Wednesday, May 9, 2018

The Left Hand of Darkness - Ursula K.Le Guin

'వర్జీనియా వుల్ఫ్ అభిమానిగా నేను కూడా ఒక ఫెమినిస్టునని' గర్వంగా చెప్పుకుంటారు ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి ఉర్సులా కె లెగైన్..ఫెమినిజానికి నిర్వచనాలు తేటతెల్లంగా లేని ఆ కాలంలో ఈ సమాజం,ప్రభుత్వాలు,మతాలూ,సైన్యాలు లాంటివి పురుషుని ఆధిపత్యం క్రింద మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు ఆమెలో తలెత్తాయి..ఒక సమాజాన్ని లైంగికత ఎందుకింత ప్రభావం చేస్తుందో అన్న ఆలోచన నుండి అసలు ఈ లైంగికత లేని మనుషులు ఎలా ప్రవర్తిస్తారు ? ఆ సమాజం ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది..ఈ ప్రశ్నలే 1969 లో గ్రౌండ్ బ్రేకింగ్ ఫెమినిస్ట్ సైన్స్ ఫిక్షన్ గా నిలిచిన ఈ 'ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్' రచనకు పునాది.
Image courtesy Google
ఐస్ ఏజ్ కాలం నాటి ఆ సమాజం పేరు గెథెన్..ఈ గెథెన్ కు విశ్వంలో నక్షత్రాలికావాల మరో ప్రపంచమైన సంయుక్త రాష్ట్రాల్లో (3000 nations on 83 worlds) భాగమైన Ekumen (ఎర్త్) నుండి రాయబారిగా వస్తాడు Genly Ai..తనకు సంబంధం లేని ప్రపంచంలో స్త్రీ పురుష లింగ భేదం లేని ఆంబీసెక్సువల్ (ambisexual) మనుషులు మసిలే వింటర్ కు రాయబారిగా వస్తు వస్తూ ఒక మగవాడిగా తన లైంగికత తాలూకూ అభిజాత్యాన్ని కూడా తోడు తెచ్చుకుంటాడు..ఆ కారణంగా గెథెన్ లోని మనుషుల పట్ల అతనికి నమ్మకమూ,గౌరవమూ కలగవు.. తన సంస్కృతి,నాగరికత,విజ్ఞానం,కళలు మొదలగువాటిని ఈ గ్రహ వాసులతో పంచుకోవాలనే జెన్లీ లక్ష్యానికి ఈ అపనమ్మకం పరోక్షంగా ఒక ప్రతిబంధకంగా మారుతుంది..తనది కానీ సంస్కృతినీ,స్థిరమైన లైంగికత లేని మనుషుల మనస్తత్వాలనూ అంచనా వెయ్యలేక ఇబ్బందులు పడతాడు..
But it is all one, and if at moments the facts seem to alter with an altered voice, why then you can choose the fact you like best; yet none of them are false, and it is all one story.
A  man wants his virility regarded, a woman wants her femininity appreciated, however indirect and subtle the indications of regard and appreciation. On Winter they will not exist. One is respected and judged only as a human being. It is an appalling experience.
మనిషి తనను తాను నిరూపించుకుకోవడం కోసం యుద్ధం చేస్తాడు..భూమి మీద మనుషుల్లో ఉండే వైరాలూ,వివాదాలూ,దోపిడీలూ,హత్యలూ లాంటి వన్నీ గెథెన్ (వింటర్) లో కూడా ఉన్నప్పటికీ వారు తమలోని ఈ హింసాత్మక ధోరణిని వ్యవస్థీకరించుకోలేదు..ఫలితంగా గెథెన్ లో యుద్ధం అనేదే ఉండదు..చరిత్ర తిరగేస్తే మానవాళి ఎదుర్కొన్న యుద్ధాలకు మతం ఒక ప్రధాన కారణమైతే,లైంగికత మరో ముఖ్యమైన కారణం..మరి ఈ రెండూ లేని సమాజంలో ఘర్షణకు ఆస్కారం ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి..యుద్ధం తెలీని గెథెన్ లో అంతర్గత  సంఘర్షణలూ,భయాలు,పవర్ పాలిటిక్స్,రాజకీయ తంత్రాలూ మాత్రం పెచ్చు గానే ఉంటాయి..
My mind, trying to imagine a world without war, arrived at a world without men – without men as such – without men who had always to be, to prove themselves, men …
Cultural shock was nothing much compared to the biological shock I suffered as a human male among human beings who were, five-sixths of the time, hermaphrodite neuters.
గెథెన్ రాజు అగ్రావెన్ స్వభావ రీత్యా భయస్తుడూ,మార్పును ఆహ్వానించలేనివాడు..కానీ అతని ప్రధాని ఎస్ట్రావెన్ అతనికి పూర్తి విరుద్ధం.. ఎస్ట్రావెన్ నక్షత్రాలకావలి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోడానికి,వ్యాపార,విజ్ఞాన తదితర రంగాల్ని అభివృద్ధి చేసుకోవడానికి జెన్లీ ని ఒక వారధిగా చూస్తాడు..కానీ జెన్లీ కి ఎస్ట్రావెన్ పై మొదట్నుంచీ ఉన్న అపనమ్మకం పరిస్థితుల్ని క్లిష్టతరం చేస్తుంది..మరి జెన్లీ తన గెథెన్ మిషన్ లో సఫలీకృతుడయ్యాడా లేదా అనేది మిగతా కథ..

ఈ పుస్తకంలో లెగైన్ చర్చించిన ప్రధానాంశం లైంగికత్వం..ఇందులో గెథెన్ సమాజాన్ని సృష్టించడం ద్వారా లింగవివక్ష లేని సమాజం ఎలా ఉంటుందో మనకు చూపించే ప్రయత్నం చేశారు..ఆ దేశంలో ఒక రాజు కూడా గర్భం ధరిస్తాడు..గెథెనియన్లు 26 రోజులకొకసారి కెమ్మెర్ (సెక్సువల్ డ్రైవ్) లోకి వెళ్తారు..కెమ్మెర్' లో ఉన్నప్పుడు మాత్రమే సంపర్కానికి సిద్ధం అవుతారు..ఆ సమయంలో స్త్రీ పురుషుడిగా,పురుషుడు స్త్రీగా కూడా మారుతూ ఉంటారు..మగ,ఆడ భేదం లేకుండా ఎవరైనా గర్భం ధరించడం జరుగుతుంది..ఈ కెమ్మెర్ 2  నుండి 5 రోజులుంటుంది..ఆ సమయంలో కెమ్మెర్ హౌస్ లో గడుపుతారు..కెమ్మెర్  సమయంలో తప్ప మిగతా రోజులన్నీ వారిలో లైంగికత్వం అంతరిస్తుంది..ఆ సమాజంలో పిల్లల్నిపెంచడానికి ఒక ప్రత్యేక విభాగం,లైంగిక అవసరాలకు మరో విభాగం (కెమ్మెర్ హౌస్) ఉంటాయి.

మానవ సమాజంలో లింగభేదాలు ద్వంద్వ వైఖరిని (duality) సూచిస్తాయి..మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే క్రమంలో లింగ భేదాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి..తినే తిండి,వస్త్ర ధారణ మొదలు వ్యావహారిక శైలి వరకు ఈ లైంగికత్వం తన తాలూకూ ముద్రను వేస్తుంది..వ్యక్తులతో వ్యవహరించే సమయంలో సైతం స్త్రీ పురుష భేదాలను దృష్టిలో పెట్టుకునే మనిషి అంచనా వేస్తారు..మరి ఈ లింగ భేదమే లేకుండా ప్రతిమనిషీ స్త్రీపురుష లక్షణాలన్నీ కలిగి పరిపూర్ణంగా నిండుకుండలా ఉంటే ఎవరేమిటో తెలుసుకోవడంలో సంక్లిష్టత ఏర్పడుతుంది...ఒకవిధంగా లైంగికత కారణంగా మనిషిని అంచనా వెయ్యడం కొంతవరకూ తేలిక..మరి స్త్రీత్వం/పురుషత్వం కలగలిసిన గెథెనియన్ల మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం ఎంత కష్టమో జెన్లీ పాట్లు చూస్తే అర్ధం అవుతుంది..ఎస్ట్రావెన్ వ్యవహార శైలిలో తొణికిసలాడే స్త్రీత్వాన్ని అతనిలో స్పష్టత లోపించడంగా పరిగణిస్తాడు జెన్లీ..కానీ కథ ముందుకు వెళ్ళే కొద్దీ ఎస్ట్రావెన్ లోని స్త్రీ సంబంధిత సౌకుమార్యం చాటున అతనిలోని శక్తిమంతమైన రాజనీతిజ్ఞుడు కనపడతాడు..మనం జెన్లీ హీరో గా కథ చదవడం మొదలు పెడతాం కానీ కొంతసేపటికి జెన్లీ ని పక్కకు నెట్టి ఆ స్థానంలో ఎస్ట్రావెన్ ను కుర్చోపెడతాం..ఎస్ట్రావెన్ సంభాషణలు,మరి ముఖ్యంగా దేశభక్తి గురించి అతని భావాలు ఆకట్టుకుంటాయి..

ఇందులో కథను ఎస్ట్రావెన్,జెన్లీ ల దృష్టికోణాల నుండి చెప్తారు..ఈ రెండు ప్రపంచాల ప్రతినిధులూ తమది కానీ సంస్కృతినీ, జాతినీ అర్ధం చేసుకోవడంలో ఎదుర్కొనే సంఘర్షణ అడుగడుగునా కనిపిస్తుంది..కానీ ఈ వైరుధ్యాల నడుమ ఒక మనిషిని మరో మనిషితో పోల్చగలిగే ఒకే ఒక్క అంశమైన 'మానవత్వం' క్రమేణా ఇద్దరి ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుంది..ఈ రచన,మండుతున్న ఎండాకాలం నుండి ఒణికించే ఐస్ ఏజ్ కాలంలోకి అమాంతం తీసుకువెళ్ళింది..ముఖ్యంగా ఎస్ట్రావెన్,జెన్లీ లు గోబ్రిన్ గ్లేసియర్ ను దాటుకుని  కార్హైడ్ చేరుకోడానికి మంచు తుఫాన్ల మధ్య ఎనభయ్యొక్క రోజులపాటు చేసే సాహస యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది..పుస్తకం మొదలు పెట్టినపుడు లెగైన్ వాడిన కార్హైడ్ మాండలీకాన్ని పట్టుకోడానికి మనకు కాస్త సమయం పడుతుంది..మెల్లి మెల్లిగా ఆ భాషకు అలవాటుపడగానే మిగతా కథంతా అడ్వెంచరస్ జర్నీలా ఉంటుంది..ఇందులో చాలా సన్నివేశాలు ఇటీవలి కాలంలో వచ్చిన 'ఇంటర్స్టెల్లార్' సినిమాను గుర్తుకు తెచ్చాయి..ఆ సినిమాలో మూడో డిమెన్షన్ గా కాలాన్ని చూడడం,ఒక గ్రహం నుండి మరో గ్రహానికి ప్రయాణిస్తే 17 సంవత్సరాలు పట్టడం,ఒక గ్రహానికీ మరో గ్రహానికి కాల వ్యవధుల్లో తేడాల వలన వయసు మారకపోవడం లాంటివాటిని ఈ పుస్తకం నుండే సంగ్రహించారనిపించింది..ఈ కాన్సెప్ట్ Kurt Vonnegut రాసిన '2BR02B', Lois Lowry - 'The Giver' లను గుర్తుకు తెచ్చింది..పుస్తకం మొదట్నుంచీ నేరేషన్ మందకొడిగా నడిచినట్లనిపించినప్పటికీ ఉర్సులా శైలి పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది.
‘No. Oh, I see. I’ve timejumped. Twenty years from Earth to Hain-Davenant, from there fifty to Ellul, from Ellul to here seventeen. I’ve only lived off-Earth seven years, but I was born there a hundred and twenty years ago.
Life on Winter is hard to live, and people there generally leave death to nature or to anger, not to law.
As they say in Ekumenical School,when action grows unprofitable,gather information; when information grows unprofitable, sleep.
గెథెనియన్ల మతాన్ని గురించి రాస్తూ,
To be an atheist is to maintain God. His existence or his non-existence, it amounts to much the same, on the plane of proof.Thus proof is a word not often used among the Handdarata, who have chosen not to treat God as a fact, subject either to proof or to belief: and they have broken the circle, and go free.To learn which questions are unanswerable, and not to answer them: this skill is most needful in times of stress and darkness.
To oppose vulgarity is inevitably to be vulgar. You must go somewhere else; you must have another goal; then you walk a different road.
‘You don’t see yet, Genry, why we perfected and practice Foretelling?’ ‘No—’‘To exhibit the perfect uselessness of knowing the answer to the wrong question.’

బాధ్యతల్లో సమానత్వం,
Anyone can turn his hand to anything. This sounds very simple, but its psychological effects are incalculable. The fact that everyone between seventeen and thirty-five or so is liable to be (as Nim put it) ‘tied down to childbearing’, implies that no one is quite so thoroughly ‘tied down’ here as women, elsewhere, are likely to be – psychologically or physically. Burden and privilege are shared out pretty equally; everybody has the same risk to run or choice to make. Therefore nobody here is quite so free as a free male anywhere else.

గెథెన్ shifgrethor (నియమాలు/రాజ్యాంగం) లో ఒక ఆసక్తికరమైన నియమం..
The system of extended-family clans, of Hearths and Domains, though still vaguely discernible in the Commensal structure, was ‘nationalized’ several hundred   years ago in Orgoreyn. No child over a year old lives with its parent or parents; all are brought up in the Commensal Hearths. There is no rank by descent. Private wills are not legal: a man dying leaves his fortune to the state. All start equal.
‘The unexpected is what makes life possible'

జెన్లీ ప్రపంచం గురించి,
The Ekumen as a political entity functions through co-ordination, not by rule. It does not enforce laws; decisions are reached by council and consent, not by consensus or command. As an economic entity it is immensely active, looking after interworld communication, keeping the balance of trade among the Eighty Worlds. Eighty-four, to be precise, if Gethen enters the Ekumen…’
Darkness is only in the mortal eye, that thinks it sees, but sees not.
It is a terrible thing, this kindness that human beings do not lose. Terrible, because when we are finally naked in the dark and cold, it is all we have. We who are so rich, so full of strength, we end up with that small change. We have nothing else to give.
The First Envoy to a world always comes alone. One alien is a curiosity, two are an invasion.’
దేశభక్తి ని నిర్వచిస్తూ ఎస్ట్రావెన్ మాటలు...
No, that’s true … You hate Orgoreyn, don’t you?’ ‘Very few Orgota know how to cook. Hate Orgoreyn? No, how should I? How does one hate a country, or love one? Tibe talks about it; I lack the trick of it. I know people, I know towns, farms, hills and rivers and rocks, I know how the sun at sunset in autumn falls on the side of a certain ploughland in the hills; but what is the sense of giving a boundary to all that, of giving it a name and ceasing to love where the name ceases to apply? What is love of one’s country; is it hate of one’s uncountry? Then it’s not a good thing. It is simply self-love? That’s a good thing, but one mustn’t make a virtue of it, or a profession…Insofar as I love life, I love the hills of the Domain of Estre, but that sort of love does not have a boundary-line of hate. And beyond that, I am ignorant, I hope.'
What is more arrogant than honesty?
I could dispense with the more competitive elements of my masculine self-respect, which he certainly understood as little as I understood,shifgrethor …
Light is the left hand of darknessand darkness the right hand of light.Two are one, life and death,lying together like lovers in kemmer,like hands joined together,like the end and the way.
Ai brooded, and after some time he said, ‘You’re isolated, and undivided. Perhaps you are obsessed with wholeness as we are with dualism.’‘We are dualists too. Duality is an essential, isn’t it? So long as there is myself and the other.’

గెథెనియన్లను చైనా ఫిలాసఫీలోని  Yin and Yang తో పోలుస్తూ,
It’s found on Earth, and on Hain-Davenant, and on Chiffewar. It is yin and yang. Light is the left hand of darkness … how did it go? Light, dark. Fear, courage. Cold, warmth. Female, male. It is yourself, Therem. Both and one. A shadow on  snow.
Silence is not what I should choose, yet it suits  me better than a lie.'

Wednesday, April 25, 2018

Autobiography of a Corpse - Sigizmund Krzhizhanovsky

ఇరవయ్యో శతాబ్దపు నియంతృత్వం చెరిపేసిన చరిత్ర పుటల్లో రష్యన్ రచయిత 'Sigizmund Krzhyzhanovsky' జీవితం కూడా ఒక భాగం కావడంతో ఆయన బ్రతికున్నంత కాలం ఆయన ఫిక్షన్ రాస్తున్నారని ఎవరికీ తెలీదట..ఆయన మరణానంతరం ప్రచురణకు నోచుకున్న ఆయన రచనలు 'న్యూయార్క్ రివ్యూ బుక్స్ క్లాసిక్స్' లిస్టులో చేరి కీర్తినార్జించాయి..''Sigizmund Krzhyzhanovsky'- అసలీ పేరు సరిగ్గా ఉచ్ఛరించడానికే నాకు చాలా సమయం పట్టింది :) పేరు చూస్తుంటే మరీ ఎలియన్ ఫీలింగ్ కలుగుతోంది అనుకుంటూ టాల్స్టాయ్,చెఖోవ్ లాంటివాళ్ళు కొందరు తెలుసుగానీ ఈయన పేరెప్పుడూ వినలేదే సరే చూద్దాం అనుకుంటూ మొదలు పెట్టాను..కొన్ని పేజీలు చదివేసరికి రష్యా,ఇండియా,భూమీ,ఆకాశం,నువ్వూ,నేనూ ఉహూ...ఇవేమీ గుర్తులేవు..ఎవరో హిప్నటైజ్ చేసినట్లు అబ్స్ట్రాక్ట్ లోకంలో రచయిత తీసుకెళ్ళిన చోటుకల్లా నోరు వెళ్ళబెట్టి చూస్తూ వెళ్ళిపోయాను..Sigizmund శైలి పాఠకుల్ని అమాంతం వశపరుచుకునే శైలి...మెదడు,కళ్ళు మన ఆధీనంలో లేకుండా పూర్తిగా ఆయన అక్షరాలకు లోబడిపోతాయి..
'ఫెంటాస్టిక్' genreలో ఆయన కూర్చిన ఈ కథలన్నీ టైం మెషీన్ లో పాఠకుల్ని కాలంలోకి ప్రయాణించేలా చేస్తాయి..సంక్లిష్టమైన ఫిలాసఫీని ఆవిష్కరించడానికి 'ఫెంటాస్టిక్' (unearthy/imaginative) ని మించిన genre లేదనీ దాన్ని Krizhizhanovsky ఉపయోగించుకున్నట్లు వేరే ఎవరూ ఉపయోగించుకోలేదనీ Adam Thirwell తన ముందుమాటలో అంటారు..Sigizmund రచనలు (philosophical and phantasmagorical fictions) సోవియట్ రాష్ట్రాన్ని పాజిటివ్ లైట్ లో చూపించలేకపోయిన కారణంగా ఆయన రచనలు,ఆయన గతించిన తరువాత కూడా చాలా ఏళ్ళు ప్రచురణకు నోచుకోలేకపోయాయట.

Image Courtesy Google

ఇందులో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి..మొదటి కథ,'ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ కార్ప్స్' లో ఒక మరణించిన వ్యక్తి ,తన గదిలో ఉండటానికి వచ్చిన మరో అపరిచిత వ్యక్తిని (ఇక్కడ జర్నలిస్ట్ Shtamm) అడ్రస్ చేస్తూ రాసి వదిలేసిన నోట్ బుక్ ఉంటుంది..ఈ కథ రష్యన్ ప్రొవిన్షియల్ ప్లేస్ నుండి మాస్కోకు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తరలివచ్చిన యువతకు,తమ ఉనికిని చాటుకునే క్రమంలో ఎదురయ్యే ఐడెంటిటీ ఇష్యూస్,ఒంటరితనం,బోర్ డమ్ లాంటి అంశాల్ని ఫిలసాఫికల్ గా చర్చిస్తుంది..విచిత్రమేంటంటే Krzhizhanovsky ఈ పుస్తకంలో భారతీయ జానపదాల గురించి అలవోకగా చర్చిస్తారనుకోలేదు..ఈ కథలో ఉన్నట్లుండి విక్రమార్కుడు భేతాళుడి ప్రస్తావన కల్లో కూడా ఊహించం..ఆ మధ్య ఉర్సులా లెగైన్ కూడా 'నో టైమ్ టు స్పేర్' లో ఇలాగే మహాభారతాన్నిఇలియడ్ తో పోల్చి ఆశ్చర్యానికి గురిచేశారు..అసలు ఈ 'ఫెంటాస్టిక్' genre రచయితల్ని చదువుతుంటే,వీళ్ళందరికీ అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన జానపదాల మీద సైతం ఎంత అవగాహన ఉందోనని ఆశ్చర్యం  కలగక మానదు..Krzhizhanovsky ఇండియన్ ఫిలాసఫీని కూడా ఔపాసన పట్టారనడానికి ఇందులో చాలానే సాక్ష్యాలు ఉన్నాయి..గూగుల్ లేనికాలంలోనే పూర్వపక్షం గురించీ,పతంజలి,వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు అంతర్జాతీయ సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనను సూచిస్తాయి..ఈయన సమకాలీనులైన బోర్హెస్,కాఫ్కా లాంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంధాలు కూడా అందుబాటులో లేనప్పటికీ Krzhizhanovsky లైబ్రరీలో Poe,పుష్కిన్,గోగోల్ ల వంటివారు ఉండేవారట..కానీ ఇన్ని పరిమితుల మధ్య,ఒక చిన్న గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన Krzhizhanovsky ని ఒక ఋషిగా భావించడంలో గానీ,ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

An old Indian folktale tells of a man forced to shoulder a corpse night after night—till the corpse, its dead but moving lips pressed to his ear, has finished telling the story of its long-finished life. Don’t try to throw me to the ground. Like the man in the folktale, you will have to shoulder the burden of my three insomnias and listen patiently, till the corpse has finished its autobiography.

ఇందులో ఒక్కో కథా ఒక్కో రత్నమైతే,నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన కథ 'ది ల్యాండ్ ఆఫ్ నాట్స్' ...కనీసం మూడు,నాలుగు సార్లు చదివుంటాను ఈ ఒక్క కథనీ..ఇది అస్తిత్వవాదాన్ని గురించిన కథ.. ఈ genre లో ఇంత మంచి కథ మునుపెన్నడూ చదివిందీ లేదు,ఇక ముందు చదువుతానన్న నమ్మకమూ లేదు..ఎప్పుడూ కంఫర్టబుల్ జోన్ లో కూర్చుని,తమను తాము ఇంటెలెక్టువల్స్ లా ఊహించుకునే పుస్తకాల పురుగులకి సైతం ఈ కథలో మొట్టికాయలు,చెంపదెబ్బలు తప్పవు..Krzhyzhanovsky దృష్టి అంతా ఆయనలో చెలరేగే తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనపడదు...అంతగానూ ఆకట్టుకున్న మరో కథ 'In the pupil',ఈ కథలో ఒక వ్యక్తి తన ప్రియురాలి కళ్ళలోకి చూసినప్పుడు కనిపించిన ఇమేజ్ ఒకటి చిన్న వ్యక్తి రూపంలో ప్రాణం పోసుకుంటుంది..ఆమె కనుపాపల్లో ఆమె జ్ఞాపకాల తాలూకూ ప్రతిబింబాలన్నీ సజీవమైన  పాత్రలుగా,వారి అనుభవాలను చర్చించడం చాలా సరదాగా ఉంటుంది..ఈయన కథలు ఎటునించి ఎటు వెళ్తాయో తెలీదు..ఈ కథలోనైతే మరీనూ,కథనం పాదరసంలా సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి ,కెమిస్ట్రీ నుంచి ఫిక్షన్ కీ అలవోకగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది..ప్రేమలు,వాటిల్లో రకాలు,మానవ సంబంధాలు సర్రియలిస్టిక్ కాన్సెప్ట్స్ తో జతచేసి రాసిన ఈ కథలో ఇమేజెస్ ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి.."Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని Adam Thirwell తన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగధాల్లోకి తొంగి  చూడమంటాయి..ఈయన్ని చదివితే,పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా  Krzhyzhanovsky ని చదవక మునుపు, Krzhyzhanovsky ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి.

In the Pupil కథ నుండి,

Sometimes you become accustomed to a trifle, invent a meaning for it, philosophize it—then before you know it, that trifle starts raising its hand, contradicting the important and the real, brazenly demanding more existence and legitimacy.

To make someone fall in love with you is to take possession of their ‘associative matter’; love itself, schematically speaking, is nothing but a special case of two-way association".

Only by changing the objects of that emotion, only by throwing more and more wood onto the fire of feeling can one maintain its white heat.

The real love object is constantly changing, and one can love you today only by betraying the person you were yesterday.

“Listen,” I turned to Sixth, “I know how we, the rest and I, got here, but why do you need love? What are you doing at the bottom of this pupil? You have the soul of a bibliophile. All you need are your bookmarks. You should have gone on living with them and your formulas, your nose in a book, rather than butting in where you’re not wanted.”    The university lecturer looked crestfallen.    “It can happen to anyone, you see . . . Even Thales.

With a new day nearing, I began to consider how to convey everything without saying anything. To begin with, I must cross out the truth; no one needs that. Then variegate the pain to the limits of my canvas. Yes, yes. Add a touch of the day-to-day and over all, like varnish over paint, a veneer of vulgarity—one can’t do without that. Finally, a few philosophical bits and . . . Reader, you’re turning away, you want to shake these lines out of your pupils. No, no. Don’t leave me here on this long empty bench: Hold my hand—that’s right—tight, tighter still—I’ve been alone for too long. I want to say to you what I’ve never said to anyone: Why frighten little children with the dark when one can quiet them with it and lead them into dreams?

మరో కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోతాయి..ఇంకో కథ 'Bridge over the Styx' లో ఒక ఇంజినీర్ కు కలిగిన భ్రాంతిలో భాగంగా Styx (In Greek the meaning of the name Styx is: A river of the under world ) నుండి భూమ్మీదకు వచ్చిన కప్ప మృతజీవుల జ్ఞాపకాలన్నీ కలిసిపోయే మృత సముద్రపు సంగతుల్ని ఫిలసాఫికల్ ధోరణిలో చెప్తుంది..
'Yellow Coal' డిస్టోపియన్ శైలిలో,డార్క్ హ్యూమర్ అంతర్లీనంగా రాసిన మరో ప్రత్యేకమైన కథ,ఇది చదువుతున్నంతసేపు జార్జ్ ఆర్వెల్ 'ఆనిమల్ ఫార్మ్' గుర్తుకువచ్చింది..ఇందులో ఒక వ్యక్తి మానవ జాతిని ప్రేమించడానికి చేసే వ్యర్ధ (?) ప్రయత్నం అసలు మర్చిపోలేం :) 
చివరి కథ Postmark:Moscow కొన్ని పోస్టు చెయ్యని ఉత్తరాలు..ఇవి రచయిత కళ్ళతో చూసిన ఆ కాలంనాటి మాస్కో నగరాన్ని పరిచయం చేస్తాయి..ఇందులో అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే 'I' కథా,కథనాల్ని బట్టి  రూపాంతరం చెందుతుంటుంది..ప్రత్యేకమైన ఆకారం గానీ characteristics గానీ ఏమీ ఉండని ఈ 'I' ,సైన్స్ భాషలో చెప్పాలంటే ఒక catalyst గా కనపడుతుంది.

 ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది..ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్థిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం..కానీ రెండువందల పేజీల పైగా అనేక విషయాలపై అనర్గళంగా తన మెడిటషన్స్ కి అక్షరరూపమిచ్చిన Krzhyzhanovsky నాకు ఇప్పటికీ ఒక అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్ గానే మిగిలిపోయారు..ఇలాంటి అరుదైన రచయితలు మన ఊహలకు రెక్కలిస్తారేగానీ,మనకు దిశానిర్దేశం చెయ్యరు..వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన..ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ  మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేశారు Krzhyzhanovsky..మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా,కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా,పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా,ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే,మరో ప్రక్క నిజమేనని నమ్మేస్తాం..వాస్తవంలో సాధ్యం కానీ విషయాలను సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక టూల్ గా ఎంత నేర్పుగా ఉపయోగించచ్చో  Krzhyzhanovsky కథలు చదివితే తెలుస్తుంది.

రెండు స్థితుల నడుమ ఊగిసలాడే ఈ ఫెంటాస్టిక్ genre కూడా సంక్లిష్టమైనది..ఒక స్థితిలో అద్భుతంగా  కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది..మరో ప్రక్క ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు..కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన ఫిలాసఫీ  Krizhizhanovsky కథల్లో కీలకమైన అంశం..ఈయన్ని చదివేటప్పుడు reading between the lines/seeing through the gaps ఈ రెండూ తప్పనిసరి..ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య గ్యాప్స్ లో దాచేస్తారు..మన దృష్టిని దాటిపోయిన బిందువు వద్దే Krizhizhanovsky కథ రూపకల్పన మొదలవుతుంది..అలాగే సరిగ్గా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.

ఈ కథలు చదువుతునప్పుడు ఒక చిన్న సంగతి..సహజంగా నిద్రపోయేటప్పుడు చదవడం అలవాటు కావడంతో ఒక రోజు రాత్రి 'ఇన్ ది ప్యూపిల్' కథ చదువుతున్నాను..అప్పటికే 12 దాటింది,పుస్తకం ప్రక్కన పెట్టేసి రెప్పల బరువుకి నిద్రకుపక్రమించే సమయం అది..కానీ ఆ సమయంలో రెప్పవెయ్యడం మర్చిపోయిన కళ్ళు కొన్ని వాక్యాలు మీద అదేపనిగా పరిగెడుతున్నాయి..అప్పుడు ఆ వాక్యాలు మనసులోపలి పొరల్లో రేపిన అలజడికి ఉన్నట్లుండి లేచి కూర్చున్నాను..శ్రద్ధగా ఏదో భగవద్గీతనో,రామాయణాన్నో పట్టుకున్నంత శ్రద్ధగా పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మళ్ళీ కొన్ని వాక్యాలు వెనక్కి వెళ్ళి చదవడం మొదలు పెట్టాను..ఒక రచయిత పాఠకుల మనసుపై ఏ స్థాయిలో ముద్ర వెయ్యగలరో చెప్పడానికి ఆ క్షణం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..ఒక పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవకపోతే ఇక ఆ చదవడం వల్ల ఉపయోగం లేదంటారు ఆస్కార్ వైల్డ్..మాములుగా అయితే వైల్డ్ ఏదైనా ఒకసారి చెప్పాక తర్కించడం పాపం అనుకుంటాను..కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయనకీ నాకూ చుక్కెదురు..ఎంత నచ్చిన పుస్తకమైనా రెండోసారి చదవడానికి అస్సలు ఇష్టపడను..Life is too short to re-read a book అనే ఫిలాసఫీని నమ్మే నేను,ఈ కథల్ని కొన్నిటిని రెండు,మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం కలిగించింది..నేను ఇప్పటి వరకూ చదివిన సాహిత్యం అంతా ఒక వైపైతే Krzhyzhanovsky ని చదవడం మరో వైపు..ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో,మాన్ బుకర్,నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో Krzhyzhanovsky లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూనే ఉండి ఉంటారు.Krzhyzhanovsky అద్భుత ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన నాగరాజు పప్పు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

But at the time I gave this phenomenon a special name: psychorrhea. Meaning “soul seepage.”    Sometimes that measured flight—drop by drop—into the emptiness even frightened me. I would turn on the light and shoo both the dusk and the pseudo-sound away. The dusk, the boredoms, the “T,” and the hallucinations would all disappear: It was then that that ultimate loneliness, known to only a few of the living, would begin, when you are left not only without others but without yourself.

Only by holding a lighted match up to the paper square’s top lines did I learn that it was collecting not only boots and undershirts but bodies with what was in them: life. About the price of this last item, it said nothing.

Now I understand: Any “I” not nourished by “we,” not umbilically attached to the maternal organism enveloping its small life, cannot begin to be itself. Even the mollusk hidden inside tight-shut valves, if one helps those valves by binding them with a tight metal band, will die.

The Collector of Cracks నుండి,
“One can never finish. My point is this: If there is no single thread of time, if being is not continuous, if ‘the universe is not whole’ but cloven by cracks into odd, unrelated pieces, then all those textbook ethics based on the principle of responsibility, on the connectedness of my tomorrow with my yesterday, all fall away and are replaced by a single crackist ethic. The formula? Just this: For everything left behind the crack, I, who have stepped over the crack, am not responsible. I am here, the deed is there, behind me. I and what I have done are in different worlds, and between those worlds there are no windows. Oh, that I realized long ago. Do you understand?”

A philosophizing Not once said, “Being cannot not be without becoming Nothing, while Nothing cannot be without becoming Being.” 

But there’s no sense becoming too nonsensical and delving too deeply into metaphysics—don’t you agree?

When you, Tintz, reach our mires . . .O, there’s nothing you can’t find in nothing! I assure you, all that life of yours betinseled with stars and suns is so much . . . Extrastyxia.To live is to defect from death. True, all of you who have run away from nothing return to nothing sooner or later—because there is nothing else.

Other people too, of course, wrestle as best they can with this or that problem; under any frontal bone lives some question to unsettle the mind and torment the “I.” Even so, I envy other people: They can hide their problem inside notebooks, lock it away in a laboratory, contain it in mathematical symbols. They may, at least for a short while, go away from their conundrum, disengage from it, and give their thoughts a rest. But I can never leave my theme: I live inside it.

I stride past bookshop windows with their ever-changing covers: Moscow.

Here, in the city, associations tend to be strangely uniform: An association by similarity (especially an inner, essential similarity) is rare and almost unachievable. Here the barbershops all trim mustaches the same way, dress shops all button women into much the same styles, bookshop windows all display the same book covers—all billed as THE LATEST THING! From nine to ten every morning four-fifths of the total number of eyes are hidden behind newssheets identical down to the last misprint. No, here in the city, if you make associations by similarity, you’re bound to confuse everything (the familiar with the unfamiliar, today with yesterday), to grow melancholy, and even to go mad.

The “ideologies,” so to speak, of all these socially minded novelists (90 percent of all novelists today) have lost their way, like some bumpkin, in a forest of three pencils; their themes begin not from the beginning but from the workbench, which they know about from Granat’s Encyclopedia.

Besides, people who edit other people’s thoughts have their own particular probes; they’ll never find their Moscow in your fragmented lines, they won’t bother about the imported thoughts of an imported person: They’ll pass over them, like the others.

The dead, the idea glimmered, are to be envied. Barely stiff, and down goes the lid; on top of the lid goes damp earth; on top of the damp earth, sod. And that’s that. But here, as soon as you begin bumping along in a dray,they cart you on and on like that, from pothole to pothole, through spring and winter, from one decade to the next, unmourned and unneeded.

I have long preferred the narrow margins of books to the monotonous miles of earthly fields; the spine of a book has always seemed more intelligent to me than confused lectures about “the roots of things”; the sheer accumulation of those things, everywhere one looks, strikes me as crude and meaningless compared to the wise and subtle concatenations of letters and symbols hidden in books. Though the lines in books deprived me of half of my eyesight (55 percent), I never resented them: They knew too well how to be meek and dead. Only they, those silent black signs, could deliver me, however briefly, from my importunate, listless, and sleepy boredoms. 

Friday, April 13, 2018

పుస్తకాలూ-పిచ్చాపాటీ కబుర్లు

పుస్తకాల గురించి ఎవరైనా పాత్రలు,స్థలాలూ పేర్లతో సహా చెప్తూ మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది..కాస్త అసూయ కూడా కలుగుతుందనుకోండి..చదవడం ప్రతివారికీ ఒక అనుభవం..ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టేవారంటే నాకు చాలా ఇష్టం.
Image courtesy Google
ఏదైనా ఒక పుస్తకం చదివిన తరువాత దాన్ని గురించి ఒక వారంలోపు రాయడం కుదరకపోతే ఇక రాసే ఉద్దేశ్యం మానుకుంటాను..అలాగే ఏదైనా చదివిన తరువాత,ఆ అనుభవాల్ని పేపర్ మీద పెట్టాకే మరో పుస్తకం మొదలుపెడతాను..ఎందుకంటే ఆ సరికే ఆ ప్రపంచం తాలూకూ జ్ఞాపకాలు మనసులో నెమ్మదిగా  మసకబారిపోతుంటాయి..లెక్కప్రకారం మనసుకి నచ్చినవన్నీ జ్ఞాపకాల పెట్టెలో భద్రంగా ఉండాలి కదా !! మరి నా విషయంలో ఆ పెట్టె ఎంత వెతికినా దొరకదేంటి ! ఒకవేళ పొరపాటున దొరికినా అదేంటో,అందులో దాచిన వస్తువులేవీ పూర్తిగా ఉండవు..

ఎందుకిలా జరుగుతోంది ! ఫలానా పుస్తకం నాకు బాగా నచ్చింది..మనసుకు హత్తుకుంది..చదివినప్పుడు నిరంతరాయంగా ఎన్నో ఉద్వేగాలకు లోనయ్యానే..ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయానే..మరి అలాంటి అనుభవం భవిష్యత్తులో తరచిచూసుకోడానికి భద్రం చేసుకోలేకపోయనేందుకు !! ఈ వ్యవహారం అర్ధంకాక బుర్ర వేడెక్కుతున్న సమయంలో సరిగ్గా ఈ వాక్యాలు కంటబడ్డాయి.."To write is to forget"..నా మనసుకి స్వాంతన చేకూర్చిన ఈ మాటలన్నది రే బ్రాడ్బరీ..

'ఓహో,అయితే నేను తిరుగాడిన ప్రపంచం గురించి అక్షరాల్లో పెట్టిన తరువాత,ఆ లోకం నా మనసులోంచి చెరిగిపోతుందన్నమాట'..కానీ పూర్తిగా కాదేమో..మనిషి మెదడేమీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ కాదు కదా,కంప్లీట్ ఫార్మాట్ బటన్ నొక్కేస్తే పూర్తిగా ఫార్మాట్ చేసెయ్యడానికి...కానీ దాదాపు అలాంటిదే..కొన్ని విహరించిన ఊహాప్రపంచపు శకలాలు ఎక్కడో సబ్కాన్షియస్ లో చిన్నాభిన్నంగా విశ్వంలోని ఆనంతకోటి గలాక్సీ లలో నక్షత్రాల్లా ఎక్కడెక్కడో తెలీని చోట అదృశ్యంగా,అస్పష్టంగా మిగిలిపోతాయి..చాలా అరుదుగా కొన్ని చెదురుమదురు జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయి...

"బి అ రోమన్ ఇన్ రోమ్" అన్నట్లు రోమ్ కి వెళ్తూ వెళ్తూ రాజమండ్రిని మోసుకెళ్ళడం అనవసరమేమో కదా..నేను కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు పెట్టెలో గతాన్ని  మోసుకెళ్ళడం ఇప్పటివరకూ జరగలేదు మరి..నిజానికి ఈ క్షణమే శాశ్వతం అనుకునేవారికీ,ఈ క్షణంలో అనుభవమే  ప్రధానమనుకునే స్వార్థపరులకీ (?) గతంతో పనేంటి !

Narsissitic గా అనిపించినా మొదటినుంచి ఈ తరహా  డిటాచ్మెంట్ నన్నొదిలి పోవడం లేదు..తాత్కాలికంగా తిరుగాడిన లోకాల్లో కలిసిన మనుషులూ,వారి వివరాలు నాకు ఎంత మాత్రం గుర్తుండవు..ఎవరికీ అనుమతిలేకుండా చుట్టూ తయారు చేసుకున్న వలయం ఈ డిటాచ్మెంట్ కి కారణమా !! లేక నిజ జీవితంలో కూడా వ్యక్తుల పేర్లు,మొహాలు,మ్యాప్స్ లో డైరెక్షన్స్ గుర్తుంచుకోవడానికి కష్టపడే జబ్బు దీనికి మూల కారణమా అన్నది ఇప్పటివరకూ తేల్చుకోలేకపోతున్నాను..ఇలాంటి వివరాలు ఒక పట్టాన రిజిస్టర్ కావు అదేంటో ! ఈ గోడు ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళబోసుకుంటే ఇంత ఎనాలిసిస్ అవసరమా,దీన్ని సింపుల్ గా 'మతిమరుపు' అంటారు అని జ్ఞానబోధ  చేశారు :) ..

కానీ మరో ఫ్రెండ్ చెప్పిన విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది..అదేంటంటే ఒక పర్టిక్యులర్ genre కి పరిమితమవకుండా రాండమ్ గా చదివేవాళ్ళకి ఈ తరహా ఇబ్బంది వస్తుందని వారి ఉవాచ..""ఒక డైరెక్షన్ లేని ప్రతిదీ ఫైనల్ outcome ను nullify చేసేస్తుంది..నువ్వు ఒక నిర్ణీత పద్ధతిలో పుస్తకాలు చదవవు.. ప్రతి పాఠకునికీ ఇష్టమైన genre ఒకటుంటుంది..కానీ నీకు ఇష్టమైన genre ఏంటంటే నువ్వు చెప్పలేవు..నిన్ను ప్రభావం చేసిన రచయిత ఎవరంటే తెల్లమొహం వేస్తావు..ఇక ఒక మంచి పుస్తకం ఏదైనా చెప్పు అంటే 3rd డిగ్రీలో టార్చర్ చేసినట్లు చూస్తావు.. Wanderlust తో పరిమితి అనేది లేకుండా ఒక genre నుంచి మరొక genre కు స్విచ్ అవుతూ,ఆ రోమ్ లో రోమన్ లా వ్యవహరిస్తూ,నీ సినికల్ క్యూరియాసిటీ తో సంబంధం లేని ప్రపంచాలు చూడాలనుకుంటావు..నీ ఐడెంటిటీ ని ఆ లోకంలో జ్ఞాపకం పెట్టుకోవు..పర్యవసానంగా ఆ లోకపు కట్టుబాట్లను గానీ,వ్యక్తుల్ని గానీ ప్రశ్నించవు..తర్కంతో నీకు పని లేదు..దానితో చిక్కేంటంటే నువ్వు ఏ ఒక్క ప్రపంచానికీ చెందకపోవడమే...belongingness అనేది నీకసలు  ఉండదు..తత్పరిణామంగా నీకు ఏదీ మనసుదాకా వెళ్ళదు..ఖాళీ కాగితంలా ఇలా మనసుపై రాస్తూ,తుడిచేస్తూ
ఉంటే చివరకి ఎంప్టీ గా మిగిలిపోవడం ఖాయం..నిన్ను ఎవరూ పూర్తి చెయ్యలేరు""..ఇదీ ఆ సారాంశం.

జలుబొచ్చిందని చెప్పడం కంటే,అదేదో నోరుతిరగని ఇంగ్లీషు జబ్బు వచ్చిందని చెప్పడం కాస్త బెటర్ గా ఉంటుందనుకుంటే ఇదే నయం అనిపించింది..ఒక పుస్తకంలో కొన్ని వాక్యాలు,మరో పుస్తకంలో కొందరు మనుషులూ,ఇంకో పుస్తకంలో ఏవో సందర్భాలూ ఇలా మంచైనా చెడైనా,ప్రతీ పుస్తకం నుంచీ ప్రతీ రచయిత నుంచీ ఎంతో కొంత ప్రభావితమవుతాం కదా ! విశ్వంలోని  అనంతకోటి నక్షత్రాల్లో ఏ తార వెలుగు నీకిష్టమంటే ఏం  చెప్పను !!

Saturday, April 7, 2018

Zen in The Art of Writing - Ray Bradbury

తొమ్మిదేళ్ళ ఆ పిల్లవాడికి కామిక్ క్యారెక్టర్ బక్ రోజర్స్ అంటే ప్రాణం..ఒకరోజు తోటిపిల్లలు అతన్ని ఈ విషయమై పరిహసిస్తే,ఏడుస్తూ తాను కలెక్ట్ చేసుకున్న బక్ రోజర్స్ కామిక్స్ అన్నీ చింపేసి విసిరేశాడు..కానీ తన ప్రాణానికి ప్రాణమైన రోజర్స్ లేని తన చిన్ని ప్రపంచం బోసిపోవడం గ్రహించిన వెంటనే తేరుకుని ఆ కామిక్స్ మళ్ళీ కలెక్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు..ఆ పసి వయసులో తన తోటి పిల్లలు చెప్పిందే నిజమని ఆ పిల్లవాడు నమ్మి ఉంటే తరువాతి కాలంలో పెద్దల్నీ,పిల్లల్నీ తన మార్స్ స్వప్నలోకంలో విహరింపజేసిన 'రే బ్రాడ్బరీ' మనకు పరిచయమై ఉండేవారు కాదు.

Image courtesy Google
బ్రాడ్బరీ బాల్యంలో జరిగిన ఈ సంఘటనతోనే రచయితలకు మొదటి పాఠం మొదలవుతుంది.. ప్రతి మనిషీ ప్రత్యేకం..అభిరుచులు,ఇష్టాయిష్టాలు,కలలూ,కల్పనలూ ఇవన్నీ వ్యక్తిత్వానికి అదనపు సుగంధాన్నద్ది ఆ మనిషిని మిగతావారికంటే వేరుగా నిలబెడతాయి..ఆ ప్రత్యేకతను గేలి చేసే లోకం శత్రు సమానమనీ,దాన్ని నమ్మవద్దనీ అంటారు బ్రాడ్బరీ..స్పేస్ ట్రావెల్,సైడ్ షోస్,గొరిల్లాస్ లాంటి వింతైన విషయాలపై తన మక్కువను చిన్నచూపు చూసేవారు తనకు స్నేహితులు కారని అనుకోవడమే ఇక్కడ బ్రాడ్బరీ విజయానికి మొదటి మెట్టు అయ్యింది.. 'Zen in The Art of Writing',ముప్పై ఏళ్ళ వ్యవధిలో ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత రే బ్రాడ్బరీ వివిధ సమయాల్లో రాసిన వ్యాసాల సంకలనం..ఈ వ్యాసాలు ఇప్పటికే రచనా వ్యాసంగంలో ఉన్నవారికోసం రాశారు..రచయిత కావాలనుకుంటున్న వారి కోసమైతే కాదు..కానీ రచయితలు కావాలనుకున్న వారికి కూడా ఇదొక మంచి రిఫరెన్స్ పుస్తకం అని చెప్పవచ్చు..ఇందులోని విషయాలు ఏదో పాఠం చెప్పినట్లో లేక ఎక్స్పర్ట్ ఇంస్ట్రక్షన్స్ ఇచ్చినట్లో కాకుండా నిజాయితీ,మరి కాస్త హ్యూమర్ కలగలిసి ఆసక్తికరంగా ఉన్నాయి.

రచనలు చేసే కొత్తల్లో అనుకరణ అనేది సర్వసాధారణం..ఇందులో బ్రాడ్బరీ కూడా తను చదివిన రచయితల ప్రభావాన్ని దాటుకుని తన సొంత శైలిని ఏర్పరుచుకునే క్రమంలో ఎదురైన చిక్కుల్ని ప్రస్తావించారు..బాల్యంలో డికెన్స్,లవ్ క్రాఫ్ట్,Poe లనూ మరికొంత కాలం తరువాత Kuttner,Bloch,and Clark Ashton Smith లాంటివారి సంప్రదాయ సాహిత్యాన్ని (ఘోస్ట్ స్టోరీస్) చదువుతూ పెరిగిన బ్రాడ్బరీ మీద సహజంగానే వారి ప్రభావం ఎక్కువ ఉండేది..రచయితగా తొలి అడుగులేస్తున్న కాలంలో ఆయన శైలిలో,భాషలో వారి జాడలు కనిపిస్తుండేవి..కానీ తన శైలిని గుర్తించకుండా వారిని గుడ్డిగా అనుకరిస్తున్నానని తెలీని వయసు అది..పన్నెండేళ్ళ వయసు నుండే  Poe ఒక భుజంపైనుండీ,Wells, Burroughs లాంటి విచిత్రమైన కథలు (Astounding and Weird Tales) రాసే మరికొంతమంది రచయితలు మరో భుజంపై నుండీ పరికిస్తుండగా రోజుకి కనీసం వెయ్యి పదాలు రాసేవారట ఆయన..

"ప్రతి రోజూ ఉదయం మంచం దిగుతూనే ల్యాండ్ మైన్ మీద కాలు మోపుతాను..ఆ ల్యాండ్ మైన్ నేనే..విస్ఫోటనం జరిగిన తరువాత మిగిలిన రోజంతా ఆ తెగిపడిన ముక్కల్ని మళ్ళీ అతికించుకుంటాను" అంటూ ఒక 'రచయిత' కావడం అంటే ఏమిటో చెప్తారు బ్రాడ్బరీ..మనిషికి శ్వాస ఎంత అవసరమో,ఒక రచయితకు రాయడం అలాగే ఒక నిత్యావసరం..అదొక ఔట్లెట్..ఒక విముక్తి...ఆ ఔట్లెట్ లేనప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచపు నీలినీడలు క్రమేణా అతనిలో విషంలా పేరుకుపోయి జీవితాన్ని నిరర్ధకం చేస్తాయంటూ,"You must stay drunk on writing so reality cannot destroy you." అంటారు..

మరో చోట రచనా వ్యాసంగానికి పురిగొల్పే కీలక అంశాలను ప్రస్తావిస్తూ,ఒక రచయితకు ముందుగా తనకు అత్యంత ప్రీతి పాత్రమైనదేంటో తెలియాలంటారు..అలాగే అన్నిటికంటే మిక్కిలి అయిష్టమైనదీ కూడా ఏంటో తెలుసుకోమంటారు..ఆ రాగద్వేషాల గాఢతే మంచి రచనకి పునాది అంటూ,వాటితో పాటు Zest,Gusto లను కూడా తోడు తీసుకెళ్తే రచనలో స్వఛ్ఛత కనిపిస్తుందన్నది బ్రాడ్బరీ ఫార్ములా..ఇక రాయడానికి మంచి మంచి ఐడియాస్ కావాలంటే ఎలా ? దానికి కూడా మంచి సమాధానం ఇచ్చారు బ్రాడ్బరీ..

But ideas lie everywhere, like apples fallen and melting in the grass for lack of wayfaring strangers with an eye and a tongue for beauty, whether absurd, horrific, or genteel.

భవసాగరాల ఈదులాటల మధ్య ఆర్ట్ (ఇక్కడ రైటింగ్) ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ,ఏ కళైనా యుద్ధాలు,ఒంటరితనం,మరణం,ద్వేషం,వృద్ధాప్యం లాంటి వాటి నుండి విముక్తుల్ని చెయ్యలేదు గానీ మనసుకి తప్పకుండా స్వాంతన చేకూరుస్తుందంటారు..ఆ క్రమంలో రైటింగ్ ను ఒక 'సర్వైవల్' గా అభివర్ణిస్తూ Not to write,for many of us ,is to die అంటారు..ఇలాంటి కొన్ని వాక్యాలు ఆ కాలంలో రచయితలకు తమ పని పట్ల ఉండే నిబద్ధతను మరోసారి గుర్తుచేస్తాయి..
మరోచోట ఆగి ఆలోచించడం సృజనాత్మకతకు ప్రతిబంధకం అని చెప్తూ,అసంకల్పిత స్థితిలో వచ్చిన ఆలోచనల్ని ఎంత త్వరగా పేపర్ మీద పెడితే ఆ రచనలో అంత స్వఛ్ఛత,నిజాయితీ కనిపిస్తాయంటారు..అంటే ఆ అసంకల్పిత స్థితికి,రచయితకీ మధ్య వచ్చే తర్కాన్ని (ఇంటలెక్ట్) ను ఎంత దూరం పెడితే అంత మంచిదన్నమాట.

Run fast, stand still. This, the lesson from lizards. For all writers.

What can we writers learn from lizards, lift from birds? In quickness is truth. The faster you blurt, the more swiftly you write, the more honest you are. In hesitation is thought. In delay comes the effort for a style, instead of leaping upon truth which is the only style worth deadfalling or tiger-trapping.

ఇరవైల తరువాత పల్ప్ ఫిక్షన్ కథలు రాస్తున్న కొత్తల్లో Henry Kuttner,Leigh లు తన గురువులుగా,వారి  సూచన మేరకు Katherine Anne Porter,John Collier, Eudora Welty లనూ The Lost Weekend, One Man's Meat, Rain in the Doorway లాంటి కొన్ని పుస్తకాలనూ చదివారు బ్రాడ్బరీ..అప్పుడు జరిగింది ఒక అద్భుతం..ఇరవై ఒకటో ఏడులో అడుగుపెడుతున్న సమయంలో కొన్ని వేసవి మధ్యాహ్నాలు,అక్టోబర్ రాత్రుల్లో నెమ్మదిగా తన ఇష్టాలు,అయిష్టాలు కలగలిపిన చిట్టాను తయారు చేసుకుంటున్న తరుణంలో ఆ వెలుగు చీకట్ల మధ్య తనదైన ఉనికిని దేన్నో అస్పష్టంగా గుర్తించారు బ్రాడ్బరీ..అప్పుడు అనుకరణలకతీతంగా 'ది లేక్' అనే కథ రాసిన అనంతరం ఆయనకు తెలీకుండానే చెంపలపై జాలువారిన కన్నీళ్ళు ఆయన ఒక పరిపూర్ణమైన రచయితగా మారారనడానికి సాక్ష్యాలు.

రచయితకు రోజు వారీ జీవితంలో ఎదురయే చిన్న చిన్న సంఘటనలే కాదు..ఎక్కడో విన్న ఒక చిన్న మాట,ఒక పదం కూడా స్ఫూర్తినిస్తాయి..అలా పదాలను ప్రోగుచేసుకుంటూ,వాటిని వాక్యాల మధ్య అమరిక కోసం ఒకదానికొకటి  ముడులు వేసుకుంటూ తొలుత కథను రాయడం మొదలు పెట్టానని చెప్పడం ఒక్కో సందర్భంలో పాఠకుల్ని ఆశ్చర్యపరిచినా, "మీకు ఇవి మెకానికల్ గా అనిపించవచ్చు,కానీ ఇవి నా అనుభవాలు,మీకు కూడా ఉపయోగపడతాయేమో,ప్రయత్నించి  చూడండి" అని చెప్పిన సమయంలో ఆయన నిజాయితీ ఎంతో నచ్చింది..ఆర్టిస్ట్ కావడానికి దైవాంశ సంభూతులై ఉండాలి,సరస్వతీ కటాక్షం ఉండాలి లాంటి సంప్రదాయ వాదనలకు దూరంగా పాఠకులకు అర్ధమయ్యే రీతిలో ఆచరణకు అనువుగా "ఈ లాజిక్ అప్లై చెయ్యండి / లేదా ఇలా చేసి చూడండి / నేనూ అప్పుడిలాగే చేశాను,నాకు వర్క్ అవుట్ అయ్యింది / నేనూ రాసేటప్పుడు ఫలానా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తన అనుభవాల సారన్నంతటినీ రంగరించి రచయితలకు చాలా సరళమైన పద్ధతుల్ని సూచిస్తూ మార్గనిర్దేశం చేశారు బ్రాడ్బరీ.

ఆర్ట్ గురించీ,రైటింగ్ గురించీ ఇంతవరకూ చదివేసినా ఎక్కడా మా గురువుగారు వైల్డ్ ప్రస్తావన రాలేదేంటి చెప్మా అని ఆశ్చర్య పోతున్నంతలో ఈ పోయెమ్ ను ప్రస్తావించారు బ్రాడ్బరీ..

We might start off by paraphrasing Oscar Wilde's poem, substituting the word "Art" for "Love."

Art will fly if held too lightly,
Art will die if held too tightly,
Lightly, tightly, how do I know
Whether I'm holding or letting Art go?

ఇకపోతే రచన చెయ్యడానికి ముడి సరుకు కావాలంటే ఎక్కడో వెతుక్కోకుండా ముందుగా మన సబ్ కాన్షియస్ లో ఎక్కడో మూలన దాక్కున్న డేటాను వెలికి తియ్యమంటారు..ఒక జీవితకాలంలో చూసినవీ,విన్నవీ,కన్నవీ,ధ్వనులు,రుచులు,వాసనలూ,వ్యక్తులూ,ప్రకృతి,సంఘటనలూ ఇలా ఇవన్నీ దొరికే భాండాగారం మన మనస్సేనట..ఒకరకంగా మన ఊహాశక్తిని ఫీడ్ చేసే ఆహారం ఈ డేటానే అంటారు..మెలకువలో వాస్తవాన్ని,జ్ఞాపకంతోను అలాగే నిద్రిస్తున్నపుడు జ్ఞాపకాన్ని,జ్ఞాపకంతోనూ సరిచూసుకోవడం కూడా ఒక ఆర్టిస్టు అలవర్చుకోవాల్సిన విషయం..

If it seems I've come the long way around, perhaps I have. But I wanted to show what we all have in us, that it has always been there, and so few of us bother to notice. When people ask me where I get my ideas, I laugh. How strange-we're so busy looking out, to find ways and means, we forget to look in.

My ideas drove me to it, you see. The more I did, the more I wanted to do. You grow ravenous. You run fevers. You know exhilarations. You can't sleep at night, because your beast-creature ideas want out and turn you in your bed. It is a grand way to live.

అలాగే ఇందులో Muse గురించి రాసిన వ్యాసం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది..మనమేదో పని చేసుకుంటున్నప్పుడు మెదడుని తొలుస్తూ,పట్టుకుందామని వెంటపడితే,చిన్న అలికిడికే దూరంగా ఎగిరిపోయే తేలికపాటి పక్షి ఈక లాంటి సున్నితమైన Muse ను అదుపులోకి తెచ్చుకోవడానికి కూడా కొన్ని మార్గాల్ని సూచించారు..సబ్ కాన్షియస్ కు డైట్ మెనూ చెప్తూ ముందుగా ప్రతి రోజూ కవిత్వం చదవమంటారు..కవిత్వంలో దాగున్న మెటాఫోర్స్ మెదడుకి మంచి మేత..ఇది మన సెన్సెస్ ను మంచి కండిషన్ లో ఉంచుతుంది..కవిత్వం తరువాత వ్యాసాలు,వాటి తరువాత కథలు,నవలలూ కూడా చదవమంటారు కానీ మంచి రచయిత  కావాలంటే తనలా ఆలోచించే వారి కథలే కాకుండా తనలా ఆలోచించని వారిని కూడా చదవడం అవసరమంటారు..భాష,ఆలోచనల్లో ఏ ప్రత్యేకతా లేని తన తండ్రి తనకు అత్యంత ఇష్టమైన అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం అతనిలో కవిత్వం పెల్లుబుకుతుందంటూ,నిజాలు మాట్లాడే ప్రతి మనిషి నోట్లోంచీ కవిత్వం పుట్టుకొస్తుందంటారు.

Be certain of this: When honest love speaks, when true admiration begins, when excitement rises, when hate curls like smoke, you need never doubt that creativity will stay with you for a lifetime. The core of your creativity should be the same as the core of your story and of the main character in your story.

పలుచోట్ల బ్రాడ్బరీ స్వస్థలమైన Waukegan,Illinois పై ఆయన ప్రేమ కూడా ఈ వ్యాసాల్లో తళుక్కుమంది..ముప్పై మూడేళ్ళ వయసులో B. Berenson నుండి వచ్చిన ఫ్యాన్ లెటర్ ను ప్రస్తావిస్తూ ఒక్కోసారి తన ఆలోచనల్ని ఆమోదించే వారు ఒక రచయితకి ఎంత అవసరమోనంటారు..

I needed that approval. We all need someone higher, wiser, older to tell us we're not crazy after all, that what we're doing is all right. All right, hell, fine!

ఈ పుస్తకంలో ఫారెన్ హీట్ 451,మార్షియన్ క్రానికాల్స్,డాండేలియన్ వైన్ లతో పాటు ఆయన రాసిన ఇతర రచనలను గురించిన ఆసక్తి కరమైన విషయవిశేషాలున్నాయి..

A last discovery. I write all of my novels and stories, as you have seen, in a great surge of delightful passion. Only recently, glancing at the novel, I realized that Montag is named after a paper manufacturing company. And Faber, of course, is a maker of pencils! What a sly thing my subconscious was, to name them thus.And not tell me!

సహజంగా విజయమైతే స్వయంకృతమనీ,అపజయమైతే విధిని నిందించే లోకంలో తన విజయాల్లో కృషితో పాటు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం ఆయన మీద గౌరవాన్ని రెట్టింపు చేసింది..ఈ పుస్తకంలో అన్ని వ్యాసాలూ ఒకెత్తయితే చివరగా క్రియేటివిటీ గురించి ఆయన రాసిన ఎనిమిది కవితలు మరొకెత్తు..ఈ పుస్తకం సారాన్నంతటినీ ఒక విధంగా ఆ ఎనిమిది కవితల్లో పొందుపరిచారా అన్నట్లున్నాయి..రచయితలైనవాళ్ళు,రచయితలు   కావాలనుకుంటున్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

What if Norman Corwin had not sent me or if Walter I. Bradbury had not received me?
Mars might never have gained an atmosphere, and its people would never have been born to live in golden masks, and its cities, unbuilt, would have stayed lost in the unquarried hills. Much thanks to them then for that journey to Manhattan, which turned out to be a forty-year round trip to another world.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు..
Even as I write this, a letter has come from a young, unknown writer, who says he is going to live by my motto, found in my Toynbee Convector.
"... to gently lie and prove the lie true... everything is finally a promise... what seems a lie is a ramshackle need, wishing to be born..."

You stumble into it, mostly. You don't know what you're doing, and suddenly, it's done. You don't set out to reform a certain kind of writing. It evolves out of your own life and night scares. Suddenly you look around and see that you have done something almost fresh.

I loved them, and they smothered me. I hadn't learned how to look away and in the process look not at myself but at what went on behind my face.

The children sensed, if they could not say, that fantasy, and its robot child science fiction, is not escape at all. But a circling round of reality to enchant it and make it behave.

It is a lie to write in such a way as to be rewarded by money in the commercial market.
It is a lie to write in such a way as to be rewarded by fame offered you by some snobbish quasi-literary group in the intellectual gazettes.

Remember: Plot is no more than footprints left in the snow after your characters have run by on their way to incredible destinations. Plot is observed after the fact rather than before. It cannot precede action. It is the chart that remains when an action is through. That is all Plot ever should be. It is human desire let run, running, and reaching a goal. It cannot be mechanical. It can only be dynamic.So, stand aside, forget targets, let the characters, your fingers, body, blood, and heart do.

Monday, March 26, 2018

Family Happiness - Leo Tolstoy

మేము ప్రకృతితో సహజీవనం చేసిన కాలంలో,ఎంతో కాలం నుంచీ చూద్దామనుకుని ఎట్టకేలకు చూసిన ఒక సినిమా 'In to the wild'..మొదటి నుంచీ చివరి వరకు ఒక రకమైన ఉద్వేగంతో చూసిన ఈ సినిమాలో,జనారణ్యానికి దూరంగా,ఒంటరిగా క్రిస్ తన మేజిక్ బస్ లో టాల్స్టాయ్ రాసిన 'ఫామిలీ హ్యాపీనెస్' అనే పుస్తకంలోని ఈ వాక్యాల్ని పైకి చదువుకుంటాడు..ఆ సీన్ రెండు మూడు సార్లు రిపీట్ చేసి చూశాము..అప్పట్లో ఆ మాటలు క్రిస్ నోటినుండి వింటే ఏదో కవిత్వం వింటున్నట్లనిపించింది..

“A quiet secluded life in the country, with the possibility of being useful to people to whom it is easy to do good, and who are not accustomed to have it done to them; then work which one hopes may be of some use; then rest, nature, books, music, love for one's neighbor — such is my idea of happiness.”

Image courtesy Google
ఒక ప్రపంచ ప్రఖ్యాత రచయిత తన దృష్టిలో 'సంతోషాన్ని' నిర్వచించిన వాక్యాలు ఇవి..కేవలం చెప్పడమే కాకుండా తన ఆలోచనల్ని ఆచరణలో కూడా పెట్టిన వ్యక్తి టాల్స్టాయ్..1859 లో రాసిన 'ఫ్యామిలీ హ్యాపీనెస్' అనే ఈ నవలిక,పదిహేడేళ్ళ మార్యా (Marya Alexandrovna/Masha ) కథ..కథ మొదలయ్యే సమయానికి మార్యా తల్లిని కూడా పోగొట్టుకుని చెల్లెలు సోన్యా,గవర్నెస్ కాత్యాలతో కలిసి Pokrovskoye ఎస్టేటులో నివసిస్తూ ఉంటుంది..తల్లి మరణం తాలూకూ వైరాగ్యం కారణంగా జీవితం పట్ల ఆశావహ దృక్పథం లోపించిన మార్యాలో క్రమేపీ నిరాసక్తత చోటుచేసుకుంటుంది..అదే సమయంలో గతించిన తండ్రికి స్నేహితుడైన (తండ్రి కంటే వయసులో చిన్న వాడు) 36 ఏళ్ళ Sergey Mikhaylych రాక మార్యాకు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తుంది..చిన్నతనం నుండీ ఎరిగిన సెర్జీతో మార్యా తొందరగానే ప్రేమలో పడుతుంది..కానీ ఇద్దరి మధ్యా ఉన్న వయోభేదం వారిని త్వరగా బయటపడనివ్వదు..ఆ సమయంలో సెర్జీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన మార్యాని చూస్తే 'బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది' అంటూ యువతిలో తొలి యవ్వనపు పొంగుని వర్ణిస్తూ యద్దనపూడి రాసిన పదాలు జ్ఞాపకం వచ్చాయి..సెర్జీ,మార్యాల ప్రేమ కథ చదువుతున్న అనేక సందర్భాల్లో నాకు తెలీకుండానే ఆ పదహారేళ్ళ వయసుకి వెళ్ళిపోయాను..ఏదేమైనా కొన్ని నిద్రలేని రాత్రులూ,మరి కొన్ని అందమైన కలయికల మధ్య వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది..

ఆ ప్రేమ భావన ఎక్కడ వదిలిపోతుందోనని మిగతా కథ చదవబుద్ధి కాలేదు..పుస్తకం ప్రక్కన పెట్టేసి ఒకరోజు చదవలేదు..ఈ కథ ఇక్కడితో ఆపేస్తే ఎంత బావుంటుంది అనిపించింది..మరి జేన్ ఆస్టిన్ కాదు కదా,టాల్స్టాయ్ ఇక్కడ.. కలలు కన్నది చాలు,కాసేపు నిజాలు కూడా మాట్లాడుకుందాం పదమంటారు.. అయిష్టంగానే ఆయన్ని అనుసరించాను..మరొక్కసారి తృప్తిగా రెండో సారి మొదట్నుంచీ చదివాకా అప్పుడు మిగతా కథ చదివాను..అంత అద్భుతమైన ప్రేమకథా అతి మాములుగా ముగుస్తుంది..ఆస్కార్ వైల్డ్ అంటారు 'They spoil every romance by trying to make it last forever.' అని..అలాగే మాములుగా సెర్జీ,మార్యాలకు పెళ్ళైపోతుంది..ఇద్దరు పిల్లలు..కానీ కాలం నేనున్నానంటూ వారి మధ్య అనుకోని అగాథం సృష్టిస్తుంది..సెర్జీ పల్లెజీవితంలోని స్థిరత్వం కోరుకుంటే,మార్యా పట్టణాల్లోని హంగూ ఆర్భాటాలవైపు పరుగులు తీస్తుంది..అలజడి చేసే మనసుతో,అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న  స్వేచ్ఛతో ఎగిరిపోవాలనే యవ్వనపు ప్రవాహానికి అడ్డు కట్ట వెయ్యలేని మార్యా సెయింట్ పీటర్స్బర్గ్ తళుకుబెళుకుల సమాజం మత్తులో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.. కానీ తన తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చిన మార్యా,సెర్జీ ప్రేమలో (సెర్జీలో ?) వచ్చిన మార్పుల్ని భరించలేకపోతుంది..మరి వారి ప్రేమ మళ్ళీ మునుపటి రూపాన్ని సంతరించుకుందా లేదా అనేది వారి కథకు ముగింపు..

జేన్ ఆస్టిన్ ఎలిజబెత్ గురించీ,ఎలిజబెత్ గాస్కెల్ మిస్ హేల్ గురించీ,బ్రాంట్ మిస్ అయిర్ గురించీ రాయడంలో వింతేమీ లేదుగానీ..స్త్రీ తత్వాన్ని మనసుకి హత్తుకునే విధంగా మలచడం ఒక పురుషుడికి అంత సులభమేమీ కాదు..అదే ఈ కథలో మరో ప్రత్యేకత..శరత్,టాగోర్ లాంటి  వారి తరహాలో ఈ కథంతా మార్యా దృష్టికోణం నుంచి చెప్పారు టాల్స్టాయ్..ఒకరకంగా మార్యా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు..

జీవితంలో కొన్ని అపురూప క్షణాలు ఒక్కోసారి మనకు తెలీకుండానే పలుకరించి వెళ్ళిపోతుంటాయి..తరువాతెప్పుడో వాటి ఉనికిని గూర్చిన స్పృహ కలిగినప్పుడు మార్పుని నిరంతరం ఆలింగనం చేసుకోవాలనీ,ఆ క్షణాల్ని పూర్తిగా జీవించాననీ తెలిసిన మనసుని ఎంత మభ్య పెట్టుకున్నా,దాటిపోయిన క్షణాల్లోని తియ్యదనం గుర్తొచ్చి మనసు చేదుగా అయిపోతుంటుంది..అందులోనూ అవధుల్లేని ఆనందాన్ని ఒకసారి చవిచూసిన మనసు ఇంకా ఇంకా కావాలనే ఆరాటపడుతుంది తప్ప ఆనందంలో నిశ్చలత్వాన్నీ,పరిమితుల్నీ అంగీకరించదు..మార్యా అదే ఆనందాన్ని మళ్ళీ కోరుకోవడం ఒకరకంగా అత్యాశే..

ప్రకృతితో మమేకమై జీవించడం ఒక్కసారి రుచి చూసిన తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే అసహజత్వాన్ని అంగీకరించడం కష్టం..ఈ అనుభవాలన్నీ కాచి వడపోసిన సెర్జీ మనకి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపిస్తాడు..ప్రేమతో సహా కాలగతికి తలవంచనిదేదీ ఉండదని ఈ కథ మరోసారి రుజువు చేస్తుంది..మారే కాలంతో పాటు మనుషులూ,వారి మనస్తత్వాలూ,వాటితో  పాటు సంతోషం,దుఖ్ఖము,ప్రేమ,మానవ సంబంధాలూ ఇలాంటివన్నీ జీవితంలోని ఒక్కో దశలో,ఒక్కో విధంగా రూపాంతరం చెందుతాయి..ఆ మార్పుని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని,ఆనందాన్ని మూటగట్టుకున్న క్షణాల్ని స్మృతిపథంలో జాగ్రత్తగా పొదివిపట్టుకుని ముందుకెళ్ళమని హితవు చెప్తుందీ నవలిక..
ఇది చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన Charlotte Bronte రాసిన 'Jane Eyre',యాష్ చోప్రా లమ్హే సినిమాలు గుర్తుకొచ్చాయి..నాలాగే మీక్కూడా ప్రేమ కథలు ఇష్టమా ? అయితే తప్పకుండా చదవండి :)

మార్యా అంతరంగం..
“I wanted movement and not a calm course of existence. I wanted excitement and the chance to sacrifice myself for my love. I felt it in myself a superabundance of energy which found no outlet in our quiet life.”

సెర్జీ దృష్టిలో స్త్రీ ...
“I can't praise a young lady who is alive only when people are admiring her, but as soon as she is left alone, collapses and finds nothing to her taste--one who is all for show and has no resources in herself”

Thursday, March 22, 2018

The Book of Sand - Jorge Luis Borges

క్రిందటి సంవత్సరం చదివిన జాన్ బెర్జర్ పుస్తకం 'ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పికాసో' చిత్రలేఖనాన్ని నాకు సరికొత్త ప్లేన్ లో పరిచయం చేసింది..అందులో పికాసో లాంటి చిత్రకారులు కొందరు ఆద్యులుగా ఉండి,వృద్ధి చేసిన 'క్యూబిజం' అనే శైలిని గురించి వివరిస్తారు..అధికశాతం చిత్రకారులు సహజంగా రెండు లేదా మూడు డైమెన్షన్స్ లో వేసే చిత్రాలకు సరికొత్త నాలుగో డైమెన్షన్ ని పరిచయం చేసింది ఈ క్యూబిజం..ఒకే వస్తువుని మూడు కంటే ఎక్కువ డైమెన్షన్స్ లో చూపగలగడం ఈ శైలి ప్రత్యేకత అన్నమాట..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావూ అంటే,అందులో క్యూబిజానికీ,జార్జ్ లూయిస్ బోర్హెస్ కలానికీ చాలా పొంతనలుండడమే కారణం..కథానిర్మాణంలో అధికశాతం రచయితలు ఒక సంఘటనని రెండు,మూడు కోణాల్లో చూస్తే,బోర్హెస్ కలం అదే సంఘటనని అనంతమైన కోణాల్లో పరిశీలించి,పరిశోధిస్తుంది..ఈ పరిశీలన ఆధారంగా ఒకే కోణంలో కథలు రాసేవాళ్ళు ఒక మోస్తరు రచయితలనుకుంటే,బోర్హెస్ ఉన్నత స్థాయికి చెందిన రచయిత అని ఘంటాపథంగా చెప్పొచ్చు.

Image Courtesy Google
సృష్టిలో రహస్యమైనదేదైనా సహజంగానే మనిషిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది..అర్ధంకానివీ,అందుబాటులో లేనివీ మనిషిలో వాటిని అందుకోవాలని కోరికని కలిగిస్తాయి..బోర్హెస్ అలాంటి ఒక రహస్యం..ఆ రహస్యాన్ని ఛేదించే కొద్దీ కొత్త కొత్త విషయాలు బహిర్గతమవుతాయి..మా చిన్నప్పుడు పిల్లల్నందర్నీ ఒక అద్దాల మందిరానికి తీసుకెళ్ళారు..మా చుట్టూ అన్నివైపులా,తలెత్తి చూస్తే పై భాగంలో,ఎటువైపు చూసినా కుంభాకార,పుటాకార దర్పణాలు,మరి కొన్ని మాములు అద్దాలతో నిండి ఉన్న ఆ గదిలో ఎక్కడ చూసినా మన ప్రతిబింబమే కనిపిస్తుంది..బోర్హెస్ శైలి అటువంటి ఒక అద్దాల గది..ఇక్కడ కొన్ని విషయాలు :
*ఒక దర్పణంలో ఒకలా కనిపించిన మన రూపం,మరో దర్పణంలో రూపాంతరం చెందుతుంది..కానీ ఇక్కడ 'వస్తువు' ఒకటే.. 
*అలాగే మనం మన దృష్టిని కేవలం ఒకటి లేదా రెండు దర్పణాల్లో ప్రతిబింబంపై నిలిపితే,మిగతా ప్రతిబింబాలు మన దృష్టిని దాటిపోయే అవకాశం మెండు..
*ఒక దర్పణంలో చూసిన రూపం మరో దర్పణంలో (ఇక్కడ కాలం అనుకోవచ్చు) మరో విధంగా కనిపిస్తుంది..
ఈ అంశాలు బోర్హెస్ కథల్లో సంక్లిష్టతకు కారణాలు..కానీ ఆ సంక్లిష్టతే ఈ కథల్ని మిగతా కథల నుండి వేరుగా నిలబెడుతుంది..అందువల్ల బోర్హెస్ కథలు ఒకసారి చదివితే అర్ధం అయ్యేవి కాదు..ఓకే కథని రెండు మూడు సార్లు చదివినప్పుడు కొత్త అర్ధాలు స్ఫూరిస్తాయి..(ఈ 'స్ఫూ' దీర్ఘం పోవడం లేదు క్షమించాలి)

ఈ విషయాన్ని ఒక కథలో ఆయన కూడా ప్రస్తావిస్తారు..Besides, rereading, not reading, is what counts.

బోర్హెస్ కు తన శైలి మీద,పాఠకుల అజ్ఞానం మీద ఎంత నమ్మకమంటే,"నా రాతలు అందరికోసమో/కొందరికోసమో కాదు" అని హెచ్చరించే మనల్ని ఈ కథలు చదవడానికి ఆహ్వానిస్తారు..ఆయన రెండు మూడు చోట్ల ఉపయోగించిన 'demagogue' అనే పదం భలే నచ్చింది నాకు :) 

I do not write for a select minority, which means nothing to me, nor for that adulated platonic entity known as ‘The Masses’. Both abstractions, so dear to the demagogue, I disbelieve in. I write for myself and for my friends, and I write to ease the passing of time. 

కానీ "మా కోసమే మేము రాసుకుంటాము" అనే చాలా మంది రచయితలు,విషయానికొచ్చే సరికి పాఠకుల అభిరుచి మేరకు రాజీపడే సందర్భాలే అధికం..కానీ బోర్హెస్ కథల్లో ఆ రాజీతత్వం మచ్చుకి కూడా కనపడదు..మన కళ్ళకు కనిపించాలని,ఆయన తన కాల్పనిక ప్రపంచాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నమేదీ చెయ్యరు,ఆయన విస్తృతమైన ప్రపంచాన్ని ఆయన కళ్ళతోనే చూడమంటారు..పరిధుల్లేని ఆ ప్రపంచపు వైశాల్యం కొలవడం కష్టం..మరో విషయం ఏంటంటే ఇందులో బోర్హెస్ శైలి,ఒక పసిపిల్లవాడు ఆటలో భాగంగా ఒక మెట్టుమీంచి దూకి మరో మెట్టు మీదికి దూకినంత సులభంగా ఒక ఉపరితలంలోనుంచి మరో ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది..కానీ ఆ వేగంతో మనమాయన్ని అనుసరించగలమా అనేది అనుమానమే..బోర్హెస్ కథలు కొంత స్వప్నం,మరికొంత వాస్తవం..కానీ ఎంత జాగరూకతతో ఉన్నా,ఎప్పుడు మెలకువగా ఉన్నామో,ఎప్పుడు స్వప్నావస్థలో ఉన్నామో గుర్తించడం చదివేవాళ్ళకి చాలా కష్టం..ఒక కథలో ఆర్ట్ ని 'కామన్ మాన్' కి అందుబాటులో లేకుండా రక్షించడానికి కట్టుదిట్టమైన metaphors ని వాడానని ఒక కవి చేత చెప్పించిన బోర్హెస్ లో ఒక ఆర్టిస్ట్ కి తన కళ పట్ల ఉండే నిజాయితీ కూడిన స్వాధీనతా భావం (possessiveness),మరికాస్త కళాకారుడికి అలంకారప్రాయంగా ఉండే అహం ధ్వనిస్తుంది.. 

ఇందులో మొత్తం 13 కథలున్నాయి..కొన్ని కథలు కల్పితాలు కాగా,మరి కొన్ని కథలు బోర్హెస్ నిజ జీవిత అనుభవాల్లోంచి పుట్టినవి..ఇందులో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మొదటి కథ 'The Other'.. ఇందులో డెబ్భై తొమ్మిదేళ్ళ బోర్హెస్-ఇరవయ్యేళ్ళ బోర్హెస్ ను ఒక నదీ తీరంలో కలుసుకుంటాడు.."నువ్వూ నేనూ ఒకటే" అంటూ వృద్ధుడైన బోర్హెస్ తనను తాను పరిచయం చేసుకుంటారు..ఆ ఇద్దరిలో ఎవరిది కలో,ఎవరిది నిజమో అర్ధంకాని సందిగ్ధం ఏర్పడుతుంది..చివరిగా డెబ్బయ్యేళ్ళ బోర్హెస్ తాను మెలకువగా ఉన్నాననీ,అందుకే ఆ యువకుడు తనకి వాస్తవమనీ,అలాగే ఆ యువకునికి తానొక స్వప్నమనీ నిర్ధారణకొస్తాడు..ఈ కథలో 'elder self' , 'younger self' మధ్య జరిగే సంభాషణల్లో బోర్హెస్ మనకు ఒక వ్యక్తిగా కాక,ఇద్దరు విడి విడి వ్యక్తులుగా గోచరిస్తారు..ఈ కథ చాలా కాలం క్రితం చదివిన జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్' ను గుర్తుకు తెచ్చింది..మనిషి నైజంలో కన్ఫర్మిటీని ఎద్దేవా చేస్తూ కాలంతో పాటు రూపాంతరం చెందిన ఇద్దరు అపరిచిత వ్యక్తుల మానసికస్థితి,దృక్పథాలను అద్భుతంగా ఆవిష్కరించిందీ కథ..

ఇందులో భావి రచయిత బోర్హెస్ గురించి వృద్ధుడి తలంపు..
It pleased me that he did not ask about the success or failure of his books.

“The man of yesterday is not the man of today,” some Greek remarked. We two, seated on this bench in Geneva or Cambridge, are perhaps proof of this.

He barely listened to me. Suddenly, he said, ‘If you have been me, how do you explain the fact that you have forgotten your meeting with an elderly gentleman who in 1918 told you that he, too, was Borges?’

మరో కథ 'Ulrike' ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్రేమకథ..ఈ కథలో  Ulrike అనే అమ్మాయి బోర్హెస్ ఆలోచనల్లో ప్రాణంపోసుకున్న ఒక ప్రతిబింబమా లేక యదార్ధమా అనేది ఇంతవరకూ తేలలేదు మరి.. 


O nights, O darkness warm and shared, O love that flows in shadows like some secret river, O that instant of ecstasy when each is both, O that ecstasy’s purity and innocence, O the coupling in which we became lost so as then to lose ourselves in sleep, O the first light of dawn, and I watching her.

'కాంగ్రెస్' అనే అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి,దానికి ఒక భవన నిర్మాణం చేయ సంకల్పించి,ఆ కార్యాలయంలో ఉండాల్సిన పుస్తకాలూ వగైరాలు సమకూర్చుకునే క్రమంలో యదార్ధానికి చాలా దూరం వెళ్ళిపోయిన కొందరు వ్యక్తుల కథ 'The Congress','ప్రాముఖ్యతలు' ప్రాతిపదికగా నడుస్తుంది.. 

I came from Santa Fe, my native province, in 1899. I have never gone back. I have grown accustomed to Buenos Aires, a city I am not fond of, in the same way that a man grows accustomed to his own body or to an old ailment. Without much caring, I am aware that I am going to die soon; I must, consequently, control my digressive tendencies and get on with my story.

There Are More Things,ఫాంటసీ ఎలిమెంట్ ఉన్న ఈ కథని H.P.Lovecraft కు అంకితమిచ్చారు బోర్హెస్..ఈ కథలో ఇంజినీర్ అయిన తన అంకుల్ తనకు ఫిలాసఫీని బోధించిన పద్ధతుల్ని గురించి ఈ క్రింది విధంగా రాశారు..బోర్హెస్ శైలికి మూలాలు ఈ కథలో వెతుక్కోవచ్చు అనిపించింది..

One of the after-dinner oranges was his aid in initiating me into Berkeley’s idealism; a chessboard was enough to illustrate the paradoxes of the Eleatics. Years later, he was to lend me Hinton’s treatises which attempt to demonstrate the reality of four-dimensional space and which the reader is meant to imagine by means of complicated exercises with multicoloured cubes. I shall never forget the prisms and pyramids that we erected on the floor of his study.

ఇక ప్రేమనూ,మరణాన్నీ ఒకే రాత్రి అనుభవపూర్వకంగా తెలుసుకున్న పిల్లవాడి కథ 'The Night of the Gifts',

'The Mirror and the Mask',తన విజయాన్ని పొగడమని ఒక కవిని కోరిన రాజు కథ..ఈ కథలో ముగింపు చాలా చిత్రంగా ఉంటుంది.. 

The sin of having known Beauty, which is a gift forbidden to men. Now it behoves us to expiate it. I gave you a mirror and a golden mask; here is my third present, which will be the last.’

చివరి కథ 'The Book of Sand',బికనేర్ (ఇండియా) లో దొరికిన ఒక వింత పుస్తకం గురించిన కథ..కాగా మిగతా కథలు The Sect of the Thirty,Undr ,Utopia of a Tired Man,The Bribe,Avelino Arredondo,The Disk లు బోర్హెస్ ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో పరిచయం చేస్తాయి..ఇందులో బోర్హెస్ సగటు పాఠకుణ్ణి ఏ మాత్రం పరిచయంలేని దారుల్లో నడిపిస్తారు..ఆయన కథలు అల్లడానికి ఎన్నుకున్న సందర్భాలు సామాజిక,రాజకీయ,చరిత్రాత్మక విశేషాలతో పాటు,ఒక ప్రొఫెసర్ గా ఆయన అకాడమిక్ అనుభావాల్తో కూడా ముడిపడి ఉండటంతో అడుగడుక్కీ గూగుల్ ను ఆశ్రయించక తప్పలేదు..అంతకుముందు బోర్హెస్ ను చదువుదామని ప్రయత్నించి,ఆయన అర్ధంకాక నెట్లో చాలా విశ్లేషణలు చదవడం జరిగింది..నేను చదివిన కొన్నివ్యాసాల్లో బోర్హెస్ గురించిన  ఫాక్ట్స్ కనిపించాయే తప్ప,బోర్హెస్ సారాన్ని లోతుగా అర్ధం చేసుకున్నవాళ్ళు పెద్దగా కనపడలేదు..ఆ సమయంలో ఆంధ్ర జ్యోతి లో ప్రచురించిన  'పింగాణీ పాత్రని తన్నేసిన పిల్లి కథ' అని నాగరాజు పప్పుగారు రాసిన వ్యాసం కంటపడింది..(నాలాంటి వాళ్ళకోసం లింకు ఇక్కడ కామెంట్లలో ఇవ్వడం జరిగింది.) ఆ వ్యాసం బోర్హెస్ ను అర్ధం చేసుకోడానికి నాకు కొంతవరకూ ఉపయోగపడింది..ఈ పుస్తకంతో నాకు బోర్హెస్ ను పరిచయం చేసిన నాగరాజు గారికి ధన్యవాదాలు.. 

Monday, March 19, 2018

2017 Reading List

 Once again I failed to reach my goal..But Once again I learned a lot in the process..41/50.. 😊
Here are my Goodreads statistics of the year 2017.