కూడా కామూతో చాలా విషయాల్లో ఏకీభావానికొచ్చినట్లు గ్రహించాననీ అంటారు.

Image courtesy Google
In the postwar years, when faced with the rising tide of Marxism, historicism and ideologies, which tried to reduce everything to a social problem, Camus’s work became an important counterbalance, emphasizing what these movements scorned or ignored: morality.

మనుషుల్లో రెండు రకాలు..ఒకటి లీడర్లు,రెండు వారి ఫాలోవర్లు..సహజంగా ఈ రెండింట్లో ఏదో ఒక వర్గంలో ఇమిడిపోడానికి ఇష్టపడేవాళ్ళే అధికం..It's rare scenario to find human beings among Gods and Worshipers,people either follow or lead,there is no way around...కానీ ఈ రెండు వర్గాలకూ చెందకుండా  సర్వస్వతంత్రంగా idols కూ,ఐడియాలజీలకూ దూరంగా ఉండే మామూలు మనుషుల వర్గానికి ప్రతినిధి ఆల్బర్ట్ కామూ..ఆ కాలంలో కంటే మనుషుల్ని దేవుళ్ళుగా ఐడియలైజ్ చేసి,ఆ దేవుళ్ళు ఏం చెప్పినా అది సరైనదేనని గుడ్డిగా నమ్మే మనుషులు అధికంగా ఉన్న ఈ సమాజానికే కామూ సిద్ధాంతాల అవసరం ఎక్కువ..మరి 'వ్యక్తి పూజ' ఆ కాలంలో లేదా ? అంటే ఉంది..కానీ ఆ కాలంలో స్వలాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తులు హీరోలైతే,సక్సెస్ మాత్రమే కొలమానంగా ఉన్న ఈ కాలంలో కార్పొరేట్ వ్యవస్థకు,క్యాపిటలిస్ట్ విధానాలకూ ప్రతినిధులు ఆధునిక తరానికి రోల్ మోడల్స్ గా చెలామణీ అవుతున్నారు..ఇక్కడ కొందరి వ్యక్తిగత విజయాలనూ,జీనియస్ నూ తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు..కానీ వారి 'వ్యక్తిగత' పురోగతి వల్ల సమాజానికీ,సగటు మనిషికీ జరిగే మేలేంటన్నది ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అంశం..ఈ తరహా సంప్రదాయీకరణలోని నిరంకుశత్వం,ఒక అబద్ధం మీద నిలబడ్డ సామాజిక జీవితం వలన కనుమరుగైపోతున్న 'నైతికత' సమాజానికి చేటని కామూ అంటారు..ఆయన సమకాలీనులైన చాలామంది ఇంటెలెక్చువల్స్ లా 'పేదరికం','దోపిడీ','నిస్సహాయత' లాంటి పదాలు కామూ గ్రంథాల్లో చూసి తెలుసుకున్నవి  కాదు,మైనారిటీ వర్గానికి ప్రతినిధిగా అవన్నీ ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి.

Camus talked of natural man, linked to the world of the elements, proudly asserting his physical being, who loves his body and tries to please it, who finds the harmony between the landscape and matter to be not only a full and satisfying form of pleasure but also the confirmation of his greatness.

Furthermore, in Camus’s thought the economic exploitation of man is implicitly condemned with the same rigour as his political oppression. And for the same reasons: through his humanistic belief that the individual can only be an end, not a means, that the enemy of man is not only the person who represses him but also the one who exploits him for gain, not just the person who puts him in a concentration camp, but also the one who turns him into a production machine.

మోడరన్ థింకర్స్ మనిషిని ఒక హిస్టారికల్ ప్రోడక్ట్ గా చూస్తే కామూ మాత్రం మనిషిని ప్రకృతిలో భాగంగా చూశారు..ఆయన పుస్తకాల్లో తరచూ కనిపించే ప్రకృతి వర్ణనలు,సముద్ర తీరాలూ,అల్జీరియన్ పర్వత శ్రేణుల్లోని వెచ్చని ఉదయాలూ దీనికి ఉదాహరణ..మెర్సాల్ట్ కామూకి ఒక ఆల్టర్ ఇగో..అందరిలా స్పందించలేకపోవడం,తన భావాల్ని వెళ్ళడించలేకపోవడం అతనిలో లోపం (?)..సమాజం మనిషి నుంచి కోరుకునేది అదేగా ! కోర్ట్ విచారణలో అందరిలో ఒకడిగా మనలేకపోవడమే మెర్సాల్ట్ చేసిన తప్పుగా కనిపిస్తుంది..ఈ కారణంగానే అతని చేతిలో అనుకోకుండా జరిగిన హత్యకు కారణాలు పరిశీలించకుండానే చనిపోయిన తల్లిని చూడ్డానికొచ్చినప్పుడు అతనిలో మనిషిలో సహజమైన భావోద్వేగాలు కనపడకపోవడం,ఆమె శవం ప్రక్కన కూర్చుని సిగరెట్ వెలిగించుకోవడం,తరువాత ఆదమరిచి నిద్రపోవడం లాంటివాటికే ప్రాధాన్యతనిచ్చి న్యాయస్థానం అతన్ని ఒక మృగంగా భావించి దోషిగా నిర్ధారిస్తుంది..కామూ పాత్రల్లో ముఖ్యంగా ఈ unrefined,raw వ్యక్తిత్వాలు కనిపిస్తాయి..ఈ పాత్రలు సామాజిక నియమాలు పాటించవు..ఆ మాటకొస్తే అలాంటి నియమాలుంటాయనే స్పృహ కూడా వారికి ఉండదు.

This man is elemental not only because his pleasures are simple and direct but also because he lacks social refinements and guile: that is, the respect for conventions, a capacity for deception and intrigue, a spirit of accommodation and an ambition for power, glory and wealth.His virtues – frankness, simplicity, a certain preference for the Spartan life – are those traditionally associated with life in the provinces and, in another way, with the pagan world. What happens when this natural man tries to exert his right to be part of the city? A tragedy: the city crushes him, destroys him. This is the theme of Camus’s best novel: The Outsider.

ఈ 'Outsider' ని అర్ధం చేసుకోవాలంటే కామూ మూడు ప్రపంచాల గురించీ ('a provincial, a man of the frontier and a member of a minority') తెలియాలంటారు లోసా..

He was a provincial for better or worse, above all for better in many respects. First, because, unlike the experience of men in large cities, he lived in a world where landscape was the primordial presence, infinitely more attractive and important than cement and asphalt. The love of Camus for nature is a permanent aspect of his work:

Without ever denying man’s historical dimension, he always maintained that a purely economic, sociological or ideological interpretation of the human condition was incomplete and, in the long run, dangerous. In L’Eté, 1948, he wrote: ‘History explains neither the natural universe that existed before it, nor the beauty that is above it.’

ఆర్టిస్టులు సమాజంతో సంఘీభావంతో మెలగడం కంటే చరిత్రగతి నుండి వెలుపలకు వచ్చి  ఆలోచించడం అవసరమని అంటూ,
In ‘The Banishment of Helen’, Camus wrote: ‘The historical spirit and the artist, each in its own way, want to remake the world. The artist, through his very nature knows the limits that the historical spirit does not know. This is why the latter ends in tyranny while the passion of the former is for freedom. All those who fight for freedom today come to do battle, in the last instance, for beauty.’ And in 1948, in a talk in the Salle Pleyel, he repeated: ‘In this age in which the conqueror, by the logic of his attitude, becomes an executioner or a policeman, the artist is obliged to be a recalcitrant. In the face of contemporary political society, the only coherent attitude of the artist, unless he prefers to renounce his art, is unconditional rejection.’

విప్లవాలను తీవ్రంగా వ్యతిరేకించే కామూ మనిషికి తిరుగుబాటు చేసే హక్కుని ఎలా సమర్ధిస్తారనే సందేహం నాక్కూడా కలిగేది..రెండూ హింసకే కదా దారితీస్తాయి అనే అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఇందులో ఒక విశ్లేషణ చేశారు లోసా..ఇక్కడే 'నైతికత' ప్రాముఖ్యత  కనిపిస్తుంది..

For Camus, the revolutionary is a person who places man at the service of ideas, who is prepared to sacrifice the man who is living for the one who is to come, who turns morality into a process governed by politics, who prefers justice to life and who believes in the right to lie and to kill for an ideal..The rebel can lie and kill but he knows that he has no right to do so and that if he behaves in this way, he threatens his cause. He does not agree that tomorrow should take preference over today; he justifies the ends by the means and he puts politics at the service of a higher cause – which is morality.

Thursday, August 30, 2018

Books V. Cigarettes - George Orwell

పొలిటికల్ లిటరేచర్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా జార్జ్ ఆర్వెల్ నుండే మొదలుపెట్టాలి..కాలదోషం పట్టని రచన ఉత్తమ సాహిత్యంగా పరిగణింపబడుతుందనుకుంటే ఆయన రాసిన ఆనిమల్ ఫార్మ్,1984 లాంటి రచనల్ని ఏ సమాజానికైనా సులువుగా అన్వయించుకోవచ్చు..ఆర్వెల్ రాసిన ఫిక్షన్ ని కాసేపు ప్రక్కన పెడితే ఆయన వ్యాసాలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం..ఒక పాఠకునిగా,జర్నలిస్టుగా,రచయితగా,అన్నిటినీ మించి ఒక సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎటువంటి భేషజాలూ లేని ఆర్వెల్ కళ్ళతో చూసే ప్రపంచం పరిధి చాలా ఎక్కువ..'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా ప్రచురించిన జార్జ్ ఆర్వెల్ 'బుక్స్ v. సిగరెట్స్' పుస్తకంలో ఆర్వెల్ వివిధ సమయాల్లో రాసిన ఏడు వ్యాసాలున్నాయి.

Image courtesy Google

ఆర్వెల్ ని చదవక మునుపు రాజకీయాలూ,సాహిత్యం అనేవి రెండు పరస్పర విభిన్నమైన ప్రపంచాలు అనే భ్రమలో ఉండేదాన్ని..అందులోనూ అస్తిత్వవాదం ఎక్కువగా చదువుతున్న సమయంలో అయితే ఈ భావన మరింత బలంగా ఉండేది..అన్నిటికీ అతీతంగా నిలబడే 'ఆర్ట్' ఒక సర్వస్వతంత్రమైన మాధ్యమం,కానీ నేడు రాజకీయసామాజికాంశాలు సాహిత్యాన్ని శాసించే దిశగా ఎదిగిన క్రమాన్ని గురించి 20 వ శతాబ్దపు ప్రారంభంలో రాసిన ఈ వ్యాసాలు ఇప్పుడు చదివినా కూడా తాజాగా అనిపిస్తాయి..మొదటి నాలుగు వ్యాసాలూ (Books v. Cigarettes,Bookshop Memories,Confessions of a Book Reviewer,The Prevention of Literature) పూర్తిగా సాహిత్యానికి సంబంధించినవి కాగా మిగతా మూడు ఆయన వ్యక్తిగతానుభవాల గురించి రాసినవి.

మొదటి వ్యాసం 'బుక్స్ v. సిగరెట్స్' లో ఒక సినిమాకు వెళ్ళినప్పుడు పెట్టే ఖర్చు,సిగరెట్ పాకెట్స్ కి పెట్టే ఖరీదూ లాంటివి లెక్కేసుకుంటే పుస్తకాలు కొనుక్కుని చదవడం పెద్ద ఖరీదైన వ్యవహారమేమీ కాదనీ,పుస్తకాలు చదువుకోవడం అన్నిటికంటే 'cheap luxury' అనీ తన దగ్గరున్న పుస్తకాల గురించిన గణాంకాల ద్వారా నిరూపిస్తారు..రెండో వ్యాసం బుక్ షాప్ మెమోరీస్ లో లండన్లో సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ లో పని చేస్తున్నప్పుడు తన అనుభవాలను గురించి రాస్తూ పుస్తకాల షాప్ లో పని చెయ్యడం పుస్తకాలు చదవాలనే ఆసక్తిని చంపేస్తుందంటారు...'The Prevention of Literature' అన్నిటికంటే నాకు బాగా నచ్చిన వ్యాసం..భవిష్యత్తులో వ్యక్తిగత అనుభవాలూ,భావోద్వేగాలూ,నిజాయితీతో కూడిన పరిశీలనలు లేని డొల్లతనంతో కొత్త రకం సాహిత్యం పుడుతుందనీ,తమ కాలంలో వారు జీవించిన లిబరల్ సంస్కృతి అంతరించడంతో పాటే సాహిత్యం కూడా తుది శ్వాస విడుస్తుందని జోస్యం చెప్పడం సమకాలీన సాహిత్యపు విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే నిజమేననిపిస్తుంది..ఆ నిరంకుశత్వం నీడల్లో మెటాఫోర్ల ముసుగుల్ని ఆసరా చేసుకుని కవిత్వం కొంతవరకూ నిలదొక్కుకోగలుగుతుందేమో గానీ హేతువాదం పునాదుల మీద నిలబడే గద్య రచన మాత్రం అంతరించిపోతుందంటారు..Totalitarian culture లో గద్య రచన చేసే రచయితకి అయితే నిశ్శబ్దం లేదా మృత్యువూ తప్ప మధ్యే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పారు.

Papers such as the Writer abound with advertisements of Literary Schools, all of them offering you ready-made plots at a few shillings a time. Some, together with the plot, supply the opening and closing sentences of each chapter. Others furnish you with a sort of algebraical formula by the use of which you can construct your plots for yourself. Other offer packs of cards marked with characters and situations, which have only to be shuffled and dealt in order to produce ingenious stories automatically. It is probably in some such way that the literature of a totalitarian society would be produced, if literature were still felt to be necessary. Imagination – even consciousness, so far as possible – would be eliminated from the process of writing. Books would be planned in their broad lines by bureaucrats, and would pass through so many hands that when finished they would be no more an individual product than a Ford car at the end of the assembly line.

In our age, the idea of intellectual liberty is under attack from two directions. On the one side are its theoretical enemies, the apologists of totalitarianism, and on the other its immediate, practical enemies, monopoly and bureaucracy. Any writer or journalist who wants to retain his integrity finds himself thwarted by the general drift of society rather than by active persecution.

At some time in the future, if the human mind becomes something totally different from what it now is, we may learn to separate literary creation from intellectual honesty. At present we know only that the imagination, like certain wild animals, will not breed in captivity. Any writer or journalist who denies that fact – and nearly all the current praise of the Soviet Union contains or implies such a denial – is, in effect, demanding his own destruction.

'Confessions of a Book Reviewer' వ్యాసం చదివినవాళ్ళు ఎవరూ ఇక ముందు బుక్ రివ్యూస్ చదివే సాహసం చెయ్యరు..పుస్తకం అచ్చు అవ్వగానే 'అద్భుతం,అమోఘం' అని రాయాలని ఎడిటర్ల దగ్గర నుండి వచ్చే వత్తిడిని తట్టుకుని సమీక్షకులు ఎంత మెకానికల్ గా ఆ పని చేసుకుపోతారో ఇందులో కాస్త సునిశిత హస్యం మేళవించి స్పష్టంగా రాశారు..పుస్తక సమీక్షల్లో లోపించే  నిజాయితీని నిజాయితీగా ఒప్పుకున్న సమీక్షకులు ఆర్వెల్..'How the poor die' అనే మరో  వ్యాసంలో 1929 లో పారిస్ లో ఉండగా ఒక X అనే హాస్పిటల్లో కొన్ని వారాలపాటు చికిత్స తీసుకున్నప్పటి సంగతులను వివరించారు..ఈ వ్యాసం అప్పట్లో చదివిన అతుల్ ఘవండే రాసిన 'బీయింగ్ మోర్టల్' ను మరోవిధంగా గుర్తుకు తెచ్చింది..Quality of life vs Quantity of life సూత్రాన్ని బట్టి చూస్తే నేటి వైద్య విధానాలు ముగింపు(మృత్యువు) విషయంలో పేషంట్లకు సరైన క్లారిటీ ఇవ్వడానికీ,నిజాన్ని నిజాయితీగా చెప్పడానికీ నిరాకరిస్తున్నాయనీ ఘవండే స్వయంగా అంటారు..పేదవారి పట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ నిరంకుశ వ్యవహారశైలిని స్వయంగా చూసిన(అనుభవించిన) ఆర్వెల్ గౌరవప్రదమైన మరణానికి ఇలాంటి హాస్పిటళ్ళ బదులు మరో మార్గం వెతుక్కోవడం ఉత్తమం అంటారు.

As a non-paying patient, in the uniform nightshirt, you were primarily a specimen, a thing I did not resent but could never quite get used to.

One wants to live, of course, indeed one only stays alive by virtue of the fear of death, but I think now, as I thought then, that it’s better to die violently and not too old. People talk about the horrors of war, but what weapon has a man invented that even approaches in cruelty some of the commoner diseases? ‘Natural’ death, almost by definition, means something slow, smelly and painful. Even at that, it makes a difference if you can achieve it in your own home and not in a public institution. This poor old wretch who had just flickered out like a candle-end was not even important enough to have anyone watching by his deathbed. He was merely a number, then a ‘subject’ for the students’ scalpels. And the sordid publicity of dying in such a place!

Whatever the legal position may be, it is unquestionable that you have far less control over your own treatment, far less certainty that frivolous experiments will not be tried on you, when it is a case of ‘accept the discipline or get out’. And it is a great thing to die in your own bed, though it is better still to die in your boots. However great the kindness and the efficiency, in every hospital death there will be some cruel, squalid detail, something perhaps too small to be told but leaving terribly painful memories behind, arising out of the haste, the crowding, the impersonality of a place where every day people are dying among strangers.

'Such,such were the joys' వ్యాసంలో బాల్యంలో St.Cyprian బోర్డింగ్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసిన కాలంలో ఆర్వెల్ అనుభవాలు వ్యక్తిగతంగా ఆయన గురించి మనకు తెలియని మరిన్ని విషయాలు తెలియజేస్తాయి..ఆర్వెల్ బాల్యం ఆయనకు పెద్దగా మధుర స్మృతులేవీ మిగల్చలేదు..బోర్డింగ్ స్కూల్లో ఇద్దరు నియంతలు Sambo,Flip ల ఆధ్వర్యంలో తన పేదరికం ఏ విధంగా నిరంతరం అవహేళనకు గురైందో పలు సందర్భాలను ఉటంకిస్తూ,నిరంకుశ ధోరణిలో వ్యవహరించే 19 వ శతాబ్దపు విద్యా విధానాన్ని ఈ వ్యాసంలో తీవ్ర స్వరంతో విమర్శించారు..ఆ రోజుల్ని తలుచుకుంటే తన మనసులో ఇప్పటికీ ఒక రకమైన ఏహ్యతాభావం తప్ప మరొకటి లేదంటారు..ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ మొదలు నిన్న మొన్నటి Downton Abbey వరకూ నాకు మొదట్నుంచీ బ్రిటిష్ aristocracy వెలుగుజిలుగుల మీద ఒక రకమైన అబ్సెషన్ ఉంది..Cranford,North and South,Wives and daughters ఇలా చెప్పుకుంటూ పోతే బీబీసీ సిరీస్ లోని కంట్రీ హౌసెస్,విక్టోరియన్ రొమాన్స్ కంటికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో..వాటన్నిటిలో Aristocrats ని సైతం బాధితవర్గంగా చూపిస్తూ 'పాపం' అనిపించేలా చిత్రిస్తుంటారు..కానీ అసలు బాధిత వర్గాలు వేరే ఉన్నాయనీ,ఆ అందమైన ప్రపంచం వెనుక మనకు తెలియని మరో ప్రపంచాన్ని కూడా చూడమంటారు ఆర్వెల్..వాటితో పాటు చిన్నపిల్లల్లోని నిస్సహాయతని పెద్దలు ఎలా దుర్వినియోగపరుస్తారో తన అనుభవాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు..పరిశీలిస్తే ఇందులో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన పలు అంశాలున్నాయి..
ఆర్వెల్ అభిమానులూ,పుస్తక ప్రియులూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

In effect there were three castes in the school. There was the minority with an aristocratic or millionaire background, there were the children of the ordinary suburban rich, who made up the bulk of the school, and there were a few underlings like myself, the sons of clergymen, Indian civil servants, struggling widows and the like.

The essential conflict was between the tradition of the nineteenth-century asceticism and the actually existing luxury and snobbery of the pre-1914 age.On the one side were low-church Bible Christianity, sex puritanism, insistence on hard work, respect for academic distinction, disapproval of self-indulgence: on the other, contempt for ‘braininess’, and worship of games, contempt for foreigners and the working class, an almost neurotic dread of poverty, and, above all, the assumption not only that money and privilege are the things that matter, but that it is better to inherit them than to have to work for them.

That was the pattern of school life – a continuous triumph of the strong over the weak. Virtue consisted in winning: it consisted in being bigger, stronger, handsomer, richer, more popular, more elegant, more unscrupulous than other people – in dominating them, bullying them, making them suffer pain, making them look foolish, getting the better of them in every way. Life was hierarchical and whatever happened was right. There were the strong, who deserved to win and always did win, and there were the weak, who deserved to lose and always did lose, everlastingly.

And yet from a very early age I was aware of the impossibility of any subjective conformity. Always at the centre of my heart the inner self seemed to be awake, pointing out the difference between the moral obligation and the psychological fact.

A public school would be better fun than St Cyprian’s, but at bottom equally alien. In a world where the prime necessities were money, titled relatives, athleticism, tailor-made clothes, neatly brushed hair, a charming smile, I was no good.

All who have passed the age of thirty are joyless grotesques, endlessly fussing about things of no importance and staying alive without, so far as the child can see, having anything to live for. Only child life is real life.

Monday, August 13, 2018

Ursula K.Le Guin on Tolstoy's famous first sentence

చిన్నతనంలో మనకంటే పెద్దవాళ్ళు,గొప్ప వాళ్ళు(?),ప్రముఖులు ఏం చెప్తే అదే సరైనది అనే ఒక భావనలో ఉంటాము,ఇది చాలా సహజం..కానీ సొంతంగా ఆలోచించే పరిపక్వత వచ్చాక ఈ ప్రశ్నించడం అనేది మొదలవుతుంది..రచయిత ఉర్సులా లెగైన్ కూడా దీనికి మినహాయింపు కాదు..ఆవిడ రాసిన 'ది వేవ్ ఇన్ ది మైండ్' (The Wave in the Mind) లో ఒక రచయితగా,పాఠకురాలిగా తన అనుభవాల్ని మనతో పంచుకున్నారు..అందులో భాగంగా టాల్స్టాయ్ మీద రాసిన ఒక వ్యాసం,టాల్స్టాయ్ వీరాభిమానినైన నన్ను ప్రత్యేకం ఆకట్టుకుంది...ఈ 'అభిమానం'తో చిక్కేంటంటే మనం అభిమానించే వాళ్ళని మనం ఏమన్నా పర్వాలేదు గానీ వేరే వాళ్ళు పొరపాటున ఏమన్నా అన్నారా కోపం,బాధా తన్నుకొచ్చేస్తాయి..కానీ ఎంత గొప్ప ఐడియాలజీ అయినా కూడా విమర్శను దాటకుండా వెళ్ళడం దాదాపు అసంభవమేమో కదా !!

Image courtesy Google
ఆ మధ్య 'A Schoolboy's Diary and Other Stories' లో రాబర్ట్ వాల్సర్ రాసిన ఒక వ్యాసంలో  'అన్నా కరెనినా' కథ మీద పరోక్షంగా కొన్ని హాస్యపూరితమైన వ్యంగ్యాస్త్రాలు వదిలారు..కానీ ఆయన వ్యాసంలో ఖచ్చితంగా సీరియస్నెస్ లేదు..మళ్ళీ ఇప్పుడు ఉర్సులా లెగైన్ 'అన్నా కరెనినా' ఓపెనింగ్ లైన్స్ మీద ఒక నిజాయితీతో కూడిన విశ్లేషణ చేశారు.. "Happy families are all alike; every unhappy family is unhappy in its own way." అని  మొదటిసారి అన్నా కరెనినా ఓపెనింగ్ లైన్స్ చదివినప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పారు అని ఆ వాక్యాలు రెండు మూడు సార్లు చదువుకున్న గుర్తు..ఈ పుస్తకం చదివినవారికి ఎవరికైనా ఆ వాక్యాలను ప్రశ్నించాలన్న ఆలోచన వస్తుందనుకోను,ఆ వాక్యనిర్మాణం అలాంటిది..ఆ ఓపెనింగ్ లైన్స్ ఒక ప్రపంచ ప్రసిద్ధమైన క్లాసిక్ లో శిలా శాసనాల్లా మిగిలిపోయాయి.

ఉర్సులా లెగైన్ కూడా టాల్స్టాయ్ వీరాభిమానిట..పధ్నాలుగేళ్ళప్పుడు తొలిసారి టాల్స్టాయ్ ని  చదివినా నలభయ్యేళ్ళ వరకూ ఆయనను సహధర్మచారిణి అంత శ్రద్ధగానూ గౌరవించానంటారు. (ఎటొచ్చీ ఆయన manuscripts ని ఒక్కోదాన్నీ ఆరుసార్లు చేత్తో మళ్ళీ కాపీ చెయ్యనప్పటికీ అంటూ :) )
'I used to be too respectful to disagree with Tolstoy' అంటూనే తనలో రహస్యంగా దాగున్న ఫెమినిస్టు ఆయన్ను జడ్జి చేస్తుందంటూ,టాల్స్టాయ్ తో విభేదించడానికి తనకు గల కారణాల్ని విశ్లేషించారు.
Anybody can make a mistake in marriage, of course. But I have an impression that no matter whom he married Tolstoy would have respected her only in certain respects, though he expected her to respect him in all respects. In this respect, I disapprove of Tolstoy; which makes it easier to disagree with him in the first place, and in the second place, to say so.
ఉర్సులా లెగైన్ లాంటి రచయిత్రి కూడా టాల్స్టాయ్ ను తప్పు పట్టడానికి ఒక కారణం కోసం  ఆయన వ్యక్తిగత జీవితంవైపు దృష్టి సారించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా, 'ఆర్టిస్టును ఆర్ట్ నుండి వేరుగా చూడడం ధర్మం' అని మనసుకి ఎంత నచ్చచెప్పుకున్నా, 'The last station' అని టాల్స్టాయ్ పర్సనల్ లైఫ్ ఆధారంగా తీసిన ఒక సినిమా చూసినప్పుడు,నాకు ఆయన మీదున్న అభిమానంలో సగం ఆయన భార్య మీదకు 'జాలి'గా షిఫ్ట్ అయ్యిపోయిందని చెప్పక తప్పదు..ఈ ఆర్టిస్టులు గొప్పవాళ్ళే గానీ వాళ్ళను ప్రక్కనే ఉండి భరించేవాళ్ళు అంతకు వెయ్యి రేట్లు గొప్పవాళ్ళు అనిపిస్తుంది..ఈ ఆర్టిస్టులకి అలా యథేచ్ఛగా వ్యవహరించే హక్కు ఎవరిచ్చారని ఎవరైనా ప్రశ్నిస్తే,వారికుండే 'జీనియస్' ఇస్తుందని చెప్తానని ఉర్సులా లెగైన్ అంటారు..మరి ఆ 'జీనియస్' కి ఆవిడిచ్చే నిర్వచనం ఏంటి అంటే,
I think what I meant by genius was that I thought Tolstoy actually knew what he was talking about—unlike the rest of us.However, at some point, around forty or so, I began to wonder if he really knew what he was talking about any better than anybody else, or if what he knew better than anybody else was how to talk about it. The two things are easily confused.
తనకు అరవై ఏళ్ళు వచ్చాకా టాల్స్టాయ్ తో విభేదించానంటూ ఆవిడ కొన్ని ఆలోచనల్ని మన ముందుంచారు..
*హ్యాపీ ఫామిలీస్ అన్నీ కూడా ఒకేలా ఎలా ఉంటాయి అనేది మొదటి ప్రశ్న
"The enormous cost and complexity of that “happiness,” its dependence upon a whole substructure of sacrifices, repressions, suppressions, choices made or forgone, chances taken or lost, balancings of greater and lesser evils—the tears, the fears, the migraines, the injustices, the censorships, the quarrels, the lies, the angers, the cruelties it involved—is all that to be swept away, brushed under the carpet by the brisk broom of a silly phrase, “a happy family”?"
*Happiness ఒక విలువలేని సాధారణమైన అంశమా అన్నది మరో ప్రశ్న.
*లేక 'Unhappiness' గురించి రాస్తే తప్ప అది ఉత్తమ సాహిత్యం క్రిందకి లెక్కలోకి రాదా అనేది ఇంకో ప్రశ్న.
In order to imply that happiness is easy, shallow, ordinary; a common thing not worth writing a novel about? Whereas unhappiness is complex, deep, difficult to attain, unusual; unique indeed; and so a worthy subject for a great, a unique novelist?
Surely that is a silly idea. But silly or not, it has been imposingly influential among novelists and critics for decades. Many a novelist would wither in shame if the reviewers caught him writing about happy people, families like other families, people like other people; and indeed many critics are keenly on the watch for happiness in novels in order to dismiss it as banal, sentimental, or (in other words) for women.
సంతోషం అంటే ఏంటో,అది దక్కడం ఎంత కష్టమో టాల్స్టాయ్ కు స్పష్టంగా తెలుసు,దాన్ని అద్భుతంగా వర్ణించగలిగే నేర్పు ఆయనకు దేవుడు ఇచ్చిన వరం..ఆయన రచనలకి ఆ వర్ణనలే అసాధారణమైన అందాన్నిస్తాయి..కానీ ఆ ప్రసిద్ధమైన వాక్యంలో ఆయన ఎందుకు అసత్యాన్ని  ఆశ్రయించారు అనేది అర్ధం కాలేదంటారు ఉర్సులా.
Why he denied his knowledge in the famous sentence, I don’t know. He did a good deal of lying and denying, perhaps more than many lesser novelists do. He had more to lie about; and his cruel theoretical Christianity led him into all kinds of denials of what in his fiction he saw and showed to be true. So maybe he was just showing off. It sounded good. It made a great first sentence. 

Saturday, August 4, 2018

మీరు పుస్తకాలెందుకు చదువుతారు ?

Image courtesy Google

నేను : "మీరు పుస్తకాలు ఎందుకు చదువుతారు ?"
వారు : జ్ఞాన సముపార్జన కోసం..
(ఇంకో ప్రశ్న వేయాల్సిన అవసరం కనపడలేదు నాకు)

వారు : మరి మీరెందుకు చదువుతారు ?
నేను : ఆనందం కోసం...

వారు : మరి పుస్తకాల గురించి రాస్తారు అన్నారు కదా ! వాటికి మనీ పే చేస్తారా ఎవరైనా ?
నేను : లేదండీ..ఇవ్వరు..అదొక హాబీ అంతే..
(ఈసారి ఇంకో ప్రశ్న వెయ్యడం అనవసరమని వారికి తోచింది.. నేను చేసే పని వల్ల ఉపయోగం వారికి కనపడలేదు మరి)

నేను : మీకు సినిమాలు ఇష్టమా ?
వారు : అవును..విపరీతమైన పిచ్చి
నేను : నాక్కూడా.. మరి మీరు మీ జీవితంలో విలువైన రెండున్నర గంటలు కూర్చుని సినిమా చూసినందుకు మీకు థియేటర్ యాజమాన్యం ఎంత పే చేస్తారు ?
వారు : (నన్ను పిచ్చి దాన్ని చూసినట్లు చూసి,పగలబడి నవ్వారు)
నేను : ఇందాక మీరడిగిన ప్రశ్న కి నాక్కూడా అలాగే నవ్వొచ్చిందండీ..
వారు :  ........... ...... ...... ......

మీరు పుస్తకాలెందుకు చదువుతారు ? ఈ ప్రశ్న చాలా సార్లు చర్చకి వచ్చింది..గూగుల్ ప్లస్ లో చాలా సార్లు స్నేహితుల మధ్య ఈ విషయంలో చర్చలు జరిగాయి.. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకునేదాన్నినిజమే నేను ఎందుకు చదువుతాను అని ? దాని వల్ల ఉపయోగం ఏదైనా ఉందా ? అని !!!

సంతోషానికి నిర్వచనాలు మనిషికీ మనిషికీ ఎలా మారతాయో,ఈ చదవడానికి కూడా కారణాలు మనిషికీ మనిషికీ మారతాయి..ఈ ఎందుకు చదువుతారు అనే ప్రశ్న ఒక్కోసారి చాలా టిపికల్ గా,కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది..హెర్మన్ హెస్సే సిద్ధార్థ చదివి సుమారు నాలుగేళ్ళకి పైనే అయ్యిందనుకుంటా...అందులో సిద్ధార్థుడు 'గౌతమ బుద్ధుణ్ణి' కలవడానికి వెళ్ళి,ఆయన చూపించే మార్గం తనకి ఉపయోగం లేదని నిర్ధారించుకుని తన దారి తాను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు..సిద్ధార్థుడి స్నేహితుడు  గోవిందుడు మాత్రం బుద్ధుడి దగ్గర ఉండిపోతాడు..ఇక్కడ సిద్ధార్ధుడు తెలుసుకున్న విషయం ఏంటంటే జీవితపరమార్ధం తెలుసుకునే దిశగా ప్రతి మనిషీ ఒక ప్రత్యేకమైన మార్గంలో నడవాల్సి ఉంటుందనీ,అది గురువునో,మరొకర్నో అనుసరిస్తే జరిగేది కాదనీను...విద్య,దానితో పాటు వచ్చే జ్ఞానం గురువు దగ్గర అభ్యసిస్తే వచ్చేది..కానీ వాటిని మాధ్యమాలుగా చేసుకుని (టూల్స్ గా ఉపయోగించి) జీవితపరమార్ధం తెలుసుకోవడం ఎలా అనేది ఎవరికివారు చెయ్యాల్సిన పని..(Information is not knowledge)..అది గురువుల వద్ద అభ్యసిస్తే వచ్చేది కాదు.ఇదంతా ఎందుకంటే ప్రతి మనిషీ,చేసే ప్రతి పనికీ ఏదో ఒక 'purpose'  (లక్ష్యం అనండి పోనీ) ఉండాలని నియమమేమీ లేదు..ఆ మధ్య ఉర్సులా లెగైన్ కూడా ఒక సందర్భంలో 'నో టైం టు స్పేర్' లో "ఆధునిక సమాజం కాలాన్ని ధనంతో ముడిపెట్టి చూస్తోందనీ,ఇది ఆర్ట్ కి పెద్ద అవరోధమనీ" అంటారు..సంతోషాన్నిచ్చే ఏ పనినీ డబ్బుతో ముడివెయ్యకూడదని ఆవిడ వాదన...ఒక స్ట్రాటజీ,ప్లానింగ్ ప్రకారం చేసేది 'పని' అవుతుంది గానీ 'కళ' కాదు..అందులోనూ సాహిత్యం లాంటివి రూల్స్,స్ట్రాటజీస్,ప్లానింగ్ లాంటి వాటికన్నిటికీ అతీతమైనవి..ఈ లిటరేచర్ అనే మాధ్యమం బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోడానికి అనే కంటే మనల్ని మనం తెలుసుకోడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది అని నేననుకుంటాను..ఇది నా అనుభవం మాత్రమే..సుభాషిత రత్నకోశంలో ఒక పద్యాన్ని Octavio Paz అనువదించారు,ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది..
 రచయితలు కూడా నాకు తెలిసినంతలో ఈ చదవడం అనేదాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసి ఉండరు..చాలా కొద్ది exceptions అన్ని చోట్లా ఉంటాయనుకోండి..పెద్దయ్యాక పెద్ద రచయిత కావాలి కాబట్టి నేను ఇప్పటినుండే చదవడం మొదలు పెడతాను,రాయడం మొదలు పెడతాను అని ఏ గొప్ప ఆర్టిస్ట్ అనుకుని ఉండరు..వారికి స్వతః సిద్ధంగా ఉన్న passion తో పని చెయ్యడం వలన ఆటోమేటిక్ గా వారికి దిశానిర్దేశం జరిగి గమ్యానికి చేరువవుతారేమో.. టాల్స్టాయ్,ఠాగోర్,వైల్డ్ లాంటి వాళ్ళని చదివినప్పుడు జీవితసారాన్ని వడబోసిన ఒక గురువు పాఠం చెప్తుంటే శ్రద్ధగా వాళ్ళ అనుభవాల నుంచి నాకు తెలీనిదేదో తెలుసుకుంటున్న భావన కలుగుతుంది..అదే  Krzhizhanovsky,పెస్సోవా,కామూ,బిల్ వాటర్సన్ లాంటి వాళ్ళు తొలిపరిచయంలోనే ఆప్తుల్లా,సన్నిహితుల్లా అనిపించారు..నా నమ్మకం ప్రకారం రచయితలందరూ conformity ని ఎద్దేవా చేసేవాళ్ళే అయినప్పటికీ,ఈ రెండో రకం గ్రూప్ బొత్తిగా 'misfits' అనిపిస్తుంది..'అందరూ చదివే పుస్తకాలు చదివితే అందరిలాగే ఆలోచిస్తారు' అని అదేదో quote ఉంటుంది..మరి నేను misfit కావడం వల్లనో మరొకటో గానీ మెజారిటీ పాఠకులు ఇష్టపడే పుస్తకాలు నాకు ఎప్పుడూ నచ్చలేదు..అలాగే సమకాలీన సాహిత్యం చదివే ఆసక్తి కూడా తక్కువ..May be I love the company of misfits..అదృష్టవశాత్తూ నాకు ప్రతి చోటా నాలాంటి వాళ్ళు కొందరు తగుల్తుంటారు,అదొక వరం..పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచాన్ని గురించీ,తోటి మనుషుల గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు,కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అతీతమైనదేదో తెలుసుకోవాలనే తపన మాత్రం ఉంది..అదేంటి అనడిగితే నాక్కూడా జవాబు తెలీదు..జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నానంటారా !!! Every sort of indulgence is a form of escape.. :) కానీ ఈ ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని మాత్రం చెప్పగలను..

ఇంతకీ నేను పుస్తకాలు ఎందుకు చదువుతాను ? పోనీ మీరెందుకు పుస్తకాలు చదువుతారు ???

చాలా కాలం క్రితం రాసుకున్న కొన్ని అక్షరాలతో ఈ పోస్ట్ ముగిస్తాను..

I read...
Some times for pleasure..
Sometimes as an escape..
Sometimes for company..
And among all,just for the love of reading..

I don't read..
To attain wisdom..
To acquire knowledge..
To be a better person..
And among all I don't read because reading is something good...

What I read,
I read good and bad books (?) equally...
I start my day as a blank sheet of paper and everything I read on that day makes a simple pattern on it which becomes 'Me' for that day....And that 'Me' could be anything..

What is 'reading' like,
Reading is like any other simple addiction/obsession..
Sometimes it made me feel better...
Sometimes it made me feel sick...

Friday, August 3, 2018

Yayati : A Classic Tale of Lust - Vishnu Sakharam Khandekar

చాలా కాలం వరకూ పురాణేతిహాసాల్ని 'రూల్ బుక్స్' అనుకునేదాన్ని..హైందవ సమాజంలోని   సంస్కృతీ,సంప్రదాయాలన్నీ అందులో సూత్రాల పునాదులమీదే గుడ్డిగా నిలబడ్డాయని ఒక బలమైన నమ్మకం ఉండేది..ఈ దేశంలో పుట్టినవారందరికీ చిన్నతనం నుండీ రామాయణభారతభాగవతాల్లోని కథలు చిరపరచితమే..ఇంట్లోవాళ్ళు చెప్పగా కొన్నీ,ఆనోటా ఈనోటా కొన్నీ,ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో కొన్నీ నేను కూడా అలాగే విన్నాను..కూలంకషంగా విషయాలు తెలీకపోయినా సుమారు ప్రతి కథా ఎక్కడో అక్కడ విన్నదో,చూసిందో అవ్వడం ఇక్కడ సహజమే అయినా యయాతి విషయానికొచ్చేసరికి ఆ పేరు వినడమే గానీ ఆయన కథ నాకు ఈ పుస్తకం చదివేవరకూ తెలీదు..అర్జునుడూ,కర్ణుడూ లాంటి హీరోలని గ్లోరిఫై చేస్తుకి కథలు చెప్పిన అమ్మనోట యయాతి కథ విన్న గుర్తేదీ లేదు.
Image Courtesy Google
విష్ణు సఖారాం ఖండేకర్ రచనల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఈ 'యయాతి'..1960లో సాహిత్య అకాడెమీ అవార్డు,1974 లో జ్ఞానపీఠ్ అవార్డులను గెలుచుకున్న ఈ నవలకు Y.P.కులకర్ణి చేసిన అనువాదం మరాఠీ మూలాన్ని చదువుతున్న అనుభవాన్నిచ్చింది..సుమారు నాలుగొందల ముప్ఫై పేజీల మరాఠీ మాతృకని ఈ ఆంగ్ల అనువాదంలో సగానికి కుదించారు...ఈ నవలని యయాతి,దేవసేన.. క్షమించాలి (బాహుబలి ఎఫెక్ట్ :) ) దేవయాని,శర్మిష్ఠ  ఈ ముగ్గురి దృష్టికోణాలనుంచీ రాశారు..దేవయాని,శర్మిష్ఠ యయాతి భార్యలు కాగా,కచుడు యయాతికి మిత్రుడు...కథలో చాలా పాత్రలున్నప్పటికీ కథనం ముఖ్యంగా యయాతి,దేవయాని,శర్మిష్ఠ,కచుడు-ఈ నలుగురి మధ్యా నడుస్తుంది..కాళిదాసు శకుంతలలో కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపుతూ,'యయాతికి శర్మిష్ఠ ఎంత ప్రీతి పాత్రమో నువ్వు నీ భర్తకి అంతటి ప్రీతిపాత్రమవ్వాలి' అని దీవించారుట..మహాభారతంలో ఈ ప్రస్తావన లేనప్పటికీ తాను కాళిదాసుని అనుసరించి ఈ కథకు రూపకల్పన చేశానంటారు ఖండేకర్. 

ఇంద్రుణ్ణి జయించిన తరువాత అగస్త్యుడి ద్వారా శాపగ్రస్తుడైన నహుషుడి రెండో కుమారుడైన యయాతి జీవితం చిత్రంగా ఉంటుంది..నహుషుడు,అతని సంతానం ఎప్పటికీ సుఖంగా ఉండబోరనే శాపాన్ని ఆధారం చేసుకుని ఈ కథ నడుస్తుంది..యయాతి తల్లి ఒక వీరుడైన భర్తకు భార్య అయ్యే క్రమంలో యయాతికి తల్లి ప్రేమను పంచడంలో విఫలమవుతుంది..బాల్యంనుండీ భావుకుడైన యయాతి ఒక రాజుగా మారే క్రమంలో వేటాడడంలో,అస్త్రశస్త్రాల అభ్యాసాల్లో అతని తెలీకుండానే అతనిలోని భావుకుడు కనుమరుగైపోతాడు..తొలిసారి స్త్రీ ప్రేమను బంగారు శిరోజాలు కలిగిన దాసీ అలక ద్వారా రుచి చూస్తాడు కానీ తల్లి అలకను చంపించడం యయాతి మనసు మీద తీవ్రమైన గాయం చేస్తుంది..ఆ గాయం మానేలోపే,ఇంద్రుణ్ణి జయించిన పరాక్రమవంతుడైన తండ్రి నహుషుణ్ణి అంతిమఘడియల్లో చూసిన యయాతి చలించిపోతాడు..అంత సాధించినా తుదిఘడియల్లో అల్పంగా,పసిపిల్లాడిలా రోదిస్తూ మరణాన్ని అంగీకరించలేని తండ్రిని చూసిన యయాతికి మృత్యుభీతి మొదలవుతుంది..ఇంత అందమైన ప్రపంచంలోని సుఖాలన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన అతన్ని క్షణం నిద్రపోనివ్వదు..కొడుకు మనస్థితి గ్రహించిన యయాతి తల్లి,పెద్ద కుమారుడు యతిలాగే యయాతి కూడా ఎక్కడ సన్యాసిగా మారతాడోననే  భయంతో  అతనికి పెళ్ళి చేస్తే మంచిదన్న ఆలోచనకొస్తుంది..అలకను చంపించిందన్న కారణంగా తల్లి మీద కోపంతో బ్రాహ్మణ స్త్రీ,శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని వివాహమాడతాడు యయాతి..తొలిచూపులోనే దేవయాని సౌందర్యానికి దాసోహమని ఆమెను పెళ్ళాడినా,ప్రేమించిన కచుణ్ణి మనసులో ఉంచుకున్న దేవయాని యయాతి కోరుకున్న భార్య కాలేకపోతుంది..మితిమీరిన అహంభావంతో వృషపర్వుడి కుమార్తె అయిన యువరాణి షర్మిష్ఠ ను తన చెలికత్తె గా చేసుకునే దాకా నిద్రపోని పట్టుదల దేవయానిది..తరువాత యయాతి శర్మిష్ఠ ద్వారా తాను కోరుకున్న ప్రేమను పొందినప్పటికీ ఆమెను దేవయానికి భయపడి కుమారుడు పురూతో సహా దూరంగా పంపించేస్తాడు..ఆ తరువాత దేవయాని తనను తాకరాదని శాసించడంతో యయాతి జీవితం కళ్ళేలు లేని గుర్రంలా తయారవుతుంది..మరణ భయం ఒక వైపు,ఒంటరితనం మరోవైపు వెంటాడగా,ఆ స్పృహనుండి తప్పించుకునే మార్గాలు వెతుకుతూ క్రమేపీ భోగలాలసత్వానికి అలవాటుపడతాడు..అశోకవనంలో మద్యం సేవిస్తూ,స్త్రీలతో గడుపుతూ రాజుగా తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరిస్తాడు..ఆ తరువాత యయాతి జీవితం ఏమైందనేది మిగతా కథ.

మొగల్ చక్రవర్తి హుమాయూన్ మృత్యుముఖంలో ఉన్నప్పుడు తండ్రి బాబర్ తన ఆయుష్షు కూడా తన కొడుక్కిమ్మని అల్లాను వేడుకున్నాడట..'అలాంటప్పుడు నేను కథ రాయాలంటే బాబర్ గురించి రాయాలి గానీ,కొడుకు యవ్వనాన్ని కోరుకున్న స్వార్ధపరుడైన యయాతి కథ ఎందుకు రాయాలనే' తలంపు వచ్చిందంటారు రచయిత..కానీ 'యయాతి' కథలో సంక్లిష్టత ఈ కథను రాయడానికి పూనుకునేలా చేసిందట..పురాణకథల్ని మూలం చేసుకుని ఫిక్షన్ రాసే రచయితల్లో ప్రధాన పాత్రల్ని వక్రీకరించడానికి అడ్డుపడే సంశయం ద్వితీయ శ్రేణి పాత్రల  రూపకల్పన విషయంలో కొంత స్వేఛ్చను తీసుకుంటుంది..వ్యాసుడి శకుంతలకు,కాళిదాసు శకుంతలకూ ఉన్న తేడా ఆ స్వేఛ్చ ఫలితమేనంటారు ఖండేకర్..అదే విధంగా దేవయాని,శర్మిష్ఠ,కచుడి పాత్రల్లో తన కథకు అనుగుణంగా చాలా మార్పులూ-చేర్పులూ  చేశారు..వీటన్నిటికీ కేంద్రబిందువుగా ఉండే యయాతి పాత్ర నామకః కథానాయకుడే గానీ నిజానికి ఈ కథలో కథానాయకుడు లేడు..యయాతి కచుడు,వీరిద్దరూ రెండు విభిన్న జీవితాలకు ప్రతినిధులు..రాజభోగాలతో కూడిన జీవనం హస్తినాపురానికి రాజుగా యయాతి జీవితమైతే,సన్యాసిగా సర్వసంగ పరిత్యాగి కచుడు..కచుడు తన ధర్మం కోసం నిలబడి,నిస్వార్ధంగా దేవయాని ప్రేమను తిరస్కరించి శుక్రాచార్యుడి నుండి సంజీవినిని(ఒక శ్లోకం) అపహరిస్తాడు..సంజీవిని అంటే మృతుల్ని పురుజ్జీవింపజేసే ఒక మూలిక అని రామాయణంలో చదువుకుంటాం..ఇక్కడ దానికి భిన్నంగా 'సంజీవిని' ఒక శ్లోకం అన్నారు..

అలాగే నహుషుడి కుమారులు యతి,యయాతి ఒకే నాణానికి రెండు వైపులు..స్త్రీ-పురుషులూ,శరీరం-ఆత్మా ఈ రెండూ Yin and Yang లా విడదీయలేనివి..ఈ రెంటిలో ఏ ఒక్కదాన్ని నశింపజేసినా రెండోదాని ఉనికి ఉండదు..యతి ఆత్మను నమ్ముకుని దేహాన్ని ద్వేషిస్తే,యయాతి దేహాన్ని నమ్ముకుని ఆత్మను విస్మరిస్తాడు..భౌతికసుఖాల్ని త్యజించి సన్యాసిగా మారిన యతి (యయాతి అన్న) ఆత్మసాక్షాత్కారం కోసం ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి 'స్త్రీ' ని నశింపజెయ్యనిదే మోక్షమార్గం సాధ్యం కాదనీ భ్రమతో చివరకు మతిచలించి పిచ్చి వాడిలా మారతాడు..అలాగే ఆత్మను పూర్తిగా విస్మరించి దేహవాంఛలకు లొంగిపోయి విలాసాల్లో మునిగి తేలిన యయాతి మరో విధంగా తన కర్తవ్యంలో విఫలమవుతాడు..ఈ రెండు వైరుధ్యాలనూ సమన్వయం చేస్తూ కచుడి పాత్ర (యయాతి స్నేహితుడు/దేవయాని ప్రేమికుడు) నిస్వార్ధ జీవనమే జీవితపరమార్ధమని బోధిస్తుంది..అదే విధంగా దేవయాని తన స్వార్ధం కోసం యయాతిని వివాహం చేసుకుంటే,శర్మిష్ఠ తన రాజ్యం కోసం తన సుఖాన్ని త్యాగం చేసి దేవయానికి దాసీగా వెళ్తుంది..హస్తినాపురాధీశుడిగా,భౌతిక వాంఛల్ని అదుపులో పెట్టుకోలేని బానిసగా,చివరకు తన వృద్ధాప్యాన్ని కొడుక్కి ఇచ్చి అతని యవ్వనాన్ని గ్రహించిన యయాతి ఈనాటి స్వార్ధపూరిత సమాజానికి ప్రతినిధిగా,ఉదాహరణగా కనిపిస్తాడు..కానీ యయాతి  వైఫల్యాల్లో దేవయాని,యయాతి తల్లి కూడా భాగస్వాములుగా కనిపిస్తారు..పురాణ కథల్లో ఉండే ప్రత్యేకత  ఏంటంటే ఇతను నాయకుడూ,ఇతను ప్రతినాయకుడూ అంటూ ఎవరికీ టాగ్స్ తగిలించరు..ఆ పాత్రలూ,వ్యక్తిత్వాల తీరుతెన్నుల్నీ,వాటి పర్యవసానాల్నీ మాత్రమే వివరించి వదిలేస్తారు..ఈ రచనలో కూడా ఖండేకర్ అదే చేశారు..మంచి-చెడు,ధర్మాధర్మాల నిర్ణయం అచ్చంగా పాఠకులకే వదిలేశారు.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
The world errs, even realises the errors, but seldom learns from them.

The central theme of all was this: The world is sustained by the struggle for power, lives on rivalry and conflict and strives for sensual pleasure.

‘There is only one abiding happiness in life ... eternal happiness. Worldly pleasures end in unhappiness ... be it the pleasure of touch or sight. The body is man’s greatest enemy. It is the prime duty of man to strive persistently for mastery over the body.

With his hand on my shoulder, he said, ‘Yayati, one day you will be king. You will be a sovereign. You will celebrate a hundred sacrifices. But never forget that it is easier to conquer the world than to master the mind ...’

Once a lovely sweet fruit had a worm in it. He turned to me and said, ‘Prince, life is such. It is sweet and beautiful but no one knows how and when it will be infected.’ He paused in deep thought and recited a verse which said, ‘In life, it is the sweet fruit that is most likely to be infested.

Is knowledge a curse or a blessing bestowed on man? Is youth which comes to all living beings a blessing or a curse? Youth is the first step towards old age. And death is the last step. How can it be youth if it lures old age? It is a terrible curse!

In this world everybody obviously lives for himself. As the roots of the trees and creepers turn to moisture nearby, so do men and women look for support to near relations for their happiness. This is what the world calls love, affection or friendship. In fact, it is only the love of self. If the moisture on one side dries up, the trees and the creepers do not dry up, but their roots look for it elsewhere, be it far or near. They find it, draw it in and so remain fresh.

Yayati, death is as inevitable as it is distasteful to all living beings. That is a part of the routine of all creation, as dramatic and mysterious as birth. As the delicate reddish foliage just appearing on the trees in spring is the play of the power of creation, equally so, is it seen in the faded yellow leaves falling off in autumn. That is just how one must view Death. Sunrise and sunset, summer and winter, light and shade, day and night, woman and man, pleasure and pain, body and soul and life and death are all inseparable pairs. Life manifests itself in such quality. It is with such web and woof, that the Prime Power weaves the fabric of the life and growth of creation.

Only one part of Angiras’ letter was truly touching. That was the tears which came to his eyes while writing about Kacha’s death and words that were disfigured thereby. Tears and the disfigured words! All the rest was preaching, just dry philosophy.

I had heard of the heavenly bliss that crowns the union of lovers. An empty pot reverberates while being filled; but the sound ceases when it is full to the brim. The hearts of lovers are the same; I recalled one poet describing this blessed state with the words — when the hearts are filled with love, there is no room for words.

One whose only thought is for himself, one who is absorbed in oneself, one who looks at the world through one’s eyes alone, indeed one who does not see the world as anything beyond oneself is never able to realise the sensibilities of another; but engaged in self worship, unconsciously turns blind in his/her mind and deaf in his/her heart.

Life is full of numerous conflicting duals. An ascetic does achieve and experience eternal happiness in a condition where duals cease to exist. To realise it he adopts a rigid code of conduct. But this code rests essentially on his acceptance of the fact that conflicting duals do exist. It is only when the soul reveals its existence through the body that it can see the world. If the woman does not bear the child for nine months, how can man be born? How elementary these facts are! The ordinary man accepts them as a part of his life. Being a natural part of creation, he accepts its suzerainty.

Sunday, July 29, 2018

Upstream:Selected Essays - Mary Oliver

. . . in solitude, or in that deserted state when we are surrounded by human beings and yet they sympathise not with us,
we love the flowers, the grass and the waters and the sky.
In the motion of the very leaves of spring in the blue air there is then found a secret correspondence with our heart.-- Shelley, On Love

అంటూ షెల్లీ కవితతో తన పుస్తకాన్ని ఆరంభిస్తారు మేరీ ఆలీవర్..ఆధునిక మానవుడు అంతులేని గమ్యాల దిశగా పరుగులు తీసే ఆరాటంలో  ప్రకృతిలో తానూ ఒక భాగమని మరచిపోయాడు..'ప్రైవసీ' పేరిట మానవసంబంధాల్ని చిన్నచూపు చూస్తూ,మొహంవైపు పరీక్షగా చూడడం,వ్యక్తిగత వివరాలు అడగడం,మనిషి కనపడగానే ఒక పలకరింపు చిరునవ్వు నవ్వడం లాంటి ప్రాథమిక అంశాలు కూడా 'అనాగరికత' గా పరిగణింపబడుతున్న ఈ కాలంలో మానవజీవితంలోని ప్రాధాన్యతల్ని ఈ వ్యాసాల ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు..బ్రెయిన్ పికింగ్స్ లో మేరీ ఆలీవర్ గురించి విరివిగా ప్రచురించిన వ్యాసాలు ఆమె పుస్తకాలు చదవాలనే ఆసక్తిని కలిగించాయి..'Upstream' అనే ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటినుండీ తన స్వీయానుభావాలను నెమరువేసుకుంటూ ఒక ఆర్టిస్టుగా ఏటికి ఎదురీదిన వైనాన్ని వ్యాసాలుగా రాశారు.
Image Courtesy Google
ప్రకృతితో జీవితాన్ని పెనవేసుకున్న మనిషికి,విషయాలను లోతుగా అనుభూతి చెందే తత్వం సహజంగానే అలవడుతుంది..అది కొరవడిన ఈనాటి కాంక్రీట్ జంగిల్స్ లో 'ఇండివిడ్యువాలిటీ,ఇండిపెండెన్స్' అనే పదాల అర్ధాలను చాలా కన్వీనియెంట్ గా మార్చేసి,'నేనూ,నాదీ' మంత్రాన్ని జపిస్తూ,నాలుగ్గోడలనూ తన బందిఖానాగా మార్చుకున్న మానవుడికి ఈ Upstream పాత ప్రపంచాన్నే కొత్తగా పరిచయం చేస్తుంది..ప్రకృతి పట్లా,సమాజం పట్లా తన బాధ్యతను విస్మరించి ముందుకు వెళ్ళిపోతున్న తరానికి ఈ వ్యాసాలు ఆదర్శవంతమైన,బాధ్యతాయుతమైన జీవన విధానం అవసరాన్ని గుర్తు చేస్తాయి.

Sometimes the desire to be lost again, as long ago, comes over me like a vapor. With growth into adulthood, responsibilities claimed me, so many heavy coats. I didn’t choose them, I don’t fault them, but it took time to reject them. Now in the spring I kneel, I put my face into the packets of violets, the dampness, the freshness, the sense of ever-ness. Something is wrong, I know it, if I don’t keep my attention on eternity. May I be the tiniest nail in the house of the universe, tiny but useful. May I stay forever in the stream. May I look down upon the windflower and the bull thistle and the coreopsis with the greatest respect.

"ప్రకృతి అనేది లేకపోతే నాలో కవిత్వం పుట్టడం సాధ్యం కాదు,మిగతావారెవరికైనా సాధ్యమేమో" For me the door to the woods is the door to the temple.అని నిష్కర్షగా ప్రకృతితో తన అనుబంధాన్ని చాటుకుంటారు ఆలీవర్..నాకు మొదట్నుంచీ ప్రకృతి వర్ణనలూ,యాత్రా విశేషాలు చదవడం పట్ల ఆసక్తి తక్కువ..వాటిని కేవలం అనుభవంలో ఆనందించాలనుకుంటాను..కానీ తొలిసారి ఆలీవర్ నన్ను తన ప్రకృతి వర్ణనలతో పూర్తిగా కట్టి పడేశారు..పెరియార్ అడవిలో గడిపిన వర్షాకాలపు రోజుల్లో ఆమెను చదివిన ప్రభావమో ఏమో!! ఆమె వ్యాసాలు నాకు మరింత అద్భుతంగా తోచాయి..మేరీ ఆలీవర్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుక్షణం ఒక విస్మయంతో చూస్తారు..సాలెగూళ్ళ మొదలు,సముద్రపు తాబేళ్ళు,చేపపిల్లలు,గుడ్లగూబలూ,నక్కల విహారాలు ఇవన్నీ ఆమెకు వింతే..ఇవన్నీ ఆమె జీవితంలో భాగమే..ఇలా ప్రకృతితో ముడివడి నడవడం వల్ల మానవజీవితం పరిపుష్టమవుతుందంటారు..ఉరకలు వేసే జలపాతాలూ,సెలయేళ్ళు,అన్ని కాలమాన పరిస్థితులనూ ఎదుర్కోడానికి సర్వసన్నద్ధతను వ్యక్తం చేస్తూ నిశ్శబ్దంగా తమ ఉనికిని చాటుకునే వృక్షరాజాలు,సముద్రపు అలలు,ఆటుపోట్లు,శీతాకాలపు గాలులకు ఆకుల శబ్దాలూ,పున్నమి రాత్రులూ,శరద్,శిశిర,వసంతాలూ,వెచ్చని వేసవి ఉదయాలు,చిక్కని చీకట్లో అడవి అందాలూ,ఇలా ప్రకృతి పరంగా ఆలీవర్ సునిశిత దృష్టిని దాటిపోయే అంశాలేవీ ఉండవు..మనిషి జీవితం ఎక్కడ మొదలయ్యిందో,మనం ఎక్కడనుంచి వచ్చామో మళ్ళీ అదే చోటుకి లాక్కెళ్ళి 'ఇవిగో ఇవీ మీ మూలాలు' అంటూ తాను తిరుగాడిన ప్రదేశాలన్నీ చూపిస్తారు..

I would say that there exist a thousand unbreakable links between each of us and everything else, and that our dignity and our chances are one. The farthest star and the mud at our feet are a family; and there is no decency or sense in honoring one thing, or a few things, and then closing the list. The pine tree, the leopard, the Platte River, and ourselves—we are at risk together, or we are on our way to a sustainable world together. We are each other’s destiny.

'ప్రకృతి'తో స్నేహం అంటే మనుష్య సంచారం లేని ఏకాంత క్షణాలు కాదు ఆలీవర్ కోరుకునేది,ఆవిడ దృష్టిలో మనిషి కూడా ప్రకృతిలో భాగమే..ఆమె కళ్ళతో చూసే రోజువారీ జీవితాలు కూడా మనకు అక్కడక్కడా తారసపడతాయి..అందులో భాగంగా ఒక కార్పెంటర్ గురించి చెప్తారు,రోజంతా పని చేసుకుని ఖాళీ సమయాల్లో తన పుస్తకాల్లో కవితలూ,కథలూ రాసుకుంటూ అతడు గడిపే సంతృప్తికరమైన జీవితాన్ని పరిచయం చేస్తారు..మరోసారి తన స్వస్థలమైన ప్రొవిన్షియల్ టౌన్ లో ఒక దుకాణదారు ఎలా ఉన్నారంటూ, చిరునవ్వుతో పలకరించడం గురించి రాస్తారు..ఈ అంశాలు చూడ్డానికి చాలా స్వల్పంగా కనిపించినా అవి మనిషి జీవితానికి పరిపూర్ణతను చేకూరుస్తాయని ఆలీవర్ నమ్మకం..ఆవిడ కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఒక సారి చూస్తే ఆ తరువాత మన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని మనమెందుకు విస్మరిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము..

Ohio లోని ఒక ప్రొవిన్షియల్ టౌన్ లో పుట్టి పెరగడం ఆలివర్ ను ప్రకృతితో స్నేహం చేసే దిశగా ప్రభావితం చేసి ఉండవచ్చు..ఈ పుస్తకంలో ఆమెను ఒక కవయిత్రిగా మాత్రమే కాక ఒక రీడర్ గా,సాధారణ వ్యక్తిగా మరింత సన్నిహితంగా చూస్తాము..ఆ క్రమంలో బుట్ట నిండా పుస్తకాలు పెట్టుకుని అడవిలోకి పరిగెత్తి అలసిపోయి,చెట్టు నీడన చేరి వాల్ట్ విట్మన్ ను చదువుకునే చిన్నపిల్ల ఒక చోట  తారసపడితే,మరో చోట కేవలం $3.58 కే తన ఇంటిని  నిర్మించుకునే స్వతంత్రురాలైన యువతి కనిపిస్తుంది..

I learned to build bookshelves and brought books to my room, gathering them around me thickly. I read by day and into the night. I thought about perfectibility, and deism, and adjectives, and clouds, and the foxes. I locked my door, from the inside, and leaped from the roof and went to the woods, by day or darkness.

ఇందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న  అంశాలు ఆమె అభిమాన రచయితలు వాల్ట్ విట్మన్,ఎమెర్సన్,పో ల గురించి రాసిన మూడు సమగ్రమైన వ్యాసాలు..విట్మన్ చిన్నతనం నుండీ పరోక్షంగా ఒక స్నేహితునిలా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో వివరిస్తూ 'లీవ్స్ ఆఫ్ గ్రాస్' గురించి ఒక మంచి విశ్లేషణ చేశారు..విట్మన్ ను వెంటనే చదవాలనిపించేంత తీక్షణత ఆమె అక్షరాల్లోని ఆరాధనాభావంలో కనిపిస్తుంది..ఒక పాఠకులు కవిత్వాన్ని ఎలా అనుభూతి చెందాలో తెలియజెప్పే వ్యాసం అది..

That his methods are endlessly suggestive rather than demonstrative, and that their main attempt was to move the reader toward response rather than reflection, is perhaps another clue to the origin of Whitman’s power and purpose, and to the weight of the task. If it is true that he experienced a mystical state, or even stood in the singe of powerful mystical suggestion, and James is right, then he was both blessed and burdened—for he could make no adequate report of it. He could only summon, suggest, question, call, and plead. And Leaves of Grass is indeed a sermon, a manifesto, a utopian document, a social contract, a political statement, an invitation, to each of us, to change. All through the poem we feel Whitman’s persuading force, which is his sincerity; and we feel what the poem tries continually to be: the replication of a miracle.

అలాగే పో శైలిని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు..పో ను అర్ధం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం కుదరదంటారు..'మనందరం ఒక్కోసారి పో కథల్లో నేరేటర్సే కదా' అంటూ చేసిన విశ్లేషణ,

For are we not all, at times, exactly like Poe’s narrators—beating upon the confining walls of circumstance, the limits of the universe? In spiritual work, with good luck (or grace), we come to accept life’s brevity for ourselves. But the lover that is in each of us—the part of us that adores another person—ah! that is another matter.
In the mystery and the energy of loving, we all view time’s shadow upon the beloved as wretchedly as any of Poe’s narrators. We do not think of it every day, but we never forget it: the beloved shall grow old, or ill, and be taken away finally. No matter how ferociously we fight, how tenderly we love, how bitterly we argue, how pervasively we berate the universe, how cunningly we hide, this is what shall happen. In the wide circles of timelessness, everything material and temporal will fail, including the manifestation of the beloved. In this universe we are given two gifts: the ability to love, and the ability to ask questions. Which are, at the same time, the fires that warm us and the fires that scorch us. This is Poe’s real story. As it is ours.

ఈ వ్యాసాల్లో పాఠకులకూ,రచయితలకూ కూడా ఉపయోగపడే అంశాలతో పాటు మనిషి జీవితంలో సాహిత్యం ప్రాధాన్యతనూ,సృజన అవసరాన్ని గురించీ రాశారు..ఇది పోయెట్రీ,ఫిలాసఫీ,నేచర్ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

సాహిత్యం తెరచే దారుల్ని గురించి రాస్తూ,
The best use of literature bends not toward the narrow and the absolute but to the extravagant and the possible. Answers are no part of it; rather, it is the opinions, the rhapsodic persuasions, the engrafted logics, the clues that are to the mind of the reader the possible keys to his own self-quarrels, his own predicament.

ఎమెర్సన్ రచనల గురించి,
The writing is a pleasure to the ear, and thus a tonic to the heart, at the same time that it strikes the mind.

ఆర్టిస్టులు శ్వాసించే 'ఏకాంతం' గురించి,
For me it was important to be alone; solitude was a prerequisite to being openly and joyfully susceptible and responsive to the world of leaves, light, birdsong, flowers, flowing water. Most of the adult world spoke of such things as opportunities, and materials. To the young these materials are still celestial; for every child the garden is re-created. Then the occlusions begin.

విద్యా,వివేకం రెండు వేర్వేరు పార్శ్వాలు అంటూ,
When I came to a teachable age, I was, as most youngsters are, directed toward the acquisition of knowledge, meaning not so much ideas but demonstrated facts. Education as I knew it was made up of such a preestablished collection of certainties..Knowledge has entertained me and it has shaped me and it has failed me. Something in me still starves.

పుస్తకం నుండి మరికొన్ని,
Outwardly he was calm, reasonable, patient. All his wildness was in his head—such a good place for it!

“Men have called me mad; but the question is not yet settled, whether madness is or is not the loftiest intelligence,” the narrator says in “Eleonora.”

I read my books with diligence, and mounting skill, and gathering certainty. I read the way a person might swim, to save his or her life. I wrote that way too.

You must not ever stop being whimsical.And you must not, ever, give anyone else the responsibility for your life.

Thus the great ones (my great ones, who may not be the same as your great ones) have taught me—to observe with passion, to think with patience, to live always caringly.

Over and over in the butterfly we see the idea of transcendence. In the forest we see not the inert but the aspiring. In water that departs forever and forever returns, we experience eternity.