Thursday, March 16, 2017

The Vegetarian - Han Kang

రచయితలు కూడా రకరకాలుగా ఉంటారు, కొందరు వాళ్ళ మనసులో ఉన్నది ఇదీ అని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు స్పష్టంగా చెప్తారు. మరి కొందరి విషయంలో మనమే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఇక ఈ మూడో రకం రచయితలు, మనకి ఏదీ స్పష్టంగా చెప్పరు. అలా అని మనకి అర్థమయ్యేలా తేలికగా క్లూలు వగైరాల్లాంటివి కూడా ఏమీ ఇవ్వరు. కానీ అర్థం చేసుకోడానికి బోల్డన్ని సంఘటనల్ని పొడుపు కథలుగా అల్లేసి ఆ చిక్కు ముడుల్ని విప్పుకోమని మనకే వదిలేస్తారు. సౌత్ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ ఈ మూడో రకం రచయిత్రి. 2007 లో "ది వెజిటేరియన్" తొలి ప్రచురణ కొరియన్ భాషలో వెలువడినప్పటికీ డెబోరా స్మిత్ ఆంగ్లానువాదం 2016 సంవత్సరానికిగాను "Man International Booker" ప్రైజ్ గెలుచుకుంది.

Image Courtesy Google

కొన్ని పుస్తకాలు చదవడం పూర్తిచేశాక ఆలోచనలో పడతాం. 
కథలో జరిగిన  అనేక సంఘటనలకు కారణాలు ఇవీ అని రచయిత మనకి చెప్పాలనుకుంటున్నారేమో అనుకుంటాం. 
ఇంకొన్నిసార్లు అంత ఆలోచన అఖ్ఖర్లేకుండా సులభంగానే  నిశ్చితాభిప్రాయాలకు వచ్చేస్తాం.
కానీ ఇవేవీ హాన్ కాంగ్ నేరేషన్ చదివే పాఠకుడికి అంత సులభంగా అనుభవమయ్యే అంశాలు కాదు. కథ మొదలయ్యేసరికి చాలా సింపుల్ గా అనిపించే విషయాలు మధ్యలోకి వచ్చేసరికి మన ఆలోచనలకి అందని,  అస్సలు అదుపు చెయ్యలేని క్లిష్టతరమైన సంఘటనలుగా రూపాంతరం చెందుతుంటాయి. ఆ నేరేషన్లో ఏదీ పాఠకుడి కంట్రోల్లో ఉండదు / మన ఊహకి అందదు. సహజంగానే ఆ ఎలియన్ ఫీలింగ్ మనకి నచ్చదు. ఆ కారణంగా  ఈ పుస్తకం చదవడం పూర్తైన చాలాసేపటి వరకూ ఒక రకమైన స్తబ్దత ఆవహిస్తుంది.

సౌత్ కొరియన్ సంస్కృతి లో ఆమోదయోగ్యం కాని 'వెజిటేరియనిజం'ను బేస్ చేసుకుని మొత్తం మూడు భాగాల్లో ముగ్గురు వ్యక్తుల దృష్టికోణం నుంచి Yeong-hye అనే ఒక సాధారణ గృహిణి కథని మనకి చెప్తారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ఆమె భర్త Mr.Cheong కాగా, మిగతా ఇద్దరూ ఆమె అక్క In -Hye, అక్క భర్త (పేరు ప్రస్తావించలేదు). కథలో ఒక రోజు హఠాత్తుగా Yeong-hye మాంసం తినడం మానేస్తుంది. ఫ్రిజ్లో ఉన్న మాంసాహారం అంతటినీ తీసి బయట పడేస్తుంది. అదేమని అడిగిన భర్తకి "I had a dream" అని మాత్రం పొడిపొడిగా సమాధానం చెప్తుంది. కథలో ఎక్కడా ఆమె సంభాషణలు వివరంగా లేకపోయినా మధ్య మధ్యలో ఆమె కలను గురించీ, కొన్నిసార్లు ఆమె మనసులో భావాల గురించీ మనకి ఒక మోనోలాగ్ చిన్న చిన్న పారాల్లో చెప్తారు.

శాఖాహారులు గా మారడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాని మన సంస్కృతిలో Yeong-Hye నిర్ణయంపై ఆమె కుటుంబం మరియు సమాజం నుంచి వచ్చే తీవ్రమైన వ్యతిరేకత, తిరస్కారం మనకి మొదట్లో చాలా అసహజం గా అనిపిస్తాయి. కానీ క్రమేపీ ఒకదానివెంట ఒకటి జరిగే సంఘటనల వల్ల కొరియన్ సంస్కృతిలో మాంసాహారం తినడం ఎంత ఆవశ్యకమో తెలుస్తుంది. ఒక official పార్టీలో Mr. Cheong సహోద్యోగులు Yeong-Hye నిర్ణయంపై వ్యక్తపరిచే అభిప్రాయాలు చూస్తే,
Do you remember those mummified human remains they discovered recently? Five hundred thousand years old, apparently, and even back then humans were hunting for meat—they could tell that from the skeletons. Meat eating is a fundamental human instinct, which means vegetarianism goes against human nature, right? It just isn’t natural.”
Well, I must say, I’m glad I’ve still never sat down with a proper vegetarian. I’d hate to share a meal with someone who considers eating meat repulsive, just because that’s how they themselves personally feel…don’t you agree?”
“Imagine you were snatching up a wriggling baby octopus with your chopsticks and chomping it to death—and the woman across from you glared like you were some kind of animal. That must be how it feels to sit down and eat with a vegetarian!”
నవల మొదట్లో ఆమె భర్త ఆమె గురించి చెప్తూ, "అసలు ఏ ప్రత్యేకతా లేని సాధారణ వ్యక్తి అయిన ఆమె శాకాహారిగా మారిన తరువాత మాత్రమే ఆమె వ్యక్తిత్వం ఒక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది' అంటాడు.
I’d always liked my wife’s earthy vitality, the way she would catch cockroaches by smacking them with the palm of her hand. She really had been the most ordinary woman in the world.
మొదటి భాగం 'The Vegetarian' లో ఆమె భర్త Mr.Cheong స్వార్ధపరుడుగా, ఏ ప్రత్యేకతా లేని ఒక సాధారణ ఉద్యోగిగా, భార్య మానసిక స్థితి అర్థంచేసుకోలేని భర్తగా కనపడతాడు. చివరకు  Yeong-Hye మానసిక అసమతౌల్యం కారణంగా ఆమెనుండి విడిపోతాడు. రెండో భాగం 'Mongolian mark'లో ఆమె బావ కళపట్ల, మరదలిపట్ల ఉండే వ్యామోహంతో తన భార్యాబిడ్డల జీవితాన్ని కూడా పణంగా పెట్టే ఒక restless, weird person గా పరిచయమవుతాడు. ఇక మూడో భాగం అన్నిటికంటే ముఖ్యమైనది. అది ఆమె అక్క In-Hye దృష్టికోణంలో చెప్పే కథ. In-Hye ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, భార్యగా, అక్కగా ఇలా అడుగడుక్కీ ఒక అసాధారణమైన వ్యక్తిగా, ఏ లోపమూ లేని "సూపర్ వుమన్"గా కనిపిస్తుంది.  తార్కికత, కళాత్మకల్లాంటి ఆర్టిస్టిక్ ప్యాషన్స్ తాలూకు కాల్పనిక ప్రపంచపు నీడలేవీ జీవితంపట్ల ఆమె ప్రాక్టికల్ దృక్పధంపై ఎటువంటి ప్రభావమూ చూపించవు. కానీ చివరకు ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం ఖాళీగా, చెల్లెలితోనూ, భర్తతోనూ ఉన్న సంబంధం కారణంగా ఎంత నిరర్ధకంగా, మారిందో అనిపిస్తుంది. 

ఇక వీటన్నిటికీ కేంద్రం అయిన Yeong-Hye జీవితంపై చిన్నతనంలో తండ్రి హింసాత్మక ప్రవృత్తి చాలా ప్రభావం కలిగి ఉంటుంది. మనిషి బ్రతకాలంటే ఎంతో కొంత హింస అనివార్యం అని గ్రహించి, మనిషిగా తన ఉనికిని అసహ్యించుకుని, ఆ ఉనికినే వద్దనుకుని తానొక మొక్కగా మారానని భావించే ఆమె ప్రవర్తనలో నిహిలిజం ఛాయలు  కనిపిస్తాయి. “Why, is it such a bad thing to die? అని అడిగే Yeong-Hye మానసిక సమతౌల్యంలేని మనిషిగా కనిపిస్తుంది. శాకాహారిగా మారడం ద్వారా తన నిర్ణయం గురించి Yeong-Hye చూపించే తిరుగుబాటు ధోరణి, coldness, detachment లాంటివి తనను ఒక మనిషిగా కాకుండా ఒక చెట్టుగా భావించుకునే ఆమె ఆలోచనలు ఒక సర్రియలిస్టిక్  వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆమె తల్లితండ్రులు, భర్త అందరూ ఆమె పట్ల చూపించే హింసాత్మక ధోరణి, ఆ వత్తిడితో ఆమె ఆత్మహత్యాయత్నం చెయ్యడం, వృత్తి-ప్రవృత్తిరీత్యా ఒక వీడియో ఆర్టిస్ట్ అయిన బావ ఆమె శరీరం పై ఉండే మంగోలియన్ మార్క్ పట్ల వ్యామోహంతో ఆమెను తన కళాఖండానికి అభ్యంతరకరమైన రీతిలో మోడల్ గా వాడుకోవడం- ఇలా ఒకదాని వెనుక ఒకటి జరిగే సంఘటనలు హాన్ కాంగ్ ప్రతిభకు దర్పణం పడుతూ మనకు ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ను తలపిస్తాయి.

Yeong-Hye మానసిక స్థితి ఇలా ఉంటుంది,
Intolerable loathing, so long suppressed. Loathing I’ve always tried to mask with affection. But now the mask is coming off.

 That shuddering, sordid, gruesome, brutal feeling. Nothing else remains. Murderer or murdered, experience too vivid to not be real. Determined, disillusioned. Lukewarm, like slightly cooled blood. Everything starts to feel unfamiliar. As if I’ve come up to the back of something. Shut up behind a door without a handle. Perhaps I’m only now coming face-to-face with the thing that has always been here. It’s dark. Everything is being snuffed out in the pitch-black darkness.

Dreams of my hands around someone’s throat, throttling them, grabbing the swinging ends of their long hair and hacking it all off, sticking my finger into their slippery eyeball. Those drawn-out waking hours, a pigeon’s dull colors in the street and my resolve falters, my fingers flexing to kill. Next door’s cat, its bright tormenting eyes, my fingers that could squeeze that brightness out. My trembling legs, the cold sweat on my brow. I become a different person, a different person rises up inside me, devours me, those hours…
పాఠకుడికి కథ మంచిచెడుల గురించిన తర్కంపై దృష్టిమళ్ళకుండా కథనాన్ని ముందు నిలబెట్టి మాములు విషయాలను కూడా తన నెరేషన్తో రక్తి కట్టించారు హాన్ కాంగ్. హాపీ రీడింగ్.

Quiet - Susan Cain

చాలా ఏళ్ల క్రితం చూసిన బసు ఛటర్జీ సినిమా Piya ka ghar లో ఒక సన్నివేశంలో ఒక పాత్రధారి అంటారు,"మనుషులు కూడా మొక్కల లాంటివాళ్ళే,కొన్ని మొక్కలు ఎలాంటి చోటైనా చిన్న దారి చేసుకుని సులభంగా పెరుగుతాయి, కానీ కొన్ని మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం అవసరం" అని..చాలా లోతైన విషయాన్ని ఇంత మాములు మాటల్లో చెప్పడం బసు ఛటర్జీ ప్రత్యేకత..ఈ పుస్తకం చదివేటప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి..మనుషులు కూడా అంతే కదా ! కొందరు సమూహాల్లో శాంతిని వెతుక్కుంటే మరి కొందరు ఏకాంతంలో ఆనందాన్ని పొందుతారు..'Quiet' గురించి చెప్పే ముందు ఒక చిన్న సంఘటన చెప్పాలి,ఆ మధ్య ఒక సంభాషణలో మిత్రులు ఒకరితో  'ఈ సోషలైజ్ అవ్వడం చాలా exhausting గా ఉంటుందని' అంటే,చాలా వింతగా చూస్తూ,తాము ఎంత బాగా సోషలైజ్ అవుతారో,తరచూ పార్టీలకు హాజరై,అందరితో కలిసిమెలిసి ఒక 'ఐడియెల్ లైఫ్' ఎలా లీడ్ చేస్తున్నారో అనర్గళంగా ఒక గంటసేపు ఉపన్యసించారు..అప్పుడు సమాధానంగా  'It's not that we hate people..It's just our life style,we like it this way" అని ఏదో తప్పు చేస్తున్నట్లు గిల్టీ ఫీల్ తో సంజాయిషీ ఇచ్చినా కూడా వారి కళ్ళతోనే సంధించిన ఒక రకమైన తిరస్కార బాణాలు గుచ్చుకోక మానలేదు..ఈ గుచ్చుకోవడం తాలూకూ నొప్పి వద్దే మొదలవుతుంది ఈ 'Quiet':The Power of Introverts in a World That Can't Stop Talking అనే పుస్తకం..2012లో అమెరికన్ రచయిత్రి Susan Cain రాసిన ఈ నాన్ ఫిక్షన్ రచన  New York Times బెస్ట్ సెల్లర్ గా నిలవడమే కాకుండా సుమారు 36 ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది..
Image Courtesy Google
1921 లో తొలిసారిగా విఖ్యాత సైకాలజిస్ట్ Carl jung రాసిన పుస్తకంలోని సైకాలజీ టైప్స్ లో  'introvert , extrovert' పదాల ఆవిర్భావం జరిగింది అంటారు..మనుషులను స్వభావాల రీత్యా ఇంట్రావర్ట్ - ఎక్ట్రావర్ట్ అనడం చూస్తుంటాం..మొదట Rosa Parks అనే African American civil rights activist గురించి చెప్తూ,సున్నితమైన స్వభావురాలైన ఆమె,ఒక బస్ డ్రైవర్ శ్వేత జాతీయులకి సంబంధించిన సీట్ లోనుంచి లేవమని ఆమెను ఆజ్ఞాపించగా,ఆ అవమానానికి ఎలా ఎదురుతిరిగారో,ఆ సంఘటనలో హింస,హడావుడి లేకుండా సున్నితంగానే తన మతాన్ని చాటి ఆమె కనబరిచిన ధైర్యసాహసాలతో మార్టిన్ లూథర్ కింగ్ Jr. civil rights movement లో ఎలా భాగస్వాములయ్యారో మనకు చెప్తారు..ఇక్కడ  గమనించవలసిన విషయం "The first lady of civil rights" and "The mother of the freedom movement" గా యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ చేత మన్ననలందుకున్న Rosa Parks మృదుభాషి ,ఇంట్రావర్ట్ కావడం..కానీ ఆమె మృదుస్వభావం ఆమె మనోనిబ్బరాన్ని,సంఘజీవిగా ఆమె ఉనికిని ఎంతమాత్రం ప్రభావితం చెయ్యలేదు..ఇంట్రావర్ట్స్ అంటే పిరికి వాళ్ళు,సామాజిక బాధ్యత లేనివాళ్ళు అని ముద్ర వెయ్యడం ఈ Extrovert సమాజం చేసే అతి పెద్ద తప్పని ఈ ఉదాహరణ ద్వారా నిరూపిస్తారు రచయిత్రి..ఒక సందర్భంలో మహాత్మా గాంధీ గురించి ప్రస్తావిస్తూ,స్వభావరీత్యా ఇంట్రావర్ట్,మితభాషి అయిన ఆయన అకుంఠిత దీక్ష,పట్టుదల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా తలవంచేలా ఎలా చేశాయో గుర్తు చేస్తారు..ఈ క్రమంలో చరిత్రలో నిశ్శబ్దంగా ఉంటూనే తమ ఉనికిని చాటుకున్న వివిధ రంగాలకు చెందిన శక్తివంతమైన ఇంట్రావర్ట్స్ : ఐన్స్టీన్,బిల్ గేట్స్,T.S.Eliot,Eleanor Roosevelt, Al Gore,Warren Buffett వంటి పలువురి స్వభావాలను గురించి విశ్లేషించారు..ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి Eleanor Roosevelt (Introvert) - Franklin D. Roosevelt (Extrovert) దాంపత్యాన్ని ఉదాహరిస్తూ ఫ్రాంక్లిన్ charming/Outgoing పెర్సొనాలిటీకి Eleanor stable/deep/సెన్సిటివ్ పెర్సొనాలిటీ పరిపూర్ణతని చేకూర్చిందనీ,ఈ రెండు స్వభావాలను సమన్వయం చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టించగలమనీ అంటారు Susan.

Yet today we make room for a remarkably narrow range of personality styles. We’re told that to be great is to be bold, to be happy is to be sociable.We see ourselves as a nation of extroverts.

ఈ రోజుల్లో కెరీర్,relationships ఇలా చాలా విషయాల్లో Presentation మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు జీవితంలో ఇంట్రావర్ట్స్ కంటే కొంచెం త్వరగా పైకి ఎదుగుతున్నారు.అంతే కాకుండా మానవ సంబంధాల్లో కూడా మంచివారిగా,గొప్ప వారిగా,ప్రేమాభిమానాలు పుష్కలం గా ఉన్నవారిగా గణించబడుతున్నారు..వీటికన్నిటికీ కారణం ఇది extrovert పక్షపాత సంస్కృతి అంటారు రచయిత్రి...మరి టెక్నికల్ గా తమతమ రంగాల్లో నిష్ణాతులైనవాళ్లు కూడా కేవలం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని కారణంగా వారి ప్రతిభకి గుర్తింపు లేక వెనకబడుతున్నారు..
“where people’s respect for others is based on their verbal abilities, not their originality or insight. You have to be someone who speaks well and calls attention to yourself. It’s an elitism based on something other than merit.”

“Respect for individual human personality has with us reached its lowest point,” observed one intellectual in 1921, “and it is delightfully ironical that no nation is so constantly talking about personality as we are. We actually have schools for ‘self-expression’ and ‘self-development,’ although we seem usually to mean the expression and development of the personality of a successful real estate agent.

"all talking is selling and all selling involves talking,”

Introversion ను లోపంగా భావించడానికి కారణాలను విశ్లేషిస్తూ 20 వ శతాబ్దంలో ఈ Extrovert ideal కి అంకురార్పణ చేసిన  Dale Carnegie ప్రస్థానాన్ని ఉదహరించారు,ఒక రైతు బిడ్డ నుంచి సేల్స్ మాన్ గా ఆ పై పబ్లిక్ స్పీకింగ్ ఐకాన్ గా ఆయన metamorphosis ఇరవయ్యో శతాబ్దపు 'Extrovart ideal' సంస్కృతికి ఎలా బీజం వేసిందో చెప్తూ,ఈ evolution మనిషి ఉనికి ఏమిటీ,మనం మనిషిలో ఆరాధించే విషయం ఏమిటి మొదలు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లలో ఎలా ప్రవర్తించాలి,ఉద్యోగుల్లో ఏ లక్షణాలు ఉండాలి,ఎటువంటి వారితో రిలేషన్స్ ఏర్పరుచుకోవాలి,పిల్లల్ని ఎలా పెంచాలి వరకూ పలు సామాన్య విషయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి అంటారు..Cultural historian Warren Susman మాటల్లో America, 'Culture of Character' నుంచి  'Culture of  Personality' కి ఎలా మారిపోయిందో, దాని కారణంగా మనకు తెలీని పర్సనల్ ఏంగ్జైటీలు మానవ జీవితాల్లోకి మహమ్మారిలా ఎలా ప్రవేశించాయో చెప్తారు..ఈ క్రమంలో పలువురు వ్యక్తిత్వ వికాస నిపుణులు,సైకాలజిస్ట్లు చేసిన విశ్లేషణలను ఈ పుస్తకంలో  క్రమబద్ధీకరించారు..మనుషులతో కలవలేకపోవడం,మాట్లాడలేకపోవడం,ఏకాంతం కోరుకోవడం లాంటివి తప్పేమీ కాదని,ఆ స్వభావం సృజనాత్మకతను పెంపొందించి అద్భుతాలు సృష్టించగలదని చెప్పడమే కాకుండా,ఆమె చేసిన విశ్లేషణలు పలువు వ్యక్తిత్వ వికాస నిపుణుల రీసెర్చ్ కి సంబంధించిన సవివరమైన ఆధారాలతో సహా మనకు నిరూపిస్తారు..Extrovert దేశాల్లో అగ్రస్థానం లో ఉన్న అమెరికా తో పాటు,introvert కల్చర్ కలిగిన Finland, (అన్నిటికంటే గొప్ప introvert కల్చర్ అట),చైనా లాంటి దేశాల గురించి కూడా రాశారు...Asian culture లో introversion గురించి చెప్తూ,

Asians are “not uncomfortable with who they are, but are uncomfortable with expressing who they are. In a group, there’s always that pressure to be outgoing. When they don’t live up to it, you can see it in their faces.”

19 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్ది చివరకు వచ్చేసరికి Carnegie సంచలనం కారణంగా వ్యక్తిత్వ వికాస గ్రంధాల్లోని
Citizenship/Duty /Work/ Golden deeds /Honor/
Reputation /Morals /Manners/ Integrity వంటి లక్షణాలు  Magnetic /Fascinating/ Stunning/ Attractive/ Glowing/ Dominant /Forceful /Energetic లాంటి వాస్తవికతకు దూరంగా ఉండే ఫాషనబుల్ పదాలతో రీప్లేస్ చేయబడ్డాయి అన్నారు...

ఒక్కో చాప్టర్ మొదలు పెట్టేటప్పుడు ముందుగా చార్లెస్ డార్విన్,విలియం జేమ్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్,మహాత్మా గాంధీ,RICHARD HOFSTADTER,రోబెర్ట్ రుబిన్ వంటి  కొందరు  introverts,రైటర్స్ మరియు సైకాలజిస్ట్స్ మాటల్ని quote చేశారు..
A man has as many social selves as there are distinct groups of persons about whose opinion he cares. He generally shows a different side of himself to each of these different groups. —WILLIAM JAMES

The meeting of two personalities is like the contact of two chemical substances; if there is any reaction, both are transformed. —CARL JUNG

Our culture made a virtue of living only as extroverts. We discouraged the inner journey, the quest for a center. So we lost our center and have to find it again. —ANAÏS NIN

 Some people are more certain of everything than I am of anything. —ROBERT RUBIN, In an Uncertain World.

మనిషి సోషలైజేషన్,కెరీర్ బిల్డింగ్,రిలేషన్షిప్స్ తదితర అంశాల్లో తన ముద్రను వేసే క్రమంలో సహజత్వాన్ని కోల్పోయి యాంత్రికతను అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు..పర్సనాలిటీ,ఆటిట్యూడ్ లతో అసలు సిసలు క్యారెక్టర్ ను తెర వెనక్కి నెట్టేసాడు..ఆ విధంగా కళ్లకు కనిపించేవి ,చెవులకు వినిపించేవే నిజమని నమ్మడం Extrovert సంస్కృతికి మరింత ఊతమిచ్చింది..సో ఇందులో కీలక పాత్ర పోషించే కమ్యూనికేషన్ స్కిల్స్,presentation లాంటి అంశాల్లో వెనకబడి ఉండే introvert స్వభావాన్ని ఒక లోపంగా,introverts ని anti-social గా భావించడం ఎక్కువైంది.. ఈ పుస్తకంలో Susan విశ్లేషణలు కేవలం introversion ని సమర్ధించే దిశగా కాకుండా 'introversion లోపం కాదు' అనేె దిశగా ఉంటాయి..ఈ క్రమంలో extroversion లో ఉండే లోటుపాటుల్నీ,ఒక్కోసారి extroverts తొందరపాటు,త్వరిత నిర్ణయాలు ఆర్ధిక సామాజిక అంశాలపై  చూపించే చెడు ప్రభావాల గురించే కాకుండా introversion ఆత్మన్యూనతగా,isolation గా మారకుండా దాన్ని బాలన్స్ చేసుకుని,అధిగమించే పద్ధతులు కూడా చెప్తారు..మొదట్లో ఎక్ట్రావర్ట్  vs ఇంట్రావర్ట్ గా మొదలయ్యే రచన క్రమేపీ ఆ రెండు వైరుధ్యాల మధ్య సమన్వయం చెయ్యడంతో ముగుస్తుంది..పదాల అల్లికలో తడబడే ఇంట్రావర్ట్స్ కు తన స్వరాన్ని అందించి,వారి భావాలకి పుస్తకరూపం ఇచ్చిన Susan Cain కు కృతజ్ఞతలు..

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన లైన్స్,
"Neither E=mc2 nor Paradise Lost was dashed off by a party animal.”

Yet today we make room for a remarkably narrow range of personality styles. We’re told that to be great is to be bold, to be happy is to be sociable.We see ourselves as a nation of extroverts.

introverts prefer to work independently, and solitude can be a catalyst to innovation.

Newton was one of the world’s great introverts. William Wordsworth described him as “A mind forever / Voyaging through strange seas of Thought alone.”

It has many powerful advocates. “Innovation—the heart of the knowledge economy—is fundamentally social,” writes the prominent journalist Malcolm Gladwell. “None of us is as smart as all of us,” declares the organizational consultant Warren Bennis, in his book Organizing Genius, whose opening chapter heralds the rise of the “Great Group” and “The End of the Great Man.”

Kafka, for example, couldn’t bear to be near even his adoring fiancée while he worked:  You once said that you would like to sit beside me while I write. Listen, in that case I could not write at all. For writing means revealing oneself to excess; that utmost of self-revelation and surrender, in which a human being, when involved with others, would feel he was losing himself, and from which, therefore, he will always shrink as long as he is in his right mind.… That is why one can never be alone enough when one writes, why there can never be enough silence around one when one writes, why even night is not night enough.

Bill Gates is never going to be Bill Clinton, no matter how he polishes his social skills, and Bill Clinton can never be Bill Gates, no matter how much time he spends alone with a computer. We might call this the “rubber band theory” of personality. We are like rubber bands at rest. We are elastic and can stretch ourselves, but only so much.

Persistence isn’t very glamorous. If genius is one percent inspiration and ninety-nine percent perspiration, then as a culture we tend to lionize the one percent. We love its flash and dazzle. But great power lies in the other ninety-nine percent.“It’s not that I’m so smart,” said Einstein, who was a consummate introvert. “It’s that I stay with problems longer."

In the United States, he warned, you need style as well as substance if you want to get ahead. It may not be fair, and it might not be the best way of judging a person’s contribution to the bottom line, “but if you don’t have charisma you can be the most brilliant person in the world and you’ll still be disrespected.

But when we began talking about Asian concepts of “soft power”—what Ni calls leadership “by water rather than by fire”—I started to see a side of him that was less impressed by Western styles of communication. “In Asian cultures,” Ni said, “there’s often a subtle way to get what you want. It’s not always aggressive, but it can be very determined and very skillful. In the end, much is achieved because of it. Aggressive power beats you up; soft power wins you over.”

Conviction is conviction, the kids from Cupertino taught me, at whatever decibel level it’s expressed.

So when introverts assume the observer role, as when they write novels, or contemplate unified field theory—or fall quiet at dinner parties—they’re not demonstrating a failure of will or a lack of energy. They’re simply doing what they’re constitutionally suited for.

Glass Castle - Jeannette Walls

మనిషి మనుగడకి అవసరమైనవి ఏమిటి అని ఎవరైనా అడిగితే ? ముందుగా రోటీ,కపడా ఔర్ మకాన్ అంటాము..మరి కడుపు నిండాకే కళలైనా,కలలైనా అనేవాళ్ళు నూటికి తొంభై..ఉహూ తొంభై తొమ్మిది మందైతే,ఆ రెండింటి తరువాతే మిగిలినవి అనే ఆ అరుదైన ఒక్క శాతంలోకి వస్తారు రెక్స్,మేరీ లు..నలుగురు సంతానానికి తల్లి అయినా ఆ బాధ్యతను తీసుకోడానికి ఇష్టపడని మేరీ,ఒక పెయింటర్ గా self-absorbed జీవితాన్ని గడుపుతుంటుంది..అలాగే ఒక అద్దాల మేడ కట్టాలనే కలని సాకారం చేసుకోవాలని ఒక్క చోట కూడా స్థిరమైన ఉద్యోగం చెయ్యకుండా,తెలివితేటలు ఎన్నున్నప్పటికీ వైవిధ్యమైన పనులు చేస్తూ మద్యం వ్యసనం బారినపడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు రెక్స్..Conformity,Commitment కి పూర్తిగా వ్యతిరేక మార్గంలో వైపు ప్రయాణిస్తూ,సమాజం కట్టుబాట్లు,అథారిటీ ని ఒప్పుకోని ఇద్దరు misfits,Rex Walls మరియు Rose Mary దంపతుల రెండో సంతానం Jeannette Walls రాసిన memoir ఈ 'Glass Castle' లివింగ్ కీ సర్వైవింగ్ కీ ఉన్న తేడాని,అందులో సాధక బాధకాల్నీ స్పష్టంగా చూపిస్తుంది..ఇది వాల్స్ నలుగురు పిల్లలు వరుసగా Lori,Jeannette ,Brian,Maureen ల దుర్భరమైన బాల్యాన్ని మనకు కళ్లకుకట్టినట్లు వర్ణిస్తుంది..

సహజంగా సృజనాత్మకత కలవారు నిజజీవితంలో చాలా సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు,అలాగే బాల్యంలో అతి చేదైన అనుభవాలు చవిచూసినవారు పెరిగి పెద్దయ్యాక తీవ్ర మనస్తత్వం కలిగి ఉంటారు అంటుంటారు ..మరి అటువంటి ఎక్స్ట్రీమ్ మనస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులు తల్లితండ్రులుగా కలిగిన సంతానం పరిస్థితి ఏంటి !!చాలామంది విషయంలో సర్వసాధారణ  కారణాలైన అవిద్య,పేదరికం లాంటివి Rex,Maryల జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలు కాకపోవడం,ఇద్దరూ కూడా విద్యావంతులు,వివిధ విషయాలపై లోతైన పరిజ్ఞానం కలిగినవాళ్లు కావడం ఇక్కడ విశేషం..Mary కి తల్లి వదలిన ఇల్లు,కొన్ని మిలియన్ డాలర్ల విలువ చేసే స్థలాలు ఉన్నా కూడా వాటిని కాదని కాలిఫోర్నియా,వెస్ట్ వర్జీనియా,లాస్ ఏంజెల్స్ ,ఫీనిక్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ పర్వతాల్లో,ఎడారుల్లో నివాసం ఏర్పరుచుకుంటూ బంజారా జీవితం గడుపుతుంటారు..మనిషి మనుగడ అంటే పెద్ద పెద్ద భవనాల్లో,ఏసీ గదుల్లో గడిపే జీవితం కాదనీ,అది అణువణువూ ప్రకృతితో ముడిపడి ఉండాలని మనసావాచా నమ్మేవారు Walls దంపతులు..వారి దృష్టిలో స్థిరత్వం అంటే మరణంతో సమానం..చేతికి దొరికింది తిని,కనిపించిన పనిచేసి,ఆ క్షణంలో బ్రతకడం వారికిష్టం,కానీ సమాజాన్ని కాదని,కుటుంబం ఏర్పడ్డాకా కూడా అదే శైలిలో బ్రతికితే !! ఆ జీవనశైలి పిల్లల మీద చూపించిన ప్రభావం,ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన కటిక దారిద్య్రం,దుర్భరమైన జీవితం Jeanette మనకు కథగా చెప్తుంది..ఇక్కడ కథ చెప్పేది Jeannette అయినా మన ఆలోచనలు,కథాగమనం మొత్తం Rex,Mary ల చుట్టూనే తిరుగుతుంటాయి..మనిషి మనుగడను గురించి ఎన్నోసమాధానాల్లేని ప్రశ్నల్ని మన ముందుంచుతాయి..

Dad missed the wilderness. He needed to be roaming free in open country and living among untamed animals. He felt it was good for your soul to have buzzards and coyotes and snakes around. That was the way man was meant to live, he'd say, in harmony with the wild, like the Indians, not this lords-of-the-earth crap, trying to rule the entire goddamn planet, cutting down all the forests and killing every creature you couldn't bring to heel.

Life is a bowl of cherries, with a few nuts thrown in"which she'd titled. "R. M. Walls's Philosophy of Life.

స్కూళ్ళ లో చదువు ఎందుకూ కొరగాదని నమ్మే Rex ఇంట్లోనే పిల్లలకు జియోగ్రఫీ,మ్యాథమెటిక్స్ నేర్పించడం,బ్రతకడానికి అవసరమైన ప్లమ్బింగ్,కార్పెంటరీ మొదలు షూటింగ్,స్విమ్మింగ్ లాంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం మనల్ని అబ్బుర పరుస్తుంది..ఎడారిలో నివాసం ఉంటున్నప్పుడు ఒక సారి క్రిస్టమస్ కు పిల్లలకు గిఫ్టులు కూడా కొనలేని పరిస్థితుల్లో రాత్రి వారిని ఒక్కొక్కరినీ తీసుకెళ్లి ఆకాశంలో నక్షత్రాలని బహుమతిగా ఇవ్వడం Rex లోని మరో మనిషిని మనకు పరిచయం చేస్తుంది..Betelgeuse,Rigel స్టార్స్ ని లోరీ,బ్రియాన్ ఎంచుకోగా Jeannette,Venus ని బహుమతిగా ఎంచుకుంటుంది..

Those shining stars, he liked to point out, were one of the special treats for people like us who lived out in the wilderness. Rich city folks, he'd say, lived in fancy apartments, but their air was so polluted they couldn't even see the stars. We'd have to be out of our minds to want to trade places with any of them.

"That's right," Dad said. "No one else owns them. You just have to claim it before anyone else does, like that dago fellow Columbus claimed America for Queen Isabella. Claiming a star as your own has every bit as much logic to it."

Dad kept telling me that he loved me, that he never would have let me drown, but you can't cling to the side your whole life, that one lesson every parent needs to teach a child is. "If you don't want to sink, you better figure out how to swim."

స్వతహాగా ఆర్టిస్ట్ అయిన కారణంగా తనని తాను 'Excitement addict' గా అభివర్ణించుకునే తల్లి మేరీ పిల్లల్ని ఇండిపెండెంట్ గా పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది..Joshua చెట్టు గురించిన ప్రస్తావనలో మేరీ,కూతురు Jeannette తో అనే ఈ మాటలు మేరీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి..

While we were in Midland, Mom painted dozens of variations and studies of the Joshua tree. We'd go with her and she'd give us art lessons. One time I saw a tiny Joshua tree sapling growing not too far from the old tree. I wanted to dig it up and replant it near our house. I told Mom that I would protect it from the wind and water it every day so that it could grow nice and tall and straight.    Mom frowned at me. "You'd be destroying what makes it special," she said. "It's the Joshua tree's struggle that gives it its beauty.

ఈ రచన,అమ్మ-నాన్న అంటే సజహంగా మనకుండే ఒక 'Ideal image' చట్రం లోనుంచి బయటకి వచ్చి ఆలోచించేలా చేస్తుంది..ఇందులో రెక్స్,మేరీలలో ఒక ఆదర్శవాద తల్లితండ్రులు కాక,తమ ఐడెంటిటీని విషయంలో అస్సలు రాజీపడనీ,స్వార్ధంతో,అనేక లోపాలతో కూడిన సాధారణమైన ఇద్దరు individuals కనిపిస్తారు..

Mom always said people worried too much about their children. Suffering when you're young is good for you, she said. It immunized your body and your soul, and that was why she ignored us kids when we cried. Fussing over children who cry only encourages them, she told us. That's positive reinforcement for negative behavior.

Dad was fed up with civilization. He and Mom decided we should move back to the desert and resume our hunt for gold without our starter money. "These cities will kill you," he said.

మొదట్లో వైవిధ్యమైన జీవనశైలిగా అనిపించే వారి ప్రయాణం పోను పోనూ Rex తాగుడు మరియు Mary డిప్రెషన్ తో పూర్తిగా గాడితప్పుతుంది.. ఒక సందర్భంలో,Rex టీనేజ్ లో ఉన్నJeannette ను గ్యాంబ్లింగ్ కి బార్ కు తీసుకువెళ్లడం,ఇంటిల్లిపాదీ ఆకలితో ఉండగా Mary పిల్లలకు కూడా పెట్టకుండా దొంగచాటుగా చాకోలెట్ బార్ తినడం లాంటి కొన్ని అంశాలు మనల్నివిస్మయ పరుస్తాయి..ఇలా మనం మంచి చెడుల తూకాలు బేరీజు వేసుకుంటూ ఉండగా,కథ చివరకి వచ్చేసరికి Jeannette తల్లిదండ్రులు మన అంచనాలకు అందని వ్యక్తులుగా,ఒక ప్రశ్నర్ధకంగా మిగిలిపోతారు..వారు మంచివారా లేక చెడ్డవారా అనేది పాఠకుల విశ్లేషణకే వదిలేస్తుంది Jeannette..సాహిత్యపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఇది ఒక ఉత్తమ రచన కాకపోవచ్చునేమో గానీ సాహిత్యం ముఖ్యోద్దేశ్యం వాస్తవాల్నిప్రతిబింబించడమే అయితే ఇది ఖచ్చితంగా ఒక ఉత్తమ రచన అని చెప్పవచ్చు..

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు..
But what I did know was that I lived in a world that at any moment could erupt into fire. It was the sort of knowledge that kept you on your toes.
You know if it's humanly possible, I'll get it for you. And if it ain't humanly possible, I'll die trying.

"Do something!" I yelled at her. "You've got to do something to help Dad!"    "Your father's the only one who can help himself," Mom said. "Only he knows how to fight his own demons."

"Everyone has something good about them," she said. "You have to find the redeeming quality and love the person for that."
"Oh yeah?" I said. "How about Hitler? What was his redeeming quality?"
"Hitler loved dogs," Mom said without hesitation.

Life's too short to worry about what other people think," Mom said. "Anyway, they should accept us for who we are."

Mary : What doesn't kill you will make you stronger......
Lori : "If that was true, I'd be Hercules by now,"

 Mom wouldn't hear of it. Welfare, she said, would cause irreparable psychological damage to us kids. "You can be hungry every now and then, but once you eat, you're okay," she said. "And you can get cold for a while, but you always warm up. Once you go on welfare, it changes you. Even if you get off welfare, you never escape the stigma that you were a charity case. You're scarred for life."

Dad," I said, "as soon as I finish classes, I'm getting on the next bus out of here. If the buses stop running, I'll hitchhike. I'll walk if I have to. Go ahead and build the Glass Castle, but don't do it for me."

The Immoralist - Andre Gide:

There is nothing more tragic for a man who has been expecting to die than a long convalescence.
After that touch from the wing of Death, what seemed important is so no longer; other things become
so which had at first seemed unimportant, or which one did not even know existed. The miscellaneous mass of acquired knowledge of every kind that has overlain the mind gets peeled off in places like a mask of paint, exposing the bare skin-the very flesh of the authentic creature that had lain hidden beneath it.

తీవ్రమైన క్షయ వ్యాధి బారినపడి మృత్యుముఖం నుంచి బయటపడ్డ Michel అంతరంగం ఇది..అతని మానసిన  పరిణామానికి బీజం పడ్డది ఇక్కడే..పెళ్లి చేసుకుని భార్యతో హనీమూన్ కి Tunis వెళ్ళిన Michel క్షయ వ్యాధి బారినపడతాడు..భార్య Marceline ప్రేమపూర్వకమైన సపర్యలతో కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను,జీవితాన్ని తాత్విక దృష్టి తో చూడటం మొదలుపెడతాడు..ఇక్కడ Michel జీవితం ఆ వ్యాధి బారిన పడకముందూ,పడ్డ తరువాత అని రెండు దర్పణాల్లోంచి చూపిస్తారు..Marceline పై ప్రేమ లేకపోయినప్పటికీ తండ్రి మాట మన్నించి ఆమెను వివాహమాడినప్పటి సాధారణ మానసిక స్థాయి నుంచి తన ఆత్మశోధనలో భాగంగా ఆమెను చావుకు దగ్గర చేసే వరకూ Michel జీవితం మనల్ని అనేక చీకటి దారుల్లోంచి నడిపిస్తుంది..

ఒక సందర్భంలో Michel,Marceline తో  అనే మాటలు అతని దృక్పధానికి అద్దం పడతాయి,
I have a horror of honest folk. I may have nothing to fear from them,but I have nothing to learn either. And besides, they have nothing to say..Honest Swiss nation! What does their health do for them? They have neither crimes, nor history, nor literature, nor arts..a hardy rose-tree, without thorns or flowers.

Michale వాదన ఏకపక్షం గా ఉండకుండా Gide,నాణానికి రెండో వైపును Marceline ప్రసంగాల ద్వారా ఎత్తి చూపిస్తాడు..ఆమె మరణానికి చేరువవుతున్న సందర్భంలో భర్త Michel లోని మార్పును చూసి,"నేను మీ సిద్ధాంతాల్ని అర్ధం చేసుకోగలను,కానీ అవి ఈ భూమ్మీద బలహీనులను పరిగణనలోకి తీసుకోవు.""అంటుంది. భర్తలోని స్వార్ధచింతన,పరిధులు దాటిన స్వీయ స్పృహ ను గురించి ఆమె తన అంతరంగాన్ని అలా వ్యక్తపరుస్తుంది..

Marceline did not mistake my thoughts; when I came back from the port, I did not conceal from her
what sort of wretches I had been frequenting. Every kind of thing goes to the making of man. Marceline knew well enough what I was trying so furiously to discover; and as I reproached her for being too apt to credit everyone she knew with special virtues of her own invention, "You," said she, "are never satisfied until you have made people exhibit some vice. Don't you understand that by looking at any particular trait, we develop and exaggerate it? And that we make a man become what we think him?"

స్వేఛ్చ గురించి ప్రస్తావిస్తూ,
To know how to free oneself is nothing; the arduous thing is to know what to do with one's freedom.
అంటారు ఒక చోట..

మరో చోట తన వాదనను ఒక లెక్చర్ లో వినిపిస్తూ,లాటిన్ civilization లో ఆర్టిస్టిక్ కల్చర్ ను ఉదహరిస్తూ ఈ విధంగా అంటారు..పుస్తకంలోని సారాంశం ఈ పారాలో సంక్షిప్తీకరించినట్లుగా ఉంటుంది..
My lectures began soon after; the subject was congenial and I poured into the first · of them all my
newly born passion. Speaking of the later Latin civilization,I depicted artistic culture as welling up
in a whole people, like a secretion, which is at first a sign of plethora, of a superabundance of health,
but which afterwards stiffens, hardens, forbids the perfect contact of the mind with nature, hides under the persistent appearance of life a diminution of life, turns into an outside sheath, in which the
cramped mind languishes and pines, in which at last it dies. Finally, pushing my thought to its logical conclusion,I showed culture, born of life, as the destroyer of life.The historians criticized a tendency, as they phrased it, to too rapid generalization. Other people blamed my method; and those who complimented me were those who understood me least.

Michel సిద్ధాంతాలకు సజీవ దర్పణం Menalque పాత్ర...Menalque తన తాత్విక దృష్టితో సమాజాన్నిలెక్క చెయ్యకుండా తన వాదానికి కట్టుబడి ఏకాంతంలో బ్రతుకుతుంటాడు..దుఖ్హ హేతువైన ప్రతీది తొలుత సంతోషాన్నిస్తుందనీ ,ఏదైనా సొంతం అనేది లేనప్పుడే మనిషి జాగరూకతతో ఉండి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడు అదే సొంతం(సెక్యూరిటీ) అనేది ఉంటే మనిషి మనశ్శాంతిగా నిద్రపోతాడనీ(it is absence from life) అంటాడు..ఒక సందర్భం లో Marceline ఆ సుషుప్తి ని 'సంతోషం/తృప్తి' అంటే,Michel దాన్ని 'విశ్రాంతి' అంటాడు..ఇలా అనుక్షణం అంతః చేతనతో తాత్విక సంబంధిత విషయాలను గురించి ముఖ్యపాత్ర అయిన Michel ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది..

Menalque వాదన:
So, in the very midst of my riches, I maintain the sensation of a state of precariousness, by which means I aggravate, or at any rate intensify, my life. I will not say I like danger, but I like life to be hazardous,and I want it to demand at every moment the whole of my courage, my happiness, my health . .

మరో చోట,
"Indeed, I hope so," answered Menalque. "If only the people we know could persuade themselves
of the truth of this! But most of them believe that it is only by constraint they can get any good out of
themselves, and so they live in a state of psychological distortion. It is his own self that each of them
is most afraid of resembling. Each of them sets up a pattern and imitates it; he doesn't even choose the pattern he imitates; he accepts a pattern that has been chosen for him. And yet I verily believe there are other things to be read in man. But people don't dare to-they don't dare to turn the page. Laws of imitation! Laws of fear, I call them. The fear of finding oneself alone-that is what they suffer from and so they don't find themselves at all. I detest such moral agoraphobia-the most odious cowardice, I call it. Why, one always has to be alone to invent anything-but they don't want to invent anything. The part in each of us that we feel is different from other people is just the part that is rare, the part that makes our special value-and that is the very thing people try to suppress. They go on imitating. And yet they think they love life."

మితిమీరిన స్వేచ్ఛావాదం,అంతర్లీనంగా వెలుగుచూసే విశృంఖలత,విస్మయపరిచే అంతః చేతన,ఆత్మశోధన వెరసి Andre Gide 'ఇమ్మోరలిస్ట్'...ఈ పుస్తకం తొలి ప్రచురణ Scandalous work గా ముద్ర వేయబడింది...Gide రచనలో తిరుగుబాటు ధోరణి,ధిక్కార స్వరం చిరపరచితంగా,Camus ను గుర్తుకు తెచ్చింది..రచనలో పొయెటిక్ టోన్,ఇంకా చార్లీ,ముక్తిర్ వంటి బాలుర పట్ల Michelకు కలిగే ఆకర్షణ వంటివి నబకోవ్ Lolita ను గుర్తుకు తెచ్చాయి..కొంతకాలం క్రితం Lolita చదవడం మొదలుపెట్టి,చదవలేక ప్రక్కన పెట్టేశాను..కానీ Gide రచనలో మార్మికత ఎక్కువ..అదే చివరి వరకూ ఈ పుస్తకాన్ని చదివించింది..Camus లోని rebellious self righteousness నీ,నబకోవ్ లోని paedophillic behaviour నీ తనదైన శైలి లో వ్యక్తపరుస్తూనే తను చెప్పదలుచుకున్న విషయాన్ని అస్పష్టంగా సూచనామాత్రం గా మన ఊహకి వదిలేస్తారు..చివరకు రచయిత  వెల్లడించిన స్వీయకేంద్రీకృత సిద్ధాంతాల్లో Morality-Immorality ల గురించి ఒక నిర్ధారణ కు రావడానికి మనకి ఒక్క ఆధారం కూడా మిగల్చకపోవడం Gide రచనలోని ప్రత్యేకత..ఆస్కార్ వైల్డ్ scandalous,controversial లైఫ్ ని సమర్ధిస్తూ  Gide రాసిన వైల్డ్ బయోగ్రఫీని బట్టి చూస్తే వారిరువురి భావాలకీ సారూప్యత ఉందనిపిస్తుంది..ఈ రచనలో వాదనలు ఎలా ఉన్నా,తాత్వికత ముసుగులో జీవితంలోని క్షణాలను ఒడిసిపట్టుకోవాలనే తాపత్రయం అంతర్లీనంగా ప్రస్ఫుతమవుతూ,మనకి అది అత్యాశగా,వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది..

The Twentieth Wife - Indu Sundaresan

స్తీలు సమాజానికి,సంప్రదాయాలకి తలొగ్గి బ్రతికే ఆ కాలంలో ఒక సాధారణ పెర్షియన్ శరణాగతుల కుటుంబంలో జన్మించిన ఆమె ఒక శక్తివంతమైన సామ్రాజ్యానికి చక్రవర్తిణి కావాలనుకుంది..ఎనిమిదేళ్ళ వయసులో ఒక రాకుమారుణ్ణి నేనెందుకు వివాహమాడకూడదు అని తనలో తాను ప్రశ్నించుకుంది..పర్షియాకు చెందిన
ఘియాస్ బేగ్ (Ghias Beg) ఇంట నాలుగో సంతానం గా జన్మించిన 'మెహరున్నిసా' (నూర్జహాన్) జన్మించేసరికి ఆ బిడ్డకి గుక్కెడు పాలు పట్టలేని దీనావస్థలో ఆ పాపని ఒక చెట్టు దగ్గర వదిలేస్తాడు ఘియాస్..స్నేహితుడు,మసూద్ కంటపడి అదృష్టవశాత్తూ మళ్ళీ తల్లిదండ్రులని  చేరిన ఆ పసిపాప,భవిష్యత్తులో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిణి అవుతుందని ఆనాడు ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు.

ఇందు సుందరేశన్ రచించిన 'The Twentieth Wife','తాజ్ మహల్ ట్రయాలాజి'లో మొదటి భాగం..ఇది 2002 లో పబ్లిష్ అయ్యింది..దీని తర్వాత 'The Feast of Roses','Shadow Princess' వెలువడ్డాయి..
నవలలోకి వెళ్తే,మెహరున్నిసా తండ్రి ఘియాస్ కు అక్బర్ కొలువులో ఉన్నతమైన స్థానం లభించడంతో అతని కుటుంబం ఆగ్రాలో స్థిరపడుతుంది..బాల్యం నుంచీ తన అందంచందాలతో,తెలివితేటలతో,వివేకం తో తండ్రికి ప్రియ పుత్రికగా పెరుగుతున్న మెహరున్నిసా,యువరాజు సలీం ప్రథమ వివాహం సమయం లో మహారాణి రుకయ్యా బేగంను తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది..ఆ ఎనిమిదేళ్ళ వయసులో తొలిసారి సలీం గురించి,అతని వివాహం గురించి విన్నప్పుడు ఆ రాకుమారుని గురించిన విశేషాలు మెహెరున్నిసాను అమితంగా ఆకర్షిస్తాయి..సలీం ని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆ వయసులోనే ఆమెలో మొగ్గ తొడుగుతుంది..ఈ లోగా రుకయ్యా ఆజ్ఞ తో అంతఃపురానికి రోజూ మెహెరున్నిసా రాకపోకలు సాగుతూ ఉండేవి..ఈ సమయం లోనే ఆమె రుకయ్యా మంత్రాంగం నడిపే తీరు,రాజనీతిజ్ఞత,జేనానా (అంతఃపురం లో స్తీల విభాగం) బరువు బాధ్యతలు నిర్వహించడం వంటి విషయాలను దగ్గరగా పరిశీలించి ఆకళింపు చేసుకుంటుంది..యుక్తవయస్సు చేరేసరికి ఆమెలో సలీం పట్ల ఆకర్షణ,అతన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక మరింత బలీయంగా మారుతుంది..ఒక సందర్భంలో ఆమెను జెనానా తోటలో చూసిన సలీం తొలి చూపు లోనే ఆమె అందం పట్ల ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు..ఈలోగా అక్బర్ చక్రవర్తి కోరిక మేరకు ఆమె వివాహం ఒక సైనికుడు అలీ కులీ తో జరిపించాలని తలపోస్తాడు ఘియాస్..ఈ విషయం తెలిసిన సలీం,అక్బర్ తో ఆమె విషయం మాట్లాడినప్పటికీ వచనాబద్ధుడైన అక్బర్ అలీ కులీ తో ఆమె వివాహం ఆపడానికి తిరస్కరిస్తాడు..ఫలితంగా తండ్రి పరువుప్రతిష్టలకు భంగం కలగకూడదని అయిష్టంగానే అతన్ని వివాహాడుతుంది మెహెరున్నిసా..ఆమెకంటే వయసులో బాగా పెద్దవాడవడమే కాకుండా,అలీ కులీ ఏ విధంగానూ ఆమెకు తగిన భాగస్వామి కాలేక పోతాడు..మొరటుతనం,కఠినత్వం కలబోసినట్లుండే అలీతో ఆమె వైవాహిక జీవితం ఒక రాజీగా పరిణమిస్తుంది..పైగా చాలా కాలం పాటు సంతానలేమితో ఆమె జీవితం మరింత నరకప్రాయమవుతుంది..

మరో ప్రక్క సలీం సింహాసనం కోసం తండ్రి అక్బర్ తో పరోక్ష యుద్ధం చేస్తుంటాడు..వయసు మీద పడుతున్నా అక్బర్ తనకి సింహాసనం అప్పగించకపోవడం అతనిలో తీవ్ర ఆగ్రహావేదనలు కలిగిస్తుంది..దీనికి తోడు మెహరున్నిసా ను కేవలం మూడు సందర్భాల్లో కలిసినా,ఆమె మీద వ్యామోహం కూడా అతన్ని కుదురుగా ఉండనివ్వదు..
సింహాసనం కోసం సలీం పన్నాగాలు పన్నుతూ ఉంటె,సలీం కోసం మెహరున్నిసాలో వివాహానంతరం కూడా అంతర్మధనం కొనసాగుతూ ఉంటుంది..ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరి దారులూ మళ్ళీ కలిసాయా ? సమాజం,సంప్రదాయాలు మెహెరున్నిసాను తను కోరుకున్నది దక్కించుకోడానికి అంగీకరిస్తాయా ? ప్రజలకి ఆదర్శమైన ఒక చక్రవర్తి స్థానాన్ని ఆశిస్తూ,మరో వ్యక్తి భార్యని కోరుకోవడం సలీంని సింహాసనానికి దూరం చేస్తుందా ? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న,అసలు వారిద్దరిదీ  ప్రేమేనా ? ఇలా పలు ప్రశ్నలతో కథ అనేక మలుపులు తిరుగుతుంది..

He had wanted her longer than he had wanted the throne.It was not just that she was beautiful woman.Beautiful women he could command at the snap of his fingers,the merest inclination of his head..He admired her fierce independence,her deep sense of self,her conviction about her actions.She scorned the rules,trod on them.

ఈ నవలలో అక్బర్ కాలంలో సమాజం స్థితిగతులు,అధికారం కోసం ఎత్తుకు పై ఎత్తులూ చాలా ఆసక్తికరం గా ఉంటాయి..ఇందులో అక్బర్ ఒక చక్రవర్తిగా కంటే,ఒక తండ్రిగానే ఎక్కువ కనిపిస్తాడు..సలీం అధికారం కోసం తనపై విష ప్రయోగం చేసాడని తెలిసి కూడా అతన్ని ఏమీ అనకుండా,తనలో తను కుమిలిపోవడం,అదే సమయం లో ఒక చక్రవర్తిగా తన హోదాకి భంగం కలగకుండా గాంభీర్యం ముసుగు వేసుకోవడం అక్బర్ ది గ్రేట్ లోని మరో కోణాన్ని మనకు పరిచయం చేస్తాయి..మనవడు,ఖుస్రో (సలీం ప్రథమ సంతానం)-సలీంల మధ్య ఆధిపత్య పోరుకి మౌన సాక్షిగా,ప్రపంచాన్ని జయించినా ఇంటి పోరుని అడ్డుకోలేని నిస్సహాయుడైన చక్రవర్తి మనకి ఒక సాధారణ కుటుంబ పెద్దని జ్ఞప్తికి తెస్తాడు..

Akbar could see only the heat-broiled plains beyond the Yamuna river,dotted here and there with stunted trees.But somewhere out there,in the dust of the plains,its sandstone buildings decaying,lay the city of Fatepur Sikri.The city he had built for Salim.

ఇందులో రుకయ్యా  బేగం,జగత్ గోసిని,అస్మత్ బేగం,సలీమా సుల్తానా వంటి మరికొందరు శక్తి వంతమైన స్త్రీల వ్యక్తిత్వాలు చాలా ఆకట్టుకుంటాయి..రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రాధాన్యత లేకపోయినా తెర వెనుకనుండి వారు మంత్రాంగం నడిపే తీరు,కీలక రాజకీయ నిర్ణయాల్లో వారి ప్రాధాన్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..కానీ ఇది ప్రత్యేకం మొఘల్ రాణుల్లో వివాదాస్పద చక్రవర్తిణి నూర్జహాన్ కథ..కోరుకున్నది సాధించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డిన జహంగీర్ కథ..అయితే,నాకు 'The Twentieth Wife'  ఒక ప్రేమ కథగా కంటే ఇద్దరు విడి విడి వ్యక్తుల జీవిత లక్ష్య సాధనగానే అనిపించింది..అధికారం సలీం జీవిత లక్ష్యం..దానికోసం తండ్రినీ,చివరకి కన్న కొడుకు ఖుస్రోని కూడా శత్రువులని చేసుకుంటాడు...కొన్ని సందర్భాలో సలీం ప్రవర్తన చిన్న పిల్లాడి మంకుపట్టుని తలపిస్తుంది..అంతలోనే అతనిలో కరడుగట్టిన రాజనీతిజ్ఞుడు ఉన్నట్టుండి ప్రత్యక్ష్యమై మనల్ని విస్మయపరుస్తాడు ..సలీం,జహంగీర్ చక్రవర్తిగా మారాక,తనకు ఎదురుతిరిగిన కొడుకుని ఖైదీగా చేసి ప్రక్కన కూర్చోపెట్టుకుని,లాహోర్ వీధుల్లో ఖుస్రో సైన్యాన్ని కిరాతకం గా ఊచకోత కోసిన శవాలని చూపించడం అతని అధికార దాహానికి పరాకాష్ట..ఒకనాడు పావురాలకి గింజలు వేస్తూ ఆనందించిన ఆ యువకుడు,ఈ కరడు గట్టిన మొఘల్ చక్రవర్తిలో మనకి వెతికినా కనిపించడు..

ఇందులో మెహెరున్నిసా,సలీంని ఒక వ్యక్తిగా కంటే,ఒక రాకుమారుడుగా ఎక్కువ ప్రేమించింది అనిపిస్తుంది..అతనిలో ఆమెను ఆకర్షించిన మరో విషయం,తను కోరుకున్నది దక్కించుకోవడం లో సలీం చూపే పట్టుదల,తెగింపు..ఆ క్రమంలో అతను వేసే ఏ ఒక్క అడుగూ ఆమెకు తప్పు గా తోచదు..వారిద్దరి మనస్తత్వాలలో ఈ విషయం లో చాలా సారూప్యత కనిపిస్తుంది..ప్రవృత్తులు వేరైనా వారు ఇద్దరూ ఉమ్మడిగా కోరుకునేది ఒక్కటే,అధికారం..అధికార దాహంతో సలీం పదిహేనేళ్ళు పాటు పరితపిస్తాడు..అలాగే మెహరున్నిసా తుదికంటా సలీం భార్య కావాలని కోరుకుంటుంది,తద్వారా పట్టపురాణిగా తెర వెనుకనుండి మొఘల్ సామ్రాజ్య భవితవ్యాన్ని  శాసించాలని కలలు కంటుంది..ఓపిగ్గా తగిన సమయం వరకూ వేచి చూసి మరీ తను అనుకున్నది సాధించుకుంటుంది..వీరిద్దరి అనుబంధం నిర్వచించడానికి కొంచెం సంక్లిష్టం గా అనిపిస్తుంది..సలీం అప్పటికే 19 వివాహాలు చేసుకుంటాడు..కానీ ఆ వివాహాలు అన్నీ రాజకీయ ప్రాతిపదికన జరిగినవే..మెహరున్నిసాను వివాహమాడటం మాత్రం వీటన్నిటికీ అతీతంగా జరుగుతుంది..ఆ కోణం లో ఆలోచిస్తే సలీం ప్రేమలో ఎంతో కొంత స్వచ్ఛత కనిపిస్తుంది..కానీ ఆమె విషయంలో సలీం పట్ల ప్రేమ కన్నా రాణి కావాలన్న స్వార్ధమే ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది..కానీ ఆమె భర్త అలీ కులీ మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆమె నిర్ణయం కూడా సబబేనని అనిపించక మానదు..

Everyone sensed that this marriage would be unusual..For the first time in his forty-two years,Jahangir had made his own choice,motivated by a charming pair of azure eyes and a bewitching smile,not by political strategy.

ఇందులో రచయిత్రి కథను నడిపించిన తీరు చాలా నచ్చింది..ఈ నవల,మనల్ని సరాసరి మొఘలాయి రాజవంశంపు అంతఃపురానికి అతిథులుగా ఆహ్వానిస్తుంది..అక్బర్ కుటుంబంలో మూడు తరాల వారిని ఒకేసారి మనకి పరిచయం చేస్తుంది..అంత గొప్ప రాజవంశంలో కూడా గులాబీకి ముళ్ళలా అంతర్గత వైషమ్యాలు,ఆధిపత్యపు పోరులూ,పగా ప్రతీకారాలు,వెన్నుపోట్లు ఉంటాయని సోదాహరణంగా వివరిస్తుంది..ఏదేమైనా ఇది చదివాకా పోయిన సంవత్సరం చూసిన ఫతేపూర్ సిక్రీ,ఆగ్రా  ఫోటోలను ఒక్కొక్కటీ మరొక్కసారి తీసి చూశాను..ఆ పరిసరాలతో పెనవేసుకున్న ఈ కథను మరొక్కసారి కళ్ళతో చూడాలని ప్రయత్నించాను..చివరగా,సలీం,మెహెరున్నీసాలు కూడా అందరూ నడిచే దారిలోనే నడిస్తే మంచి వారిగా(?) మిగిలిపోయేవారేమోగానీ వారి ఉనికిని మాత్రం కోల్పోయేవారు..మనకి స్వార్ధం గా తోచినా కూడా వారు అనుకున్న జీవిత లక్ష్యాలను ఛేదించారు కాబట్టే వారిద్దరూ చరిత్ర లో చిరస్థాయిగా మిగిలిపోయారు..

Pages      :375
Publisher :Harper Collins
Price        :399/-

Half a Rupee - Stories by Gulzar

ఈ పుస్తకం చదవాలనిపించడానికి కవర్ మీద గుల్జార్ ఫోటో తప్ప మరే కారణం లేదు...సంపూరణ్ సింగ్ కల్రా ఉరఫ్ గుల్జార్ రాసిన పాటల్లోనూ,సినిమాల్లోనూ బాగా నచ్చే అంశం ఒక్కటే,అవి మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తాయి..ఆయన అక్షరాలు మన జీవితం లో ఏదో ఒక సందర్భంలో మనకు తారసపడ్డ పరిచయస్తుల్లా,మన చిన్ననాటి స్నేహితుల్లా ఏవో జ్ఞాపకాలను స్పృశించి మనసు లోతుల్లోని సున్నితత్వాన్ని తట్టిలేపుతాయి.ఒక కవిగా,దర్శకునిగా,గీత రచయితగా గుల్జార్ ప్రతిభ జగమెరిగినదే..కానీ ఈ పుస్తకం,ఒక కథకునిగా ఆయన భావాలను,అనుభవాలనూ మరింత దగ్గరగా అనుభూతి చెందే అవకాశం కల్పిస్తుంది..ఈ పుస్తకాన్ని కొన్ని కమ్మని కబుర్లు,తీపి జ్ఞాపకాలతో పాటు చేదు విషాదాలూ,మరి కొన్ని నులివెచ్చని అనుభవాలూ-అనుభూతులూ,బ్రతుకు బాటలో మజిలీలూ,కొన్ని సరిహద్దు కథలు,అన్నీ కలిపి ఒక పాతిక కథలతో మల్లెచెండులా కూర్చారు..ఇందులో కులదీప్ నయ్యర్,సాహిర్ లుధియాన్వి,జావేద్ అఖ్తర్,భూషణ్ బనమాలి వంటి కొందరు ప్రముఖుల నిజ జీవిత విశేషాలతో కూడిన కథలు కూడా ఉన్నాయి.

అన్ని కథల్లోకి నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న కథ 'సాహిర్ అండ్ జాదూ'..ప్రముఖ కవులూ మరియూ గీత రచయితలైన సాహిర్ (Sahir Ludhianvi),జాదూ ఉరఫ్ జావెద్ అఖ్తర్ల స్నేహ బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన కథ ఇది..తండ్రిని నిరంతరం ద్వేషించీ,ఎదిరించే జాదూ ఇందులో మనకి చాలా కొత్తగా కనిపిస్తాడు..తిరుగుబాటు మనస్తత్వం అతనికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్థి..జాదూ తండ్రితో పోట్లాడి సాహిర్ ఇంటికి వచ్చేసి,చిన్న పిల్లాడిలా తన కోపాన్నంతా వెళ్లగక్కడం,అతనిలో మొండితనం,చంచలత్వం చూస్తే తరువాత ఈయనేనా అంతటి పరిపక్వత కలిగిన కవితలు రాసింది అని ఆశ్చర్యం కలుగకమానదు..స్నేహితునిలా మాత్రమే కాకుండా ఒక తండ్రిలా సాహిర్,జాదు మంచి చెడ్డలు చూస్తారు..ఒక సందర్భంలో సాహిర్ వద్ద తీసుకున్న వంద రూపాయల అప్పుని,కావాలని ఇవ్వకుండా దాటవేస్తూ ఆయన్ని ఆటపట్టిస్తూ ఉంటాడు జాదూ..కానీ సాహిర్ మరణం తరువాత ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళే టాక్సీకి జాదు అనుకోకుండా వంద నోటు ఇస్తాడు..చివరలో ఆయన తన డబ్బును అలా వసూలు చేసుకున్నారని జాదూ బాధపడటం చాలా ఐరనీ గా అనిపిస్తుంది..
"కభి కభి మేరె దిల్ మే " అంటూ అతి సున్నితమైన భావాలు పలికించిన సాహిర్ కీ,పాదరసం లాంటి జాదూకీ మధ్య స్నేహం చిన్న చిన్న తగాదాలతో చాలా చిత్రంగా అనిపిస్తుంది..ఇందులో యువకునిగా జావేద్ అఖ్తర్ ని గురించి తెలుసుకుంటే,ప్రపంచంతో స్పర్ధ కలిగి ఉండటం కవులకు,కళాకారులకూ సహజమేమో అని అనుమానం కూడా కలుగుతుంది..

Few lines from the book about Javed Akhtar,
Jaadu was a man of honour,and since he was young,his sense of self respect was a little exaggerated.His nose was often in the air,and his attitude turned a notch higher.God alone knows what he ate,where he slept,how he managed to live during the days he was away.

మరొక కథ The Charioteer లో ముంబైలో మారుతీ అనే ఒక బోటు క్లీనర్ జీవితంలో ఒక రోజుని మనకి పరిచయం చేస్తారు..రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడి,నిరాశ నిస్పృహల మధ్య ఇంటికి చేరిన అతనికి ఇంట్లో దొరికే ప్రేమాభిమానాలు,గౌరవం కొండంత బలాన్నిస్తాయి..ఉదయంనుంచీ అతను యజమాని నుండి ఎదుర్కొన్న తిట్లు,అవమానాలూ అన్నీ ఏడుగురు సభ్యులు గల కుటుంబానికి సారధిగా ఆ రోజు చివరలో అతనికి దొరికే ఆత్మసంతృప్తి ముందు పటాపంచలైపోతాయి..ప్రతి వారికీ తమని ప్రేమించే కుటుంబం ఉండటం ఎంత అవసరమో  నొక్కి చెప్పే కథ ఇది..

A man is forever in search of a co-traveller.

A soldier's words,
O'Ji,that's just a grandiloquent feeling.It is all about the splendour of the uniform and the charm of the army baret,and the status that it adds to a man's prestige.I don't think that men become soldiers to die and kill for the country.

When you face your fear,you become familiar with it and familiarity makes it lose its meaning,loosen its grip-fear ceases to be fear.

About Mumbai,
You want to live here in this city-don't become a turmeric.Become chilli,red hot chilli.

మరికొన్ని కథలు Over,The Rams,LoC,The stone age,The search వంటివి మన సరిహద్దు సమస్యలకీ,భారత-పాక్ శత్రుత్వం వలన నలిగిపోయే సామాన్య ప్రజానీకం ఆవేదనకి అద్దం పడతాయి..బోర్డర్ లో భారత,పాకిస్థాన్ సైనికుల మధ్య ప్రపంచానికి తెలియనీ,మనం ఊహించలేని మైత్రి ఈ కథల్లో మరో కోణం..'Gagi and Superman' కథ చదివితే గుల్జార్ స్క్రీన్ ప్లే రాసిన  Masoom సినిమా గుర్తు రాకమానదు..
From the footpath,Half a rupee కథలు ముంబై లో నిరుపేద ఫుట్ పాత్ జీవితాలకి అద్దంపడతాయి..వారి జీవితాల్ని చాలా దగ్గరగా పరిశీలించి,అతి చిన్న చిన్న విషయాలను కూడా రచయిత ఇందులో ప్రస్తావించిన తీరు అబ్బుర పరుస్తుంది.Orange అనే మరో కథలో భూమిని ఆరెంజ్ తో పోలుస్తూ మనిషి భూమిని ఎలా కలుషితం చేస్తున్నాడో వర్ణించిన తీరు అద్భుతం.

కొన్నేళ్ళు కలిసి బ్రతికితే వారు వీరవుతారు అని ఎక్కడో విన్నట్లు,భార్యతో సర్దుకుపోవడం ఒక అలవాటుగా మొదలై ఆమె మరణించాకా కూడా ఆమెను నిరంతరం తలుచుకుంటూ,ఆమెలాగానే ప్రవర్తించే ఒక తాతగారి కథ 'The Adjustment'..ఈ కథ చదివితే,భాగస్వామి అలవాట్లూ,విధానాలూ మనకి నచ్చినా నచ్చకపోయినా,కొన్ని సంవత్సరాలుగా వారికి అలవాటైపోవడం వలన ఆ అలవాటు కూడా చివరకు ప్రేమగా మారుతుందేమో అనే భావన కలుగుతుంది..మన ఇంట్లో తాతగారినీ,బామ్మగారినీ ఖచ్చితంగా మన కళ్ళ ముందు నిలిపే కథ ఇది..ఈరోజుల్లో కాలంతో పాటు నిరంతరం పరిగెత్తే బిజీ జీవితాల్లో,వృద్ధుల మనసులో భావాలను,వారి అంతః సంఘర్షణలనూ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే బహుశా మనం కూడా ఆ వయసు చేరే వరకూ సాధ్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది..Dadaji,Dusk అనే మరో రెండు కథలు కూడా ఇదే తరహాలో ఉంటాయి..పెద్దవాళ్ళ మనసుల్లో గూడు కట్టుకున్న ఒంటరితనం,జ్ఞాపకాలూ వద్దన్నా మన మనసుని సున్నితంగా మెలిపెడతాయి..

ఈ షార్ట్ స్టోరీస్ లో ఎక్కడా విసుగు కలగకుండా,రచయిత చెప్పాలనుకున్నది క్లుప్తంగా చాలా బాగా రాశారు..ఇందులో ప్రతి కథా దేనికదే ప్రత్యేకం..సమాజంలో ఉన్నత వర్గాలు  మొదలు ఫుట్ పాత్ జీవితాల వరకూ,చిన్నారుల మొదలు వృద్ధుల మనస్తత్వాల వరకూ,చిన్న చిన్న సంతోషాల మొదలు సాంఘిక,రాజకీయ అంశాల వరకూ దాదాపు ప్రతి చిన్న విషయాన్నీ వీటిల్లో పూలదండలో దారంలా ఇమిడ్చారు.కొన్ని కథలు పెదవులపై చిరునవ్వు పూయిస్తే,మరి కొన్నిఅస్సలు ఊహించని మలుపులతో విచారంలోకి నెట్టేస్తాయి..ఇంకొన్ని హాయిగా మెత్తని పచ్చిక బయళ్ళలో నడకలా ఉంటే,మరి కొన్ని ఉన్నట్లుండి కాలికి ముల్లులా గుచ్చుకుంటాయి..నిస్సందేహంగా ఈ పాతిక కథలూ జీవితం లోని అన్ని రంగులనూ మరొక్కసారి అనుభూతి చెందేలా చేస్తాయి.

Pages :218
Publisher : Penguin group
Price :299/-

Kanthapura - Raja Rao

అవి స్వార్ధమంటే తెలియని రోజులు..నాలుగు గోడల మధ్య ఎలక్ట్రానిక్ వస్తువుల సాగంత్యం లో గడిపెయ్యకుండా నలుగురితో కలిసి మెలిసి బ్రతికే రోజులు..భారత దేశంలో మనిషిని అసలు సిసలైన సంఘజీవిగా చూడగలిగిన రోజులు..అటువంటి కాలంలో కాంతాపురా అనే దక్షిణాదికి చెందిన కల్పిత గ్రామంలోని కథే ఈ 'కాంతాపురా'..ఆనాటి స్వాతంత్ర్య సమరానికి కాల్పనిక నేపధ్యంలో రాసిన ఈ నవల ప్రముఖ రచయిత,పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీ రాజా రావ్ రచించారు..ఆయన మరో రచన 'The Serpent and The Rope' కి గాను సాహిత్య అకాడెమి అవార్డును సొంతం చేసుకున్నారు..ఈ నవల భారతీయ సాహితీ చరిత్రలో తొలి ప్రఖ్యాత ఆంగ్ల నవలగా ప్రసిద్ధి చెందింది..ఒక సాయం సంధ్య వేళ,దీపాలు వెలిగించాకా,తన వరండాలో నులక మంచం వాల్చుకుని ఒక బామ్మగారు,అచ్చక్క తన గ్రామం గురించి మనతో పంచుకున్న కబుర్లు ఇవి...

Here are few lines from the book..
Karthik is a month of lights,sisters and in Kanthapura when the dusk falls,children rush to the sanctum flame and the kitchen fire,and with broom grass and fuel chips and coconut rind they peel out fire and light clay-pots and copper candelabras and glass lamps.Children light them all,so that when darkness hangs drooping down the eaves,gods may be seen passing by,blue gods,quite gods and bright-eyed gods.And as they pass by,the the dust sings back in to the earth,and night curls again through the shadows of the streets.Oh!have you seen the gods sister ?

మూర్తి అనే బ్రాహ్మణ యువకుడు మహాత్ముని ప్రతినిధిగా గాంధేయవాదాన్ని తన గ్రామానికి పరిచయం  చెయ్యడం,సత్యం మరియు అహింస స్ఫూర్తి తో ఆ గ్రామస్థులు చైతన్యవంతులు కావడం,క్లుప్తం గా ఇదే నవల సారాంశం.సంప్రదాయాలకి ఎదురీదడం అంటే సామాన్యమైన విషయం కాదు..అటువంటిది కుల వ్యవస్థ,అంటరానితనం వ్రేళ్లూనుకుపోయిన ఆ కాలం లో పై చదువులకై పట్నం వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు మూర్తి గాంధీజీ ఆశయాలతో ప్రభావితుడై చదువును మధ్య లోనే ఆపేసి ఆయన మార్గాన్ని అనుసరిస్త్తాడు..స్వాంతంత్ర్య సముపార్జనే లక్ష్యం గా పని చేస్తున్న కాంగ్రెస్ సభ్యుడిగా గాంధేయవాదాన్ని తమ గ్రామానికి పరిచయం చేస్తాడు...నాలుగు వర్ణాలు,నాలుగు వర్గాలుగా ఉన్న ఇళ్ళ సముదాయంలో,అంటరాని కులస్థుల గడప తొక్కి మరీ గాంధీ ఆశయాలను ప్రచారం చేస్తుంటాడు..బ్రాహ్మణత్వాన్ని మంటగలుపుతున్నాడని అతడి మీద భట్ట లాంటి అగ్ర కులస్తులు ఆగ్రహిస్తారు...ఈ క్రమంలో తల్లి నూకమ్మ కూడా అతడిని వ్యతిరేకించి,బెంగతో ప్రాణాలు వదులుతుంది..కులబహిష్కరణకు లోనైనా తను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తాడు మూర్తి..పటేల్ రంగే గౌడ,శంకర్,రత్న,శీను,రంగమ్మ వంటి కొంతమంది అభ్యుదయవాదులు అతనికి వెన్ను దన్నుగా నిలుస్తారు..Skeffington Coffee Estate కూలీల్ని దుర్భర బానిసత్వం,తాగుడు నుంచి విముక్తుల్ని చెయ్యడానికి వారిని విద్యావంతుల్ని చేయ సంకల్పిస్తాడు మూర్తి..ఇందులో Skeffington కాఫీ ఎస్టేట్ కూలీల దుర్భర జీవనం ద్వారా ఆనాటి బానిసత్వం తీవ్రతను చూపించే యత్నం చేశారు..ఉద్యమకారులు,వారి కోసం లాఠీ దెబ్బలు సైతం లెక్ఖ చెయ్యకుండా పోలీసులకి ఎదురు వెళ్తారు..కానీ ఇంటిదొంగ భట్ట,పోలీస్ బడే ఖాన్ లాంటి కొందరి సాయంతో ఉద్యమాన్ని అణచడానికి ఆంగ్లేయులు అన్ని ప్రయత్నాలు చేస్తారు..చివరకు హింస ద్వారా గ్రామాన్ని అదుపులోకి తీసుకుంటారు..కొందరు సత్యాగ్రహులను ఖైదు చేస్తారు..

The best lines from the book in Murthy's words,
A cock does not make a morning,nor a single man a revolution,but we'll build a thousand-pillared temple,a temple more firm than any that hath yet been builded,and each one of you be ye pillars in it,and when the temple is built,stone by stone,and an by man,and the bell hung to the roof and the eagle-tower shaped and planted,we shall invoke the Mother to reside with us in dream and in life.India then will live in a temple of our making.

ఈ నవలలో పశ్చిమ కనుమల్లో,హిమవతీ నదీ తీరాన,ఒక చిన్న మారుమూల కుగ్రామంలో స్వాతంత్ర్య ఉద్యమం బీజాలు ఎలా మొలకెత్తాయో మనకు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు..ఎన్నో ఏళ్ళుగా పాతుకుపోయిన కుల వ్యవస్థకూ,సంప్రదాయాలకూ ఎదురు వెళ్ళడం భారతీయ సమాజంలోనే కాదు ఆ మాటకొస్తే ఏ సమాజం లోనైనా కఠినతరమే..అటువంటిది గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపాలని చేసిన బోధలతో స్ఫూర్తి పొంది ,మూర్తి మొదటి సారిగా ఒక శూద్రుని ఇంటికి వెళ్తాడు.అటువంటి ఒక సందర్భం లో రచ్చన్న గడప తొక్కి మంచి నీళ్ళు త్రాగేటప్పుడు,మూర్తి  అంతరాంతరాలలో ఏదో పాపభీతి ఒక క్షణం అలా మెరిసి మాయమయ్యే సందర్భం చాలా బావుంటుంది..మరో సందర్భంలో  పోలీసులు ఉద్యమాన్ని చిన్నాభిన్నం  చేసి స్త్రీలను అర్ధరాత్రి అడవిలో వదిలిపోతే,దారిలో ఎడ్ల బండి వాళ్ళు వారిని ఉద్యమకారులుగా గుర్తించి,రూపాయి కూడా ఆశించకుండా వారిని క్షేమం గా ఇంటికి చేర్చడం ఆనాడు ప్రజల్లో నెలకొన్న స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి,ఐక్యతకూ నిదర్శనం..అడ్వకేట్ శంకర్ పాత్రకూడా మూర్తి కి ఏ మాత్రం తీసిపోదు..

About Sankar,the advocate:
The friends got angry and called him a fanatic;but he said there must be a few fanatics to wash the wheel of law..

గ్రామాలలో పండుగలకూ,పూజలకూ జరిగే హరి కథా కాలక్షేపాలు,అందరూ ఒక కుటుంబంలా చందాలు వేసుకుని పెట్టుకునే భోజనాలు,కార్తీక మాసం దీపాల సందళ్ళు ఇలా పూర్తి స్థాయి గ్రామీణ వైభవాన్ని మన కళ్ళ ముందుకు తీసుకువస్తుంది ఈ రచన..మూర్తి లాంటి విద్యావంతులు పరిచయం చేసేవరకూ వార్తా పత్రికలూ కూడా ఉంటాయన్న సంగతి తెలియని సామాన్య జీవనం గడుపుతూ ఉంటారు ఆ గ్రామస్థులు..బ్లూ పేపర్ లో గాంధీజీ ఉద్యమం గురించి రంగమ్మ లాంటి వారు చదివి వినిపించగా తెలుసుకుంటారు..పూజలు,పండుగ సమయాల్లో భజనలు,హరికథల స్థానే మహాత్ముని కథలు విని గ్రామస్తులు ప్రభావితులవుతారు..ముఖ్యంగా స్త్రీ శక్తి స్వరూపిణి అని నిరూపిస్తూ, మహిళలు అందరూ రంగమ్మ ఆధ్వర్యంలో ఉద్యమకారులుగా శిక్షణ తీసుకోవడం,ధైర్య సాహసాలతో పోలీసులను ఎదుర్కోవడం,పన్నులు కట్టమంటూ ప్రభుత్వానికి ఎదురు తిరగడం లాంటి సందర్భాలు విస్మయపరుస్తాయి..ఈ నవలలో ప్రత్యేకించి పెద్ద కథ అంటూ ఏమీ లేకపోవడం,కథనమే ముఖ్యం కావడం తో రంగమ్మ,పుట్టమ్మ,సతమ్మ,రచ్చన్న,పుట్టన్న అంటూ పదే పదే అవసరం లేని పేర్లను కూడా ప్రస్తావించడం కొంచెం చికాకు పరచింది..చదవడానికి ఇబ్బందిగా,ఒకింత గందరగోళం గా అనిపిస్తుంది..ఏదేమైనా ఈ పుస్తకం చదివితే,నేను-నా కుటుంబం అనే కాకుండా సమాజం పట్ల నైతిక బాధ్యతను గుర్తెరిగి మసలుకునే మనుషులు ఆ కాలం లో ఉండబట్టే మనం ఈరోజు స్వేచ్చా వాయువులు పీలుస్తున్నాము అని తెలుస్తుంది..అంతేకాకుండా స్త్రీ-పురుష,కుల-మత,పేద-ధనిక వర్గ వైషమ్యాలు అన్నీ ప్రక్కన పెట్టి అందరూ కలసికట్టుగా సాధించిన స్వరాజ్యాన్ని ఈనాడు అంతర్గత వైషమ్యాలతో,అన్నిటినీ మించి స్వార్ధం తో దుర్వినియోగం చేసుకుంటున్నాము అని అనిపించక మానదు..
Pages     :190
Price        :210
Publisher :Oxford University press